ద్రవ్యోల్బణం ...... దేశ ఆర్థిక వ్యవస్థలో ఇదో విచిత్రమైన పదం.. ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం. దీని సూచీ ఎందుకు పెరుగుతుందో.. ఎందుకు తగ్గుతుందో.. దీనికీ, ధరల సూచీకీ ఉన్న సంబంధం ఏమిటో.. ద్రవ్యోల్బణం సూచీ పెరిగితే ధరలు పెరుగుతాయని, తగ్గితే తగ్గుతాయని చెప్తారు... కానీ, ఇప్పుడు మైనస్‌లోకి పడిపోయినా ధరలు తగ్గటం లేదు... పైగా చుక్కలనంటుతున్నాయి. ఇదంతా ఒక మాయ.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో సామాన్య ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం..
అర్థ శాస్త్రంలో ఇన్‌ఫ్లేషన్ అంటే వివిధ వస్తువులు, సర్వీసులకు సంబంధించి సాధారణ స్థాయిలో ఉండే ధరలు అని అర్థం. దీన్నే ద్రవ్యోల్బణం అని మనం చెప్పుకుంటాం. దీన్ని ఒక నిర్ణీత కాలానికి లెక్కిస్తారు. అమెరికన్ సివిల్ వార్ సమయంలో ప్రైవేట్ బ్యాంక్ నోట్ కరెన్సీ ప్రింట్ అయింది. అప్పుడే మొట్టమొదటిసారిగా ఇన్‌ఫ్లేషన్ అన్న పదం ప్రత్యక్షంగా వాడుకలోకి వచ్చింది. కరెన్సీ డిప్రిసియేషన్‌ను సూచిస్తూ దీన్ని ఉపయోగించారు. మన కరెన్సీలోని ప్రతి రూపాయితో వస్తువులను కానీ, సర్వీసులను కానీ కొనుగోలు చేస్తాం. మనీకి ఉండే నిజమైన విలువ, ప్రజల కొనుగోలు శక్తి మన ఆర్థిక వ్యవస్థలో జమాఖర్చులను ప్రభావితం చేస్తాయి. ఒక విధంగా సాధారణ ద్రవ్యోల్బణం రేటు వినియోగ దారుల ధరల సూచి అని చెప్పవచ్చు. ఇన్‌ఫ్లేషన్ రేటు సందిగ్ధంగా ఉంటే దాని వల్ల ఆర్థిక వ్వయస్థపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. పెట్టుబడులకు ప్రోత్సాహం లభించదు. హై ఇన్‌ఫ్లేషన్ రేటు వస్తువుల కొరతకు కారణమవుతాయి. ఇది స్థూల జాతీయోత్పత్తిపైనా ప్రభావం చూపుతుంది. అందువల్లే ద్రవ్యోల్బణం అంటే అటు పాలకులకు, ఇటు పారిశ్రామిక వేత్తలకు అంత హడల్.. నిపుణులు చెప్తున్నట్లు ద్రవ్యోల్బణ సూచీ పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ, అదే సూచీ పడిపోయినప్పుడు ధరలు కూడా పడిపోవాలి కదా? కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఇన్‌ఫ్లేషన్ రేటు 14 శాతం చేరుకున్నప్పుడు పాలకులకు చెమటలు పట్టాయి. అప్పుడు ధరలను చూస్తే కందిపప్పు 45 రూపాయలు, బియ్యం 25 రూపాయలు.. అన్ని వస్తువుల ధరలూ అమాంతంగా పెరిగిపోయాయి. ప్రజలు ఏదో భరించారు... సరే ద్రవ్యోల్బణం రేటు తగ్గినప్పుడు ఎలాగూ ధరలు తగ్గుతాయని అనుకున్నారు. ఆశపడ్డారు. కానీ పరిస్థితి తిరగబడింది. శాస్త్రీయతకు భిన్నంగా ద్రవ్యోల్బణం రేటు పూర్తిగా నెగెటివ్ జోన్‌లోకి పడిపోయింది. అలాంటప్పుడు ధరలు పూర్తిగా తగ్గాలి. కానీ, అలా జరగలేదు. ఇన్‌ఫ్లేషన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికంటే ఎక్కువగా రేట్లు పెరిగిపోయాయి. అప్పుడు ఆ ధరలను భరించిన ప్రజలు ఇప్పుడు భరించలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలో తోచక అల్లల్లాడిపోతున్నారు. కందిపప్పు 70 రూపాయలైంది. బియ్యం37 రూపాయలైంది. చివరకు కూరగాయలూ కొనే పరిస్థితి కనుచూపు మేరలో కొనే పరిస్థితి కనిపించటం లేదు. వంద రూపాయల నోటుకు ఒక రూపాయికున్నంత విలువ కూడా లేకుండా పోయింది. అప్పుడు రూపాయి ఇరవై పైసలు ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు మూడు రూపాయలకు చేరుకుంది. ద్రవ్యోల్బణం లెక్కింపులోని డొల్ల తనాన్ని ఈ పరిణామం సూచిస్తున్నది. టోకు ధరల సూచీ ఆధారంగా దీన్ని లెక్కించటం వల్ల ఇన్‌ఫ్లేషన్ నెగెటివ్ జోన్‌లో పడిపోయిందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో డిమాండ్ పడిపోవటం వల్ల ద్రవ్యోల్బణం మైనస్ అయిందని, మనం ఒక విధంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్లేనని మరికొందరు అంటున్నారు.ద్రవ్యోల్బణాన్ని తప్పుగా లెక్కిస్తున్న వాస్తవాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికి గుర్తించింది. ఈ సెప్టెంబర్ నుంచి ఇప్పటికన్నా మరింత మెరుగైన, వాస్తవాన్ని వాస్తవంగా ప్రతిబింబించే స్థాయిలో కొత్త ద్రవ్యోల్బణ సూచీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే దీన్నికూడా టోకు ధరల ఆధారంగానే సూచిస్తామంటున్నారు. దీంతో దీని విశ్వసనీయతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ ధరల ముఖచిత్రాన్ని నిష్కర్షగా ఆవిష్కరించే విధంగా ద్రవ్యోల్బణ సూచీ అవసరం. సూచీ మాటెలా ఉన్నా, మోత మోగిస్తున్న ధరలను ఆకాశం నుంచి కిందకు దింపటానికి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్‌లో అర్జెంటుగా తీసుకునే చర్యలు ఏమిటన్నది ఇప్పటికి మాత్రం సస్పెన్సే....

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం మునుపెన్నడూ లేని విధంగా కెసిఆర్‌ను టార్గెట్ చేసింది. పార్టీలో అసమ్మతి తనకు తీవ్ర మనస్తాపం కలుగజేసిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం సీనియర్ నేత రవీంద్ర నాయక్‌పై దాడి. నిన్నటికి నిన్న తెలంగాణ విమోచన సమితి ఆవిర్భావం.. అన్నీ కలగలిసి కెసిఆర్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్, కెసిఆర్‌పై తీవ్రస్థాయిలో సంధించిన విమర్శనాసా్తల్రు టిఆర్‌ఎస్ ముసలాన్ని ముదిరేలా చేశాయి. వైఎస్ వూ్యహాత్మకంగా వేసిన ఎత్తుగడ దాదాపుగా ఫలించిందనే చెప్పాలి. అయితే కెసిఆర్ గతంలో కూడా ఒకసారి రాజీనామా డ్రామా ఆడారు. ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత రాజీనామా లేఖను పంపించటం, రాష్ట్ర కార్యవర్గం దాన్ని నిరాకరించటం క్షణాల్లో జరిగిపోయిన పని. అప్పుడు పార్టీలో అసమ్మతి రేగకుండా కెసిఆర్‌ను ఆ రాజీనామా ఖేల్ కాపాడింది. కానీ, ఇప్పుడు పార్టీలో అసమ్మతి పతాక స్థాయికి చేరుకుంది. ఒకరి వెంట ఒకరుగా పార్టీని వీడిపోవటం, అదీ, కెసిఆర్ ఆనుపానులన్నీ తెలిసిన అత్యంత సన్నిహితులు, పార్టీ స్థాపన నుంచి వెన్నంటి ఉన్నవారు రాజీనామా బాటలో నడవటం కెసిఆర్‌కు తలనొప్పిగా పరిణమించింది. దీనికి తోడు కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు రావటంతో హరీశ్, రామారావులు తెరచాటుకు బలవంతంగా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కూడా రాజీనామా డ్రామా అవుతుందా? అన్నది 24 గంటలు వేచి చూస్తే కానీ అర్థం కాదు. రేపు రాష్ట్ర కార్యవర్గం సమావేశమై కెసిఆర్ రాజీనామా గురించి చర్చిస్తుంది. కానీ, ఇప్పటికే ఆయన వందిమాగధ బృందం ఆయన నాయకత్వాన్ని వేనోళ్ల కొనియాడుతూ ప్రకటనలు చేయటం ప్రారంభించింది. 1969 తరువాత తెలంగాణ భావోదేగానికి మళ్లీ ఊపిరులూదింది కెసిఆర్ అన్నది నిస్సందేహం. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు పార్టీని ముందుకు తీసుకుపోగలిగిన సమర్థుడైన నాయకుడు కెసిఆర్. దేవేందర్ గౌడ్ లాంటి నేతే సొంత కుంపటిని పెట్టుకుని పట్టుమని పది రోజులైనా ముందుకు నడపలేక చిరంజీవి పంచన చేరారు. కెసిఆర్ తన నియంతృత్వ ధోరణికి తెలంగాణ భావోద్వేగం తోడై పార్టీని ఇంతకాలం నిర్వహించగలిగారు. కానీ, ఆయన ఒంటెత్తు పోకడలు, తెలంగాణ రాష్ట్రం విషయంలో పలుమార్లు ఆయన వేసిన పిల్లి మొగ్గలు, వైఎస్‌తో సెల్‌ఫ కిల్లింగ్ గేమ్‌స ఆడటం చివరకు ఆయన అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేశాయి. తాజాగా తెలంగాణ విమోచన సమితి ఏర్పాటు కావటంతో అసమ్మతికి తిరుగులేని బలం వచ్చినట్లయింది. దీనికి తోడు టిఆర్‌ఎస్ నుంచి మరో కీలక నేత కూడా బయటకు వెళ్లిపోతున్నారన్న వార్తలు మీడియాలో షికారు చేశాయి. రవీంద్రనాయక్ గొడవ టిఆర్‌ఎస్ కుము్మలాటలను తారాస్థాయికి చేర్చింది. చివరకు గిరిజనులకు కెసిఆర్ క్షమాపణ కూడా చెప్పుకున్నారు. కానీ పరిస్థితి చక్కబడలేదు సరికదా మరిన్ని చిక్కుముడులు పడింది. పర్యవసానం ప్రస్తుత కెసిఆర్ రాజీనామా. కెసిఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక ఇదీ ఒక డ్రామేనా తెలియదు. సీనియర్ నేతలు ఆయన్ను ఎంతవరకు ఒప్పించగలరు? కెసిఆర్ రాజీనామాను మిగతా నేతలు ఒప్పుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటన్నది కూడా ఆలోచించాలి. కెసిఆర్ కాకపోతే పార్టీ అధ్యక్ష పదవి రేసులో ముందుగా ఉండేది హరీశ్‌రావు. ఆయన్ను కెసిఆర్ కుటుంబ సభ్యుడిగా లెక్కలోకి తీసుకుంటే విజయశాంతి ఆ పదవికి పోటీ పడతారు. లేక అందరికీ న్యూట్రల్‌గా ఉండేందుకు పార్టీ సిద్ధాంత కర్త జయశంకర్‌ను రంగం మీదకు తీసుకువచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు... ఎవరు అధ్యక్షులు అయినా తెరవెనుక రాజకీయం నడిపేది మాత్రం కెసిఆరేనని నిస్సందేహం...రాబ్రీ దేవిని సిఎం కుర్చీపై కూర్చోబెట్టి లాలూ ఏం చేశారో తెలియదా? అలాంటి రాజకీయమే ఇక్కడా నడుస్తుంది. తల పగుల గొట్టుకోవటానికి ఏ రాయి అయితేనేం. టిఆర్‌ఎస్‌లోని ఈ పరిణామాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ నిలబెడతాయా? ముందుకు నడిపిస్తాయా? అంటే అనుమానమే... కెసిఆర్... జర సోచియే....