29, డిసెంబర్ 2008, సోమవారం

చిరంజీవి విజేత అవుతారా?

మెగాస్టార్‌ చిరంజీవి సుదీర్ఘకాలం ఆలోచించి ఆలోచించి ముహూర్తం పెట్టుకుని రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి రావటం ఒక మహా సంచలనం అంటూ మీడియాలో హోరెత్తింది. తిరుపతి సభ మీడియా మాటల్ని నాటికి నిజం చేసింది. చిరంజీవి పార్టీని ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నది. కానీ, ఆయన పార్టీ దశ ఏమిటి? దిశ ఏమిటి? అది ప్రజలకు ఇస్తున్న మార్గ నిర్దేశన ఏమిటన్నవి.. ఇప్పటికీ ఒక స్పష్టత రాని ప్రశ్నలు. చిరంజీవి రాజకీయాల్లోకి రావలసిన అవసరానవసరాల గురించి ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. ఆయన ఎలాగూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయనున్నారన్నదే సందేహం. చిరంజీవిని ఎన్టీయార్‌తో పోల్చటం ఒక విధంగా సమంజసమే కావచ్చు. కానీ, ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేవలం ఆయన చరిష్మా ఒక్కటే పని చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన చరిష్మా కంటే కూడా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరత్వమే ఎక్కువగా ప్రభావితం చేసింది. కేవలం సినిమాల్లో వేషాల వల్లనే ఎన్టీయార్‌ తొమ్మిది నెలల్లో అధికారంలోకి రాలేదు. దాదాపుగా అప్పుడే భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందిన జనసంఘం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఉండకపోతే అధికారంలోకి వచ్చేది. ఎందుకంటే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న వ్యతిరేకత అలాంటిది. దీనికి తోడు ఎన్టీయార్‌కు నాడు పూర్తిగా సహకరించిన వాళు్ల కమూ్యనిస్టులు. ఆయన సభలకు పెద్ద ఎత్తున జనాల్ని తరలించిన వాళు్ల కమూ్యనిస్టులు అన్నది నిర్వివాదం. వీటన్నింటికీ మించి నాడు మీడియా రారాజుగా నిలిచిన ఈనాడు పత్రిక పూర్తిగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించింది. ఈనాడు పత్రిక ఏది రాస్తే అది వేదంగా చెలామణి అయిన కాలం అది. తెలుగుదేశం పార్టీ జెండా ఈనాడు హైదరాబాద్‌ కార్యాలయంలో రూపొందిన మాట వాస్తవం. ఎన్టీయార్‌ ప్రసంగాలతో పాటు, తెలుగుదేశం పార్టీలోని చిన్న నాయకులకు, సినిమా తారలకు ప్రసంగ పాఠాలు రాసివ్వటమే కాకుండా, వారు ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చింది కూడా ఈనాడు కార్యాలయంలోనే. ఇన్ని రకాలుగా ఎన్టీయార్‌కు కాలం కలిసి వచ్చింది కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చారు. అదే ఎన్టీయార్‌ను అయిదేళ్ల తరువాత ఓడించి మరీ గద్దె దింపింది ఈ ప్రజలేనన్నదీ మరవద్దు...చిరంజీవిని ఎన్టీయార్‌తో పోల్చుకున్నా.. చరిష్మా విషయంలో  చిరంజీవికి ఉన్న అభిమానులు అధికంగా మాస్‌.. యూత్‌ అన్నది నిర్వివాదం. యువతలో ఓటు హక్కు ఉన్న వారి సంఖ్య పరిమితం. వీళ్లలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యే ఎక్కువ. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అర్బన్‌ ఓటర్లలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువ. వీళ్లలో చాలామందికి ఓటు పైన ఆసక్తి కూడా ఉండటం లేదని చాలా సందర్భాల్లో తేలింది. మరి సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న గ్రామీణ ఓటర్ల మాటేమిటి? వీళ్లలో ఎంతమందిని చిరంజీవి తనవైపు తిప్పుకోగలరు? పార్టీ స్థాపించి ఇప్పటికి నాలుగు నెలలు అయింది. మూడు ప్రాంతాలలో 13 రోజుల పాటు రోడ్డు షోలు నిర్వహించారు. ఇప్పుడు ప్రజా అంకిత సభలు పెడుతున్నారు. మొట్ట మొదట సిరిసిల్ల వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తన ప్రసంగాల్లో రాజకీయాల్లో మార్పు గురించో... అవినీతి నిర్మూలన గురించో.. వివిధ అంశాలపైన సాధారణీకరణ(జనరలైజ్‌) వ్యాఖ్యానాలు చేస్తున్నారే తప్ప .. నిర్మాణాత్మకంగా తన అజెండాను స్పష్టంగా చెప్పింది లేదు. లక్షల మంది ప్రజలు తనను చూసేందుకు వస్తున్నప్పుడు వారిలో భావోద్వేగాన్ని (ఎమోషన్‌) సృష్టిస్తే తప్ప ఆయన మాటలు వారి మనసుల్లో ఎక్కువ కాలం నిలవవు. ఈ వాస్తవాన్ని ఆయన గ్రహించినట్లు లేదు.  అప్పుడే వారు తనకు ఓటర్లుగా మారే అవకాశం ఉంటుంది. ఆయనకు ప్రసంగాలు రాసిస్తున్న వారు కూడా కేవలం ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పడికట్టు పదాలు రాసివ్వటం తప్ప తనకు అవకాశం ఇస్తే ప్రజలకు ఇప్పుడున్న నాయకుల కంటే మెరుగ్గా తానే పని చేయగలనన్న ధీమా కలిగించే ప్రసంగ పాఠాలు మచ్చుకైనా కనిపించవు. ఎందుకంటే  ఆ రాయసగాండ్రు కూడా ఈనాడు సంస్థలో నలిగి నలిగి వచ్చిన వారే కాబట్టి. 
ఆయన పార్టీ స్థాపించిన తరువాత అందులో చేరిన వారంతా రాజకీయ కురువృద్ధులూ.. రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిన వారే కావటం గమనార్హం.. చేగొండి హరిరామ జోగయ్య, శివశంకర్‌, పర్వతనేని ఉపేంద్ర లాంటి ముసలివాళు్ల.. భూమా దంపతులు.. తమ్మినేని సీతారాం లాంటి వాళు్ల 2004లో వాళ్ల నియోజక వర్గాల్లోనే ఓడిపోయిన నేతలు.. ఒకరిద్దరు ఛోటామోటా నాయకులు తప్ప ప్రజారాజ్యం పార్టీలో ప్రజలపై ఖచ్చితమైన ప్రభావం చూపగల నాయకులంటూ ఎవరూ లేరన్నది నిష్ఠుర సత్యం. కత్తిపద్మారావు లాంటి నేతలు రాజకీయంగా చిరంజీవికి ఎంతమాత్రం ఉపయోగపడతారన్నది అనుమానమే.
ఇక పార్టీ ప్రతినిధులూ అలాగే ఉన్నారు. ఒకరు బిజెపిలో ఇమడలేక ఈటీవీలో ప్రతిధ్వని కార్యక్రమానికి యాంకరింగ్‌ చేస్తూ.. రామోజీరావు గారి సిఫార్సుమేరకు పిఆర్‌పి ప్రతినిధిత్వం స్వీకరించిన పరకాల ప్రభాకర్‌.. మరొకరు చిరంజీవికి తొలి నుంచి రాజకీయ సలహాదారుగా ఉన్న పుచ్చలపల్లి వారి మనవడు మిత్రా. ఈ ఇద్దరూ కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారు కారు..వారికి ఉన్న బలం అల్లా ఒక్కటే.. భాషాదోషం లేకుండా, తడబడకుండా మాట్లాడగలగటం. పార్టీలో అభిమానులకు లభించిన ప్రాధాన్యమూ అంతంతమాత్రమేనని పలు జిల్లాల్లో తరచూ జరుగుతున్న గొడవలే స్పష్టం చేస్తున్నాయి. చిరంజీవి అభిమాన గణానికి,  అభిమానేతర వర్గానికి మధ్య అంతరం అన్ని నియోజక వర్గాల్లో కనిపిస్తూనే ఉన్నది. ఒక్కో నియోజక వర్గంలో పది నుంచి పదిహేను మంది టిక్కెట్ల కోసం ఆశిస్తున్నట్లు అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వీళ్లందరి మధ్య సమన్వయం కుదర్చటం చిరంజీవికి తల బొప్పి కట్టించే విషయం.
దీనికి తోడు మార్చి ఏప్రిల్‌లలో ఎన్నికలు జరగ వచ్చని ఎన్నికల సంఘం అప్పుడే సూచన ప్రాయంగా ప్రకటించింది. అంటే ఎన్నికలకు ఇంకా మూడు మాసాల గడువే ఉంది. ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు ఏమిటన్నది ఇంకా ఖరారు కానే లేదు. అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించాలని చిరంజీవి ఇసికి విజ్ఞప్తి చేసి వచ్చారు కూడా. ఎన్నికల సంఘం గుర్తు కేటాయించిన తరువాత దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటం పెద్ద సవాలు.. ప్రజారాజ్యం పార్టీ జెండా ఇప్పుడు ప్రజలకు బాగా తెలిసిపోయింది. ఓట్ల సమయంలో వేరే గుర్తు ఉంటే గ్రామీణ ఓటర్లు దాన్ని గుర్తించటం ఓ సమస్య. పార్టీ గుర్తు ఎంత తొందరగా ఖరారైతే అంత మంచిది. చివరి నిమిషంలో ఖరారైతే.. ఓటర్లలో అయోమయం నెలకొనవచ్చు. 
119 సీట్లు ఉన్న తెలంగాణాలో తెలంగాణ అనుకూల పార్టీలు మూడు వర్గాలుగా పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు ఇప్పటికైతే వినవస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ అనుకూల ఓట్లు ఈ మూడింటి మధ్య చీలిపోవచ్చు. దాని వల్ల అంతిమంగా సత్ఫలితాన్ని పొందేది కాంగ్రెసే.. ఈ అడ్డంకిని చిరంజీవి ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి. మరోవైపు ఎన్నికల పొత్తుల విషయంలోనూ చిరంజీవికి ఎదురుదెబ్బే తగిలింది. పార్టీ ప్రారంభానికి ముందు చిరంజీవితో ఆయన తము్మళ్లతో, బావమరిదితో మాట్లాడటానికి ఉత్సాహం చూపిన వారంతా ఒక్కరొక్కరుగా వెనక్కిపోయారు. మొదట్లో అత్యుత్సాహం ప్రదర్శించిన ఉభయ కమూ్యనిస్టులు ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు. కొంతకాలం ఊగిసలాడిన కెసిఆర్‌ సైతం మొహం చాటేశారు. ఇప్పుడు చిరంజీవితో కలిసి పని చేయాలని భావిస్తున్న వ్యక్తి నవతెలంగాణ పార్టీ అధినేత దేవేందర్‌ గౌడ్‌ మాత్రమే. దేవేందర్‌ గౌడ్‌ పార్టీ తెలంగాణ ప్రజలపై చూపిస్తున్న ప్రభావం అంతంతమాత్రమే. అలాంటప్పుడు గౌడ్‌ చిరంజీవికి ఎంతవరకు లాభం చేస్తారో చూడాల్సిందే. 
తెలుగు సినీపరిశ్రమను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కుటుంబం చిరంజీవిది. అలాంటి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే.. ఆయన వెంట ఆయనకు వెన్నుదన్నుగా సినీపరిశ్రమ కదలిరాకపోవటం విచిత్రం. పైగా సినీపరిశ్రమ మూడు ముక్కలుగా రాజకీయాల్లో చీలిపోయింది. సూపర్‌స్టార్‌ కుటుంబం కాంగ్రెస్‌ వైపు వెళ్తే.. నందమూరి కుటుంబం పూర్తిగా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యతల్ని భుజానికెత్తుకుంది. నాగార్జున సైతం కాంగ్రెస్‌ పథకాలకు ప్రచారం మొదలు పెట్టారు. ఈ దామాషా పద్ధతిలోనే అభిమానుల ఓట్లు పార్టీల మధ్య చీలుతాయన్నది నిర్వివాదం. అలాంటప్పుడు చిరంజీవి 225 సీట్లు సాధిస్తానని ఏ ధీమాతో చెప్తున్నారో ఆలోచించాలి.
చిరంజీవి ఇప్పటివరకు ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. అన్నీ తానే అయి.. అంతటా తానే నిలిచి పని చేస్తున్నారు. ఈ పోరాటంలో చివరికి విజేతగా నిలుస్తారా? విజితులవుతారా? వేచిచూద్దాం....

7, డిసెంబర్ 2008, ఆదివారం

నిజం నిప్పులాంటిది


పదహారు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత 46చానళ్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న జీ నెట్‌వర్‌‌క తెలుగులో కొత్త న్యూస్‌ చానల్‌ను ఒక సరికొత్త రూపంలో, సరికొత్త ఆలోచనలతో వార్తలను వార్తలుగా ప్రజల ముందుంచడానికి అత్యాధునిక హంగులతో సంసిద్ధమైంది. వక్రీకరణకు తావు లేకుండా, వార్తల్లోని సీరియస్‌నెస్‌ను, ప్రాధాన్యాన్ని ఎంతమాత్రం తగ్గించకుండా జీ24గంటలు ఫోకస్‌ చేస్తుంది. వార్తల్లోని వాస్తవాలపై ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తించటమే కొత్త నినాదంగా జీ24 గంటలు మీముందుకు వస్తున్నది..
నిజం నిప్పులాంటిది. ఒక నిజం అనేకుల జీవితాల్లో వెలుగుల్ని నింపితే.. మరో నిజం కొందరిని మాత్రం నిలువునా కాల్చేస్తుంది.. నిజానికి రూపం ఉండకపోవచ్చు.. కానీ, దానికి హేతువు ఉంటుంది. ఆ హేతువుకు అనేక రూపాలు ఉంటాయి. అవి భవిష్యత్తుకు నిర్దేశిస్తాయి. సామాజిక మార్పునకు నాంది పలుకుతాయి. ఈ లక్ష్యంతోనే జీ 24 గంటలు సరికొత్త రూపంలో తెలుగు మీడియాలో దూసుకువస్తున్నది. ఇంతకాలం అబద్ధాల నివురు వెనుక దాగిన నిజాన్ని వెలుగులోకి తెచ్చేందుకు సర్వ సన్నద్ధమవుతున్నది. వక్రీకరణలకు ఆలవాలంగా మారిన మీడియా ప్రపంచంలో వార్తల్ని వార్తలుగా ఇవ్వటమే ప్రధాన లక్ష్యంగా జీ24 గంటలు, అహరహం కృషి చేస్తుంది. .
మీడియా ప్రసారం చేసే ప్రతి వార్త గురించి ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. ప్రేక్షకుల ఆలోచనను తక్కువ అంచనా వేయరాదు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఉండటం, వారికి మార్గదర్శకం కావటం మీడియా లక్ష్యం కావాలి. వారి ఆలోచనలకు వార్తలు మరింత పదును పెట్టాలి కానీ, అర్థాలు అపార్థాలు కారాదు.. ప్రజలకోసం, ప్రజల పక్షంలో వార్తల ప్రసారాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత ఆసక్తికరంగా అందించటం జీ 24గంటలు చానల్‌ పరమార్థం..ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నిలవాలన్న సామాజిక బాధ్యతను జీ 24 గంటలు అక్షరాలా నెరవేరుస్తుంది.

ఇవీ మన దేశంపై జరిగిన దాడులు

మన దేశంలో టెరర్రిజం 1970వ దశకంలో మొదట కళు్ల తెరిచింది. అప్పటి నుంచి నాలుగేళ్ల క్రితం అంటే 2004 వరకు 4100 టెరర్రిస్టు దాడులు భారత మంతటా రకరకాల స్థాయిల్లో జరిగాయి. ప్రపంచ టెరర్రిజం డేటాబేస్‌ ఈ సమాచారాన్ని ధృవీకరించింది. ఈ డేటాబేస్‌ను అమెరికాలోని మేరీలాండ్‌ యూనివర్సిటీలోని స్టడీ ఆఫ్‌ టెరర్రిజం, రెస్పాన్సెస్‌ టు టెరర్రిజం విభాగాలు నిర్వహిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం 1970 నుంచి 2004 వరకు జరిగిన దాడుల్లో దాదాపు 12540మంది మృత్యువాత పడ్డారు.  దాదాపు సగటున ఏడాదికి 360 మంది చనిపోతున్నారు. 1991, 1992లలో భారత్‌లో ఉగ్రవాదం పరాకాష్టకు చేరుకుంది. ఆ రెండేళ్లలో వరుసగా 1184, 1132 మంది తీవ్రవాదుల ముష్కర చర్యలకు చనిపోయారు. దేశంలో జరుగుతున్న టెరర్రిస్టు దాడుల్లో 38.7శాతం ఫిదాయూలు ఇతర రూపాల్లో నేరుగా దాడులు జరపడం కాగా, 29.7శాతం బాంబు పేలుళ్ల రూపంలో జరుగుతున్నాయి. 25.5 శాతం హత్యల రూపంలో కొనసాగుతున్నాయి. 
దేశంలో 1993 నుంచి చోటు చేసుకున్న ప్రధాన టెరర్రిస్టు దాడుల వివరాలు...
12 మార్చి 1993.. బొంబాయిలో బాంబు పేలుళు్ల.. 257 మంది మృతి
14 ఫిబ్రవరి 1998..కోయంబత్తూరు బాంబు పేలుళు్ల.. 46మంది మృతి
1 అక్టోబర్‌, 2001.. శ్రీనగర్‌ అసెంబ్లీపై ఉగ్రవాదుల దాడి.. 35 మంది మరణం
13 డిసెంబర్‌, 2001.. పార్లమెంటు భవనంపై ఉగ్రవాదుల దాడి.. 7గురు మృతి..
21 డిసెంబర్‌ 2001.. కర్నూలు ట్రైన్‌ క్రాష్‌.. 20 మంది మృతి
10 సెప్టెంబర్‌, 2002.. రఫీగంజ్‌ రైలు దుర్ఘటన.. 130 మంది మృతి
27, ఫిబ్రవరి, 2002.. గుజరాత్‌లో గోధ్రా దహనం.. 55మంది మృతి
24 సెప్టెంబర్‌, 2002.. గుజరాత్‌ అక్షరధామ్‌ గుడిపై టెరర్రిస్టుల దాడి. 31 మంది మృతి 
13, మార్చి, 2003.. ముంబై రైల్లో బాంబు దాడి.. 11 మంది మృతి
14 మే, 2003 జము్మ ఆర్మీ క్యాంప్‌పై టెరర్రిస్టుల దాడి.. 30మంది మృతి 
25 ఆగస్టు, 2003.. ముంబయిలో రెండు కారు బాంబు పేలుళు్ల.. 60 మంది మృతి
15 ఆగస్టు, 2004.. అసోంలో బాంబు పేలుడు.. 16 మంది స్కూలు పిల్లల మరణం
5, జూలై, 2005.. అయోధ్యలో రామజన్మభూమిపై టెరర్రిస్టుల దాడి..
29 అక్టోబర్‌, 2005.. న్యూఢిల్లీలోని మూడు మార్కెట్లలో పేలుళు్ల.. 70 మంది దుర్మరణం
7, మార్చి, 2006..వారణాసిలోన సంకట్‌ మోచన్‌ మందిర్‌లో పేలుళు్ల..21మంది మృతి
11 జూలై  2006.. ముంబై లోకల్‌ రైళ్లలో ఏడు బాంబుల పేలుళు్ల.. 209 మంది మృతి
8 సెప్టెంబర్‌ 2006..ముంబై సమీపంలోని మాలేగావ్‌లో వరుస పేలుళు్ల.. 32 మంది మృతి
19 ఫిబ్రవరి, 2007.. సంఝోతా ఎక్‌‌సప్రెస్‌లో పేలుళు్ళ.. 66మంది సజీవ దహనం
18 మే, 2007.. హైదరాబాద్‌ మక్కా మసీద్‌లో పేలుడు..11 మంది మృతి
25ఆగస్టు, 2007..హైదరాబాద్‌ లుంబినీపార్‌‌క, గోకుల్‌చాట్‌లలో పేలుళు్ల.. 42మంది మృతి
11 అక్టోబర్‌, 2007..ఆజ్మీర్‌లో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి
14 అక్టోబర్‌, 2007.. లూథియానా సినిమాహాల్‌లో పేలుడు.. ఆర్గురు మృతి.
24 నవంబర్‌ 2007.. లక్నో, వారణాసి, ఫైజాబాద్‌లలో పేలుళు్ల...16మంది మృతి
13 మే, 2008.. జైపూర్‌లో తొమ్మిది చోట్ల వరుస పేలుళ్లు 63మంది దుర్మరణం...
25 జూలై 2008..బెంగళూరులో ఎనిమిది చోట్ల చిన్న చిన్న బాంబుపేలుళ్లు.. ఇద్దరు మృతి
26జూలై, 2008.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 17చోట్ల వరుస బాంబు పేలుళు్ల.. 45 మంది మృతి..
13 సెప్టెంబర్‌, 2008.. న్యూఢిల్లీ మార్కెట్లలో అయిదు చోట్ల పేలుళు్ల..21 మంది మృతి
27 సెప్టెంబర్‌, 2008.. ఢిల్లీ పూల మార్కెట్‌లో రెండు బాంబు పేలుళు్ల.. ఒకరి మృతి
29 సప్టెంబర్‌, 2008 మహారాష్ట్ర, గుజరాత్‌లలో పేలుళు్ల.. 10 మంది మృతి
29 సెప్టెంబర్‌, 2008.. మాలేగావ్‌లో మళ్లీ పేలుళు్ల.. 7గురు బలి
1 అక్టోబర్‌, 2008... అగర్తలాలో బాంబు పేలుడు.. నలుగురు మృతి
21 అక్టోబర్‌ 2008.. ఇంఫాల్‌లో బాంబు పేలు.. 17 మంది మృతి
30 అక్టోబర్‌ 2008, అసోంలో 11 బాంబు పేలుళు్ల.. 77మంది మృతి
26 నవంబర్‌, 2008, ముంబయిలో  ఉగ్రవాదుల దాడి.. 183 మంది మృతి

మొబైల్ నెట్వర్క్ నూ హైజాక్ చేసిన పాక్

భారత్‌పై జరుగుతున్న టెరర్రిస్టు దాడులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ పాకిస్తాన్‌ ఎప్పటికప్పుడు పతివ్రత మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. ముంబై దాడుల తరువాత కూడా అదే పనిగా పాత పాటే పాడుతూ వస్తున్నది. అధికారంలో ముషారఫ్‌ ఉన్నా, జర్దారీ ఉన్నా అదే తంతు.. దాడుల్లో అరెస్టు అయిన అజ్మల్‌ కసావ్‌ భారత్‌పై టెరర్‌ దాడులకు సంబంధించి ఒక్కో అంశాన్ని బయటపెడుతున్న కొద్దీ విస్మయం కలుగుతోంది. ముంబయికి సముద్ర మార్గంలో ఉగ్రవాదులను పంపించే కార్యక్రమాన్ని పాక్‌ నౌకాదళం స్వయంగా పర్యవేక్షించింది. మరోవైపు పాకిస్తాన్‌ స్థల సేన కాశ్మీర్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌  సరికొత్త ముప్పును తెచ్చి పెట్టింది.  సరిహద్దుకు ఆవలివైపున తన భూభాగంలో  తొమ్మిది మొబైల్‌ టవర్లను నెలకొల్పడంతో  మన దేశ అంతర్గత భద్రతకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ పెను ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే గమనించింది. అయినా కొట్టడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. భారత్‌ పాకిస్తాన్‌ సరిహద్దు లోని మునబావ్‌ దగ్గర హద్దుకు ఆవలి వైపున పాకిస్తాన్‌ భూభాగంలో ఒకదాని వెంట ఒకటిగా కనిపిస్తున్న మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేసింది. వీటిని చూస్తేనే చాలు.. మన భూభాగంలోని గ్రామాల ప్రజల గుండెల్లో రైళు్ల పరిగెత్తిస్తున్నాయి. ఈ టవర్ల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లనుందో సామాన్యుడికి సైతం అర్థమవుతున్నా, మన ప్రభుత్వానికి మాత్రం ఇంకా ఈ విషయం పట్టనే లేదు. ఈ మొబైల్‌ టవర్ల వల్ల రాజస్థాన్‌లోని మొత్తం మొబైల్‌ నెట్‌వర్‌‌క పాకిస్తాన్‌ చేతుల్లోకి వెళ్లినట్లయింది. ఈ ప్రమాదం ఏ స్థాయికి వెళ్లిందంటే పాకిస్తాన్‌ గూఢచారులు స్వేచ్ఛగా సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న తమ సహచరులతో స్వేచ్ఛగా లోకల్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకోవచ్చు. పాకిస్తాన్‌లోని ఏదైనా నెట్‌వర్‌‌క ఫ్రీకాల్‌ ఆఫర్‌ ఇచ్చిందంటే ఇక అడ్డేముంటుంది. ఇంత ఫ్రీగా గూఢచర్యం నిర్వహించే వ్యవస్థ ప్రపంచంలోనే మరొకటి ఉండదేమో. సరిహద్దు గ్రామాల్లో మన లోకల్‌ టవర్లు పనిచేయవు.. కానీ, పాకిస్తాన్‌ టవర్ల నుంచి మాత్రం స్పష్టమైన సిగ్నల్‌‌స వస్తాయి. అంటే ఈ ప్రాంతం నుంచి సైనికులు మాట్లాడే ప్రతి మాటా పాకిస్తాన్‌లోని కాల్‌ సెంటర్లలో రికార్డు అవుతుందన్నమాట. పాకిస్తాన్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క గురించి సరిహద్దుల్లో కీలకమైన 46 ప్రాంతాల్లో మన ప్రభుత్వం దర్యాప్తు చేసింది. అందులో  39 ప్రాంతాల్లో పాక్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క బ్రహ్మాండంగా పని చేస్తున్నట్లు తేలింది.  అంటే దాదాపు సరిహద్దు అంతటా పాక్‌ మొబైల్‌ నెట్‌వర్‌‌క పనిచేస్తున్నది. సరిహద్దుల్లో మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేయటం అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకం. పాకిస్తాన్‌ అన్ని అంతర్జాతీయ నిబంధనలకు అతీతమని భావిస్తుంది కాబట్టే ఈ ఆగడాలకు పాల్పడుతోంది. అన్నింటికీ మించి మునబావ్‌ఖోక్రాపార్‌ రహదారిలో రాకపోకలు ప్రారంభమైన తరువాత పాకిస్తాన్‌కు చెందిన సిమ్‌ కార్డులు మన దేశంలోకి యథేచ్ఛగా వచ్చేస్తున్నాయి. కనీసం వాటిని దేశంలోకి రాకుండా అడ్డుకునే అవకాశం కూడా లేకపోయింది. ప్రభుత్వం దీనిపై దష్టి కూడా పెట్టలేదు. ఈ సమస్య తీవ్రత తెలిసి కూడా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించటం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలకు సమాచార వ్యవస్థ ఎంత అవసరమో, అంతకంటే మించి దేశ భద్రత ముఖ్యం. ఇందుకోసం సరిహద్దుల్లో మొబైల్‌ నెట్‌వర్‌‌క పని చేయకుండా జామర్లు ఏర్పాటు చేయటం అత్యవసరం. పాకిస్తాన్‌ విషయంలో మన ప్రభుత్వాలు ఇప్పటికే దారుణమైన అలసత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. దాని ఫలితాన్ని ముంబయిలో నాలుగుసార్లు.. మిగతా చోట్ల పలుమార్లు  అనుభవించాం. ఇప్పటికైనా నేతలు కళు్ల తెరిస్తే ఈ దేశ ప్రజలు గుండె నిండా నిద్ర పోతారు.


2, డిసెంబర్ 2008, మంగళవారం

ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఎందుకు కావాలి?

ప్రధాన నగరాల్లో సామాన్యులను టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారీ దేశమంతటా తలెత్తే ప్రశ్న ఒకటే.. టెరర్రిజాన్ని అణచివేసేందుకు సమర్థమైన చట్టం అవసరం లేదా? అని... చట్టం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోతాయి. ఒకరు చట్టం అవసరం.. మరొకరికి అనవసరం.. ఇందులో  ఎలాంటి లాజిక్‌ ఉండదు. వాళు్ల కావాలన్నారు కాబట్టి వీళు్ల వద్దంటారు. అంతకు మించి ఓట్ల లెక్కలు కీలకమవుతాయి. ఒకవేళ చట్టం అంటూ చేస్తే ప్రస్తుత కాలానికి ఇలాంటి చట్టాలు పనికిరావన్న వాదనా చేస్తారు? దీనికీ లాజిక్‌ ఉండదు. ప్రపంచంలో అన్ని దేశాలూ చట్టాల్ని చేసుకుంటాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాయి. అయినా మన దేశంలో మాత్రం చట్టం అంటూ చేస్తే.. అది ఏ అంశానికి సంబంధించినదైనా సరే.. ఉల్లంఘనకు అవకాశం లేకుండా రూపొందదు. ఉల్లంఘనకు గురికాని చట్టం అంటూ ఉండదు. రూపకల్పన దశలోనే రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని `జాగ్రత్తలు' తీసుకుంటారు. టెరర్రిజం విషయంలో ఏ విధంగా వ్యవహరించాలన్నది ఇవాళ్టికీ మన రాజకీయ నాయకులకు అర్థం కావటం లేదు. ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ఏర్పాటు చేస్తామంటున్నారు.. నాలుగు దిక్కులా జాతీయ భద్రతా గార్డుల బలగాలను మోహరిస్తామంటున్నారు. కానీ చట్టం ప్రస్తావన మాత్రం చేయటం లేదు. చట్టం అంటూ ఒకటి ఉంటే కదా.. విచారణ సంస్థలు ఏవైనా ముందుకు పోగలవు! కఠిన చట్టం లేకుండా ఎఫ్‌బిఐని ఏర్పాటు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఇందుకు కారణం.. మరో పార్టీ చేసిన చట్టాన్ని ఈ పార్టీ రద్దు చేసింది కాబట్టి తిరిగి చట్టం చేయటం అంటే అది ప్రతిష్ఠకు భంగం కలిగినట్లే అవుతుంది కనుక.. రేపు ఆ పార్టీ వస్తే వారు ఓ చట్టాన్ని చేస్తారు... ఇంతే తప్ప ఈ దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి ఏ విధంగా రాజకీయాలకు అతీతంగా ఎలాంటి విధానం అనుసరించాలో ఏ రాజకీయ పార్టీకీ అవగాహన లేదు... అర్థమూ కాదు.. కనీసం ఆ దిశగా ఆలోచించనైనా ఆలోచించరు...ఇందుకు కారణాలు, భ్రమలు అనేకం ఉన్నాయి. 
1.
మన దేశంలో ఉగ్రవాదం పట్ల ప్రభుత్వ వర్గాలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, విశ్లేషకులకు కానీ ఒక స్పష్టమైన దృష్టికోణం లేదు. ఒకరి దృష్టిలో టెరర్రిస్టు అయిన వాడు.. మరొకరి దృష్టిలో  ఫ్రీడం ఫైటర్‌గా మారుతున్నాడు. పవిత్ర యుద్ధం చేస్తున్న యోధుడుగా కీర్తి పొందుతున్నాడు.. అంతే కానీ, ఉగ్రవాదంపై ఈ దేశంలో ఖచ్చితమైన నిర్వచనం అంటూ ఏమీ లేదు. మన రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ధోరణులు ఇందుకు స్పష్టమైన ఉదాహరణలు.  జాతీయ ప్రయోజనాల గురించి రాజకీయ పార్టీలు ఒక్క క్షణం అయినా సమష్టిగా, ఒకటిగా ఆలోచించవు. ఆందుకు అంగీకరించవు...
కానీ, కాస్త ఆలోచించండి.. విచక్షణ లేకుండా మానవ సమూహాన్ని హననం చేస్తున్న మూకను యోధులుగా నిర్వచించటం నాగరిక సమాజంలో సాధ్యమేనా? మారణకాండ సృష్టించే లక్ష్యంతో, ఒక పథకం ప్రకారం రక్తపుటేరులను పారించేవారిని ఏమనాలి? మార్కెట్‌లలో, షాపింగ్‌ మాల్‌లలో బాంబులు పెట్టడం, విద్యార్థులు ఉన్న బస్సులను కిడ్నాప్‌ చేయటం, థియేటర్లలోకి చొరబడి కుటుంబాలకు కుటుంబాలనే అంతం చేసేవారి  వారి పట్ల ఎవరైనా ఎలా వ్యవహరించాలి? చివరకు ఫిదాయూలు చొరబడి అత్యాధునిక ఆయుధాలతో మారణ కాండ చేయటం జిహాద్‌ అనటానికి ఎవరికైనా నోరెలా వస్తుంది. మతం పేరుతో, రాజకీయం „పేరుతో, దేవుడిపేరుతో,  భయోత్పాతాన్ని సృష్టించే క్షుద్ర హవనం ఇది. ఇది ఉద్యమం కాదు.. సిద్ధాంతం అంతకన్నా కాదు.. ఇది ఒక ఉన్మాదం.. ఒక దేశం మరో దేశంపై పరోక్షంగా చేస్తున్న యుద్ధం..
2
9/11 తరువాత అమెరికాలో కానీ, ఆ మరుసటి సంవత్సరం రష్యా థియేటర్‌లో చెచెన్‌ ఉగ్రవాదుల దాడుల తరువాత కానీ ఆయా దేశాల్లో దాడులు జరగలేదంటే అందుకు  కారణాలు వేరు.  అక్కడ ఉన్నది పరిమిత వర్గాలు..., పరిమిత జాతులు..అన్నింటికీ మించి అక్కడి రాజకీయ వ్యవస్థ వేరు. అమెరికాలోనైనా, రష్యాలోనైనా అడ్డగోలుగా ప్రభుత్వాలు పడిపోవు. ఒకసారి ఎన్నికలు పూర్తయితే, మళ్లీ నాలుగేళ్ల దాకా రాజకీయ పార్టీల మధ్య అనారోగ్యకరమైన స్పర్థలు ఉండవు. అత్యున్నత అధికార పీఠం ఎక్కే అర్హత ఎవరికైనా రెండే సార్లు దక్కుతుంది.  రష్యా అధ్యక్షుడుగా పుతిన్‌ ఎంత సమర్థంగా పని చేసినప్పటికీ, పరిమిత కాలం తరువాత అధికారం నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవటం అక్కడి రాజకీయ వ్యవస్థ గొప్పతనానికి నిదర్శనం.  మన దేశంలో ఉన్న పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇక్కడ కొల్లల కొద్దీ పార్టీలు.. అన్నీ పుట్టగొడుగులు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎప్పుడు ఏ పార్టీ కుర్చీకిందకు నీళు్ల తెస్తాయా అన్న ఆందోళనే ప్రధాని పీఠంపై కూర్చున్నాయనను పట్టి పీడిస్తుంది. చిన్న, చితక పార్టీల గొంతెమ్మ కోర్కెలను `సంకీర్ణ ధర్మాన్ని'  పాటించే పేరుతో తీర్చటంతోనే దొరవారి పుణ్యకాలం అంతా గడిచిపోతుంటే ప్రజల సమస్యలను పట్టించుకోవటం ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ అధికారం అనుభవించటానికి  పరిమితి అంటూ ఉండదు. ముదిమి వయసు మీదపడుతున్నా.. మోకాలి చిప్పలు అరిగిపోయినా, కళు్ల కనిపించకున్నా, కాళు్ల సహకరించకున్నా పదవి మాత్రం భేషుగ్గా అనుభవించవచ్చు. హత్యానేరం లాంటి తీవ్రమైన నేరాభియోగాలు నమోదయి, క్రిమినల్‌ కేసు విచారణలను ఎదుర్కొంటున్న వాళు్ల కూడా `నేరం రుజువు కానంతవరకు దోషి కాదన్న' న్యాయ సూత్రాన్ని అనుసరించి ఎంపిలుగా ఎన్నికవుతారు. ఇలాంటి అస్తవ్యస్త రాజకీయ వ్యవస్థ నుంచి ఉగ్రవాదానికే కాదు.. మరే సమస్యకైనా పరిష్కారాన్ని ఎలా ఆశించగలం?
3
మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడి సమాజంలోని వర్గాలు అనేకం. వాటి మధ్య వ్యత్యాసం అనంతం. ఆర్థిక, హార్థిక వ్యత్యాసాలు ఇక్కడ ఉన్నన్ని మరెక్కడా కనిపించవు.  ఇందులో కొన్ని వర్గాల పట్ల పాలకవర్గాలు చూపించినఉదాసీనత తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నది. ఈ అసంతృప్తిని ప్రత్యర్థి దేశ ఉగ్రవాద మూకలు సొము్మ చేసుకుంటున్నాయి. అణగారిన వర్గాల ఆర్థిక బలహీనతలను టెరర్రిస్టు, మావోయిస్టు సంస్థలు సొము్మ చేసుకుంటున్నాయనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. టెరర్రిస్టు సంస్థలను నిర్వహించేవారు విద్యావంతులైన మేధావులైతే, టెరర్‌ సృష్టించేవారు మాత్రం ఈ బలహీనులే. కోట్ల కొద్దీ సొము్మలు ఆశచూపి రిక్రూట్‌ చేసుకుంటారు. ఆ తరువాత అర్థం లేని సిద్ధాంతాలను నూరిపోసి, రెచ్చగొట్టి, మైండ్‌సెట్‌ మార్చి ఫిదాయూలుగా మార్చి  ఉన్మాదానికి రక్తతర్పణం చేస్తున్నారు.  మసూద్‌ అజర్‌ లాంటి నాయకులు సురక్షితంగానే ఉంటారు. సమిధలవుతున్నది మాత్రం మానవ బాంబులుగా మారిన యువతే. అమాయకుల ప్రాణాలను బలిగొంటూ తాము బలవుతున్నారు. తాము చేస్తున్న పని తప్పు అన్న ఆలోచన కూడా వారికి రానీయకుండా చనిపోయేదాకా పోరాడాలంటూ వాళ్ల మెదళ్లను పురుగు తొలిచినట్లు తొలిచి మనపైకి అసా్తల్రుగా వదులుతున్నారు. ఈ అణగారిన వర్గాల ఆర్థిక అభివృద్ధి  కోసం కొంతైనా చిత్తశుద్ధిని పాలకులు ప్రదర్శిస్తే.. యువతను వక్రమార్గం నుంచి తప్పించవచ్చు. దాంతో పాటే ఈ మార్గంలో ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న సంస్థల కార్యకలాపాలను నిరోధించటానికి పకడ్బందీగా ఉండే చట్టం మనకు కావాలి. అంతే కానీ, ఉత్తుత్తి మాటల చట్టాలు ఎందుకూ కొరగావు.
4.
దాడులు జరిగిన ప్రతిసారీ మీడియాలో బీభత్సమైన దృశ్యాలను ప్రదర్శిస్తారు. మానవీయ కథనాలను ప్రసారం చేస్తారు. తొలి దర్యాప్తు ఏజెన్సీలుగా మీడియాయే వ్యవహరిస్తుంది. వీటన్నిటి కంటే ముందు మీడియాలో వినిపించే ముందుమాట నిఘా వైఫల్యం. మన దేశంలో ప్రత్యేకించి చట్టాలు లేకపోవటం, నిఘా వ్యవస్థ కేంద్రీకృతం కాకపోవటం పెద్ద సమస్య. నిఘా అన్నది కేంద్ర, రాషా్టల్ర మధ్య రెండుగా పనిచేస్తోంది. ఉగ్రవాద వ్యవస్థ ఆనుపానులు కనిపెట్టే సామర్థ్యం రాషా్టల్ర వద్ద లేదు. సూక్ష్మస్థాయిలో పెద్ద ఎత్తున జరిగే రిక్రూట్‌మెంట్‌ను కనిపెట్టడం బొటాబొటి శిక్షణ కలిగిన రాష్రా్టల్ర నిఘా సిబ్బంది వల్ల కాదు. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయానికి  వంద అడుగుల దూరంలో ఉన్న టాస్‌‌కఫోర్‌‌స కార్యాలయంపై 2006లో మానవబాంబు దాడి. ఏదో భావోద్వేగంతో మాట్లాడటం కాకుండా నిఘా వ్యవస్థను చక్కబెట్టడంపై పూర్తి దృష్టి సారించాలి.  ఏ దేశానికైనా నిఘా వ్యవస్థే భద్రతకు, శాంతికి పునాది. ఇది గట్టిగా లేనప్పుడు మరేమీ చేయలేం. విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాషా్టల్రు నిరంతరంగా నిఘా ఉంచే విధంగా అన్ని అధికారాలను ఇస్తూ ఒక నిఘా సంస్థను నెలకొల్పటం, దానికి పూర్తి స్వతంత్రత కల్పించటం అవసరం. ఇందుకోసం ఒక చట్టం అవసరం. గుజరాత్‌ లాంటి రాషా్టల్రు ఏదైనా తీవ్రవాద నిరోధక చట్టాల్ని చేసుకుంటే, అది మోడీ లాంటి వాడు చేశాడు కాబట్టి గుడ్డిగా తొక్కిపెట్టటం సమర్థనీయం కాదు.. అది కాదనుకుంటే మరో మార్గం చూపించటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మనం చేయం.. మరొకరిని చేయనివ్వం అనే ధోరణి భారీ మూల్యానికి దారి తీస్తుంది. జాతీయ స్థాయిలో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ.. అందుకు తగిన చట్టం లోప రహితంగా ఉండటం తప్పనిసరి.  
5. 
టెరర్‌ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అందుకు పాల్పడిన సంస్థలను గుర్తించటం గొప్పతనం కాదు. దాడులు చేసిన టెరర్రిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయటంతోనే విజయం సాధించినట్లు కాదు.. వారి మూలాలను కూకటి వేళ్లతో సహా పీకినప్పుడే అది నిజమైన విజయం అవుతుంది. 
సమర్థమైన చట్టాలు అంటూ ఉండాలనేది ఇందుకోసమే. టెరర్‌ ఆపరేషన్‌లో పాల్గొనే కిందిస్థాయి వారిపై చర్యలు తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవచ్చు. కానీ, వాళ్లను ప్రేరేపించిన వారి బాస్‌లను ఏరివేయటం కోసం చట్టాలు కావాలి. వారికి నిధులు  సమీకరించి ఇస్తున్న సంస్థలను తునుమాడటం కోసం చట్టాలు కావాలి. కూటనీతి రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదులను సమర్థిస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసి, వాటి నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు కావాలి. 
6.
1985లో టెరర్రిస్‌‌ట్స అండ్‌ డిస్రప్టివ్‌‌స ఆక్టివిటీస్‌ ఆక్‌‌ట (టాడా) చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి 1987లో సవరణ కూడా జరిగింది. ఈ చట్టాన్ని 1995లో అంటే ముంబయిలో తొలి సారి వరుస పేలుళు్ల జరిగిన రెండేళ్లకు రద్దు చేశారు.  ఆ తరువాత 2001లో ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెరర్రిజం ఆర్డినెన్‌‌స(పోటో)ను తీసుకువచ్చారు. దీన్నే 2002 మార్చిలో ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెరర్రిజం ఆక్‌‌ట(పోటా)గా పార్లమెంటు ఆమోదించింది. ఈ రెండు చట్టాలు కూడా  వివిధ అమలు దశల్లో మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఇందుకు సంబంధించి పుష్కలమైన ఆధారాలూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా ఈ చట్టాలు కాలరాచాయి. సంక్షిప్తంగా చెప్పుకుంటే ఈ చట్టాల ప్రకారం  ఒక వ్యక్తిని 180 రోజుల పాటు ఎలాంటి  నేరాభియోగాలు నమోదు చేయకుండా నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టాల్లో టెరర్రిజం అన్న పదం నిర్వచనంలో అన్ని నేరాలూ కలిసిపోయాయి. చాలా విస్తృత పరిధిలో దీన్ని నిర్వచించారు. సాధారణ పీనల్‌ కోడ్‌లోని హత్య, దొంగతనం వంటి నేరాలు కూడా ఇందులో మిళితమయ్యాయి. ఈ చట్టాల కింద రాషా్టల్రకు అపరిమిత అధికారాలు లభించాయి. ఇంకేముంది, రాజకీయ కక్ష సాధింపు కోసం పలు రాషా్టల్రు ఈ చట్టాల్ని దారుణంగా దుర్వినియోగం చేశాయి. తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర వంటివి వీటిలో కొన్ని.  ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరులో ఈ చట్టాల్ని అడ్డగోలుగా వాడాయి కాబట్టే తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చివరకు రద్దు అయ్యాయి. 
మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్న పేరుతో చట్టాల్ని రద్దు చేస్తే సమస్య పరిష్కారమైందా? కాలేదు. పకడ్బందీగా, ఎలాంటి లొసుగులకు తావు లేకుండా చట్టాల్ని చేసే సామర్థ్యం ప్రభుత్వాలకు లేదా? అంటే అవుననే చెప్పాలి. దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా చట్టాన్ని రూపొందించటం తప్పదు. ఎప్పుడో 1935లో బ్రిటిష్‌వాడు చేసిన పాచి పట్టిన పోలీసు చట్టాన్నే ఇవాళ్టికీ మనం అనుసరిస్తున్నాం. వాడి చట్టాల్ని, వాడి సంస్కృతిని, వాడి నాగరికతను యథాతథంగా అనుకరించి, అనుసరించేటట్లయితే, స్వాతంత్య్రోద్యమం చేసిందెందుకో అర్థం కాదు. స్వతంత్రం రాకముందు ఎలా ఉందో.. వచ్చిన తరువాత కూడా అలాగే ఉంది. 
ముంబయిలో దాడుల తరువాత దేశ ప్రజలు తీవ్రస్థాయిలో  ప్రతిస్పందించటంతో ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. ఇంతకాలం వేచి చూద్దాం అన్న విధానం సమాజాన్ని భయం గుప్పిట్లోకి నెట్టి వేసింది. ఫెడరల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ ఏర్పాటు అవుతున్నది. కానీ, దీనికి ఉండే పరిధి ఏమిటి? పరిమితి ఏమిటి? అధికారం ఏమిటి? బాధ్యత ఏమిటన్న విషయాలపై ప్రభుత్వం నిక్కచ్చిగా మార్గదర్శకాలు జారీ చేయటం అవసరం. 
* రూల్‌ ఆఫ్‌ లా పరిధిలోనే ఒక శక్తిమంతమైన   ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని  తీసుకురావాలి. 
* ఈ ఎఫ్‌బిఐ కూడా దీని పరిధిలోనే ఉండాలి. ఉగ్రవాద సంస్థలను, వాటికి నిధులు అందించే సంస్థలను క్రమంగా నిర్వీర్యం చేసే విధంగా  ఈ చట్టం రూపకల్పన జరగాలి. 
* టెరర్రిస్టు సంస్థల్లో కేడర్‌ నియామకాలను ఇది నిరోధించగలగాలి. 
* నిధుల సమీకరణను ఆపగలగాలి.
*  నాయకులు, సభ్యులు, సానుభూతి పరులపై నిరంతరం నిఘా ఉంచేందుకు ఈ చట్టం వీలు కల్పించాలి. 
* పక్షపాతం లేకుండా, మినహాయింపులు, రాయితీలు లేకుండా అన్ని వర్గాల, మతాల, జాతుల ప్రజల పట్ల ఒకే విధంగా వ్యవహరించేలా చట్టం ఉండాలి. అందరికీ సమన్యాయం అన్న సూత్రాన్ని అక్షరాలా పాటించాలి.
* విమానాశ్రయాలు, హోటళు్ల, షాపింగ్‌ మాల్‌లు, మార్కెట్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలి. ప్రైవేటు మాల్‌లకు భద్రత ఏర్పాట్లు నెలకొల్పుకునేలా ఈ చట్టం పరిధిలోనే ఆదేశాలు జారీ చేయాలి. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* తమ తమ రాషా్టల్ల్రో  సంఘ విద్రోహ శక్తులను నిర్వీర్యం చేయటం స్థానిక ప్రభుత్వాల బాధ్యత. ఇలాంటి విషయాల్లో  అలసత్వానికి తావు లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి.
* సాధారణ క్రిమినల్‌ నేరాలకు, దేశద్రోహంతో సమానమైన టెరర్రిజంకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని విస్పష్టంగా నిర్వచించాలి. 
* సాక్షుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు కల్పించాలి.
* అన్నింటికంటే మించి ఈ చట్టం అమలు జాతీయ స్థాయిలో ఒకే విధంగా, ఒకే పద్ధతిలో అమలు కావాలి. 
* చట్టం అమలుపై జాతీయ స్థాయిలో పర్యవేక్షణ అవసరం. ఇది కేంద్రీకృతమై ఉండాలి. 
* ఈ చట్టం పరిధిలో ఏర్పాటు చేసే స్పెషల్‌ ఏజెన్సీలకు పూర్తి అధికారాలు, నిధుల కేటాయింపు సమృద్ధిగా ఉండాలి. 
ఇంత ఖచ్చితంగా చట్టాన్ని రూపొందించి అమలు చేస్తేనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం పడుతుంది. లేకపోతే.. ముంబయి తాజ్‌పై ఫిదాయూల దాడి అనంతరం అప్పటి ఉప ముఖ్యమంత్రి ఆర్‌.ఆర్‌ పాటిల్‌ అన్నట్లు `బడే బడే షహరోంమే.. ఐసా ఛోటీ ఛోటీ చీజెస్‌ హోతే రహతీహై' అనుకుంటూ ఉండాలి.

29, నవంబర్ 2008, శనివారం

వంటవాడిగా ఉగ్రవాది

భారత దేశంపై ఉగ్రవాదులు కనీవినీ ఎరుగని రీతిలో జరిపిన యుద్ధంలో క్షణక్షణానికి సంచలన విషయాలు బయటపెడుతున్నాయి. కరాచీ నుంచి గేట్‌వే దాకా సముద్ర మార్గంలో టెరర్రిస్టులు చొరబడటమే విస్మయం అనుకుంటే, అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగుచూసింది. మారణకాండకు తెగబడిన వారిలో ఒకరు గత పది మాసాలుగా తాజ్‌ హోటల్‌లో ట్రైనీ చెఫ్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా వెలుగుచూసిన ఈ నిజం  కేంద్ర హోం శాఖకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ముంబయి మహానగరాన్ని కాష్టాల గడ్డగా మార్చటానికి లష్కర్‌ ఉగ్రవాదులు పన్నిన పన్నాగాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న కొద్దీ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పన్నెండు నాటికన్‌ మైళ్ల మేర తీర ప్రాంతంలో నిరంతర నిఘా కళు్ల కప్పి దేశంలోకి ముష్కరులు ప్రవేశించటమే మింగుడు పడని అంశంగా మారింది. టెరర్రిస్టులు కరాచీ నుంచి పోర్‌బందర్‌ చేరుకుని అక్కడ కుబేర్‌ అనే బోటును హైజాక్‌ చేశారు. అక్కడి నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియాకు మరో నాలుగు రబ్బరు బోట్లలో చేరుకున్నారు. వాస్తవంగా నవంబర్‌ 26న ఘాతుకానికి ముందు టెరర్రిస్టుల చొరబాటుకు సంబంధించిన వివరం ఇది. కానీ, ఈ దారుణంకోసం ఏడాది క్రితం నుంచే కరాచీలో కుట్ర జరిగింది. ఘటనలో పాల్గొన్న అందరికీ అత్యాధునిక శిక్షణ ఇవ్వబడింది. భారత ప్రథమ శత్రువు దావూద్‌ ఇబ్రహిం సముద్రమార్గం గుండా నడిపిస్తున్న నెట్‌వర్‌‌క ముష్కరులకు చక్కగా ఉపయోగపడింది. అయితే తుట్టతుది ఆపరేషన్‌కు జరిగిన తంతు ఇది. దీనికి ముందస్తుగా టెరర్రిస్టు సంస్థ లష్కర్‌ భారీ కసరత్తే చేసింది. అందులో భాగంగానే ఇద్దరు ఉగ్రవాదులను అటు తాజ్‌లో, ఇటు ఓబెరాయ్‌లో చొరబర్చింది. తాజ్‌ హోటల్‌లో పది నెలల నుంచే ఈ ఆపరేషన్‌కు కుట్ర జరుగుతున్నదన్న విషయం నిర్ధారణ కావటం ఉగ్రవాదులు దేశంలో ఏ మేరకు విస్తరించారో అర్థమవుతోంది. హోటల్‌ తాజ్‌లో జరిగిన దాడిలో అయిదుగురు వంటవాళు్ల మరణించారు. వారిలో ఒక ట్రైనీ చెఫ్‌ తాను చనిపోయే ముందు తన తండ్రికి ఫోన్‌ చేసి పది మాసాలుగా తనతో పని చేసిన మిత్రుడే తనపై కాల్పులు జరిపాడని చెప్పాడు. దీంతో తాజ్‌లో చాలా కాలం నుంచే ఉగ్రవాదులు మకాం వేసినట్లు స్పష్టమైంది. వంటవాడిగా ఉన్న కాలంలోనే హోటల్‌లోకి వివిధ రకాలుగా సరుకులు వస్తున్న సమయంలో తెలివిగా మారణాయుధాలను, మందుగుండు సామాగ్రిని హోటల్‌లోకి చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. విచిత్రమేమంటే తాజ్‌, ఓబెరాయ్‌లలో ఏడాది నుంచే ఉగ్రవాదులు కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేసుకున్నారని కేంద్ర మంత్రి కపిల్‌సిబల్‌ స్వయంగా ఓ చానల్‌తో అన్నారంటేనే మన ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అంటే దాడికి సంబంధించిన సమాచారం ఎంతో కొంత కేంద్రం వద్ద ఉంది. కపిల్‌ సిబల్‌ ఇచ్చిన సమాచారానికి ఆధారం ఏమిటి? తెలిసిన సమాచారాన్ని సంబంధిత వర్గాల మధ్య కము్యనికేట్‌ అయిందా? అయితే ఎందుకు నియంత్రించలేదు? పది నెలలుగా ఒక వంటవాడే ఉన్నాడా, మరికొందరు హోటల్‌లో మకాం వేశారా అన్నది ఇంకా స్పష్టం కావలసి ఉంది. అయితే ఒక విదేశీ నాగరికుడికి హోటల్‌ మేనేజిమెంట్‌ శిక్షణ ఇవ్వటానికి హోటల్‌ తాజ్‌ ఏ ప్రాతిపదికన అంగీకరించిందన్నది అంతుపట్టని విషయం. అంత పెద్ద హోటల్‌లో, విఐపిల తాకిడి ఎక్కువగా ఉండే చోట ఒక ఉద్యోగం ఇస్తున్నప్పుడు అతనికి సంబంధించిన అన్ని వివరాలను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోకుండానే ఎలా ఇచ్చారు? లోతుల్లోకి వెళ్తే కానీ, డొంక కదలదు. అంతే కాదు..ఈ ఘాతుక చర్యలో  స్థానిక సంఘ విద్రోహుల ప్రమేయాన్నీ కొట్టిపారేయలేం.. నాలుగు రబ్బరు బోట్లలో చొరబడ్డ టెరర్రిస్టులు అందరి కళు్ల కప్పి స్థానికుల సహకారం లేకుండా ఎలా ముందుకు వెళ్లగలిగారు?  ప్రముఖ ప్రదేశాలకు దూరంగా ఉన్న నారిమన్‌ హౌస్‌లో ఇజ్రాయిలీలు ఉంటున్న సమాచారం ఉగ్రవాదులకు ఎలా ఉప్పందింది? ఈ ప్రశ్నలన్నింటినీ ఛేదించాల్సి ఉంది. కేంద్ర సర్కారు జాతికి జవాబుదారి.... కాబట్టి వీటికి సమాధానాలు ఇవ్వాల్సింది సర్కారు పెద్దలే. ``ఇంతకాలం సహించాము.. ఇప్పటికే చాలా చాలా మూల్యం చెల్లించుకున్నాం.. ఇక సహించేది లేదు.. ఏదో ఒకటి చేయండి.. చేసి చూపించండి''.. ప్రజలంతా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఇదే. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వేచి చూడాలి...

జై జవాన్‌..

జై జవాన్‌... పాలకులు ఉదాసీనత వహించినప్పుడు ఈ జవానులే ఈరోజు సామాన్యుల పాలిటి రక్షకులయ్యారు. నిద్రాహారాలు మాని పక్కా వూ్యహంతో, యాభై తొమ్మిది గంటల సుదీర్ఘ పోరాటం చేసి శత్రువులను నిర్జించిన అసాధారణ పటిమ నేషనల్‌ సెక్యూరిటీ గార్‌‌డ్స కమాండోలది. మాతృభూమిని కబళించేందుకు వచ్చిన ముష్కరులను కలుగుల్లోంచి బయటకు రాకుండానే అంతం చేసిన ఎన్‌ఎస్‌జిలకు జాతి యావత్తూ సలామ్‌ చేస్తోంది. 
ముంబై లోని నారిమన్‌ హౌస్‌, ఓబెరాయ్‌ హోటల్‌ ల వద్ద ఆపరేషన్‌ టోర్నడోను విజయవంతం చేసి బయటకు వచ్చిన వీర జవానులకు అక్కడి స్థానికులు పట్టిన నీరాజనం అపురూపం.  మీడియాలో కనిపించిన ఆ దృశ్యాలు జాతి శౌర్యానికి ప్రతీకలు.. మన సైనికుల అసాధారణ పాటవానికి నిలువు దర్పణాలు..మిన్నంటిన నినాదాలు భారత సైనిక కీర్తిపతాకను వినువీధిన ఎగరేస్తున్నాయి. భారత్‌పై తెగబడ్డ ఉగ్రవాదానికి ముఖం బద్దలయ్యే జవాబు చెప్తున్నాయి.... ఎవరు కన్నెత్తి చూసినా చావు దెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నాయి.
ప్రతి ఒక్క పెదవి పైనా ఒకే మాట.. ఒకే నినాదం.. వందే మాతరమ్‌.. భారత మాతాకీ జై అని... ప్రతి ఒక్క చెయూ్య చేస్తున్నది తన జవానుకు సగర్వంగా  సలామ్‌.. తమ దేశాన్ని, తమ ప్రాణాలను కాపాడిన వీర జవానులను మనసారా అభినందిస్తున్నది. యుద్ధంలో  ఎన్‌ఎస్‌జి విజయాన్ని గుండెల నిండా నింపుకున్న ఆనందం వారి భావోద్వేగంలో అణువణువునా తొణికిసలాడింది.  రెండు రోజులుగా తలుపులు బిగించుకుని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజల్ని ఎన్‌ఎస్‌జి విజయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. రెచ్చిపోయిన ఉత్సాహంతో సైనికులను అభినందించేందుకు వేల సంఖ్యలో వచ్చిన జన సందోహాన్ని చూస్తె ప్రతి భారతీయుడి మనసు పులకరించి పోతుంది. దాదాపు 59 గంటల పాటు నిద్రాహారాలు మాని శత్రువులను పరిమార్చటం కోసమే ఎన్‌ఎస్‌జి శ్రమించింది. జన్మభూమిని కంటికి రెప్పలా కాపాడటంలో ఎన్‌ఎస్‌జి ఏనాడూ వెనుకడుగు వేయలేదు..ఓటమి అంటే ఏమిటో దానికి తెలియదు.. అక్షరధామ్‌ ఆపరేషన్‌ నుంచి ఆపరేషన్‌ టోర్నడో, ఆపరేషన్‌ సైక్లోన్‌ల దాకా దేశం పట్ల వారి కమిట్‌మెంట్‌ ఎన్నడూ వృథా పోలేదు. అడుగడుగునా అవరోధాలు ఎదురైనా ఆపరేషన్‌ను సక్సెస్‌ చేయటంలో , ఉన్మాదులను మట్టుపెట్టడంలో వారి నైపుణ్యం అపూర్వమ్.  నారిమన్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన జవానులను చూసిన ప్రతి ఒక్కరికీ ఆ క్షణంలో అనిపించింది ఒక్కటే.. ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలా వీళ్లు అని..
భారత దేశం హృదయపూర్వకంగా తన సైనికులను సల్యూట్‌ చేస్తోంది. త్రివర్ణ పతాకం తిరిగి సంతోషంగా వినీలాకాశంలో రెపరెపలాడుతోంది. జై హింద్.


28, నవంబర్ 2008, శుక్రవారం

పౌరుషం లేని పాలకులు

భారత దేశంపై మహా సంగ్రామానికి పూనుకునే దుస్సాహసానికి ఉగ్రవాదులు పాల్పడ్డారంటే అందుకు బాధ్యులెవరు? అసంఖ్యాకంగా అత్యాధునిక ఆయుధ సంపత్తితో అతి తేలిగ్గా వాణిజ్యరాజధానిలోకి ప్రవేశించి దేశానికి ప్రతీకలుగా నిలిచిన వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయటంలో విజయం సాధించగలగటం ఎవరి వైఫల్యం?కనీవినీ ఎరుగని స్థాయిలో మహామారణ కాండకు పాల్పటం ఎలా సాధ్యపడింది. ఎక్కడో కరాచీ నుంచి కార్గో షిప్లలో బయలుదేరి, అక్కడి నుంచి బోట్లలో గేట్వేకు చేరుకుని బాంబుల మూటలతో, ఎకె గన్నులతో దాదాపు 20 మంది.. బీభత్సాన్ని సృష్టించటం అసాధారణం.  పదుల కిలోల కొద్దీ ఆర్డీఎక్‌‌.. సంచుల నిండా గ్రెనేడ్లు.. రాకెట్లాంచర్లు.. ఆధునిక మారణాయుధాలతో స్వేచ్ఛగా ఎలా ప్రవేశించగలిగారు? విచ్చలవిడిగా, పిచ్చి పట్టినట్లు  విచక్షణ లేకుండా కాల్పులు జరుపుతుంటే ఏం జరుగుతోందో తెలిసే లోగానే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ప్రభుత్వాలు చేష్టలుగి పోయాయి. పాతికేళ్ల లోపు కురవ్రాళు్ల మహామారణ కాండకు పదుల సంఖ్యలో వాణిజ్య రాజధానిలోకి ప్రవేశిస్తుంటే సరిహద్దుల్లో వాళ్లను అడ్డుకునే వ్యవస్థే లేకుండా పోయింది. రెండు బోట్లలో  దిగిన వీళ్లను జాలర్లు పసిగట్టి పోలీసులను హెచ్చరించినా ఫలితలేకపోయింది. ఖాకీలు అన్నీ సర్దుకుని వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోయింది. చివరకు వాళ్ల వాహనాలనే కబ్జా చేసి పారిపోతున్నా పట్టుకోలేని అసమర్థత మన వ్యవస్థది. ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించిన తీరు చూస్తే.. మన దేశంలో అసలు రక్షణ వ్యవస్థ అన్నది ఒకటి ఉందా? అన్న అనుమానం కలుగుతుంది. దాడికి ఆరు నెలల ముందే బ్లూప్రింట్తయారైంది. ముంబై ఆపరేషన్కు `నవంబర్‌ 26 దివాళి'  అని కోడ్కూడా పెట్టుకున్నారు ముష్కరులు. 12 నవంబర్ కరాచీ నుంచి కార్గో షిప్లో కమాండర్ముంబయి బయలు దేరాడు. మార్గ మధ్యంలో లష్కర్ముఖ్యనేతల్లో నాలుగో వ్యక్తికి ఫోన్చేసి తాను మరో ఏడెనిమిది గంటల్లో  ముంబై చేరుతున్నట్లు తెలిపాడు. సురక్షితంగా గేట్వే చేరుకుని అక్కడి నుంచి ముంబైలోకి అతను అనుచరులతో ప్రవేశించాడు. 19, 20 తేదీలలో నగరమంతా తిరిగి ఆనుపానులన్నీ తెలుసుకున్నారు. తరువాత 26 నాటికి ప్రత్యేక బోట్లలఫిదాయూలు దిగారు. గ్రూపులుగా విడిపోయారు. తాము అనుకున్న విధంగా దీపావళి జరుపుకున్నారు.... వందల ప్రాణాలను బలిపెట్టి...

వీరికి సహకరించిన వారిలో మన పంజాబ్కే చెందిన ఇంటిదొంగ ఒకరున్నట్లు తెలుస్తోంది. ఇతను రెగ్యులర్గా లష్కర్కమాండర్తో సంప్రతింపులు జరిపినట్లు సమాచారం. టెరర్రిస్టులను తీసుకువచ్చిన బోటును నడిపిందికూడా భారతీయుడే. తాము గమ్యం చేరగానే అతణ్ణి ఉగ్రవాదులు హతమార్చారు. వాస్తవానికి సెప్టెంబర్లోనే ఉగ్రవాదుల దాడి జరుగవచ్చని ప్రముఖ విదేశీ నిఘా ఏజెన్సీ  ఒకటి `రా' వర్గాలను హెచ్చరించింది. `రా' ఐబికి సమాచారం లిపింది. విషయాన్ని యథావిధిగా ముంబయి పోలీసులకు, కేంద్ర హోం శాఖకు అందించి ఐబి చేతులు దులుపుకుంది. సమాచారం మేరకు సెప్టెంబర్‌ 24 దాడి జరగాల్సి ఉంది. అప్పుడు పోలీసులు కాస్త హడావుడి చేసి ఊరుకున్నారు. కానీ, అదే దాడి సరిగ్గా రెండు నెలల తరువాత జరిగింది. గత మే నెల 13 జైపూర్లో దాడులు జరిగినప్పటి నుంచీ జూన్‌, ఆగస్టు మినహా మిగతా అన్ని నెలల్లో ఒక్కో మహానగరంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఫెడరల్సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సి ఉందంటూ తాజాగా ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యను హోంమంత్రి శివరాజ్పాటిల్ఎప్పుడో చేసేశారు. బ్రిటిష్కాలం నాటి బూజు పట్టిన పోలీసు చట్టాన్ని సంస్కరించాలన్న మెరుపు ఆలోచనా సింగ్గారికి ఇప్పుడే వచ్చింది. ఒక నగరం తరువాత ఒకటి దాడికి గురవుతున్నా, సదరు సంస్థను ఏర్పాటు చేయటమో, ప్రత్యేక చట్టాన్నో చేసే ఓపికా, తీరికా పాలకులకు ఎంతమాత్రం చిక్కటం లేదు. ఎన్నికల ప్రచారాలు మాత్రం భేషుగ్గా చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడూ  గంభీరోపన్యాసాలకు కొదువ లేదు. శవాలపై రాజకీయ ఫలాలను ఏరుకునే ప్రయత్నాలలోనూ ఎవరికి వారే సాటి. ప్రజల అస్తిత్వమే ప్రమాదంలో పడుతున్నా  వారి ధోరణి ఎంతమాత్రం మారదు. 40 గంటల పాటు ఎన్ఎస్జి కమాండోలు ఉగ్రవాదులు యుద్ధం చేశారు. ఇక యథావిధిగా పరామర్శల పర్వం ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సంకీర్ణ కూటమి అధినేత్రి.. రాజకీయ పార్టీల నేతలు, ఛోటా మోటా నాయకులు, మంత్రులు పొలోమని ముంబయిని చుట్టుముట్టనున్నారు. గంభరమైన పదజాలంతో రాజకీయం చేసేందుకు వారికిది సువర్ణావకాశం.. కానీ బాధితులకు కావలసింది నేతల మాటలు కాదు.. ప్రధానమంత్రి చేస్తానని చెప్తున్నవి చేతల్లో చూడటమే వాళ్లకు కావాలి. ఇవాళ భద్రత కావలసింది నేతలకు కాదు.. వారిని ఎన్నుకున్న సామాన్యుడికి.. చట్టం చేయటానికి నాయకులకు ఇంత వెరపెందుకో సామాన్యులకు అర్థం కాదు. కేంద్రంలోని పాలక వర్గం ఉన్న చట్టాన్ని రద్దు చేస్తుంది.. పోనీ ఒక రాష్ర్టం తాను చట్టం చేసుకుంటానన్నా దానికీ మోకాలడ్డుతుంది... అంతా రాజకీయమే.. అన్నింటా రాజకీయమే..దీనికి పరిమితి లేదు.. నేతలకు పరిణితి లేదు. ఇది రాజనీతి కాదు.. కూటనీతి. ప్రజాస్వామ్యం ముసుగులో నాయకులు ప్రజలను పందెంగా పెట్టి ఆడుతున్న మృత్యుక్రీడ. మతంతో ప్రమేయం లేకుండా కలుగుల్లో దాగిన ఉగ్రవాదులను ఏరివేయటానికి రాజకీయ సంకల్పం అవసరం. అవసరమైతే అందుకోసం అధికారాన్ని పణంగా పెట్టడానికైనా వెనుకాడవద్దు. బంగ్లాదేశ్విషయంలో, ఖలిస్తాన్విషయంలో ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.. హైదరాబాద్సంస్థానం విలీనం కోసం సర్దార్పటేల్ఎంత ఖచ్చితంగా సైనిక చర్య జరిపారో నేతలు గ్రహించాలి. ఉగ్రవాదానికి ఇస్లాం, హిందూ అన్న తేడా లేదు. దేశానికి ద్రోహం చేసిన వాడవడైనా వెంటాడి వెంటాడి వేటాడాలి. వాళ్ల పట్ల చూపే కనికరం వందల ప్రాణాలతో చెలగాటం అన్నది నిష్ఠుర సత్యం. మన దేశ అంతర్గత భద్రత కంటే అంతర్జాతీయ శాంతి వ్యవహారాలు ముఖ్యమేం కాదు.. మనం శాంతికాముకులమన్న పేరు కోసం పక్కలో బల్లెంలా తయారైన శత్రువును విడిచిపెట్టడం మూర్ఖత్వం అవుతుంది. విస్పష్టంగా పాక్ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నట్లు మనకు తెలుసు. ప్రథమ శత్రువు దావూద్ఇబ్రహిం అక్కడే ఉన్నాడనీ తెలుసు. వారికి పాక్ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తోన్న విషయమూ తెలుసు. ప్రత్యక్ష యుద్ధానికి దిగలేక.. పరోక్షంగా దేశంపై పట్టు బిగించేందుకు పాకిస్తాన్ప్రయత్నిస్తున్నదనీ తెలుసు. అలాంటి దేశంతో చర్చలు కాలాయాపనే తప్ప పరిష్కారానికి మార్గం చూపవన్నదీ మన పాలకులకు తెలుసు. అయినా అగ్రరాజ్యానికి ఉన్న ధైర్యం మనకు లేకపోయింది. టెరర్రిస్టు దాడి జరిగిన వెంటనే ఇది పిరికిపందల చర్య అని ట్లాడే నాయకుల చేవ పిరికితనం కాదా? రాజ్యం వీర భోజ్యం అన్నారు పెద్దలు. రాజ్యం ఏలే పాలకుడికి ప్రజలను కాపాడే వీరత్వం, పౌరుషం ఉండాలి. పౌరుషమే ఇవాల్టి పాలకులకు కరవైనప్పుడు మృత్యు ముఖంలో ఉన్న పాలితులు ఎవరిని నిందించితే మాత్రం ఏం ప్రయోజనం

25, నవంబర్ 2008, మంగళవారం

అభద్రతానగరం భాగ్యనగరం

రాష్ట్ర రాజ`దాని భాగ్యనగరం... ఒకప్పుడు దేశంలోనే ఎలాంటి అలజడులు ఎరుగని సుర`ిత ప్రాంతంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు కూడా సుర`ిత ప్రాంతంగానే ఉంది. కానీ, అది సామాన్యులకు కాదు... రౌడీ షీటర్లకు.. దొంగచాటుగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన వారికి... మాఫియా గ్యాంగ్‌లకు, ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు తిరుగులేని అడ్డాగా మారిపోయింది. ఏ ఒక్క నేరంలోనూ నేరగాడు ఎవరన్నది బయటపడలేదు. చివరకు ఇక్కడ జరిగిన మారణకాండల వెనుక కుట్రలను సైతం పోలీసులు ఛేదించింది లేదు.. ఏం చేసినా తప్పించుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇక ఈ నగరంలో సామాన్యుడికి భద్రత జాడ దొరికేదెలా?
పవిత్ర ప్రార్థనాలయం మక్కా మసీదులో `ాంబు పేలుడు జరిగి ఏడాది దాటిపోయి మూడు నెలలు కావస్తున్నది.  ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరో పోలీసులకు ఇంతవరకూ కనీసం క్లూ కూడా దొరకలేదు. మొ`ైల్‌ ఫోన్‌ ద్వారా `ాంబును పేల్చారని చెప్పటమే తప్ప,  ఈ మిస్టరీని ఛేదించటం మన వారి వల్ల కానే లేదు. ఇక ఆ తరువాత గోకుల్‌చాట్‌, లుంబినీపార్‌‌కల్లో  ఇక జంట పేలుళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. మక్కామసీదు పేలుడు సందర్భంలోనే కాదు.. ఈ జంట పేలుళ్ల సమయంలోనూ పోలీసులు ప్రాథమిక సమాచారం అంటూ ముందుగా వెల్లడించేది బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ, పాకిస్తాన్‌కు చెందిన లష్కర్‌, జైష్‌ తీవ్రవాదుల కుట్ర ఫలితమే ఈ ఘటనలని... అంతటితో వ్యవహారం ముగిసిపోతుంది. ఆ తరువాత విచారణ ఏమేరకు పురోగతి సా`దిస్తుందన్నది  ఎవరికీ తెలియదు.. మక్కామసీదు పేలుడు కేసులో ముపై్ఫ మందిని అరెస్టు చేసినట్లు గతంలో అ`దికారులు చెప్పారు. చివరకు వారిలో  ఒక్కరు కూడా నేరంతో సంబం`దం ఉన్నవారు కాదని తేలింది. చివరకు ఈ కేసుతో షాహిద్‌ బిలాల్‌ అనే తీవ్రవాదికి పాత్ర ఉందన్నారు. అతను కాస్తా పాకిస్తాన్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఇక కేసు కథ కంచికిపోయినట్లే అయిందనుకున్నాం. ఇక ఇప్పుడు మాలేగావ్‌ పేలుళ్లలో నిందితులైన కల్నల్‌ పురోహిత్‌, సా`ద్వి ప్రజ్ఞాసింగ్‌, దయానంద్‌ పాండేలకు సంబం`దం ఉన్నదని అనుమానిస్తున్నారు. వారి కోసం ముంబయి వెళ్లి విచారణ చేస్తున్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు సంబం`దించిన ప్రతి కేసు విషయంలోనూ పోలీసులు వైఫల్యం చెందుతూనే ఉన్నారన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.  ఈ వైఫల్యం వల్లనే దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా దాని మూలాలు హైదరా`ాద్‌లో తేలుతున్నాయి. `ెంగుళూరు ఐఐఎం పేలుడు కానీ, కాన్పూర్‌ అల్లర్లు కానీ, వారణాసి పేలుళ్ల వెనుక కూడా హైదరా`ాద్‌లో తీగలు బయటపడుతున్నాయి.  ఒక ముజి`్‌.. టెరర్రిస్టు.. ఒక అజీజ్‌ రెడ్డి.. మాఫియా, ఒక అయూ`్‌ఖాన్‌.. గ్యాంగ్‌స్టర్‌.. ఒక నయూమ్‌.. మాజీ నక్సల్‌.. ఒక డిజెఎస్‌.. మతోన్మాద సంస్థ.. ఇలాంటి వారందరికీ భాగ్యనగరం సౌభాగ్యనగరంగా మారింది. ఇందుకు రాజకీయ నాయకుల అండ కూడా కొండంత ఉంది. టెరర్రిస్టు సానుభూతిపరుల ఇళ్లకు సా`ాత్తూ రాష్ట్ర మంత్రులే వెళ్లి పరామర్శిస్తారు.. కరడుగట్టిన ఉగ్రవాదికి సత్ప్రవర్తన సర్టిఫికెట్‌ ఇచ్చి ప్రభుత్వమే `ƒమాభి`ƒ ప్రసాదిస్తుంది... మక్కామసీదు పేలుడైనా, దిల్‌సుఖ్‌నగర్‌ సాయి`ా`ా గుడి పేలుడైనా, గోకుల్‌చాట్‌పేలుడైనా.. ఒకటే.. పోలీసుల చేతులకే రాజకీయ సంకెళు్ల పడితే.. నేరగాళ్లకు `ేడీలు వేసేదెవరు? టెరర్రిస్టులకు మతోన్మాదమే తప్ప మతం ఉండదని మన రాజకీయ నాయకులు గ్రహించి, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తేనే టెరర్రిస్టులను వెంటాడి వేటాడటం సా`ద్యపడుతుంది.

మరో అయిదేళ్లలో భూగోళం విచ్ఛిన్నం కాబోతోందా?

ఈ భూమి వయస్సు ఇంకెన్నాళు్ల? మరో అయిదేళ్లలో భూగోళం విచ్ఛిన్నం కాబోతోందా? కలియుగం అప్పుడే అంతం అవుతోందా? ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు లెక్కలు వేసి తేదీలు చెప్తున్నారు. మత గ్రంథాలు ముహూర్తాలు నిశ్చయించేశాయి. ఈ గణాంకాల ప్రకారం ఈ భూమి మరో అయిదేళ్లలో అంతం కాబోతోంది. రకరకాల కారణాల వల్ల 2012 డిసెంబర్‌ 21 భూమి మనుగడకు ఆఖరు తేదీ కానుందని శాస్త్రవేత్తలంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? 

2012 ప్రస్తుతం హాట్‌ టాపిక్‌.. ప్రపంచమంతా ఇప్పుడు ఈ సంవత్సరం గురించే వేడి వేడిగా చర్చిస్తోంది. 1999లో భూమి అంతం కాబోతోందని లెక్కలు వేసినట్లే, 2012 కూడా భూమి జీవితానికి చివరి సంవత్సరంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఖగోళ శాస్త్రంలో, సంఖ్యాశాస్త్రంలో తలలు పండిన పెద్దలంతా ఇదే మాట చెప్తున్నారు. పవిత్ర గ్రంథం బైబిల్‌లో  భూప్రళయానికి పెట్టిన ముహూర్తం కూడా ఇదే. శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్తున్న ప్రకారం 2012 డిసెంబర్‌ 21న భూమి అంతం అవుతుంది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. డిసెంబర్‌ 21కి మూడు వారాల ముందు ప్రకృతిలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో విపత్తులు భూ వినాశనానికి నాంది పలుకుతాయి. అసంఖ్యాకంగా గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి పరస్పరం ఢీకొనటం వల్ల పర్యావరణంలో అనూహ్యమైన మార్పులు నెలకొంటాయి. ఈ మార్పులు వాతావరణంలో ఆక్సీజన్‌ శాతాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇంతకంటే మించి భూగర్భంలో కేంద్రక స్థానంలో ఉన్న పొరల్లో తీవ్రస్థాయిలో కదలిక మొదలవుతుంది. ఇది భూభ్రమణంపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల భూమి అంతటా భూకంపాలు అధిక సంఖ్యలో వస్తాయి. సముద్ర గర్భంలో భూ పొరల్లో ప్రకంపనలు వచ్చి ఇంతకు ముందు ఎరుగని స్థాయిలో సునామీలు సంభవిస్తాయి. దీంతో అధిక భూభాగాన్ని సముద్రపు నీరు మింగేస్తుంది. సాగరం లోపలి అగ్ని పర్వతాలు బద్దలు అవుతాయి. భూమిపై కరవు కాటకాలు, వరదలు, తుఫానుల సంఖ్య గత పదేళ్లలో పెరగటం ఇందుకు సంకేతం. రానున్న అయిదేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికీ మించి భూగోళపు ఉత్తర దక్షిణ ధృవాలు తమ దిశలను మార్చుకునే దిశగా కదిలిపోతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ కదలిక రానున్న రోజుల్లో మరింత వేగం పుంజుకుంటుంది. అంతే కాకుండా సూర్యుడి అతి నీల లోహిత కిరణాల నుంచి భూమికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొర మరింత బలహీనపడుతుంది. భూమి చుట్టూ ఆవరించి ఉన్న అయస్కాంతపు పొర దక్షిణ అట్లాంటిక్‌ ధృవ సమీపంలో ఇప్పటికే బలహీనపడింది. 780వేల సంవత్సరాల క్రితం భూ అయస్కాంతపొరలో ప్రధానమైన మార్పు సంభవించింది. తిరిగి 2012 నాటికి మరో మార్పు జరుగుతుంది. ఇది భూమికి ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఈ మార్పులన్నీ కూడా సౌర కుంటుంబంలో భూ కక్ష్యను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే, రోదసిలో భూగోళం ఎక్కడో పడిపోయి విధ్వంసం అవుతుంది. అయితే మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకోనవసరం లేదంటున్నారు. సౌరకుటుంబంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు రావటం సహజమేనని, అలాంటివి ఏర్పడినప్పుడల్లా   భూమిని, సౌర కుటుంబాన్ని చక్కదిద్దడానికి రోదసిలో మనకు తెలియని శక్తులు, వ్యవస్థ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే అయిదేళ్లలో భూమి అంతం అవుతుందన్న వాదనలకు బలం ఏమిటి? భారతీయ సిద్ధాంతం ప్రకారం ప్రతి యుగం నాలుగు పాదాలు కొనసాగుతుంది. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలియుగంలో ప్రథమ పాదం మాత్రమే ఇంకా కొనసాగుతోంది. మిగతా మూడు పాదాలు ఇంకా మొదలే కాలేదు.. అంటే మరి కొన్ని వేల సంవత్సరాల తరువాత కానీ భూ ప్రళయం సంభవించదు. మరి పాశ్చాత్య శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలు, క్యాలెండర్లు ఇందుకు భిన్నంగా చెప్తున్నాయి. బిగ్‌బ్యాంగ్‌ థియరీ తొలిదశ ప్రయోగం జరిగినప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తం అవుతే మరి కొన్ని లక్షల సంవత్సరాల దాకా భూమికి విపత్తే లేదన్నారు. అసలు భయపడాల్సిన పనే లేదన్నారు. ఇప్పుడు అబ్బే అదేం లేదు.. ఇక అయిదేళ్లకే మన బతుకులు తెల్లవారుతాయంటున్నారు.. ఇంతకీ ఎవరెవరు ఏమేం కారణాలు చెప్తున్నారు.

నెంబర్‌1

మాయన్‌ క్యాలెండర్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మెక్సికో యుకటన్‌ ద్వీపకల్పంలో  ప్రాచీన నగరం చిచెన్‌ ఇజా నాగరికతకు మాయన్‌ క్యాలెండర్‌ దర్పణం పడుతుంది. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న అనేక క్యాలెండర్లన్నింటికంటే కూడా  తొంభై శాతం వాస్తవానికి దగ్గరగా భవిష్యత్తును చెప్పిన క్యాలెండర్‌ మాయ. మాయలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు నిజమయ్యాయని అంటారు. అందులో భాగంగానే 2012 డిసెంబర్‌ 21న భూమి అంతం అవుతుందని మాయ రెండు వేల సంవత్సరాల క్రితమే పేర్కొంది. ఇది కూడా నిజమే అవుతుందా? ఈ కాలెండర్‌ ప్రకారం భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3, 29, 53, 20 రోజుల 34 సెకండ్ల దూరం. 2012 డిసెంబర్‌ 21నాటికి ఈ దూరం మరింత దగ్గరకు వస్తుంది. ఇదే భూమి అంతానికి కారణమవుతుంది.
నెంబర్‌2
సూర్య గోళంలో పేలుళు్ల విపరీతమవుతాయి. వాటి వల్ల ఉద్భవించే శక్తి, ఇప్పటికన్నా ఎన్నో వేల రెట్లు అధికంగా ఉంటుంది. ఓ పక్క భూ అయస్కాంత పొర, ఓజోన్‌ పొర బలహీనపడటం, ప్రకృతిలో కలిగే మార్పుల వల్ల భూమి విపరీతమైన రేడియేషన్‌కు గురవుతుంది. ఇది 2012నాటికి భరించలేని స్థాయికి చేరుకుంటుంది.
నెంబర్‌3
ఐరోపాలో 27 కిలోమీటర్ల వ్యాసంతో బిగ్‌బ్యాంగ్‌ ప్రయోగం చివరిదశకు చేరుకునే సరికి భూ ఉపరితలంపై బ్లాక్‌ హోల్‌‌స సంఖ్య పెరుగుతుంది. దీని ప్రభావం 2012నాటికి తీవ్రస్థాయిలో భూగోళంపై పడుతుంది.
నెంబర్‌4
క్రైస్తవ మతగ్రంథం బైబిల్‌ కూడా ఇదే చెప్తోంది. 2012లో మంచికి, చెడుకు మధ్య అంతిమ యుద్ధం జరుగుతుందని బైబిల్‌లో పేర్కొన్నారు. చివరకు దేవుడే భూ భ్రమణానికి స్టాప్‌ బటన్‌ నొక్కుతాడని బైబిల్‌ అంటోంది.
నెంబర్‌5
అమెరికాలోని నేషనల్‌పార్‌‌క ఎల్లోస్టోన్‌ అగ్నిపర్వతం 6లక్షల50వేల సంవత్సరాల తరువాత ఒకసారి బీభత్సంగా బద్దలవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఇదే. ఇది బద్దలవుతే భూ వాతావరణం అంతటా బూడిద ఆవరిస్తుంది. అదే జరిగితే సుమారు 15వేల సంవత్సరాల దాకా భూమి మంచు కప్పినట్లు స్తంభించిపోతుంది. భూగర్భ శాస్త్రవేత్తలు ఈ అగ్నిపర్వతం బద్దలవటానికి కూడా 2012 ను ముహూర్తంగా నిర్ణయించారు.
నెంబర్‌6
భూమి చుట్టూ ఉన్న అయస్కాంతపు పొరలో 7లక్షల 80వేల సంవత్సరాలకు ఒకసారి మార్పులు వస్తాయి. ప్రస్తుతం దక్షిణ ధృవం దగ్గర ఈ పొర బలహీనమయి ఉంది. ఇది క్రమంగా మరింత బలహీన పడి భూ రక్షణకు ముప్పు ఏర్పడవచ్చు.
నెంబర్‌7
బర్‌‌కలీ యూనివర్సిటీ భౌతిక శాస్త్రవేత్తల గణాంకాలు కూడా డిసెంబర్‌ 21, 2012 భూ ప్రక్షాళన జరుగుతుందని చెప్తున్నాయి. ఒక భారీ కెటాస్క్రోపిక్‌ 
ఘటన జరగవచ్చని ఇది 99శాతం జరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.
ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా 2010 నాటికి దీని లక్షణాలు కన్పిస్తే, 2012 గురించి కంగారు పడాలని, అలా కానప్పుడు దీన్ని పట్టించుకోనవసరం లేదని నిపుణులు అంటున్నారు. లెట్‌ అజ్‌ వెయిట్‌ ఫర్‌ 2010.

ఇది ఎవరి దేశం?

మా చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లగానే ప్రార్థన జరిగేది...ప్రార్థన చివరలో ప్రతిజ్ఞ చేసేవాళ్లం... ``భారత దేశం నా మాతభూమి. భారతీయులంతా నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహు విధములైన నా వారసత్వ సంపద నాకు గర్వకారణము..........'' ఇలా ప్రతిజ్ఞా పాఠం ఉండేది.. ఇప్పుడు కూడా `ప్రేయర్‌ చదువుతుంటారు కానీ, దాని తీరు తెన్నుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఈ ప్రతిజ్ఞకు అర్థం ఈ దేశం మనందరిదీ.. మనలను కన్న తల్లి ఈ దేశం.. ఈ భూమిపై జన్మించిన వారంతా ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములు . ఆసేతు హిమాచలం ఇక్కడ ఉద్భవించిన నాగరకత, సంస్కతి, ఇక్కడ పుట్టిన వారందరిదీ.. వీరికి జాతి, మత, వేష, భాషా భేదములున్నా.. భారతీయత అన్నది వీరందరినీ ఒకటిగా కలుపుతున్నది.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇవాళ్టి వరకు మన చదువుతున్నది, వింటున్నది ఈ ఒక్క మాటే.. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప ప్రజాస్వామ్య దేశమని.. మన నాయకులు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికలపైనా మన దేశ సాంస్కతిక వారసత్వం గురించి, జాతి సమైక్యత గురించి సందర్భం వచ్చినప్పుడల్లా అద్భుతంగా చెప్పుతుంటారు. ``ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము'' అని రాయప్రోలు వారు అన్న మాటల్ని అక్షరాల పాటిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని గురించి చెప్తుంటారు. ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన దేశంగా మన దేశాన్ని చెప్తారు. 21శతాబ్దం భారత దేశానిదేనని, ఆ దిశగా వేగంగా పురోగమిస్తున్నామని చెప్తారు. కానీ, వాస్తవం ఏమిటి? నిజంగా ఈ దేశం మనందరిదేనా? ఇదేమీ వెర్రి ప్రశ్న కాదు.. ఒక్కసారి గుండెలమీద చేయి ఉంచుకుని ఆలోచించండి. వాస్తవం మీ కళ్ల ముందు కనిపిస్తుంది.
1.
ప్రపంచంలో మరే దేశానికీ లేని విభిన్నమైన జాతీయత ఈ దేశానికుంది. ఒక భాష కాదు, ఒక సంస్కతి కాదు, ఒక పండుగ కాదు, ఒక మతం కాదు, ఒక వేషం కాదు.. ఇన్ని వైరుధ్యాలు ఉన్నా అన్నింటినీ కలిపే సన్నని దారం ఏదో అంతర్లీనంగా ఉన్నదని పెద్దల మాట. దానికే వారు పెట్టిన పేరు భిన్నత్వంలో ఏకత్వం. ఎవరికి వారు వారి వారి మతాభిప్రాయాలను గౌరవించుకున్నా, భారతీయ సమాజం అంతా ఒకటేనని మనం ఎప్పుడూ చెప్పుకునే మాట. ఎందుకంటే మన పూర్వీకులు అంతా ఆసేతు హిమాచలాన్ని ఒకటిగానే భావించారు. జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే అని నిత్యం దేవతార్చనల్లో వినిపించే పవిత్ర మంత్రం. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడు స్వయంగా అన్న మాట. ఒక్క రామాయణమే కాదు.. భారతాది ఇతిహాసాలు. ఇతర సాహిత్యము, ఇక్కడి పర్యాటక `ేత్రాలు, ఆ`ద్యాత్మిక `ేత్రాలు, నదులు, పర్వతాలు భారత ప్రజలందరినీ ఏకం చేశాయి. రాజకీయంగా దేశంలో వందలాది రాజ్యాలు ఉండేవి.. అయినా సాంస్కతికంగా ఉన్న ఐక్యత దేశాన్ని ఏకతాటిపై ముందుకు నడిపించింది. స్వాతంత్య్రానికి ముందు కానీ, ఆ తరువాత కానీ, ఈ దేశంలో పుట్టిన విప్లవ, సాంస్కతిక, సంస్కరణ ఉద్యమాలన్నీ ఈ పునాదులపైనే దేశమంతటా విస్తరించాయి. రాజా రామ్మోహన్‌రాయ్‌, దయానంద సరస్వతి, రామకష్ణ పరమహంస, ఆరవిందులు, వీరేశలింగం పంతులు వంటి వారు అనేకులు ఈ పునాదులపైనే ఆ`దారపడి ఉద్యమాలను నడిపారు. వీరికి మత, ప్రాంత, భాషా వేషాలతో పని లేదు. భారతీయ సమాజాన్నంతా ఒకటిగానే సంభావించారు. ప్రపంచంలో ఇతర దేశాల వాళు్ల దేశం అంటే కేవలం జియోగ్రాఫికల్‌గానే చూస్తారు. కానీ, మన పెద్దలు ఈ దేశాన్ని మాతమూర్తిగా ఆరా`దించారు. మైదానాలు, అడవులు, కొండలు, నదులు కలగలిసిన సమస్త ప్రకతిని దేశంలో భాగంగా చూశారు. జాతి అంటే కోట్ల ప్రజల సమష్టి శక్తి అని అరవిందులు అంటారు. ఈ శక్తి ఇప్పుడు మరుగునపడిపోయింది. మూలాలు భూగర్భంలోకి చొచ్చుకుపోయాయి. వీటిని సంపూర్ణ శక్తితో తిరిగి వెలుగులోకి తీసుకురావటానికి అప్పుడప్పుడూ ఎవరో ఒకరి ద్వారా ప్రయత్నం జరుగుతున్నా.. అది పూర్తిగా సఫలం మాత్రం కావటం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
మన స్వాతంత్య్రం షష్టి పూర్తి చేసుకుని కూడా ఏడాది గడిచిపోయింది. దేశంలో రాష్ట్రాల సంఖ్య 30కి చేరవస్తున్నది. 23 భాషలను అధికారికంగా గుర్తించారు. దాదాపు వెయ్యి మాండలికాలు వాడుకలో ఉన్నాయి. లిపి లేని మౌఖిక భాషలు లెక్కే లేదు. శైవ, వైష్ణవ, శాక్తేయ, సిక్కు, `ౌద్ధ, జైన, ఇస్లాం, christianity లాంటి మతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ సహజంగా పుట్టినవి.. మరికొన్ని బలవంతంగా ఇక్కడ చొరబడ్డవి. ఈ దేశ సంస్కతిలో అంతర్భాగంగా చేరిపోయినవి. ఇక జాతులు, ఉపజాతులు.. కులాలు, ఉప కులాల సంఖ్య చెప్పనే అక్కర్లేదు. వాటి మధ్య జీవన వైరుధ్యం , సాంస్కతిక వైరుధ్యం, సంప్రదాయ వైరుధ్యం ఎంతో ఉంది. ఒక్కో సంస్థానం ఒక్కో విధమైన జీవన శైలిని అనుసరించింది. అటు గాంధారం (ఇవాల్టి ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌) నుంచి బాలి దీవుల దాకా వందలాది సంస్థానాల్లో విభిన్నమైన నాగరికత అభివద్ధి చెందింది. అయితే, అదై్వత, విశిష్టాదై్వతాది ధర్మాలు , `ౌద్ధ, జైన ధర్మాలు ఆసేతు హిమాచలం హిందుత్వమనే జాతీయ భావనా సూత్రం ఆధారంగా విస్తరించటం వల్ల ఈ వైరుధ్యాల నడుమ ఏదో తెలియని సామరస్యం ఒక ప్రవాహశీలియై కొనసాగుతూ వచ్చింది. హిందువు అన్న పదం అఖండ భారతంలోని అయిదారు వందల సంస్థానాల్లో జన్మించిన ప్రజల అస్తిత్వానికి గుర్తుగా ఉండిందే తప్ప మతంగా అది ఎన్నడూ గుర్తు ఎరుగదు. ఆసేతు హిమాచలం హిందుస్థానంగా ప్రసిద్ధి చెందిందే తప్ప, దీన్ని హిందూ రాజ్యంగా ఎవరూ పిలవలేదు. ఈ హిందుస్థానంలో మతం అంటే శైవం.. మతం అంటే వైష్ణవం.. మతం అంటే శాక్తేయం.. మతం అంటే సిక్కిజం.. మతం అంటే `ౌద్ధం.. మతం అంటే జైనం...ఇస్లాం, ఆ తరువాత పరాయి గడ్డల మించి వలస వచ్చినవి.
ఇక్కడ వత్తులు ఆ తరువాతి క్రమ పరిణామంలో కులాలుగా మారి ఉండవచ్చు. కానీ, ఆనాడు ఆ వత్తులే జీవన ఆ`దారాలు అయ్యాయి. వస్తు వినిమయ సంస్కతి విస్తరించిన తరువాత కూడా పల్లెల్లో ప్రశాంత జీవనం కొనసాగిందంటే ఆ వత్తుల మ`ద్య తెగని అనుబం`దమే కారణం. అన్ని వత్తుల వారి మ`ద్య బం`దు సం`ో`దనలు పల్లెలను ఐక్యంగా , పల్లె వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉంచాయి. సమాజానికి కావలసిన ఒక్కో బాధ్యతను ఒక్కో వత్తి సమానంగా పంచుకుంది. చదువు చెప్పేవారు చదువు చెప్పారు. rakshana చేసే వారు ఆ బాధ్యతను నిర్వర్తించారు. పంట పండించేవారు, ఆ పంటను వండుకునేందుకు అవసరమైన కుండలను తయారు చేసే వారు, కట్టుకునేందుకు బట్టలు నేసేవారు, అలంకరించుకునేందుకు నగలు చేసే వారు.. ఇలా ఎవరి బాధ్యతలూ వారు సమానంగా నిర్వహించటం వల్ల ప్రజానీకం సమైక్యంగా ఉండగలిగింది. ఇక్కడ మత, కుల వైరు`ద్యాలు, ఆచార వ్యవహారాలు అడ్డం రాలేదు. ఈ సమాజమే సున్నాను మొదట కనుగొన్నది. ఈ సమాజమే ఖగోళ శాస్త్రాన్ని మదించింది. ఈ సమాజమే ప్రపంచానికి ఆయుర్వేద వైద్యాన్ని అందించింది. ఈ సమాజమే విమానం నుంచి సమస్త విజ్ఞాన విశ్వాన్ని ఆవిష్కరించింది. ఇదంతా రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మాట...
2.
దేశంలో అపారమైన సంపత్తి నెలకొంది. ప్రపంచానికి ఆ సంపద కావలసి వచ్చింది. అప్పటి నుంచి దేశంపై దాడులు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న దాడుల దగ్గర నుంచి పెద్ద పెద్ద యుద్ధాల దాకా ఎన్నో జరిగాయి. ముస్లింల దండయాత్రలు ప్రారంభమైనప్పటి నుంచి సమాజం రూపు రేఖలు మారడం ప్రారంభమైంది. గజనీ మహమ్మద్‌ లాంటి వారు అడ్డగోలుగా దండయాత్రలు చేసి అందినకాడికి అందినంత దోచుకుపోయారు. ఆనాడు సాంస్కతిక నిలయాలుగా ఉన్న దేవాలయ వి`ద్వంసం జరిగింది. మొఘలాయూల కాలం నాటికి దేశం వారి పాదాక్రాంతమైంది. వందల సంవత్సరాల పాటు ఏలుకున్నారు. క్రమంగా పోర్చుగీసులు, ఫ్రెంచి వారు, డచ్చి వారు, ఇంగ్లీషు వారు ఏదో ఒక మిషతో దేశంలోకి చొచ్చుకువచ్చారు. బలవంతుడి రాజ్యమన్నట్లు ఇంగ్లీషు వాడు క్రమంగా పట్టు సా`దించాడు. రెండు వందల సంవత్సరాల పాటు దేశాన్ని పాలించుకున్నాడు. వాడు సా`దించిన పట్టు ఎలాంటిదంటే.. వాడు వెళ్లిపోయి ఆరు దశా`ా్దలు గడిచినా పరో`ƒంగా వాడి ఏలుబడిలోనే దేశం ముందుకు సాగేలా చూసుకోవటం. అదేమిటని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే.. ఇవాళ్టికీ మనకు వాడే ఆదర్శం.. వాడు చూపిన మార్గాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తాం కాబట్టి.. భారత్‌, హిందుస్థాన్‌ వంటి పేర్లు నోరు తిరగక తన వాడుక కోసం, సౌకర్యం కోసం ఇంగ్లీషువాడు ముద్దుగా పెట్టుకున్న `ఇండియా' పేరును మనం అ`దికారికం చేసుకున్నాం. ఎప్పుడో 1935లో వాడు చేసిన చట్టాల్ని మనం ఇంకా అనుసరిస్తున్నాం.. అమలు చేస్తున్నాం. అన్నింటికీ మించి విభజించు... పాలించు అనే వాడి సిద్ధాంతాన్ని ఈరోజు కూడా మన పాలకులు అ`ƒరాలా పాటిస్తున్నారు. ఈ దేశ పౌరుల్లో నరనరానా పరాయూకరణ జీర్ణించుకుపోవటానికి మెకాలే వంటి వారు ప్ర`దాన కారకులు. వాళు్ల ముందుగా చేసింది ఈ దేశంలోని సాంస్కతిక మూలాలను వి`ద్వంసం చేయటం.. ఇక్కడి ప్రజలకు నాగరికత అంటే ఏమిటో తెలియదని ప్రచారం చేసి నమ్మించటం. ఈ దేశ ప్రజలు నాగులని, పాములను పూజించే అనాగరకులనీ, తామే వీరికి జీవించటం అంటే ఏమిటో నేర్పామని ఇక్కడి వారే విశ్వసించేలా చేయటం. చివరకు ఈ దేశంలోని ప్రజలను తామే ఉద్ధరించామని నమ్మించటమే కాదు.. ఆ తరువాత పది తరాల దాకా వారి ప్రభావం ఇక్కడి మనుషుల పైనుంచి పోకుండా చూసుకోవటంలో మెకాలే మే`దో సంపత్తి అపారంగా పని చేసిందనటంలో సందేహం లేదు. విచిత్రమేమంటే మనల్ని స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ కూడా మనం మే`దావులని భావిస్తున్న మహానుభావులు, మన పాలకులు చాలా మంది లండన్‌ బళ్ల నుంచి `ారిష్టరు పట్టాలు పొందినవారే కావటం. విదేశీ చదువులు.. విదేశీ సంస్కతి వారిని స్వదేశంలోని ప్రజలకు ఎంతో కొంత దూరం చేస్తూ వచ్చాయనటం సత్యదూరం కాదు. వీరి డివైడ్ అండ్ రూల్ విధనమే దేశంలో అంతరాలను పెంచుతూ వచ్చింది. మతసామరస్యాన్ని దారుణంగా దెబ్బ తీసింది. దేశాన్ని మూడు ముక్కలు చేసింది. ఈ రెండు జాతుల మ`ద్య సామరస్యాన్ని కాపాడటం కోసం స్వాతంత్య్రోద్యమానికి ఒక రూపును, పోరాట పటిమను తీసుకువచ్చిన గాం`దీజీ కషి చేశారు. ఆయన గాం`దేయవాదం దాన్ని దాదాపుగా సా`దించింది కూడా. అయితే అది ఎక్కువ కాలం నిలవలేదు. ఆంగ్లేయ సిద్ధాంత పునాదులపైన రూపుకట్టుకున్న ఈ దేశ రాజకీయ వ్యవస్థలో గాం`దేయవాదానికి నిలువనీడ లేకుండా పోయింది.
3
గాం`దీజీ జీవించి ఉన్నప్పుడే మతాల మ`ద్య సంఘర్షణ తీవ్రరూపం దాల్చింది. కానీ, ఆయనపై ఉన్న గౌరవం వల్లనో, ఆయన చాటున రాజకీయం నడిపిన నేతల కారణంగానో నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. ఆ తరువాత మన రాజకీయ నాయకుల పుణ్యమా అని, వారి సంతప్తీకరణ వి`దానాల వల్ల దేశంలో ద్విజాతి సిద్ధాంతం కొనసాగుతూ వచ్చింది. రాను రాను అది మరింత విస్తరించి బహుళ జాతి సిద్ధాంతం బలంగా ముందుకు తోసుకువచ్చింది. విభజనే తప్ప సమైక్యత సా`ద్యం కాని విపరీతమైన పరిస్థితి ఇవాళ నెలకొంది. మతాల మ`ద్యనే కాదు.. కులాల మ`ద్య కూడా బహుళ సిద్ధాంతం ప్రభావం చూపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ దేశంలో ఎక్కడ చూసినా కనిపించేది భిన్నత్వమే కానీ, ఏకత్వం కాదు. మతాల మ`ద్య, రాష్ట్రాల మ`ద్య, ప్రాంతాల మ`ద్య ఎక్కడా సామరస్యం అన్న మాటే వినిపించదు. అతి చిన్న చిన్న ప్రాంతాల మ`ద్య కూడా స్నేహం పొసగని వాతావరణం ఉంది. స్వాతంత్య్రానికి ముందు దేశంలో 550 సంస్థానాలు ఉండేవి. 1947 పంద్రాగస్టు తరువాత ఒక్కో సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలిపేందుకు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. హైదరా`ాద్‌ సంస్థానందైతే కథే వేరు. పోలీస్‌ యాక్షణ్ ‌ చేసి మరీ విలీనం చేసుకోవలసి వచ్చింది.
ఆయన విలీనాలు చేస్తూ పోయారు. ఆ తరువాత విడిపోవటం కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఢిల్లీ పాలకులు పదే పదే చేస్తున్న పొరపాట్ల పుణ్యమా అని జము్మ కాశ్మీర్‌లో వేర్పాటు వాదం.. మొత్తం దేశాన్నే భారీ మూల్యం చెల్లించే దిశగా తీసుకుపోతున్నది. కాశ్మీర్‌ వ్యవహారంలో భారత ప్రభుత్వాలు అనుసరిస్తున్న వి`దానాలు ఉగ్రవాదాన్ని దేశవ్యాప్తం చేయటానికి దోహదపడ్డాయి. అరవైఒక్క సంవత్సరాలైనా, కాశ్మీర్‌ భారత దేశంలో అంతర్భాగమని నాయకులు వేదికలెక్కి ఉపన్యాసాలు దంచటం తప్ప, కాశ్మీరీల్లో ఆ భావనను సంపూర్ణంగా పాదుకొల్పలేకపోయారు. ఫలితం.... పండిట్లను వెళ్ల గొట్టిన తరువాత ముస్లిం మెజారిటీ స్టేట్‌గా మారిన కాశ్మీర్‌లో ఇవాళ ప్లెబిసైట్‌ జరిపితే ఎక్కువ మంది పాకిస్తాన్‌ వైపు మొగ్గు చూపితే ఆశ్చర్య పోనవసరం లేదు. ఎందుకంటే ఓ పక్క టెరర్రిస్టులు, మరో పక్క భారత సైన్యం రెంటి మ`ద్య నలిగే కంటే ఏదో ఒక తుది పరిష్కారాన్ని కోరుకోవటమే మంచిది. కాశ్మీర్‌లో టెరర్రిజాన్ని భారత ప్రభుత్వం అణచివేస్తుందన్న విశ్వాసం కాశ్మీరీల్లోనే కాదు.. సగటు భారతీయుల్లో ఏ ఒక్కరిలోనూ లేదంటే ఆశ్చర్యం కాదు. అందుకే వారు పాకిస్తాన్‌ను ఎంచుకోవటం అసహజమేం కాదు. అదే వి`దంగా పంజా`్‌లో ఖలిస్తాన్‌ ఉద్యమం చెలరేగింది. ఈ ఉద్యమాన్ని అణచివేసినందుకు నాటి ప్ర`దానమంత్రి ఇందిర ప్రాణాల్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో హరితప్రదేశ్‌, అసోంలో `ోడోలాండ్‌, నాగాలాండ్‌ ఉద్యమం, మహారాష్టల్రో విదర్భ, ఆం్ర`దప్రదేశ్‌లో తెలంగాణా... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏర్పాటు, వేర్పాటు ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. భాష, చరిత్ర, సంస్కతి, సంప్రదాయాలు పొసగని రెండు ప్రాంతాలను బలవంతంగా ఏకం చేసిన ఫలితం ఆంధ్రప్రదేశ్ ‌లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కారణమయింది. ప్రజల్లో తాము బలవంతంగా కలిసి ఉన్నామన్న భావనను ప్రభుత్వాలు కానీ, సోదర ప్రాంతాలు కానీ పోగొట్టలేకపోయాయి... ఉద్యమాలు జరుగుతున్న అన్ని రాషా్టల్ల్రోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారే కానీ, ప్రాంతాల మ`ద్య, ప్రజల మ`ద్య సౌమ్యత ఎలా ఉందన్నది పాలకులు ఆలోచించటం లేదు.
కనీసం జాతుల మ`ద్యనైనా స్నేహబం`దం ఉందా అంటే అదీ లేదు. తమ జాతి పట్ల దురభిమానమే తప్ప అభిమానం లేదు. తమిళ, కన్నడ, `ెంగాలీ, పంజాబీ, మరాఠా.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే గొప్ప అనుకుంటే తప్పులేదు. తమకు తప్ప మిగతా వాళ్లకు అస్తిత్వమే లేదన్న స్థాయిలో ఘర్షణలు జరగడం కళ్లారా చూస్తున్నదే. దేశానికి విద్రోహం చేస్తున్న ఎల్‌టిటిఇ వంటి ఉగ్రవాద సంస్థలకు సైతం కేవలం తమిళ ముద్రతో తమిళనాడు లోని రాజకీయ పార్టీలు బహిరంగంగా మద్దతునివ్వటం, ఆర్థిక సహాయాన్ని అందివ్వటం చూస్తున్నదే. ఇలాంటి వాటి పర్యవసానం మాజీ ప్ర`దాని రాజీవ్‌ గాం`దీ బలి.
4
ఇక మహారాష్టల్రో రాజ్‌ థాక్రే సష్టించిన మరాఠా వ్యతిరేకుల పట్ల విద్వేష జ్వాలలు ఏ సమైక్యతకు గుర్తో అర్థం కాదు. మహారాష్టల్రో ఉన్న మరాఠేతరులందరినీ దాదాపు వెళ్లగొట్టేంత పని చేశారు. వాళ్ల టాక్సీలు `ద్వంసం చేశారు. దుకాణాలు లూటీ చేశారు. అగ్గిపెట్టారు. దుకాణాలపై బలవంతంగా మరాఠా భాషలో పేరు రాయించారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ `ోర్డు పరీ`ƒ రాసేందుకు కొందరు బీహారీలు ముంబయి వచ్చినందుకు రాజ్‌థాక్రే గూండాల చేతుల్లో చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇదేమిటని రాజ్‌ను అడుగుతానంటూ రాహుల్‌ రాజ్‌ అనే ఓ అమాయకుడు బస్సులో తుపాకి చూపి `ెదిరించిన పాపానికి ముంబయి పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి కాల్చి పారేశారు. పని ముగించుకుని లోకల్‌ ట్రెౌన్‌లో తన ఇంటికి తాను వెళు్తన్న ఓ ఉత్తర ప్రదేశ్‌ యువకుణ్ణి, ఊరు పేరు అడిగి మరీ చితగ్గొట్టి చంపేశారు. తాను యుపి మహిళను కాబట్టి హిందీలో మాట్లాడతానని జయా బచ్చన్‌ అన్న పాపానికి `ాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితా`్‌ కుటుం`ాన్నే వెలివేసే పరిస్థితి నెలకొంది. చివరకు బిగ్‌బిక్షమాపణ చెప్తే కానీ, ఆ నిప్పును నివురు కప్పలేదు.
కాశ్మీర్‌లో ఇతర రాషా్టల్ర వారు ఆస్తులను కొనే అ`దికారం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రాజ్యాంగంలో 170వ అ`దికరణాన్ని పొందు పరిచారు. కాశ్మీరీలు మాత్రం దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఏ ఆస్తినైనా కొనుగోలు చేయవచ్చు. ఏ వి`దంగానూ మిగతా ప్రాంతాల వారితో కలిసిపోవటానికి కాశ్మీరీలు ఇష్టపడని పరిస్థితి నెలకొంది. ఇదే `దోరణి స్థానిక వాదంగా మిగతా అన్ని రాషా్టల్ల్రో ఇప్పుడు ప్రబలుతోంది. విద్యాఉపా`ది వంటి కీలక రంగాల్లో స్థానిక, స్థానికేతర సమీకరణాల సమతులనం పాటించకుండా వివక్ష ప్రదర్శించిన దుష్పలితం ఇది . అన్ని ప్రాంతాల అభివద్ధి పట్ల సమతూకం పాటించని తీరు ఈ దుస్థితికి కారణం. ఈ వివ`ే వలసలను ప్రోత్సహించింది. స్థానిక, స్థానికేతరుల మ`ద్య సంఘర్షణలకు, వేర్పాటు, ఏర్పాటు ఉద్యమాలకు దారి తీసింది.
5
భాషా దురభిమానం గురించి చెప్పనవసరమే లేదు. జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాట పెద్ద ఉద్యమమే జరిగింది. ఇవాళ్టికీ తమిళులు తమ భాషను, తమ వారిని తప్ప మిగతా వారి పట్ల ఉపేక్ష వహించటం బహిరంగ రహస్యమే. 2004లో ఐక్య ప్రగతిశీల కూటమి అ`దికారంలోకి వచ్చినప్పుడు ద`ిణ భారత దేశం నుంచి ప్ర`దాన మిత్రపక్షం గా ఉన్న డిఎంకె తమ భాషకు ప్రాచీన హోదా కల్పించటం కోసం యుపిఎపై తెచ్చిన ఒత్తిడి అంతా ఇంతా కాదు.. తమిళ భాషకు ప్రాచీన హోదా కల్పించటంతోనే ఊరుకోలేదు. తమిళభాషకు ప్రాచీన హోదా వచ్చే నాటికి మన రాజ్యాంగం అందుకు నిర్ణయించిన అర్హత సదరు భాష కనీసం వెయ్యేళ్ల పూర్వపుదై ఉండాలి. తమిళానికి ఆ హోదా రావటంతోనే కేంద్ర ప్రభుత్వంలోని తమిళ మంత్రులు చక్రం తిప్పారు. ప్రాచీన హోదా అర్హత ప్రాతిపదిక వెయ్యేళ్ల నుంచి పదిహేను వందల సంవత్సరాలకు పెంచారు. దాంతో తెలుగుకు ఆ హోదా సంపాదించటం కోసం నాలుగున్నర సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. తమిళ భాషకు అప్పనంగా ప్రాచీన హోదా కల్పించిన కేంద్రం కన్నడ, తెలుగులకు ఆ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించేందుకు ఒక ప్రత్యేక కమిటీనే నియమించాల్సి వచ్చింది. చివరకు ఆ కమిటీలో సభ్యులంతా రెండు భాష లకు అనుకూలంగా స్పందిస్తే అందులో తమిళ సభ్యుడొకరు మాత్రం దీనిపై విభేదించారు. అసలు తెలుగు, కన్నడలకు ప్రాచీన హోదా ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు. దీనికి తోడు ఈ కమిటీ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ తమిళనాడులోని మద్రాసు హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. తమిళుల దురభిమానానికి, కూటనీతికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి? మళయాలీలు, `బెంగాలీలు కన్నడిగులు, మరాఠీల గురించి చెప్పనే అక్కర్లేదు. భాషాభిమానం ఉండటం తప్పులేదు. అది దురభిమానంగా మారినప్పుడే సమస్యలు వస్తాయి. తెలుగులో అయితే భాషపై కంటే మాండలికంపై ఉండే దురభిమానం ఎక్కువ. ఒక మాండలికంలో మాట్లాడే వారికి మరో మాండలికం ఎ`ె్బట్టుగా, కామెడీగా వినిపిస్తుంది. భాషే కాదు... తన భాషలోని మాండలికాన్ని సైతం వెక్కిరించటానికి తెలుగువాడు ఎంతమాత్రం వెనుకాడడు.
6
ఇక కులాల మ`ద్య సమైక్యత గురించి చెప్పాల్సింది చాలానే ఉంది. కులరహిత సమాజం కోసం పోరాటాలు చేస్తున్నామంటారు. కానీ, కులాల మ`ద్య విభేదాలను పెంచి పోషిస్తుంటారు. వెనకట కులవత్తులు ఉండేవి వలస పాలకుల పుణ్యమా అని అవన్నీ కనుమరుగైపోయాయి. కానీ, కులాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. అవి లేని సమాజాన్ని నిర్మించే మాటెలా ఉన్నా.. ఐడెంటిటీ పేరుతో, కులాల అస్తిత్వం కొనసాగుతూనే ఉంది. కులరహిత సమాజం రావాలంటే, ముందుగా కులాల ఐడెంటిటీ తప్పనిసరి అన్న వాదనతో కొంతవరకు ఏకీభవించవచ్చు. కానీ, ఈ ఐడెంటిటీ మిగతా కులాలతో దూరాన్ని పెంచేదిగా ఉండకూడదు. ఎస్సీ రిజర్వేషన్లలో సింహభాగం మాలలే అనుభవిస్తున్నారని, మాదిగలకు మిగులుతున్నదేమీ లేదని, కాబట్టి ఎస్సీలను నాలుగు భాగాలుగా విభజించాలని దశాబ్ద కాలంగా ఉద్యమం జరుగుతోంది. ఓటు `ా్యంకు రాజకీయాలు ఈ ఉద్యమాన్ని సుదీర్ఘం చేసింది. ఇవే ఓట్ల కోసం బిసిల్లో రోజు రోజుకూ చేరుస్తున్న కులాలు అప్పటికే అందులో ఉన్న కులాల మ`ద్య ఆస్తి పంపకాలకు వచ్చినట్లుగా అనిపించటంతో అదో వి`దమైన ఆసమ్మతికి కారణమైంది. ఉత్తరప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేత మాయావతి అగ్రకులాలతో పాటు అన్ని కులాలకూ రాజకీయ సమీకరణల్లో ఇచ్చిన ప్రా`దాన్యం సక్సెస్‌ కావటంతో ఇటీవల తరచూ వినిపిస్తున్న మాట ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు.. ఇక ఈ వర్గాల మ`ద్యా రిజర్వేషన్‌ పోరు తప్పకపోవచ్చు.
7
ఇక నీటి యుద్ధాలు తప్పకుండా ప్రస్తావించాల్సిన అంశం. జీవనదులు ఎక్కడో పుట్టి మరెక్కడో సముద్రంలో కలుస్తాయి. ఉన్న నీటిని ఆ నదీ పరివాహక ప్రాంతాలు సమానంగా వాడుకోవటం అవసరం. కానీ, ఎగువన ఉన్న రాషా్టల్రు అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టి నీటిని బిగపట్టి దిగువన రైతాంగం మట్టి కొడతాయి. ఇందుకోసం జలాల జగడం తప్పవు. ఈ విషయంపై ఏ రాజకీయ పార్టీ గట్టిగా మాట్లాడే సాహసం చేయదు. ఒకే రాజకీయ పార్టీ ఎగువ రాష్ట్రంలో ఒక మాట, దిగువ రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతుంది. దేశమంతా ఒక్కటేనంటూ ఢిల్లీలో కూర్చొని పరిపాలించే ప్రభుత్వానికీ ఈ సమస్యను పరిష్కరించే `దైర్యం చాలదు. ఎవరినీ నొప్పింపక తానొవ్వక సమస్యను పరిష్కరించాలని భావిస్తుంది. దీని వల్ల కర్ర విరగదు. పాము చావదు. సమస్య పరిష్కారం కాదు. ఆలమట్టి, కావేరి, హొగెనేకల్‌, పాలార్‌, బబ్లి ... ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.. వర్షాలు పుష్కలంగా పడి, ప్రాజెక్టుల్లోకి నీరు భారీగా వస్తే తప్ప మిగులు జలాలు దిగువకు చేరవు. అలా జరిగినంత కాలం నీళ్లను నివురు కప్పుతుంది. కరవు వస్తే మాత్రం కరవాలాలు లేస్తాయి. అవే నీళ్లు నిప్పుల సెగలు ఎగజిము్మతాయి. ట్రిబ్యునళ్ల ఆదేశాలు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ, పరస్పర చర్చలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వవు.
8
మతాల మ`ద్య విభేదాలు ఉగ్రవాదానికి మరింత ఊతమిస్తున్నాయి. మతాల మ`ద్య సామరస్యం ఉన్నదని నాయకులు చెప్పటమే తప్ప అది వాస్తవ దూరం అన్నది జగద్విదితం. ఎవరి మతాన్ని వారు అవలంబించుకుంటూ వెళ్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఒకరి మతంలో మరొకరు దూరి మత మార్పిళ్లకు పాల్పడటం, ఇందుకోసం తాయిలాలు పంచటం ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యకర వాతావరణాన్ని సష్టిస్తున్నది. మతం ఉన్మాదమైపోయింది. అమాయకుల ఆర్థిక బలహీనతలను ఆసరా చేసుకుని వారిని పెడమార్గంలో నడిపిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయటం కోసం ఉగ్రవాదులు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారన్నది వాస్తవం. దీని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి టెరర్రిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ప్రభుత్వాలు ఓటు `రాజకీయాల పట్ల వేలం వెర్రిగా పరిగెడుతూ దేశ అంతర్గత భద్రతను పణంగా పెడుతున్నాయి. టెరర్రిజంపట్ల ప్రభుత్వాలు అంటీముట్టనట్టు వ్యవహరించిన కారణంగా కౌంటర్‌ టెరర్రిజం ఆవిర్భవించింది. ఈ పరిస్థితికి ఖచ్చితంగా పాలకుల వి`దానాలే కారణం.
9
రాజకీయ నాయకులే ప్రాంతాల వారిగా ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు దేశం ఇలా ఉండక మరెలా ఉంటుంది. అదష్టం తన్నుకొచ్చి ప్ర`దానమంత్రి పదవి వరించిన దేవెగౌడ వంటి నాయకుడు, తాను పదవి వెలగ`ెట్టిన ఏడాదిన్నర కాలం కర్ణాటకకు ప్ర`దాని అని భావించారే కానీ, దేశానికి ప్ర`దాని అని అనుకోలేదు. రైల్వేలకు మమతా `ెనర్జీ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె `ెంగాల్‌కు చేసిన మేలు అంతా ఇంతా కాదు. రాంవిలాస్‌ పాశ్వాన్‌, నితిష్‌ కుమార్‌, ఇప్పుడు లాలూలు అదే శాఖకు మంత్రులుగా ఉన్నారు. బీహార్‌కు వచ్చినన్ని రైల్వే ప్రాజెక్టులు మరో ప్రాంతానికి రాలేదంటే అత్యుక్తి కాదు. మురసోలిమారన్‌, దయాని`ది మారన్‌, టిఆర్‌ `ాలులు తమిళనాడుకు తరలిస్తున్న కంపెనీలకు, సా`దిస్తున్న పెట్టుబడులకు లెక్కలేదు. అంతెందుకు మన రాష్ర్టంలోనే ముఖ్యమంత్రి తన నియోజక వర్గానికి చేస్తున్న ప్రయోజనం ముందు మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న అభివద్ధి దిగదుడుపే. తమ ప్రాంతాలను అభివద్ధి చేయటం వాటికి ప్రతిని`దిత్వం వహిస్తున్న నేతలుగా వారి `ా`ద్యత. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టనవసరం లేదు. వారు సా`దారణ ఎమ్మెల్యేనో, ఎంపినో అయితే పట్టించుకోనవసరం లేదు. కానీ, `ా`ద్యత గల ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు తాము తమ ప్రాంతంతో మాటు మిగతా ప్రాంతాలను సమాన దక్పథంతో చూడాల్సిన అవసరాన్ని గుర్తించకపోవటం వల్లనే సమస్యలు అ`దికమవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు, వాటి రాజకీయ అవసరాల ముందు జాతీయ పార్టీలు అస్తిత్వం కోల్పోతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీల అవసరం తప్పనిసరి అవుతుంది. అలా ఏర్పడ్డ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఆయా పార్టీల గొంతెమ్మ కోర్కెలను తీర్చుకుంటూ గడపాల్సిందే. ఫలితం ప్రాంతాల మ`ద్య, రాషా్టల్ర మ`ద్య అంతరాలు
రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
'''
దీనికంతటికీ మూలం మన రాజకీయ వ్యవస్థ. బ్రిటిష్‌ పాలకుల నుంచి నేర్చుకున్న వాటిలో పదునైన `విభజించి పాలించు' సూత్రానికి మన రాజకీయ నాయకులు చక్కగా అలవాటు పడ్డారు. దాన్నే పాటిస్తున్నారు. అన్ని ప్రాంతాల మ`ద్య అంతరం తగ్గిపోతే, అంతా భారతీయులుగా కలిసి ఉంటే రాజకీయులకు ఇక పనేముంటుంది? అందుకే ఈ దేశం ప్రజలది కాదు.. రాజకీయ నాయకులది. వారి వారసులది. వారి నిర్ణయాలపైనే దేశం ఆ`దారపడి ఉంటుంది. తమ ప్రయోజనాలను కాదని దేశానికి వారు చేసేదేమీ ఉండదు. ఈ వ్యవస్థ బురదగుంట. ఇందులో ఎవరు దూకినా బురద అంటకుండా బయటపడటం సా`ద్యం కాదు. అంతరాలను కొనసాగనివ్వకుండా, విభేదాలు లేకుండా సామరస్య సమాజాన్ని స్థాపిస్తే ఇక దేశంలో రాజకీయానికి అర్థం ఉండదు. నాయకులు వారే.. పార్టీలే వేరు.. పాతవి ఉన్నా... కొత్తవి పుట్టుకొచ్చినా.. అద్భుతం జరిగేదేమీ లేదు. కొత్తగా వచ్చే మార్పేమీ లేదు. ఎవరూ మారరు. ఈ దేశంలో సమస్య శాశ్వతం.. పరిష్కారం తాత్కాలికం.. ఈ సత్యం ప్రజలకు తెలుసు.. ప్రజా ప్రతిని`దులకు కూడా తెలుసు. అందుకే కొత్తగా వచ్చిన వాళ్లను వింతగా చూస్తారు. పాతవాళ్లను పట్టించుకోరు. అన్ని పండుగలను మొక్కుబడిగా చేసుకున్నట్లే.. ఓట్ల పండుగనాడూ ప్రజాప్రతిని`దుల సొము్మతో పండుగ చేసుకుంటారు. అంతటితో మర్చిపోతారు. చివరకు ఈ దేశం తమదన్న సంగతి ప్రజలకు గుర్తుండదు. ప్రజా ప్రతిని`దులకు అంతకంటే గుర్తుండదు. మరి వంద కోట్ల మందిని కన్న మహా తల్లి భారత మాతకో...?
కోవెల సంతోష్ కుమార్