27, మార్చి 2023, సోమవారం

మహారాష్ట్రలో తెలంగాణ సెంటిమెంట్ #congress #brs #brsparty #brsnews



బీఆరెస్ రైతు ఎజెండా  జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? దేశవ్యాప్తంగా రైతులను బీఆరెస్ సంఘటితం చేయగలుగుతుందా? ఇదే ఇపుడు బీఆరెస్ ముందున్న సవాలు.రైతుల సమస్యలు ఎక్కడుంటే బీఆర్ఎస్ అక్కడ కాలుమోపాలన్న వ్యూహంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించినట్టే ఇపుడు రైతుల కష్టాలపై ఉద్యమాలకు సిద్దమవుతున్నారు.ఇపుడు మహారాష్ట్రలో సభలు నిర్వహించడంలో కూడా అదే ఉద్దేశముంది. దేశంలోనే ఇక్కడ  ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారన్న పేరుంది.  తమ డిమాండ్ల కోసం మహారాష్ట్రలో కొన్నాళ్ళుగా అక్కడి రైతుల ఉద్యమిస్తున్నారు.. కొన్నాళ్ళ కిందటే మహారాష్ట్రలో 10వేల మంది రైతులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. 200 కిలోమీటర్ల ఈ పాదయాత్ర ముంబైకి చేరడానికి మధ్యలోనే ప్రభుత్వం రైతుల డిమాండ్లకు తలొగ్గాల్సివచ్చింది. ఇలాంటి ఆందోళనలు మహారాష్ట్రలో తరచూ జరుగుతూనే ఉంటాయి. గిట్టుబాటు ధరలేక ఉల్లి రైతులు పడిన  కన్నీటి కష్టాలు అందరికే తెలిసిందే..  ఇలాంటి సమయంలో రైతులను తమవైపు ఆకర్షించవచ్చన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంది. 

కామెంట్‌లు లేవు: