29, మార్చి 2023, బుధవారం

అయోధ్యలో రామమందిరం 10 విశేషాలు #shorts #shortsvideo #shortsfeed #shortsv...


అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావస్తున్నసందర్భంగా మందిరానికి సంబంధించిన పది విశేషాలు.. శ్రీరామ నవమి సందర్భంగా.. ఈఎన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

మోడీజీ నేనున్నా.. మీరేం భయపడకండి.. #karnataka #karnatakanews #aimim #bjp...


కర్ణాటక ఎన్నికల నగారా మోగడంతో గెలుపోటముల లెక్కలు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లీడ్ ఉంటుందని సర్వేలు చెప్తుండగా.. మరో సారి గెలవటానికి మోదీ షా ద్వయం తమ సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం కూడా పోటీలోకి దిగుతుండటంతో బీజేపీ ఊపిరి పీల్చుకొంటున్నది. మైనార్టీ ఓట్లు ఎంఐఎం చీలిస్తే.. బీజేపీకి లాభం చేకూరుతుందనటంలో సందేహం లేదు.

చంద్రబాబుకు వైసీపీ నేతలే దిక్కా? #tdp, #ycp #ycpvstdp #ycpnews #tdpnews


రాజకీయాలలో అధికారంలోకి వస్తామన్న ఆత్మవిశ్వాసం ప్రతీ పార్టీలో ఉంటుంది. అది ఉండాలి కూడా..అంతే కాదు ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి .అంతవరకు ఓకే. కానీ అది అతివిశ్వాసంగా మారితేనే కష్టం..దాని వల్ల ఆ పార్టీకే నష్టం..ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టీడీపీ తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆ పార్టీ  పదే పదే తమదే అధికారం అని ప్రకటిస్తోంది.   అంతేకాదు కొందరు నేతలు  అప్పుడే అధికారంలోకి వచ్చామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

28, మార్చి 2023, మంగళవారం

చిన్నమ్మ మళ్లీ వచ్చింది #bjptelangana #bjpvscongress #bandisanjay #kisha...


బీజేపీలో మహిళా నాయకురాలు అంటే ఒకప్పుడు వినిపించే పేరు సుష్మా స్వరాజ్..బీజేపీలోనే కాదు అన్ని పార్టీలకు చెందిన వారి అభిమానమూ సంపాదించిన మహిళా నేత ఆమె. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన సుష్మ  చిన్నమ్మగా కూడా పేరు  తెచ్చుకున్నారు. రాజకీయాలలో ప్రవేశించాలనుకునే మహిళలకు సుష్మ స్ఫూర్తిగా నిలిచారు.  ఆమె మరణించిన తర్వాత బీజేపీలో కూడా అంతటి సామర్థ్యమున్న మహిళా నేతలెవ్వరూ రాలేదనడంలో సందేహం లేదు. చాలా కాలం తర్వాత సుష్మ స్వరాజ్ అందరికీ మరోసారి గుర్తుకొచ్చారు. దీనికి కారణం ఆమె కూతురు బాన్సురీ స్వరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే. .

పాపం డీఎస్ #congress #congressnews #arvinddarmapuri #brs


పాపం డీఎస్.. ఇప్పటి ఆయన పరిస్థితి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన  డీ శ్రీనివాస్ కు ఇలాంటి దురవస్థ ఏంటి అనిపించకమానదు. అది కూడా సొంత కొడుకుల వల్లే ఈ పరిస్థితి రావడం మరీ దారుణమనిపిస్తుంది. రెండు రోజుల కిందట కాంగ్రెస్ కండువా కప్పుకున్న సమయంలోనే ఎందుకో తేడా కొట్టినట్టనిపించింది. 

27, మార్చి 2023, సోమవారం

మహారాష్ట్రలో తెలంగాణ సెంటిమెంట్ #congress #brs #brsparty #brsnews



బీఆరెస్ రైతు ఎజెండా  జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? దేశవ్యాప్తంగా రైతులను బీఆరెస్ సంఘటితం చేయగలుగుతుందా? ఇదే ఇపుడు బీఆరెస్ ముందున్న సవాలు.రైతుల సమస్యలు ఎక్కడుంటే బీఆర్ఎస్ అక్కడ కాలుమోపాలన్న వ్యూహంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించినట్టే ఇపుడు రైతుల కష్టాలపై ఉద్యమాలకు సిద్దమవుతున్నారు.ఇపుడు మహారాష్ట్రలో సభలు నిర్వహించడంలో కూడా అదే ఉద్దేశముంది. దేశంలోనే ఇక్కడ  ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారన్న పేరుంది.  తమ డిమాండ్ల కోసం మహారాష్ట్రలో కొన్నాళ్ళుగా అక్కడి రైతుల ఉద్యమిస్తున్నారు.. కొన్నాళ్ళ కిందటే మహారాష్ట్రలో 10వేల మంది రైతులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. 200 కిలోమీటర్ల ఈ పాదయాత్ర ముంబైకి చేరడానికి మధ్యలోనే ప్రభుత్వం రైతుల డిమాండ్లకు తలొగ్గాల్సివచ్చింది. ఇలాంటి ఆందోళనలు మహారాష్ట్రలో తరచూ జరుగుతూనే ఉంటాయి. గిట్టుబాటు ధరలేక ఉల్లి రైతులు పడిన  కన్నీటి కష్టాలు అందరికే తెలిసిందే..  ఇలాంటి సమయంలో రైతులను తమవైపు ఆకర్షించవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. 

రేవంత్ కు కలిసి వస్తున్నదా? #congress #congressnews #revanthreddy #revan...


తమ నాయకుడు రాహుల్ గాంధీపై వేటు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కలిసి వస్తున్నదా? ఆ సానుభూతి పవనాలు తెలంగాణలో కాంగ్రెస్ కు మేలు చేసే అవకాశం ఉన్నదా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులను రేవంత్ రెడ్డి ఎలా సద్వినియోగం చేసుకోనున్నారు?

26, మార్చి 2023, ఆదివారం

తేక్కాడీ (కేరళ ట్రావెలాగ్ - దత్తశర్మ ఆరో భాగం)#travelvlog #traveling #...


ప్రఖ్యాత రచయిత పాణ్యం దత్త శర్మ కేరళ ట్రావెలాగ్ చివరి భాగం.. తేక్కాడి.. ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రకు తీసిపోకుండా భారతీయ కథాకథన సంప్రదాయానికి వినూత్నతను జోడించి వ్యాఖ్యానించిన ట్రావెలాగ్.. అద్భుతం.. త్వరలో గుజరాత్, ద్వారక, రాజస్థాన్ ట్రావెలాగ్ ను మరింత అందంగా చెప్పబోతున్నారు. సిద్ధంగా ఉండండి..

విలన్ ఎందుకు? హీరో అయితే ఓకే... #mallareddy #mallareddyuniversity #brs


తెలుగు సినిమా ప్రేక్షకులు నిజంగా ఒక గొప్ప నటుడిని చూసే అవకాశం కోల్పోయారు. అది ఎవరో కాదు.. మన మంత్రి మల్లారెడ్డి. మంత్రి స్వయంగా చెప్పే వరకు కూడా చాలా మందికి ఈ విషయం తెలియక పోవడం నిజంగా సినీ అభిమానుల దురదృష్టం. మన దర్శకులు మల్లారెడ్డికి మంచి పాత్రలు ఇవ్వకపోతే.. భవిష్యత్తులో ఆయన తీసే సినిమాలో ఆయనే హీరో అయినా ఆశ్చర్యం లేదు.

అంతుపట్టని యోగ రహస్యం.. ఛిన్నమస్త #chinnamasta #dasamahavidhya #dasamaha...


దశమహా విద్యల్లో అంతుపట్టని యోగ రహస్యం ఛిన్నమస్త.. మన శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు, ఛిన్నమస్తకు ఉన్న సంబంధం ఏమిటి.. శరీరంలో ప్రాణాధారమైన నిరంతర రక్త ప్రసారానికి, ఛిన్నమస్తకు ఉన్న విజ్ఞాన శాస్త్ర సంబంధం ఏమిటి? మహా యోగ రహస్యం .. చూడండి..

కవిత అరెస్టు లేనట్టేనా? #kavita #edcase #brs #congress #edinijamtelugu



రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దు వ్యవహారం లిక్కర్ స్కాం విచారణపై ప్రభావం చూపనున్నదా? ఈడీ విచారణలో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ.. బీఆర్ఎస్ నేత కవితను కూడా అరెస్టు చేస్తారని అనుకొన్నారు. కానీ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ విచారణకు బ్రేక్ పడనున్నదా? బీఆర్ ఎస్ కు ఇది కొంత ఊరట కలిగించే అంశమే.

రాహుల్ ను చూసి మోదీ భయపడుతున్నారా? #congress #congressnews #bjp #bjptela...



రాహుల్ గాంధీని చూసి మోదీ భయపడుతున్నారా? అదానీ పేరు ప్రస్తావించడమే రాహుల్ సభ్యత్వ రద్దుకు కారణమా? అదానీ గురించి రాహుల్ లోక్ సభలో మాట్లాడిన వెంటనే పాత కేసును తిరగదోడి.. రోజుల వ్యవధిలోనే తీర్పు ఇప్పించడం వెనుక మోదీ భయమే కారణమా?

25, మార్చి 2023, శనివారం

రంగంలోకి ప్రియాంక #priyanka #congress #congressnews #edinijamtelugu


రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ.. రంగంలోకి దిగనున్నారా? వాయనాడ్ కు ఉప ఎన్నిక వస్తే ప్రియాంక అక్కడి నుంచి పోటీ చేస్తారా?

కేసీఆర్, రాహుల్ కలిస్తే..


కేసీఆర్.. రాహుల్ కలుస్తారా? రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం రద్దు కారణంగా కేసీఆర్ రాహుల్ కు అనుకూలంగా స్పందించడం వెనుక వ్యూహం ఏమిటి?గతంలో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా స్పందించిన కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేకంగా పదును పెడుతున్న ఎత్తుగడలు ఏమిటి?

ఈ మోడీ.. మోడీ కాదు.. బూట్ వాలా.. #rahulgandhi #modi #purneshmodi #edinij...


పూర్ణేశ్ మోడీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయించగలిగి సంచలనం సృష్టించిన బీజేపీ నేత. నిజానికి ఈ పూర్ణేశ్ మోడీ.. ఇంటి పేరు మోడీ కాదా.. అతని అసలు ఇంటిపేరు బూట్ వాలా.. మరి మోడీ అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది?

24, మార్చి 2023, శుక్రవారం

రాహుల్ పై బీజేపీ వ్యూహం రివర్స్? #rahulgandhi #rahul #congress #edinijam...


కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వ్యూహం బీజేపీ కి ప్రతికూలం కానున్నదా? ఈ నిర్ణయం తిరిగి రాహుల్ గాంధీపై సానుభూతిగా మారనున్నదా? ప్రతిపక్షమే లేకుండా చేయాలని బీజేపీ భావిస్తున్నదన్న ఆరోపణకు ఈ నిర్ణయం బలం చేకూరుస్తున్నదా?

23, మార్చి 2023, గురువారం

మున్నార్ టీ మ్యూజియం (కేరళ ట్రావెలాగ్ - దత్తశర్మ ఐదో భాగం)#travelvlog ...


దేవభూమి కేరళ. అలాంటి దేవభూమిని ప్రఖ్యాత రచయిత పాణ్యం దత్త శర్మ సందర్శించి తనదైన శైలిలో.. కథా కథన సంవిధానంతో.. అద్భుతంగా వివరిస్తున్నారు. అందులో ఇది నాలుగో భాగం.. కేరళలోని మున్నార్ టీ మ్యూజియం సందర్శనం.. తప్పక చూడండి.. పది మందికి చూపించండి.. తరువాతి భాగం కోసం సబ్ స్క్రయిబ్ చేయండి.

కర్ణాటకలో కేసీఆర్ ఎవరిని గెలిపిస్తారు? (impact of brs in karnataka) #kar...


రానున్న కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ ఎస్ పోటీ వల్ల జేడీఎస్ లాభపడుతుందా? ఓట్లలో చీలికల వల్ల బీజేపీ, కాంగ్రెస్ కు లబ్ధి జరుగుతాయా? బీఆర్ఎస్ కర్ణాటకలో ఏ మేరకు తన అస్తిత్వాన్ని చాటుకోబోతున్నది?

సృజనస్వరం- హెచ్చార్కే.. ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ #hrklive #telugu


సృజనస్వరం కార్యక్రమంలో ఈ వారం తెలుగు కవి హెచ్చార్కే అంతరంగం.. ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీ కృష్ణ

22, మార్చి 2023, బుధవారం

GIRISH KARNAD A RARE INTERVIEW #girishkarnad #jnanapeeta #jnanapitha #en...



He wrote his first play, the critically acclaimed Yayati (1961), while still at Oxford. Centred on the story of a mythological king, the play established Karnad’s use of the themes of history and mythology that would inform his work over the following decades. Karnad’s next play, Tughlaq (1964), tells the story of the 14th-century sultan Muḥammad ibn Tughluq and remains among the best known of his works. this is his rare interview conducted by sahitya acadami

10 గంటలు.. 10 ఫోన్లు.. 10 ప్రశ్నలు..#kavita #edcase #liquor scam #entvte...


లిక్కర్ స్కాంలో విచారణ అంతా ఫోన్ల చుట్టూనే తిరుగుతున్నది. ఎంఎల్ సీ కవిత అందజేసిన ఈడీకి అందజేసిన ఫోన్లలో ఏదైనా ఈడీ కోరుకొన్న సమాచారం దొరికే అవకాశం ఉన్నదా?

20, మార్చి 2023, సోమవారం

కవిత.. లాకప్ ఖాళీగా లేదు.. (no lock up for kavita)


కవిత కోసం ఈడీ లాకప్ లో ఖాళీలు లేవంట.. ఒకటి ఖాళీ అవుతే తప్ప మరొకరిని అందులో చేర్చడానికి అవకాశం లేదంట.. 

19, మార్చి 2023, ఆదివారం

వైఎస్సార్సీపీ కి ముందస్తు హెచ్చరికేనా? (a WARNING FOR YCP)


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి వైఎస్సార్సీపీకి ముందస్తు హెచ్చరికా? ఎన్నికల్లో ఓటమి.. వైసీపీ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకొంటుంది.. అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి వ్యూహంతో ముందుకు పోతుంది?

తప్పు ఒకరిది.. శిక్ష నిరుద్యోగులకా? (who is responsible for tspsc leakage


కేవలం ఒకరిద్దరి కారణంగా నాశనమయ్యే స్థాయిలో ఒక వ్యవస్థ ఉన్నదంటే.. దాన్ని వ్యవస్థ అంటారా? ఒకే ఒక్క కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటంతో లక్షలాది నిరుద్యోగుల తల రాతలు మార్చేసేంత బలహీనంగా టీఎస్ పీఎస్ సీ ఉన్నదా? ఒకరిద్దరి తప్పుకు లక్షలాది నిరుద్యోగులు క్షోభ పడాల్సిందేనా? బాధ్యులెవరు?

17, మార్చి 2023, శుక్రవారం

దిక్కులేని రైతు.. (onion farmers tears.. no body responding)


ఎంతసేపూ కవిత అరెస్టవుతుందా? ఆస్కార్ అవార్డులు వస్తాయా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అన్న విషయాలు తప్ప మనకు మూడు పూటలా పట్టెడన్నం పెడుతున్న అన్నదాత పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతే.. పట్టించుకొనే నాథుడెవ్వడు?

16, మార్చి 2023, గురువారం

విచారణకు వెళ్లకుంటే జరిగేది అదే..? (IS KAVITA ATTENDS ED ON 20TH MAR)


బీఆర్ఎస్ నేత కవిత ఈ నెల 20 న కూడా ఈడీ ముందు హాజరుకాకుంటే ఏం జరుగుతుంది? ఇదే ఇపుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.  ఇపుడున్న పరిస్థితులలో ఆమె సుప్రీంకోర్టులో విచారణ మొదలయ్యేవరకు కూడా ఈడీకి దూరంగా ఉండాలనే భావిస్తున్నట్టున్నారు. అంటే ఈ నెల 24 వరకు కూడా ఆమె ఈడీ ఆఫీసుకు వెళ్లకపోవచ్చు. 

వర్మ పాఠాలు వినే ఖర్మ ఏమిటి?


చదివేస్తే ఉన్న మతి పోయిందంటారు. ఇపుడు నాగార్జున యూనివర్సిటీ ఆచార్యులను చూస్తుంటే జాలివేస్తుంది. ప్రపంచంలో ఎవరూ దొరకనట్టు అకడమిక్ ఎగ్జిబిషన్ కు ముఖ్యఅతిథిగా దర్శకుడు ఆర్జీవీని పిలిచారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అసలే ఆయన దర్శకుడిగా ముదిరి ఇంకేదో అయ్యాడు. ఆయన నేర్చుకున్న పాఠాలు నిజంగా వింటే మన విద్యార్థులు ఏమవుతారో భయంగా ఉంది. 

14, మార్చి 2023, మంగళవారం

వాటికీ చేయాలా..? చట్టాలకు విలువేమున్నది?


స్వలింగ వివాహాలను గుర్తించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తేల్చి చెప్పింది. ఈ తరహా వివాహాలకు గుర్తింపు నిచ్చేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తన వైఖరిని వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడం సంచలనం సృష్టిస్తున్నది. స్వలింగ సంపర్కాలను గుర్తిస్తే సమాజం పెడదోవన పడుతుందని పేర్కొనడంతో స్వలింగ సంపర్కంపై మన దేశంలో మరోసారి చర్చ మొదలైంది.

ఆ పొత్తు పవన్ కొంప ముంచేందుకేనా?


తెలుగుదేశంతో పొత్తు అంటేనే పార్టీలు భయపడే పరిస్థితి ఉందా? ఒకప్పుడు బీజేపీకి ఎదురైన పరిస్థితే ఇపుడు జనసేనకు ఎదురుకాబోతుందా? ఈ విషయంలో  కొందరు జనసేనను ముందే అప్రమత్తం చేశారా? టీడీపీ దృష్టిలో తమ పార్టీ ఏంటో జనసేనాని పవన్ కల్యాణ్ కు సంకేతాలు అందినట్టున్నాయి. అందుకే తమను టీడీపీ 20 సీట్లకే పరిమితం చేయాలనుకుంటోందంటూ పవన్ బయటపడ్డారు. 

13, మార్చి 2023, సోమవారం

బండికి బ్రేకులేస్తున్నారా?


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు బ్రేకులు వేసే ప్రయత్నం జరుగుతున్నదా? కొద్ది కాలంగా సద్దుమణిగినట్టున్న అసమ్మతి మళ్లీ రేగుతున్నదా? తాజా పరిణామాలు అవే చెప్తున్నాయి.

రాజమౌళే అసలు హీరో


ఇక రాజమౌళిని దర్శకుడు అనలేమేమో.. ఆయన సినిమాలకు ఆయనే హీరో.. ఆయనే అన్నీనూ.. తెలుగు సినిమాకు ప్రపంచ యవనికపై అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చి తెలుగుల గౌరవాన్ని కీర్తి శిఖరాలకు అందించిన దర్శకుడు రాజమౌళి. 

11, మార్చి 2023, శనివారం

ఇతర పార్టీల నేతలే దిక్కా?


తెలంగాణలో అమిత్ షా వచ్చినా అంతేనా? పార్టీలో సొంత నేతలు లేరా? అవకాశాలు ఇవ్వడం లేదా? ఇతర పార్టీల నేతలపై ఆధారపడటం తప్ప దిక్కు లేదా?

10, మార్చి 2023, శుక్రవారం

సృజనస్వరం- ద్విభాష్యం రాజేశ్వర్ రావు ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ

కవిత కోసం సోనియా వస్తారా?


లిక్కర్ స్కాం లో సమన్లు అందుకొన్న ఎంఎల్ సీ కవిత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రశంసించడంపై రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశంసించిన కొన్నాళ్లకే కవిత ఈ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ల రాబోయే సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నట్టు విమర్శకులు భావిస్తున్నారు.

9, మార్చి 2023, గురువారం

ఈడీ విచారణలతో జరిగేదేమిటి? ఒరిగేదేమిటి?

ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు, విచారణలు, అరెస్టులతో ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవరికైనా శిక్షలు పడ్డాయా? విచారణల ప్రహసనంతో ఏం జరుగుతుంది?

8, మార్చి 2023, బుధవారం

సృజనస్వరం- ఆదూరి సీతారామమూర్తి ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ రెండ...



ప్రఖ్యాత రచయిత ఆదూరి సీతారామమూర్తి సృజన స్వరం రెండోభాగం.. రచయిత అంతరంగం మీకోసం..

an universal director.. adoor gopalakrishnan.. journey of a legend


An universal director.. adoor gopalakrishnan rare conversation

ఢిల్లీకి వెళ్తే జైలుకేనా?


లిక్కర్ స్కాం లో ఎంఎల్ సీ కవితను ఢిల్లీకి రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేయడం వెనుక మతలబు ఏమిటి? ఢిల్లీలోనే విచారించి అక్కడే అరెస్టు చేస్తారా? ఇదే బీజేపీ వ్యూహమా? దీనిని బీఆర్ ఎస్ రాజకీయంగా ఎలా ఎదుర్కొంటుంది?

యోగి మోదీని మించిపోతారా?


ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇమేజి రోజు రోజుకూ పెరుగుతున్నది. ఈక్రమంలో బీజేపీలో యోగి.. ప్రధాని మోదీని మించిపోతారా?

7, మార్చి 2023, మంగళవారం

కేసీఆర్ ను రేవంత్ ఢీ కొనగలరా?

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ ఊపొచ్చింది. ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు తెచ్చి పెడుతుందా? కేసీఆర్ ను రేవంత్ ఢీ కొనగలరా?

అమెరికాను ఏలేది భారతీయుడే..


మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న అమెరికాలో అప్పుడే హడావుడి మొదలైంది. ఈసారి ఎన్నికల్లో భారత సంతతి వారు ప్రముఖంగా పోటీలో నిలబడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. ఆయన అభర్థిత్వాన్ని సాధిస్తారా? తీవ్రమైన పోటీని తట్టుకొని నిలబడగలరా?

6, మార్చి 2023, సోమవారం

సానియా.. షోయబ్ ఎక్కడ?


టెన్నిస్ స్టార్ సానియా షోయబ్ మాలిక్ ల బంధం దెబ్బ తిన్నదా? సానియా వీడ్కోలు కార్యక్రమానికి కూడా రానంత తీరిక లేకుండా షోయబ్ ఉన్నాడా? ఏది నిజం?

సీబీఐ నెక్స్ట్ టార్గెట్ ఆ నేతలే


సీబీఐ తరువాతి టార్గెట్ ఎవరు? విపక్ష నేతలపైనే సీబీఐ ఎందుకు దాడులు చేస్తున్నది?

5, మార్చి 2023, ఆదివారం

సేనానీ.. ఇక సమయం లేదు


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులు ఎటువైపు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికైనా ఒక స్పష్టత ఇస్తారా?

4, మార్చి 2023, శనివారం

పాక్ సైన్యం ఆకలి భారత్ తీర్చాలా?


పాక్ సైన్యం ఆకలి భారత్ తీర్చాలా? పెను ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ సైన్యానికి కూడా తిండి పెట్టలేని స్థితికి చేరుకొన్నది. ఈ దశలో పాకిస్తాన్ కు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని కొందరంటున్నారు. విభజన నాటి నుంచి మన దేశంలో రక్తపాతం సృష్టించిన పాక్ కు సాయం ఎలా చేసేదని మరికొందరంటున్నారు.

RUDRA-SHIVA.. VEDIC CONCEPT BY RL KASHYAP



Creation of Universe by the divine is a perpetual act and not a few days affair like constructing a house. All living things follow this principle. For example, Creation of a bird do not end up when it come out from the egg. Its evolution to develop body, wings, growing strong, then an old age and even death is part of creation.  This is why Hindus says birth and death are two sides of same coin.

Of course, this may look like a paradox. But once you understand the concept behind Rudra or Siva then  you can overcome the paradox in the statement and understand the broad sense of creation. Purana in its narrative style of storytelling have told and retold us that, Brahma is creater, Vishnu sustains and Siva annihilate or destroy. These stories while creating concrete forms for Siva are not ideal to understand the concept behind the cosmic dance of Siva or Siva-Shakti.

Among the Hindu gods, the concept of Siva is most difficult to understand. Hindus still have the prevailing concept that Siva is formless.  That is why, in temples, while all other Gods were crafted with beautiful figures, Siva alone is installed in the form of a simple stone and called as Siva Linga, a symbol of Siva. The most popular mantra, “Om Nama Sivaya”, is not a praise to Lord  but a high spiritual concept in which a devotee identifies himself with Siva, the infinite existence. Ardhanariswara, Siva-Sakti, Dakshinamurthi are other important concepts.

The concept of Nataraja, the rhythmic dance of Siva is the best imagination for the Harmony in Nature. This has amazed many a scientists and philosophers. Frijof Capra, Coomaraswamy, Vilayanur s Ramachandran are few among them.  Dr R L Kashyap a Scientist turned Vedic Scholar takes this concept to the new heights in the following video.

Dr R L Kashyap, now in his late seventies is an old student of Indian institute of science and Harward University and professor- emeritus of Purdue University.  He had a meritorious research life spanned over 35 years in United States.  Some of his theories are very popular and are part of science and Engineering textbooks.

ఈ దూరం తగ్గేదే లే..


తెలంగాణ ప్రభుత్వం,గవర్నర్ ల మధ్య వివాదం అలాంటిదే. దాదాపు రెండేళ్లుగా ఏదో ఒక అంశంపై రెండు వ్యవస్థల మధ్య దూరం పెరుగుతూనే ఉంది. ఎవరి పట్టు వారిదే..ఇప్పుడు మళ్లీ రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య పంచాయితీ మొదటికొచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళి సై పెండింగ్ లో ఉంచడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, ఆ వెంటనే గవర్నర్ స్పందించడం చూస్తుంటే ఈ వివాదం మరింత ముదిరేట్టు కనిపిస్తోంది. 

3, మార్చి 2023, శుక్రవారం

వేషం మారితే రాత మారుతుందా?

తెలంగాణలో త్రిపుర వ్యూహం.. బీజేపీ ఎత్తుగడా?

తెలంగాణలో బీజేపీ త్రిపుర వ్యూహాన్ని అనుసరిస్తోందా? ఒకప్పుడు జీరోగా ఉన్న రాష్ట్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీ తర్వాత టార్గెట్ తెలంగాణ కానుందా? ఈశాన్యంలో సాధించిన విజయాలను సౌత్ లో ఎందుకు సొంతం చేసుకోలేమన్నదే బీజేపీ నేతల ఆలోచన. దక్షిణాదిలో బీజేపీ ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఇక మిగిలిన రాష్ట్రాలలో తెలంగాణలో మాత్రమే ఆ పార్టీకి అంతో ఇంతో పట్టు ఉంది. అందుకే తెలంగాణలో కొంతకాలంగా సీరియస్ గా ఫైట్ చేస్తోంది.

మున్నార్ (munnar) (కేరళ ట్రావెలాగ్ - పాణ్యం దత్తశర్మ మూడోభాగం)


తనదైన కథాకథన శైలిలో.. ట్రావెలాగ్ ను కూడా ఈ విధంగా చెప్పవచ్చా అని ఆశ్చర్య పరిచేరీతిలో అత్యద్భుతంగా వివరిస్తున్న పాణ్యం దత్తశర్మ.

2, మార్చి 2023, గురువారం

సృజనస్వరం- ఆదూరి సీతారామమూర్తి ఇంటర్వ్యూ.. కస్తూరి మురళీకృష్ణ మొదట...


సృజనస్వరం- ఆదూరి సీతారామమూర్తి  అంతరంగం వినండి

ఇమిటేషన్ ఆచార్యులు.. తెలుగు బజారు వింతలు.. శ్రవణ వ్యంగ్యం



ఇమిటేషన్ ఆచార్యులు.. లఘు హాస్య వ్యంగ్య రూపకం.. తెలుగు పద్యనాటకంలో ఒక అద్భుతం

హమ్మయ్య.. నిత్యానంద కైలాసం దేశం కాదు..


చివరకు  చైనా,పాకిస్తాన్ లతో పాటు నిత్యానంద కైలాస దేశంతో కూడా పోరాడాల్సివస్తుందా అని మనలో చాలా మంది భయపడ్డారు. ఇక్కడ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పారిపోయిన నిత్యానంద అంత శక్తిమంతుడెలా అయ్యాడని ఆందోళన కలిగింది. అంతేకాదు ఇలా దేశం నుంచి పారిపోయినవాళ్లంతా నిత్యానందలాగే కొత్తగా దేశాలు స్థాపించి మనపై యుద్దాన్ని ప్రకటిస్తే ఎలా అనికూడా అనిపించింది. కొద్ది రోజులుగా ఇలా ఎన్నో భయాలు,అనుమానాలు అందరినీ తొలిచివేశాయి.

1, మార్చి 2023, బుధవారం

Rabindranath Tagore: India’s Great Poet sends a message to America



Sir Rabindranath Tagore, Hindu philosopher speaking. Says the shrinking of distance between countries should be used to promote spiritual values, not just commerce. Indian artist and Nobel Prize winning author makes first appearance in talking films.


మజ్లిస్ బీజేపీ దోస్తానా??

మజ్లిస్ బీజేపీ ల మధ్యన రహస్య అవగాహన ఏదైనా ఉన్నదా? ఒకవేళ ఉన్నట్టయితే అది ఏ పార్టీకి నష్టం కలిగిస్తుంది?

TUM BAHUT YAAD AYE .. bollywood tributes the legend mohd. rafi (A rare d...


GREAT TRIBUTE TO MOHD.RAFI BY ENTIRE BOLLYWOOD