29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

GRAMPHONE: HOW IT WORKS LIVE DEMO PRITHVI THEATRE (గ్రామ్ ఫోన్ రికార్డు...



GRAMPHONE: HOW IT WORKS LIVE DEMO PRITHVI THEATRE (గ్రామ్ ఫోన్ రికార్డు ఎలా పనిచేస్తుందో తెలుసా?) a Talk in Prithvi theater Bombay- on gramophones & records by Dr. Suresh Chandvankar

28, సెప్టెంబర్ 2023, గురువారం

సృజనస్వరం- భోగరాజు సూర్యలక్ష్మి.. ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #కవి...



తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రముఖ రచయిత్రి భోగరాజు సూర్యలక్ష్మి అంతరంగం మీకోసం..

25, సెప్టెంబర్ 2023, సోమవారం

కస్తూరి రంగ రంగా... పాట.. 1930 నాటి రేడియో రికార్డు..



కస్తూరి రంగ రంగా.. మా యన్న కావేటి రంగ రంగా.. అన్న పాట చిన్నప్పుడు మన నానమ్మలు, అమ్మమ్మల నోట వినని వారు బహుశా అరుదు... ఆ పాట బహుశా మొట్టమొదట 1930లో జీ సుబ్బులు అనే గాయని స్వరంలో రేడియో వారు రికార్డు చేశారు. ఈ సుబ్బులు గారు గుంటూరు, ప్రకాశం ప్రాంతాలకు చెందిన వారని కొంత సమాచారం. వారి గురించి పూర్తి వివరాలు మద్రాసు ఆకాశవాణి రికార్డుల్లో ఉన్నదని తెలుస్తున్నది. చాలా సంప్రదాయమైన, హార్మోనియంపై వినసొంపుగా ఉన్న ఈ పాటను వీనుల విందుగా వినండి..

21, సెప్టెంబర్ 2023, గురువారం

బాబు అరెస్టు.. టీడీపీ నాయకత్వం విఫలమైందా? #tdpnews #tdpvsycp #naralokes...


చంద్రబాబును అరెస్టు చేస్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఒక రాజకీయ ఆరోపణగా మాత్రమే చూశారు తప్ప అరెస్టు చేస్తే ఆ తరువాత ఏం చేయాలన్న దానిపై ఆలోచించడంలో విఫలమయ్యారు. అరెస్టు అయిన తరువాత కూడా పార్టీ ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నారా లోకేశ్.. యువగళం పాదయాత్రను పూర్తిగా ఆపివేసి.. రాజమహేంద్ర వరానికి పరిమితమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.

14, సెప్టెంబర్ 2023, గురువారం

బాబుకు పవనే దిక్కా? #telugudesampartyofficial @pawankalyanfans2524 #jana...



చంద్రబాబునాయుడు అరెస్టు.. అనంతర పరిణామాలు ఒక్కసారిగా పవన్ కల్యాణ్ కు కలిసి వచ్చినట్టయింది. రెండు పార్టీల ఉమ్మడి పోరాటానికి పవన్ కల్యాణే నాయకత్వం వహిస్తారా? అంటే అవుననే అంతా భావిస్తున్నారు.

సత్యహరిశ్చంద్ర పద్యాలు.. గానం: శ్రీ పాణ్యం దత్తశర్మ.. #telugu #telugulit...



శ్రీ కౌతా పూర్ణా నంద కళా వేదిక, గాంధీ నగర్, విజయవాడలో సత్య హరిశ్చంద్ర నాటకాలు పద్య గానపోటీలు జరిగాయి. ఆ సందర్భంగా ప్రముఖ రచయిత, గాయకుడు హరిశ్చంద్ర పద్యాలు గానం చేశారు. వారికి విశిష్ట ప్రత్యేక పురస్కారం, ప్రశంసా పత్రం, జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు. దత్త శర్మ గారు గానం చేసిన పద్యాలు.. వారి స్వరంలోనే విని ఆనందించండి.

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

పారిశ్రామిక వేత్తల లాగే వ్యవసాయ వేత్తలు.. మహాభారతం రైతులకు ఇచ్చిన గౌరవమిది.



పారిశ్రామిక వేత్తల లాగే వ్యవసాయ వేత్తలు.. మహాభారతం రైతులకు ఇచ్చిన గౌరవమిది. మరి మనం ఏం చేస్తున్నాం. 80 శాతం మంది ఆధారపడిన వ్యవసాయానికి రాజ్యాంగంలో ఎంత చోటు కల్పించాం?

11, సెప్టెంబర్ 2023, సోమవారం

భారతీయ చింతన గ్రంథావిష్కరణ.. ప్రఖ్యాత రచయిత దహగాం సాంబమూర్తి గారి అశీతి...



భారతీయ చింతన గ్రంథావిష్కరణ.. ప్రఖ్యాత రచయిత దహగాం సాంబమూర్తి గారి అశీతి మహోత్సవం.. వరంగల్ లో జరిగిన కార్యక్రమం సమగ్ర కథనం.

7, సెప్టెంబర్ 2023, గురువారం

ఇక అఖండ భారత కూటమి...? #bjptelangana #bjpandhrapradesh #congresstelangan...

రామాయణంలో.. పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది.. అయినా మనం ఎందుకు అరువు తెచ్చుకొ...



రామాయణం అంటే కేవలం సీతను ఎత్తుకుపోవడమో.. లేక రావణుణ్ణి చంపడమో కాదు.. అంతకు మించి. రామరాజ్యం అంటే ఏమిటో వాల్మీకి రామాయణం ఏం చెప్పుతున్నదో చూడండి. అయినా మనం బయటి నుంచి అరువు తెచ్చుకొన్నాం. సూపర్.. ఉదాహరణకు ఒకటి రెండు పాయింట్లు.. మీకోసం..మొత్తం వీడియో చూడండి.. చాలా విషయాలు అర్థమవుతాయి. రాజు నిద్రమత్తులో ఉండకూడదు. తెల్లవారుజామునే లేచి ఆ రోజు చేయాల్సిన పనులను గురించి ఆలోచించాలి. • తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం వచ్చే పనిని చేపట్టి.. దాన్ని కూడా ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. • రాజు పూర్తిచేసిన పనులు మాత్రమే ఇతరులకు తెలియాలి. ముందుముందు చేయతలపెట్టిన పనులు బయటకు తెలియకూడదు. • ఇతరులు లేదా ప్రత్యర్థులు తమ తెలివితో.. లేక ఇతర అడ్డదారుల్లో మన రహస్యాలను తెలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రామం భజే శ్యామలం- కోవెల సంతోష్ కుమార్ 8వ అధ్యాయంలో రెండోభాగం

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

దేశం పేరు మార్పు.. గుట్టు రట్టు #congresstelangana #bjptelangana #brs



ఇండియా పేరును తొలగిస్తూ.. కేవలం భారత్ అని ఒకటే పేరు ఉండేలా పేరు మార్పు ప్రక్రియకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. దీని వెనుక నేపథ్యం ఏమిటి? హఠాత్తుగా దేశం పేర్లలో ఒకదాన్ని మాత్రమే ఎందుకు ఉంచుతున్నారు?

4, సెప్టెంబర్ 2023, సోమవారం

వేదాలు చెత్త పుస్తకాలా? #vedamu #ramayan #ramambhajeshyamalam #kovelasan...



వేదాల్లో అన్నీ ఉన్నాయిష అని వెటకారం చేసిన వాడెవడికీ వేదాలు తెలియవు. సంస్కృత భాషే రాదు. ఇక అర్థమేం తెలుస్తుంది. ఎవడో చెప్పిన నాలుగు ముక్కలను పట్టుకొని.. ఎద్దేవాలు చేస్తుంటారు. ముందు చదివి అర్థం చేసుకుంటే కదా.. అందులో ఏమున్నదో తెలిసేది. ఆ తరువాత తిట్టినా అర్థం ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనట్టు.. ఒక్కో దేశం నుంచి అరువు తెచ్చుకొని ఓహో అన్నట్టు పే...ద్ద ఉద్గ్రంథం రాసుకొని ఊరేగుతున్నాం. ఇక్కడ ఉన్నవేవో తెలుసుకొని అందులో పనికొచ్చేవాటిని తీసుకొని రాసుకొని ఉంటే.. ఇంతకంటే పెద్ద గ్రంథమే అయ్యేది కాదా.. ?