ఒక కుటుంబం.. అన్నదము్మల మధ్య అధికార తగాదా మొదలైంది.. చిలికి చిలికి గాలివానగా మారింది. అన్న భార్యను తము్మడు అవమానించాడు.. ఇంకేం యుద్ధమేఘాలు కము్మకున్నాయి. ఇరు వర్గాలూ రణరంగానికి సర్వసన్నద్ధమయ్యాయి. ఒక వర్గంలో వంద మంది.. మరో వర్గంలో అయిదుగురు.. ఈ అయిదుగురు.. ఆ వందమందిని ఓడించారు. నామరూపాలు లేకుండా చేశారు.. యుద్ధం జయించారు.. విజయం సాధించారు. అయిదుగురు వందమందిని ఎలా గెలిచారు? ఇది సాధ్యమేనా? ఏమిటీ స్ట్రాటజీ.. అడవుల్లో ఉన్నవాళు్ల.. ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో ఏడాది పాటు దాక్కున్న వాళు్ల, వంద మంది వెనుక ఉన్న అపార మందీ మార్బలాన్ని అలవోకగా జయించేశారు.. ఒక్కర్ని కూడా మిగల్చకుండా మట్టుబెట్టారు. ఇదంతా ఎలా సాధ్యమయింది. ఒక భారీ సైనిక వ్యవస్థను ఒక చిన్న సైన్యం ఎలా విచ్ఛిన్నం చేయగలిగింది.. అదే ఎత్తుగడ.. అదే యుద్ధ నీతి.. అదే గెలుపు మంత్రం..ఇవాళ్టి రాజకీయ వ్యవస్థకూ మార్గదర్శనం చేస్తున్న ఈ మంత్రం ఏమిటి?
1
అధికారం అన్నదము్మల మధ్య చిచ్చు పెట్టింది. అహంకారం పగల్ని రగిల్చింది. మహామారణహోమాన్ని సృష్టించింది.. ప్రపంచ నాగరిక చరిత్రలో కనీవినీ ఎరుగని సామూహిక జన హననం అది. ఒక కుటుంబం కోసం ఒక దేశం బలైపోయింది. రాజరికపు దుష్టజూదానికి సామంత రాజ్యాలు హరించుకుపోయాయి. మాయదారి యుద్ధం లక్షల మందిని పొట్టన పెట్టుకుంది.
ఇదంతా అయిదున్నర వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ.. మన దేశంలోనే జరిగిన కథ. ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఇప్పటి రాజకీయ వ్యవస్థ సైతం అనుసరిస్తున్న రాజనీతిని అందించిన చరిత్ర. ఇది మహాభారత గాథ.. అయిదుగురు పాండవులు, నూరుగురు కౌరవులను అతి తేలిగ్గా ఓడించిన ఇతిహాసం.
మహాభారతం.. ఈ కథ తెలియకపోవటం అంటూ లేదు. పాండవులు, కౌరవులను జయించిన కథ.. తమ రాజ్యాధికారాన్ని అన్యాయంగా స్వాధీనం చేసుకున్న కౌరవులపై పాండవులు ప్రతీకారం తీర్చుకున్న కథ.. తమ భార్యను పదిమందిలో వివస్త్రను చేసేందుకు యత్నించిన దుర్మార్గులను పాండవులు మట్టుబెట్టిన కథ.
దీని గురించి ఇప్పుడు చర్చించుకోవలసిన అవసరం ఏమొచ్చింది.. మరదే సంగతి.. ఇప్పుడు మహాభారతం అగ్రరాజ్యం అమెరికాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఒకరికి పది మంది వ్యాస మహాభారతాన్ని అదే పనిగా ముందేసుకుని తెగ పరిశోధనలు చేసేస్తున్నారు. ఒబామా సర్కారు సైతం ఇందుకు ఫండింగ్ కూడా చేస్తోందిట.
ఇప్పుడు అమెరికాకు భారతం చాలా ముఖ్యమైపోయింది. కొంతకాలంగా ఆర్థికంగా అల్లాడిపోతున్న అమెరికా, హార్థికంగా ఏకాకిగా మారుతున్న అమెరికాకు ఇంటెలెక్చు్యవల్ వూ్యహం అవసరమైంది. ప్రపంచంపై ఆధిపత్యం కొనసాగటానికి రాజనీతి ఎలా ఉండాలి? పాండవులు కౌరవులను ఎలా జయించారు? యుద్ధంలో గెలిచేందుకు పాండవులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? ఒకరిపై ఒకరు ఎలాంటి పన్నాగాలు పన్నారు? గెలుపు కోసం అయిదుగురు అన్నదము్మలు ఎలా పావులు కదిపారు? ఈ విషయాల్ని ఎలా ఛేదించాలి?
2
నిజమే.. ఇప్పుడంటే అమెరికా ఈ రకమైన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది కానీ, భారత యుద్ధం జరిగింది మన దగ్గర కదా.. పాండవుల విన్నింగ్ స్ట్రాటజీ గురించి మనలో ఎంతమందికి అవగాహన ఉంది? రామాయణ, భారతాలను నిందించటమే అలవాటు తప్ప, అందులో ఇప్పటికీ మనకు పనికొచ్చే విషయాలేమున్నాయని ఆలోచించిందెవరు కనుక? ఇదిగో ఇప్పుడు ప్రపంచ పోలీసు ఆలోచిస్తున్నాడు...ఇంతకీ ఈ విన్నింగ్ మంత్రమేమిటి? పాండవులది రాజనీతా.. కూటనీతా?
మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. రెండు బలమైన శక్తుల మధ్య జరిగిన యుద్ధం అది. ఈ యుద్ధంలో బలం కంటే వూ్యహమే గెలిచింది. ఏ విధంగా చూసినా యుద్ధం జరిగే నాటికి కౌరవుల కంటే పాండవుల శక్తి, సంపదలు తక్కువ. పాండవులు పవర్ కోల్పోయి అడవుల పాలై అప్పటికే పదమూడు సంవత్సరాలు గడిచిపోయింది. అందులో చివరి సంవత్సరం వేషాలు మార్చుకుని అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది.
కౌరవులు అధికారాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నారు..అటు ఆర్థిక బలం, ఇటు అంగ బలం పుష్కలంగా ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి క్షణాల్లో శత్రువును చిత్తు చేయగల పవర్‌ఫుల్ మేజర్ జనరల్‌స చాలా మందే ఉన్నారు. అధికారంలో ఉంటే అందివచ్చే అవకాశాలకూ కొదవ లేదు. అన్నింటికీ మించి ఫండింగ్ సమస్య ఎంతమాత్రం లేదు.
పైగా దుర్యోధనుడి మిత్రుడు కర్ణుడు దేశమంతా తిరిగి యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను జయించుకు వచ్చాడు.. ఆ రాజ్యాల బలాబలాలన్నీ కూడా కౌరవుల పక్షమయ్యాయి. చివరకు శ్రీకృష్ణుడి రాజ్యంలో ఆయన తప్ప మిగతా సైన్యం అంతా కూడా కౌరవుల వైపే నిలిచింది..పాండవులకు విద్యలన్నీ నేర్పిన గురువులే కౌరవుల పక్షాన నిలిచారు.. పాండవులతో సమానమైన వీరులు కౌరవుల పక్షాన ఉన్నారు.. అయినా, కౌరవ సైన్యం ఓడిపోయింది. కౌరవులు మట్టి కరుచుకుపోయారు..
ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలలేదు.. ఇంత దారుణంగా ఎలా ఓడిపోయారు.. పాండవులు ఎలా గెలువగలిగారు.. ధర్మం గెలిచింది అనీ, అధర్మం ఓడిపోయిందనే మాటలు చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి. కానీ, వాస్తవం వేరు.. యుద్ధంలో బలమైన ప్రత్యర్థిని జయించటం మాటలు కావు.. కేవలం ధర్మాన్ని ఆచరించటం వల్లనే గెలుపు సాధ్యమవుతుందనుకోవటం తప్పు.. ప్రత్యర్థిని వీక్ చేసి గెలుపును సాధించటం ఓ గొప్ప విద్య.. అదే యుద్ధనీతి. ఆ విద్య, ఆ నీతి పాండవులకు బాగా తెలుసు.. అదే వారిని విజయం వైపు నడిపించింది. చరిత్ర సృష్టించింది.
3
ఏమిటీ పాండవుల యుద్ధనీతి.. గెలుపు కోసం వారు అనుసరించిన రణతంత్రం ఏమిటి? అధికారం కోల్పోయి, అజ్ఞాతంలో ఉన్న పాండవులకు అంతగా అండదండలిచ్చిన వారు ఎవరు? యుద్ధం చేసేందుకు వారికి ఆర్థిక వనరులు, మానవ వనరులను సమకూర్చింది ఎవరు? ఇదేం ఆషామాషీ యుద్ధం కాదు.. అలాంటి యుద్ధాన్ని గెలిచేందుకు పాండవులు కదిపిన పావులేమిటి?
మహాభారత యుద్ధంలో పాండవుల గెలుపు అంత తేలికగా సాధ్యం కాలేదు.. అడవుల్లో పన్నెండేళు్ల... ఏడాది పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ఓ పక్క అధికారం లేదు.. ఆర్థిక వనరులు లేవు.. కేవలం మజిల్ పవర్‌తో గెలుపు సాధ్యం కాదని వారికి తెలుసు.. తమ వీక్‌నెస్‌ను తెలుసుకుని దాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అజ్ఞాతంలోకి వెళ్లటానికి ముందు నుంచే అయిదుగురు అన్నదము్మలూ ఒక్కో అడుగు నెమ్మదిగా ముందుకు వేస్తూ వెళ్లారు.
అర్జునుడు పవర్ ఫుల్ ఆయుధాలను సమకూర్చటంపై దృష్టి పెట్టాడు.
అణ్వస్త్రం అని భావించే పాశుపతాసా్తన్న్రి సంపాదించాడు.
భీముడు హనుమంతుడిని కలిసి గదావిద్యలో మరింత బలాన్ని సంపాదించాడు..
అటు గంధర్వుల దగ్గరకు వెళ్లి వారి మిత్రత్వాన్ని సంపాదించాడు.
ఇక ధర్మరాజేమో.. యుద్ధనీతిపై దృష్టి పెట్టాడు..
తన టార్గెట్ ఏమిటో ఆయన ముందే డిసైడ్ చేసుకున్నాడు. ఇటు కృష్ణుడితో, అటు ద్రౌపది తండ్రి దృపదుడితో మంతనాలు జరుపుతూ భారత దేశమంతటా పవర్ ఫుల్ మిత్ర పక్షాలను ఏర్పాటు చేసుకున్నాడు.
అంతకంటే ముందు పాండవులు ద్రౌపది కాకుండా విడివిడిగా చేసుకున్న వివాహాల మూలంగా బలమైన ఆర్థిక శక్తులను కూడగట్టుకున్నారు.
ధర్మరాజు, దేవికల వివాహంతో కేకయ రాజ్యం
భీముడు, బలంధరల పెళ్లితో కాశీ
అర్జునుడు సుభద్రల పెళ్లితో ద్వారక
అర్జునుడు, ఉలూచిల పెళ్లితో నాగులు
నకులుడు, కిరణ్మయిల పెళ్లితో చేది
సహదేవుడు, విజయల వివాహంతో మగధ రాజ్యాలు దగ్గరయ్యాయి.
వీరిలో నాగులు మాత్రం యుద్ధంలో పాల్గొనలేదు.
పాండవులు అడవుల్లో ఉన్నా, కృష్ణుడు అవసరమైన సన్నాహాలన్నీ చేసిపెట్టాడు.. మిత్రులను సమకూర్చి ఉంచాడు.. సంధి రాయబారానికి వెళ్లి భీష్మ,ద్రోణులకు, కర్ణుడికి మధ్య చిచ్చు పెట్టాడు.. దీని ద్వారా భీష్ముడు, కర్ణుడు ఒకేసారి యుద్ధరంగంలోకి దిగకుండా అడ్డుకట్ట వేయగలిగాడు. భీష్ముడు చనిపోయిన తరువాత కానీ, కర్ణుడు రంగంలోకి రాలేదు..
యుద్ధ నాయకత్వం విషయంలోనూ చాలా స్ట్రాటెజిక్‌గా వ్యవహరించారు.. మొత్తం బలగాలను డీసెంట్రలైజ్ చేశారు.. ఏడు ఆర్మీ డివిజన్లను, అప్పుడు వాటిని అక్షౌహిణులు అన్నారు లెండి.. ఒక్కో డివిజన్‌కు ఒక్కో కమాండర్.. అందరికీ కలిపి ఒక జనరల్. దీంతో వూ్యహాన్ని, ఎత్తుగడల్ని పంచుకోవటం కానీ, ఇంప్లిమెంట్ చేయటం కానీ చాలా సులువు అయిపోయింది.
టీమ్ స్పిరిట్.. పాండవులకు పెద్ద బలం.. ఒకే టీమ్.. ఒకే మాటపై నడిచే సైన్యం. ఎవరికీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు . అందరిదీ ఒకే టార్గెట్.. కౌరవులను ఓడించటం.. ప్రతీకారం తీర్చుకోవటం.. అధికారాన్ని హస్తగతం చేసుకోవటం... అందరూ ఆ గోల్ కోసమే యుద్ధం చేశారు.. ఎలాగైనా గెలిచి తీరాలనే ముందుకు వెళ్లారు. కో ఆపరేషన్, కో ఆర్డినేషన్.. సహకారం, సమన్వయం.. ఈ రెండూ పాండవులకు పెద్ద బలం.. బలగం...
4.
కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల గెలుపు వూ్యహం చాలా కీలకమైంది.. 18 రోజుల పాటు యుద్ధం జరిగిన తీరు గమనిస్తే.. ఆశ్చర్యం వేస్తుంది.. విస్మయం కలుగుతుంది. ఒక్కొక్కరినీ, ఒక్కో రకంగా, ఒక్కో ఎత్తుగడ వేసి హతమార్చిన వైనం పాండవుల, వారి జనరల్‌స యుద్ధనీతికి నిదర్శనం.. కౌరవుల దగ్గర ఈ వూ్యహమే లోపించింది. అంతా నిరంకుశంగా సాగిన రణతంత్రం వారిని పూర్తిగా దెబ్బతీసింది.
కృష్ణుడు రాయబారానికి వెళ్లినప్పుడు దుర్యోధనుడు సంధికి ఒప్పుకోకపోవటానికి సరైన కారణమే ఉంది. కృష్ణుడికి జవాబు చెప్పటానికి ముందు దుర్యోధనుడు తన కోర్ టీమ్‌లోని దుశ్శాసన, కర్ణ, శకునిలతో సీరియస్‌గానే చర్చించాడు. శత్రు బలాలను పూర్తిగా అంచనా వేసుకున్నారు.. ఏ విధంగా చూసినా తమ దగ్గర ఉన్న వీరులు కానీ, ఆయుధ బలగాలు కానీ, ఎక్కువ.. తన శక్తిసంపదలపై అతి విశ్వాసం పెట్టుకున్నాడు.. నిజంగా కూడా కౌరవుల వాస్తవ బలం ముందు పాండవుల బలం తక్కువే. ఆ ధైర్యం తోనే యుద్ధానికి దుర్యోధనుడు సై అన్నాడు.
పాండవులు అడవులకు వెళ్లగానే, ఇక తమకు ఎదురు లేదని కర్ణుణ్ణి ఇతర దేశాలపైకి మిలిటరీ మిషన్‌పై పంపించారు. అన్ని దేశాలను జయించి సామంతులను, సంపదను పెంచుకున్నట్లే శత్రువులనూ పెంచుకున్నారు.. కనీసం అధికార వికేంద్రీకరణ అయినా ఉందా అంటే అదీ లేదు.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ నలుగురే.. సామంతులు కాకుండా తోడుగా నిలిచిన మిత్రపక్షాలు శకునికి చెందిన గాంధార.. అంటే ఇవాళ్టి కాందహార్ సైంధవుడికి చెందిన సింధు, భగదత్తుడికి చెందిన కంబోడియా అంటే కాంభోజలు మాత్రమే.
యుద్ధం జరుగుతున్నప్పుడు సైతం 11 ఆర్మీ వింగ్‌స ఉన్నా, నాయకత్వం ఒకరి చేతులోనే ఉండిపోయింది. దీంతో సైనికులు, సైన్య విభాగాల మధ్య కము్యనికేషన్ గ్యాప్ చాలా పెరిగిపోయింది. పైగా ఎవరికి వారు వాళ్ల వాళ్ల ప్రయోజనాల కోసమో, ఎప్పుడో చేసిన కమిట్‌మెంట్ల కోసమో యుద్ధం చేశారే తప్ప, దుర్యోధనుణ్ణి గెలిపించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.. కర్ణుడికి లైఫ్‌టైమ్ గోల్ అర్జునుణ్ణి గెలవటం, భీష్ముడికి అప్పుడెప్పుడో సింహాసనాన్ని కాపాడతానన్న తన ప్రతిజ్ఞ ప్రధానం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ కావటంతో టీమ్ స్పిరిట్ లేకుండా పోయింది.
అంతే కాదు.. దుర్యోధనుడు, అతని నలుగురు కోర్ టీమ్‌కు తప్ప మిగతా వాళ్లెవరికీ యుద్ధం ఇష్టం లేదు. బలవంతంగానే రణరంగంలోకి వచ్చారు.. వీరిలో పెద్ద తలకాయలకు పాండవ పక్షపాతం. ఈ వీక్‌నెస్‌ను పాండవులు చక్కగా వాడుకున్నారు. ఒక్కొక్కరిని వేరు చేసి విడివిడిగా హతమారుస్తూ వచ్చారు. పది రోజులు బీభత్సం సృష్టించిన భీష్ముడి వీక్‌నెస్ శిఖండి.. అతణ్ణి ప్రయోగించి ఆయన్ను పక్కకు తప్పించారు. కొడుకే బలహీనత అయిన గురువు ద్రోణుణ్ణి చంపేందుకు ధర్మరాజు అబద్ధం అడేందుకు వెనుకాడలేదు.. కర్ణుడికి సకల అవలక్షణాలు ఉన్నాయి. అవన్నీ రణరంగంలో అతనికి శాపాలుగా మారాయి. అతణ్ణి నిరాయుధుణ్ణి చేసి మరీ చంపారు. దీనికి తోడు పాండవుల కోవర్‌ట శల్యుడు.. ఇతను కర్ణుడి సారథి.. అతనికి ఇది పెద్ద దెబ్బ. అంతా ఒక్కటై నిలిస్తే పాండవులు గెలిచే వారే కారు.. అందుకే ఏకాకుల్ని చేసి మరీ అంతం చేశారు. ఈ వూ్యహాన్ని దుర్యోధనుడు అర్థం చేసుకునే సరికే తాను ఏకాకి అయిపోయాడు. అంతం అయ్యాడు.
మన బలహీనతల్ని బలంగా మార్చుకోవాలి
శత్రువులను మిత్రపక్షాలుగా మలచుకోవాలి
బాధ్యతలను అందరితో సమంగా పంచుకోవాలి
సరైన టీమ్‌ను ఎంచుకోవటం, టీమ్‌స్పిరిట్‌తో నడుచుకోవటం ముఖ్యం
బలమైన నాయకత్వం చాలా అవసరం
టీమ్ మొత్తం ఒకే గోల్ కోసం స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి..
ప్రత్యర్థి శిబిరంలో బలహీనతల్ని సొము్మ చేసుకోవటానికి
వూ్యహాత్మకంగా పావులు కదపాలి
బలవంతులను ఐక్యంగా ఉంచటం కంటే వీక్ చేసి శత్రు శిబిరాన్ని విచ్ఛిన్నం చేయాలి..
పాండవుల విజయ రహస్యం ఇదే.. ఆచితూచి పావులు కదిపి అధికారాన్ని హస్తగతం చేసుకున్న వీరులు.
తమ బలంపై అతి విశ్వాసానికి పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో 9/11 నాడు ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు రుచి చూపించాడు. అందుకే ఇప్పుడు అమెరికాకు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటం అవసరమైంది. అమెరికా మాటెలా ఉన్నా, మనకు మన బలాన్ని, బలగాన్ని సెల్‌ఫ అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలని కలలు కంటున్న పాలకులు ఒక్కసారి మహాభారత రాజనీతిని, కూటనీతిని, యుద్ధనీతిని జస్‌ట ఫాలో అయితే వాళ్ల కల నెరవేర్చుకోవటం పెద్ద కష్టం ఏమీ కాదు..
మన భారతం మనం ఎలా ఉండాలో చెప్తోంది. మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలో డైరెక్‌ట చేస్తోంది. ఎక్‌సటర్నల్ పాలసీనీ, ఎకనమిక్ పాలసీని సైతం ఓ రోల్‌మోడల్‌గా భారతం చెప్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, భారతంలో అసలు కథ అన్నదము్మల గొడవే కానీ, దాని వెనుక ఉన్నది మాత్రం అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ జన జీవన విధానం.
హాస్టల్‌కు విరాళంగా గ్రైండర్, ఫ్యాన్లు....
1 రోజు క్రితం











0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి