జగన్‌ రాజీనామా చేశారు

2 comments
జగన్‌ రాజీనామా చేశారు.. పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో  సంచలనానికి తెరతీశారు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు కెసిఆర్‌ ఆమరణ దీక్ష సందర్భంగా రాష్ట్ర రాజకీయం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి మొదలైంది. జగన్‌  రాజీనామా పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి తప్పదు..  అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌కు జగన్‌ రాజీనామా శరాఘాతమే. కాంగ్రెస్‌కు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న స్థానాలు157 మాత్రమే. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్ర  శాసనసభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 147. అంటే పది మంది సభ్యులు రాజీనామా చేస్తే సర్కారు మైనారిటీలో పడిపోతుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి మద్దతు తీసుకుంటే ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. దీనికి తోడుగా ఎంఐఎం నుంచి 7 సీట్ల మద్దతు ఎలాగూ లభిస్తుంది. అంటే 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఈ రెండు పార్టీల నుంచి లభిస్తుందన్నమాట. అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటమో, జగన్‌ వర్గం వైపు వెళ్లటమో జరిగితే సర్కారు ఖచ్చితంగా మైనార్టీలో పడిపోతుంది. అంటే జగన్‌ కనీసం 40 మంది ఎమ్మెల్యేలను చీల్చగలిగితే స్పష్టంగా సర్కారు మైనార్టీలో పడిపోతుంది. జగన్‌ వర్గానికి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్న. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన మరునాడు జగన్‌ ఇంట్లో 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. వీరిలో చివరి వరకు ఆయన వెంట ఎంతమంది కొనసాగుతారు.. కాంగ్రెస్‌లో మరెంత మంది ఆయన వెంట వస్తారనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.. మొత్తానికి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రమాణం చేసిన మరునాటి నుంచే సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.. దీన్ని ఎలా అధిగమిస్తారో, ఏ విధంగా చక్రం తిప్పుతారో చూడాలి.

రాముడు ఎవరు? వీడియో

3 comments
రాముడు ఎవరు? వీడియో





సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 2 -వీడియో

0 comments
సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 2 -వీడియో
please click on links to this post






సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 1.. వీడియో

2 comments
సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 1.. వీడియో
please click link to this post







వీడియోలో నా ప్రోగ్రామ్‌లు చూడండి

0 comments
కొన్ని రోజులుగా నేను పోస్‌‌ట చేస్తున్న టపాలకు సంబంధించిన ఫీచర్‌  ప్రోగ్రామ్‌ క్లిప్‌‌సను బ్లాగ్‌లో ఉంచమని కొందరు కోరుతున్నారు. వారికి నా ధన్యవాదాలు. గత కొంతకాలంగా  జీ 24 గంటలులో చేసిన కొన్ని  ఎపిసోడ్‌‌సను ఇక నుంచి పోస్‌‌ట చేస్తాను.. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

అఘోరా










ఎస్‌ఐ పరీక్షలు వాయిదా..

2 comments
ఫ్రీజోన్‌ వివాదం ముదిరిన నేపథ్యంలో ఎస్‌ఐ పరీక్షల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గత అయిదారు రోజులుగా హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఫ్రీజోన్‌ వివాదంపై చేస్తున్న ఆందోళనలకు మొదట ప్రతికూలంగా మాట్లాడినా, చివరకు అనుకూలంగా స్పందించింది. 14 ఎఫ్‌ వివాదం సమసేంత వరకూ అని చెప్పకపోయినా, ప్రస్తుతానికైతే ఎస్‌ఐ పరీక్షలను వాయిదా వేశారు.

కైలాసంపై శివుడున్నాడా?

2 comments
మంచుకొండల్లో.. వెండి వెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతు పట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో
సైన్‌‌సకు అందని అసాధారణ వ్యవస్థ
కైలాసం
పరమ శివుడి ఆవాసం
ఆదిశక్తి పార్వతి నివాసం
రావణుడు పది తలలతో ఎత్తిన కైలాసం
ఈ భూమిపైనే ఉంది..
మన కళ్ల ముందు ఉంది
మనకు కనిపిస్తోంది
భూమిపైనే దేవుడు కొలువై ఉన్నాడు
భక్తులకు
శివ అనుగ్రహం లభిస్తోంది..
సముద్ర మట్టానికి
21,778 అడుగుల ఎత్తులో
52 కిలోమీటర్ల విస్తీర్ణంలో
మంచుకొండల నడుమ
 కైలాస పర్వతం
ఈ కొండపైనే రుద్రతాండవం
లయకారుడి లయవిన్యాసం
త్రినేత్రుడి సాక్షాత్కారం
కైలాసంపై ఈశ్వరుడి ఉనికి నిజం
దైవత్వానికి మహాదేవుని నిర్వచనం
కైలాస పర్వతంపైభాగంలో ఏముంది?
ఎవరికీ తెలియని అంతులేని రహస్యం ఏమిటి?
భూమిపైనే ఈశ్వరుడి ఉనికి నిజమేనా? 

.............
నిజమే---- పరమేశ్వరుడు ఈ భూమిపైనే ఉన్నాడు.. మనముంటున్న ఈ నేలపైనే నివాసమున్నాడు.. అవును ఇది అక్షరాలా నిజం.. ఇక్కడే.. ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఆయన ఉన్నాడు.. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు.. వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు.. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది.. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది.. సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుమ ఉంది. ఈ కైలాసంపైనే శివుడు ఉన్నాడు.. ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది.. సైన్‌‌సకు అంతుపట్టని అపురూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది.
....
సశరీరంతో కైలాసానికి  వెళ్లటం గురించి విన్నాం.. కానీ, ఇప్పుడు ఇది వాస్తవం.. కైలాసానికి మనం బొందితోనే వెళ్లవచ్చు.. తిరిగి రానూ వచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్‌నెస్‌ అవసరం. ఫిట్‌నెస్‌ ఉంటే కైలాసానికి వెళ్లి పరమ శివుని చూసి చక్కగా తిరిగి రావచ్చు.
కైలాసానికి శరీరంతో ఎలా వెళ్లగలమని ఆలోచించకండి.. కైలాసం మన భూమిపైనే ఉంది. హిమాలయ పర్వతాలలో ఉంది. సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో ఉంది.. టిబెట్‌ భూభాగంపై ఉన్నది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు.. వేలాది భక్తులకు దర్శనమిస్తున్నారు..
  మౌంట్‌ కైలాస్‌ ప్రపంచంలో స్పిర్చు్యవాలిటీ  సంపూర్ణంగా  వ్యాపించిన ఏకైక  ప్రాంతం. ఇక్కడికి వెళ్లి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం జరుగుతోంది.
ఉమాశంకరులే కాదు.. శివపార్వతుల ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉన్నది. కైలాస పర్వతం చుట్టూ ట్రెకింగ్‌ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట  ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు..
మౌంట్‌ కైలాస్‌ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు.. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికీ లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రత్నాల్లో , నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్‌‌స అన్నింటికీ వండర్‌ మౌంట్‌ కైలాస్‌.   

-1-
దేవుణ్ణి దర్శించాలంటే కఠిన మైన నియమాలు పాటించాలి. తపస్సు చేయాలి. ఉపాసన చేయాలి. యజ్ఞ యాగాదులు చేయాలి.. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు.. దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు..ఎంత కష్టపడితే తప్ప.. సాధ్యం కాదని చెప్పటమే వీటన్నింటి ఉద్దేశం..
కైలాస్‌ మానస్‌ సరోవర్‌ యాత్ర అచ్చంగా అలాంటిదే.. అన్ని కష్టాలకూ పరాకాష్ట.. ఊపిరి కూడా తీసుకోవటం కష్టమైన యాత్ర..సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు... ఆక్సీజన్‌ అంతంత మాత్రం.. అసలు వేడి అంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం.. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి.. ఇతర తీర్థయాత్రా స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు.. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెకింగ్‌  చేయాలి..
ఈ యాత్ర ఒక జీవిత కాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఖాట్మండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీఠ్‌, గౌరీకుండం మీదుగా కైలాస్‌ చేరుకుంటారు.. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే ఫిట్‌నెస్‌ చెక్‌ చేయించుకోవలసి ఉంటుంది.. అన్ని విధాలా ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్‌ యాత్రకు అనుమతిస్తారు...
కైలాస్‌ పర్వతానికి చేరుకోవటం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే..పర్వతాన్ని ఒకసారి చుట్టి రావటానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆక్సీజన్‌ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో నాలుగు రోజుల పాటు నడవటం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది?
శరీర కష్టం కంటే మానసిక సై్థర్యంపైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్‌ పర్యటన కొనసాగుతుంది. కైలాసం శివుడి పూర్ణస్వరూపమని విశ్వాసం. అక్కడకు వెళ్లిన అనేక మంది భక్తులకు పర్వతం ఆసాంతం శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఉన్నాయి. విచిత్రమేమంటే కైలాస పర్వతం దగ్గరకు వెళ్లిన యాత్రికులు, పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు.. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు.. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం.. ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి  కైలాస పర్వతంపైకి మాత్రం ఎందుకు వెళ్లలేకపోతున్నాడు..
కైలాస పర్వతం పైకి అధిరోహించటం అంత తేలికైన సంగతేం కాదు.. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయటం తప్ప, దాన్ని తాకేందుకు కూడా ప్రజలు భయపడతారు..ఎవరెస్టు ఎక్కటానికి లేని భయం కైలాసం తాకటానికి ఎందుకు? కైలాసం ఉపరితలంపై ఏముంది.. కనీసం హెలికాప్టర్లు కూడా దీని పైభాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మమేమిటి?

-2-
ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు పది మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెప్తారు. కైలాస్‌ పర్వతం వయసు కూడా బహుశా అంతే అయి ఉండవచ్చు.  అయితే మిగతా హిమాలయ పర్వతాలకు, కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస్‌ పర్వతం ఒకప్పటి అఖండ భారతానికి సెంటర్‌ పాయింట్‌లో ఉంది. గురుత్వాకర్షణ శక్తికి గరిమనాభి ఎలాంటిదో.. అఖండభారతానికి సెంటర్‌ పాయింట్‌ కైలాసం..
ఆరు హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది.. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది..
కైలాస్‌ పర్వతం నాలుగు వైపుల నాలుగు రంగుల్లో కనిపిస్తుంది. ఒక వైపు నుంచి చూస్తే పూర్తిగా స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది.. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా గోచరిస్తుంది.
అంతే కాదు..  కైలాసానికి నాలుగు రూపాలూ ఉన్నాయి. ఒకవైపు గుర్రంగా, ఇంకోవైపు సింహంగా, మూడో వైపు ఏనుగుగా, నాలుగో వైపు నెమలిగా కనిపిస్తాయి.. ఇందులో  గుర్రం హయగ్రీవ రూపం కాగా, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీక అయితే, నెమలి కుమారస్వామికి వాహనం.. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తాయి.
కైలాస్‌ పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న  నాలుగు పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించటం..గంగ, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదులు ఇక్కడి నుంచే కిందకు ప్రవహిస్తాయి..
మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అద్భుతం. ఈ పర్వత పాదపీఠంలో బ్రహ్మమానస సరోవరం మరో అపురూపం.. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండదని చెప్పే సైన్‌‌స మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్ఛత ఈ భూమిపై కన్ను పొడుచుకుని చూసినా కనిపించదు. పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం..కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
కైలాసం పైకి అధిరోహించటం ఇప్పటికి ఎవరి వల్లా సాధ్యం కాలేదు. పదవ శతాబ్దంలో బౌద్ధ మతగురువు మిర్లెపా కైలాస పర్వతాన్ని ఎక్కినట్లు చెప్తారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ, ఎవరూ దీన్ని స్పృశించేందుకు కూడా సాహసించలేదు.. సాహసించిన వారు కనిపించకుండా అదృశ్యమైపోయారని చెప్తారు.. 1954లో కైలాస్‌ యాత్రను నిషేధించిన చైనా కూడా  దీనిపై ప్రయోగం చేసి విఫలమైంది. రెండుసార్లు హెలికాప్టర్లు పంపిస్తే  అవి తిరిగి రాలేదు. ఆ తరువాత ఎవరూ సాహసించలేదు...
ఎన్నో ప్రయోగాలు జరిగాయి.. ఏమీ తేలలేదు.. ఇప్పటి వరకు కైలాస్‌ పర్వతం అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన వాళ్లే తప్ప ఇన్నర్‌ సర్కిల్‌లోకి ప్రవేశించిన వాళూ్ల లేరు.. 21సార్లు అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన తరువాత ఇన్నర్‌ సర్కిల్‌లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. అది అంత తేలిక కాదు.. అఘోరాల్లాంటి వాళ్లకు కానీ సాధ్యం కాదు.. ఇంత క్లిష్టమైన పర్వతం ఉపరిభాగంపై ఏమున్నదన్నది సైన్‌‌సకు మాత్రం అందలేదు.. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు.. ధ్యానముద్రలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు....ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైంది.. అంతు చిక్కనిది.
కైలాస్‌ దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి.. హిమాలయ సానువుల్లో సువర్ణభాండం.. పరమేశ్వరుడి దివ్యధామం.. పార్వతి దేవీ కొలువైన పవిత్ర క్షేత్రం. అణువణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు.

మీ పిల్లల్ని మీరు చంపేస్తున్నారు

5 comments
ఒక చిరు తిండి మీ చిన్నారి ప్రాణాల్ని హరించేస్తున్నది
అందంగా కనిపిస్తూనే అంతం చేస్తోంది
కమ్మకమ్మగా ఖతం చేస్తోంది
జ్యూసీగా జ్యూసీగా విషం లోపలికి ఇంజెక్ట్‌ అవుతోంది
రక్తంలో కలిసిపోతోంది
మీరే మీ పిల్లలకు విషాన్ని అందిస్తున్నారు
అన్నం బదులు రసాయనాలను తినిపిస్తున్నారు
పురుగుమందులను తాగిస్తున్నారు
పిజ్జాలు..
బర్గర్లు..
పావ్‌ బాజీలు..
కట్‌లెట్‌ రగడా..
హమ్‌బర్గర్స్‌
హాట్‌ డాగ్స్‌
ఐస్‌క్రీమ్‌
కేక్‌
ఫ్రెంచ్‌ ఫ్రైస్‌
ఆనియన్‌ రింగ్స్‌
డోనట్స్‌
సాఫ్ట్‌ డ్రింక్స్‌
-----------------------------------------------

1
హాలీడే వచ్చేసిందంటే చాలా మందికి జాలీడే.. పిల్లలతో షికార్లు.. మెక్‌డోనాల్డ్స్‌లో పిజ్జాలు.. బర్గర్‌లు.. ఐమాక్స్‌లో సినిమా.. వీడియో గేమ్స్‌తో హల్‌చల్‌.. గోకుల్‌ చాట్‌లో చాట్‌, పానీపురీ, పావ్‌బాజీ.. ఫుల్‌ హంగామా.. వారం రోజుల పాటు రోజూ పది, పన్నెండు గంటలు పని చేసి హాలీడే వచ్చిందంటే, పిల్లలతో హ్యాపీగా గడపడం, వాళ్లడిగింది కొనివ్వటం దగ్గరుండి రకరకాల ఫుడ్స్‌ తినిపించటం.. ఓ రిలాక్స్‌.. ఓ ఆనందం.. పిల్లలూ హ్యాపీ.. మనమూ హ్యాపీ..,..... ఈ హ్యాపీ హ్యాపీయేనా? మీ పిల్లలకు కోరిందల్లా కొనివ్వటమే హ్యాపీయా? కాదు.. మీకు తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నారు.. కోరి కోరి మృత్యుముఖంలోకి నెట్టేస్తున్నారు.. పిల్లలను మృత్యువు దగ్గరకు మీరే పంపిస్తున్నారు.. ఇది పుక్కిటి పురాణం కాదు. పిట్టకథ కాదు.. మీకు ఓ హెచ్చరిక.
మీ పిల్లలకు అన్నీ ఇష్టమే.. మీకూ ఇష్టమే.. వాళ్లు అన్నం తినకపోయినా సరే.. పిజ్జా తింటే చాలు.. పసిపాపకు తిండి అంటే ఫ్రెంచ్‌ఫ్రై, డోనట్సే.. ఇక ఐస్‌క్రీమ్‌లకు, కూల్‌డ్రింక్‌లకూ కొరవేముంది... ఏదీ తిండికి అనర్హం కాదు.. ఏదీ తాగటానికి అనర్హం కాదు.. ఎక్సెప్ట్‌ అన్నం తప్ప..

ఇక్కడే ఓ ప్రశ్న ఉదయిస్తుంది. వీకెండ్స్‌లో కూడా ఇంట్లోనే తినాలా? అదీ అన్నం తినాలా? పిల్లల సూటి ప్రశ్న ఇది. అవును.. నిజమే.. రోజూ ఏదో అన్నం తింటున్నాం.. సరదాగా వీకెండ్స్‌లో మరేదైనా తినిపించవచ్చు కదా.. లాజిక్‌ బాగానే ఉంది. పిల్లల్ని హ్యాపీగా ఉంచటం ముఖ్యం వాళ్లకు ఇష్టమైంది తినిపించకపోతే మనమెందుకు అని పేరెంట్స్‌ ఫీల్‌ కావటమూ లాజిక్కే.  ఈ మాత్రం దానికి పిల్లలకు విషం తినిపిస్తున్నామని, వాళ్లను చంపేస్తున్నామని అడ్డగోలుగా వాదించటం, భయపెట్టడం సబబేనా?  అంటే నిజమే.. కానీ, దీని వెనుక కారణం ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించాలి.
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకువెళ్లేదే, ఫుడ్‌కోర్ట్‌కో, సినిమాకో, వీకెండ్‌ స్పాట్స్‌కో.. ఫుడ్‌ కోర్ట్‌కు వెళ్లినప్పుడు అక్కడ పులిహోరో, అన్నం పాయసమో అమ్మరు కదా.. అక్కడ అమ్మేదే ఫాస్ట్‌ ఫుడ్‌... అదీ పిజ్జా, బర్గర్లు, చాట్‌, పానీపూరీలు..రెస్టారెంట్‌  టైప్‌ అయితే బిర్యానీ, రుమాలీ రోటీ, చైనీస్‌ ఫుడ్‌.. అవే ఉంటాయి. అవే తినాలి. అవి తినేందుకే పేరెంట్స్‌ వెళ్తారు. పిల్లల్ని వెంటేసుకుని మరీ వెళ్తారు. వాళ్లు పిజ్జా తింటుంటే హ్యాపీగా ఫీలవుతారు..
ఇప్పుడు ఈ తిండే పెద్ద సమస్యగా మారింది. ప్రాణాంతకంగా మారింది. పిల్లలను మృత్యుముఖంలోకి నెట్టేస్తుంది. మీ పిల్లల ప్రాణాలను తోడేసేది ఎవరో కాదు.. పిజ్జా.. బర్గర్‌, పావ్‌, కురుకురే.. ఎస్‌.. వీటికి ముద్దు పేరు జంక్‌ ఫుడ్‌.. జస్ట్‌ అచ్చతెలుగులో అనువదిస్తే చెత్త ఆహారం అని అర్థం.. అలా అనడానికి మనసొప్పదు కాబట్టి చిరుతిండి అని కూల్‌గా పిలుచుకుంటాం...
మీ పిల్లలకు తినిపిస్తున్న పిజ్జా, బర్గర్‌, డోనట్‌.. వాళ్ల శరీరాల్లో చెత్తలా పేరుకుపోతోంది. ఎక్కడ పడితే అక్కడ చేరిపోతోంది. అది కొండలా పెరిగిపోతోంది. పిల్లకాయల్ని బెలూన్లా ఊరేలా చేస్తోంది. నాలుగేళ్ల వయసుకే వంద కిలోల బరువెక్కి, బతుకే భారంగా మారేట్లు చేస్తోంది.
రెండేళ్ల నుంచి ౧౯ఏళ్ల వరకు ఆడ, మగ తేడా లేకుండా అందరిలోనూ ఫుడ్‌ సెユ్టల్‌ మారిపోయింది. అన్నం అంటే సెユ్టల్‌గా పిలుచుకుంటే వైట్‌రైస్‌ అనేది లైట్‌గా తీసుకోవటం, సైడ్‌ ఫుడ్స్‌ తెగ మెక్కేయటం అలవాటుగా మారిపోయింది.

ఇది అంత ఆషామాషీగా తీసుకోవద్దు.. మీ పిల్లల్లో అవాంఛనీయమైన ఊబకాయానికి ఈ తిండ్లే కారణమని గ్రహించండి.. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి మీ పిల్లల్ని ఎదగనీయవు.. జీవన పరిమాణాన్ని అమాంతంగా తగ్గించేస్తాయి. మీ జనరేషన్‌  వాళ్లు కనీసం 60-70 ఏళ్లయినా బతుకుతున్నారు. మీ పిల్లల జనరేషన్‌ 40 ఏళ్లు దాటితే గొప్పే...
-----------------------------

3
ఎందుకింతగా భయపెడుతున్నారు? అని అందరికీ సందేహం కలుగుతుంది.. కానీ, ఇది భయపెట్టడం కాదు.. హెచ్చరించటం.. నిజంగా ఇది యంగ్‌ పేరెంట్స్‌కు ఓ హెచ్చరిక.. ఫాస్ట్‌ఫుడ్‌ మేనియాలో పడి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడమని హంబుల్‌ రిక్వెస్ట్‌.  ఈ చిన్న కథలాంటి వాస్తవాన్ని ఒకసారి చదవండి..
జనవరి ౧, ౧౯౮౯ సాన్‌ఫ్రాన్సిస్కో అమెరికాలో మాట్‌ మామ్‌గ్రమ్‌ అనే యువకుడు ఓ పిజ్జా హట్‌లోకి వెళ్లాడు. రెండు బర్గర్లు తీసుకున్నాడు.  ఒక బర్గర్‌ తినేసి, మరో బర్గర్‌ను కోటు జేబులో  పెట్టుకున్నాడు. ఆ తరువాత దాని సంగతే మరిచిపోయాడు. ఏడాది పాటు ఆ కోటునే వేసుకోలేదు.  సరిగ్గా సంవత్సరం తరువాత మాట్‌ తన పాత కోటు తీశాడు. కోటు జేబులో ఏదో తగిలిందని చూస్తే, ఏడాది క్రితం నాటి బర్గర్‌
ఆశ్చర్యం వేసింది. తాను కొన్నప్పుడు ఎలా ఉందో.. ఎలాంటి వాసన వచ్చిందో అలాగే ఉంది..తాను కనుగొన్న ఈ డిస్కవరీని తన ఫ్రెండ్స్‌తో పంచుకున్నాడు. ఎవరూ అతణ్ణి నమ్మలేదు. కొత్త బర్గర్‌ కొని అబద్ధమాడావన్నారు. అప్పటి నుంచి మాట్‌ బర్గర్ల కలెక్షన్‌ ప్రారంభించాడు.  వాటిని టీపాయ్‌ కింద బేస్‌మెంట్‌లో దాచాడు. ఇదంతా జరిగి ౨౧ సంవత్సరాలు పూర్తయ్యాయి.  ఇవాళ మాట్‌ దగ్గర సూపర్‌ బర్గర్‌ కలెక్షన్‌ తయారైంది.
ఎప్పటికీ చెడిపోని బర్గర్లు.. డబుల్‌ చీజ్‌ బర్గర్లు.. హమ్‌బర్గర్లు.. ప్రపంచంలో కనీవినీ ఎరుగని కలెక్షన్‌ ఇది. ఇప్పుడాయన బర్గర్‌ మ్యూజియం నిర్వహిస్తున్నాడు.

ఒక ఆహార పదార్థం ఎన్నాళ్లయినా పాడు కాకుండా ఉండటం ఎలా సాధ్యం? వీటిలో ఏయే పదార్థాలు వాడారు.. ఎందుకలా చెడిపోకుండా ఉన్నాయి. ఇలాంటి పదార్థాలు తింటే, మీరు తినిపిస్తే.. మీ పిల్లలు ఏమై పోతారు.. ఒక్కసారి కూల్‌గా ఆలోచించండి..
అమెరికాలో మాట్‌  మామ్‌గ్రమ్‌ స్టోరీ కల్పితం కాదు. నిజం.. ఈ బర్గర్‌లలో వాడిన ఇన్‌గ్రెడెంట్స్‌ వింటే దిమ్మ తిరిగిపోతాయి.
ఆవుమాంసం
ట్రెユక్లోరోథిన్‌
క్లోరోఫామ్‌
డిడిటి
ఇథైల్‌ బెంజిన్‌
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రసాయనాలు కనిపిస్తాయి. ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు, రుచికరంగా ఉండేందుకు, చాలా వస్తువులు ఇందులో కలుస్తాయి. ప్రపంచం అంతా ఇదే జరుగుతోంది. ఇందుకు మన దేశం మినహాయింపేమీ కాదు. ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు.. వీటివల్ల జంక్‌ఫుడ్‌ లోపలికి వెళ్లి పూర్తిగా జీర్ణం కాక రక్తనాళాల పక్కన కొలెస్ట్రాల్‌గా మారి నిలిచిపోతుంది. ఫలితం.. ఊబకాయం...
ప్రతి వందమంది పిల్లల్లో  ౩౫ శాతం మంది అండర్‌ వెయిట్‌ ఉంటే, ౫౫ శాతం మంది ఓవర్‌ వెయిట్‌ ఉన్నారు.. కేవలం పది శాతం మంది మాత్రమే వయసుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉంటున్నారు. మిగతా వాళ్లందరికీ ఎప్పుడూ ఏదో సమస్యే... ఏ చిన్న ప్రతికూల వాతావరణాన్ని కూడా భరించలేని పరిస్థితి. ఎక్కువ వేడిని తట్టుకోలేరు.. ఎక్కువ చల్లదనాన్ని తట్టుకోలేరు.. చిన్న చిన్న వాటికే కిందామీదా పడిపోతారు.. మీరే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆలోచించండి.. నెలకు మీ పిల్లల మెడిసిన్స్‌ ఖర్చు ఎంతవుతోందో లెక్కలేసుకోండి.. మీకే అర్థమవుతుంది.. మీ పిల్లలెంత బాగా ఉన్నారో.. వారి ఆరోగ్యాన్ని మీరెంతగా చెడగొడుతున్నారో..

చెత్త తిండి, అదేనండి.. జంక్‌ ఫుడ్‌ తినిపిస్తే మీ పిల్లల్లో  ఒబెసిటీ పెరగడమే కాదు.. మామూలు భోజన అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. తిండి సరిగా తినరు.. జంక్‌ఫుడ్‌పై చూపే మోజు, మామూలు అన్నంపై చూపించరు. తొందరగా అలిసిపోతారు. కాళ్ల నొప్పులంటారు... కడుపు నొప్పంటారు.. తరచూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. ప్రతి చిన్న దానికి భయపడిపోతుంటారు. నిద్ర సరిగా పట్టదు.. ఒకదాని వెంట ఒకటిగా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. డాక్టర్లను పేరెంట్స్‌ పోషిస్తూనే ఉంటారు. దటీజ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ జంక్‌ఫుడ్‌.

ఈ ఒబెసిటీ జాడ్యం కూడా పాశ్చాత్య దేశాల నుంచే మనకు పట్టుకుంది. అన్నింటా అమెరికాను ఆదర్శంగా తీసుకోవటం, అడ్డమైన ఫుడ్డూ తినటం, మన తరువాతి జనరేషన్‌ ఆయుర్దాయానికే ఎసరు తెచ్చిపెడ్తోంది. అసలు వాళ్ల లైఫ్‌సెユ్టల్‌నే అది పూర్తిగా మార్చేస్తోంది.    
ఇప్పుడు మన లైఫ్‌ అంతా అమెరికా సెユ్టల్‌.. లండన్‌ సెユ్టల్‌.. సిడ్నీ సెユ్టల్‌.. అంతే తప్ప.. హైదరాబాదీ సెユ్టల్‌ అనేది లేనే లేదు. నగరాల్లో కాలుష్యం ఓ నరకం అయితే, ఫాస్ట్‌ఫుడ్‌ డైరెక్ట్‌ పాయిజన్‌గా ఇంజెక్ట్‌ అవుతోంది. మన రాజధానిలో నెలకు రెండు  వందల కోట్ల రూపాయల వరకు రకరకాల రూపాల్లో ఫాస్ట్‌ఫుడ్‌ బిజినెస్‌ జరుగుతోందంటేనే, నగర ప్రజలు ఏ స్థాయిలో అడిక్ట్‌ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
అమ్మాయిల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది.. ఇలాంటి జంక్‌ఫుడ్‌ కారణంగా అమ్మాయిల్లో హార్మోన్లు వ్యాకోచించి తొందరగా ఎదిగిపోతున్నారు.. చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు. పెద్ద వాళ్లలో ఉన్న లక్షణాలన్నీ ముందే వచ్చేస్తున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారుతోంది.
ఈ సమస్యంతా నగరాల్లో ఉన్న పిల్లల విషయంలోనే జరుగతోంది. ఫాస్ట్‌ఫుడ్‌.. జంక్‌ఫుడ్‌.. చెత్త తిండి అంతా నగరాల్లోనే దొరుకుతోంది.. ఇంకా పల్లె సీమలకు ఎక్కువగా విస్తరించకపోవటం వల్ల అక్కడి పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలు అక్కడికి పాకలేదు. నగరాల్లోనే ఈ విషం పిల్లల రక్తనాళాల్లో వేగంగా వ్యాపిస్తోంది.  ఏ దశలోనూ  పిల్లలకు పోషకాహారం లభించటం లేదన్న వాస్తవాన్ని  తల్లిదండ్రులు గుర్తించటం లేదు. ఒకవేళ గుర్తించినా, ఆ పోషకాహారాన్ని అందించే పరిస్థితీ, వాతావరణం లేనే లేదు. ఇది ఇంతమందిలో ఉంది.. జంక్‌ఫుడ్‌ ప్రభావం ఇంతమందిలో లేదు అన్న లెక్కలు పత్రాలు అవసరం లేదు. ప్రతి ఇంట్లో, పిల్లలందరికీ విస్తరించిన జాడ్యం. దీన్ని నిర్మూలించటం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న వేయవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా ఆపగలం అని అడగవచ్చు. కానీ, దాన్ని కనీస స్థాయికి తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. పీజ్జాలతో చెలగాటం.. మీ పిల్లలకు ప్రాణసంకటం అని గ్రహించండి...జస్ట్‌ అవాయిడ్‌ జంక్‌ఫుడ్‌.. సేవ్‌ యువర్‌ కిడ్స్‌..

రాముడు ఎవరు?

9 comments
శ్రీరాముడు..
మానవుడా.. దేవుడా?
దైవం మానవరూపంలో అవతరించాడా?
మనిషే దేవుడిగా ఎదిగిపోయాడా?
వాలిని చెట్టు చాటు నుంచి చంపిన వాడు
భార్యను అడవుల పాలు చేసిన వాడు
ప్రపంచానికి రోల్‌మోడల్‌ ఎలా అయ్యాడు?
రాముళు్ల ఇద్దరున్నారా?
రామాయణానికి రుజువులేమిటి?

.......................................................................
శ్రీరాముడు... సుగుణాభి రాముడు.. మర్యాదా పురుషోత్తముడు.. జగదభిరాముడు.. ఎన్ని పేర్లు.. ఎన్ని స్తోత్రాలు.. ఆయన పేరే ఒక తారకమంత్రం. ఆ పేరును ఒక్కసారి జపిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని చెప్తారు. నిజంగా రాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు.. వాలిని చెట్టు చాటు నుంచి చంపినవాడు.. ఎవరో తాగుబోతు మాటలు విని భార్యను అడవుల పాలు చేసిన వాడు ఆదర్శపురుషుడు ఎలా అయ్యాడు? రామాయణం నిండా రకరరకాల ఛిౌ్టట్చఛీజీఛ్టిజీౌట కనిపిస్తాయి.. వాదాలు, వివాదాలూ ఉన్నాయి. అయినా రామరాజ్యం రావాలని, రాముడి లాంటి పాలకులు, లీడర్లు రావాలని ఎందుకు కోరుకుంటారు? ఈ ఆదర్శ రాముడు ఎవరు?
.....................................
భారత దేశంలో ఆదర్శపురుషుడు ఎవరంటే ముందుగా వచ్చే పేరు శ్రీరాముడు.. ఆదర్శ దంపతులు ఎవరంటే సీతారాములు.. ఆదర్శపాలకుడు ఎవరంటే శ్రీరాముడు.. ఆదర్శ రాజ్యం ఏదంటే రామరాజ్యం.. ఇవాళ మన పాలకులంతా మైకుల ముందు ఊదరగొట్టే ఉపన్యాసాల్లో తరచూ చెప్పే మాట.. మళ్లీ రామరాజ్యం తెస్తామని? ఏమిటీ రామరాజ్యం? అసలు ఈ రాముడు మనిషా? దేవుడా? ఏమిటీ సీక్రెట్‌..?  
...................................
రామాయణం. రాముడు.. సీతారాములు.. లక్షల సంవత్సరాల నాటి చరిత్ర... అఖండ భారత దేశమంతటితో అనుబంధం పెనవేసుకున్న చరిత్ర.. దేవుడు మనిషిగా అవతరించిన చరిత్ర.. మనిషి దేవుడిగా ఎదిగిపోయిన చరిత్ర.. ఇంతకీ ఈ రాముడు ఎవరు? మనందరికీ తెలిసినంతవరకు విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవ అవతారం శ్రీరాముడు.. రావణుడిని హతమార్చేందుకు ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడు.
కొడుకుగా రాముడు
అన్నయ్యగా రాముడు
భర్తగా రాముడు
స్నేహితుడిగా రాముడు
రాజుగా రాముడు
ఏమిటీ రాముడి అవతారంలోని గొప్ప సీక్రెట్‌.. ఆయన ఫేస్‌ వాల్యూ లక్షల సంవత్సరాల తరువాత కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉంది. సాక్షాత్తూ నారాయణుడే రాముడిగా అవతరించి ఉంటే.. నేరుగా వెళ్లి రావణుణ్ణి హతమార్చి ఉండవచ్చు కదా? అంతకు ముందు వచ్చిన అన్ని అవతారాల్లోనూ ఆయన చేసింది అదే.. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ కొద్ది నిమిషాల్లో ముగిసినవే..
మరి రామావతారం మాత్రం వాల్మీకి రామాయణం ప్రకారం పదకొండు వేల సంవత్సరాలు ఎలా కొనసాగింది.. ? దిగివచ్చిన దేవుడు రాముడిగా ఎందుకు అష్టకష్టాలు పడినట్లు.. వనవాసం ఎందుకు చేసాడు..? నేరుగా వెళ్లి రావణుడితో యుద్ధం చేసి హతమార్చి ఉండవచ్చు కదా.. కేవలం మానవమాత్రుడిలాగా ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొన్నాడు? ఈ రాముడు దైవమా? దైవంగా ఎదిగిన మనీషా?
రాముడు దేవుడే అయితే, ఎందుకిలా కష్టపడ్డాడన్న ప్రశ్న హేతుబద్ధమే. కానీ, ఇక్కడే ఓ ట్విస్‌‌ట ఉంది. పురాణాల ప్రకారమే అయితే, విష్ణుమూర్తి అవతారాల్లో  పూర్ణమానవుడిగా అవతరించిన సందర్భం రాముడే.. మనిషి జీవితంలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో రాముడు చేసి చూపించాడు.. ఆయన కేవలం రావణ వధ చేయటం కోసమే అవతరించాడా, లేక మరేదైనా గొప్ప కార్యాన్ని సాధించటానికి పుట్టాడా?
.................
రాముడు దేవుడా? రామాయణం ఎప్పుడు జరిగింది.. ఇవి మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు.. ఈ తరానికి అంతుపట్టని తెలియని ప్రశ్నలు.. అసలు రామాయణమే లేదని, ఇది కేవలం ఒక మిథ్యావాదమని, కల్పిత కావ్యమే తప్ప, చరిత్ర కాదని చెప్పేవాళు్ల ఎక్కువమందే ఉంటారు.. కానీ, రామాయణ కాలం ఇప్పటికే విస్పష్టమైంది.. టైమ్‌తో సహా  తేలింది.. ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో ఉన్నాం.. రామాయణం 26వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి రామాయణం చెప్పుకొచ్చింది. ఒక మహాయుగం అంటే కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలన్నమాట. ఒక మహాయుగం అంటే 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అంటే ఒక్కో యుగం లక్షా ఎనిమిది వేల సంవత్సరాలన్నమాట. ఈ ప్రకారం చూస్తే, రామాయణం పది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది.
రామాయణానికి సంబంధించిన రుజువులు అన్నీ దొరికాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లాలోని అయోధ్యలో రాముడి జన్మస్థలాన్ని విక్రమాదిత్యుడు కనుగొని గొప్ప ఆలయాన్ని నిర్మించాడు.. రామాయణంలో పేర్కొన్న సరయూ నదీతీరం, సాకేతపురి అన్నీ ధృవీకరణ జరిగాయి. లంకలో రావణాసురుడి ఆనవాళు్ల స్పష్టంగా లభించాయి. అన్నింటికీ మించి రాముడు లంకకు నిర్మించిన సేతువు ఇవాళ్టికీ 30 కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తూనే ఉంది.

ఇవన్నీ మానవ నిర్మితాలని, ప్రపంచ అతి ప్రాచీన నాగరికతకు గుర్తులని, ఇంటర్నేషనల్‌ సైంటిస్టులే గుర్తించారు.. ఇదిగో చూడండి.. ఇవి రాముడి సేతువుకు సంబంధించిన సాటిలైట్‌ ఇమేజెస్‌. ఇవి మన భారతీయులో.. లేక ఏ హిందూ సంస్థలో తీసిన చిత్రాలు కావు. ప్రపంచం అంతా దేనై్నతే ప్రామాణికంగా భావిస్తుందో, దేని మాటైతే వేదంలా నెత్తిన పెట్టుకు పూజిస్తుందో ఆ నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసిన చిత్రాలు.. పదిలక్షల సంవత్సరాల క్రితం ఒక రాజు నిర్మించినట్లు కూడా అది వివరించింది. ఇదొక్కటి చాలు రామాయణం వాస్తవమని చెప్పటానికి..

అటు హంపి దగ్గర కిష్కింధలోనూ, తిరుమలలోని అంజనాద్రిపైనా, నాసిక్‌, చిత్రకూటం ఇలా రాముడు అయోధ్య నుంచి లంక వరకు ప్రయాణించిన మార్గమంతటా ఏవో ఒక గుర్తులు మనకు కనిపిస్తాయి.

రామాయణం మాట సరే.. మరి రాముడి మాటేమిటి? విష్ణుమూర్తి నరుడిగా అవతరించాడా? నరుడే నారాయణుడయ్యాడా? ఈ మీమాంస ఎప్పుడూ ఉండేదే.. దేవుడ్ని మనం ఎలాగూ చూడలేదు.. కానీ, రాముడి చరిత్ర మాత్రం మనకు తెలుసు.. దేవుడిగా ఆయన అవతరించాడని హిందూ పురాణేతిహాసాలు చెప్తున్నాయి. అంతకంటే మించిన గొప్ప సంస్కృతిని ఈ దేశం ఆవిష్కరించింది. భగవంతుడిగా మానవుడు ఎదగటం.. ఎదిగేలా చేయటం..


రాముడు దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి.. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్టసుఖాలన్నీ అనుభవించాడు.  రాజుగా ప్రజల్ని పరిపాలించాడు.. మరి ఒక మిలియన్‌ ఇయర్‌‌స తరువాత కూడా  ఆదర్శరాముడని కొలుస్తున్నారు.. రాముడికి ముందు కానీ, రాముడి తరువాత కానీ, ప్రజల్ని ప్రభావితం చేసిన రాజే లేడా? అసలు ఇన్ని తరాలకు ఆయన రోల్‌ మోడల్‌ ఎలా అయ్యాడు?  
.......................................
నిజం.. రాముడు తానే ఓ తారకమంత్రం. జైశ్రీరాం అన్నది ఒక దివ్యౌషధం.. అంతగా భారతీయ సంస్కృతిలో రామచంద్రుడు నాటుకుపోయాడు. కారణం ఏమిటి? ఒక మనిషిగా జన్మించాక, అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి.. ఎలాంటి జీవితాన్ని గడపాలి.. బంధుమిత్రులతో ఎలా ఉండాలి.. ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి.. కష్టాల్లో, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలి అన్న వాటిని ఆచరించి చూపించిన వాడు రాముడు.

తల్లి దండ్రుల గారాల పట్టి అయిన రాముడు 17ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట వెళ్లమంటే మారు మాటాడకుండా వెళ్లాడు.. రేపు పట్టాభిషేకం అనగా పధ్నాలుగేళు్ల వనవాసం చేయమంటే అలాగే అంటూ వెళ్లిపోయాడు.. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఇవాళ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రుల్ని కాదని రాత్రికి రాత్రి ఇల్లు వదిలేసే సంతానాన్ని మనం చూస్తున్నాం. జననీ, జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నది ఈ రాముడే.. కన్నతల్లి, కన్నభూమి స్వర్గంతో సమానమన్నాడు.. అందుకే ఆయన ఆదర్శరాముడయ్యాడు.

అన్నగా తము్మళ్ల పట్ల అపారమైన ప్రేమను కురిపించిన వాడు. ఆయన తము్మళు్ల కూడా అదే విధంగా అన్నపట్ల ప్రేమతో ఉన్నారు.. తల్లులు వేరైనా ఏనాడూ కూడా దాయాదుల పోరు జరగలేదు. సీతాపహరణం తరువాత సుగ్రీవుడితో స్నేహం కుదిరాక ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని తము్మడి భార్యను అపహరించిన వాలిని సంహరించాడు..

వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు.. అంతటి వీరుడు చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చింది? దీనికి రకరకాల సమాధానాలు ఉన్నాయి. ఎవరికి తోచిన జవాబులు వాళు్ల చెప్పుకొచ్చారు. జంతువును చెట్టుచాటునుంచి చంపటం తప్పుకాదన్నారు. దీని వెనుక సాంకేతికంగా ఓ లాజిక్‌ ఉంది. దాని గురించి వాల్మీకి స్వయంగా రామాయణంలో చెప్పుకొచ్చాడు. వాలిలో ఒక గొప్ప శక్తి ఉంది.. ఆయన ముందు ఎవరు నిలబడ్డా.. ఆయన్ను చూసిన వెంటనే మెస్మరైజ్‌ అయిపోతారు.. ఎదుటివారిలో శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. ఇది ఒకరకంగా హిప్నటిజం లాంటిదే.. ఇప్పుడంటే హిప్నటిజంలో ఎదుటి వ్యక్తి అనుమతితో అతణ్ణి మెస్మరైజ్‌  చేస్తారు. ఆనాడు వాలి సూపర్‌ హిప్నాటిస్‌‌ట అన్నమాట.

ఒకటి కాదు.. రెండు కాదు.. హు్యమానిటీ అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఎన్నో ఉదాహరణలు రామాయణంలో మనకు కనిపిస్తాయి. పడవపై దాటించిన గుహుడు, ఎంగిలి పళ్లను ఇచ్చిన శబరి, సీత జాడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణ సమయంలో ఉడుత, శరణు కోరిన శత్రువు తము్మడు.. చివరకు తొలి రోజు యుద్ధంలో నిరాయుధుడైన రావణున్ని సైతం వదిలేసిన ఉదాత్త పురుషుడు కాబట్టే ఆయన అన్నింటా, అందరికీ, తరతరాలకు, యుగయుగాలకు ఆదర్శమయ్యాడు.. యుగపురుషుడయ్యాడు.


ఇంతవరకు బాగానే ఉంది..  మరి రాముడి విషయంలో ఉన్న మిగతా కథనాల మాటేమిటి? రావణ వధ తరువాత సీతమ్మను అగ్నిప్రవేశం చేయించాడు.. ఆ తరువాత నిండు గర్భవతిని అడవుల్లో వదిలేశాడు.. అది కూడా ఓ తాగుబోతు మాటలు విని వదిలేశాడు.. ఇలాంటి వ్యక్తి  భావి తరానికి ఎలా ఆదర్శమూర్తిగా నిలుస్తాడు? ఇవాళ్టికీ రామరాజ్యం రావాలని అంతా ఎందుకు కోరుకుంటున్నారు...?
రాముడి ఆదర్శం విషయంలో భారత దేశంలో తలెత్తే అతి పెద్ద ప్రశ్న సీతాదేవి విషయంలో రాముడు వ్యవహరించిన తీరు.. దీనిపై వంద సంవత్సరాలుగా వాదాలు, చర్చలు తీవ్రంగానే జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి కూడా.  అసలు సీత రాముడికి ఏమవుతుందని బల్లగుద్ది క్వశ్చన్‌ చేసేవాళూ్ల ఉన్నారు.. వీటన్నింటికీ జవాబులు వాల్మీకి రామాయణంలోనే ఉన్నాయి. వాస్తవానికి సీత భూమి నుంచి పుట్టలేదు.. జనకుడికి భూమిలో ఒక పెట్టెలో దొరికింది. ఆమె అయోనిజ. ఈమె భూదేవి కూతురు కాదు. లక్ష్మీదేవే శిశువుగా భూమిలో దొరికింది. కాబట్టి శ్రీదేవి, భూదేవి విష్ణుమూర్తి భార్యలు కాబట్టి అందులో ఒకామె కూతుర్ని ఆయన ఎలా పెళ్లి చేసుకున్నాడన్న ప్రశ్నే ఉదయించదు.
రావణ వధ తరువాత సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడు రాముడు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది రాముడనే వ్యక్తి మరి కొద్ది రోజుల్లో రాజుగా పట్టాభిషేకం పొందనున్నాడు. అంటే పబ్లిక్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడని అర్థం. పబ్లిక్‌ లైఫ్‌లో అడుగుపెట్టే వ్యక్తి జీవితానికి క్లీన్‌చిట్‌ అనేది ముఖ్యం. ఒకసారి పబ్లిక్‌ లైఫ్‌లో అడుగుపెట్టాక ప్రజలే సర్వస్వం కావాలే తప్ప వ్యక్తిగతానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. అందుకే ఆ క్లీన్‌చిట్‌ కోసమే అగ్నిప్రవేశం చేయించాడు. ఇవాళ్టికీ మన పల్లె సమాజాల్లో నిప్పులపై నడిచే సంప్రదాయాలు ఉన్నాయి. ఒక పాలకుడిగా ప్రజల అభిప్రాయాలకు ఎంత గౌరవం ఇవ్వాలో ఆనాడే ఆయన ఆచరించి చూపాడు.. కాబట్టే ఆయనది రామరాజ్యంగా ఇవాళ్టికీ చెప్పుకుంటున్నారు..
ఇక సీతమ్మను అడవుల్లో వదిలేయటం సంగతి... వాల్మీకి రాసిన రామాయణం 24 వేల పద్యాల్లో ఉంది. వాల్మీకి రామాయణం తరువాత దాదాపు 300 వెర్శన్‌‌సలో 20 భాషల్లో రామాయణాలు వచ్చాయి. వీటిలో కొన్ని సంస్కృతంలో వచ్చి, వాటిని వాల్మీకికి ఆపాదించినవీ ఉన్నాయి. వాస్తవానికి మహాభారతానిది కూడా అదే పరిస్థితి. అసలు 8,800 పద్యాలున్న భారతం కాలం గడుస్తున్న కొద్దీ లక్ష దాకా పెరుగుతూ పోయింది. ఇవి రెండూ గ్రోయింగ్‌ ఎపిక్‌‌స.
ఇలాంటిదే ఉత్తర రామాయణం కూడా.. వాల్మీకి తన రామాయణానికి ముందే దాని సంగ్రహాన్ని విస్పష్టంగా వివరించాడు. అందులో ఎక్కడా ఉత్తర రామాయణం ప్రస్తావన లేదు. వాల్మీకి రామాయణం రామ పట్టాభిషేకంతోనే ముగుస్తుంది. పట్టాభిషేకం తరువాత 11వేల సంవత్సరాల పాటు రాముడు ఈ భూమిని పరిపాలించి తిరిగి వైకుంఠానికి వెళ్లిపోయాడని కూడా చివరి పద్యాల్లో ఉంటుంది. చివరకు రామాయణం ఫలశ్రుతి కూడా ఉంటుంది. ప్రాచీన చారిత్రక ఇతిహాసాలన్నీ ఫలశ్రుతితోనే ముగియటం అందరికీ తెలిసిన సత్యమే.. అలాంటప్పుడు ఉత్తర రామాయణం అనేది ఆ తరువాత కల్పించిన కథ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతమ్మను అడవుల్లో వదిలేశాడన్నదీ ఈ కల్పితంలో భాగమే.
రాముడి పాత్రపై, ఉత్తర రామాయణంపై కానీ, రకరకాల కథనాలు ఆ తరువాతి కాలంలో ఆయా కాలాలకు అనుగుణంగా వచ్చినవే.. ఆనాటి సమాజానికి అనుగుణంగా మార్పులు చేర్పులకు గురైనవే. రాముడి నిజమైన వ్యక్తిత్వాన్ని వాల్మీకి మాత్రమే ఆవిష్కరించాడు.. ఆ తరువాత వచ్చినవన్నీ పుక్కిటి పురాణాలే.. వాల్మీకి చూపించిన రాముడే మనకు ఇవాళ ఆదర్శంగా నిలిచిన జగదభిరాముడు.. మర్యాదాపురుషోత్తముడు.



భూతాలు ఏర్పరుచుకున్న లిపి.. భూత లిపి..

0 comments
ఇది రామాయణం కాదు..
మహాభారతం అంతకన్నా కాదు..
కలియుగ కాలజ్ఞానమూ కాదు..
నరమానవులకు అర్థం కాని భూతాక్షరాలు..
మరణాన్ని శాసించే రక్తాక్షరాలు..
ఇది దెయ్యాల ఘోష..
మానవుడు తీసుకోలేడు ఇక శ్వాస
భూతాలకు, జీవకోటికి
మధ్య యుద్ధం జరగుతోందా?
ఎందుకోసం ఈ పోరాటం?
ఎవరు రగిల్చారు ఈ చిచ్చు?
ప్రళయాన్ని సృష్టిస్తున్న  దెయ్యాలు
ఈ అక్షరాలు చెప్తున్నదేమిటి?
వీటిలో ఉన్న రహస్య సంకేతాలేమిటి?
డెత్‌డేట్‌ను డిసైడ్‌ చేస్తున్న భూతాలు
కాలజ్ఞానాన్ని శాసిస్తున్న భూతజ్ఞానం
హఠయోగికి అంతుచిక్కిన దెయ్యాల రాత
ఇందులో దాగున్న రహస్యం ఏమిటి?

1
ఒక విచిత్రమైన భాష .. బురల్రు బద్దలు కొట్టుకున్నా అర్థం కాని భాష. విచిత్రమైన బొమ్మల మధ్య, చిత్రమైన అక్షరాలు.. విడ్డూరమైన ఆకారాలు.. చూస్తేనే ఒళు్ల గగుర్పొడుస్తుంది.. దాని వెనుక ఏదో తెలియని గుబులు పుడుతుంది.. ఏమిటిదన్న ఆందోళన నెమ్మదిగా మొదలవుతుంది.. అవును.. మిగతా ప్రపంచానికి ఇదేమిటన్నది తెలియదు.. స్థానిక ప్రజలు మాత్రం దీన్ని భూతాల భాష అంటారు.. అవును.. ఇది భూతాలు రాసుకున్న భాష.. భూతాలు ఏర్పరుచుకున్న లిపి.. భూత లిపి..

2
వాస్తవం.. ఇది భూతాలకు సంబంధించిన భాష.. పిశాచాలకు మాత్రమే అర్థమయ్యే భాష.. కిరాతులు.. కిన్నెరలకు మాత్రమే తెలిసిన భాష.. ప్రపంచంలో ఎవరూ చదవలేని రహస్యమయ భాష.. దీనిపై ఉన్న బొమ్మలు భయం కొల్పేలా ఉన్నాయి. వీటిని ఎవరు రాశారు. రాసిన దానికి అర్థం ఏమిటి? ఇది నిజంగా భూతాల భాషేనా? చూస్తేనే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ లిపి వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

అనేక రహస్యాలు దాగి ఉన్న పర్వతం అది.. శవాలను పీక్కుతినే
రాబందులకు డైనింగ్‌ స్పాట్‌ .. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, జీవాత్మలు తిరిగే చోటు.
ఈ ప్రాంతం దేవతల భూమి.. తాంత్రికులకు తపస్థలి. ఇక్కడ కొన్ని  శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కొన్ని గొంతులు ఘోషిస్తున్నాయి. కొన్ని మాటలు బొమ్మలుగా భయపెడుతున్నాయి. ఇవి కేవలం భూత ప్రేతాలు మాత్రమే అర్థం చేసుకోగలవు. ఈ అక్షరాలను చదవటం మామూలు మనిషి  వల్ల అయ్యే పని ఎంతమాత్రం కాదు..ఎందుకంటే ఇవి భూతాక్షరాలు.. భూతాల మంత్రాలు.. భూతాలను వశం చేసుకునే తంత్రం వీటిలో ఉంది.
ఈ లిపిని ఎవరు సృష్టించారు? లయకారుడు పరమేశ్వరుడు సృష్టించిన భాష.. భూతగణాధిపతి త్రినేత్రం నుంచి పుట్టిన భాష.. శివుడి రుద్రతాండవం నుంచి ఉద్భవించిన ధ్వనులు..
భూత లిపిలో రాసిన మంత్రాలను మొట్టమొదటి సారిగా మీరు టెలివిజన్‌లో చూస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి.. నిశితంగా చూడండి.. ఈ భూత్‌లిపి కొద్ది కొద్దిగా దేవనాగరి లిపికి దగ్గరగా ఉంది. సంస్కృతభాష మాదిరిగా కనిపిస్తుంది. కానీ, ఇది దేవనాగరి లిపి కానీ, సంస్కృత భాష కానీ కానే కాదు. కానీ, దీన్ని అర్థం చేసుకునే కొందరి అభిప్రాయం ప్రకారం ఇది సంస్కృతం కంటే చాలా పురాతనమైన భాష.
సంస్కృతం పరిశుద్ధమైన భాష.. ఈ భూత్‌లిపికి ఎలాంటి వ్యాకరణం ఉన్నట్లు కనిపించదు.. కొన్ని శబ్దాలకు అర్థాలే కనపడవు.. మరి ఇది ఎలాంటి భాష.. ఎప్పటి భాష? నిజంగా భూతాలు, ప్రేతాల భాషేనా? లేక ఏదైనా కిరాత జాతికి సంబంధించిన భాషనా?
3
భూత వైద్యుల గురించి విన్నాం.. వారిని కన్నాం.. గ్రామాల్లో ఏమీ తెలియని అమాయకులను మోసం చేసి సొము్మలు చేసుకునే వారే వీరంతా.. కానీ, భూత విద్య అన్నది నిజంగానే ఉన్నదని, తపస్సు చేసిన తాంత్రికులు బల్లగుద్ది వాదిస్తున్నారు.. భూత ప్రేతాలను నమ్మటమే లేనప్పుడు, వాటి లిపికి మాత్రం ఎందుకు గౌరవం ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.    
హిమాచల్‌ ప్రదేశ్‌లోని పంజయ్‌ గ్రామ పరిసరాల్లో  హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ లిపి లభ్యమైంది. తాంత్రిక ఉపాసన చేస్తున్న సత్యేంద్రనాథ్‌ అనే యోగికి లభించింది. ఈయన కథనం ప్రకారం పరమేశ్వరుడు హిమాలయాలను సృష్టించి తాను అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు.. తనతో పాటుగా యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కిరాత, కింపురుషులకు రకరకాల ప్రదేశాల్లో చోటు కల్పించాడట.. వాళ్ల కోసం ప్రత్యేక భాషను సృష్టించి రాక్షస గురువు శుక్రాచార్యుడికి ఇచ్చాడట భూతనాథుడు.. అప్పటి నుంచి భూత, పిశాచ గణాల మధ్య కము్యనికేషన్‌ భూత భాషలో  మొదలైందని ప్రచారంలో  ఉన్న కథనం.
కులు నుంచి పంజయ్‌ వరకు రకరకాల గ్రామాల్లో భూతలిపి ఉన్న శిలాశాసనాలు మనకు కనిపిస్తాయి. ఇవి మామూలు మనుషులకు అర్థం కావు.. భూతవిద్య తెలిసిన వాళు్ల మాత్రం ఈ మంత్రాలను చదవటం ద్వారా వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ దగ్గరకు రప్పించుకుంటారు.
భూత విద్య తెలిసిన వాళ్లకు అర్థమయ్యే భాష, సామాన్యుడికి ఎందుకు అర్థం కావటం లేదు..ఈ భాషను ఉపాసకులు ఎలా ఉపయోగిస్తారు? ఈ భాషలో ఉన్న మర్మం ఏమిటి?

భూతలిపిలో కనిపించే  చిత్రాలను, అక్షరాలను అర్థం చేసుకోవటం సంగతి దేవుడెరుగు.. కనీసం వీటి ధ్వనులను విని కూడా అవగాహన చేసుకోవటం సాధ్యం కాదు..
భూత విద్య తెలిసిన వాళు్ల ఈ లిపిని డీకోడ్‌ చేశారు.. దేవనాగరిలో ఉన్నట్లే, భూతలిపిలో మొత్తం 54 అక్షరాలు ఉన్నాయి. వీటిని బీజాక్షరాలని పిలుస్తారు.. వీటి ఉచ్చారణ మామూలు మనుషులు మాట్లాడే రీతికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
భూత్‌లిపిని తెలుసుకోవటం వల్ల తంత్రం అంటే ఏమిటో తెలుస్తుంది. తంత్ర విద్యను తెలుసుకోవచ్చు. తంత్ర యోగాన్ని సాధించవచ్చు.
4
కులూ నుంచి టిబెట్‌ దాకా  చాలా గ్రామాల్లో రాళ్లపై మంత్రాలు కనిపిస్తాయి. వీటినే భూతలిపిగా తాంత్రికులు చెప్తారు.. నిజంగా ఇది భూతాలు, ప్రేతాలకు సంబంధించిన లిపేనా? భూతలిపి ఉన్న మాట వాస్తవమే అయితే, దెయ్యాలు, భూతాలు ఉన్నాయని విశ్వసించాలా? మనిషి చనిపోయిన తరువాత దెయ్యంగా మారటం వాస్తవమేనా? దీనికి హేతుబద్ధత ఏమిటి?
భూతలిపి.. ఇంతకాలం అత్యంత రహస్యంగా ఉన్న లిపి వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. ఇది భూతాలు, ప్రేతాలకు సంబంధించిన లిపి అంటే భూతాల మధ్య కము్యనికేషన్‌ను స్థాపించే ఒకరకమైన భాషగా తాంత్రికులు భావిస్తారు.. నిజానికి ఇది భూతాలు, ప్రేతాలు రాసుకునే లిపి కాదు.. ఇది ఒక రకమైన తంత్ర సాధనకు సంబంధించిన లిపి..
రుద్రుడు.. అంటే శివుడి మరో రూపం.. ఈ రుద్రుడి ఉపాసనలో  వామాచార పద్ధతి ప్రత్యేకంగా ఉంది. ఈ పద్ధతిలో తంత్ర సాధన, యోగ సాధన విపరీతంగా ఉంటాయి.  వాటిలో మంత్రాలు, దానికి సంబంధించిన లిపి, చిత్రాలు కూడా అంతే విపరీతంగా కనిపిస్తాయి. యోగ, తంత్ర సిద్ధి కోసం ఈ రహస్యమయ మంత్రాలను తీవ్రంగా ఉపాసన చేస్తుంటారు..  కులు నుంచి మానస సరోవరం దాకా వేలాది సిద్ధులు, నాగాలు, అఘోరాలు ఈ మంత్రాలను ఉపాసిస్తుంటారు.
విచిత్రమేమంటే, ఈ మంత్రాలన్నీ కూడా దేవతలకు వ్యతిరేకంగా, వారిని నిందిస్తూ ఉంటాయి. మనం సాధారణంగా వినే క్షుద్ర మంత్రాలంటే ఇవే.. వీటిని ఉపాసించిన వారికి కొన్ని సిద్ధులు లభిస్తాయని, భూతాలను వశం చేసుకుని వాటిచేత కావలసిన పనులు కూడా చేయించుకోవచ్చని స్థానికులు నము్మతారు. దీన్ని పాండు లిపి అని కూడా అంటారు.. దేవీదేవతలను నిందించే విధంగా ఉన్న మంత్రాలు కాబట్టే వీటిని చూస్తే అపశకునంగా కూడా స్థానికులు బలంగా విశ్వసిస్తారు..
ఇంకో విచిత్రం ఏమంటే ఈ మంత్రాలను రాసేందుకు మనిషి రక్తాన్ని, జంతు రక్తాన్ని ఇంక్‌గా వాడతారని కూడా చెప్తారు.. అందుకే ఈ లిపిని చూసినా, చదువుతుంటే విన్నా అశుభమేనని విశ్వసిస్తారు..
దీనికోసం ప్రత్యేక గ్రంథం అంటూ ఏదీ లేదు. గురుశిష్యపరంపర ద్వారా తెలుసుకున్నది, అధ్యయనం చేసింది మాత్రమే బతికి ఉన్నది. దీనికి ఓ అస్తిత్వం అంటూ లేదు. కొందరికి మాత్రమే.. ఉపాసన చేస్తున్న వారికి మాత్రమే వీటి పరిభాష అర్థమవుతుంది.  

150 సంవత్సరాలు

1 comments
హిమాలయ పర్వతశ్రేణులు.. మంచు కొండల మధ్యన ఆశ్రమాలు.. అఖారాలు... ఆశ్రమాల్లో సాధు సంతులు.. నిస్సంగులు.. గడ్డ కట్టే చలిలో ఆవాసాలు.. దొరికితేనే తిండి.. దొరక్కపోతే గాలే భోజనం.. బట్టలూ అంతంత మాత్రమే.. దిగంబరులకైతే ఆ వసా్తల్ర బాధా లేదు.. మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్షు ఎంతో తెలుసా? మినిమమ్‌ హండ్రెడ్‌ ఇయర్‌‌స.. ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళు్ల .. 250  ఏళ్ల పాటు జీవించిన వాళూ్ల ఉన్నారంటే నము్మతారా? నమ్మాల్సిందే మరి..   
1
150 ఏళు్ల.. వినిడానికి వింతగానే ఉంది కదా? ఇన్నేళు్ల జీవించటం మానవ మాత్రుడికి సాధ్యమేనా? యెస్‌.. సాధ్యమే.. హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధపురుషులు చాలా మంది వందేళ్లకు పైగా వయసున్న వాళ్లే.. వారిలో ఒకరిద్దరు 250 సంవత్సరాలు కూడా జీవించిన వారున్నారు.... ప్రతికూల వాతావరణంలో,  నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు.. మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం..పట్టణాల్లో ఉండే జనం 50 ఏళ్లకే ఎందుకు బాల్చీ తన్నేస్తున్నాడు..? వాట్‌ ఈజ్‌ ది మిస్టరీ...
2
ఒకరి వయసు 120 ఏళు్ల
మరొకరు 150 ఏళు్ల
ఇంకొకరికి ఏకంగా 250 ఏళు్ల
కలా? నిజమా?
ఇంతకాలం జీవించిందెవరు?
పురాణాల్లో దేవతలు కారు..
మన కళ్ల ముందున్న సాధువులు
హిమాలయాల్లో ని సంతులు
మంచు కొండల నడుమ ఉండే సిద్ధులు
ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు

దేవ్హ్‌బ్రాబా... ఈయన ఉత్తరప్రదేశ్‌ నుంచి హిమాలయాలకు వచ్చారు... అక్కడే ఉంటున్నారు.. ఈయన ఫోటోను ఇంటర్నెట్‌లో చూడవచ్చు కూడా.. ఈయన వయస్సు మాత్రం 250 సంవత్సరాలు..ఈయన పుట్టింది 1772 మార్చిలో.. చిన్నప్పుడే హిమాలయాలకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు.. ఈశ్వరుడి ఉపాసనలో జీవితం గడపుతున్నారు.. హిమాలయాల్లో చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. ఈయన ఇక్కడే ఉన్నా చాలా కాలం పాటు ఎవరికీ దర్శనమిచ్చేవారు కారు.. ఈయన పాదస్పర్శతో అన్ని కోరికలూ తీరుతాయని ప్రజల విశ్వాసం..
ఈయన ఇంతకాలం జీవించి ఉండటం విదేశీ మీడియాకూ మిస్టరీగా మారింది.. దీనిపై తెగ రీసర్‌‌చ చేసింది.. పాపం ఆ జర్నలిస్టులు సైతం ఆయన పాదాల్ని శిరసుపై ఉంచుకుని వెళ్లిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు...
3
కోరుకున్నప్పుడు మరణించటం సాధ్యమేనా?
మామూలు మనుషులకు సాధ్యం కానిది
సాధు సంతులకు ఎలా సాధ్యపడింది?
వందేళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు?
సైన్‌‌సకు సైతం అంతుపట్టని మృత్యురహస్యం
చావును జయించిన  సాధువులు

వాళు్ల ఉండే మంచుకొండల నడుమ మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు.. అక్కడికి వెళ్లాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు.. ఒళ్లంతా ఉన్నితో కప్పుకుని కానీ కదలలేరు. సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు.. అంతే కాదు.. వారి జీవన విధానం కూడా పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది.. అలాంటి ప్రతికూల వాతావరణంలో  వాళు్ల వందల సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు, మనకు ఎందుకు సాధ్యం కావటం లేదు?
4
మనం ఎన్నేళు్ల బతుకుతాం? మహా అయితే 50 ఏళు్ల.. కాకుంటే అరవై ఏళు్ల.. అంతకన్నా ఆశ లేదు లెండి... ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం.. ఇంకేం బతుకుతాం చాల్లెద్దూ.. ఇవాళ ప్రతి ఒక్కరి నోటా సహజంగా వినిపించే మాటే ఇది.. ఎక్కువకాలం బతకటం.. ఒకరిపై ఆధారపడటం దేనికి? హాయిగా యాభై ఏళు్ల బతికితే చాలనే వాళ్ల సంఖ్యే ఎక్కువ.. మరి ఎలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుష్షు మాత్రం ఎక్కువగా కోరుకుంటున్నారు.. కోరుకుంటున్నట్లే ఉండగలుగుతున్నారు.. ఎందుకు? ఎలా?  
హిమాలయాలు.. ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం.. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం.. కైలాస్‌, మానస సరోవర్‌, గంగ, యమున, సరస్వతి, కేదార్‌నాథ్‌, హరిద్వార్‌, రుషికేష్‌, బద్రీనాథ్‌.. ఒకటా రెండా.. వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు..వెండి కొండల్లో  వేలుపుల వెలుగులు..ముక్కోటి దేవతల అలవాలం..సాధుసంతుల పాలిటి కల్పతరువులు.
హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే.. సిద్ధపురుషులే.. ఈశ్వరోపాసనలో  తలమునకలై కనిపిస్తారు. భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు.. విభూతి ఇస్తారు.
లోకాన్ని పట్టించుకోరు
తమనూ పట్టించుకోరు
శరీరంపై మమకారం లేదు
కోరికలు లేని జీవన విధానం
ఉపాసనలోనే జీవితం
అందులోనే ఆనందం అనుభవిస్తారు.
సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు.. మంచి చెడులు చెప్తారు. ఆశీర్వదిస్తారు.. కానీ, ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధుపురుషులు ఉన్నారు.. వీళ్లకు లోకం పట్టదు.. లోకానికి వీళు్ల పట్టరు.. వీళు్ల ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు.. వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు.. హిమాలయ సానువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్లే.. తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు.
హిమాలయాల్లో  క్లిష్టమైన ప్రదేశాల్లో  ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో  ఉంటారు.. మంచు కరిగిన స్వచ్చమైన నీటిని తాగుతారు.. ఒంటి నిండా విభూతే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు.. దేనిపైనా మోజు ఉండదు.. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు.. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు...పవిత్రస్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు..
5
మిగతా మనుషులకూ, హిమాలయాల్లో ఉండే సాధువులకు మధ్య తేడా ఏమిటి? వాళు్ల సుదీర్ఘ కాలం ఎలా జీవించగలుగుతున్నారు.. కేవలం ఈశ్వరుని ఉపాసించటమే వారి ఆరోగ్య రహస్యమా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? ప్రతికూల వాతావరణం, శరీరం గడ్డకట్టే చలి, అన్నింటినీ తట్టుకునే శక్తి ఎక్కడిది? అతీంద్రియ శక్తులు ఉన్నాయా? సిద్ధులు లభించాయా?
సాధువుల ఆరోగ్య రహస్యం ఏమిటి?
ఇది నిజంగా అంతుపట్టని విషయం.. సైన్‌‌స పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం.. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పాలి.. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళు్ల.. తాము కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్థా్యన్ని సాధించిన వాళు్ల. అందుకే ఎన్నేళ్లయినా వారి శరీరం క్షీణించదు.. రోగాలు దగ్గరకు రావు.
హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్షుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టి కర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది.. నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నము్మతారు.. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనే వారు భావిస్తారు..తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు.
తమ ఆయుష్షుపై నమ్మకం ఉండటం రెండో కారణం. తాము కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత కాలం పెంచుకోగలమని వారు గట్టిగా నము్మతారు.. కేవలం కోరుకుంటే జరిగిపోతుందా అని ఆశ్చర్యపోవద్దు.. ఇది వాస్తవం.. మన మైండ్‌ను పూర్తిగా మన అదుపులో ఉంచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చన్న అంశం మిలియన్ల కొద్దీ సందర్భాల్లో రుజువైన సంగతే. విల్‌పవర్‌ అన్నది అందరికీ తెలిసిన సంగతే.. ఆ విల్‌ పవరే.. మనల్ని మన లక్ష్యానికి చేరువ చేస్తుంది. సాధుపురుషులు సాధించింది ఇదే.
తమ జీవితంపై తమకు పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ ఉండటం మూడో విషయం.. మనలో చాలామందికి కరవైంది ఇదే. ఈ పాజిటివ్‌నెస్సే తగ్గిపోయింది. యూత్‌ సైతం లైఫ్‌లో అంతా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడటం మామూలే.. కానీ, హిమాలయాల్లో సాధువులు అలా కాదు.. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నము్మతారు.. జీవితాన్ని ముగించేయాలనుకోవటమో.. ముగించటమో లాంటి హక్కు తమకు లేదని నము్మతారు.. తమపై తమకు పూర్తి అనుకూలత అనేది ఎంత బలాన్నిస్తుందనేది హిమాలయ సాధువులను చూసి తెలుసుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైంది సాధువుల్లో  అంతర్గతంగా కనిపించే శక్తి.. ఆహారం, వ్యాయామాలకంటే మించిన అంతర్గత శక్తి  మనిషిని అన్ని రోగాల నుంచి దూరం చేస్తుంది. శరీరంలో ఇంటర్నల్‌గా ఉండే వివిధ ఎనర్జీ సెంటర్లను పూర్తి స్థాయిలో ఆక్టివ్‌గా ఉంచటం. హిమాలయాల్లో సాధువులు మెడిటేషన్‌ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు.. కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్లిపోతారు.. ఇది శరీరాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకువస్తుంది.
6
ఒక ప్రత్యేక జీవన శైలి... మామూలు ప్రపంచానికి అర్థం కానిది.. మనకు.. అంటే సాధారణ ప్రజలు అవలంబించలేని జీవన విధానం... అందుకే వారు కోరుకున్నట్లుగా ఉంటున్నారు. కోరుకున్నేళు్ల జీవిస్తున్నారు.. కేవలం హిమాలయాల్లోనే కాదు.. ప్రపంచంలో  అక్కడక్కడా, అడపా దడపా నూరేళ్ల పైచిలుకు జీవించిన వారి వివరాలు తెలుసుకున్నా ఇంచుమించు వాళ్ల లైఫ్‌లోనూ ఇలాంటి ఆసక్తికర కథనాలే కనిపిస్తాయి..
హిమాలయాల్లో సిద్ధపురుషులు నియమిత జీవితం అసాధారణమైంది. మామూలు ప్రజలు కనీసం ఊహల్లోనైనా ఆలోచించలేనిది. వాళు్ల చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు.. కొందరు దిగంబరంగా ఉంటారు.. కొందరు స్మశానంలో తిరుగుతారు.. ఆహారం విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు. దొరికింది తింటారు.. దొరక్కపోతే మానుకుంటారు. పచ్చి ఆకులు తింటారు. పచ్చి మాంసమూ తింటారు.
సాధువులంతా శాకాహారులే అనుకుంటే పొరపాటే.. నాగా సాధువులు అతి తీవ్రంగా ఉంటారు. మద్యం సేవిస్తారు.. హుక్కా పీలుస్తారు.. ఒళ్లంతా విభూతి రాసుకుని ఉంటారు.. వీళ్లకు ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. అలాగని ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినట్లుగా తినరు.. పరిమిత ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు.. నాగాలు కాకుండా మామూలు సాధువులైతే శాకాహారానికే ప్రిఫరెన్‌‌స ఇస్తారు..
అన్నింటికీ మించి సాధువులు చేసే యోగ సాధన వారిని మృత్యుంజయులను చేస్తోంది. భారతీయ యోగ శాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు, ఆసనాలు సాధు సంతుల నిత్యకృత్యాలు.. యోగా ద్వారా మనిషి శరీరంలోని కుండలినీ శక్తిని చైతన్యం చేయవచ్చని ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తోంది.. ఈ యోగాను మన సాధువులు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్నారు.. వారు చేసే యోగాను చూస్తే ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోక తప్పదు.
ఉపాసన, సాధనల ద్వారా  హిమాలయాల్లో సాధువులు ఇచ్ఛామరణాన్ని సాధించారు. దేవ్హ్‌ బాబా ఇందుకు ఒక్క ఉదాహరణే... ఈయన్ను దర్శించుకోవటానికి ఆనాడు ఇందిరాగాంధే స్వయంగా వచ్చారు... ఈ సాధువులే కాదు.. ప్రపంచంలో చాలా చోట్ల అక్కడక్కడా మనకు వందేళ్లకు పైగా జీవించిన వాళు్ల మనకు తారసపడతారు. బంగ్లాదేశ్‌లో 150 ఏళ్లు జీవించిన వ్యక్తి, చైనాలో అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన మనుషులను చూడవచ్చు.
నియమిత పద్ధతిలో ప్రకృతి సహజసిద్ధమైన జీవిత విధానాన్ని అనుసరించే వాళు్ల  కోరుకున్నన్ని రోజులు జీవించవచ్చు. సో బి పాజిటివ్‌ ఆబౌట్‌ యువర్‌ లైఫ్‌.. అండ్‌ బి ఏ పాజిటివ్‌ ఆటిట్యూడ్‌.. ట్రైటు లాంగ్‌లైఫ్‌ యువర్‌ సెల్‌‌ఫ... మీ విల్‌ పవరే మిమ్మల్ని సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందన్న వాస్తవాన్ని గ్రహించండి...

రెండో కైలాసం

2 comments
మహా దేవుడికి మరో కైలాసం.. దేవభూమిలో దివ్యధామం.. లింగరూపుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు.. త్రివర్ణాలలో త్రినేత్రుడి మహాదర్శనం.. అపురూపం.. అపూర్వం.. భూమి ఆకాశాలను కలుపుతున్నట్లుగా ఉమాశంకరుడు స్వయంభువుగా అవతరించి భక్తుల మనోరథాలు ఈడేరుస్తున్నాడు. మన భూమిపైన.. మనకు అందుబాటులో  సాక్షాత్కరిస్తున్నాడు. ఇది వింత కాదు.. విడ్డూరం అంతకంటే కాదు.. పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు. నిజం.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రంగుల్లో ముక్కంటి తన భక్తుల ముచ్చట తీరుస్తున్న వాస్తవం.
1
భూమిపై కైలాసాలు ఎన్ని ఉన్నాయి. మహాదేవుడి నిజనివాసం ఎక్కడ.. టిబెట్‌లోని మానస సరోవరం పాదతీర్థంగా ఉన్న కైలాస పర్వతం కాకుండా, మరో కైలాసం ఉందా? అవును.. దేవదేవుడు హిమాలయ శ్రేణుల నిండా విస్తరించి ఉన్నాడు. హిమాలయాలకు అన్ని వైపులా కైలాస పర్వతాలు నెలకొని ఉన్నాయి. ప్రతిచోటా పలు రూపాల్లో పరమేష్టి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.. మహాదేవుడు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తున్న వైనం తొలిసారి టెలివిజన్‌ కెమెరాకు చిక్కింది..
హిమాలయాల్లో శివుడు మరో కైలాసంలో దర్శనమిస్తున్నాడు. మూడు రంగుల్లో త్రినేత్రుడు తొంభై అడుగుల ఎతె్తైన సహజసిద్ధ శివలింగంగా కనిపిస్తున్నాడు.. ఒక రోజులో మూడు వర్ణాలు మారే శివలింగం.. దేవభూమిలో మహాద్భుత దృశ్యం ఆవిష్కారమైంది.. అత్యంత ఎతె్తైన మంచు కొండల పైన, నిటారుగా, నిరాకారంగా వెలసిన మహాద్భుత అవతారం..

2

17, 500 అడుగుల చుట్టు కొలత
18వేల అడుగుల ఎత్తున మహా శివలింగం
రంగులు మారే మహాదేవుడు
ఉదయం రజతం
మధ్యాహ్నం సువర్ణం
సాయంత్రం నీలమేఘం
మూడు వర్ణాల్లో ముక్కంటి
ఆధ్యాత్మిక క్షేత్రంలో అపురూప సన్నివేశం

బోళా శంకరుడికి రెండో  కైలాసం ఏమిటని ఆశ్చర్యపోకండి.. ఇది వాస్తవం.. ఆయన నిజంగానే బోళా శంకరుడు.. అందుకే భక్తులను ఇబ్బంది పెట్టకుండా సులభసాధ్యుడయ్యాడు.. కోరుకున్న చోటనే దర్శనమిస్తున్నాడు.. అదే ఈ రెండో కైలాసం.. మౌంట్‌ కైలాస పర్వతం మాత్రమే కాదు.. అది ఆయన నిజనివాసం కావచ్చు. కానీ, శివుడికి రెండో కైలాసం హిమాచలంలోనే ఉంది. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తున ఉంది. భక్తులను పలు వర్ణాల్లో అలరిస్తోంది. వారికి అందుబాటులో ఉంది. కొంచెం కష్టపడితే లయకారుడి దివ్యదర్శనం లభ్యమవుతోంది..

కిన్నెర కైలాసం. పరమేశ్వరుడి నిజకైలాసాన్ని మరిపించే కైలాసం..చూస్తున్న కొద్దీ చూడాలనిపించే కైలాసం.. అణువణువునా ఆధ్యాత్మికత నిలువునా కమ్మేసే అపురూప ప్రదేశం.. అక్కడ శివలింగం రంగులు మారటం విశేషం.. ఒకే ప్రాంతంలో.. ఒకే చోట.. నిశ్చలంగా ఉన్న శివలింగం ఏ విధంగా రంగులు మారుతోంది.. ఇదెలా సాధ్యపడుతోంది?
3
శివలింగం రంగులు మారటం ఏమిటి? శివుడి మహత్యమా? మాయా? నిజంగా ఈశ్వరుడి లీలలు అక్కడ కనిపిస్తున్నాయా? దీని వెనుక సైంటిఫిక్‌ రీజన్‌ మరేదైనా ఉందా? ఇందులో రహస్యం దాగున్నదా? సముద్ర మట్టానికి దాదాపు 18 వేల అడుగుల ఎత్తున ఉన్న త్రివర్ణాలలో కనిపిస్తూ కెమెరా కంటికి చిక్కటం నిజంగా విశేషం.. ఇంతకీ ఈ అద్భుత ఆవిష్కారం ఎక్కడ దాగి ఉంది? వాస్తవం ఏమిటి?

హిమాచల ప్రదేశ్‌లో కిన్నౌర్‌  ప్రాంతం.. టిబెట్‌కు తూర్పున హిమాచల్‌ ప్రదేశ్‌ దాకా కొనసాగే హిమాలయ శ్రేణి అంతా దేవ భూమి.. ఒక అద్భుతమైన వాతావరణం.. మౌనంగా ఉన్నా, గాలిలో ఈశ్వరుడి పేరు ప్రతిధ్వనించే ప్రాంతం. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్‌ జిల్లా ఉంది..

కిన్నౌర్‌ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో.. నిజంగా అందాల కోన.. మూడు హిమాలయ పర్వతాలు పక్కపక్కనే పేర్చినట్లు ఉంటాయి. జన్‌స్కర్‌, గ్రేటర్‌ హిమాలయ, దౌలంధర్‌ శ్రేణులు సట్లెజ్‌, స్పిటి, బాస్పా వంటి జీవనదులకు పుట్టినిళు్ల.. వీటి మధ్యలోనే అన్నింటికంటే అత్యంత ఎత్తుగా కిన్నెర కైలాస్‌ పర్వతం కొలువుదీరి ఉంది.

సట్లెజ్‌ నదీతీరంలో అందమైన జలపాతాల నడుమ 18వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతాన్ని చూడటానికి వేయి కన్నులున్నా సరిపోవు.. ఈ కొండపైనే సహజసిద్ధమైన శివలింగం ఆవిర్భవించి ఉంది. యోగులకు, సిద్ధులకు మాత్రమే కాదు.. సామాన్యులకు కూడా సాక్షాత్కరించే అతి గొప్ప శివలింగం.. తొంభై అడుగుల ఎతె్తైన శివలింగం..

ఇది అలాంటిలాంటి శివలింగం కాదు.. మనం సాధారణంగా చూసే మాదిరిలో దీని ఆకారం ఉండదు.. కిన్నెర కైలాసం పీక్‌ స్టేజ్‌లో నిటారుగా నిలుచుని ఉన్న రాతినే శివలింగంగా భక్తులు భావిస్తారు.. కేవలం రాయిని శివలింగంగా ఎందుకు భావించారు.? అదే ఇక్కడి ప్రత్యేకత.. ఇది కేవలం రాయి కాదు.. ఇందులో జీవశక్తి ఉందని ఇక్కడ ఉపాసించే సిద్ధుల దృఢమైన అభిప్రాయం. ఎందుకంటే ఈ శివలింగం రోజులో మూడు కాలాల్లో మూడు రంగుల్లో కనిపిస్తుంది. నిర్దిష్ట సమయానికి శివలింగం రంగు మారుతుంది.
అత్యంత ఎతె్తైన ప్రాంతంలో ఉన్న ఈ శివలింగం ఉదయం భానుడి లేలేత కిరణాల స్పర్శతో  మిలమిలా మెరిసిపోతుంది.. వెండి రాశి పోతపోసుకున్నట్లుగా తెల్లగా ఈ శివలింగం దర్శనమిస్తుంది. మధ్యాహ్నానికి సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చేసరికి పసిడి వన్నెలోకి మారిపోతుంది.. ఇదే మహాలింగం సాయంత్రం అయ్యేవేళకు నీలిరంగులో ధగధగలాడుతుంది.. ప్రపంచంలో అతి గొప్ప పరిణామ క్రమం ఇది. శివలింగం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ రంగులు మారుతున్నాయి. ముక్కంటి మాత్రమే ఈ విధంగా దర్శనమిస్తున్నాడు.. ఇది ఆయన లీలా విలాసమేనా? మరేదైనా మర్మముందా?
4
ప్రపంచంలో కిన్నెర కైలాసంలో  మాత్రమే ఈ అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. అదీ ఈ శివలింగం నెలకొని ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇలా రంగులు మారుతాయి. ఈ పరిణామం దేనికి సంకేతం? శివలింగం మాత్రమే కాదు. కిన్నెర కైలాస పర్వతానిదే ఒక ప్రత్యేకత. మౌంట్‌ కైలాసాన్ని మరిపించే ఈ కిన్నెర కైలాసం మర్మం ఏమిటి?   ..లుక్‌

కిన్నెర కైలాసంలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం మూడు వర్ణాల్లో కనిపించేందుకు ఇక్కడ ఉపాసకులు ఆసక్తికరమైన కథనాలను వినిపిస్తారు.. ఉదయం వెండి రంగులో  శివలింగం కనిపిస్తుంది.. సూర్యుని కిరణాలు శివుడి తలపె ఉన్న జాబిల్లిని తాకుతాయి.  జాబిల్లి నుంచి వెలువడే వెన్నెలే ఈ తెలుపు రంగుకు కారణం.. ఈ వెన్నెలకు భూతనాథుడి ఒంటిపై ఉండే విభూతి తోడై అద్భుతంగా విరాజిల్లుతుందని శివభక్తులు చెప్తారు..

మధ్యాహ్నానికి కిన్నెర శివలింగం పసిడి వన్నెలోకి మారిపోతుంది. శివుడు ధరించిన పులిచర్మం, పట్టపగలు తనపై నేరుగా పడే సూర్యుడి కిరణాలకు బంగారు రంగులో మెరిసిపోతుందిట.. ఈ రంగు చుట్టూ ఉన్న మేఘాలపై ప్రసరించి మరింత అద్భుత దృశ్యం ఆవిష్కారమవుతుంది.

సాయంకాలానికి ఈశ్వరుడి లయవిన్యాసం విశ్వరూపం దాలుస్తుంది. ఆయన కంఠంలో ఉన్న గరళం ఒక్కసారిగా చైతన్యవంతం అవుతుంది. గరళం నుంచి వెలువడే సెగలు ఒక్కసారిగా శివలింగాన్ని నీలివర్ణంలోకి మార్చేస్తాయి. ఇదొక అద్భుత సన్నివేశం.. అపురూప ప్రకృతి స్వరూపం.

పురాణాలు చెప్పే కథనాలు  ఆధ్యాత్మిక భావనను వెల్లడి చేస్తున్నాయి. ఈ కథలు, కథనాలు సైన్‌‌సకు అంతుపట్టవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలో, సూర్యుడి ప్రస్థానంలో, వాతావరణంలో, హిమాలయ శ్రేణుల్లో సాగే మేఘాలు ఈ శివలింగాన్ని తాకుతూ వెళ్తాయి. అందువల్లే ఇక్కడ ప్రకృతిలో రంగుల మార్పులు జరుగుతాయని సైంటిస్టులు ఒకరకమైన అంచనా వేస్తుంటారు..

సైంటిస్టులు చెప్పిన మాటలో లాజిక్‌ లేకపోలేదు. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న ఎలాంటి జవాబుకూ చిక్కడం లేదు. ఎందుకంటే నిజంగా ప్రకృతిలో, వాతావరణంలో మార్పుల వల్ల ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే ఆ ప్రాంతం అంతటా అదే విధంగా రంగులు మారుతూ ఉండాలి.. కానీ, ఒక్క శివలింగం ఉన్న పరిసర ప్రాంతంలోనే ఇలా జరుగుతోంది.. కిన్నెర కైలాస పర్వత శ్రేణిలోనే ఈ వర్ణాల మార్పు జరుగుతోంది.. దీనికి మాత్రం ఇప్పటివరకు ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు.. మరి ఇది నిజంగా ఈశ్వరుడి మాయా? ఏమో..
5
సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తున జరుగుతున్న అద్భుతం ఇది.. సైన్‌‌సకు ఎంతమాత్రం అందని, అంతుపట్టని ప్రకృతి విన్యాసం ఇది. కేవలం శివలింగం మాత్రమే కాదు.. మొత్తం కిన్నెర కైలాస్‌ పర్వతం అంతా శివుడి ఉనికిని, అస్తిత్వాన్ని, ఆయన తేజస్సును విరజిము్మతున్నది.. అక్కడికి వెళ్లే భక్తులందరికీ ఇదే అనుభూతి కలుగుతోంది.. హేతువాదులకు సైతం ఆధ్యాత్మిక భావనను కల్పించే వాతావరణం అక్కడిది.                   
కైలాసాలు ఒకటి కంటే ఎక్కువ ఉండటం ఏమిటి? ఎలా ఏర్పడ్డాయి ఇవి..? వీటికి స్థానిక కథనాలు చాలానే ఉన్నాయి. రుద్రుడు హిమాలయాలను సృష్టించినప్పుడు ఆయన తన గణాలకోసం ప్రత్యేక స్థానాలను ఏర్పాటు చేశాడు.. అందులో కిన్నెరుల కోసం ఏర్పాటు చేసిన ఆవాస స్థలమే కిన్నెర కైలాసం.. ఇక్కడ కిన్నెరులు తనను ఆరాధించటం కోసం స్వయంభువుగా లింగరూపుడై అవతరించాడని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం..

శివుడి నిజనివాసం టిబెట్‌లోని కైలాస పర్వతం.. దీని చుట్టూ బయటి నుంచి ప్రదిక్షణ  చేయటమే గొప్ప సాహసం.. కిన్నెర కైలాసం అలాంటిది కాదు.. ఇక్కడికి శివలింగం వరకు వెళ్లి స్పృశించి వచ్చే అవకాశం ఉంది.. కాకపోతే కిన్నెర కైలాసం ఒక్కోసారి మౌంట్‌  కైలాస్‌నే తలపిస్తుంది. కొన్ని వేళల్లో కిన్నెర కైలాసాన్ని చూస్తే, మౌంట్‌ కైలాస్‌కు, దీనికి అస్సలు తేడా కనిపించదు.. కైలాస పర్వతం, కిన్నెరకు వచ్చేసిందా? అన్నంత కన్ఫూ్యజన్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఈ ప్రకృతి వింతను చూసి తీరాల్సిందే..

శివుడికి కైలాసాలు కేవలం రెండే కాదు.. మొత్తం అయిదు కైలాసాలు ఉన్నాయని చెప్తారు.. వీటిలో మొదటిది మౌంట్‌ కైలాస్‌..ఇది టిబెట్‌లో ఉంది. రెండవది కిన్నెర కైలాస్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఉన్న గొప్ప పర్వతం ఇది. ఇక మూడవది మౌంట్‌ ఆది కైలాస్‌.. ఇది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ జిల్లాలో ఉంది. దీన్ని చోటా కైలాస్‌ అని కూడా పిలుస్తారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనే రాంపూర్‌ జిల్లాలో శ్రీఖండ్‌ కైలాసం ఉంది. ఇది నాలుగో కైలాసం. ఇదే రాష్ర్టంలో చంబా జిల్లాలో మణి మహేశ్‌ కైలాసం ఉంది.. మొత్తం అయిదు కైలాసాల్లో శివుడు ఆదిపురుషుడిగా, ఈశ్వరుడిగా నెలకొని ఉన్నాడు.
భారత దేశ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో  హిమాలయాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మన దేశానికి సంబంధించి భక్తి ఉద్యమం అంతా కూడా హిమాలయాలనుంచే ప్రారంభం అవుతుంది.. అక్కడే ముగుస్తుంది కూడా.. హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించిన ప్రాంతం అంతా దేవతల భూమిగా, దేవ లోకంగా భారతీయులు గట్టిగా నము్మతారు.. అక్కడి వాతావరణం కూడా అదే విధంగా ఆధ్యాత్మిక వాసనలను వెదజల్లుతుంటుంది.. కిన్నెర కైలాసం అందులో పీక్‌ లెవల్‌లో ఉంది. దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా ఒక్కసారి అక్కడికి వెళ్లి వస్తే మానసికంగా మనిషిలో కలిగే మార్పు మాత్రం తిరుగులేనిది..

ఎలా గెలిచారు?

0 comments
ఒక కుటుంబం.. అన్నదము్మల మధ్య అధికార తగాదా మొదలైంది.. చిలికి చిలికి గాలివానగా మారింది. అన్న భార్యను తము్మడు అవమానించాడు.. ఇంకేం యుద్ధమేఘాలు కము్మకున్నాయి. ఇరు వర్గాలూ రణరంగానికి సర్వసన్నద్ధమయ్యాయి. ఒక వర్గంలో వంద మంది.. మరో వర్గంలో అయిదుగురు.. ఈ అయిదుగురు.. ఆ వందమందిని ఓడించారు. నామరూపాలు లేకుండా చేశారు.. యుద్ధం జయించారు.. విజయం సాధించారు. అయిదుగురు వందమందిని ఎలా గెలిచారు? ఇది సాధ్యమేనా? ఏమిటీ స్ట్రాటజీ..    అడవుల్లో ఉన్నవాళు్ల.. ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో  ఏడాది పాటు దాక్కున్న వాళు్ల, వంద మంది వెనుక ఉన్న అపార మందీ మార్బలాన్ని అలవోకగా జయించేశారు.. ఒక్కర్ని కూడా మిగల్చకుండా మట్టుబెట్టారు. ఇదంతా ఎలా సాధ్యమయింది. ఒక భారీ సైనిక వ్యవస్థను ఒక చిన్న సైన్యం ఎలా విచ్ఛిన్నం చేయగలిగింది.. అదే ఎత్తుగడ.. అదే యుద్ధ నీతి.. అదే గెలుపు మంత్రం..ఇవాళ్టి రాజకీయ వ్యవస్థకూ మార్గదర్శనం చేస్తున్న ఈ మంత్రం ఏమిటి?   
1
అధికారం అన్నదము్మల మధ్య చిచ్చు పెట్టింది. అహంకారం పగల్ని రగిల్చింది. మహామారణహోమాన్ని సృష్టించింది.. ప్రపంచ నాగరిక చరిత్రలో కనీవినీ ఎరుగని సామూహిక జన హననం అది. ఒక కుటుంబం కోసం ఒక దేశం బలైపోయింది. రాజరికపు దుష్టజూదానికి సామంత రాజ్యాలు హరించుకుపోయాయి. మాయదారి యుద్ధం లక్షల మందిని పొట్టన పెట్టుకుంది.
ఇదంతా అయిదున్నర వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ.. మన దేశంలోనే జరిగిన కథ. ఇన్ని వేల సంవత్సరాల తరువాత కూడా ఇప్పటి రాజకీయ వ్యవస్థ సైతం అనుసరిస్తున్న రాజనీతిని అందించిన చరిత్ర. ఇది మహాభారత గాథ.. అయిదుగురు పాండవులు, నూరుగురు కౌరవులను అతి తేలిగ్గా ఓడించిన ఇతిహాసం.
మహాభారతం.. ఈ కథ తెలియకపోవటం అంటూ లేదు. పాండవులు, కౌరవులను జయించిన కథ.. తమ రాజ్యాధికారాన్ని అన్యాయంగా స్వాధీనం చేసుకున్న కౌరవులపై పాండవులు ప్రతీకారం తీర్చుకున్న కథ.. తమ భార్యను పదిమందిలో వివస్త్రను చేసేందుకు యత్నించిన దుర్మార్గులను పాండవులు మట్టుబెట్టిన కథ.
దీని గురించి ఇప్పుడు చర్చించుకోవలసిన అవసరం ఏమొచ్చింది.. మరదే సంగతి.. ఇప్పుడు మహాభారతం అగ్రరాజ్యం అమెరికాలో హాట్‌ టాపిక్‌ అయిపోయింది. ఒకరికి పది మంది వ్యాస మహాభారతాన్ని అదే పనిగా ముందేసుకుని తెగ పరిశోధనలు చేసేస్తున్నారు. ఒబామా సర్కారు సైతం ఇందుకు ఫండింగ్‌ కూడా చేస్తోందిట.
ఇప్పుడు అమెరికాకు భారతం చాలా ముఖ్యమైపోయింది. కొంతకాలంగా ఆర్థికంగా అల్లాడిపోతున్న అమెరికా,  హార్థికంగా ఏకాకిగా మారుతున్న అమెరికాకు ఇంటెలెక్చు్యవల్‌ వూ్యహం అవసరమైంది. ప్రపంచంపై ఆధిపత్యం కొనసాగటానికి రాజనీతి ఎలా ఉండాలి? పాండవులు కౌరవులను ఎలా జయించారు? యుద్ధంలో గెలిచేందుకు పాండవులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? ఒకరిపై ఒకరు ఎలాంటి పన్నాగాలు పన్నారు? గెలుపు కోసం అయిదుగురు అన్నదము్మలు ఎలా పావులు కదిపారు? ఈ విషయాల్ని ఎలా ఛేదించాలి?
2
నిజమే.. ఇప్పుడంటే అమెరికా ఈ రకమైన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది కానీ, భారత యుద్ధం జరిగింది మన దగ్గర కదా.. పాండవుల విన్నింగ్‌ స్ట్రాటజీ గురించి మనలో ఎంతమందికి అవగాహన ఉంది? రామాయణ, భారతాలను నిందించటమే అలవాటు తప్ప, అందులో ఇప్పటికీ మనకు పనికొచ్చే విషయాలేమున్నాయని ఆలోచించిందెవరు కనుక? ఇదిగో ఇప్పుడు ప్రపంచ పోలీసు ఆలోచిస్తున్నాడు...ఇంతకీ ఈ విన్నింగ్‌ మంత్రమేమిటి? పాండవులది రాజనీతా.. కూటనీతా?
మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. రెండు బలమైన శక్తుల మధ్య జరిగిన యుద్ధం అది.  ఈ యుద్ధంలో బలం కంటే వూ్యహమే గెలిచింది. ఏ విధంగా చూసినా యుద్ధం జరిగే నాటికి కౌరవుల కంటే పాండవుల శక్తి, సంపదలు తక్కువ. పాండవులు పవర్‌ కోల్పోయి అడవుల పాలై అప్పటికే పదమూడు సంవత్సరాలు గడిచిపోయింది. అందులో చివరి సంవత్సరం వేషాలు మార్చుకుని అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది.
కౌరవులు అధికారాన్ని పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నారు..అటు ఆర్థిక బలం,  ఇటు అంగ బలం పుష్కలంగా ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేసి క్షణాల్లో శత్రువును చిత్తు చేయగల పవర్‌ఫుల్‌ మేజర్‌ జనరల్‌‌స చాలా మందే ఉన్నారు. అధికారంలో ఉంటే అందివచ్చే అవకాశాలకూ కొదవ లేదు. అన్నింటికీ మించి ఫండింగ్‌ సమస్య ఎంతమాత్రం లేదు.
పైగా  దుర్యోధనుడి మిత్రుడు కర్ణుడు దేశమంతా తిరిగి యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను జయించుకు వచ్చాడు.. ఆ రాజ్యాల బలాబలాలన్నీ కూడా కౌరవుల పక్షమయ్యాయి. చివరకు శ్రీకృష్ణుడి రాజ్యంలో ఆయన తప్ప మిగతా సైన్యం అంతా కూడా కౌరవుల వైపే నిలిచింది..పాండవులకు విద్యలన్నీ నేర్పిన గురువులే కౌరవుల పక్షాన నిలిచారు.. పాండవులతో సమానమైన వీరులు కౌరవుల పక్షాన ఉన్నారు.. అయినా, కౌరవ సైన్యం ఓడిపోయింది. కౌరవులు మట్టి కరుచుకుపోయారు..
ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలలేదు.. ఇంత దారుణంగా ఎలా ఓడిపోయారు.. పాండవులు ఎలా గెలువగలిగారు.. ధర్మం గెలిచింది అనీ, అధర్మం ఓడిపోయిందనే మాటలు చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి. కానీ, వాస్తవం వేరు.. యుద్ధంలో  బలమైన ప్రత్యర్థిని జయించటం మాటలు కావు.. కేవలం ధర్మాన్ని ఆచరించటం వల్లనే గెలుపు సాధ్యమవుతుందనుకోవటం తప్పు.. ప్రత్యర్థిని వీక్‌ చేసి గెలుపును సాధించటం ఓ గొప్ప విద్య.. అదే యుద్ధనీతి. ఆ విద్య, ఆ నీతి పాండవులకు బాగా తెలుసు.. అదే వారిని విజయం వైపు నడిపించింది. చరిత్ర సృష్టించింది.
3
ఏమిటీ పాండవుల యుద్ధనీతి.. గెలుపు కోసం వారు అనుసరించిన రణతంత్రం ఏమిటి? అధికారం కోల్పోయి, అజ్ఞాతంలో ఉన్న పాండవులకు అంతగా అండదండలిచ్చిన వారు ఎవరు? యుద్ధం చేసేందుకు వారికి ఆర్థిక వనరులు, మానవ వనరులను సమకూర్చింది ఎవరు? ఇదేం ఆషామాషీ యుద్ధం కాదు.. అలాంటి యుద్ధాన్ని గెలిచేందుకు పాండవులు కదిపిన పావులేమిటి?      

మహాభారత యుద్ధంలో పాండవుల గెలుపు అంత తేలికగా సాధ్యం కాలేదు.. అడవుల్లో  పన్నెండేళు్ల... ఏడాది పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ఓ పక్క అధికారం లేదు.. ఆర్థిక వనరులు లేవు.. కేవలం మజిల్‌ పవర్‌తో  గెలుపు సాధ్యం కాదని వారికి తెలుసు.. తమ వీక్‌నెస్‌ను తెలుసుకుని దాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అజ్ఞాతంలోకి వెళ్లటానికి ముందు నుంచే అయిదుగురు అన్నదము్మలూ ఒక్కో అడుగు నెమ్మదిగా ముందుకు వేస్తూ వెళ్లారు.
అర్జునుడు పవర్‌ ఫుల్‌ ఆయుధాలను సమకూర్చటంపై దృష్టి పెట్టాడు.
 

అణ్వస్త్రం అని భావించే పాశుపతాసా్తన్న్రి సంపాదించాడు.
 

భీముడు హనుమంతుడిని కలిసి గదావిద్యలో మరింత బలాన్ని సంపాదించాడు..
అటు గంధర్వుల దగ్గరకు వెళ్లి వారి మిత్రత్వాన్ని సంపాదించాడు.


ఇక ధర్మరాజేమో.. యుద్ధనీతిపై దృష్టి పెట్టాడు..
తన టార్గెట్‌ ఏమిటో ఆయన ముందే డిసైడ్‌ చేసుకున్నాడు. ఇటు కృష్ణుడితో, అటు ద్రౌపది తండ్రి దృపదుడితో మంతనాలు జరుపుతూ భారత దేశమంతటా పవర్‌ ఫుల్‌  మిత్ర పక్షాలను ఏర్పాటు చేసుకున్నాడు.
అంతకంటే ముందు పాండవులు ద్రౌపది కాకుండా విడివిడిగా చేసుకున్న వివాహాల మూలంగా బలమైన ఆర్థిక శక్తులను కూడగట్టుకున్నారు.
ధర్మరాజు, దేవికల వివాహంతో కేకయ రాజ్యం
భీముడు, బలంధరల పెళ్లితో కాశీ
అర్జునుడు సుభద్రల పెళ్లితో ద్వారక
అర్జునుడు, ఉలూచిల పెళ్లితో నాగులు
నకులుడు, కిరణ్మయిల పెళ్లితో చేది
సహదేవుడు, విజయల వివాహంతో మగధ రాజ్యాలు దగ్గరయ్యాయి.
వీరిలో నాగులు మాత్రం యుద్ధంలో పాల్గొనలేదు.

పాండవులు అడవుల్లో ఉన్నా, కృష్ణుడు అవసరమైన సన్నాహాలన్నీ చేసిపెట్టాడు.. మిత్రులను సమకూర్చి ఉంచాడు.. సంధి రాయబారానికి వెళ్లి భీష్మ,ద్రోణులకు, కర్ణుడికి మధ్య చిచ్చు పెట్టాడు.. దీని ద్వారా భీష్ముడు, కర్ణుడు ఒకేసారి యుద్ధరంగంలోకి దిగకుండా అడ్డుకట్ట వేయగలిగాడు.  భీష్ముడు చనిపోయిన తరువాత కానీ, కర్ణుడు రంగంలోకి రాలేదు..

యుద్ధ నాయకత్వం విషయంలోనూ చాలా స్ట్రాటెజిక్‌గా వ్యవహరించారు.. మొత్తం బలగాలను డీసెంట్రలైజ్‌ చేశారు.. ఏడు ఆర్మీ డివిజన్లను, అప్పుడు వాటిని అక్షౌహిణులు అన్నారు లెండి.. ఒక్కో డివిజన్‌కు ఒక్కో కమాండర్‌.. అందరికీ కలిపి ఒక జనరల్‌. దీంతో వూ్యహాన్ని, ఎత్తుగడల్ని పంచుకోవటం కానీ, ఇంప్లిమెంట్‌ చేయటం కానీ చాలా సులువు అయిపోయింది.

టీమ్‌ స్పిరిట్‌.. పాండవులకు పెద్ద బలం.. ఒకే టీమ్‌.. ఒకే మాటపై నడిచే సైన్యం. ఎవరికీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు . అందరిదీ ఒకే టార్గెట్‌.. కౌరవులను ఓడించటం.. ప్రతీకారం తీర్చుకోవటం.. అధికారాన్ని హస్తగతం చేసుకోవటం... అందరూ ఆ గోల్‌ కోసమే యుద్ధం చేశారు.. ఎలాగైనా గెలిచి తీరాలనే ముందుకు వెళ్లారు. కో ఆపరేషన్‌, కో ఆర్డినేషన్‌.. సహకారం, సమన్వయం.. ఈ రెండూ పాండవులకు పెద్ద బలం.. బలగం...
4.
కురుక్షేత్ర యుద్ధంలో  పాండవుల గెలుపు వూ్యహం చాలా కీలకమైంది.. 18 రోజుల పాటు యుద్ధం జరిగిన తీరు గమనిస్తే.. ఆశ్చర్యం వేస్తుంది.. విస్మయం కలుగుతుంది. ఒక్కొక్కరినీ, ఒక్కో రకంగా, ఒక్కో ఎత్తుగడ వేసి హతమార్చిన వైనం పాండవుల, వారి జనరల్‌‌స యుద్ధనీతికి నిదర్శనం.. కౌరవుల దగ్గర ఈ వూ్యహమే లోపించింది. అంతా నిరంకుశంగా సాగిన రణతంత్రం వారిని పూర్తిగా దెబ్బతీసింది.  

కృష్ణుడు రాయబారానికి వెళ్లినప్పుడు దుర్యోధనుడు సంధికి ఒప్పుకోకపోవటానికి సరైన కారణమే ఉంది. కృష్ణుడికి జవాబు చెప్పటానికి ముందు దుర్యోధనుడు తన కోర్‌ టీమ్‌లోని దుశ్శాసన, కర్ణ, శకునిలతో సీరియస్‌గానే చర్చించాడు. శత్రు బలాలను పూర్తిగా అంచనా వేసుకున్నారు.. ఏ విధంగా చూసినా తమ దగ్గర ఉన్న వీరులు కానీ, ఆయుధ బలగాలు కానీ, ఎక్కువ.. తన శక్తిసంపదలపై అతి విశ్వాసం పెట్టుకున్నాడు.. నిజంగా కూడా కౌరవుల వాస్తవ బలం ముందు పాండవుల బలం తక్కువే. ఆ ధైర్యం తోనే యుద్ధానికి దుర్యోధనుడు సై అన్నాడు.
పాండవులు అడవులకు వెళ్లగానే, ఇక తమకు ఎదురు లేదని కర్ణుణ్ణి ఇతర దేశాలపైకి మిలిటరీ మిషన్‌పై పంపించారు. అన్ని దేశాలను జయించి సామంతులను, సంపదను పెంచుకున్నట్లే శత్రువులనూ పెంచుకున్నారు.. కనీసం అధికార వికేంద్రీకరణ అయినా ఉందా అంటే అదీ లేదు.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ నలుగురే.. సామంతులు కాకుండా తోడుగా నిలిచిన మిత్రపక్షాలు శకునికి చెందిన గాంధార.. అంటే ఇవాళ్టి కాందహార్‌ సైంధవుడికి చెందిన సింధు, భగదత్తుడికి చెందిన కంబోడియా అంటే కాంభోజలు మాత్రమే.
యుద్ధం జరుగుతున్నప్పుడు సైతం 11 ఆర్మీ వింగ్‌‌స ఉన్నా, నాయకత్వం ఒకరి చేతులోనే ఉండిపోయింది. దీంతో సైనికులు, సైన్య విభాగాల మధ్య కము్యనికేషన్‌ గ్యాప్‌ చాలా పెరిగిపోయింది. పైగా ఎవరికి వారు వాళ్ల వాళ్ల ప్రయోజనాల కోసమో, ఎప్పుడో చేసిన కమిట్‌మెంట్ల కోసమో యుద్ధం చేశారే తప్ప, దుర్యోధనుణ్ణి గెలిపించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.. కర్ణుడికి లైఫ్‌టైమ్‌ గోల్‌ అర్జునుణ్ణి గెలవటం, భీష్ముడికి అప్పుడెప్పుడో సింహాసనాన్ని కాపాడతానన్న తన ప్రతిజ్ఞ ప్రధానం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో గోల్‌ కావటంతో టీమ్‌ స్పిరిట్‌ లేకుండా పోయింది.
అంతే కాదు.. దుర్యోధనుడు, అతని నలుగురు కోర్‌ టీమ్‌కు తప్ప మిగతా వాళ్లెవరికీ యుద్ధం ఇష్టం లేదు. బలవంతంగానే రణరంగంలోకి వచ్చారు.. వీరిలో పెద్ద తలకాయలకు పాండవ పక్షపాతం. ఈ వీక్‌నెస్‌ను పాండవులు చక్కగా వాడుకున్నారు. ఒక్కొక్కరిని వేరు చేసి విడివిడిగా హతమారుస్తూ వచ్చారు. పది రోజులు బీభత్సం సృష్టించిన భీష్ముడి వీక్‌నెస్‌ శిఖండి.. అతణ్ణి ప్రయోగించి ఆయన్ను పక్కకు తప్పించారు. కొడుకే బలహీనత అయిన గురువు ద్రోణుణ్ణి చంపేందుకు ధర్మరాజు అబద్ధం అడేందుకు వెనుకాడలేదు.. కర్ణుడికి సకల అవలక్షణాలు ఉన్నాయి. అవన్నీ రణరంగంలో అతనికి శాపాలుగా మారాయి. అతణ్ణి నిరాయుధుణ్ణి చేసి మరీ చంపారు. దీనికి తోడు పాండవుల కోవర్‌‌ట శల్యుడు.. ఇతను కర్ణుడి సారథి.. అతనికి ఇది పెద్ద దెబ్బ.  అంతా ఒక్కటై నిలిస్తే పాండవులు గెలిచే వారే కారు.. అందుకే ఏకాకుల్ని చేసి మరీ అంతం చేశారు. ఈ వూ్యహాన్ని దుర్యోధనుడు అర్థం చేసుకునే సరికే తాను ఏకాకి అయిపోయాడు. అంతం అయ్యాడు.
మన బలహీనతల్ని బలంగా మార్చుకోవాలి
శత్రువులను మిత్రపక్షాలుగా మలచుకోవాలి
బాధ్యతలను అందరితో సమంగా పంచుకోవాలి
సరైన టీమ్‌ను ఎంచుకోవటం, టీమ్‌స్పిరిట్‌తో నడుచుకోవటం ముఖ్యం
బలమైన నాయకత్వం చాలా అవసరం
టీమ్‌ మొత్తం ఒకే గోల్‌ కోసం స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి..
ప్రత్యర్థి శిబిరంలో బలహీనతల్ని సొము్మ చేసుకోవటానికి
వూ్యహాత్మకంగా పావులు కదపాలి
బలవంతులను ఐక్యంగా ఉంచటం కంటే వీక్‌ చేసి శత్రు శిబిరాన్ని విచ్ఛిన్నం చేయాలి..
పాండవుల విజయ రహస్యం ఇదే.. ఆచితూచి పావులు కదిపి అధికారాన్ని హస్తగతం చేసుకున్న వీరులు.
తమ బలంపై అతి విశ్వాసానికి పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో 9/11 నాడు ఒసామా బిన్‌ లాడెన్‌ అమెరికాకు రుచి చూపించాడు. అందుకే ఇప్పుడు అమెరికాకు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటం అవసరమైంది. అమెరికా మాటెలా ఉన్నా, మనకు మన బలాన్ని, బలగాన్ని సెల్‌‌ఫ అసెస్‌ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలని కలలు కంటున్న పాలకులు ఒక్కసారి మహాభారత రాజనీతిని, కూటనీతిని, యుద్ధనీతిని జస్‌‌ట ఫాలో అయితే వాళ్ల కల నెరవేర్చుకోవటం పెద్ద కష్టం ఏమీ కాదు..
 మన భారతం మనం ఎలా ఉండాలో చెప్తోంది. మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలో డైరెక్‌‌ట చేస్తోంది. ఎక్‌‌సటర్నల్‌ పాలసీనీ, ఎకనమిక్‌ పాలసీని సైతం ఓ రోల్‌మోడల్‌గా భారతం చెప్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, భారతంలో అసలు కథ అన్నదము్మల గొడవే కానీ, దాని వెనుక ఉన్నది మాత్రం అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ జన జీవన విధానం.

వైట్‌హౌస్‌ అలియాస్‌ రెసిడెన్సీ

0 comments
కోఠీ రెసిడెన్సీ.. ఒకప్పుడు నిజాం వైభవానికి నిలువెత్తు నిదర్శనం... ఇప్పుడు అగ్రరాజ్యం అధిపతి నివాసంగా మారింది. మన రెసిడెన్సీని ప్రపంచ పోలీసు ఎత్తుకెళ్లిపోయాడు.. అక్కడి నుంచే అధికారాన్నంతా చెలాయిస్తున్నాడు.. ఒకప్పటి మన రెసిడెన్సీ.. బ్రిటిష్‌ వారి మెప్పు కోసం, మెహర్బానీ కోసం నిజాం నిర్మించి ఇచ్చిన గొప్ప ప్యాలెస్‌ ఇప్పుడు పేరు మార్చుకుని వాషింగ్టన్‌ డిసికి తరలిపోయింది.. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసంగా మారిపోయింది. ఇది వింతవార్త కాదు.. పుకారు కాదు.. విచిత్రం కాదు.. నిజం..
1
ఇదేమీ కట్టుకథ కాదు.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే వాస్తవం.. మనకు తెలియకుండానే మన భవనం అమెరికా అధ్యక్షుడి నివాసమైపోయింది. ఇదెలా జరిగింది? ఇప్పుడు యావత్ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రశ్న. హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న వాస్తవం.. రెసిడెన్సీ ఏ విధంగా తరలిపోయింది? ఎలా పేరు మార్చుకుంది? అంతటి అగ్రరాజ్యానికి మన రెసిడెన్సీయే ఎందుకు కావలసి వచ్చింది? వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు.. కానీ, ఇది వాస్తవం..  
మనకు తెలిసిన అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్‌.. రాజధాని వాషింగ్టన్‌ డిసిలో కొలువై ఉన్న శ్వేత సౌధం.. కనుసైగతో ప్రపంచాన్ని శాసించే అత్యంత శక్తిమంతమైన రాజ్యాధిపతి అధికార దర్పానికి నిలువుటద్దం. శ్వేతసౌధంలో అధికార లాంఛనాలతో రెడ్‌కార్పెట్‌ స్వాగతం స్వీకరించేందుకు ఉబలాటపడని ప్రపంచదేశాధి నేతలు ఉండరు.. మన మన్మోహన్‌ సింగ్‌ సైతం జార్జిబుష్‌ ఇచ్చిన విందుకు సంబరపడే అణు ఒప్పందంపై రాజీ లేకుండా సంతకం చేసేశారు..
ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా మొట్టమొదటి సమాచారం వైట్‌హౌస్‌కు చేరుతుంది. ఏ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చూసేందుకు వేలాది డేగకళ్లకు శ్వేతసౌధం నివాసం. ఒక్క మీట నొక్కితే మూడు వేల సార్లు భూమిని నాశనం చేసే అణ్వసా్తల్రను పేల్చే బ్లాక్‌ బాక్‌‌స భద్రంగా ఉన్న భవనం.
అమెరికా సంయుక్తరాషా్టల్ర అధ్యక్షుడి నివాసంతో పాటు ఆయన పరిపాలనా విభాగాలన్నీ వైట్‌హౌస్‌లోనే కొలువై ఉంటాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయమైనా ఈ భవనంలోనే రూపొందుతుంది.. ఇక్కడే అమలు జరుగుతుంది. తాను కావాలనుకుంటే యుద్ధం.. వద్దనుకుంటే శాంతి.. వార్‌కైనా, పీస్‌ కైనా ఇక్కడే నాంది పలుకుతుంది.. ఇక్కడి నుంచే ఆపరేషన్‌ స్టార్‌‌ట అవుతుంది..
అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే నియంతృత్వ అమెరికాకు శ్వేతసౌధం కేంద్రకం. ఇందులో ఎవరికీ ఆక్షేపణ లేదు.. అభ్యంతరం అంతకంటే లేదు.. మరి ఎక్కడో భారత్‌లో ఓ మూలన హైదరాబాద్‌లో ఉన్న కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి ఉన్న సంబంధం ఏమిటి? రెసిడెన్సీ వైట్‌హౌస్‌గా ఎలా మారిపోయింది? ఎవరు మార్చాల్సి వచ్చింది. వైట్‌హౌస్‌ను అలియాస్‌ రెసిడెన్సీగా ఎందుకు పిలవాలి? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌?

2
అంతా అయోమయంగా ఉందని అనుకోకండి.. ఇందులో విశేషమే ఉంది. మన కోఠీ రెసిడెన్సీని, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను ఒక్కసారి నిశితంగా గమనించండి.. పరిశీలించండి.. అణువణువూ పరికించండి.. మర్మం ఏమిటో మీకే తెలుస్తుంది. కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి అణువంతైనా తేడా లేదని.. అచ్చంగా మన రెసిడెన్సీకి కవల పిల్లలా ఉందని మీకే అర్థమవుతుంది.              
మనలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది.. భారతీయులందరిలోనూ ఉన్న లక్షణమే అది.. ఏమంటే.. మనకు ఎలాంటి తెలివీ లేదని.. ఎవడో బయటివాడు వచ్చి మనకు నేర్పితే కొని తెచ్చుకున్న కొంచెపు తెలివే తప్ప.. మనకంటూ సహజంగా ఉన్నది సున్నాయేనని ఓ గట్టి నమ్మకం. అమెరికా వోడు ఆరోగ్యానికి పెరుగన్నం తినమంటే ఆహా, ఓహో అంటూ తినేస్తాం... వైట్‌హౌస్‌ నుంచి కూచోమని ఆదేశమొస్తే కూచుంటాం.. నిలుచోమంటే నిలుచుంటాం.. మన మంచి మనకంటే వాడికే ఎక్కువ తెలుసని మనమే దబాయించి వాదిస్తాం మరి..
కానీ, ఇదిగో ఒక్కసారి ఆలోచించండి.. మన వారికి ఉన్న తెలివేంటో తెలుసుకోండి.. మన వారిని మనం వదిలేసుకున్నాం.. కానీ, అదే అమెరికావోడు తెలివిగా పట్టేసుకున్నాడు.. మనకున్న నైపుణ్యాన్ని వాళు్ల నిస్సిగ్గుగా తమ దగ్గరకు తీసుకెళ్లిపోయారు.. అందుకు ఉదాహరణే హైదరాబాద్‌ కోఠీలోని ఒకప్పటి బ్రిటిష్‌ రెసిడెన్సీ.. ఇప్పటి వుమెన్‌‌స కాలేజి. జస్‌‌ట లుక్‌ ఇన్‌టు ఇట్‌..
కోఠీ రెసిడెన్సీ, వైట్‌హౌస్‌ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటాయి.. ఉన్నాయి. ముఖద్వారం నుంచి, వెనుక ఉన్న ఫౌంటెన్‌ దాకా, స్తంభాల దగ్గరి నుంచి వాటిపై ఏర్పరిచిన అలంకారాల దాకా కోఠీ రెసిడెన్సీకి ఓ కార్బన్‌ కాపీలా వైట్‌హౌస్‌ ఉంటుంది.
కొద్దిగా కూడా తేడా కనిపించదు.. ఒకే ముఖం.. ఒకే ఎత్తు.. ఒకే శిల్పం.. ఒకే నిర్మాణ రీతి.. చూస్తుంటే ఒంట్లో ఒక రకమైన కదలిక వచ్చేస్తుంది.. ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి.. ఇది ఎలా సాధ్యపడింది? కోఠీలో బ్రిటిష్‌ వారి రెసిడెన్సీ ఆర్కిటెక్చర్‌ను వైట్‌హౌస్‌ అనుకరించిందా? వైట్‌హౌస్‌ ఆర్కిటెక్చర్‌ను నాటి నిజాం అనుకరించాడా?
అవును.. మీ అనుమానం నిజమే.. మన నైపుణ్యాన్నే వైట్‌హౌస్‌ నిర్మాతలు తేలిగ్గా కొట్టేశారు.. హాలీవుడ్‌ సినిమాల్లో సీన్లను కాపీ కొట్టి తెలుగు సినిమాల్లో యథాతథంగా వాడుకున్నట్లే.. మన రెసిడెన్సీ నిర్మాణశైలిని ఉన్నది ఉన్నట్లుగా అగ్రరాజ్యం కాపీ కొట్టింది..
3
ఎక్కడి వైట్‌ హౌస్‌.. ఎక్కడి కోఠీ రెసిడెన్సీ.. రెండూ ఒకే లాగా ఎలా నిర్మించారు.. రెండింటి ఆర్కిటెక్‌‌ట ఒక్కరేనా? లేక ఒకదాని నమూనాతో మరొకటి నిర్మించారా? ఇన్నాళూ్ల బయటి ప్రపంచానికి తెలియని ఓ పెద్ద మిస్టరీ.. రెండూ ఒకే రీతిలో నిర్మాణం జరగడానికి వెనుక కారకులెవరైనా ఉన్నారా?
వైట్‌ హౌస్‌.. కోఠీ రెసిడెన్సీ.. ఒకటి అగ్రరాజ్యం అధినేత నివాసం.. మరొకటి ఒకనాటి బ్రిటిషర్లు, నిజాం నవాబు వైభవానికి నిదర్శనం.. ఒకటి తూర్పు.. మరొకటి పడమర.. రెండూ ఒకేలాగా ఉండటం ఎలా సాధ్యపడింది? ఒకటి కాదు.. రెండు కాదు.. రెంటికీ బోలెడు పోలికలు ఉన్నాయి...
రెండింటినీ దక్షిణాభిముఖంగానే నిర్మించారు.

రెండింటి ఫ్రంటల్‌ వూ్య ఒకే విధంగా ఉంటుంది.

రెండింటికీ సెమీ సర్కిల్‌ పోర్టికో ఉంది.

ఈ పోర్టికోలో నిలుచునే అమెరికా అధ్యక్షుడు ప్రసంగం చేసే సంప్రదాయం ఉంది. బ్రిటిష్‌ రెసిడెన్సీలోనూ గవర్నర్‌ జనరల్‌ ఇదే పోర్టికోలో నిలుచుని ప్రజలను అడ్రస్‌ చేసేవారు.

సెమిసర్కిల్‌ పోర్టికోలో ఉన్న స్తంభాలు రెండింటిలోనూ ఒకే ఎత్తులో ఉంటాయి

రెండింటి పునాది ఒకే ఎత్తులో ఉంది.

రెండింటికీ సెల్లార్‌లో నిర్మాణం జరిగింది.

వైట్‌ హౌస్‌లో మొత్తం సెల్లార్‌ నుంచి పై వరకు మొత్తం ఆరు అంతస్థులు ఉంటే, కోఠీ రెసిడెన్సీలో  సెల్లార్‌, గ్రౌండ్‌, ఫస్‌‌ట ఫ్లోర్లు ఉన్నాయి.

బయటినుంచి చూస్తే రెండు భవనాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

భవనాలకు ఉత్తరాభిముఖంలో కనిపించే ట్రయాంగిల్‌  పోర్టికో కూడా ఒకే విధంగా ఉంటుంది.

స్తంభాల అంచుల్లో డిజైనింగ్‌ అచ్చుగుద్దినట్లే ఉంటుంది.

లోపల తలుపులపై వెంటిలేటర్ల నిర్మాణం కానీ, రూఫ్‌ డిజైనింగ్‌లో కూడా తేడా ఇసుమంతైనా కనిపించదు..

సీలింగ్‌, పిల్లర్లు మాత్రమే కాదు.. లోపల దర్బార్‌ హాల్‌ నిర్మాణం కూడా రెండింటిలోనూ ఒకే రకంగా కనిపిస్తుంది.

భవనం లోపలి భాగంలో పిల్లర్ల ఏర్పాటులో కూడా ఏక రూపత కనిపిస్తుంది. ఒక పిల్లర్‌ దాని తరువాత రెండు పిల్లర్లు ఆ తరువాత ఒక పిల్లర్లను ఏర్పాటు చేయటం రెట్టింపు ఎత్తులో ఉన్న సీలింగ్‌కు భద్రత కల్పించటం కోసం ఈ రకమైన స్తంభాల ఏర్పాటు చేశారు.
రెండు భవనాల్లోనూ ఉత్తరం వైపు పెద్ద గార్డెన్‌ ఉంది.. ఈ రెండు తోటల్లోనూ వలయాకారంలో ఉన్న ఫౌంటెన్‌లను చూడవచ్చు.
వైట్‌హౌస్‌లో మెట్లు బయటి నుంచి ఉంటే, కోఠీ రెసిడెన్సీలో మెట్లు లోపలి నుంచి కనిపిస్తాయి. రెయిలింగ్‌ డిజైనింగ్‌ ఒకే రకంగా ఉంటుంది.
రెండు భవనాలకు రెండువైపులా అదనపు నిర్మాణాలు జరిగాయి.
కిటికీల డిజైనింగ్‌ కానీ, బాల్కనీ అంచులపై ఉన్న డిజైనింగ్‌ కానీ రెండింటిలోనూ ఒకేరకంగా ఉంటుంది.
4
వైట్‌హౌస్‌, కోఠీ రెసిడెన్సీలు రెంటిలోనూ ఇన్ని కామన్‌ ఎలిమెంట్లు ఎలా సాధ్యమైందన్నది ఇప్పటివరకూ అంతుపట్టని విషయం.. కోఠీ రెసిడెన్సీని చూసి వైట్‌హౌస్‌ను నిర్మించారా? లేక సొంత డిజైనింగేనా? సొంతంగా అగ్రరాజ్యం డిజైన్‌ చేయించినట్లయితే ఇన్ని సిమిలారిటీస్‌ కనిపించటం అసాధ్యమైన పని. కానీ, ఎలా సాధ్యపడింది?
వైట్‌హౌస్‌ను మొట్టమొదట నిర్మించింది 1792లో.. అమెరికా అప్పటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ ఈ భవంతికి రూపకర్త.. ఐరిష్‌కు చెందిన జేమ్‌‌స హోబన్‌ ఈ భవనానికి డిజైన్‌ చేశాడు.. జాన్‌ ఆడమ్‌‌స అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు అందరు ప్రెసిడెంట్లకూ ఇది అధికార నివాసంగా ఉంటూ వచ్చింది. 1792లో ఈ బిల్డింగ్‌ను నిర్మించినప్పుడు ఆక్వా సాండ్‌ స్టోన్‌ వాడారు.. అప్పుడు దీన్ని వైట్‌ హౌస్‌ అని పిలవలేదు. ఎగ్గిక్యూటివ్‌ మాన్హన్‌ అని, మరి కొన్ని పేర్లతో దీన్ని పిలిచారు. 1801లో థామస్‌ జెఫర్‌సన్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక దీని బయటి వైపు విస్తరించాడు.
1814లో బ్రిటిష్‌ ఆర్మీతో యుద్ధం జరిగిన సమయంలో ఈ భవంతి పూర్తిగా కాలిపోయింది. బ్రిటిష్‌ సైన్యం పూర్తిగా దీన్ని ధ్వంసం చేసింది.  ఆ తరువాత దీన్ని మళ్లీ నిర్మించారు.. పాత డిజైన్‌లోనే మళ్లీ నిర్మించినా, ఇంటీరియర్‌, ఎక్సీ్టరియర్‌ డిజైనింగ్‌లో మార్పు వచ్చింది. 1829 నాటికి సౌత్‌ పోర్టికో వచ్చేసింది. తూర్పు, పడమరల వైపు విస్తరణ జరిగింది. ఈ ఆల్టరేషన్‌‌స 1948 దాకా జరుగుతూనే వచ్చాయి.  అధ్యక్షుడు మారుతున్న కొద్దీ ఒక్కో మార్పు జరుగుతూ వచ్చింది. 1948 నాటికి కానీ, ఇవాళ మనం చూస్తున్న వైట్‌హౌస్‌ ఒక రూపానికి రాలేదు..

శాండ్‌స్టోన్‌ బిల్డింగ్‌కు 1829లో పునర్నిర్మాణం జరిగిన తరువాత వైట్‌పెయింట్‌ వేశారు. అప్పటి నుంచీ దీన్ని వైట్‌హౌస్‌గా పిలవటం ప్రారంభించారు.
ఇక కోఠీ రెసిడెన్సీ విషయానికి వస్తే, 1798లో హైదరాబాద్‌ కోఠీలో నిర్మించారు. ఇప్పటి వరకూ అందరికీ తెలిసినట్లుగా బ్రిటిష్‌ రెసిడెంట్‌ గవర్నర్‌ జేమ్‌‌స కిర్‌‌కపాట్రిక్‌ తన భార్య ఖైరున్నీసా కోసం నిర్మించారన్నది పచ్చి అబద్ధం.. నిజాం రాజు బ్రిటిష్‌ వాళ్ల దగ్గర తన ప్రాపకాన్ని పెంచుకునేందుకు, వారి నుంచి తన అధికారానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు తానే భూమిని సమకూర్చి, తన నిధులతో, తన మనుషులతో  అద్భుతమైన రెసిడెన్సీని నిర్మించి ఇచ్చాడు. దీన్ని ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీగా పిలిచారు.
నిజానికి వైట్‌హౌస్‌ కోఠీ రెసిడెన్సీ కంటే  ముందే నిర్మించారు. కానీ, మొదట నిర్మించినప్పుడు వైట్‌హౌస్‌ డిజైన్‌ వేరు.. దాని నిర్మాణంలోని తీరు వేరు. 1814లో అది పూర్తిగా తగలబడిపోయిన తరువాత దాని డిజైన్‌ మారిపోయింది. మార్పులు, చేర్పులతో పూర్తిగా కోఠీ రెసిడెన్సీకి కవలగా రూపు మార్చుకుంది.

రెండు నిర్మాణాలకు ఎందుకింత సారూప్యం ఉందంటే అందుకు రీజన్‌ లేకపోలేదు.. మన నిర్మాణ రీతులను అప్పటికే ఐరోపా దేశాలు అనుకరిస్తూ వస్తున్నాయి. చాలా దేశాల్లో ప్రెసిడెన్షియల్‌ భవనాలు కానీ, ఇతర పెద్ద భవనాలు కానీ, భారతీయ నిర్మాణాన్ని పోలి ఉండటం గమనించవచ్చు. బ్రిటిష్‌ రెసిడెన్సీ దగ్గరకు వచ్చేసరికి దీని డిజైనింగ్‌ లండన్‌లో జరిగింది. విచిత్రమేమంటే, ఇక్కడి నిర్మాణశైలిని వంటబట్టించుకున్న తెల్లవాడు, అదే డిజైనింగ్‌ను మళ్లీ నిజాంకు ఇచ్చాడు. అదే శైలిలో రెసిడెన్సీ కట్టారు..

ఇదే సమయంలో వైట్‌హౌస్‌ నిర్మాణానికీ ఐరోపాకు చెందిన డిజైనరే, అంటే ఐరిష్‌ ఆర్కిటెక్‌‌ట హోబన్‌ ప్లాన్‌ వేశారు. దీని రూపురేఖలను మార్చిన థామస్‌ జెఫర్‌సన్‌ అంతకు ముందు ఫ్రాన్‌‌స మినిస్టర్‌గా పనిచేశారు కూడా.. అందుకే వారిపై భారతీయ నిర్మాణాల ప్రభావం ఎక్కువగా పడింది. వైట్‌హౌస్‌ ఆ ప్రభావానికి లోనైన నిర్మాణమే. అచ్చంగా మన రెసిడెన్సీకి కాపీయే. కాకపోతే మన రెసిడెన్సీ ఇవాళ ఓ మహిళా కళాశాలగా మాత్రమే అందరికీ తెలుసు.. సర్కార్లు కళు్ల తెరిస్తే, దాని గొప్పతనం జనం ముందుకు వస్తుంది.

సత్యభామ.. ఎ రియల్‌ విమెన్‌ వారియర్‌..

1 comments
ఆమెను అంతా అహంకారి అన్నారు.. మొగుణ్ణి కొంగున ముడేసుకుందన్నారు.. పెంకిపెళ్లామని ఈసడించుకున్నారు.. ముక్కుమీదే కోపం ఉందన్నారు. మొగుణ్ణి అమ్మేసిన జాణ అని తిట్టుకున్నారు..కుటుంబం పట్ల సరిగా వ్యవహరించలేదన్నారు.. సవతులను అవమానించిందని ఆగ్రహించారు.  మహిళాలోకంలో ఆమె ఓ నెగెటివ్‌ కేరెక్టర్‌.. ద్వాపర యుగంలో  ఆమె కథ ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌.. నిలువెత్తు బంగారం లాంటి నెరజాణ.. సత్రాజిత్తు కుమార్తె.. సాత్రాజితి.. సత్యభామ.. ఎ రియల్‌ విమెన్‌ వారియర్‌..

సత్యభామ.. పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అహంకారం.. ఒక మహిళ అహంభావం పతాకస్థాయికి ఆమె అచ్చమైన ఉదాహరణ.. కృష్ణుడి అష్టభార్యల్లో  తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తిగా సత్యభామ మనకు తెలుసు.. నిజంగా ఆమెలో ఇంత నెగెటివ్‌ షేడ్‌ ఉందా?  నిజంగానే ఆమె దురహంకారేనా? ఓ మహిళా విలన్‌గా ఆమె పాత్రను ఎలా చిత్రించారు..?                      
అందమైన అహంకారం
అహం నుంచి పుట్టిన అస్తిత్వం
నడకలో వాడి
నడతలో వేడి
ముక్కుసూటి
ఆమె వ్యక్తిత్వమే ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌.. ఆమె సత్యభామ.. శ్రీకృష్ణుడి ముద్దుల భార్య. అష్టభార్యల్లో ముచ్చటగా మూడో భార్య.. సృష్టి సౌందర్యం అంతా రాశిగా పోతపోసుకుని పుట్టిన ముద్దుగుమ్మ.. వేల నిర్వచనాలకైనా అందని ఆనంద లక్ష్మి..
ఓటమి ఆమె ఎరుగని పదం
విజయం ఆమె హక్కు
దాన్ని సాధించటం ఆమె నైజం
భర్తనైనా ఎదిరించటం ఆమె తత్త్వం
ఆధిపత్యం పరమసోపానం
సత్యభామ గురించి మాట్లాడుకున్నా, ఆమె పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఈ విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. ఎనిమిది మంది భార్యలున్నా, పదహారు వేల మంది గోపికలున్నా, అంతమందిలోనూ భర్తను కొంగున ముడివేసుకున్న మహిళగా ఆమె వ్యక్తిత్వం సుపరిచితమే.. ఆమె నిటారుగా నిలబడితేనే నిలువెత్తు అహంభావానికి రూపమిచ్చినట్లుంటుంది.. పురాణాల్లోనైనా, భాగవతంలోనైనా ఎవరితోనూ సఖ్యంగా ఉన్నట్లు మనకు కనిపించదు.. అంతా మంచి వాళ్లే, ఆమె మాత్రం దుర్మార్గురాలన్నట్లుగానే మనం వింటూ వస్తున్నాం.. ఆమె కేరెక్టర్‌ను అలాగే మన మనసుల్లో  ముద్రించుకున్నాం..

సత్యభామ కేరెక్టర్‌ ఇంత దుర్మార్గమైందా? ఆమె తానున్న సమాజంలో అందరినీ తిరస్కరించి, అందరికీ దూరంగా ఉండిపోయిందా? సత్యభామ నిజంగా అంతా ఈసడించుకోదగిందా? ఆమె ఎందుకలా ప్రవర్తించింది? ఒక మహిళగా ఆమె జీవించిన తీరు ఎందుకు ఇంతగా అభ్యంతరకరమైంది?
2
 శ్రీకృష్ణుడితో చిన్ననాట రాసలీలలాడింది రాధాదేవి. బృందావనంలో  కృష్ణుడి రసరాజ్యానికి ఆమె పట్టమహిషి.. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్న తరువాత రాధాదేవి పాత్రను పోషించింది సత్యభామే. సత్యభామ ద్వారకానాథుడి శృంగార రసాధి దేవత. ఆమెలో అహంకారమే మనకు పైకి కనిపించిన, కనిపిస్తున్న వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలో మనకు తెలియని కోణాలు మరెన్నో ఉన్నాయి.
క్రీస్తుపూర్వం 3228 నాటి మాట.. మధురలో కంసుడి జైల్లో జన్మించిన కృష్ణుడి గాథ..  పదకొండో ఏట కంసుణ్ణి సంహరించిన తరువాత మరో 18ఏళ్ల పాటు ఆయన మధురలోనే గడిపాడు.. అక్కడే ఉన్నప్పుడు అంటే 25వ ఏట రుక్మిణితో వివాహం జరిగింది. రుక్మిణితో  వివాహం ఓ సంచలనం..
రుక్మిణితో వివాహం తరువాత సత్రాజిత్తు తన శ్యమంతక మణిని దొంగిలించాడని కృష్ణుడిపై నిందమోపాడు.. దాన్ని మాపుకోవటానికి వెళ్లి మణితో పాటు జాంబవతిని వివాహం చేసుకుని వచ్చాడు కృష్ణుడు.. సత్రాజిత్తు తన తప్పును తెలుసుకుని తన కూతురు సత్యభామను కృష్ణుడి చేతిలో ఉంచి వివాహం చేశాడు. మొత్తం ఎనిమిది వివాహాలు చేసుకుని ఆష్టభార్యలతో సంసారం చేయటం కృష్ణుడికి మాత్రమే సాధ్యమైంది.
అష్టభార్యల్లో ఏడుగురు ఒక ఎత్తు.. సత్యభామ ఒక్కతే ఒక ఎత్తు.. ఆమె అహం ముందు మిగతా సపత్నులంతా ఓడిపోయారు..ఎనిమిది మందిలోనూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది.. భర్తను తన వాడిగా చేసుకుంది.. సంపద, అభిమానం, పట్టుదల, భర్తపైన అపారమైన ప్రేమ కృష్ణుడిని కట్టిపడేసింది.
చివరకు ఆమె ప్రేమకు ఆయన దాసుడయ్యాడు. కృష్ణుడి భార్య సత్యభామ అని కాకుండా, సత్యాపతి కృష్ణుడనే లెవల్‌కి తన స్టేటస్‌ను పెంచుకోగలిగింది సత్యభామ. తాను అనుకున్నది సాధించటం కోసం అధికారం చెలాయించింది... ముద్దు చేసింది. మురిపాలు పోసింది...   వయ్యారానికి పోయింది...కోపగించుకుంది.. అలకబూనింది.. కోపంతో తలనే తన్నింది...
భర్తను తనవాడిగా చేసుకోవటం కోసం ఆయన్నే దానమివ్వటానికి కూడా వెనుకాడని మహిళ సత్యభామ. తనదైన వస్తువును, వ్యక్తిని ఇతరులెవరితోనూ పంచుకునేందుకు ఇష్టపడని అభిమానవతి.. ఇందుకోసం ఆమె దేనికైనా తెగించింది.. సాహసించింది.. సాధించింది.. ఈ లక్షణమే ఆమెను అహంకారిని చేసింది. ఈ తెగింపే ఆమె నడతను నిందించింది.. ఆమెను విలన్‌గా మార్చింది.
3
సత్యభామ నిజంగా అహంకారా? ఎవరికీ రాని సందేహం ఇది. ఎందుకంటే ఆమె స్వభావంలో కనిపించేదే అదైనప్పుడు ఆమె ధిక్కార ధోరణిపై అనుమానం దేనికి? అందరూ తప్పులో కాలేసే చోటు ఇదే. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వంలో కనిపించే అహం అహం కాదు. ఆమె తనను తాను అసర్‌‌ట చేసుకునేందుకు చేసిన పోరాటానికి ఓ ప్రతిరూపం.. ఒక మహిళగా తన ఉనికిని కాపాడుకునేందుకు సమాజాన్ని ఎదిరించి నిలిచిన అసాధారణ వ్యక్తిత్వానికి బింబం.
సత్యభామ వ్యక్తిత్వాన్ని ఇంతకాలం సమాజంలో ఓ వ్యతిరేక శక్తిగానే మనం చిత్రించుకుంటూ వచ్చాం. దుర్మార్గమైన మహిళగా ఉన్న సత్యభామ దురహంకారాన్ని కృష్ణుడు అణచివేసినట్లుగా చెప్పుకుంటున్నాం.. కృష్ణుడి మిగతా ఏడుగురు భార్యలు చాలా మంచివారుగా, సత్యభామ మాత్రం తులసివనంలో గంజాయి మొక్కలా చెప్పుకొస్తున్నాం..
కానీ సత్యభామ వ్యక్తిత్వం వక్రీకరణ జరిగింది. మోస్‌‌ట అడ్వాన్‌‌సడ్‌ విమెన్‌కు ఆమె అచ్చమైన ప్రతీక. ఇదేమిటని ఆశ్చర్యపోకండి.. ఇది తిరుగులేని నిజం. సత్యభామ తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి విరామం లేని పోరాటం చేసిన సబల.
సత్యభామ కాలం నాటి సమాజం ఒక చిత్రమైన లక్షణం కలిగి ఉన్నది. బహు భార్యత్వాన్ని, బహు భర్తృత్వాన్ని అంగీకరించిన సమాజం. ఇందుకు ఉదాహరణ అయిదుగురు భర్తలు ఉన్న ద్రౌపది.. అష్టభార్యలున్న శ్రీకృష్ణుడు.. పైగా సమష్టి కుటుంబ వ్యవస్థ, భర్తను దేవుడితో సమానంగా చూడటం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల వంటివి బలంగా వేళూ్లనుకునిపోయిన సమాజం ఆనాటిది.. అలాంటి సమాజంలో  మహిళగా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవటం కత్తిమీద సాము లాంటిది. కృష్ణుడి అష్టభార్యల్లో రుక్మిణి, సత్యభామ మినహా మిగతావాళు్ల అబలలుగానే వెనుకబడే ఉండిపోయారు. సత్యభామ మాత్రం తనను తాను అసెర్‌‌ట చేసుకోగలిగింది.
ఎనిమిది మంది భార్యల మధ్య భర్తను తనవాడిగా చేసుకోవటం కోసం తాపత్రయ పడింది. ఏ భార్యకైనా భర్త తనవాడుగా ఉండాలని ఉండటం తప్పుకాదు.. సత్యభామ అదే కోరుకుంది. అలా అని అత్తమామల పట్ల కానీ, సపత్నుల పట్ల కానీ, ఆమె ఎన్నడూ అమర్యాదగా ప్రవర్తించలేదు. కాకుంటే ఆమెలోని ఈగో తన భర్తను డామినేట్‌ చేసే దిశగా సాగింది. అలిగైనా సరే ఆయన్ను సాధించుకుంది.
విజయవిలాసం వంటి కావ్యాల్లోనో, ఆ తరువాత వచ్చిన రకరకాల కథనాల్లో  సత్యభామ పాత్రను రకరకాలుగా చిత్రించారు..మగవాడి డామినేషన్‌కు కొంత వ్యతిరేకంగా ఉండటంతో దాన్ని తగ్గించేందుకు, సప్రెస్‌ చేసేందుకు ఆమె అహంకారాన్ని అణచినట్లు, మిగతావారి పట్ల ఆమె అనుచితంగా ప్రవర్తించినట్లు కథను మార్చేశారు. వాస్తవానికి ఆమె ఆనాటికి తానున్న సొసైటీలో తన భర్త కోసం, తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటం కోసం అనుక్షణం పోరాడింది.
సాధారణంగా మహిళలో ఉండే ఆభిజాత్యమే ఆమెలోనూ ఉంది. ఎందుకంటే సత్యభామ ఆగర్భ శ్రీమంతురాలు..రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇచ్చే శ్యమంతకమణిని వెంట తెచ్చుకున్న మహిళ.. అంతటి సంపద నుంచి వచ్చిన అహం సహజంగానే ఆమె వ్యక్తిత్వాన్ని విశిష్టంగా మలచింది. మిగతా భార్యలందరిలోనూ ప్రత్యేకంగా నిలిచింది. భర్తను డామినేట్‌ చేయటం కాదు.. భర్తపట్ల పెత్తనం చెలాయించటం కాదు.. మిగతా భార్యల కంటే తానే ఎక్కువగా ప్రేమ కురిపించింది. ముద్దు మురిపాలు చేసింది.  భర్త ప్రేమను పొందటమే కాదు.. పది మందిలో తానేమిటో నిరూపించుకోవటమే సత్యభామాకలాపం.
4

భర్తను గౌరవించటం, భర్తను దేవుడిగా పూజించటం, భర్త మాటే వేదవాక్కుగా భావించటం మాత్రమే స్త్రీ జీవితం కాదని నిరూపించింది సత్యభామ. ఆత్మాభిమానం ఉండటం అహం కాదు.. అభిమానం అంటే, ఆధిపత్యం చెలాయించటం కాదు. మొగుణ్ణి కొంగున ముడేసుకోవటం కాదు.. ప్రేమను పంచటం.. భర్త సుఖంలో, కష్టంలో పాలుపంచుకోవటం.. అతని బాధ్యతల్లో భాగం పంచుకోవటం.. అలాంటి అభిమానానికి భర్త దాసోహం అనక ఏం చేస్తాడు.. కృష్ణుడు అందుకే సత్యాపతి అయ్యాడు..
శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యల్లో ఏడుగురిని ఆయన ఏదో రకంగా యుద్ధం చేసి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. రుక్మిణీ వివాహం కూడా ఆమె నన్ను తీసుకుపొమ్మని ఉత్తరం రాస్తే వెళ్లి ఎత్తుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు..
సత్యభామ వివాహం మాత్రం అలా జరగలేదు. తండ్రి సత్రాజిత్తు ఒప్పుకున్నాడు. తాను ఒప్పుకుంది.. అందరి అంగీకారంతో సంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి అది. పైగా సంపన్నవతి.. బంగారం లాగానే తామసం ఎక్కువ. అందుకే మిగతా అందరిలోనూ ఆమె రూటే సెపరేటు
కేవలం భార్యగా భర్తను పొందటమే కాదు.. అవసరమైతే భర్తకు దీటుగా ఆయనకు అండగా నిలిచి మహిళగా తన ప్రత్యేకతను నిరూపించుకుంది. నరకాసురుడి వధకు భర్తతో పాటు యుద్ధరంగానికి వెళ్లింది.. యుద్ధంలో భర్త అలసిపోతే, తానే ఆయుధం చేతపట్టింది. నరకుణ్ణి వధించింది. పదహారు వేల మంది కన్నెలను విడిపించింది. ఎ రియల్‌ విమెన్‌ వారియర్‌గా చరిత్రలో నిలిచిపోయింది.

అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఒక మహిళ ఎలా ఉండాలో సత్యభామ ఉండి చూపించింది. ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి అభిమానవతులు అవసరం. రకరకాల ఇన్‌ఫ్లూయెన్సెస్‌ పడటం వల్ల ఇవాళ్టి మహిళలు పెళ్లి కాగానే భర్తను తమ చెప్పుచేతల్లో ఎలా పెట్టుకోవాలో ఆలోచిస్తారు.. తాము పుట్టినింటిని వదిలి వచ్చినప్పుడు తన భర్త మాత్రం అతని కుటుంబంతో ఎలా ఉండాలన్న స్థాయికి మోడ్రన్‌ మహిళ వచ్చేసింది. ఫలితం వేరు కాపురం.. వినకపోతే విడాకులు.. అంతా జస్‌‌టకూల్‌..
మనల్ని మనం అసెర్‌‌ట చేసుకోవటం అంటే ఎదుటివాళ్లను అవమానించటం కాదు.. చిన్నచూపు చూడటం అంతకంటే కాదు.. నెగెటివ్‌ ఆటిట్యూడ్‌ను వదిలేసి సానుకూల కోణంలో  వ్యవహరించటం ఈతరానికి ఉండాల్సిన బేసిక్‌ క్వాలిటీ.. ఇదిగో ఈ క్వాలిటీ సత్యభామ నుంచి నేర్చుకోవాలి.. తనలో అభిమానాన్ని కొంచెమైనా విడవకుండానే మహిళగా, భార్యగా, యోధాగా తానేమిటో నిరూపించుకుంది.. జస్‌‌ట ఒక్కసారి ఆలోచించండి.. ప్రతిభామా ఒక సత్యభామ అయితే, అలుకలూ, అనునయాలు ఉంటాయేమో కానీ, ఏ కాపురమూ కుప్పకూలదు.