తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు ప్రజల్ని మరోసారి నయవంచన చేశారా? ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలందరిలోనూ వ్యక్తమవుతున్న ఆగ్రహం వెనుక దాగిన సందేహం ఇది... స్పీకర్ తనకు సమర్పించిన రాజీనామాల్లో 129 రాజీనామాలు ఆమోదయోగ్యం అయ్యేలా ఆర్డర్‌లో లేవని విస్పష్టంగా తేల్చి చెప్పి తిరస్కరించటం ప్రజలకు మింగుడుపడని అంశం... ఈ 129 మందిలో తెలంగాణా వారితో పాటు ఆంధ్ర, రాయలసీమ నేతలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ, తెలంగాణా ప్రధానాంశం నేపథ్యంలో ఉద్యమాలు సాగుతున్న నేపథ్యంలో నేతలు నిజాయితీ మరచి కావాలనే ఇలా చేశారా? ఇంతకాలం వాళు్ల చేస్తున్న ఆందోళన అంతా ప్రజల్ని మభ్యపెట్టడానికేనా?
తెలంగాణా నేతలు అంతా తుస్సు మనిపించారు.. ఇంతకాలం వాళు్ల చేసిన ఉద్యమం అంతా ఒఠ్ఠిదేనని తేలిపోయింది... రాజీనామాలతో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తామని ప్రభుత్వాన్ని నడవనీయకుండా అడ్డుకుంటామని పోటీలు పడి ప్రసంగాలు చేసిన వాళ్లందరిదీ నాటకమేనని స్పష్టమైంది. స్పీకర్‌కు వాళు్ల చేసిన రాజీనామాలన్నీ ఉత్తుత్తివేనని స్పీకర్ తేల్చేశారు..
ఆంధ్రప్రదేశ్ విభజన గురించి విద్యార్థులు ఉద్యమాలు ప్రారంభించినప్పటి నుంచీ రాజకీయ నాయకులు ఉపన్యాసాలకు, సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారు..ఏనాడూ ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనలేదు. ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వెళ్లి అడపాదడపా సంఘీభావం తెలపడం తప్ప వాళు్ల ప్రత్యక్షంగా ఉద్యమంలో పాలుపంచుకున్నది లేదు. పైగా ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేసి విద్యార్థుల ఆగ్రహానికి గురైన సందర్భాలూ ఉన్నాయి.
ప్రజల్లో భావోద్వేగాలు పెరిగిపోయిన తరువాత రాజకీయ పార్టీలన్నీ ఒక్క వేదికపైకి రాకతప్పలేదు. అన్ని పార్టీలూ కలిసి జెఏసి పేరుతో ఓ కుంపటి పెట్టుకుని రాజీనామాల డ్రామా నడిపించాయి. హైదరాబాద్‌లో కూర్చుని మీటింగుల మీద మీటింగులు పెట్టుకుని తెగ మంతనాలు జరిపాయి.
ఉస్మానియాలో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో కెసిఆర్ పార్టీ సభ్యులు తెగ ఆవేశంతో స్పీకర్ ఇంటి ముందుకు వెళ్లి రాజీనామాలు ఆమోదిస్తారా లేదా అంటూ రాత్రిపూట హడావుడి చేసి అరెస్టులు కూడా అయ్యారు.. ఈ డ్రామాలో హరీష్, కెటిఆర్, ఈటెల వంటి వారు పాల్గొన్నారు కూడా..
తమతో పాటు మీరూ రాజీనామాలు చేయకపోతే ఇక ఊరుకునేది లేదంటూ ఇతర పార్టీల వారికి డెడ్‌లైన్ల విధింపులు ఎప్పటిలాగే టిఆర్‌ఎస్ మేధావులు చేసేశారు... కాంగ్రెస్ వాళూ్ల ఒత్తిడికి లోనైనట్లే కనిపించారు... చివరకు జనవరి 28 తేదీ గడిచిపోయింది. సహజంగానే గడువూ వారం రోజులు పొడిగించేశారు.. తీరా చూస్తే అంతా తుస్సేనని తేలిపోయింది. అసలు రాజీనామాలు ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు కదా.. ఏ గడువుకైనా విలువ ఉండేది..?
ఇవాళ రాజీనామాల తిరస్కరణతో తెలంగాణ నేతల డొల్లతనం ఏమిటో అర్థమవుతోంది... రాజీనామాలను తాము సమర్పిస్తున్నప్పుడు అవి సరైన పద్ధతిలో ఉన్నాయా లేదా అన్నవి వాళ్లకు తెలియవా? లేక తెలిసే ఇలా చేశారా? ప్రతిరోజూ తమ ప్రాంతంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.
విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని పణంగా పెట్టి ఆందోళనల్లో పాల్గొంటున్నారు...
మరి ప్రజాభీష్ఠాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకువెళ్లాల్సిన నాయకులు మాత్రం ఇలా వ్యవహరిస్తే ప్రజల్లో విశ్వసనీయత ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా జెఎసి పేరుతో వీళు్ల చేసిన ప్రసంగాలు, సందేశాలు.. వేటిల్లోనూ చిత్తశుద్ధి లేనట్లేనా? ప్రజల్లో విశ్వాసమే కల్పించలేని వాళు్ల ఇక రాషా్టన్న్రి ఎలా సాధిస్తారు? జనాల్ని మభ్యపెట్టి వీళు్ల సాధించదలచుకున్నదేమిటి? రాజీనామాలను స్పీకర్ తిరస్కరించారు.. జనం వెర్రివాళై్ల స్పీకర్ నిర్ణయాన్ని చూస్తూ ఉండిపోయారు.. ఇప్పుడు నేతలు ఏం చేస్తారు?
30, జనవరి 2010, శనివారం
28, జనవరి 2010, గురువారం
తెలంగాణాపై కమిటీ ఏర్పాటు పూర్తయింది
చిదంబరం మరో ప్రకటన చేశారు.. అంతా ఊహించినట్లుగానే తెలంగాణాపై కమిటీ వేస్తున్నామన్నారు.. ‘‘ తెలంగాణాపై కమిటీ ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వారాంతం లోగా తుది రూపం వస్తుంది. వచ్చే వారంలో కమీటీని ప్రకటించవచ్చు. తెలంగాణాలో ఆందోళనలు దాదాపుగా తగ్గిపోయాయి. అక్కడక్కడ కొద్ది కొద్దిగా నిరసనలు జరుగుతున్నాయి. కాకపోతే కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటమే విచారకరం.. పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి. వాటిని అడ్డుకునే బాధ్యత తల్లిదండ్రులపై, ఉపాధ్యాయులపై, స్నేహితులపై ఉంది. మేము మా మాటలకు కట్టుబడి ఉన్నాం.. ఇలాటి చిన్న చిన్నవి తప్పిస్తే శాంతిభద్రతల పరిస్థితి మొత్తం మీద నియంత్రణలోనే ఉంది. కమిటీ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. దాని స్వరూపం మాత్రం ఇప్పుడే చెప్పలేను..’’.
మొత్తం మీద చిదంబరం మరో ఫీలర్ వదిలారు.. రాజకీయాలు వేడెక్కినప్పుడు.. ఆందోళనలు రేగినప్పుడు... వాటి దిశను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నది. అందులో భాగమే చిదంబరం నోట మరో మాట.. డిసెంబర్ ౯న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడటం దగ్గర నుంచి కేంద్రం ఈ వ్యవహారాన్ని అతి సున్నితంగా డీల్ చేస్తూ వస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా తొలి ప్రకటన చేసిన తరువాత వెల్లువెత్తిన నిరసనలను చల్లార్చేందుకు రెండో ప్రకటన చేశారు.. వ్యవహారం తెలంగాణాలో రివర్స్ కావటంతో ఏకంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ అనిపించారు.. శాంతియుతంగా ఉండండంటూ సందేశం ఇచ్చారు.. ఇప్పుడు రాజీనామాల బెదిరింపులను సమాధానపరచటానికి కమిటీ ప్రకటన చేశారు.. దీని వల్ల కాంగ్రెస్ నేతలు కొంతవరకు సంతృప్తి పడవచ్చేమో కానీ, మిగతా పార్టీల నేతలు సంతోషపడే పరిస్థితి కనిపించటం లేదు.. చిదంబరం ప్రకటనను ఎవరికి తోచిన రీతిలో వారు అర్థం చేసుకుంటున్నారు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఏర్పాటు దిశగా సాగే ప్రయత్నంలో భాగంగానే కమిటీ అంటుంటే.. స్పష్టత లేని ప్రకటనలు మోసం చేసేందుకేనని మిగతా పార్టీల వాదన... అటు సీమాంధ్ర నేతల్లోనూ అంతగా సంతృప్తి కనిపించటం లేదు.. తెలంగాణ ఏర్పాటు చేయటం కోసమే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారంటూ రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ విస్పష్టంగానే చెప్పుకొచ్చారు.. ఇక మిగిలింది పంపకాలేనంటూ ఆయన తేల్చేశారు కూడా... అటు తెలుగుదేశం నేతలు పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ లాంటి వారు కూడా ఈ ప్రకటన బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు లొంగటమేనన్నారు.. తెలంగాణ తెలుగుదేశం నేతలు మాత్రం విస్పష్టంగా ప్రకటన చేస్తే తప్ప ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు.. వెరసి కర్రవిరక్కుండా, పాము చావకుండా చిదంబరం మరో నాలుగు మాటల అస్త్రాలను రాష్ట్రంలోని ఇరుపక్షాల మధ్యలో విడిచిపెట్టారు..అటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రం ఎలాంటి కమిటీలను అంగీకరించేది లేనేలేదు పొమ్మంటోంది. ఇక నేతల ఇళ్లను ముట్టడించటమే తరువాయి అని కూడా స్పష్టం చేసింది. చిరంజీవి సానుకూలంగానే స్పందించారు.. వైఖరి స్పష్టం కాని పార్టీలకు ఇబ్బంది కానీ, కమిటీతో మాకేం నష్టం లేదన్నది ఆయన వాదన.. ఇక చంద్రబాబు ఏం మాట్లాడతారో తెలియదు.. అసలు మాట్లాడతారో లేదో కూడా తెలియదు.. ఇక మూలవిరాట్టు కెసిఆర్ మీడియా ముందుకు రావలసి ఉంది... జెఏసి ఏదో ఒకటి తేల్చుకుంటే కానీ ఆయన మాట్లాడరు.. మొత్తం మీద జనవరి ౨౮ డెడ్‌లైన్ ఏదీ తేల్చకుండానే తేలిపోయింది.. తెలంగాణ ఉద్యమ కారులు ఇప్పుడేం చేస్తారు? వేచి చూడాలి..

25, జనవరి 2010, సోమవారం
సుప్రసన్న ‘అంతరంగం’

written by - డా.లక్ష్మణ చక్రవర్తి
(సుప్రసన్నాచార్య ‘అంతరంగం’కు నేడు ఢిల్లీలో సాహిత్య అకాడమి ‘టాగూరు సాహిత్య పురస్కారం’ ప్రదానం చేసిన సందర్భంగా)
అనుభూతి, అనుభవం ఇవి రెండు ఒకే వ్యక్తిలో ఉంటే అంతరంగం సుప్రసన్నమౌతుంది. అనుభూతిని అనుభవానికి తెచ్చుకుని అంతరంగాన్ని ఆవిష్కరించగలగడం అందరూ చేయగలిగిన పని కూడా కాదు.
నలభై ఏళ్లుగా సృజన/విమర్శ రంగాలలో తమదైన ముద్రను ప్రదర్శిస్తూ తమ అంతరంగాన్ని ఈ రెండు రంగాలలోను ఆవిష్కరిస్తున్నవారిలో ప్రత్యేకంగా చెప్పదగినవారు ఆచార్య కోవెల సుప్రసన్న. సృజనమూలాలు విమర్శ చైతన్యం రెండూ వేర్వేరు తీరాలు.
హృదయం ద్రవించి ఏ తీరాన్ని చేరుతుందో దానినిబట్టి సృజన/విమర్శ ఏర్పడతాయని భావించే వర్గానికి ప్రతినిధిగా నిలిచేవారు వీరు. గత ౪౦ ఏళ్లుగా సృజనాత్మక, శాస్త్ర వాఙ్మయ గ్రంథాలకు రాసిన పీఠికలన్నీ కలిపి ‘అంతరంగం’గా సృజనలోకం (వరంగంల్) వారు ప్రచురించారు. ఇందులో ౬౮ పీఠికలున్నాయి.
పెద్దల స్తుతిరూపంలో ప్రాచీనాంధ్ర కవుల పీఠికలుంటే పెద్దలే రచించినవి ప్రస్తుత పీఠికలు. రెండవ పద్ధతికి సంబంధించిన పీఠికలు ఇవి. చాలావరకు పీఠికలు గ్రంథాన్ని, గ్రంథకర్తను ప్రోత్సహించి ముగించినట్లుగా, గ్రంథ విశేషాలతో కూడినట్లుగా ఉంటాయి. ఈ పద్ధతికి భిన్నంగా ఉండడమే ఈ పీఠికల విశిష్టత. సుప్రసన్న ఈ పీఠికల ద్వారా కొత్తమార్గం వేశారని చెప్పవచ్చు. రచన, రచయిత కంటే రచనలోని అంశానికి సంబంధించిన విస్తృత విషయాలను అందించడం ఆ కొత్తమార్గం.
౧౯౬౬లో సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘వసుచరిత్ర’కు సంపాదకునిగా రాసిన పీఠిక నుండీ, సాహిత్యలోకంలోకి ఇటీవల వచ్చిన ‘భారతీయ జ్వలిత చేతన-బంకించంద్ర చటర్జీ’ వరకు పయనించిన వారి పీఠికలు ఇందులో ఉన్నాయి. కాలక్రమంగా కాకుండా విషయ ప్రధానంగా పీఠికలు కూర్చడం బాగుంది. విషయం అర్థం చేసుకునేందుకు వీలు కలిగింది. ఒక అంశానికి సంబంధించిన పీఠికలను ఒక దగ్గరగా చదువుకుంటే ఆ విషయానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది.
సాహిత్య చరిత్ర, విమర్శకులకు సంబంధించిన పీఠికలు ముందుగా చేర్చడం, స్వీయ రచనలు, భగవత్ సంబంధ రచనలు దేశభక్తి, విశ్వనాథ, శాస్త్ర వాఙ్మయ విషయాలకు సంబంధించినవి వరుసగా చేర్చడం వలన విషయ విస్తృతి తెలుస్తుంది. భట్టుమూర్తి వసుచరిత్రకు రాసిన పీఠిక మధ్యయుగ ప్రబంధాల అధ్యయనానికి ఒక నూతన మార్గాన్ని వేసింది.
కథను మూడంచెలుగా భట్టుమూర్తి నిర్వహించినట్లు వారు ప్రతిపాదించడంతో తర్వాతి కాలంలో ప్రబంధాలలో ఉన్న సంకేత శిల్పాన్ని చాలా మంది అధ్యయనం చేయడానికి దోహదం చేసింది. ఉపరిచరంలో వసువృత్తాంతం, ఇంద్రవృత్రాసురుల కథ, జలకథ ఈ మూడు పొరలలో కథ నడిచిందని ప్రతిపాదించారు. మహాకావ్య నిర్మాణానికి ఉపబలకంగా ఉండే అన్ని అంశాలు ‘శిల్పం’లో ఉంటా యి. ఈ శిల్పం ద్వారా కావ్య నిర్మాణాన్ని కవి చేసిన తీరును ఈ పీఠిక తెలియజేస్తుంది.
చేతనావర్తం ఆధునిక సాహిత్యలోకంలో తెచ్చిన మార్పు దేశీయమైంది. వైయక్తిక, సామాజిక అనుభూతులను వ్యక్తీకరించడంలో చేతనావర్త కవులు కొత్త దారులు వేశారు. ఈ పీఠికలో డార్విన్, ఫ్రాయిడ్, మార్క్స్, ఐన్‌స్టీన్ చేసిన శాస్త్రీయ భావాలపైన ఆధునికత నిలిచిందన్నారు. ౧౯౬౦ వరకున్న సాహిత్య వాతావరణాన్ని కూలంకషంగా చర్చించి, ఐహిక, భావ, ఆధ్యాత్మ రచన చేసేవారు చేతనావర్త కవులని భావించారు. సహృదయుడి నేపథ్యంతో విమర్శ నిర్మించవలసి ఉందన్న ప్రతిపాదన చేశారు. ఆధునిక సాహిత్య పరిణామాన్ని సూచించే పీఠిక ఇది.
స్వీయరచనల పీఠికల్లో పాంచరాత్రాగమశాస్త్ర అవగాహన తెలుస్తుంది. హనుమంతుడు, నృసింహుడు మొదలైన విషయాలపై రచించిన సిద్ధాంత వ్యాసాలు, సృజనాత్మక రచనలకు రాసిన పీఠికల్లో ఆయా భగవత్తత్వాలు తెలుస్తాయి. కృష్ణతత్త్వానికి సంబంధించిన పీఠికలు అంతరంగంలో ఎక్కువ. ఉత్పలవారి భ్రమరగీతాలకు రాసిన పీఠిక కృష్ణతత్త్వక్రమ పరిణామాన్ని చెబుతుంది.
ముదిగొండ వీరభద్రమూర్తి వందేమాతరం, బంకించంద్ర గ్రంథానికి రాసిన పీఠికలు భారతీయ జీవనమూల్యాలు పరిష్కృతం కావడానికి కారణమైన వారిని చెబుతూనే ప్రస్తుత కర్తవ్యాన్ని వివరిస్తాయి. కేతవరపు రామకోటి శాస్త్రి నాచన సోముడుకు రాసిన పీఠిక/సోమనపై వచ్చిన విమర్శ గ్రంథాలను ప్రస్తావించి తుమ్మపూడి వారిది సమగ్రమైందని సమన్వయ పూర్వకమైందని నిష్పాక్షికంగా చెప్పారు.
అంతరంగంలోని పీఠికలు పుస్తకం అట్టమీద ఉన్నట్టు ‘పీఠికలు కేవలం ప్రశంసలు కావు. కావ్యగర్భంలోనికి ప్రవేశించి దాని పరమార్థాన్ని వ్యాఖ్యానించేవి. పీఠికలో రచన/ రచయిత కంటే దానిచుట్టూ ఉన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన పాఠకుడి జ్ఞానం మరింత విస్తృతమవుతుంది.
ఇందులోని సాహిత్య చరిత్ర విమర్శ వికాసాలకు సంబంధించిన పీఠికలు ఆయా రంగాల్లోని కొత్త మార్గాలను చెబుతున్నాయి. అయితే సుప్రసన్నగారి విస్తృత విషయ పరిజ్ఞానం పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏ పీఠికకు ఆ పీఠికగా అధ్యయనం చేస్తే ప్రతి పీఠికా విజ్ఞాన సర్వస్వమవుతుంది. ఒక్కో పీఠిక ఒక్కో విమర్శాంత రంగాన్ని ఆవిష్కరిస్తుంది.
ఈ విధంగా వారి పీఠికలన్నీ ఒక్క దగ్గరికి చేర్చడం వల్ల సాహిత్య విమర్శలో కొత్త మార్గాలు తెలుసుకోవడానికి, లోటును దూరం చేసుకోడానికి ఉపయోగపడతాయి. అటువంటి పీఠికలకు టాగూర్ సాహిత్య అవార్డు రావడం సాహిత్య విమర్శకులకు ఆనందాన్ని కలిగించే విషయం.
18, జనవరి 2010, సోమవారం
విషాద వచనం
ఇవాళ మనకు కనిపిస్తున్న దృశ్యం సుస్పష్టం. నేటి పోరాటం ఆత్మగౌరవ ఆస్తిత్వ రేఖాచిత్రం. ఆర్థిక ఆధిక్యత తాత్కాలికం. రాజకీయపు పెత్తనాలు దీర్ఘకాలికం. కానీ సాంస్కృతికమైన పెత్తందారీతనం మాత్రం శాశ్వతం. ఇదిగో.. ఈ శాశ్వత ముద్రలు వేస్తున్న సాంస్కృతిక ఆధిపత్య దాడుల ప్రతిస్పందనలే జన హృదయ ఘోషలు. ఆకాశాన్నంటుతున్న విషాద పాటలు నెత్తుటి సంతకాలు.
ఇది నిజం.. నేటి తెలంగాణ గ్రామీణ జీవన విధ్వంసపు విషాద వచనం. ఇది సత్యం, తల్లడిల్లుతున్న పల్లె తెలంగాణ ఘోషలకు అక్షర రూపం. ఇది వాస్తవం, నాలుగు కోట్ల రతనాల వీణ వీర గాధల పల్లవుల పునాదుల అన్వేషణ. ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాత ధనిక నియంత ఏడవ నిజాం నవాబు రుబాబుకు పోరాటపు జవాబు చెప్పిన తెలంగాణ అంతరంగపు సాంస్కృతిక విచ్ఛిన్న నేపథ్యం ఇది.
ఇది ఇవాళ్టి ధ్వంస రచన కాదు.. ఏడు శతాబ్దాల విధ్వంస రచన.. దాదాపు ఏడు వందల సంవత్సరాలుగా నిర్నిరోధంగా అట్టడుగుకు అణచివేయడానికి అనేక శక్తులు అనేక మార్గాల నుంచి చేస్తున్న ప్రయత్నాలను నిలువరించటానికి, నిర్మూలించటానికి నిరంతరంగా తెలంగాణ ప్రజలు చేస్తున్న బతుకు పోరాటం పతాక స్థాయికి చేరుకున్న వేళ ఇది. ఇప్పుడు గెలుపు సాధించకపోతే మరెప్పుడూ సాధించలేమని దృఢ నిశ్చయం చేసుకున్న సందర్భం ఇది.
ఎందుకిలా జరుగుతోంది..? స్వతంత్ర భారతం షష్టిపూర్తి చేసుకుని ఇన్నేళ్లయిన తరువాత కూడా భారత దేశంలో ఒక ప్రాంతం ఇంతగా అల్లాడిపోవలసిన అవసరం ఎందుకొచ్చింది? తమ ప్రాంతానికి స్వాతంత్య్రమే రాలేదన్నంతగా ఇక్కడి ప్రజలు ఎందుకు విలవిల్లాడిపోవలసి వస్తోంది? ఎంత ఎత్తో తెలియనంత ఎత్తుకు ఎగసిన ఒక గొప్ప సంస్కృతి అస్తిత్వాన్ని నిలబెట్టడానికి నాలుగు కోట్ల ఊపిరులు బిగపట్టి ఉద్యమిస్తున్నాయి.
ఏమిటీ సంస్కృతి గొప్పతనం? దీని పట్ల ఎందుకింత ద్వేషం? దీన్ని అణచివేయటానికి ఎందుకింతమంది ఒకరివెంట ఒకరుగా దాడులు చేస్తున్నారు..? ఆక్రమించుకోజూస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి... మన మూలాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకోండి..
తెలంగాణా అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం అని అర్థం.. అంటే అచ్చమైన తెలుగు భాష ను మాతృభాషగా వ్యవహరించే జాతి జీవించే ప్రాంతం తెలంగాణా అని అర్థం. నిజమైన తెలుగుదనం కనిపించే ప్రాంతం తెలంగాణాయే అనటంలో సందేహం లేదు.. కాకతీయుల పతనానంతరం 1323 తరువాత కాలం నుంచి 1948 వరకు రకరకాలుగా తెలంగాణ ప్రజల భాషాసంస్కృతులను అణచివేసే ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే వచ్చింది. అయితే ఈ ఆరువందల ఏళ్లలో జరిగిన అన్యాయం ఒక ఎత్తు అయితే, గత 50 సంవత్సరాలలో తెలంగాణాకు జరిగిన అన్యాయం మరో ఎత్తు.. అంతకు ముందు ఆరువందల సంవత్సరాలలో రాజులు, జమీందారులు తెలుగు భాషను కానీ, వారి సంస్కృతిని కానీ పట్టించుకోలేదు.. పక్కన పెట్టారు.. తమ మతాన్ని, భాషను రుద్దే ప్రయత్నం చేశారు. ఇంత నిర్బంధంలోనూ ఇక్కడ అసాధారణంగా సంస్కృతి, సాహిత్యం దేశంలోని మరే ప్రాంతానికీ తీసిపోని స్థాయిలో విలసిల్లింది. తెలుగుగడ్డపై తొలి సారి అక్షరాలను కూర్చిన గుణాఢ్యుడు బృహత్కథను రాసింది మెదక్ జిల్లా కొండాపూర్‌లో.. రామాయణం తొలి అనువాదం భాస్కర రామాయణం తెలంగాణాలో పుట్టింది. తొలి పురాణ అనువాదం మార్కండేయ పురాణం తెలంగాణా ప్రాంతంలోనే పుట్టింది. ఇక భాగవతం సంగతి సరేసరి.. బమ్మెర పోతన భాగవతం తెలుగు సాహిత్యంలో అజరామరమైన ఇతిహాసం. యక్షగానాలు మనదగ్గరే పుట్టాయి. శతకం తెలంగాణాలోనే పుట్టింది. బొమ్మల్లో పద్యాలు రాయటం వంటి గొప్ప ప్రక్రియ తెలంగాణ సొంతం. వీటన్నింటికీ ఆంధ్ర ప్రాంతంలో కొనసాగింపులే జరిగాయి తప్ప అక్కడ సృజనాత్మకతకు ఉన్న చోటు ఏమిటంటే ఏమీ చెప్పలేం.. గురజాడ అప్పారావు తొలి తెలుగు కథ రాశాడని చెప్పుకున్నారే కానీ, దానిపైన వివాదం రేగింది. కందుకూరి వీరేశలింగం తొలి తెలుగు నవల రాశానని తాను చెప్పుకున్నారే తప్ప అదీ వివాదాస్పదమే అయింది. ఆ ప్రాంతంలో తొలిసారి వెలుగులోకి వచ్చిందని చెప్పుకున్న ఏ ప్రక్రియా దాదాపుగా వివాదానికి చోటు చేసుకోకుండా ఉండలేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉప్పొంగిన సృజన మరెక్కడా మచ్చుకైనా కనిపించదు..
అందుకే 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం విలీనం అయిన తరువాత సాహిత్య విధ్వంసం నాందిగా సాంస్కృతిక ధ్వంస రచనకు శ్రీకారం జరిగింది. మొట్టమొదట ఇక్కడ ఎలాంటి సృజన అన్నది జరగనే లేదని చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.. బమ్మెర పోతన్నను వరంగల్ వాడు కాదని, కడప జిల్లా ఒంటిమిట్ట వాడని కనీవినీ ఎరుగని వాదనను లేవదీశారు.. అదే నిజమేనేమో అన్నంతగా ప్రచారం చేశారు.. వేముల వాడ భీమకవిని ద్రాక్షారామానికి చెందిన వాడంటూ మరో కథను సృష్టించారు. పాల్కురికి సోమనాథుడు కర్ణాటకలో ఎక్కడో హాల్కురికి అనే ఊరుందని, అక్కడి నుంచి వచ్చినవాడన్నారు.. మల్లినాథసూరిని, అప్పకవిని.. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఓ పాటో, ఓ పద్యమో, ఓ కథో, ఓ కవితో , ఓ విప్లవమో ఏదైనా ఒక సృష్టి జరిగితే, దాన్ని సృష్టించిన వాడు తెలంగాణా ప్రాంతం వాడు కాదని నిరూపించేందుకు విపరీతమైన ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రతిఘటించాల్సి వచ్చింది. మల్లినాథసూరి మెదక్ జిల్లా కొలిచెలిమ ప్రాంతానికి చెందిన వాడు. కాకునూరి అప్పకవి మహబూబ్ నగర్ వాసి. ఇక్కడి మేధావులు గట్టిగా తిప్పికొట్టారు కాబట్టి ఈ జాతి సృజన జీవనం ఈకాస్తయినా మిగిలింది. వాళ్ల ప్రాంతం వాళ్లయితే వాళ్లలో ప్రతిభ ఉన్నా లేకపోయినా నెత్తిన పెట్టుకుని మరీ వాళ్లకోసం మార్కెటింగ్ చేశారు. ఒక్క విజయనగరం ప్రాంతానికి సంబంధించిన మాండలికంలో కన్యాశుల్కం నాటకం రాసినందుకు గురజాడను వైతాళికుడని కీర్తించారు.. కానీ అదే సమయంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాకతీయ ప్రతాపరుద్రుని కథాంశంతో, పాత్రోచిత వ్యవహార భాషలో ప్రతాపరుద్రీయం నాటకం వస్తే.. అది ఈ ప్రాంతానిది చెందింది కాబట్టి `ఇగ్నోర్' చేసి వదిలేశారు. దాన్ని నామరూపాలు లేకుండా అణచివేశారు.. విశేషం ఏమంటే ఆ నాటకం రాసింది ఆ ప్రాంతం వాడే అయిన వేదం వెంకట రాయశాస్త్రి.. అయినా సరే. .నాటకం తెలంగాణాది కావటమే అభ్యంతరం... ఇవాళ అలాంటి నాటకం ఒకటుందని ఎంతమందికి తెలుసు?
తెలుగువాళ్లను అందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి పరిపాలించింది మొట్టమొదట శాతవాహనులు.. వారి రాజధాని ప్రస్తుతం మహారాష్టల్రోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ప్రతిష్ఠానపురం... ఇది తెలంగాణా ప్రాంతానికి చెందినదే.. కానీ, శాతవాహనులను తమ సొంతం చేసుకునేందుకు వాళ్ల రెండోరాజధాని ధనుష్కోటి అయి ఉండవచ్చన్న ప్రచారం చేశారు.. ఇప్పటికీ దానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు...అటు తరువాత తెలుగువాళ్లను ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాళ్లు కాకతీయులు. వాళ్ల రాజధాని కూడా ఓరుగల్లు... అయితే వీరికి మరో రాజధానిని ఆంధ్రప్రాంతంలో సృష్టించే అవకాశం లభించలేదు.. కానీ, వీరిని తమవాళు్లగా చెప్పుకునే ప్రయత్నాలు మాత్రం విస్తృతంగా జరిగాయి. కాకతీయులు తమ వర్గం వారని, వాళు్ల ఆంధ్రప్రాంతం నుంచే వలస వచ్చి ఓరుగల్లులో స్థిరపడిపోయినట్లుగా నిరూపించటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు.. రాజమహేంద్రవరంపై ఆరుద్ర రాసిన పాటలో కాకతీయుల పేరు వాడుకుని కాకతీయుల్ని తమ సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. 1960లలో నల్గొండ జిల్లాకు చెందిన ప్రసిద్ధ శాసనకారుడు బిఎన్ శాస్త్రిగారి వద్దకు కొందరు ఆంధ్ర పెద్దలు వచ్చి కాకతీయులకు సంబంధించిన ఏదైనా శాసనంలో అర్థం మార్చమని కోరినట్లుగా అందుకు కొంత సొము్మ ఇవ్వజూపినట్లుగా కూడా శాస్త్రిగారే కొందరి వద్ద వాపోయారు. ఈ రకమైన ప్రయత్నం ఇప్పటికీ ఆగలేదు.. వాళ్ల వ్యాపార సంస్థలకు, విద్యాసంస్థలకు కాకతీయ పేరును వాడుకోవటం మనం స్పష్టంగానే గమనించవచ్చు.
తెలంగాణ ప్రాంతంలో చేసుకునే ఏ పండుగైనా మట్టివాసనతో ముడిపడి ఉంటుంది. మట్టిని కాదని ఇక్కడి ప్రజలు బతకలేరు.. దేశమంటే మట్టికాదోయ్ అని మట్టిని విస్మరించి బతకటం ఇక్కడి ప్రజలకు చేతకాదు.. అసలు తెలంగాణ పేరులోనే మట్టి అస్తిత్వం గోచరిస్తుంది. తెలుగుల మాగాణం తెలంగాణం అని అన్నారు.. తెలుగును సిరులుగా పండించే భూమి అని అర్థం. అందుకే ఇక్కడ ప్రతి పండుగా ఆ మట్టితోనే ముడిపడి ఉంటుంది. తెలంగాణ పద సీమల్లో ప్రకృతి పరవశించి తాండవం చేస్తుంది. దానికి ప్రతిరూపమే తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగ బొడ్డెమ్మ, బతుకమ్మ. దసరాకు ముందు ఇరవై రోజుల పాటు చేసుకునే పండుగలివి. మొదటి తొమ్మిది రోజులు మట్టితో బొడ్డెమ్మను చేసి పాటలు పాడుకుంటూ కన్నెపిల్లలు పండుగ చేసుకుంటే, తరువాత పూలతో జరుపుకునే పండుగ బతుకమ్మ.. ప్రపంచంలో పూవులతో తొమ్మిది రోజులపాటు పండుగ జరుపుకునే సంస్కృతి ఉన్న ఏకైక జాతి తెలంగాణాయే అనటంలో సందేహం లేదు.. దీని గురించి వర్ణించేందుకు ఎన్ని వర్ణనలైనా చాలవు. రాష్ట్రంలో పది జిల్లాల్లో అంటే దాదాపు యాభై శాతం రాష్ట్రం వైభవంగా జరుపుకునే ఈ పండుగను ఏనాడు ప్రభుత్వాలు గుర్తించలేదు. ఇది కూడా ఓ పండుగేనా అన్న ఈసడింపులు కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి. బతుకమ్మను ఒక పండుగగా ఇవాళ్టికీ పరిగణించని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరువాత కానీ బతుకమ్మ చర్చలోకి రాలేదు.
అదే విధంగా బోనాలు.. రాష్ట్ర రాజధానిలో నెల రోజుల పాటు నిరంతరంగా జరిగే పండుగ బోనాలు.. అమ్మవారికి భోజనాలు పెట్టడమే బోనాలు.. ఇది కూడా వ్యవసాయంతో ముడిపడి ఉన్నదే. ప్రతి ముఖ్యమంత్రి బోనాల నాడు సికిందరాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి రావటం మినహా దీన్ని పట్టించుకున్న నాథుడు లేడు..
ఇక మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర.. మూడు రాషా్టల్ర నుంచి దాదాపు కోటి మంది భక్తులు రెండేళ్లకోసారి చేసుకునే పండుగకు నాలుగు దశాబ్దాల పాటు పోరాడితే కానీ, రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టలేకపోయింది. భారీ ఎత్తున జనం రావటం, హుండీలు నిండటం వల్ల ఆ ఆదాయాన్ని క్రమబద్దీకరించే నెపంతో దేవాదాయ శాఖ వేలు పెట్టింది. కానీ, మేడారంలో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అక్కడి జంపన్న వాగు శుద్ధి జరగలేదు.. అక్కడి ప్రజలు బాగుపడిందీ లేదు.
కొమరవెల్లి , ఐనవోలు, కురవి, కొండగట్టు, వేములవాడ ఇలా తెలంగాణాలోని ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో ఎప్పుడూ ఏదో ఒక జాతర జరుగుతూనే ఉంటుంది. ఇక్కడి ప్రతి పండుగా సామూహికంగా, సమష్టిగా జరుపుకునేవే. కులభేదాలు లేకుండా అంతా ఒక్కటై నిర్వహించే పర్వదినాలు తెలంగాణాలో ఉన్నన్ని మరెక్కడా లేవు. చిన్నాపెద్దా తేడా లేకుండా, వయోభేదం లేకుండా, కులమతాల భేషజాలు లేకుండా నిర్వహించుకునే ఈ పండుగలను, జాతరలను పండుగలే కావన్నారు.. జాతరలే కావన్నారు.. ఇవి కూడా పండుగలేనా అని నిరసించారు.. ఇవి కూడా వేడుకలేనా అని ఎద్దేవా చేశారు.. అనాగరకులు చేసుకునే పండుగలన్నారు.. తెలంగాణ ప్రాంతానికి మహారాష్టత్రో ఉన్న సంబంధాల కారణంగా హోళీ తెలంగాణకు ప్రధానమైన పండుగ అయింది. జాతీయోద్యమంలో భాగంగా మహారాష్టల్రో ప్రారంభమైన వినాయకచవితి ఉత్సవాలు తెలంగాణాలోనూ వైభవంగా జరుగుతాయి. పీర్ల పండుగను ఇక్కడి ప్రజలు సమష్టిగా చేసుకుంటారు.. కానీ, ఇవేవీ పండుగల్లా అక్కడి ప్రాంతం వాళ్లకు కనిపించలేదు. క్రమంగా తెలంగాణ పండుగలపై వాళ్ల పండుగలు సూపర్ ఇంపోజ్ అయ్యాయి. అవే గొప్ప పండుగలని, తెలంగాణలోని పండుగలు పండుగలే కాదన్నంత భావనను ప్రచారం చేశారు.. 50 ఏళు్లగా ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు బతుకమ్మను జరుపుకోరు.. బోనాల వంకైనా చూడరు.. కానీ, తెలంగాణ ప్రజలు సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టడం అలవాటు చేసుకున్నారు.. కానీ, ఆంధ్రప్రాంత ప్రజలు తెలంగాణా పండుగల్లో ఒక్కనాడు కూడా మమేకం అయిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు.. పండుగలకు సమైక్యతకు సంబంధం ఏమిటి అని అడగవచ్చు. ఉంది. ఇవాళ సమైక్యం గురించి వాదిస్తున్న వాళ్లంతా తెలుగు వాళ్లందరూ ఒకటేనని, తెలుగు జాతి ఒకటే అని, పాలుపొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దనే కదా అంటున్నారు.. మరి అం తా ఒకటే అయినప్పుడు.. అన్ని సంస్కృతులను తమవిగా భావించాలి కదా.. తెలంగాణా వాళు్ల ఆ పని చేస్తున్నారు..చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలను తమ వాళు్లగా, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా ఆదరించారు.. అక్కున చేర్చుకున్నారు.. ఆప్యాయంగా పలకరించారు.. మరి వాళు్ల , తెలంగాణా ప్రజలతో కలిసిమెలిసి ఉందామని హృదయపూర్వకంగా భావిస్తున్నామని చెప్పుకుంటున్న వాళు్ల యాభై ఏళ్లలో ఒక్కనాడైనా తెలంగాణ సంస్కృతిని తమదిగా భావించి, ఆదరించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు కదా.. ఏనాడైనా వాళ్లకు బతుకమ్మ తెలుసా? బోనాలు తెలుసా? జాతరల్లో జన జాతరల గురించి తెలుసా? వాళ్ల దృష్టిలో ఇవేవీ పండుగలు కావు.. అనాగరికులు.. అజ్ఞానులు, మూఢులు, చేసుకునే కిందిస్థాయి సంబరాలు మాత్రమే.. వాటికి తెలుగు పండుగలన్న హోదా కల్పించటం కూడా వారి దృష్టిలో అతి పెద్ద ద్రోహం కింద లెక్క.
జానపదం అంటే అంటే అనాగరికులని, చదువుకున్న వాళు్ల కాదనే ఒకానొక భ్రమ ఆంధ్రప్రాంతం వాళ్లలో ఉంది.. జానపదులంటే వాళ్లకు చదువు లేదని, ఏవో పదాలు పాడుకుంటూ బాంచన్ కాల్మొక్తా అంటూ దొరల దగ్గర వెట్టి చేసుకుని బతికిన వాళ్లే తెలంగాణ వాళ్లని, ఆంధ్రప్రదే శ్ ఏర్పడిన తరువాతే ఈమాత్రమైనా పురోగతి సాధించారని చెప్తారు. ప్రచారం చేస్తారు.. నమ్మబలుకుతారు.. దాండిగతనం ప్రదర్శిస్తారు. కానీ తెలంగాణ మాండలికం (ఇప్పుడు అధికారికంగా వాడుతున్న రెండున్నర జిల్లాల భాష కానిదేదైనా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో మాండలికంగానే గుర్తింపు ఉంది.) తెలంగాణ జనులు వ్యవహారంలో వాడే భాష,ను అనాగరకుల, అజ్ఞానుల నిరక్షరులి యాస అంటూ తీసిపారేశారు.. వెటకారం చేశారు.. అదేమంటే ఆటపట్టించాం అంటారు.. మా మాండలికాన్ని కూడా ఆటపట్టిస్తున్నారు అంటారు..నిజమే అన్ని ప్రాంతాల మాండలికాల్ని ఆటపట్టిస్తున్నారంటే దాన్ని కాదనాల్సిన పని లేదు. ఆట పట్టింపును స్పోర్టివ్‌గా తీసుకోవాలి.. కానీ, ఆటపట్టింపుకు, వెటకారానికి మధ్య తేడా చాలా ఉంది. ర్యాగింగ్ పేరుతో ఆటపట్టించటానికి, వేధించటానికి ఉన్న తేడాయే ఇక్కడ కూడా ఉంటుంది. మిగతా మాండలికాల విషయంలో జరిగింది ఆటపట్టింపు.. తెలంగాణా భాష విషయంలో జరిగింది వెటకారం. ఈ వెటకారం కేవలం సినిమాల్లోనే కాదు.. సాధారణ జనజీవనంలో కూడా తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు.. ఎదుర్కొంటున్నారు.. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే తెలంగాణ భాషలో మాట్లాడితే అదొక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్‌సకు లోనయ్యే దశకు చేరుకుంది. ఈ విధంగా భాషను మాట్లాడనీయకుండా చేయటంలో వారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నిజానికి తెలంగాణాలో మాట్లాడే భాష తెలుగుకు ఓ ప్రాంత మాండలికం కానే కాదు.. ఇది పూర్తి స్థాయి భాష. సంపూర్థంగా వికసించిన భాష. దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు ప్రభుత్వ పోషణ లేక, ఆదరణ లేక పోవటం వల్లనే తెలంగాణాలో తెలుగు భాష కలుషితం కాలేదు.. అధికారుల స్థాయిల్లో, పరిపాలన స్థాయిలో ఉర్దూయే రాజభాషగా ఉండటం వల్ల, ఇక్కడి ప్రజలు తమ తెలుగును తామే పరిరక్షించుకున్నారు. పట్టణాల్లోనైనా, పల్లెల్లో అయినా, పాట పుట్టినా, ఆట పుట్టినా, తిరుగుబాటైనా, సంప్రదాయమైనా, గ్రామీణమైనా, ఏ ఒక్కదాన్నీ ఏ ఒక్కటీ నిరసించలేదు. ఇక్కడ అన్నీ కలగలిసే ముందుకు సాగాయి. పల్లే కన్నీరూ పెడుతుందో అన్నా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, అన్నా పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం అన్నా.. అచ్చమైన తెలుగులోని అసాధారణ పదవిన్యాసమే కనిపిస్తుంది. ఇక్కడ జానపదానికి, సంప్రదాయానికి పెద్దగా తేడా కనిపించదు. జాను తెనుగు గుభాళించిన సాహిత్య సంస్కృతులు ఇక్కడి కణ కణంలో విలసిల్లాయి. అందుకే ఇక్కడ సహజ పాండిత్యంతో ఒక బమ్మెర పోతన పుట్టాడు ఆకాలంలో.. అక్షరాభ్యాసం అంటే ఏమీ తెలియకుండానే, చదువు సంధ్యల జ్ఞానం సముపార్జించకుండానే గొప్ప ప్రజాకవిగా అందెశ్రీ జన్మించాడు ఈకాలంలో... తెలంగాణ గడ్డపైనే సృజన మూలాలు విస్తరించి ఉన్నాయి. వాటిని పెకిలించటం ఎవరితరం? తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో బ్రిటిష్ ఇంగ్లీష్ తెలుగును ఆక్రమించుకుంది. అక్కడి భాష సంకరమైంది. ఇప్పుడు ఆ సంకర భాషను ప్రామాణికం చేసేసుకుని దాన్ని నిజమైన తెలుగు భాషపై రుద్ది, దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా?
తెలంగాణ నగర జీవితాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడటం చాలా సులువే.. కానీ వాస్తవాల్ని అంగీకరించగలగటం చాలా కష్టం. తెలంగాణలో నాగరికత 1956 వరకు లేదన్న వాదనే ఇంతకాలం బలంగా వినిపిస్తూ వస్తున్నారు.. కానీ భారత దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా వేగంగా నాగరికత విలసిల్లిన ప్రాంతం తెలంగాణా.. దీన్ని రుజువు చేసేందుకు పెద్దగా శాస్త్ర పరిజ్ఞానం అక్కర లేదు. పుస్తకాలు, శాసనాలు చదవక్కరలేదు. ఇక్కడి జనజీవనాన్ని అధ్యయనం చేయటానికి ఈ ప్రాంతంలోని దేవాలయాలను సందర్శిస్తే చాలు.. అక్కడి శిల్పాల్లోనే తెలంగాణా జనజీవితం ప్రతిబింబిస్తుంది. రామప్ప ఆలయంలోని శిల్పాల్లో ఓ యువతి ఎత్తు మడమల చెప్పులు వేసుకుని కనిపిస్తుంది. మరో యువతి వేషధారణ, జడకట్టు ఈ తరానికి ఎంతమాత్రం తీసిపోనట్లుగా ఉంటుంది. ఇలాంటి శిల్పాలు ఎన్నెన్నో కనిపిస్తాయి. ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం చెక్కిన శిల్పాలు ఇవి. నీటి పునాదులపై వేయి స్తంభాల ఆలయం నిర్మించిన ఘనత తెలంగాణాది. నీటిపై తేలే ఇటుకలను రూపొందించిన నైపుణ్యం తెలంగాణాది. దేశంలో ఏ మూలకు వెళ్లినా పాలమూరు నిర్మాణ నిపుణుల ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలంపూరు దేవాలయం నీట మునిగితే యథాతథం గా తరలించి మరో చోట మూల నిర్మాణానికి అంగుళం కూడా తేడా రాకుండా నిర్మించగలిగిన మేధ తెలంగాణాది. అగ్గిపెట్టెలో ఆరంగుళాల చీరను పట్టించిన నేతన్నలు పుట్టిన నేల ఇది... ఇవాళ ఆ నిర్మాణ నిపుణులంతా పొట్ట గడవక , బతుకు భారమై భారతదేశంలోని మూల మూలకు వెళ్లి రూపాయి యాచించుకోవలసిన దుస్థితిలో ఉన్నాడు. ఇక నేతన్నకు బతుకే హేయమై బలవంతంగా ఉసురు తీసుకుంటున్నాడు..
తెలంగాణా సంస్కృతిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి లలిత కళలు. అందులో నృత్యం ముఖ్యమైంది. ఇక్కడ ఓ విచిత్రం జరిగింది. తమిళనాడుకు భరత నాట్యం ఎలాగో , ఒరిస్సాకు ఒడిస్సీ ఎలాగో, కేరళకు కథాకళి ఎలాగో తెలుగు వారికి కూడా కూచిపూడి ఓ ప్రత్యేకమైన నృత్య సంప్రదాయమని, దాన్ని కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో సిద్దేంద్ర యోగి దాని రూపశిల్పి అని మనం అంతా గౌరవిస్తున్నాం.. ఆ నృత్యాన్ని ఆచరిస్తున్నాం. కానీ, ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలోనే కూచిపూడిపై వివాదం చెలరేగింది. తమ భరతనాట్యానికి కొంత నాటకీయత చేర్చి దాన్నే కూచిపూడిగా చెప్తున్నారని తమిళులు పెద్ద వివాదాన్ని రేపారు.. దీనిపై వాదోపవాదాలు తీవ్రంగానే జరిగాయి. ఇందులో వాస్తవం ఏమిటన్న లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయితే వివాదాలకు తావు లేని విధంగా, మనదైన, మనకు మాత్రమే పరిమితమైన, మనకు మాత్రమే ప్రత్యేకమైన నృత్య కళ తెలంగాణాలో వెయ్యేళ్ల క్రితమే ఆవిర్భవించింది. కాకతీయుల సేనానిగా ఉన్న జాయపసేనాని నృత్త రత్నావళి అన్న పేరుతో ఓ శాసా్తన్న్రే రచించాడు... దాని ఆధారంగానే రామప్పలో నృత్య భంగిమల్లో శిల్పాలు విలసిల్లాయి. పేరిణీ నృత్యం పుట్టింది. దీనిపై ఎలాంటి వివాదాలకు తావు లేదు. కానీ దీన్ని ఒక జానపద, గ్రామీణ నృత్యరీతి స్థాయికి దిగజార్చడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. దీన్ని తెలుగువారి నృత్యంగా, నృత్తరత్నావళిని తెలుగువారి నాట్యశాస్త్రం గా అంగీకరించే మనసు లేకుండా పోయింది.
తెలంగాణ సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామానికి గ్రామాలు ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగారె, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ``ఏందె నాయినా'' అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ...వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు.. ఈ గుణం తెలంగాణ ప్రజల్లో అధికంగా ఉంటుందని సుప్రసిద్ధ పరిశోధకులు బిఎన్ శాస్త్రి వ్యాఖ్యానించారు.. దీనికి కారణం భౌగోళిక పరిస్థితులేనని ఆయన అంటారు. ఒక ప్రదేశంలోని భౌగోళిక స్థితిగతులు అక్కడి సమాజంపైనా, వ్యక్తిగత జీవితంపైనా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. మైదాన ప్రాంతాల్లో జీవించే వారికి, పీఠ భూముల్లో నివసించే వారికి మధ్య అంతరం ఎంతో ఉంటుంది. మైదాన ప్రాంతాల వారు లౌక్యంగా వ్యవహరిస్తారు.. హుందాగా కనిపిస్తారు.. పీఠభూమి ప్రాంత వాసులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు.. సూటిగా ఉంటారు. తెలంగాణ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఎక్కువ . ఈ స్థితిలోనూ వర్షాధార సేద్యానికి అలవాటు పడ్డవాళు్ల కాబట్టే, తెలంగాణ ప్రజలు బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించారు. బుద్ధికి పదును పెట్టిన వారు, దానితో ఈ హృదయాన్ని ముక్కలు చేశారు..
మనుగడ కోసం పోరాటం అనే డార్విన్ సూత్రం తెలంగాణ జనజీవనంలో ప్రతి అడుగులో కనిపిస్తుంది. నిరంతర అణచివేత కుట్రల కారణంగానే తెలంగాణ ప్రజలు తెగింపును సాధించుకున్నారు. ప్రాచీన భారతంలో హర్హవర్థనుడు, మధ్యయుగంలో ఖిల్జీలు, తుగ్లక్‌లు, ఆ తరువాత బహుమనీలు, కుతుబుషాహీలు, అసఫ్ జాహీలు.. స్వాతంత్య్రం తరువాత ఇప్పటి పాలకవర్గం తెలంగాణాపై దండయాత్రకు వెళ్లారు.. ఎందుకంటే ఉత్తర దక్షిణ భారత దేశాలకు తెలంగాణ ప్రాంతం ఒక అనుబంధ సేతువు. ఇదొక వూ్యహాత్మక స్థావరం. దక్షిణ భారత దేశంలో పెత్తనం నిలుపుకోవ…ననికి ఇది కీలక స్థావరం. అందుకే నిరంతర యుద్ధాలతో, పోరాటాలతో తెలంగాణా రణస్థలికి పర్యాయపదంగా మారిపోయింది. నాడు పోరాట బాటలో నడిచిన రాజులు వారి సిపాయిల కోసం నల్లగొండ, దేవరకొండ, వేల్పుగొండ, కొయ్యలకొండ, ఉండ్రకొండ, కవులాస్, రాచకొండ, మెదక్ మానుగల్లు, గోలకొండ, ఖమ్మం వంటి చోట్ల దుర్గాలు నిర్మించుకున్నారు.. మరి ఈనాడు పోరాట బాట పట్టిన వారికి ఆయుధాలు లేవు. అహింసతోనే అడుగులు ముందుకు కదులుతున్నాయి. వీరికి దుర్గాలు వేరే అక్కర లేదు. లక్ష్యం సాధించేవరకూ ఈ ఉద్యమకారుల కాళ్లకు అలుపు ఉండదు.. వీరికి వెన్నూ దన్నూ నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమే.

15, జనవరి 2010, శుక్రవారం
జంట నగరాల చరిత్రలోకి ఒకసారి తొంగిచూస్తే....
హైదరాబాద్‌సికిందరాబాద్ జంటనగరాల్లో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది. ఇక్కడ బతికిన వాళు్ల.. బతుకుతున్న వారందరికీ ఇది అనుభవమైనదే. జంటనగరాల ఆశ్రయాన్ని ఒకసారి పొందిన వారు తిరిగి ఆ ప్రాంతం నుంచి కదిలేందుకు ఇష్టపడరు...
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం వరకు హైదరాబాద్‌కు ప్రాధాన్యం లేదు.. గోలకొండ ప్రాంతం నుంచే నగర పరిపాలన సాగింది. ఔరంగజేబ్ తరువాతే హైదరాబాద్‌కు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది.
హైదరాబాద్ నూటికి నూరుపాళు్ల తెలుగు పట్టణం కాదు.. జంటనగరాల్లో ఈనాటికీ నికారై్సన తెలుగుదనం కనిపించదు. తెలుగు తెలంగాణ జిల్లాల ప్రజల భాష. తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, తమిళ, ఇరానియన్ తదితర భాషలతో భాగ్యనగరం బహుభాషా నిలయంగా రూపుదిద్దుకుంది.
(courtesy..ఆత్మ కథల్లో ఆనాటి తెలంగాణా పుస్తకం లోంచి..రచన జి.బాల శ్రీనివాసమూర్తి )
హైదరాబాద్‌లో విలసిల్లిన సంస్కృతి దక్కనీ సంస్కృతి. తెలుగు, మరాఠీ, కన్నడ భాషల ప్రజలు.. ఇరానియన్ దక్కన్ ప్రవాసుల భాషలతో కలగలిసిన భాషగా దక్కనీ భాష పుట్టుకొచ్చింది. ఇవాళ ఇది నిర్లక్ష్యానికి గురైంది.
19వ శతాబ్దంలోనే భాగ్యనగరానికి వలసలు ఆరంభమయ్యాయి. ఉత్తర భారతం నుంచి కాయస్థులు, ముస్లింలు తరలివచ్చారు. నిజాం సర్కారులో ఉన్నతోద్యోగాలు సంపాదించారు. రాజస్థానీ మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. 1948 తరువాత ఆంధ్రప్రాంతం నుంచి వలసలు మొదలయ్యాయి. 1956 తరువాత ఉద్ధృతమయ్యాయి. గుంటూరు పల్లెలు అప్పుడు ఏర్పడినవే.
1938 దాకా హైదరాబాద్ నగరంలో చిన్నస్థాయి మతకల్లోలం కూడా జరగలేదు.. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సామరస్యంతో జీవించారు.
హైదరాబాద్ నగర పాలన విషయంలో నిజాం రాజ్యవ్యవస్థ అపరిమితమైన ఆసక్తిని చూపించింది. దేశం మొత్తం మీద తొలి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఘనత హైదరాబాద్‌దే.
ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్న పంజగుట్ట ప్రాంతం ఒకనాడు నగరానికి నాలుగుమైళ్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి విద్యానగర్ ప్రాంతం కూడా అడవే.. అక్కడ పశువులను మేతకు తీసుకువెళ్లేవారట...
మహానగరిలో అడవిని నిర్మించిన ఘనత కూడా ఆనాటి పరిపాలకుల ఖాతాలోకే చేరుతుంది. నాంపల్లిలో కృత్రిమ అటవీ నిర్మాణం జరిగింది. అదే ఇవాళ్టి పబ్లిక్ గార్డెన్‌స... దీన్ని ఆ కాలంలో `బాగే ఆమ్' అని పిలిచేవారు. ఇందులోనే ఓ మూల జూ ఉండేది. బాగ్ అంటే తోట అని అర్థం.
ఒకనాటి భాగ్యనగరం కాలుష్యానికి ఆమడ దూరంలో ఉండేది. పటాన్ చెరువు, జీడిమెట్ల, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో చాలాకాలం క్రితమే భారీ పరిశ్రమలు విస్తరించాయి. అయినా ఆనాడు అవి నగర శివార్లలో ఉన్నవే. నగరం నగరం నలువైపులా చమన్లు, తోటలు పెంచటంతో కాలుష్యానికి తావే లేకుండాపోయింది.
1922నాటికే హైదరాబాద్‌లో వస్త్ర పరిశ్రమకు పునాదులు పడ్డాయి. దివాన్ బహదూర్ రాంగోపాల్ మిల్లుల్లో 1300 మంది కార్మికులు పనిచేసేవారు..
జంటనగరాల్లో 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు మోటర్ కారు అంటే తెలియదు. ఎక్బాలుద్దౌలా అనే ఆయన మొట్టమొదటిసారి మోటారు కారును హైదరాబాద్ వీధుల్లో నడిపించారు. ఆయన వాడింది ఆనాటికే పాతబడిన మోటారు కారు.. ఆ తరువాత ముసల్లింజంగ్, కమాల్‌యార్‌జంగ్, రాజారామ్‌రాయన్, లక్ష్మణ్‌రాజ్‌లు కొత్త తరహా మోటారు కార్లు కొన్నారు.. వీరంతా ఆనాటి హైదరాబాద్ ప్రముఖులు.
1911 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఉన్న మోటారు కార్ల సంఖ్య 118 అని నిజాం ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. 1934లో గాంధీజీ హైదరాబాద్ వచ్చినప్పుడు సంపన్నుడైన ధన్‌రాజ్ గిర్‌జీ తన రోల్‌సరాయిస్ కారును ఆయన కోసం అందుబాటులో ఉంచారు. అప్పటికే రోల్‌సరాయిస్ కారు హైదరాబాద్ వీధుల్లో తిరిగింది.
1920 నాటికి హైదరాబాద్ జనాభా నాలుగు లక్షలు. మోటారు కార్ల సంఖ్య తక్కువ. అప్పుడు రిక్షాలు లేవు. ఆటోరిక్షాలు అంతకంటే లేవు. సంపన్నులకు బగ్గీలు ఉండేవి. అద్దె టాంగాలు ఉండేవి. సైకిళ్ల సంఖ్య మాత్రం వేల సంఖ్యలో ఉండేవి. మోటారు వాహనం వస్తుందంటే ట్రాఫిక్ పోలీసు సీటీ ఊదేవాడు..ప్రజలంతా ఆ మోటారును విచిత్రంగా చూసేవారు.
1930వ దశకంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ తీవ్రత తక్కువైనా పూర్తిస్థాయి ట్రాఫిక్ క్రమశిక్షణను పాటించేవారు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేవి.. టాంగాలు ఎక్కువ. రోడ్ల మీద కొంత కొంత దూరాలకు రేకులు, తట్టలు పట్టుకుని కొందరు మనుష్యులు ఉండేవారు. గుర్రం లద్ది పెట్టినా, చెత్త పడినా వెంటనే తీసేవారు.
హైదరాబాద్ నగరంలో దేవిడీల సంస్కృతి ఎక్కువ. ఢిల్లీ, లక్నో, కాశీ వంటి నగరాల మాదిరిగానే ఇక్కడా దేవిడీలు ఎక్కువగానే ఉన్నాయి. ఆనాటి నవాబులు, జమీందారులు దేవిడీలు నిర్మించుకుని అందులో దర్జాగా నివసించేవారు. ఇప్పటికీ కొన్ని దేవిడీలు నేటికీ నగరంలో కనిపిస్తాయి.
20వ శతాబ్దం ప్రారంభం కావటానికి ముందువరకు హైదరాబాద్‌లో హోటళు్ల, వసతి గృహాలు లేవు. ధర్మశాలలే ఉండేవి. హైదరాబాద్‌కు వచ్చిన వారు ధర్మశాలలో వండుకుని తినే వారు. ఉచితంగా అన్నదానం కూడా చేసేవారు.
1943లో ఉస్మానియా ఆసుపత్రి ఎదురుగా చింతల నర్సమ్మ భోజనశాల ఉండేది. అన్నం, పప్పు, రెండు కూరలు, ఊరగాయ, కాచిన నెయ్యి, గడ్డ పెరుగుతో భోజనం లభించేది. నెలకు రెండుపూటల భోజనానికి రెండు రూపాయలు, వసతికి మరో రెండురూపాయలు తీసుకునేవారు.
హైదరాబాద్‌లో హోటళు్ల ప్రారంభమైన తొలినాళ్లలో విచిత్రమైన పరిస్థితి ఉండేది. జనం హోటళ్లకు వెళడానికి మొహమాటపడేవారు.. ఆనాడు హోటళ్లను చాయ్‌ఖానా అని పిలిచేవారు.. చాయ్‌ఖానాకు వెళ్లడం అంటే సారాయి దుకాణానికి వెళ్లినట్లు భయపడేవారు..
1920 నాటికి కానీ హైదరాబాద్‌లో హోటళు్ల రాలేదు. టీ, కాఫీలతో పాటు ఉప్మా, వడ,దోశ వంటి టిఫిన్లు ఎక్కడో అరుదుగా లభించేవి. గౌలిగూడ రామమందిరం ప్రాంతంలో సుబ్బారావు హోటల్ అనేది తొలి హోటళ్లలో ఒకటి.
1920 లలో హైదరాబాద్‌లో నాష్తాలు ఖాజీ పకోడా, పూరీసాగ్, పూరీచూన్‌లు.. మాంసాహారంలో మేక కాళ్ల ముక్కల పులుసు(పాయ), బన్ను రొట్టెలు ఆనాటి టిఫిన్లు..
హైదరాబాద్‌లో ఇరానీచాయ్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. 1920లలో గౌలిగూడెంలోని శంకర్‌షేర్ అనే హోటల్‌లో మలాయ్‌దార్(మీగడతో కూడిన) చాయ్ ఆనాడు ఫేమస్.. మూడు పైసలకు చాయ్.. ఒక పైసకు లవంగం గుచ్చిన పాన్.. ఒక పైసకు నాలుగు చార్మినార్ సిగరెట్లు.. ఇవీ ఆనాటి హైదరాబాద్ ధరలు..
హైదరాబాద్ ప్రజలకు టీ ని అలవాటు చేసేందుకు టీ కంపెనీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో బహిరంగంగా స్టౌ వెలిగించి అందరిముందే టీని తయారు చేసేవారు. ఒకరు టీ వల్ల వచ్చే లాభాలను గురించి చెప్పేవారు.. మరొకరు తయారు చేసిన టీని ఉచితంగా అందరికీ పంచేవారు.. టీ గొప్పతనాన్ని గురించి ఇంకొకరు ప్రసంగించేవారు.. తరువాత ఇంటింటికీ తిరిగి టీని పంపిణీ చేసేవారు. మొత్తం మీద టీ ని జనానికి అలవాటు చేసి కానీ కంపెనీలు విడిచిపెట్టలేదు..
గండిపేట్‌కీ పానీ, మదీనాకీ బిర్యానీ హైదరాబాద్ ప్రత్యేకతలు.. గండిపేట నీటిలో తేటదనం ఎక్కువగా ఉంటుంది. మదీనా బిర్యానీలో నిర్వచనాలకే అందని రుచి ఉంటుంది.
1950 వదశకంలోనే హైదరాబాద్‌లో సినిమాలు వచ్చాయి. ఆనాడు ఆబిడ్‌సలో సాగర్ టాకీస్ ప్రసిద్ధమైంది. నాంపల్లిలో మోతీమహల్ టాకీసులో హిందీ సినిమాలు వచ్చేవి. 1956లో ఈ మోతీమహల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కొంతకాలం తరువాత దిల్‌షాద్ అని పేరు మార్చుకుని తిరిగి ప్రారంభమైంది.
1908 సెప్టెంబర్‌లో రెండు రోజుల్లో 19 అంగుళాల వర్షం కురిసింది. మూసీ నది కట్టలు తెంచుకుంది. 221 చెరువులు తెగిపోయాయి. నాలుగు వంతెనలు మునిగిపోయాయి. 15వేల మంది మరణించారు. 20 వేల ఇళు్ల నేలమట్టమయ్యాయి.
మూసీ వరదలకు దానిపై నిర్మించిన మూడు వంతెనలు చాదర్‌ఘాట్, పురానాపూల్, నయాపూల్‌లు పూర్తిగా మునిగిపోయాయి. చెన్నరాయని గుట్ట(నేటి చాంద్రాయణ గుట్ట) నుంచి షాలిబండ వరకు నగరం పూర్తిగా మునిగిపోయింది.
మూసీ వరదలు నిజాం సర్కారుకు నేర్పిన గుణపాఠాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి పిలిచి ఆయన సారథ్యంలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట)లు నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నెలకొల్పారు. మురికివాడల స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించారు.. భారీ ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
1911లో హైదరాబాద్‌లో ప్లేగు రోగం విస్తరించింది. ప్లేగు గత్తరల వల్ల 15 వేల మంది మృత్యువాత పడ్డారు. చలికాలంలో హైదరాబాద్ రావాలంటేనే జనం భయపడేవారు.
1919లో ఇన్‌ఫ్లూయెంజా తీవ్రంగా వ్యాపించింది. భాగ్యనగరంలో రోజూ కనీసం 500 మంది మరణించేవారని నిజాం సర్కారు రికార్డులు చెప్తున్నాయి.
1936లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనా రజతోత్సవాలను నిర్వహించారు. జూబ్లీహాల్ అప్పడు కట్టిందే. జూబ్లీహిల్‌స, జూబ్లీ క్లబ్, జూబ్లీ బజార్ వంటివన్నీ అప్పుడు పెట్టిన పేర్లే.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోలకొండపై దండెత్తి కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాను జయించాడు. అప్పుడు మొగలాయూ సైనికులు నిలిచిన చోటును ఫతే మైదాన్ అని పిలిచారు.. ఇదే ఇప్పుడు లాల్‌బహదూర్ స్టేడియంగా మారింది.
తానీషాను ఓడించిన తరువాత ఫతేమైదాన్ పక్కనే ఉన్న కొండపైన ఔరంగజేబ్ సైనికులు నగారా మోగించారు. అదే నౌబత్‌పహాడ్... ఇప్పుడు నగరం సిగలో మల్లెపూవులా వెలిగిపోతున్న బిర్లామందిర్ ఉన్న కొండ అదే.
హైదరాబాద్‌లో రెసిడెన్సీ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలో నిజాం చట్టాలు అమలు కాలేదు.. పోలీస్ చర్య తరువాత కోఠీలోని రెసిడెన్సీ భవనాన్ని పోలీసు కేంద్ర కార్యాలయానికి ఇవ్వాలని ఆనాటి సైనిక అధికారి జె.ఎన్.చౌదరి ప్రభుత్వాన్ని కోరారు.. కానీ, దాన్ని మహిళా కళాశాలకు ఇచ్చారు.. అదే ఇవాళ్టి కోఠీ మహిళా కళాశాల.
కోఠీలో మొదట రెసిడెన్సీరోడ్డుగా పిలిచిన ప్రాంతం ఆ తరువాత తుర్రేబాజ్‌ఖాన్ రోడ్డుగా మారింది. 1857లో తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో తుర్రెబాజ్‌ఖాన్ బలమైన తిరుగుబాటుదారు.. అతని స్మృతి చిహ్నంగానే తుర్రెబాజ్‌ఖాన్ రోడ్డు ఏర్పడింది.
హైదరాబాద్‌సికిందరాబాద్‌ల మధ్య ప్రజల వ్యవహారంలో చాలా తేడాలు ఉండేవి. హైదరాబాద్‌ను పట్నం అని పిలిచేవారు.. సికిందరాబాద్‌ను లష్కర్ అని పిలిచేవారు. నాడు సికిందరాబాద్ ముందు బెజవాడ చిన్న పల్లెలా కనిపించేది.
హైదరాబాద్‌లో ఉర్దూ భాషకు ఎంత దర్జా ఉండేదో.. సికిందరాబాద్‌లో ఇంగ్లీషుకు ఆ స్థాయిలో గౌరవం ఉండేది. ఆ రోజుల్లో కందస్వామి మొదలియార్ అనే ఆయన సికిందరాబాద్‌లో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయనే మెహబూబ్ కాలేజీని స్థాపించాడు.
హైదరాబాద్‌లో తీవ్ర నిర్బంధం ఉండటంతో, సికిందరాబాద్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకునే వారు. కర్బాలా మైదానంలో సద్దుల బతుకమ్మ జరిగేది.
సికిందరాబాద్‌లోని కింగ్‌సవే రహదారి, మారేడ్‌పల్లి ప్రాంతాలను బ్రిటిష్‌వారు తమ అధీనంలో ఉంచుకున్నారు.. తామే అభివృద్ధి చేసారు.
హైదరాబాద్‌కు భాగ్యలక్ష్మి అధిష్ఠాన దేవత.. సికిందరాబాద్‌కు ఉజ్జయిన మహంకాళి అధిష్ఠాన దేవత. అమ్మవారికి ఆషాఢమాసంలో సమర్పించుకునే బోనాలు హైదరాబాదీలకు అతి పెద్ద పండుగ.
సికిందరాబాద్‌లోని ఆనందభవన్, ఆబిడ్‌సలోని తాజ్‌మహల్ హోటళు్ల చాలా పాత హోటళు్ల.. అవి హోటళు్ల కావు.. మిత్రులు కలిసే ప్రదేశాలు.

11, జనవరి 2010, సోమవారం
ద్రౌపది అగ్ని సంభవ
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ద్రౌపది నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన వార్త తెలుగు సాహిత్య లోకంలో అపూర్వమైన కల్లోలాన్ని రేపింది. పురాణ ఇతీహాసాల్లోంచి పాత్రలను తీసుకుని మానవతా దృక్పథంతో ఆధునిక జీవన చైతన్యంతో చిత్రించటం ఈనాడు జరుగుతున్నదే. కెఎం మున్షీ కృష్ణావతారం సంపుటాలు మహాభారతానికి ఆధునిక కథారూప కల్పన. దీంతో ఎవరికీ పేచీ లేదు. ఇట్లా అనేక భారతీయ భాషల్లో ప్రాచీన గాథల్ని మళ్లీ కొత్తగా చెప్పటం మనకు కనిపిస్తుంది. రసోచితంగా పూర్వ ఇతివృత్తాన్ని మార్చ వచ్చని ఆలంకారికులు చెప్పారు.. కాళిదాసు శాకుంతలంలో మహాభారతంలో లేని కల్పనలు చేశాడు. ఈ మార్పులని భారత జాతీయ జనుల మౌళిక విశ్వాసాలకు అనుగుణంగా ఉన్నవే. మౌలిక విశ్వాసాలకు భంగం కలిగించే మార్పులు ఏ సమాజమూ హర్షించదు. ఆ మార్పులు ఆ పాత్రల స్థాయిని అత్యంతమూ, అధోభూమికలోకి లాగినప్పుడు ప్రజల హృదయాలు గాయపడి సంక్షోభం చెలరేగుతుంది. లక్ష్మీ ప్రసాద్ నవల వల్ల ఇవాళ జరుగుతున్న అల్లకల్లోలం అలాంటిదే.
ద్రౌపది పాత్ర ప్రధానంగా నిర్మింపబడ్డ ఈ నవల పురాగాధకు కొత్తరూపమే. అయితే, మహాభారత రచనలోని పాత్రల మూల స్వభావాలకు, లక్ష్యాలకు ఈ రచన భిన్నంగా, విరుద్ధంగా పాత్రల నిర్మాణం చేసింది. ద్రౌపది అగ్ని సంభవ. అయోనిజ. ఈ రెండు లక్షణాలు ఆమెలోని ఈశ్వరాభిముఖంలో ఉన్న చైతన్యానికి ప్రతీకలు. అగ్ని జ్వాల ఎప్పుడూ ఊర్థ్వ ముఖంగానే ఉంటుంది. కామ భావం ఎప్పుడూ అథోముఖంగా ఉంటుంది. ద్రౌపది పుట్టుక వెనుక, ఒక మహావీరుడి గాయపడ్డ అభిమానం తపోరూపంలో వరంగా ఆమెను పొందిన అంశం వ్యక్తమవుతుంది. ఈ పుట్టుక నాటి నుంచి మత్స్య యంత్ర భేదన వేళలోనూ, వసా్తప్రహరణ వేళలోనూ, ఆమె ధీర యువతిలాగా ఎవరై్ననా, ఎంత పెద్దలైనా ప్రశ్నించగలదిగా కనిపిస్తుంది. ఆ క్రమంలో కామ చేష్ట ద్వారా పిలిచినందుకే దుర్యోధనుణికి ఊరు భంగం కలిగించింది. జుట్టు పట్టి లాగినందుకు దుశ్శాసనుణ్ణి రొము్మ చీలేట్లు చేసింది. కామంతో తన వెంటపట్ట సైంధవుణ్ణి అవమానింపజేసింది. కీచకుణ్ణి మట్టి కరిపించింది. భారత యుద్ధ సందర్భంలోనూ ఆమె సందేశం ప్రతీకారమే. తిక్కన `ఈ వెండ్రుకలు పట్టిన ఆ చేయి' మొదలైన పద్యాలు ఆమె తత్తా్వన్ని ప్రకటింప చేస్తాయి. శ్రీకృష్ణుని ఆమె భగవద్భావంతో ఆరాధించింది కానీ, రాధ వలెనో, గోపిక వలెనో మధుర భక్తి మార్గంలో ప్రయాణించలేదు. అందువల్ల ద్రౌపదిశ్రీకృష్ణ సంబంధాన్ని జయదేవుని గీతగోవిందంతో పోల్చి చూడమనటం హేతు విరుద్ధమైన అంశం. ద్రౌపది ఉజ్జ్వలమైన పాత్ర చిత్రణం భట్టనారాయణుని వేణీ సంహారంలో కనిపిస్తుంది. ఈ భూమిక మీద ఆలోచిస్తే, లక్ష్మీ ప్రసాద్ నవలలోని ద్రౌపది పాత్ర చిత్రణ, సన్నివేశాల వివరణ అంతా, ఆమె యందున్న పూజ్యమైన మాతృభావనను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం కనిపిస్తుంది. నెల్లూరు ప్రాంతంలో ద్రౌపది తిరునాళు్ల అనే పేర ఇప్పటికీ ఆమెను ఆదిశక్తిగా ఆరాధించే జానపద సంప్రదాయం ఉంది.
ఈ నవలలో ద్రౌపదిని కామాతురగా చిత్రించటం పెద్ద దోషం.. పంచ భర్తృక అనే భావం ఒక ప్రతీకాత్మకమైందే తప్ప, కామ భావానికి సంబంధించింది కాదు.. కుంతి సంతానమందు ఆరాధించిన ఇంద్ర, యమ, వాయు, అశ్వినీ దేవతల అంశలు, శక్తులు ఆవరించి ఉన్నవనే తప్ప, మానుషమైన శృంగారం ప్రధానాంశం కాదు.. ఎక్కడైనా హిమాచల ప్రాంతంలో ప్రాచీన కాలంలో బహు భర్తృత్వం అనే ఆచారం ఉన్నదని పేర్కొన్నా, ఆ సమాజం ఆనాడు విధించుకున్న ధర్మమే తప్ప, కామ అతిచారం కాదు. అలా వ్యాఖ్యానిస్తే, ఆ గిరిజన సంస్కృతిని మనం అవమానించినట్లే. ద్రౌపదీ దేవి సౌందర్యం లోకోత్తరమైందనీ, ధృతరాష్రు్టని కోడళు్ల ఆ సౌందర్యానికి ముగ్ధలైనారని వ్యాసుడు చెప్పటం, ఆమె శరీరంలో అంతర్గతంగా లీనమై ఉన్న అగ్ని హోతృని ప్రకాశమే తప్ప, సర్వ పురుషాకర్షకమైన తక్కువ స్థాయి అందం కాదు. ఈ నవలలో చిత్రించిన ద్రౌపది కామాతుర. ఆమె యందు భర్తలు కామోల్బణం కలవారే. భీష్మ ద్రోణాదులు కూడా ఆమె శారీరక సౌందర్యం యెడల లాలస ఉన్న వాళు్లగా చెప్పబడ్డారు.. అన్నింటికంటే ఆశ్చర్యం సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా ఆమె యందు కామలోలకుడైనట్లుగా వర్ణించటం. ఈ అంశాలన్నీ వ్యాసుని భారత తాత్పర్యానికి, కావ్య పరమార్థానికి విరుద్ధమైన అంశాలు.. అతిలోకమైన ఆ వ్యక్తిత్వాన్ని తలక్రిందులుగా చేసి చిత్రించటం. ఈ పని ఏదో అప్రసిద్ధమైన రచన విషయంలో జరగలేదు. భారతీయులు అయిదు వేల సంవత్సరాలుగా ఆరాధించే మహాభారత విషయంలో జరగటం అత్యంత శోచనీయమైంది. ఖండించదగింది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)