భాష మీద అధికారం, పద్యవిద్యా ప్రాగల్భ్యం ఉండటం సాధారణంగా కావ్యరచనకు తగిన అవసరం. దీంతో పాటు పదప్రయోగంలో ఏయే అక్షరాలు ఎక్కడెక్కడ ఒదిగి ఉంటవో సద్య స్ఫురణలో ఉండటం చిత్రకవితకు ప్రధాన లక్షణం. చిత్ర కవితలో గర్భ కవిత్వం, బంధ కవిత్వం, ఏకాక్షర, ద్యక్షర పద్యాలు, పద్య భ్రమక, పాద భ్రమకాలు.. అనులోమ విలోమ రీతులు, అంతర్భవిస్తవి. చిత్ర కవిత నిర్వహణకు ఛందస్సు మీద ఉన్న అధికారం గర్భ కవిత్వానికి ప్రధానమైన అర్హత. సీస పద్యంలో మత్తేభం నాలుగు పాదాల్లో ఇమిడిపోతుంది. అట్లాగే గీత పద్యంలో కందము ఇమిడిపోతుంది. పై పాదాలలో మొదట చివర చేర్చవలసిన అక్షరాలు యతులకు అనుగుణంగా తెలిస్తే ఇది సాధ్యమవుతుంది.అట్లాగే ఇతర గర్భ పద్యాలకు కూడా. ప్రబంధ రాజ వెంకటేశ్వర విలాసంలో గణపవరపు వెంకట కవి ఒక సీస పద్యంలో సుమారు 190 పద్యాలను ఇమిడించాడు. ఇది ప్రపంచంలోనే ఛందో విద్యలో అసామాన్యమైన పోటీలేని ఒక గొప్ప ఉపలబ్ధి. కంద పద్యంలో ఆయా భాగాల్లో విరుపులతో నాలుగు కంద పద్యాలు ఇమిడిపోతవి. ఇది యతి ప్రాసలను ఇమిడించుకునే ఎరుకతో సాధించవచ్చు. ఆధునిక కాలంలో ఒక కవి భారత గర్భ రామాయణం అని ఒక అపూర్వ ప్రబంధాన్ని నిర్మించాడు. గర్భ పద్యాలలో రామాయణ గాధ, మొత్తం పద్యంలో భారత గాధ ఇమిడి ఉంటాయి. ఇది ఒక విధంగా ద్వ్యర్థి కావ్యాలకు విలక్షణమైన చేర్పు. సంస్కృతంలో అనులోమ విలోమ కావ్యంగా రామాయణ భారతాలను ఇమిడించిన ఒక అద్భుత కావ్యం ఉన్నది.
ఇంకా చిత్రకవిత్వంలో ఒక అక్షరంతోని, రెండు అక్షరాలతోని పద్యాలు నిర్మించే ప్రక్రియ ఉన్నది. ఈ రీతి కవికి ఉన్న నిరంతర భాషాధ్యయనము, నిఘంటు పరిజ్ఞానము వల్ల సాధ్యపడుతుంది. పద్య భ్రమక, పాద భ్రమకాలు భాషమీద ఛందస్సు మీద ఉన్న పట్టు వల్ల సాధింపబడేవి. శ్రీరామా, రామాశ్రీ అన్న కంద పద్య తొలిపాదం పాద భ్రమక రీతికి ఒక ఉదాహరణ. నాలుగు పాదాలు ఇలాగే రచన సాగుతుంది. శబ్దాల బహు అర్థ సంఘటన అక్షరాలను పోహళించే రీతి గురు లఘవుల పొదిగింపు ఈ ప్రజ్ఞలన్నీ చిత్ర కవితకు అత్యవసర సాధనాలు.
బంధ కవిత్వం విషయం వస్తే, విచిత్రమైన ఆకారాలు, ఛత్రము, ఖడ్గము, నాగము, గజము మొదలైనవి కల్పించి వాటిలో తాను ఇమిడించదలచుకున్న పద్యానికి తగిన గడులను ఏర్పరిచి ఆ అక్షరాలు రెండు మూడు సందర్భాలలో, భిన్న భిన్న అర్థాలలో కుదిరేట్లు నిర్మించుకోవటం తో పాటు గణ యతి ప్రాసలకు భంగం కలగకుండా పద్య రచన సాగించవలసి ఉంటుంది. ఈ బంధ కవిత్వాన్ని నూరు పైగా బంధాలలో చిత్రించిన వారు కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన శతావధానం కృష్ణమాచార్యులు. అట్లాగే వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు తమ అనేక ప్రబంధాలలో (వాటిలో అచ్చ తెనుగు కావ్యాలు, నిరోష్ట్య, నిర్వచన కావ్యాలు ఉన్నవి) 60 విలక్షణమైన బంధ భేదాలు నిర్మించారు. ఈ పద్యాలు నూరుకు మించే ఉన్నాయి.
చిత్ర కవిత్వ అభ్యాసం ప్రధానంగా తెలంగాణాలోని కవుల రచనల్లో కన్పిస్తుంది. ఈ రకమైన విలక్షణ స్థితికి ఈ ప్రాంతంలో కవులలో ఉండే సృజన శీలంలోని ప్రయోగ దృష్టి కారణం అని చెప్పాలి. ఈ విషయం ప్రత్యేకంగా పరిశోధించితే ఈ కవులు చేసిన ప్రయోగాలలోని వైశిష్ట్యము, నైపుణ్యం తెలియవస్తాయి. చిత్రకవిత్వ పద్యాలు సాధారణంగా కావ్య మధ్యంలో దేవతా స్థుతులలో కన్పిస్తుంది. ఈ కావ్యాలలోని చక్రబంధం విలక్షణమైంది. దీన్లో ఒక వలయంలో కావ్య నామం, ఇంకొక వలయంలో కవి నామం, నిక్షేపింపబడి ఉంటాయి. మరింగంటి సింగరాచార్యులు రచించిన బిల్హణీయ కావ్యం ఇంకొకరి రచనగా ప్రచారం అయినా, చక్రబంధంలో నిక్షేపింపబడిన నామం వల్ల అది ఆయన రచనగా సురవరం ప్రతాపరెడ్డి గారు నిర్ణయించారు. చిత్ర కవిత్వం కవి వు్యత్పన్నతకి, అసాధారణ ప్రజ్ఞకు ఉదాహరణ. ఇది ఒక ప్రత్యేకమైన విద్యావిశేషం. ప్రహేళికల వంటి నిర్మాణం. ఆధునిక సాహిత్య విమర్శకులు దీన్నేదో గారడీ విద్య అని నిరసించే ప్రయత్నం చేశారు. ఈ కాలంలో అసాధారణ ప్రతిభాభ్యాసాలకు గిన్నిస్ బుక్ వంటి వాటిలో స్థానం లభిస్తున్నది. అయితే తెలుగు కవిత్వం సాధించిన ఈ అసాధారణ ప్రజ్ఞా విశేషాలను గూర్చి మనం ఎందుకు గర్వించకూడదో అర్థం కాదు. కవిత్వం అంతా భావ కవిత్వంలా ఉండదు. జీవితమంతా హంసతూలికా తల్పంలా ఉండదు. జీవితంలో వైవిధ్యం ఎలాంటిదో కవిత్వంలోని వైచిత్రి కూడా అలాంటిది. జీవితంలో అద్భుతం, మనస్సుకు ఎంత ఉదాత్తతను కల్పిస్తుందో, చిత్ర కవిత్వం కల్పించే అలాగే చిత్తానికి ఉన్నతిని కల్పిస్తుంది. మనం సమాహిత చిత్తంతో చిత్ర కవిత్వాన్ని అది కలిగించే అచ్చెరువుని అనుభవిద్దాం.
25, జనవరి 2009, ఆదివారం
8, జనవరి 2009, గురువారం
మన మీడియా వెళ్తున్న దారి సరైనదేనా?
మన మీడియా వెళ్తున్న దారి సరైనదేనా? అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ప్రస్తావిస్తున్నా. మీడియా పారదర్శకత సమాజంలో దాని భూమికను మీరే నిర్ధారించండి.
* 26/11 దాడులకు సంబం`దించి భారతీయ మీడియా తీసుకున్న స్టాండ్(వైఖరి) కూడా చర్చనీయాంశమైంది. రెండు మాసాలుగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తీరుపై దేశ వ్యాప్తంగా విస్తతంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ సందర్భంలో ప్రజల మనోభావాలను ప్రతిబింబించే వి`దంగా చర్చ చేసిన చానళు్ల చాలా తక్కువ. ఇలాంటి వాటిలో టైమ్‌సనౌ చానల్ అగ్రస్థానంలో ఉంది. pakistan is our enemy అని ముందుగా వ్యాఖ్యానించింది టైమ్‌సనౌ... పాకిస్తాన్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారంటూ చెప్తున్న మాటలన్నీ బూటకమేనని స్పష్టం చేసింది. పాలకులను ఎన్నుకున్నది ప్రజలే అయినప్పుడు జరుగుతున్న పరిణామాలకు వారూ `ా`ద్యత వహించాల్సిందేనన్న టైమ్‌స వాదన సమంజసమైంది. పాకిస్తాన్‌లోని ప్రతి ప్రాంతం ఉగ్రవాదానికి ఆలవాలమైంది.వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది అక్కడి ప్రభుత్వ యంత్రాంగం.. అక్కడి మదరసాల్లో ఉగ్గుపాలతోనే భారత వ్యతిరేక విషబీజాలను పసివాళ్లలో నాటుతున్నారు. ఇంత తీవ్రస్థాయిలో భారత వ్యతిరేకత అక్కడి ప్రజల్లో, పాలకుల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్‌ను శత్రువనకపోతే ఇంకేమంటాం... ``పాకిస్తాన్ మారాలనుకుంటోంది.. అందుకు అవకాశం ఇవ్వాలంటూ'' రాం జెత్మలానీ వంటి మూర్ఖ లాయర్లు చేసే వాదన అర్థరహితమైందని టైమ్‌స స్పష్టం చేసింది. అరవై ఏళు్లగా పాకిస్తాన్ మారుతుందనే ఎదురు చూశాం.. ఇంకా మార్పు సా`ద్యమేనని పేర్కొనటం మన చేతకాని తనమే అవుతుంది.
* ' 2008 నవంబర్ 26న ముంబయిపై టెరర్రిస్టుల దాడి దేశంపైనే పాక్ శ్రత్రువులు ప్రకటించిన యుద్ధం. కొత్త దారులు వెతుక్కుని వాణిజ్య రాజ`దానికి ప్రతీకలుగా నిలిచిన సంస్థలపై ఉగ్రవాదులు దాడులు జరిపితే...భారతీయ మీడియా కనపరచిన అత్యుత్సాహం `ƒమించరానిది. టెలివిజన్ చానళు్ల పోటీలు పడి ప్రత్య`ƒ ప్రసారాలు చేయటం వల్ల ఉగ్రవాదుల ఏరివేత ఆలస్యం కావటమే కాక, మరింత ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించింది. తాజ్, ఓ`ెరాయ్ హోటళ్లలో దాగి ఉన్న టెరర్రిస్టులకు పాకిస్తాన్‌లో ఉన్న వారి `ాస్‌లు మన టెలివిజన్ చానళ్లలో వస్తున్న సమాచారం ఆ`దారంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేశారంటేనే మీడియా వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. హోటళ్లలో మంత్రులు ఉన్న సంగతి, సైనికులు ప్రవేశించిన విషయాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌లోని `ాస్‌లు తమ వారికి సాటిలైట్ ఫోన్‌ల ద్వారా చెప్తూ వీలైనంత అ`దిక నష్టాన్ని చేసేందుకు ప్రయత్నించారు. తాజ్ హోటల్ ముందు మూడు వందల మీటర్ల దూరంలో కొందరు పాత్రికేయులు చేసిన డ్రామా పిటుసిలు సర్వత్రా విమర్శలకు దారి తీశాయి.
* ' కార్గిల్ యుద్ధం సమయంలో ఎన్‌డిటివి పొలిటికల్ ఎడిటర్ బర్ఖాదత్ యుద్ధభూమి నుంచి వార్తలను ప్రసారం చేసింది. ఆ సమయంలో ఆమె సాహసానికి ప్రశంసల వర్షం కురిసింది. ఆ వార్తల కవరేజీలో ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకుందన్న వార్తలూ వెలువడ్డాయి. కానీ, నిజం వేరేలా ఉంది. కార్గిల్ ప్రాంతానికి వెళ్లిన బర్ఖాదత్ కెమెరా చిత్రీకరణకు అనువుగా ఉండేలా శతఘు్నలను పేల్చాలంటూ అ`దికారులను అడిగిందిట. అందుకు అ`దికారులూ సరేనన్నారట. ఈ దశ్యాలకు సంబం`దించి, ప్రసారం చేసే విషయాన్ని చర్చించేందుకు బర్ఖా సెల్‌ఫోన్‌ను ఉపయోగించిందట. ఈ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆ`దారంగా పాకిస్తాన్ సైనికులు దాడి చేస్తే, ముగ్గురు భారతీయ సైనికులు, శక్తిమంతమైన తుపాకులు, బంకరు నాశనమై పోయాయట.
* ' 2006 సెప్టెంబర్ మొదటి వారంలో ఉజ్జయిని మా`దవ్ కాలేజీ ప్రొఫెసర్ హెచ్. ఎస్. సభర్వాల్‌పై ఎబివిపి కార్యకర్తలు దాడి చేసి హతమార్చారు. విద్యార్థి సంఘం ఎన్నికలను పర్యవే`ిస్తున్న ఆయనపై దాడి చేసే విషయాన్ని ముందుగానే ఎబివిపి కార్యకర్తలు మీడియాకు వెల్లడించారు. ఈ దాడిని కవర్ చేసేందుకు ఎబివిపి కార్యకర్తలు చేరకముందే వివి`ద చానళ్ల కెమెరాలు సభర్వాల్ ఇంటికి చేరుకున్నాయి. ఆ తరువాత ఎబివిపి గూండా విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి ప్రొఫెసర్‌ను కొడుతుంటే ఆయనపై కెమెరాలు ఉంచి షూట్ చేశారే తప్ప ఆ దాడిని అడ్డుకునే ప్రయత్నం మీడియా ప్రతిని`దులు చేయలేదు. ప్రొఫెసర్ దాహం దాహం అన్నా ఆయన మంచినీళు్ల కొరుతున్నారంటూ ప్రత్య`ƒ ప్రసారం చేశారు కానీ, ఆయన్ను ఆదుకునే ప్రయత్నం మీడియా చేయలేదు. దాని పర్యవసానం సభర్వాల్ మరణం..
* ' మూడున్నర సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో ఒక ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఓ భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకోవటానికి ముందే ఈటీవీ, టివి9 చానళు్ల అక్కడికి చేరుకున్నాయి. అతను భవంతి పైనుంచి డిమాండ్లు చేస్తున్నప్పటి నుంచి అతను పై నుంచి దూకి చనిపోయేంత వరకు కూడా ప్రతి `ƒణం రికార్డు చేశాయి. ఆ తరువాత ఆ రోజంతా ఆ సన్నివేశాన్ని జూమ్ ఇన్‌లు, జూమ్ అవుట్‌లు, స్లో మోషన్.. ఇలా రక రకాలుగా ప్రసారం చేశారు. ఒళు్ల గగుర్పొడిచే, సున్నిత మనస్సులను తీవ్రంగా గాయపరిచే ఇలాంటి ఘటనలను ప్రసారం చేయటం వల్ల సమాజంలో ఎలాంటి మార్పును మీడియా కోరుకుందో అర్థం కాదు.. దీని తరువాత ఇలాంటి ఘటనలు మరో రెండు జరిగాయి. అంతే కాదు... సెల్‌ఫోన్ టవర్‌లపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ `ెదిరించిన ఘటనలూ ఆ తరువాత రొటీన్‌గా మారిపోయాయి.
* ' 2008 డిసెంబర్ 10వ తేదీన వరంగల్ లో ఇద్దరు బిటెక్ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలపై ముగ్గురు విద్యార్థులు యాసిడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన వారిలో స్వప్నిక ఇరవై రోజులు ఆసుపత్రిలో మత్యువుతో పోరాడి చనిపోయింది. యాసిడ్ దాడి చేసిన ముగ్గురు దోషులను ఇరవై నాలుగు గంటలు తిరక్కుండానే వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. పదకొండో తేదీ మ`ద్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇంతవరకు `ాగానే ఉంది. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి సా`ా్య`దారాలతో నేరం రుజువు చేసి వారికి శి`ƒపడేలా చేయటం పోలీసులు ఆ తరువాత నిర్వర్తించాల్సిన వి`ది. కానీ, పోలీసులు సత్వర న్యాయం కోసం ఉరకలు వేశారు. ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన కొద్ది గంటలకే వరంగల్ శివార్లలో దారుణంగా ఎన్‌కౌంటర్ చేసేశారు. నేరం చేసిన కొద్ది గంటల్లోనే వారికి తగిన శి`ƒ పడిందని అంతా సంతోషించారు. శి`ƒ పడటం `ాగానే ఉంది. కానీ న్యాయస్థానం మెట్లు నిందితులు ఎక్కకుండానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు శి`ƒను అమలు చేసిన తీరు ఆ`ేపణీయం. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు కాబట్టి పోలీసులు తాము చేసిన పనిని సమర్థించుకోవచ్చు. కానీ, రాజ్యాంగ పరంగా పోలీసులు ఈ కేసును పరిష్కరించిన తీరు గర్హనీయం. న్యాయాన్ని అన్యాయంగా చేయటాన్ని ఒకసారి ఆమోదిస్తే.. భవిష్యత్తులో పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే ప్రమాదం ఉంటుంది. అమ్మాయిలకు భద్రత చట్టాన్ని చేసినట్లయితే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.. దోషులు చట్టం నుంచి తప్పించుకునే వాళు్ల కారు..నేర వార్తను వివరిస్తూనే... పోలీసుల నిర్ణయాన్ని విశ్లేషించటం, అమ్మాయిల ర`ƒణకు ప్రభుత్వాలు తీసుకోవలసిన త`ƒణ చర్యల గురించి చర్చిస్తూ... నిష్పా`ికంగా వార్తను రాయటం ప్రొఫెషనల్ జర్నలిస్టు కర్తవ్యం.
* ' ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిన వ్యవహారంలో పోలీసులు నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోకుండా ఆ వ్యవహారానికి సంబం`దించిన అశ్లీల సిడిలను లోపాయికారిగా మీడియాకు విడుదల చేయటం అనైతికం. పోలీసులు తాము విడుదల చేయలేదని చెప్తున్నా.. అక్కడి నుంచే లీకయిందన్న వార్తలు కొట్టిపారేయలేం. ఇలాంటి సున్నితమైన కేసుల విషయంలో పోలీసులు మహిళల ప్రాథమిక హక్కుల్ని, సున్నితత్వాన్ని గ్రహించి మెలగటం అవసరం. పోలీసులు ఆ పని చేయలేకపోయారు. కనీసం మీడియా అయినా సరిగ్గా వ్యవహరించిందా అంటే అదీ లేదు.. `ా`దితురాలి పేరు చెప్పకుండా ముఖంపై మాస్‌క వేసినంత మాత్రాన గోప్యతను పాటించినట్లు ఎలా అవుతుంది? ఘటన జరిగిన స్థలాన్ని పేర్కొని, `ా`దితురాలి తల్లిదండ్రుల పేర్లు చెప్పటం ద్వారా అమ్మాయి అస్తిత్వాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి దశ్యాలను రోజంతా అటు తిప్పి, ఇటు తిప్పి చూపించటం వల్ల ఆ అమ్మాయి కుటుం`ానికి నష్టం చేసినట్లే కానీ, మేలు చేసిందేమీ లేదు... అదష్ట వశాత్తూ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేయకుండా, రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.
* ' 2003 మార్చిలో ఇరాక్‌పై అమెరికా యుద్ధం చేస్తే మీడియా లైవ్ కవరేజి ఇవ్వలేదు.. అమెరికా అనుమతించిన మేరకే విజువల్‌స రికార్డు చేసి ఆ తరువాత చూపించారు. తమ దేశ ప్రయోజనాలకు భగం కలిగించే ఏ ఒక్క సన్నివేశాన్నీ మీడియాలో ప్రసారం కాకుండా అమెరికా నియంత్రించగలిగింది. అదే 26/11 2008 టెరర్రిస్టుల దాడిని మీడియా అత్యుత్సాహంతో ప్రత్య`ƒ కవరేజీ చేస్తుంటే సర్కారు ఏ వి`దంగానూ నియంత్రించలేకపోయింది. ఈ అలసత్వాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మలచుకున్నారు.
* ' పత్రికాస్వేచ్ఛ పేరుతో మీడియా అనుభవిస్తున్న స్వాతంత్య్రానికి పరిమితులు లేకుండా పోయింది. వాస్తవానికి పత్రికా స్వేచ్ఛ అన్న పదానికి ఎక్కడా చట్టబద్ధత లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడా పత్రికాస్వేచ్ఛ గురించి పేర్కొనలేదు. 19వ అ`దికరణంలోని భావప్రకటనా స్వేచ్ఛనే పత్రికా స్వేచ్ఛగా పేర్కొంటూ మీడియా తన అస్తిత్వాన్ని కొనసాగిస్తున్నది. సమాజంలో అది నిర్వహించే కీలక భూమికను దష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలూ దీన్ని పట్టించుకోవటం లేదు. స్వయం నిర్దేషిత స్వేచ్ఛను కూడా మీడియా దుర్వినియోగం చేయటం వల్ల ఎవరికీ మేలు జరగకపోగా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళు్తన్నాయి.
5, జనవరి 2009, సోమవారం
రక్తమోడుతున్న ఈశాన్యభారతం
ముంబయిలో టెరర్రిస్టుల దాడి జరిగితే అది దేశంపై ముష్కరులు ప్రకటించిన యుద్ధంగా పెద్ద ఎత్తున ప్రజల ఆగ్రహం పెల్లుబికింది. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా దౌత్యపరమైన చర్యలు మొదలయ్యాయి. సాక్ష్యాలు పాక్ చేతిలో పెట్టి మరీ అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది మన సర్కారు.. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుపట్టాల్సింది ఏమీలేదు. ఇవన్నీ ఆహ్వానించదగిన పరిణామాలే...అయితే అదే ఉగ్రవాదం ఈశాన్యభారతంలో సాగిస్తున్న మారణహోమానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యం శూన్యం.. వాస్తవానికి ఇక్కడ సాయుధ వేర్పాటువాద పోరాటం కాశ్మీరం కంటే హింసాత్మకమైంది. మన ప్రభుత్వానికి ఈశాన్య రాషా్టల్ర అస్తిత్వమే గుర్తుకు రావటం లేదు.. ఇంతకంటే దురదృష్టం ఇంకేముంటుంది?
ప్రతి సంవత్సరం జనవరి ఒకటి వస్తోందంటే చాలు.. అసోం గడగడలాడుతుంది. ఎందుకంటే దేశమంతా కొత్తసంవత్సర వేడుకల కోసం ఉత్సాహపడుతుంటే.. అసోం మాత్రం ఈసారి ఎక్కడ బాంబు పేలుతుందోనన్న భయం ప్రజ వెన్నుల్లోంచి వణుకు పుట్టిస్తుంది. గత రెండు మూడేళ్ల మాదిరిగానే ఈసారి కూడా జనవరి ఒకటిన గౌహతిలో వరుస పేలుళు్ల పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని అనంతవాయువుల్లో కలిపాయి.వేర్పాటు వాదుల మృత్యుయజ్ఞానికి అమాయకులు సమిధలవుతున్నారు. నిజానికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఉగ్రవాద హింసాకాండ కంటే బ్రహ్మపుత్ర లోయలో, దాని చుట్టుపక్కల కొండ కనుమల్లో కొనసాగుతున్న మారణకాండ అధికంగా ఉందని దక్షిణాసియా టెరర్రిజం పోర్టల్ వెల్లడించింది. నిన్న మొన్న కాలగర్భంలో కలిసిపోయిన సంవత్సరంలో అస్సాం, మణిపూర్‌లలోనే వెయ్యిమంది వేర్పాటువాదానికి బలైపోయారంటేనే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.2006లో 640మంది చనిపోతే.. 2008లో మృతుల సంఖ్య 1057కు పెరిగింది. ఇదే సంవత్సరంలో కాశ్మీర్‌లో టెరర్రిజానికి 539 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఎక్కువ మంది సామాన్య ప్రజలే కావటం దురదృష్టం. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌లో టెరర్రిజాన్ని ఎదుర్కోవటంపై చూపించిన శ్రద్ధ ఈశాన్యభారతంలో వేర్పాటువాదాన్ని అణచివేయటంపై చూపించలేదనటానికి అక్కడ పెచ్చరిల్లుతున్న హింసే తార్కాణం. సైనిక చర్యలకు మరణిస్తున్న వేర్పాటువాదుల సంఖ్య పెరుగుతున్నా...వారి మనోధైర్యాన్ని మాత్రం మన బలగాలు దెబ్బతీయలేకపోతున్నాయి. 2006లో 317మంది టెరర్రిస్టులు చనిపోతే 2008లో వీరి సంఖ్య 612కు చేరింది. ఇదే సమయంలో ఈ పోరాటంలో చనిపోతున్న సైనికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈశాన్యభారతంలోని ఏడు రాషా్టల్ల్రో చొరబాట్లు చాలా తేలిగ్గా జరుగుతుంటాయి. ఆరు దశాబ్దాలుగా ఇక్కడ వేర్పాటు వాదం ప్రజలకు ప్రశాంతత లేకుండా చేసింది. 1994నుంచి ఇప్పటివరకు పదిహేనేళ్లలో బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతంలో 16వేల 271మంది చనిపోయారంటేనే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అస్తిత్వం కోసం వివిధ జాతులు ఇక్కడ చేస్తున్న అస్తిత్వ ఉద్యమాలను ప్రభుత్వాలు పట్టించుకోని దుస్థితే ఈ అస్థిరతకు కారణం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 50 మిలియన్ల ప్రజల్లో 20శాతం మంది ఈశాన్య రాషా్టల్ల్రోనే ఉన్నారు. దేశంలో ఆంత్రొపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన 632 గిరిజన జాతుల్లో 213 ఈశాన్య రాషా్టల్ల్రోనే ఉన్నాయి. ఈ జాతులు, తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకపోవటం వల్ల ఇక్కడ వేర్పాటు వాదం పెచ్చరిల్లింది. స్థానిక, స్థానికేతర వాదం ప్రజ్వరిల్లింది. దాదాపు 32 సంస్థలు సాయుధపోరాటాన్ని చేపట్టాయి. వీటిలో 15 సంస్థలను మేజర్ మిలిటెంట్ గ్రూపులుగా గుర్తించారు. ఇందులో ఇప్పుడు 12 సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. అసోంలో ప్రధాన సంస్థ ఉల్ఫా, నాగా మిలిటెంట్లతో పొత్తు కుదుర్చుకోవటం ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారింది. అటు బంగ్లా చొరబాట్లను అడ్డుకోవటంలో వైఫల్యం కూడా అస్సాంలో మరింత హింసాకాండకు కారణమవుతోంది. లాల్‌డెంగా నేతృత్వంలో 1986లో మిజో నేషనల్ ఫ్రంట్ ఏర్పడిన తరువాత మిజోరాంలో క్రమంగా వేర్పాటువాదం సన్నగిల్లింది. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాషా్టల్రు కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉన్నాయి. త్రిపురలో రాజకీయ చొరవ సత్ఫలితాలను ఇచ్చింది. ఇక్కడ టెరర్రిస్టు కార్యకలాపాలు నిలిచిపోయి దాదాపు దశాబ్దం పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ప్రధానంగా టెరర్రిస్టు కార్యకలాపాలు జరుగుతున్నవి అసోం, మణిపూర్, నాగాలాండ్‌లలో మాత్రమేనని చెప్పవచ్చు. కాశ్మీర్ కంటే ఎక్కువగా ఈ రాష్ట్రాల్లోనే ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఆక్టివ్‌గా ఉన్న టెరర్రిస్టు సంస్థల్లో పదివేల మంది కేడర్ ఉన్నట్లు అంచనా. జనాభా నిష్పత్తిలో పోలీసుల సంఖ్య ఉన్నప్పటికీ ఈ రాషా్టల్ల్రో హింసను నిరోధించటం సాధ్యం కావటం లేదు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)ను అణచివేసేందుకు అసోం ప్రభుత్వం కేంద్ర సర్కారు సాయంతో ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. 2005లో భూటాన్ ప్రభుత్వం సైనిక చర్యతో తన సరిహద్దుల్లోని ఉల్ఫా శిబిరాలను ఏరివేసిన సందర్భాన్నీ మన బలగాలు అందిపుచ్చుకొని ముందుకు సాగలేకపోయాయి. దీని పర్యవసానం నిరంతరంగా కొనసాగుతున్న హింస. ఈ ప్రాంతంలో సైనిక చర్య ద్వారా వేర్పాటు వాదాన్ని అణచివేస్తామని ప్రభుత్వం భావిస్తే అది భ్రమే అవుతుంది. సైనిక చర్యకు తోడ్పాటుగా, గిరిజన సముద్ధరణకు కృషి చేయనంతకాలం ఈశాన్యభారతం రక్తమోడుతూనే ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)