5, జనవరి 2010, మంగళవారం

చర్చల కోసం చర్చలు

ఢిల్లీ లో చిదంబరం అఖిల పక్షం సమావేశం ముగిసింది.. తెలంగాణా పై ఎనిమిది పార్టీల నేతలు తమ వాదనలను వినిపించారు..అన్ని ప్రాంతాల నుంచి అభిప్రాయాలూ తెలుసుకున్న తరువాత పరిష్కారం ఆలోచిస్తుంది. కేంద్రం కోర్టులో బంతి పడింది. ఎవరికీ వారు వారి వాదనలను వినిపించారు.. విస్తృత స్థాయి చర్చలు కావాలని సమైక్య వాదులు చెప్తే.. అవసరం లేదని తెలంగాణావాదులు చెప్పారు. ఎం ఐ ఎం మాత్రం తన వైఖరి స్పష్టం చేయలేదు.. కాంగ్రెస్ లో విభేదాలపై అంతర్గతంగా పరిష్కరిన్చుకున్తామని చిదంబరం చెప్పారు. మిగత పార్టీలు దాదాపు ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడించాయి. చర్చల కొనసాగింపునకు వీలుగా ప్రజలు ఆందోళన మాని ప్రశాంతంగా ఉండాలని సమావేశం లో పాల్గొన్న అన్ని పార్టీలు ఒక ప్రకటన పై సంతకం చేశాయి.



2 కామెంట్‌లు: