8, జనవరి 2011, శనివారం

అమల్లోకి వచ్చిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు..

శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తక్షణ అమల్లోకి తీసుకు వచ్చింది. కమిటీ ఇచ్చిన నివేదికలోని తొలి నాలుగు సిఫార్సులు ప్రాక్టికల్ కావని తేలటంతో.. ఇక అయిదు, ఆరు సిఫార్సుల్లో ఒకదాన్ని ఆమోదించాల్సిన, లేదా పూర్తిగా తిరస్కరించాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ దశలో ఇప్పుడు ఆరో సిఫార్సు గురించి  ప్రస్తావించటం, అమలు గురించి ఆలోచించటం తొందరపాటు అవుతుంది కాబట్టి అయిదో సిఫార్సులో అంతర్గతంగా చేసిన సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయటం ప్రారంభించింది. ‘‘ అన్‌లెస్ హాండిల్డ్ డెఫ్ట్‌లీ, టాక్ట్‌ఫుల్లీ, ఫర్మ్‌లీ..’’ అప్పుడు మాత్రమే అయిదో సిఫార్సులోని ప్రధాన అంశం అయిన రాష్ట్ర విభజన చేయాలని శ్రీకృష్ణ స్పష్టంగా సూచించారు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్నది అదే. ఉద్యమాన్ని అణచివేయటం మీకు సాధ్యం కానప్పుడు, చేతకానప్పుడు మాత్రమే రాష్ట్రాన్ని విభజించాలని పేర్కొంది. అందుకే ఇప్పుడు ఉద్యమాన్ని అణచివేయాలన్న సిఫార్సును ముందుగా అమలు చేస్తోంది.. దీని పర్యవసానలను బట్టి, తీవ్రతను బట్టి, జయాపజయాలను బట్టి ,  మిగతా సిఫార్సుల సంగతి.. వాటిలోని ఇతర అంశాలను అమలు చేయాలన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. శాంతిభద్రతల పేరుతో విద్యార్థులపై దమనకాండ సక్సెస్ అవుతే తెలంగాణ ఉద్యమం వెనక్కి పోవటం ఈజీ అన్నది నిఘా వర్గాలు రాష్ట్రానికి, కేంద్రానికి పంపిన సంకేతం. కాబట్టి కేంద్రం ప్రస్తుతం ఆ దిశగా తొలి అడుగు వేసింది.

13 కామెంట్‌లు:

  1. ఈ పనేదో కిందటి సంవత్సరం రోశయ్య గారు చేసి వుంటే ఈ గొడవలన్నీ వుండేవి కాదు కదా!

    రిప్లయితొలగించండి
  2. మండుతున్న గుండెతో ఒక్క మాట చెబుతున్నా -
    నాడు .. కౌరవులకు లొంగి ఒకే రాజ్యంలో ఉండడం ఇష్టంలేక, ఆత్మాభిమానంతో పాండవులు రాజ్యభాగాన్ని కోరడం తప్పు కాకపోతే, నేడు ... అదే పద్ధతిలో ధర్మయుద్ధం చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులను అణచివేయ జూసేవాడెవడికైనా వంశక్షయం కాక తప్పదు!
    తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయజూస్తున్న ప్రతి ఒక్కడికీ రాజశేఖరరెడ్డికి పట్టిన గతి పట్టు గాక!
    ఒక్కొక్క తెలంగాణ విద్యార్థి ఒంటిపై బడ్డ ప్రతి దెబ్బ - తెలంగాణ ఏర్పాటుకు, ధనాహంకారంతో, రాజకీయంతో, అధికారంతో, భౌతికంగా, తుదకు మానసికంగా, అడ్డు పడుతున్న ప్రతి ఒక్కడి పాలిట, ఏడేడు తరాల వరకు మహాపాపమై, దుర్భర శాపమై పట్టి పీడించు గాక!

    పరిత్రాణాయ సాధూనాం
    వినాశాయచ దుష్కృతాం
    ధర్మో రక్షతి రక్షితః

    రిప్లయితొలగించండి
  3. EE SPANDANA KOSAME CHAKORA PAKSHILA CHUSTUNNA.. DHARMAME TELANGANANU KAPADUTUNDI

    రిప్లయితొలగించండి
  4. :)) Stupid. Pandavas were not blatant liers and shameless creatures who indulged in extortions from business/cinema people. You are not even fit Kauravas, they had a sensible point too. Yours is pick-pocketers dharma.

    You will get more than what you deserve, sure ..... from the Police! :)) Earlier the better.

    రిప్లయితొలగించండి
  5. ఒరే పిచ్చి శంకరయ్య!
    రాజసూయ యాగమంటే ఏందిరా? వసూళ్ళు కాదా?
    నాడు పాండవులైనా, నేడు తెలంగాణ వాదులైనా చేసిన వసూళ్ళు, మీలా అవినీతి పాలనతో కోట్లు కోట్లు సంపాదించి స్వంతానికి దొబ్బితినడానికి కాదు. ఆశయ సాధన కోసం అయ్యే ఖర్చు కొరకు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బిర్లా, ఇతర సంస్థానాధీశులు, తుదకు కొందరు బ్రిటిష్ మిత్రుల దగ్గర నిధులు వసూలు చేసిన గాంధిని కూడ నువ్వు ఇలాగే తిట్టగలవు. నీకున్న పురాణ, చరిత్రల జ్ఞానం ఎంత? నువ్వెంత? నీ మొహానికి ప్రపంచమంతా ఉత్కంఠగా పరిశీలిస్తున్న మహోద్యమం గురించి వ్యాఖ్యానించడమా?

    ఇప్పుడు కాదు, ఒక పదేళ్ళ తరువాత క్రౌర్య ప్రవృత్తితో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యను చదువుకో - అప్పుడు నీ మొహం మీద నువ్వే ఉమ్మేసుకొంటావు.

    రిప్లయితొలగించండి
  6. ఒరే పిచ్చి శంకరయ్య!
    రాజసూయ యాగమంటే ఏందిరా? వసూళ్ళు కాదా?
    నాడు పాండవులైనా, నేడు తెలంగాణ వాదులైనా చేసిన వసూళ్ళు, మీలా అవినీతి పాలనతో కోట్లు కోట్లు సంపాదించి స్వంతానికి దొబ్బితినడానికి కాదు. ఆశయ సాధన కోసం అయ్యే ఖర్చు కొరకు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో బిర్లా, ఇతర సంస్థానాధీశులు, తుదకు కొందరు బ్రిటిష్ మిత్రుల దగ్గర నిధులు వసూలు చేసిన గాంధిని కూడ నువ్వు ఇలాగే తిట్టగలవు. నీకున్న పురాణ, చరిత్రల జ్ఞానం ఎంత? నువ్వెంత? నీ మొహానికి ప్రపంచమంతా ఉత్కంఠగా పరిశీలిస్తున్న మహోద్యమం గురించి వ్యాఖ్యానించడమా?
    ఇప్పుడు కాదు, ఒక పదేళ్ళ తరువాత క్రౌర్య ప్రవృత్తితో ఇప్పుడు నువ్వు చేసిన వ్యాఖ్యను చదువుకో - అప్పుడు నీ మొహం మీద నువ్వే ఉమ్మేసుకొంటావు.

    రిప్లయితొలగించండి
  7. ముక్కోడు మీ రాజు, వసూళ్ళు ఆయన బలపరాక్రమంతో షేషిండు అంటావా! గట్లైతే షరే. మంచిగ షెప్పినావ్. మరి అడవులకి గెప్పుడెళ్ళిండు? తెలంగాణ రామాయణమే కాదు, భారతం కూడా వుందా?! అమ్మ!
    ఔ! పెపెంచికమంతా తెలంగాణ ఎప్పుడొస్తుందా అని ఎర్రిమొహాలేసుకుని 54ఏళ్ళుగా చూస్తోంది. నిన్ననే ఓబామా, ఒసామా అదే సెప్పిన్రు. :))

    రిప్లయితొలగించండి
  8. // ఒక్కొక్క తెలంగాణ విద్యార్థి ఒంటిపై బడ్డ ప్రతి దెబ్బ - ఏడేడు తరాల వరకు మహాపాపమై, దుర్భర శాపమై పట్టి పీడించు గాక!//

    అట్లేగానీ, ఏదీ ఇంకా దంచుడు షురూ గేడయిందన్నా, మల్లేష్. పుణ్యాత్ములైన కేరళ పోలీసులైతే బాగా దంచుతారంట, వాళ్ళనే తెప్పిస్తాం, ఫికరు చేయకు. మీకూ బాగా పుణ్యాలు పంచాలని వువ్విళ్ళూరుతున్నారట! :P

    రిప్లయితొలగించండి
  9. snkr,

    "వాస్తవాలు గ్రహించి, అంగీకరించేముందు ఇష్టాఇష్టాలు పక్కకి పెట్టాలి"...
    ఆగాగు! ఇప్పుడు కాదు, తెలంగాణా వచ్చినంక!(ఎందుకంటే వాస్తవమదె గద!)...ఈ మాటలు అప్పుడు కనీసం నీ మనశ్శాంతి కైనా పనికొస్తై!..లేకపోతే అశాంతితో పోతావ్!...జాలిపడి చెబ్తున్న!

    రిప్లయితొలగించండి
  10. "54ఏళ్ళుగా పోరడుతున్నం, దీచ్చలు చేస్తున్నం, భూకంపాలు పుట్టిస్తున్నం, నరుకుతున్నం, తరుముతున్నం, షర్టులిప్పి ఓ.యు.లో ఫోటోలు దిగుతున్నం " వినీ వినీ విసుగొస్తోంది. ఆఖరికి కేశవరావు కూడా 8ఏళ్ళనుంచి చేత్తుండంట - దీచ్చ! :))

    చాలు చాల్లోవోయ్, అనామకా. మీవి చెక్కనోళ్ళైతే ఎప్పుడో పగిలివుండేవి. జాలి గీలి అన్నవంటే... జగన్ ను పంపిస్తా , ఖబడ్దార్! బుగ్గలు, ముక్కు కసకసా నిమిరేస్తడు. :)
    నీ ఏడుపు చూస్తుంటే సీమ ఆంధ్రా అంతా తెలగాణాకే రాసివ్వాలని వుందోయ్ ఏడుపుగొట్టు అజ్ఞాతాచారి..:).

    రిప్లయితొలగించండి
  11. శ్రీకృష్ణుడే తీర్పు చెప్పిన తర్వాత ఇంకా ఈ శాపినార్ధాలతో మాకు పనిలేదు. మిమ్మల్ని మీరు పాండవులు ఎట్టనుకుంటారే? మొన్ననే మీ ఉన్మాదియా యూనివర్శిటీ లో ఆర్యులు మమ్మల్ని దోచుకున్నారు అని దీపావళి మా పండగ గాదని, కృష్ణుడు మా దేవుడు గాదని, మాకు నరకాసురుడు దేవుడని ధూం ధాం చేసారుగా.

    రిప్లయితొలగించండి
  12. ఒరే అగ్నాతా, మనస్పూర్తిగా ఇవ్వటం, బెదిరించి గుంజుకోటం ఒకటేనా? నెత్తిన రూపాయి పెడితే పది పైసలకు కూడా కొనని మీ మొహాలకు ఎవడూ ఐదు పైసలు కూడా ఇవ్వడు.

    రిప్లయితొలగించండి
  13. ప్రపంచమంతా ఉత్కంఠగా పరిశీలిస్తున్న మహోద్యమం.. ROFLLLLLLLLLLLLL.

    రిప్లయితొలగించండి