మృత్యువు. ఈ పదం అంటే మనలో భయం లేనిదెవరికి? ఈ చావును తప్పించుకోవటానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు.. ఒక మనిషి బతకడని తెలిసిన తరువాత కూడా చివరి క్షణం వరకూ అతణ్ణి బతికించటం కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడం.. మనకు చావంటే అంత భయం. కానీ, మృత్యువును కోరి ఆహ్వానించే వారూ ఉన్నారు.. వారికి మృత్యువు ఒక వరం.. దాని కోసం అంతదూరం వెళ్లి మరీ మరణాన్ని ఆహ్వానిస్తారు. దాని కోసం వేచి చూస్తారు. ఆనందంగా మరణిస్తారు. ఎందుకింత ఆనందం.. ఇక్కడే ఎందుకు చనిపోవాలి?
అక్కడే చనిపోవాలి.. అక్కడ చనిపోతే కైలాసంలోకి వెళ్లి శివుడిలో ఐక్యం చెందినట్లే.. సాక్షాత్తూ శివుడి సమక్షంలో మోక్షాన్ని సాధించినట్లే.. భారతీయుల్లో వేలాది ప్రజలు మృత్యువును కోరుకుంటున్న ప్రదేశం అది. ఆ స్మశానం అతి పవిత్రం.. ఈశ్వరుడు తాను దగ్గరుండి జీవులను తనలో ఐక్యం చేసుకునే స్మశానం.. ఏమిటీ స్మశానం ప్రత్యేకత? ఇక్కడ అంతిమ సంస్కారం కోసం ఎందుకు తాపత్రయ పడాలి? నిజంగా మరణం తరువాత మరో జీవితం అనే ఉంటుందా? దీని వెనుక మర్మమేమిటి?
-------------------
అదొక స్మశాన వాటిక. అన్నింట్లో మాదిరిగానే ఇక్కడా చనిపోయిన వారిని తీసుకువచ్చి దహన క్రియలు చేస్తుంటారు. కానీ, ఇక్కడే తేడా ఉంది. ఇక్కడ చితి మంటలకు విరామం ఉండదు.. దహన కాండకు అంతు ఉండదు.. అనంతంగా అంతిమక్రియలు జరుగుతుంటాయి. అఖండంగా చితి మంటలు కాలుతుంటాయి. ఒకదాని వెంట ఒకటిగా శవయాత్రలు జరుగుతూనే ఉంటాయి. అంతిమ సంస్కారం కోసం క్యూలు ఉంటాయి.
సమయం ఉండదు.. దహనకాండలు నిర్వహించేందుకు రోజులో ఉన్న 24 గంటలు ఎంతమాత్రం సరిపోవు. సమయం తగ్గించుకోవటానికి ఒక చితిపై మరో చితిని పేర్చేస్తారు. ఒక శవం మూడు వంతులు కాలిందో లేదో పక్కనే ఉన్న నదిలోకి తోసేసి మరో దహన కాండను చేపడతారు.. ఆ నదిలో ఆ భౌతిక దేహం భాగాలు కొట్టుకుపోతాయి.
చూసే వాళ్లకు అసహ్యం వేస్తుంది.. జుగుప్స కలుగుతుంది. భయం వేస్తుంది. శవాల్ని పూర్తిగా దహనం కూడా చేయకుండా నదిలోకి ఎందుకు విసిరేస్తున్నారన్న ఆగ్రహమూ కలుగుతుంది.. అసలు అక్కడ వేరే స్మశానాలు లేవా? వేరే చోట దహనం చేయవచ్చు కదా? అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించాలన్న జిజ్ఞాస చనిపోయిన వారి బంధువులకు ఉండదా? వారిని ఏం చేసినా తప్పు లేదన్న విసుగూ కలుగుతుంది..
నిజమే చూస్తుంటే పరమ భయంకరంగా కనిపించే చోటు.. ఎక్కడో, ఎప్పుడో సినిమాల్లో నరకంలో శిక్షలను చూశాం...ఇది అలాంటిదేనా? ఈ స్మశానానికి ఎందుకింత గిరాకీ.. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తూ పరమేశ్వరుడే కాటికాపరిలా ఉన్నాడు.. ఇక్కడే ఆయన నివాసమున్నాడు. ఈ చితాభస్మమే ఆయన విభూతిగా మారుతోంది. ఈశ్వరుడు కొలువైన స్మశానమది. మణికర్ణికా స్మశాన ఘట్టం అది. సత్యహరిశ్చంద్రుడు కాపలాగా ఉన్న స్మశాన వాటిక అది. ఈశ్వరుడు విశ్వనాథుడిగా ఉన్న స్మశానమది. వారణాసి... బెనారస్.. కాశీ.. క్రైస్తవులకు జెరూసలేం ఎలాంటిదో.. హిందువులకు కాశీ అలాంటిది.
...........................................
శైవక్షేత్రానికి తోడు పవిత్రమైన గంగానదీ తీరం.. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించటం, దేవుణ్ణి దర్శించటం ఎంత ముఖ్యమో, ఇక్కడ చనిపోవటం అంత ముఖ్యం. ఇక్కడికి వచ్చిన వారికి ఒకటే కోరిక.. మరణించటం. అదే స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగటమే పరమపదం. ఇది విపరీతం కాక మరేమిటి? వారణాసికి ఎందుకింత క్రేజి?
మామూలుగా ఆధ్యాత్మిక క్షేత్రం అంటే అక్కడికి వెళ్లాలి.. నదిలో స్నానం చేసి, దేవుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తిరిగి వస్తాం.. కానీ, కాశీకి వెళ్తే కాటికి వెళ్లినట్లే.. కాటికి వెళ్లేందుకే కాశీకి వెళ్లాలి. దీనికి కారణం ఆ స్మశాన వాటికే.. అక్కడే దహనం కావాలి. ఆ గంగలోనే అస్థికలు కలవాలి. అప్పుడే మోక్షం కలుగుతుంది. శివసాన్నిధ్యం దొరుకుతుంది. గంగా తరంగాలలో ప్రతిధ్వనించే భక్తుల మనోరథమిది.
ఎవరేమన్నా సరే.. అసహ్యమేసినా సరే.. తమ వారి శరీరాన్ని సగం కాలగానే గంగలోకి తోసేసినా సరే.. వెనక్కి తగ్గేది లేదు. అంత్యక్రియలు ఆ ఘాట్‌లోనే జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఇది సత్య హరిశ్చంద్రుడు కాపలా కాసిన స్మశాన వాటిక. ఈ స్మశాన వాటికలో మహా విష్ణువు తన సుదర్శన చక్రంతో భూమిని కట్ చేసి బావిని ఏర్పాటు చేశాడట. ఆ బావిలో విశాలాక్షి పార్వతీదేవి చెవిరింగులు పడిపోయాయి. అందుకే ఈ స్మశాన వాటికకు మణికర్ణిక అన్న పేరు వచ్చింది.
ఇక్కడ అణువణువూ భక్తి భూమిక అనంతంగా ఉంటుంది. ఒక విశ్వేశ్వరుడు మాత్రమే కాదు.. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో కాశీ ఒకటి. అన్నింటికీ మించి దేవనది గంగమ్మ ఈశ్వరుడి పాదాల చెంత నుండి ప్రవహిస్తున్నది. ఇన్ని ఆధ్యాత్మిక భావభూమికలు ఒకచోట కలగలిసిన ఆధ్యాత్మిక భూమి మరెక్కడా కనిపించదు.
ఇక్కడి గంగా నదిలో స్నానం చేస్తే సాధారణంగా కలిగే శరీర వికారాల నుంచి ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుందంటారు. ఇక్కడ విశాలాక్షిగా ఉన్న పార్వతీదేవి అన్నపూర్ణగా భక్తులను ఆదరిస్తుంది. ఎంతమంది వచ్చినా ఇక్కడ భోజనానికి లోటు ఉండదు. ఇది బెనారస్‌లోని ప్రత్యేకత. ఈ స్మశానాన్ని శివుడి కైలాసంగా భావిస్తారు కాబట్టే ఇక్కడ చనిపోవటం ఒక వరంగా భక్తులు విశ్వసిస్తారు.
........................................
మళ్లీ అదే ప్రశ్న.. ఎవరికీ అర్థం కాని.. అవగాహన లేని ప్రశ్న... జవాబు తెలియని ప్రశ్న.. అదే.. చనిపోవటం వరం అని అనుకోవటం ఏమిటి? పిచ్చితనం కాకపోతే.. ? అదీ ఇంతదూరం వచ్చి చనిపోవటం విడ్డూరం కాక మరేమిటి? అదీ ఒక చితిపైన మరో చితి పేర్చటం.. ఒక శవాన్ని కాలకుండానే మరో శవాన్ని దహనం చేయటాన్ని ఎలా అంగీకరిస్తున్నారు.. మూఢనమ్మకం కాదా ఇది? దీని వల్ల పర్యావరణ వేత్తలూ గగ్గోలు పెడుతున్నారు.. గంగమ్మ కాలుష్యమైపోతోందని.. దీనికి పరిష్కారం వెతకలేక సర్కారూ చేతులెత్తేసింది.? ఎందుకింత వెర్రి? ప్రపంచానికి, మన దేశానికి లైఫ్ స్టైల్‌లో చాలా తేడా ఉంటుంది. ఎంతగా వెస్ట్రన్ కల్చర్‌ను మనం అడాప్ట్ చేసుకున్నా, బేసిక్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పుట్టుక నుంచి చావు దాకా మన లైఫ్‌స్టైల్ ఒక స్పెసిఫిక్ టార్గెట్‌తో సాగుతుంది. జీవితంలో కుటుంబం పట్ల, సమాజం పట్ల ధర్మాన్ని నిర్వర్తించటం, తగినంత సంపాదించుకోవటం, విజయం సాధించటం, జీవితంలో సుఖాలను అనుభవించటం, కోరికలను తీర్చుకోవటం, చివరకు ప్రశాంతంగా చనిపోవటం.. ఇది ఒక ట్రెడిషనల్ లైఫ్‌స్టైల్.. దీనికి పురాణాలు ధర్మ, అర్థ, కామ మోక్షాలని పేర్లు పెట్టాయి. ఇదిగో ఈ చివరిదైన మోక్షం కోసమే కాశీలోని స్మశాన వాటికకు జనం వస్తారు.
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దానికి ముందు నుంచే గంగానదీ తీరంలో నాగరికత అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతికా అంటూ గరుడపురాణంలోనే స్పష్టంగా కాశీ గురించి ప్రస్తావించారు. వారణాసి క్రీస్తుపూర్వం అయిదు వందల సంవత్సరాలప్పుడే ఏర్పడింది. మొదట్నుంచీ కూడా హిందూ సంప్రదాయాలను పూర్తిగా అనుసరిస్తున్న నగరం వారణాసి మాత్రమే. పుట్టడం, పెళ్లి చేసుకోవటం, జీవితంలో విజయం సాధించటం, మరణించటం.. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనిషి జీవితంలో జరగాల్సిందే. అందులో చివరిదైన మృత్యువు మాత్రం కాశీలోనే రావాలి.
కాశీ అంటే శివుడి మహా స్మశానం అని అర్థం. ఈ మహా స్మశానానికే శ్రీరాముడి పూర్వీకుడైన హరిశ్చంద్రుడు కాపలా కాశాడు. ధర్మాన్ని నిలబెట్టాడు. సత్యవ్రతాన్ని నిరూపించాడు.
సాక్షాత్తూ ఈశ్వరుడు లయకారుడై చనిపోయిన వారి ఆత్మలను తనలో లయం చేసుకుంటాడని బలమైన విశ్వాసం కాబట్టే ఈ మణికర్ణికాఘాట్‌లో అంత్యక్రియల కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు. చరమాంకంలో కాశీకి వచ్చి అక్కడే శేషజీవితాన్ని గడిపేసి ఆ స్మశాన వాటికలోనే లయమైపోతారు.
ఎందుకింత విపరీతం అన్నదానికి హేతుబద్ధత లేదు. భక్తుల విశ్వాసమే ఇందుకు ప్రాతిపదిక. భారతీయ సంస్కృతిలోని అనంతమైన మోక్ష సాధనే ఈ బలమైన కోరికకు అసలు కారణం. చనిపోయిన తరువాత ఆత్మ అనేది ఉంటుందనే నమ్మకం. ఈ ఆత్మ దేవుడిలో లీనం కావాలనే కోరిక.. ఇవన్నీ కాశీలో, అదీ మణికర్ణికా ఘాట్‌లో అంతిమ ఘట్టం పూర్తయినప్పుడే జరుగుతాయనే భావనకు హేతువులు వెతకటం సాధ్యమేనా?
-----------------------------
చనిపోవటాన్ని మనిషి తానుగా కోరుకోవటం మన జీవన విధానంలో ఉన్న గొప్ప లక్షణం. ఒక జీవితానికి ముగింపు ప్రశాంతంగా సాగిపోవాలి. మృత్యువు తప్పదని తెలిసి తెలిసీ, దాన్నుంచి పారిపోవటం వెర్రితనం.. ఎంతగా పారిపోయినా, అది రాకుండా పోదు. ఇది అందరికీ తెలిసినా, చివరి వరకూ ఏదోరకంగా దాన్నుంచి దూరం కావటానికి ప్రయత్నిస్తారు.. కానీ, కాశీకి వెళ్లిన వారికి మాత్రం జీవితం ప్రశాంతంగా ముగిసిపోవాలన్న కోరిక కలుగుతుంది. ఆ ప్రదేశంలోని గొప్పతనం అదే.. అయితే శవాల దహనకాండ ఇంత దారుణంగా ఉండటాన్ని మాత్రం ఎలా అంగీకరిస్తున్నారన్నదే ఎవరికీ అంతుపట్టని ప్రశ్న..
వారణాసికి ప్రతి నెలా దాదాపు లక్ష మంది యాత్రికులు వస్తుంటారు. గంగానదిలో రోజూ పవిత్ర స్నానాలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో ప్రతి నెలా దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఇక్కడికి వలసలు వస్తుంటారు. వీరంతా ఇక్కడే తమ జీవితాన్ని ముగించాలన్న ఉద్దేశంతో వచ్చేవారే.. ఇక్కడే చనిపోయే వారే.
కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో, గంగానదీ తీరంలో కనీసం వంద ఘాట్‌లు ఉంటాయి. వీటిలో ఎక్కు స్నాన ఘాట్‌లు ఉంటే క్రిమేషన్ ఘాట్‌లు పాతిక దాకా ఉంటాయి. వీటన్నింటికీ కూడా ఏదో ఒక స్థల పురాణం చెప్తారు. పురాణ కథ వినిపిస్తారు. ఇన్ని స్మశాన వాటికలు ఉన్నా, మణికర్ణికా ఘాట్‌కు ఉన్న డిమాండ్ సామాన్యమైంది కాదు.
ఈ స్మశాన వాటికలోనే ఎందుకు దహనం కావాలి? సగం కాలిన శరీరాన్ని గంగలోకి విసిరేసినా ఎందుకు ఒప్పుకోవాలి? గమ్మత్తేమిటంటే, కొందరి భౌతిక దేహాలను ఎలాంటి దహన కాండ చేయకుండానే, ఖననం లాంటి క్రియలు చేయకుండానే నేరుగా గంగలో వదిలేస్తారు. ఈ శవాలను వామాచార పద్ధతిలో రుద్రుని పూజించే అఘోరాలు సేకరించి వాటికి పూజలు చేసి ఉపాసిస్తారు. కొందరు అఘోరాలు ఈ శవాలను ఆహారంగా కూడా స్వీకరిస్తారు. సామాన్య లోకానికి అర్థం కాని భయంకరమైన జీవితాలను శవాలతో సహవాసం చేస్తూ గడుపుతారు.
ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం లేకపోలేదు.. మనిషి చనిపోయిన తరువాత స్వర్గానికి కానీ, నరకానికి కానీ వెళ్తాడనేది నమ్మకం. కాశీలో చనిపోతే నరకబాధలు ఆత్మకు ఉండవు. ఆ బాధలన్నీ తమ భౌతిక దేహానికి ఈ భూమి మీదే అనుభవంలోకి వచ్చేస్తాయి. అన్ని రకాల శిక్షలూ ఇక్కడే లభిస్తాయి. మణికర్ణికా స్మశాన వాటికలో కాటి కాపరులు శిక్షిస్తారు.. గంగానది శిక్షిస్తుంది. అఘోరాలు శిక్షిస్తారు. ఈ జన్మలోని కర్మలన్నింటికీ ఫలితాలు ఇక్కడ అంతమైనప్పుడే లభిస్తాయి. తరువాత లభించేది మోక్షమే.
ఈ మోక్షం కోసమే కాశీకి జనం వెళ్తారు. ఈ మోక్షం కోసమే హరిశ్చంద్రఘాట్‌లో అంతిమ సంస్కారానికి ఆరాటపడతారు.. ఈ మోక్షం కోసమే మృత్యువును వరంగా కోరుకుంటారు. ఈ మోక్షం కోసమే చకోరపక్షుల్లా ఇక్కడ ఎదురు తెన్నులు చూస్తుంటారు..
సైన్స్‌కు ఇది నచ్చదు. పర్యావరణానికి ఇది సరిపడదు. హేతువాదానికి ఇది అంతుపట్టదు. భక్తి, విశ్వాసాలకు ఇది పతాక సన్నివేశం. శరీరంపై అంతులేని ప్రేమకు చితిపేర్చే మహా స్మశానం. మణికర్ణిక.. భూతనాధుడి అస్తిత్వానికి గుర్తు. మోక్ష సాధనకు ఇది చివరి స్థానం.

0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి