31, జనవరి 2020, శుక్రవారం
interview of pb srinivas
25, జనవరి 2020, శనివారం
prof. suprasanna speach on literary history
తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణ పరిణామ క్రమంలో వాస్తవాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలుసుకోవాలంటే.. ప్రఖ్యాత విమర్శకుడు కవి, ఆచార్య సుప్రసన్న చేసిన ప్రసంగం ఇది. గత శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఎన్నిరకాల సంస్కరణోద్యమాలు పుట్టాయి. వాటి ప్రభావం తెలుగు సాహిత్యంపైన.. రచయితలపైన ఎలా పడ్డాయో సమగ్రంగా వివరించారు. ఈ తరం రచయితలంతా.. తప్పకుండా పూర్తిగా విని తీరాల్సిన ప్రసంగం ఇది. చాలామంది ఆదునిక కవులకు, రచయితలకు తెలియని సాహిత్య చరిత్ర ఈ ప్రసంగం. తప్పకుండా వినండి. సాహిత్య సేవ చేస్తున్న స్వాధ్యాయను ఆదరించండి. పదిమందికి ఈ సేవను పంచండి. సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి.
21, జనవరి 2020, మంగళవారం
bilingual genius kasi krishnacharyulu voice on sanscrit lanuage
కాశీ కృష్ణాచార్యులు తెలుగువారంతా
గర్వించదగ్గ మహా పండితులు. తిరుపతి వెంకటకవుల చేత అవధాన శిరోమణి బిరుదును పొందిన
వారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి తరువాత ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవిని
అలంకరించినవారు. సంస్కృత భాష ఎంత తేలికగా నేర్చుకోవచ్చో.. దాని వల్ల ఎన్ని
ఉపయోగాలు ఉన్నాయో చెప్తున్నారు. ఆయన ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు జాగ్రఫీ అర్థం
కాకపోతే.. సంస్కృతంలో రాసుకొని గుర్తు పెట్టుకొని చదువుకున్నారట.. సంస్కృత అక్షరాలు
పలికితే.. శరీరంలోని సంపూర్ణమైన నాడులు కదిలి ఏ రోగమూ రాదట. ఆ మహానుభావుడి అపూర్వ
గళం మీరూ వినండి. స్వాధ్యాయ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్
చేయండి. తెలుగువారి అపూర్వ సారస్వత సంపదను పదిమందికి అందించడంలో మీవంతు చేయూతనివ్వండి.
14, జనవరి 2020, మంగళవారం
sripada krishnamurty sastry voice
12, జనవరి 2020, ఆదివారం
jayanti ramayya pantulu voice
మీలో ఎవరైనా గుండెమీద చెయ్యి వేసుకొని ‘నాకు తెలుగులోని తెలియని పదం లేదు’ అని ధైర్యంగా చెప్పగలరా? ఇదిగో ఈయన చెప్తున్నాడు. తెలుగు భాషా సరస్వతికి అపూర్వమైన సేవచేసినవాడు. సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాత.. ఆంధ్ర సాహిత్య పరిషత్ వ్యవస్థాపకుడు.. 250 గ్రంథాలు రచించినవాడు.. జయంతి రామయ్య పంతులు.. ఈ పేరు ఈ తరం వారు విని ఉండరు. కానీ.. తెలుగు భాష ఇప్పటివరకు సుసంపన్నంగా ఉన్నదంటే.. ఈయనలాంటివారు పెట్టిన భిక్షే. వీరిని మనం మరువద్దు. మరుపురాని మహాత్ములు వీరు. వీరి అపూర్వ స్వరాన్ని ఒక్కసారి వింటేనే జన్మ ధన్యమవుతుంది. వినండి.
ఈ చానల్ ను సబ్స్క్రైబ్ చేయడం అంటే ... ఈ చానల్ ను పదిమందికి చేరవేయడం ద్వారా తెలుగు సరస్వతిని మనం మన తరంలోనూ.. మన తరువాతి తరంలోనూ కాపాడుకొనే చిన్న ప్రయత్నమిది. నేను దీపం వెలిగించాను. దీన్ని జాజ్వల్యమానం చేయాల్సిన బాధ్యత అందరిదీ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)