31, జులై 2009, శుక్రవారం
ప్రజారాజ్యం కనుమరుగు అవుతున్నదా?
మెగాస్టార్... ఏడాది క్రితం వరకు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్త ఒక ఉత్కంఠను సృష్టించింది. ఆయన ఎన్నికల ప్రచారంలోకి కదిలితే జనం ఆయన వెంట పరిగెత్తింది. సరిగ్గా ఏడాది కాలం పూర్తయింది. ఇంకో ఇరవై ఆరు రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ తొలి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోబోతోంది. అదే సమయంలో అస్తిత్వం కోసం పోరాడుతోంది....ఉన్న వాళ్లంతా వెళ్లిపోతుంటే.. మిగతా వారిని కాపాడుకోవటానికి ఏం చేయాలో తోచక అయోమయంలో ఉంది.
పోయినోళు్ల పోతే పోనీ... ఉన్నోళ్లే చాలు... నా ఇమేజీ ఒక్కటే చాలు.. అన్నీ నేనే... అంతా నేనే.. నా సభలకు ప్రభంజనంలా వచ్చిన జనమే నేనేమిటో నిరూపిస్తున్నారు... ఇక అధికారంలోకి రావటమే తరువాయి....2009 ఎన్నికలకు ముందు చిరంజీవి చెప్పిన మాటలు.. నిజం.. ఇందులో ఎలాంటి అసత్యం లేదు. ఎన్నికలకు ముందు చిరంజీవికి ఉన్న అంచనాలు ఇవి. ఆయన తనను తాను అమితంగా విశ్వసించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. చిరు అంచనాలకు మీడియా హైప్ బాగా తోడయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల దాకా ఆయన చేసిన ప్రచారానికి వచ్చిన జనం మరే రాజకీయ పార్టీ నాయకుడికీ రాలేదు.. మరి ఈ జనం అంతా ఏమయ్యారు. వీరంతా ఓట్ల రూపంలో ఎందుకు మారలేదు... తన సభలకు వస్తున్న వారు ఓట్లుగా మారటం లేదని ఎన్నికలు జరుగుతున్నప్పుడే చిరంజీవికి అర్థమయింది. కానీ, అప్పటికే జరగాల్సిన ఆలస్యమంతా అయిపోయింది. చివరకు 17శాతం ఓట్లతో, 18 సీట్లతో అసెంబ్లీలో మెగాస్టార్ అడుగుపెట్టారు. ఆ తరువాతైనా పార్టీని పటిష్ఠం చేసే దిశగా ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. దాని ఫలితం... పార్టీ క్రమంగా అనాధగా మారిపోతుండటం... రంగస్థలం మించి ఒక్కరొక్కరుగా తప్పుకుంటుండటం... కొందరు చిరంజీవిని నిందించి బయటకు వెళ్తే.. మరికొందరు ఇమడలేకపోతున్నామంటూ వెళ్లిపోయారు.. ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు... మెగాస్టార్ రాజకీయ ప్రవేశంలో కీలక పాత్ర పోషించిన మిత్రా దగ్గర నుంచి ఒకే ఊరు.. కోస్టార్ అయిన కృష్ణంరాజు వరకూ అంతా చిరంజీవిని వదిలేశారు..
ఇలా ఎందుకు జరిగింది? ప్రజారాజ్యం పార్టీలో ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న పరిణామాలకు కారణమేమిటి? పార్టీని ఇంతకాలం ముందుండి నడిపించిన మహామహులంతా ఏమైపోయారు..? ఎక్కడ ఉన్నారు..? ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి ఇప్పుడు ఒంటరి అయిపోయారు.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన పార్టీ అస్తిత్వం ప్రశ్నార్థకంలో పడిపోయింది. పార్టీని వదిలిపెట్టి వెళ్లే వారే తప్ప.. వచ్చేవారు ఒక్కరూ కనిపించటం లేదు.. దీనికంతటికీ మూలం ఎక్కడ ఉందో.. అధినేత చిరంజీవికే అర్థం కాని పరిస్థితి ఉంటే.. ఇక మిగతా కేడర్‌కు ఎలా ఉంటుంది?
ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి మరో ఇరవై ఆరు రోజుల్లో ఏడాది పూర్తి చేసుకోబోతోంది. ఏడాదిలోనే ఎన్ని ఒడిదుడుకులు...పార్టీ ప్రారంభించినప్పుడు తిరుపతిలో జరిగిన బహిరంగ సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూడగానే చిరంజీవితో పాటు ఆయన కోటరీలో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరిగింది. మెగాస్టార్‌ను అన్నీ తానే అయి నడిపించిన అల్లు అరవింద్ అయితే.. దూకుడుగా వ్యవహరించారు. వైఎస్, చంద్రబాబులు పోటీ చేసే రెండు స్థానాలు తప్ప 292 స్థానాలూ మావేనన్నారు.. అడుగడుగునా సర్వే చేసి గెలుపు గుర్రాలకే టిక్కెట్లిచ్చామన్నారు.. తీరా చూస్తే.. ఆయనే గెలవలేదు... ఆయన సొంత ఊళ్లో బావగారిని గెలిపించుకోలేదు.. పిఆర్‌పి ఎన్నికల వూ్యహం ఎంత పేలవంగా ఉందో అధినేత ఓటమితోనే తేలిపోయింది. సేఫ్‌గా రెండో స్థానంలో పోటీ చేసి గెలిచారు కాబట్టి చిరంజీవి ప్రతిష్ఠ ఆ మాత్రమైనా నిలబడింది. ఇక ఆ తరువాత అసలు కథ ప్రారంభమైంది.. ఒక్కరొక్కరూ నెమ్మది నెమ్మదిగా జారుకోవటం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కొందరు జారుకుంటే, ఫలితాల తరువాత మిగతా వాళు్ల ఆ బాట పట్టారు. మిత్రా, వినయ్, శివశంకర్, బండి రమేశ్, కనకారెడ్డి, కృష్ణంరాజు.. చివరకు రాష్ట్ర చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లారు. ఇక కెఎస్‌ఆర్ మూర్తి, దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి, నర్రా రవికుమార్‌లు తమకు ఇబ్బంది లేకుండా వెళ్లే దారిని వెతుక్కుంటున్నారు. మరో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను దేవేందర్ తనతో పాటు తీసుకెళు్తన్నారని వార్తలు.. ఇదే నిజమైతే... ప్రజారాజ్యం పతనం అంచుకు చేరుకున్నట్లే....
ఒక నిర్దిష్టమైన అజెండా ఏమీ లేకుండా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. దాని పరిస్థితి ఎలా ఉంటుందనేందుకు ప్రజారాజ్యం ఒక ఉదాహరణ...ప్రజారాజ్యం ఏర్పాటు హడావుడిగానే సాగింది. కానీ, దాని ప్రస్థానమే పడుతూ లేస్తూ సాగుతోంది. పార్టీ పెట్టిన సంవత్సర కాలంలో ఒకే ఒక్కసారి ఒక్క గంట పాటు కందిపప్పు ధరపై రోడ్డుపై కూర్చోవటం తప్ప చిరంజీవి నేరుగా ప్రజాందోళనల్లో ఏనాడూ పాల్గొనలేదు. పార్టీ పెట్టిన తరువాత కొంతకాలానికి సామాజిక న్యాయం సిద్ధాంతం మొగ్గ తొడిగింది. కనీసం పార్టీలోకి యువరక్తాన్ని తీసుకువచ్చారా అంటే అదీ లేదు. సీనియర్లయినా, రాజకీయ వూ్యహరచన చేయగల సమర్థులనైనా తీసుకున్నారా అంటే దానికీ జవాబు లేదు. ఇవాళ్టి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపని వృద్ధబృందాన్ని పార్టీలోకి తీసుకువచ్చి, దాన్ని ఓ వృద్ధాశ్రమం చేశారు. వైఎస్, చంద్రబాబు లాంటి వాళ్లను ఎదుర్కొనే శక్తిసామర్థా్యలు వారికెక్కడివి? వాళ్ల సలహాలతో ముందుకు వెళ్లితే బోల్తా పడటం తప్ప సాధించేమేముంటుంది? చిరంజీవి విషయంలో అక్షరాలా జరిగింది ఇదే... దీనికి తోడు.. ప్రజారాజ్యం యూత్‌వింగ్ అధ్యక్షుడుగా కొరి పదవి తీసుకున్న తము్మడు పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ఆ విభాగాన్ని గాలికొదిలేసి సినిమాల వెంట వెళ్లిపోయారు.. ఇక అల్లుఅరవింద్ జాడే లేకుండా పోయారు.. నాగబాబు సంగతి చెప్పేదేముంది.. వెరసి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ఒంటరి అయిపోయారు... ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
జమాయిత్ ఏ ఇస్లామీతో భారతీయ జనతాపార్టీకి పోలికా....!?
గురువారం రాత్రి సిఎన్‌ఎన్ ఐబిఎన్ చానల్‌లో ఓ చర్చాకార్యక్రమం వాడిగా వేడిగా జరిగింది. పాకిస్తాన్ విషయంలో ప్రధాన జాతీయ పార్టీలైన భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ఈ చర్చలో ప్రధానాంశం. పాకిస్తాన్‌తో చర్చల విషయంలో కైరోలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి గిలానీతో అనూహ్యంగా సానుకూలంగా స్పందించటం రెండు రోజులుగా పార్లమెంటును కుదిపేస్తోంది. పైగా బలూచిస్తాన్‌ను చర్చల్లో అంశంగా చేర్చాలన్న దానికి ఒప్పుకోవటం గమ్మతె్తైన వింత... దీనిపై చర్చించమని సోకాల్‌డ మేదావులనుకునే విశ్లేషకులను సదరు చానల్ పిలిస్తే.. ఆ విశ్లేషకులు దేశానికి సంబంధించిన కీలక విషయాన్ని వదిలిపెట్టి, ఓ కుహనా రాజకీయ వేత్తగా మారి పాకిస్తాన్‌లో అతివాద చాందస సంస్థ, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ఓ ముష్కర మూక జమాయితే ఇస్లామీతో దేశంలోని ఓ జాతీయ రాజకీయ పార్టీని పోల్చటం విస్మయానికి గురి చేసింది. ఈ మాట అనగానే నన్ను బిజెపి మనిషని కొందరు భ్రమ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. దేశ రాజకీయాల్లో బిజెపి తన సిద్ధాంత పరంగానో, మరో మరో కారణాల చేతనైనా భారత రాజ్యాంగ నిబంధనల పరిధిలో, పరిమితుల్లో రాజకీయాలు చేస్తున్న జాతీయ స్థాయి పార్టీ. ఆరేళ్ల పాటు దేశంలో అధికారాన్ని నిర్వహించిన పార్టీ. పార్లమెంటులో వందకు పైగా స్థానాలు గెలుచుకున్న పార్టీ. అలాంటి ఓ రాజకీయ పార్టీని ఓ చాందసవాద సంస్థతో పోల్చటం ఈ దేశ పౌరులంతా ఆక్షేపించాల్సిన విషయం. ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడి, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన కీలక విషయాన్ని పక్కదారి పట్టించే మేధావుల వల్లనే దేశం ఇన్ని రకాలుగా సతమతమవుతోంది. ఒక అడుగు ముందుకేస్తే.. రెండడుగులు వెనక్కి వేస్తోంది. దీనిపై భారతీయులంతా సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. మనకెందుకులే అనుకున్నంతకాలం దేశం మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ దేశం నాది అన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగేలా స్పందించాలని మనవి....
ఇక మూలాల్లోకి వెళ్తే.....
పాకిస్తాన్‌తో మన వైరం 1946 నుంచే మొదలైంది. కాంగ్రెస్‌లో ఒకనాడు అచంచల దేశభక్తుడిగా మెలిగిన మహమ్మద్ అలీ జిన్నా పుర్రెను ఏ క్షణాన ఏ పురుగు తొలిచిందో కానీ, దేశాన్ని విచ్ఛిన్నం చేశాడు. కాశ్మీర్‌ను రావణ కాష్టంగా మండించిపోయాడు. దేశ విముక్తికి మేమే కారణమని భాజాభజంత్రీలు వాయించుకునే మహానుభావులంతా గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. 62ఏళ్లయింది. మన మహానుభావుల బాటలో వారి వారసులు దారి తప్పకుండా నడుస్తున్నారు. వీరికి సమాంతరంగా అధికారానికి దారి ఏర్పరుచుకున్న మిగతా పక్షాల వారూ వారసుల పక్కనే సమాంతరంగా నడుస్తున్నారే తప్ప కొత్తదారిలో ముందుకుపోయేవాళు్ల ఎవరూ లేరు... పార్లమెంటులో మాత్రం అవకాశం వస్తే మాత్రం కొట్టుకుంటుంటారు. వారికి అలా చేయటం వినోదం... జనానికి ప్రాణసంకటం...
62 సంవత్సరాలు గడిచిపోయాయి. కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తానని అన్ని పార్టీలూ గొప్పలు చెప్పి అధికారాన్ని అనుభవించినవే... ఒక విధంగా చెప్పాలంటే దేశంలోని అన్ని పార్టీలూ... ప్రాంతీయ పార్టీలతో సహా అన్నీ కేంద్రంలో ఎంతో కొంతకాలం అధికారాన్ని వాసన చూసినవే ఉన్నాయి. కాశ్మీర్‌లో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించిన పాపం ఇవాళ దేశం మొత్తాన్ని దహించివేస్తున్నది. పాకిస్తాన్ పట్ల కేంద్రంలోని ప్రభుత్వాలు ఎప్పుడూ సరైన అంచనాతో, సరైన విధానాన్ని అనుసరించిన దాఖలా లేదు. ఈ విషయంలో అటల్ బిహారీ వాజపేయి అయినా, మన్మోహన్‌సింగ్ అయినా వేరు కాదు..
పాక్ ఉగ్రవాదులు మన విమానాన్ని హైజాక్ చేసి తాలిబన్ గడ్డపైకి తీసుకువెళ్తే... మన విదేశాంగమంత్రి జస్వంత్ సింగ్ స్వయంగా వెళ్లి వారి డిమాండ్లను నెరవేర్చి మరీ వచ్చారు. తరువాత కాశ్మీర్ అసెంబ్లీపై దాడి జరిగింది. ఏకంగా పార్లమెంటునే ముట్టడించటానికి ముష్కరులు ప్రయత్నించారు. కార్గిల్‌లోకి చొరబడి పూర్తిగా స్థిరపడి పాకిస్తాన్ సైన్యం మనపై యుద్ధానికి సన్నద్ధమైన తరువాత కానీ, నాటి సర్కారుకు కళు్ల తెరుచుకోలేదు. అపారమైన ప్రతిభాపాటవాలతో మనసైన్యం సాధించిన విజయం ఫోటోను చూపించుకుని నాడు బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఇక అటల్జీ పోచికోలు కబుర్లకు(మూ్యజింగ్‌స అని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు) కొదవే లేదు. లాహోర్‌కు బస్సు యాత్ర చేస్తారు. ముషారఫ్‌ను పిలిచి ఆగ్రాలో చర్చలు జరుపుతారు.. మన కార్యదర్శిని ఇస్లామాబాద్‌కు పంపించి చర్చలు జరిపిస్తారు..
ఇక మన్మోహన్‌జీకి ఉన్నది మరింత ఔదార్యం.... ఊహించరాని ఔదార్యమది. గత హయాంలో అంటే ఆయన అధికారంలో ఉన్న మొదటి అయిదేళ్లలో జరిగినన్ని ఉగ్రవాద ఘటనలు అంతకుముందు 55ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. దాదాపు నెలకొకటిగా జరుగుతూ వచ్చాయి. అంతేకాదు.. దేశంలోని అన్ని రాషా్టల్రకూ ఉగ్రవాదులు విస్తరించారు. అక్కడా, ఇక్కడా అని కాకుండా ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా సామూహిక జనహననానికి పాల్పడ్డారు. అన్నింటికీ మించి నిఘా వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉందని విశ్వసించే నౌకాదళాన్ని కన్నుగప్పి సముద్రమార్గం గుండా దేశంలోకి చొరబడి దేశ వాణిజ్యరాజధానిని స్మశాన వాటికగా మార్చే మహా దారుణ యత్నానికి ఉగ్రవాదులు పాల్పడటం మహోపద్రవానికి సంకేతం. 260 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాడు ఇదే సముద్రమార్గం ద్వారా దేశంలోకి వచ్చి మనల్ని బానిసల్ని చేశాడు. ఇప్పుడు పాక్ ముష్కరులు అదే దారిని ఎంచుకున్నారు. మనం చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నాం. ఎప్పటిలాగే కొంతకాలం పాక్‌పై మన పాలకుల ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇక పాక్‌తో మాట్లాడేదే లేదన్నారు. ఉన్నట్టుండి... పాక్‌తో చర్చించటానికి పిఎం ఒకె అన్నారు. అది కూడా ఉగ్రవాదం ఊసు లేకుండా... ఇంకా గమ్మత్తేమిటంటే.. ఎక్కడో బలూచిస్తాన్‌లో టెరర్రిజం సమస్య తమను వేధిస్తోందని, దీనికి కారణం భారతేనని పాక్ ప్రధానిగారు సింగ్‌జీ వద్ద వాపోయారట...తూచ్... బలూచిస్తాన్‌లో సమస్య ఉంటే మాకేం సంబంధం.. కావాలంటే మీ ఆరోపణలపై చర్చించటానికి మేం రెడీ అని ఒప్పేసుకుని, ఓ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేసి మరీ కైరో నుంచి ఇంటికి వచ్చారు సింగ్ గారు..
ఇదంతా ఒక ఉగ్రవాద ఘటనకు, మరో ఉగ్రవాద ఘటనకు మధ్య ఎప్పుడూ జరిగే తంతు అనుకుంటే ఏం ప్రమాదం లేదు.. ఎందుకంటే... ఒక బాంబు పేలుడో.. ఒక టెరర్రిస్టు దాడో జరగ్గానే పాక్‌పై నిప్పులు చెరగడం... ఇది పిరికిపందల చర్య అనో.. దేశమంతా సంయమనం పాటించాలనో... ఇలాంటి వాటికి భయపడేది ఎంతమాత్రం లేదనో ఉపన్యాసాలు చేసేస్తారు... ఉగ్రవాదాన్ని కఠినంగా అణచేసేంతవరకూ పాకిస్తాన్‌తో చర్చలు జరిపేదే లేదంటారు.. మీరే చేశారంటూ సాక్ష్యాలు పంపిస్తారు... పాకిస్తాన్ వాటిని చెత్తబుట్టలో పారేస్తుంది.. ఒకరిద్దరిని అరెస్టు చేసి పంచనక్షత్రాల హోటల్లో ఉంచి రెండురోజుల తరువాత విడుదల చేస్తుంది. నాలుగు రోజులు బాగానే ఉంటుంది. అయిదో రోజు మళ్లీ మొదలవుతుంది. ప్రధాని కుర్చీలో కూర్చున్న పెద్దమనిషికి కడుపులో ఏదో దేవినట్లవుతుంది. మరెవరో మళ్లీ సలహా ఇస్తారు.. అమెరికా లాబీ మెల్లిగా ఊదర మొదలు పెడుతుంది. అంతే...పాకిస్తాన్‌తో మళ్లీ చర్చల ప్రక్రియ మొదలవుతుంది. ఆశావహం అంటారు.. సుహృద్భావపూరిత వాతావరణంలో చర్చిస్తామంటారు.. అన్నీ చర్చకు వస్తాయంటారు.. పరస్పర విశ్వాస చర్యలు చేపడ్తామంటారు.. ఇరు దేశాల మధ్య రాకపోకలు మొదలవుతాయి. ఇదంతా జరుగుతుండగానే మరో పేలుడు.. మళ్లీ చరిత్ర పునరావృతం...
అక్షరాలా ఇలాగే జరిగితే దొందు దొందే అనో.. అంతా ఒక తానుముక్కలే అనో ఓ నిట్టూర్పు విడిచి మరో పేలుడు ఎప్పుడు ఎలా జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్లం అంతా... కానీ, సింగ్ గారి రూటే వేరు. కైరోలో ఆయన వెళ్లింది జి8 సమావేశంలో పాల్గొనేందుకు...సీతను చూసి రమ్మంటే.. లంకను కాల్చి వచ్చినట్లు.. మన సింగ్‌జీ కూడా అలాగే చేశారు. హఠాత్తుగా పాక్ ప్రధానితో సమావేశమయ్యారు. గతంలో ఎప్పుడూ కూడా పాకిస్తాన్‌తో ముందుగా నిర్ణయం కాకుండా ఎవరూ చర్చలు జరపలేదు. కానీ సింగ్ ఈజ్ కింగ్ కాబట్టి...ఆయన అన్నింటికీ అతీతుడు కాబట్టి.. ఆయనే సుప్రీం కాబట్టి గిలానీని పిలిపించుకుని అదే పనిగా చర్చలు జరిపారు. అసలు అజెండాలో లేని సమావేశాన్ని హడావుడిగా ఏర్పాటు చేయటానికి కారణం ఏమిటి? చర్చలు జరిపితే జరిపారు.. మన స్టాండ్‌ను బలంగా వినిపించాల్సిన బాధ్యత ప్రధానికి లేదా? కసబ్ లాంటి తీవ్రవాది ముంబయి దాడుల వ్యవహారంలో నేరం జరిగిన తీరును విస్పష్టంగా వెల్లడించిన తరువాత కూడా పాక్‌పై ఒత్తిడి పెంచడానికి జి8 సమావేశాల్లో గట్టిగా వాదించాల్సిన బాధ్యతను సింగ్ ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించినట్లుంది. గిలానీతో చర్చలకు సిద్ధంకావటమే కాకుండా ఈ చర్చల్లో ఉగ్రవాదం ప్రస్తావన రాదని మరీ హామీ ఇచ్చేశారు..పాక్ ఆరోపిస్తున్నట్లు బలూచిస్తాన్‌లో భారత్ పాత్రపై చర్చించటానికీ సై అన్నారు. ఇదేం విడ్డూరమో అర్థం కాదు...
ఓ పక్క ఉగ్రవాదుల పీచమణచేంత వరకూ పాక్‌తో చర్చించేది లేదంటూనే... చర్చిద్దామంటారు... ఇది ఎలాంటి విదేశాంగ విధానమో ఎంతటి మేధావులు బురల్రు బద్దలు కొట్టుకున్నా అర్థం కానిది.
తీరా ఢిల్లీకి వచ్చాక ఇదే పని చేశారు సింగ్ గారూ అని విపక్షాలు అడగటం వారి తప్పయింది. మీ హయాంలో మీరేదో చేశారు కనుకనా.. మమ్మల్ని అడుగుతారు అని ఎదురుదాడి చేశారు. వాళు్ల సరిగా చేయలేదనే కదా ఈయన్ను అందలమెక్కించింది... అలాంటప్పుడు ఈ ఎదురుదాడికి అర్థమేముంది? బలూచిస్తాన్‌లో మన తప్పేం లేనప్పుడు చర్చించటానికి భయపడాల్సిందేముంది అన్నది మన్మోహన్ సింగ్ వాదన. వాడెవడో అర్థం లేని ఆరోపణ చేస్తే... తగుదునమ్మా అని చర్చిద్దాం అంటే ఆయన్ను ఏమనాలి? ఈయన చేసిన పనికి పాకిస్తాన్‌లో మీడియా, రాజకీయ నేతలు తాము గొప్ప విజయం సాధించినట్లుగా చెప్పుకున్నాయంటేనే సింగ్‌ను గిలానీ ఎలా బోల్తా కొట్టించారో అర్థం చేసుకోవచ్చు. అసలు బలూచిస్తాన్‌కీ మనకు సంబంధం ఏమిటి? ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లిన భారతీయ బృందానికి అక్కడ సహాయ, పునరావాస కార్యక్రమాలు చేసేందుకు సమయం చాలటం లేదు... ఇక బలూచిస్తాన్‌కు వెళ్లి అక్కడ తాలిబన్లతో కుమ్మకై్క ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారట... ఎవరన్నా వింటే నవ్విపోతారు... తాలిబన్లకు తల్లీదండ్రీ పాకిస్తాన్ సైన్యం. ఐఎస్‌ఐ...ఇంత యుద్ధం జరిగిన తరువాత కూడా వారిని వాయవ్య ప్రాంతంలో అతిథి మర్యాదలతో అక్కున దాచిపెట్టుకున్నది పాకిస్తాన్... ప్రపంచపోలీసు కంటపడకుండా లాడెన్‌ను దాచి ఉంచింది పాకిస్తాను.. అలాంటి పాకిస్తాన్‌లో ఉగ్రవాదం చేయటానికి భారత్ నుంచి కుట్ర జరగాలా? ఇదేమని అడిగితే... ఇతర రాజకీయ పార్టీలపై అర్థం లేని అవాంఛనీయ ముద్ర వేస్తారా? దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంలో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏక అభిప్రాయంతో వ్యవహరించాలి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇలాగే జరుగుతుంది. మన దేశంలో తప్ప. కసబ్ నేరాంగీకార ప్రకటనతోనే భారత్ పాకిస్తాన్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచాల్సి ఉండేది. అమెరికాను నిలదీయాల్సి ఉండేది. కానీ, అవన్నీ పక్కనపెట్టి ఆయుధ కొనుగోలు ఒప్పందాన్ని అది కూడా సిగ్గుతో తలదించుకునేలా అమెరికా ముందు మోకరిల్లేలా, తనిఖీలకు అంగీకరిస్తూ కుదుర్చుకున్నారు. ఈ పాలకుల వైఖరి ఏమిటన్నది అంతుపట్టకుండా తయారైంది. సింగ్ బృందం గిలానీకి లొంగిపోయిందా? ఒబామాకు తలూపుతోందా? దేశం ఏ దారిలో పోతున్నది... వీరు ఎక్కడికి తీసుకువెళు్తన్నారు?

29, జులై 2009, బుధవారం
గూటికి చేరుతున్న రాజకీయ పక్షులు
రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా సాయంకాలానికి గూటికి తిరిగి చేరుకోవటం పక్షుల సహజ లక్షణం. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పక్షుల పరిస్థితీ అలాగే ఉన్నట్టుంది. తెలంగాణ పేరుతో, తెలంగాణ కోసమంటూ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన దేవేందర్‌గౌడ్ ఎక్కడా ఇమడలేక. అస్తిత్వాన్ని కాపాడుకోలేక మళ్లీ మాతృసంస్థవైపు చూస్తున్నారు.. బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయపోయినా, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి గౌడ్‌పై వస్తున్న వదంతులను ఖండించవచ్చు. మెగా బావగారి బావమరిది అల్లు అరవింద్ అర్జెంటుగా గౌడ్‌తో సమావేశమై రాజీ చేసే యత్నమూ చేయవచ్చు. కానీ, నిప్పులేందే పొగరాదు కదా....
నిజానికి తెలుగుదేశంలో దేవేందర్‌గౌడ్ ఒకనాడు విప్లవం. 1983లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనంలా అధికారంలోకి వచ్చినప్పుడు రాజకీయాలంటే తెలియని బిసిల్లో అసాధారణంగా వచ్చిన చైతన్యానికి గౌడ్ ప్రత్యక్ష నిదర్శనం. ఎన్టీరామారావుతోనే దేవేందర్ గౌడ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసిన దేవేందర్ సీనియర్ స్థాయికి ఎదగటానికి ఎంతోకాలం పట్టలేదు. తెలుగుదేశం పార్టీకి ఒక దశలో తెలంగాణలో పెద్ద దిక్కుగా మారారు. 1995లో చంద్రబాబు అధికారంలోకి రావటం వెనుకా దేవేందర్ పాత్ర చిన్నదేమీ కాదు. రామారావు ఆగ్రహానికి కడియం శ్రీహరి బలిపశువయితే, దాన్ని ఆసరా చేసుకుని చక్రం తిప్పిన చంద్రబాబుకు అన్ని విధాలా అండదండలిచ్చి పార్టీలో నెంబర్ 2గా ఎదిగారు. తరువాత విపక్షంలోకి వచ్చాక తెలంగాణ ప్రాంతంలో ఆయన నిర్వహించిన పాదయాత్రకూ మంచి స్పందన వచ్చింది. అక్కడి నుంచే తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోవటం ప్రారంభించారు. పార్టీ అధినేతతో సమాన స్థాయిలో తన స్థాయిని భావించారు. పరిశీలకులూ ఆయన్ను అదేవిధంగా చూడటం మొదలు పెట్టారు. నిజంగా ఆయన పార్టీ ని వీడితే తెలంగాణలో ఆయన స్థాయిలో బిసి నేతను సమీకరించుకోవటం సాధ్యమేనా? అన్న అనుమానమూ తీవ్రంగా చర్చ జరిగింది. ఓ పక్క తెలంగాణ ఉద్యమం, మరో పక్క దేవేందర్ ఎదురుదాడితో బాబు ఉక్కిరిబిక్కిరయిన మాట వాస్తవమే. శ్రుతి మించిన ధీమాతో దేవేందర్ పార్టీని విడిచిపెట్టి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆయన పెట్టుకున్న నవతెలంగాణ పార్టీ ఆయన కోరుకున్న తెలంగాణ కోసం ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఆయన వెంట తనవారనుకున్న ఏ ఒక్కరు కూడా నడచిరాలేదు. రాజకీయ పార్టీని నిర్వహించే ఆర్థిక, హార్థిక సామర్థ్యం లేక నెలల వ్యవధిలోనే దేవేందర్ చేతులెత్తేశారు. అటు తనతో సమానమైన కెసిఆర్‌తో కలపడానికి దేవేందర్‌కు చేతులు రాలేదు. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం పిఆర్‌పి. మారు ఆలోచించకుండా పోయి చిరంజీవితో అంటకాగారు దేవేందర్‌గౌడ్. 2009 ఎన్నికల్లో పిఆర్‌పి ఎంతమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. 18మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవటమే ఆ పార్టీకి గగనమైంది. ఆ పార్టీని నము్మకున్నందుకు దేవేందర్‌కూ పరాభవం తప్పలేదు.
చివరకు తెలుగుదేశం నుంచి బయటకు రావాలన్న తన నిర్ణయం ఎంత నష్టాన్ని కలిగించిందన్న ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలో తోచని అయోమయంలో దేవేందర్ గౌడ్ ఉన్నారు. మాతృసంస్థకు తిరిగి వెళ్లటం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. పాతకాపులు వస్తే వారిని సాదరంగా ఆహ్వానించటానికి తెలుగుదేశం, కాంగ్రెస్‌లు సిద్ధంగానే ఉన్నాయి. కానీ, తెలుగుదేశంలో తిరిగి చేరితే, దేవేందర్‌కు పూర్వవైభవం దక్కుతుందా అన్నదే అనుమానం. పార్టీలో ఒక వెలుగు వెలిగి అన్ని విధాన నిర్ణయాల్లో ముఖ్యపాత్ర నిర్వహించిన దేవేందర్‌గౌడ్ అదే పార్టీలో రెండోశ్రేణి నాయకుడుగా మనుగడ సాగించగలరా? అప్పటి గౌరవ మర్యాదలు ఆయనకు పార్టీ కేడర్ నుంచి మళ్లీ దక్కుతాయా? కాలమే నిర్ణయించాలి.
28, జులై 2009, మంగళవారం
రాములమ్మ ముసుగు తొలగింది
విజయశాంతి రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారో.. ఎందుకు ప్రవేశించారో.. ఏం చేశారో.. ఏం సాధించారో.. ఆమెకు కూడా క్లారిటీ ఉన్నట్లు కనిపించదు. అప్పట్లో భారతీయ జనతాపార్టీ అధికారాన్ని అనుభవించిన రోజుల్లో విద్యాసాగర్ రావు లాంటి వాళ్ల ద్వారానో.. మరో మార్గంలోనో అద్వానీని కలిసి ఆ పార్టీలో చేరారు. ఆమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల గురించి లేడీ అమితాబ్‌గా ఆమె తెచ్చిపెట్టుకున్న ఇమేజిని భూతద్దంలో చూపించేసరికి అద్వానీ లాంటివారు కూడా ఆమెకున్న ప్రజాదరణ గురించి అతిగా అంచనా వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయశాంతి వల్ల తమ పార్టీకి కొద్దో గొప్పో సీట్లు రాకపోతాయా అని ఆశపడ్డారు. జాతీయ స్థాయిలో మహిళా విభాగానికి నాయకురాలిని చేశారు. బిజెపిలో చేరిన తరువాత ఆమె ఎన్ని సభల్లో పాల్గొన్నారో తెలియదు కానీ, ఆమె వల్ల ఆ పార్టీకి ఒరిగిందేమిటని ఆలోచిస్తే... నిండు సున్నాయే కనిపిస్తుంది.
తాను బిజెపి జాతీయ స్థాయి నాయకురాలినని తన ఇమేజీని పెంచుకునే ప్రయత్నం చేసుకున్నారే కానీ, రాష్ట్రంలో పార్టీని ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ తరువాత ఉన్నట్టుండి ఆమెకు తెలంగాణ గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. బిజెపిలో ఉంటూనే అకస్మాత్తుగా తెలంగాణపైనా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపైనా అవ్యాజమైన ప్రేమానురాగాలని కురిపించటం ప్రారంభించారు. అప్పటికే కెసిఆర్ టిఆర్‌ఎస్ ప్రారంభించారు. అటు బిజెపిలో ప్రాపకాన్ని, ప్రాభవాన్ని కోల్పోయిన నరేంద్ర బయటకొచ్చి సొంత కుంపటి పెట్టుకున్నట్టే పెట్టుకుని అంతలోనే టిఆర్‌ఎస్ నదిలో తన కుంపటిని నిమజ్జనం చేసారు. ఇక విజయశాంతి ఒక్కసారిగా రాములమ్మ అవతారం ఎత్తారు. అటు అన్న కెసిఆర్ అయితే, ఇటు విజయశాంతి తెలంగాణా ప్రజల పాలిటి అక్క రాములమ్మ అయిపోయారు.
ఆమె భజన బృందం ఇంకో అడుగు ముందుకేసి విజయశాంతి పేరును మరిపించి రాములమ్మ పేరునే ఖాయం చేసేశారు..గోడలపై రాతల్లో రాములమ్మ పేరే... అతికించే పోస్టర్లలో రాములమ్మ వేషమే.. ఎక్కడ చూసినా రాములమ్మే తప్ప విజయశాంతి పేరే కనపడని స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. ఆమెతో పాటు ఆమె వెంట నడిచే ఓ వందమంది వందిమాగధ బృందం అంతా కలిసి తమదంతా ఓ రాజకీయ పార్టీ అన్నారు. దానికి తల్లి తెలంగాణ అని పేరూ పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి పార్టీ పేరును రిజష్టర్ కూడా చేసేసుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ, అసలు అయోమయం తొలగనే లేదు.. సందేహం తీరనే లేదు. ఇంతకీ అక్క రాములమ్మకి తెలంగాణ ఉద్యమం చేపట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని... ఎవరికీ అర్థం కాలేదు.. చివరకు ఆమెనే అడిగారు.. ఏమిటీ సంగతని.. అప్పుడు ఆమె గుట్టు విప్పారు. తనది తెలంగాణ ప్రాంతమేనని, తాను పుట్టింది వరంగల్ జిల్లా రామన్నపేటలోనేనని... ఆశ్చర్యపోవటం అందరి వంతయింది. అప్పటి వరకు ఆమె ఆంధ్రప్రాంతానికి చెందిన తారగానే అందరికీ తెలుసు. సినీనటి విజయలలిత అక్క కూతురు అని కూడా తెలుసు. కానీ, ఆమె పూర్వీకులు రామన్నపేటకు చెందినవారన్నది ఆమె చెప్పేంత వరకూ ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని ఆక్షేపించనవసరం లేదు. ఎవరికీ అభ్యంతరమూ ఉండనవసరం లేదు.. సరే.. మొత్తం మీద తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానన్నారు. కానీ, తెలంగాణ గురించి ఆమెకున్న అవగాహన అంతంత మాత్రమేనని తొలి ప్రసంగంలోనే తేటతెల్లమైంది. ఆ తరువాత కూడా తెలంగాణ ప్రాంతం గురించి కానీ, సమస్యల గురించి కానీ ఆమె పెంచుకున్న అవగాహన పెద్దగా కనిపించదు. పడికట్టు పదాల ప్రసంగాలతోనే మొన్నటి ఎన్నికల దాకా నెట్టుకొచ్చారు. వాస్తవానికి ఎన్నికలు ముంచుకొచ్చేసరికి తానేం ఏం చేయాలో.. రాజకీయ మనుగడ ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. అదే సమయంలో అటు కెసిఆర్ తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం వెంపర్లాడుతున్న పరిస్థితిని విజయశాంతి తెలివిగా క్యాష్ చేసుకున్నారు. ఇంకేం తల్లి తెలంగాణ టిఆర్‌ఎస్‌తో మమేకమైపోయింది. పార్టీని బెదిరించి మరీ మెదక్ సీటు సాధించుకున్నారు. హరీశ్‌రావు మెజారిటీ పుణ్యమా అని స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. కానీ, తరువాత టిఆర్‌ఎస్‌లో మొదలైన సంకుల సమరం విజయశాంతికి పాలుపోని పరిస్థితి కల్పించింది. ఇంకా ఈ పార్టీలోనే ఉంటే తనకు మనుగడ కష్టమని దాదాపు నిర్థారణకు వచ్చినట్టున్నారు... దాని పర్యవసానమే... సచివాలయంలో ఓ ఫైన్ మార్నింగ్ విజయశాంతి ప్రత్యక్షం కావటం... వైఎస్‌ను కలవటం... తన నియోజక వర్గానికి మేలు చేస్తున్నందుకు రాజకీయ ధన్యవాదాలు చెప్పేయటం చకచకా జరిగిపోయాయి. తెలంగాణ రంగు చెదిరింది... రాములమ్మ ముసుగు తొలిగింది.
వై.ఎస్.సవాలు...చంద్రబాబు ప్రతిసవాలు...
శాసనసభలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుల మధ్య చోటుచేసుకున్న సవాళ్లపర్వం కొత్తదికాదు కాని, ఈసారి మరింత స్పష్టతగా సాగిందని చెప్పవచ్చు. ఇద్దరు నేతల మధ్యే ఇలాంటి పోటీ జరిగితే ఎలా ఉంటుంది? వినడానికే ఎంతో రంజుగా ఉంటే, నిజంగా జరిగితే భలేగా ఉంటుందని చెప్పవచ్చు. విశ్వసనీయత విషయంలో ముఖ్యమంత్రి సవాలు విసిరితే, విశ్వసనీయత, అవినీతి, హత్యా రాజకీయాలు, పరిపాలన అంశాలలో చంద్రబాబు ప్రతి సవాలు విసిరారు.
వీరిద్దరి సవాళ్లను ఇతర పక్షాల నేతలు జయప్రకాష్ నారాయణ, చిరంజీవి, గుండా మల్లేష్, కిషన్ రెడ్డి తదితరులు దీనిని ఆక్షేపించి, ప్రజాసమస్యల పరిష్కారానికి సవాలు విసురుకోవాలని, రాజ్యాంగంలో రిఫరెండమ్ కు అవకాశం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణ అంశం మీద ఆ రిఫరెండమ్ నడిపితే బాగుంటుందని హారీష్ రావు అన్నారు. కొత్త శాసనసభ ఏర్పడిన తర్వాత ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా తలపడడం ఇదే మొదటిసారి. పార్టీ విఫ్ శైలజానాద్ చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా వై.ఎస్.సవాలు విసిరి, రిఫరెండమ్ లో ఓడినవారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని షరతు పెట్టారు. సవాలు విసిరినప్పుడు ప్రతి సవాలు ఉండనే ఉంటుంది.
ముప్పై ఒక్క ఏళ్ల క్రితం శాసనసభలో ప్రవేశించిన ఈ ఇద్దరు నేతలు, గత పాతికేళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. గత పదిహేను సంవత్సరలుగా వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటోంది. ఇంతటి అవకాశం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరే ఇద్దరు నేతలకు రాలేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పటి మిత్రులైన వీరు వర్తమాన పదవీ రాజకీయాలలో ఘాటైన విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను వీరిద్దరీ మధ్యే తిరిగేలా చేసుకోగలుగుతున్నారు. రాజ్యంగంలో అవకాశం ఉండకపోవచ్చు. కాని శాసనసభలో ఇలాంటి సవాళ్లు ఇంతకు ముందు కూడా వచ్చాయి.
కొందరైతే రాజీనామా పత్రాలు సమర్పించి షరతులతో కూడిన సవాళ్లను విసిరిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వై.ఎస్. చంద్రబాబుల మధ్య సవాళ్లు కాబట్టి ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ధైర్యం ఉంటే మేయర్ ఎన్నిక ప్రత్యక్షంగా పెట్టమని సవాలు కొనసాగించడం ద్వారా ఇంకో అడుగు ముందుకు వేశారు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. వారు విసురుకున్న సవాళ్లలో కొన్నిటిలో వై.ఎస్.కు, మరికొన్నిటిలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రజాభిప్రాయం రావచ్చు. అప్పుడు వీరిలో ఎవరూ రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉండదు.
రాజకీయాలలో ఉన్నవారంతా చెప్పేవన్నీ నిజాలని జనం అనుకోవడం లేదు. అలాగే ఎవరి పాలనలోనైనా లోపాలు ఉంటాయి. కాకపోతే కొంచెం తరతమ బేధాలు ఉండవచ్చు. అవినీతి రహితంగా రాజకీయం సాగుతోందని ప్రజలు ఎవరూ భావించడం లేదన్న సంగతి వై.ఎస్. చంద్రబాబులకు తెలియని రహస్యం కాదు. కాకపోతే వీటన్నిటిలో ఎవరిది పైచేయి అన్నది తేల్చుకోవడమే వీరి లక్ష్యం కావచ్చు. వీరిద్దరి సొంత ఖర్చుతో ఇలాంటి రిఫరెండం పెడితే ఎవరికి అభ్యంతరం ఉండనవసరం లేదు. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎందుకన్న సామెత ఇక్కడ బాగా అతుకుతుందేమో.

ధన్యవాదాలు.
మిత్రులారా.. కరెంట్ అఫ్ఫైర్స్ తో పాటు సాహిత్యం, సంస్కృతి, భక్తి కి సంబంధించిన వ్యాసాలు వేరే రాయాలన్న కోరికతో.. మరో సైట్ ఓపెన్ చేశా.. అందులో భారతీయత ను ప్రతిబింబించే వ్యాసాలు ఉంటాయి. చుడండి.. చదవండి. ఆశీర్వదించండి.. అభిప్రాయాలూ చెప్పండి... సైట్ నేమ్ www.kovelas.com
నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు.

26, జులై 2009, ఆదివారం
నినదించాల్సిన తరుణం....ఒక్కటవ్వాల్సిన అవసరం
`జాతీయ గీతాన్ని పాడే కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.' అని రాసుకోవాల్సిన దుస్థితి బహుశా ఏ దేశానికీ, ఏ జాతికీ కలిగి ఉండదు. ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో భారత దేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో ఉవ్వెత్తున ఎగసి, ప్రజల కణం కణంలో ఉత్తేజాన్ని నింపిన ఒక మహత్తరమైన నినాదానికి పట్టిన దుర్గతి ఇది. జాతీయతా భావానికి ప్రతీకాత్మకంగా వందేళ్లకు పైగా వర్ధిల్లుతున్న వందేమాతరం గీతం కూడా ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయానికి బలికావడం కంటే దురదృష్టం ఇంకేముంటుంది?
వందేమాతర ఉద్యమానికి వందేళు్ల పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆ మహత్తరమైన నినాదాన్ని నినదించే కార్యక్రమం చాలా సార్లు అడ్డుకున్నారు. దానికి మతం రంగు పూసారు. మాస్‌క వేశారు. ఎన్నో అన్నారు. మరెన్నో చేశారు. ఎవరు ఎన్ని వివాదాలు సృష్టించినా ఇవాళ్టికీ వందేమాతరం ఆగలేదు. పాఠశాలలు, ప్రభుత్వ, సాంస్కృతిక సంస్థలన్నింటిలోనూ వందేమాతరం గేయం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ గీతం పాడుతుంటేనే ఒక ఉత్సాహం, ఉద్వేగం.. ఉద్రేకం ఉప్పొంగుతూ వస్తాయి. . కొన్ని చోట్ల తొలి రెండు చరణాలనే పాడినప్పటికీ, ఎక్కువ ప్రాంతాల్లో పూర్తి గీతాన్ని ఉద్వేగంతో పాడుకోవడం విశేషం. వివాదం ఎంతగా రగుల్కొల్పినప్పటికీ, ముస్లిం వరా్గల్లో కొన్ని దూరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటిలోనూ భేదభావాలకు అతీతంగా వందేమాతరాన్ని ఆలపిస్తుండటం ఆ గీతంలో ఇప్పటికీ ఉన్న అసాధారణమైన ప్రేరణ శక్తికి నిదర్శనం. వందేమాతరాన్ని ముస్లిం, మైనారిటీ సంస్థలు నిర్ద్వంద్వంగా తిరస్కరించేశాయి. వందేళ్ల వందేమాతరం వార్షికోత్సవం సందర్భంగా ఏకంగా తమ విద్యాసంస్థలకు, మదరసాలకు సెలవులు ప్రకటించేసుకున్నాయి.
దేశంలో వందేమాతరం పాడేందుకు తొలుత అభ్యంతరం చెప్పింది భారత దేశ ముస్లింలకు ప్రవక్తనని తనను తాను భావించుకునే జామా మసీద్ ఇమామ్ సయ్యద్ బుఖారీ అయితే, గీతాన్ని పాడటం ఐచ్ఛికం చేసి వివాదాస్పదం చేసింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు గతంలో మంత్రిగా వెలగబెట్టిన అర్జున్ సింగ్ దొరవారు. అర్జున్ సింగ్ తానే ఒక వివాదం. ఆయన మాట్లాడే ప్రతిమాటా ఇటీవలి కాలంలో వివాదం కాకుండా ఉండలేదు. ఎన్నికల్లో ఒబిసిలు, ముస్లింల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు చేస్తున్న సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్ట జాతీయ గీతాలాపనను ఐచ్ఛికం చేయడం. వందేమాతరం గేయంపై యాభై ఏళ్ల క్రితమే వివాదాలు రేగడం, సమసిపోవడం కూడా జరిగిపోయింది. ఈ గేయంలోని తొలి రెండు చరణాలను ఎలాంటి ఆక్షేపణలకు తావు లేకుండా దేశ పౌరులంతా పాడాలని ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ విషయంలో మరో ఆలోచనకు తావే లేదు. నాటి నుంచి నేటి వరకు పార్లమెంటు సహా అన్ని ప్రభుత్వ సంస్థల్లో, సమావేశాల్లో, పాఠశాలల్లో తొలి రెండు చరణాలను పాడుతూనే ఉన్నారు. భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని సంగీతకారుడు రహమాన్ వందేమాతరాన్ని విశ్వవ్యాప్తం చేశారు. విదేశీయులైన నెల్సన్ మండేలా, యాసర్ అరాఫత్ వంటివారు వందేమాతరాన్ని నినదించి స్ఫూర్తిని పొందారు. బుఖారీలకు, అర్జున్‌సింగ్‌లు తమ అవసరార్థం పనిచేసే బాపతు నేతలు... ఓటు రాజకీయాల కోసమో, మరో ప్రయోజనం కోసమో, దేశ అస్తిత్వాన్ని పణంగా పెట్టడం కాదా ఇది? దేశ ప్రధాన స్రవంతిలో ముస్లింలను భాగస్వాములను చేయకుండా... వేరు చేసే అత్యంత కుటిలమైన రాజనీతి దీని వెనుక దాగి ఉంది. ఇలాంటి కుహనా చర్యల వల్ల దేశాన్ని ఇప్పటికే టెరర్రిజం పట్టి పీడిస్తున్నది. బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పాలసీకీ, ఇప్పుడున్న పరిపాలకుల రాజనీతికి ఇక ఏం తేడా ఉన్నది?
సెక్యులరిజం రాజకీయాల పుణ్యమా అభంశుభం తెలియని అమాయక విద్యార్థులలో విషబీజాలు నాటినట్లయింది. వందేమాతరం గేయాన్ని బంకించంద్రుడు ఆయన ఢాకా నవాబుకు వ్యతిరేకంగా రాశాడని, దాన్ని హిందూ సన్యాసులు పాడారు కాబట్టి అది ఇస్లాముకు వ్యతిరేకమని వాదించడం అర్థం లేనిది. చివరి మూడు చరణాల్లో ఉన్న విగ్రహారాధన కొందరికి అభ్యంతరం కాబట్టే, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ కూడా తొలి రెండు చరణాలనే పాడుతున్నారు. ఈతరం వారిలో చాలా మందికి వందేమాతరంలో మరో మూడు చరణాలు ఉన్నాయన్న సంగతే తెలియదు. ఈ గీతాన్ని రచించడంలో రచయిత ఉద్దేశం ఏమైనప్పటికీ, అది భారత జాతిలో రేకెత్తించిన జాతీయ భావన అసాధారణమైనది. కేవలం రెండు పదాల నినాదం బ్రిటిష్‌వారి గుండెల్లో రైళు్ల పరిగెత్తించింది. వందేమాతరం అనడమే రాజద్రోహంగా పరిగణించిన రోజులవి. ఈ ఒక్క నినాదంపై జాతి యావత్తూ ఏకత్రితం అయిందంటే ఒక జాతీయ గీతానికి ఇంతకంటే కావలసిన అర్హత ఏమిటి? అర్థం లేని అభూత కల్పనలతో లేని వివాదాన్ని సృష్టించడం దేశ సమైక్యతకు తీరని విఘాతాన్ని కల్గిస్తుందన్న కఠిన సత్యాన్ని వివాద సృష్టికర్తలు గ్రహించకపోవడం దురదృష్టం. విభజించి పాలించు సూత్రంపై బ్రిటిష్‌వారు బెంగాల్ విభజనకు పూనుకోవడం వల్లనే నూరేళ్ల క్రితం వందేమాతరం ఉద్యమం వచ్చిందన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి. ఈ దేశం అంతా మనదేననే బలమైన భావనను కులమతరాజకీయాలకు అతీతంగా ప్రజలందరిలో బలంగా పెంపొందించగలిగితే దేశం అభివృద్ధి కోసం పరిపాలకులు ఎలాంటి పథకాలు వేయనక్కరలేదు. పార్లమెంటులో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నా, దేశం పురోగతి వేగాన్ని అడ్డుకోలేరు. మతప్రాంతాలకు అతీతంగా దేశాన్ని ఒక్కటయిన తరువాత సమస్యలు దూదిపింజల్లా సమసిపోతాయి.

24, జులై 2009, శుక్రవారం
కసబ్‌ను ఉరితీయాలట... ఇదో డ్రామా... కాదు.. కాదు.. సినిమా!
నన్ను ఉరితీయండి.. అజ్మల్ అమీర్ కసబ్ న్యాయమూర్తిని వేడుకున్నాడట..ముంబయి దాడుల వ్యవహారంలో తన పాత్ర పరిమితమంటూ తెలివిగా కోర్టులో చెప్పుకొచ్చాడు. తాను ఎవరిపైనా కాల్పులు జరపలేదని, తన సహచరుడు అబు ఇస్మాయిల్‌కు సహాయం చేయటంతోనే తన బాధ్యత తీరిపోయిందని కసబ్ చెప్పాడు. కరాచీ నుంచి ముంబయికి చేరుకుని, అక్కడ దాడులు నిర్వహించిన అన్ని సందర్భాల్లోనూ తన పాత్ర కేవలం కాపలాకే పరిమితమని కథ చెప్పేశాడు.
ఎంవి కుబేర్ పడవలో నావికుడు అమర్ సింహ్ సోలంకీని హత్య చేసినప్పుడు కానీ, ఆ తరువాత కామా ఆసుపత్రి వద్ద పోలీసులను చంపటంలో కానీ తాను అసలు తుపాకీ వాడనే లేదన్నట్లుగా స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.. డిఫెన్‌స లాయర్ వాదనను సైతం తోసిరాజని మరీ నేరాంగీకార ప్రకటన చేసేశాడు. మన దేశంలో నేరాలకు శిక్ష పడటం, ఒకవేళ శిక్ష పడినా అది అమలు కావటం అన్నది మామూలుగానే అరుదుగా జరుగుతుంది. ఇక తాను నేరం చేశానంటూనే.. అది చాలా చిన్నదని చూపించే ప్రయత్నం చేయటంతో ఇక ఏ కోర్టయినా ఇంకేం శిక్ష విధిస్తుంది? దాడుల్లో అతని పాత్ర తక్కువ అని భావిస్తే ప్రపంచంలో ఏ కోర్టు కూడా కసబ్‌కు ఉరిశిక్ష విధించే అవకాశం ఉండదు. పైగా భారత న్యాయస్థానాల్లో అలాంటిది సాధ్యం కాదు. ఇవన్నీ తెలుసుకున్నాడు కనుకే కసబ్ తెలివిగా పావులు కదిపాడు. ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఇతని నేరాంగీకార ప్రకటనను ఆంగీకరించేలా చేశాడు. తనను, పాకిస్తాన్‌లోని తన వారిని రక్షించేందుకు అద్భుతమైన నాటకం ఆడాడు. తనకు సహకరించటం లేదంటూ కసబ్ డిఫెన్‌స లాయరేమో.. కేసునుంచి విత్‌డ్రా చేసుకుంటానని అంటున్నాడు. కసబ్ నేరాంగీకార ప్రకటనను కోర్టు ఆమోదించినట్లయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నికమ్ సందేహం వ్యక్తం చేసినట్లు రైల్వే స్టేషన్‌లో కాల్పులు జరపటం, స్కోడా కారును ఎత్తుకెళ్లటం వంటి వాటికే శిక్ష పడుతుంది. వాస్తవానికి కసబ్ కోర్టులో పేర్కొన్న అంశాలు చాలా తక్కువ. అన్ని విషయాలను కసబ్ చెప్పనే లేదు. అవన్నీ వెలుగులోకి రావలసి ఉంది. అంతకు మించి ఇతర సాక్ష్యాలను దర్యాప్తు బృందం కసబ్‌కు వ్యతిరేకంగా సేకరించినవి ఉన్నాయి. వాటినీ కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఓ పక్క విచారణ కొనసాగుతూనే ఉన్నప్పటికీ, ఈ వాఙ్మూలం ఆధారం చేసుకుని సర్కారు పాకిస్తాన్‌పై ఏ విధంగా ఒత్తిడి పెంచేదీ చూడాలి. లఖ్వీని ఎలా విడుదల చేశారో పాక్ సర్కారును నిలదీసే ధైర్యం ప్రభుత్వానికి వస్తుందనైతే ఊహించలేం. కనీసం కసబ్ లాంటి ముష్కరుల పీచమణచే విషయంలోనైనా కఠినంగా వ్యవహరిస్తుందా అంటే అదీ అనుమానమే. ఎందుకంటే పార్లమెంటుపై దాడికి కుట్రపన్నిన అఫ్జల్ గురుకు ఉరి తీయటానికి మత పరమైన ఓట్లు గుర్తొచ్చి అతిథి మర్యాదలు చేస్తున్న ప్రభుత్వానికి అజ్మల్ అమీర్ కసబ్‌పై కరుణ కలుగకుండా ఉండదని ఎలా అనుకోగలం?

వింత వార్త
మతం అన్నది మా కంటికి మచ్చయితే.. మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు అన్నాడట ఓ కవి. కానీ, ఈ మాటలు, పాటలు పాడుకోవటానికి బాగానే ఉంటాయి. ఆచరణలోకి వస్తేనే వింతగా ఉంటుంది. దేశంలో నిజంగా మతం అన్నది ఓ వింత పదార్థం. అందుకే ఇదో వింత వార్త... మతపరమైన యాత్రలకు ప్రభుత్వం నిధులు సమకూర్చటంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అరవై ఏళు్లగా లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చింది?
1956లోనే తొట్టతొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ గారికి గొప్ప ఆలోచన వచ్చింది. మక్కాకు వెళ్లాలనుకునే పేద ముస్లింలకు ఆర్థిక సాయం చేయాలని. ఆలోచన కలిగిందే తడవుగా ఆయన పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేశారు.. ఆమోదింప చేసుకున్నారు. అప్పటి నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం భక్తులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఒక్కో వ్యక్తికి పాస్‌పోర్‌ట, వీసాలు ఇవ్వటంతోపాటు, 12వేల రూపాయల నగదును అందజేస్తారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యం, మందులు, ఆహారం, బిర్యానీ పొట్లాలు వంటివి అందజేస్తాయి. ఇది నిరాటంకంగా సాగుతూనే ఉంది. అయితే... ఈ దేశంలో మంచుకొండల్లో మహాశివుని చూసేందుకు అమర్‌నాథ్‌కు వెళ్లటానికి, టిబెట్‌లో కైలాస మానస సరోవరయాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఆర్థిక సాయం అందివ్వాలన్న డిమాండ్‌ను ఆ తరువాత ఏ ప్రభుత్వమూ మన్నించలేదు. ఇన్నాళ్ల తరువాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రీస్తు ప్రభువు పుట్టిన పవిత్ర జెరూసలేంకు వెళ్లాలనుకునే పేద క్రైస్తవులకు ఆర్థిక సాయం అందివ్వాలని నిర్ణయించారు. 2008 జూలై 21న 29వ నెంబర్ జీవో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కూడా అయింది. నిరుటి బడ్జెట్‌లో సుమారు రెండు కోట్ల రూపాయలనూ కేటాయించేశారు. తరువాత ఎవరో చెప్తే... హిందూ ఆలయాలకూ ఇద్దామని ఆలోచన చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఈ దేశం లౌకిక రాజ్యమని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాం. (ఖిౌఠ్ఛిట్ఛజీ ఖిౌఛిజ్చీజూజీట్ట ఖ్ఛిఛిఠజ్చూట, ఈ్ఛఝౌఛిట్చ్టజీఛి, ్ఛఞఠఛజూజీఛి). అంటే భారత దేశం ఏ మతానికి సంబంధించిన దేశం కాదు. ఇక్కడి ప్రభుత్వానికి మతంతో ప్రమేయం లేదు. దేశంలోని ప్రజలందరి దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బులను మతపరమైన కార్యక్రమాలకు, విరాళాలకోసం వినియోగించరాదని 27వ అధికరణం స్పష్టంగానే చెప్తోంది. అయినా ప్రభుత్వాలు ఈ అధికరణాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ విధంగా మత కార్యకలాపాలకు వాడుకోవటం రాజ్యాంగంలోని 245, 246, 266 అధికరణాలకు విరుద్ధం కూడా. అయినా స్రభుత్వాలకు ఇవేవీ పట్టవు. ప్రజలకు సహాయం చేయటం, చేయూతనివ్వటం ప్రభుత్వాల బాధ్యత ఇందులో ఎవరికీ ఆక్షేపణలు ఉండక్కర్లేదు. దీనికి మతంతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మతంతో ప్రమేయం లేని ప్రభుత్వాలు మతపరమైన యాత్రలకు నిధులు ఇవ్వవచ్చునా లేదా అన్నది తొలి ప్రశ్న. దీనికి ప్రభుత్వాల దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఉన్నా చెప్పే సాహసం ఎవరూ చేయరు. పేద ప్రజలకు సహాయం చేయటంలో తప్పేమిటని వాదన చేయవచ్చు. దీనికి అంగీకరించాల్సిందే. మరి పాకిస్తాన్‌లోని నాన్‌కానా గురుద్వారాకు ఏటా వేలాది సిక్కులు వెళ్లి పవిత్ర ప్రార్థనలు చేస్తుంటారు. భూటాన్‌లోని బౌద్ధారామాలకు వెళ్లే బౌద్ధులు అనేకమంది ఉన్నారు. ఇక కైలాస మానస సరోవరానికి, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులు వేలల్లో ఉన్నారు. ఇలా వెళ్లే వాళ్లంతా సంపన్నులేం కాదు.. అంతా వారి వారి మతాలకు సంబంధించిన భక్తులే... వాళ్లలోనూ పేదలున్నారు. జీవితంలో ఒక్కసారి భగవంతుని దర్శనం చేసుకోవాలన్న తపన ఉన్నవారు వారు. కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క మతానికి సంబంధించిన వారికి మాత్రమే ఎందుకు సొము్మలు చెల్లించాలి. ఇందుకోసం ఏటా ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మొదలెట్టింది. హైకోర్టు ఆపిందనుకోండి అది వేరే సంగతి. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు మిగతా మతాలకూ అదే రీతిలో సాయం చేయాలి.. ఆర్థిక సాయం ఇవ్వాలి. అలా ఇవ్వనప్పుడు లౌకికత్వానికి విలువేముంది? అమర్‌నాథ్ యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించటం కోసం కొంత అటవీ భూమిని అమర్‌నాథ్ యాత్రాట్రస్‌టకు కేటాయించినందుకు కాశ్మీర్‌లో ముస్లిం అతివాద వర్గాలు ప్రళయాన్ని సృష్టించాయి. ఒక విధాన నిర్ణయం తీసుకుంటే దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేలా ఉండాలి కానీ, అది ఒక వర్గానికో, ఒక కూటమికో మాత్రమే మేలు చేసేలా ఉండవద్దు. గమ్మత్తేమిటంటే, మతపరమైన యాత్రలకు ఆర్థిక సాయం చేయాలన్న పద్ధతి ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనూ లేదు. చివరకు కరడు గట్టిన చాందసవాదులు ఏలుతున్న దేశాల్లోనూ ఈ పద్ధతి లేదు.. పైగా ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలు మక్కాకు వచ్చే భక్తులు వారి సొంత నిధులతోనే రావాలి తప్ప, ఎవరి దగ్గరో విరాళంగానో, సాయంగానో తీసుకున్న డబ్బులతో వస్తే ఫలితం రాదని స్పష్టంగా చెప్తున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఒక్క భారత దేశం తప్ప. ఒకరికి సాయం చేయటం తప్పు కాదు. అదే సమయంలో అదే విధంగా ఆర్తులందరికీ సాయం అందివ్వటం బాధ్యత. ఒకరికి కంచం నిండా అన్నం పెట్టి, పక్కనే ఉన్న వాడికి ఖాళీ కంచం చూపించినట్లే మన సర్కారు ప్రభువుల తీరు ఉంది. ఇది ప్రజల మధ్య సామరస్యం కంటే, విభేదాలను మరింతగా పెంచుతుంది. ప్రజల్లో వర్గాలు ఏర్పడితే, విభేదాలు పెచ్చరిల్లితే దేశ సార్వభౌమత్వానికి ఎంత ముప్పో మన వారికి తెలియంది కాదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు జాతి భవితవ్యాన్ని తాకట్టు పెట్టడం క్షంతవ్యం కాదు.

23, జులై 2009, గురువారం
ఈ మోకరిల్లడం ఇంకెన్నాళ్ళు?
తెల్లవాడు మనల్ని వదిలి వెళ్లినా స్వతంత్రంగా బతికే అలవాటు మాత్రం మనకు అరవై ఏళ్లయినా రాలేదు. ఎప్పుడో వాడున్నప్పుడు వాడు చేసిన చట్టాలను కొత్త పుస్తకంలో తిరగరాసుకుని అమలు చేసుకోవటమే తప్ప, మన కోసం మన వాళు్ల బుర్ర పెట్టి ఆలోచించింది లేదు. 1935 నాటి పోలీసు చట్టాన్ని మనం కళు్ల మూసుకుని అమలు చేసుకుంటున్నాం. పోలీసు సంస్కరణలు అంటే అబ్బో.. అని మన వాళు్ల ఆమడ దూరం పారిపోతారు. అప్పుడు యూరోప్ వాడు మన నెత్తిన కూచుంటే, ఇప్పుడు అమెరికా వోడు మన పాలిటి శాపంగా మారాడు. మొన్నటికి మొన్న అణు ఒప్పందం పేరుతో మన అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు సింగ్‌జీ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో వినియోగదారుల నియంత్రణ ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ కొనుగోలు చేసిన రక్షణ పరికరాలను తనిఖీ చేసే అధికారం అమెరికాకు కట్టబెట్టేశారు.. ఇదేమని అడిగితే అబ్బే అదేం లేదు.. మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టనే లేదని విదేశాంగ మంత్రి భుజాలు తడుముకున్నారు.
నిజానికి వైట్ హౌస్‌లో చిన్న శబ్దమైతే చాలు.. న్యూఢిల్లీలోని 7 రేస్ కోర్‌స రోడ్డు ఉలిక్కిపడుతుంది. మన పాలకులపై అమెరికా లాబీ ఎంత బలంగా పనిచేస్తుందో చెప్పేందుకు మాటలు చాలవు. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. బిజెపి, కాంగ్రెస్, లెఫ్‌టలన్న తేడా లేదు. ప్రాంతీయ పార్టీలకైతే అమెరికా పాలకులు ధర్మప్రభువుల్లాంటి వాళు్ల. అన్ని రాజకీయ పార్టీలూ ఒకే తాను ముక్కలు. అధికారంలో లేకపోతే అమెరికాపై నిందలు.. ఉన్నప్పుడు ప్రపంచ పోలీసుకు జీహుజూర్ అనటం... దేశం గురించి, దేశ భద్రత గురించి పోచికోలు కబుర్లు చెప్పమంటే ఎనై్ననా చెప్తారు. గంటల తరబడి మైకులు వదలరు. చేతల్లోకొచ్చేసరికే జావగారిపోతారు. 1991లో ఆర్థిక సంస్కరణల సమయంలో ప్రారంభమైన ఈ ధోరణి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏ హయాంలో ఎక్కువైంది. అమెరికాతో మిత్రత్వానికి తెగ తాపత్రయ పడ్డారు. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్‌క ట్విన్ టవర్‌సపై అల్‌ఖైదా దాడి తరువాత ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా నిర్వహించిన యుద్ధానికి కోరకుండానే సాయపడేందుకు అటల్‌బిహారీ వాజపేయి సర్కారు సిద్ధపడింది. బుష్ దొరకు పాకిస్తాన్ అంటే తెగ ముద్దొచ్చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో తమ మిత్రపక్షాల్లో మొదటిస్థానం పాకిస్తాన్ అంటూ మహా ఆనందంగా చెప్పుకొచ్చారు. అదే బుష్ మన్మోహన్‌జీకి రెడ్‌కార్పెట్ పరచి మరీ వైట్‌హౌస్‌లో విందిచ్చారు. భారత్‌ను అణు శక్తి దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించేశారు. బుష్ తనను ఉచ్చులో బిగిస్తున్నట్లు మన్మోహన్ ఆరోజు ఊహించలేదు. ఇప్పటికీ అర్థం కావటం లేదు. దీనికి తోడు అమెరికా స్వచ్ఛమైన ఉద్దేశంతోనే మనకు సాయం చేయటం కోసమే అంతా చేస్తోందని భారత్‌లోని అమెరికా వందిమాగధ బృందం తెగ ప్రచారం చేసేసింది. ఇంకేముందు అమెరికాతో అణు ఒప్పందం కుదిరిపోయింది. పౌర ప్రయోజన అణు కార్యక్రమానికి ఇంధన సరఫరాకు సంతకాలు జరిగిపోయాయి. దాంతో పాటే మన అణు రియాక్టర్లను తనిఖీ చేసే అధికారమూ కట్టబెట్టారు. ఇదేమని అడిగితే.. అబ్బే ఆందోళన చెందాల్సింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అమెరికాతో ఏ రక్షణ పరికరాన్ని కొన్నా, దాని వినియోగం ఎలా చేస్తున్నారన్నది తనిఖీ చేసే అధికారాన్ని అంకుల్‌శామ్‌కు అప్పజెప్పేశారు. ఒక వస్తువును మనం కొన్నప్పుడు ఆ వ్యాపారి వచ్చి దాన్ని ఎలా వాడుతున్నారో చూస్తానంటే ఎలా ఉంటుంది? అమెరికా వాడు మనకు ఆయుధాలు ఉచితంగా ఏం కట్టబెట్టట్లేదు. మనం కోట్ల రూపాయల డబ్బులు కుమ్మరించి కొనుక్కుంటున్నాం. అలాంటప్పుడు వాళు్ల మనల్ని తనిఖీ చేయటం ఏమిటి? వాళ్ల దగ్గర కొన్న ఆయుధాలనే తనిఖీ చేస్తారా? మిగతా దేశాల దగ్గర నుంచి తెచ్చుకున్నవీ తనిఖీ చేస్తారా? యుపిఎ ప్రభుత్వం అందుకు ఎలా ఒప్పుకుంది. ఇప్పటికే మన మీద అమెరికా పెత్తనం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ఇది ఇంకా పెరిగితే, మనపై ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ శత్రుమూకలు కము్మకుని పద్మవూ్యహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఈ పరిస్థితిలో అమెరికా చెప్పిన దానికల్లా తలాడిస్తూ పోవటం, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలను ప్రపంచ పోలీసు చేతిలో పెట్టడం ఎంతవరకు సమంజసం? నిజంగా మన పరిపాలకుల బురల్రో ఉన్నదేమిటి? అమెరికా అగ్రరాజ్యం కాబటిట ఆ దేశంతో మంచి సంబంధాలు పెంచుకోవటం తప్పుకాదు.. అవసరం కూడా. అంతమాత్రం చేత దానికి దాసోహం అనే పరిస్థితి ఉంటే అది జాతి అస్తిత్వాన్ని పణంగా పెట్టినట్లే.... సింగ్‌జీ ఈ విషయాన్ని గుర్తించకపోతే.. అమెరికా మన దేశాన్ని తన సైనిక స్థావరంగా మలచుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

20, జులై 2009, సోమవారం
ఇప్పుడేం చేస్తారు?
పాకిస్తాన్ ఇప్పుడేమంటుంది? మన పాలకులకు ఇకనైనా పౌరుషం వస్తుందా? ముంబయిపై యుద్ధానికి తెగబడింది పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులేనని ముష్కరుడు అజ్మల్ ఆమీర్ కసబ్ పూర్తిగా అంగీకరించాడు. లష్కర్ ఏ తొయెబా కమాండర్ జకీర్ ఉర్ రహమాన్ లఖ్వీ మాస్టర్ మైండ్ అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టాడు... మన్మోహన్‌జీ ఇప్పుడేం చేస్తారు? కైరో ప్రకటన ప్రకారం పాక్‌తో ఉగ్రవాదం ఊసులేని చర్చలా? ముష్కరులపై చర్యలా?
పాకిస్తాన్ ఏమిటో మళ్లీ రుజువైంది. పాక్ సైనిక వ్యవస్థ భారత దేశాన్ని బద్ధ శత్రువుగా పరిగణిస్తున్న వైనం మరోసారి నిజమైంది. ముంబయి పై యుద్ధానికి తెగబడ్డ ఉగ్రవాది అజ్మల్ ఆమీర్ కసబ్ నిప్పులాంటి నిజాలను ఊహించని విధంగా బయటకు కక్కేశాడు. తనతో పాటు టెరర్రిస్టుల బృందం కరాచీ నుంచి సముద్ర మార్గం గుండా ఎలా ముంబయికి చేరుకున్నదీ... అక్కడి నుంచి ముంబయిలోని మూడు ప్రాంతాలపై ఎలా దాడులకు పాల్పడిందీ పూసగుచ్చినట్లు వివరించాడు. ముంబయి దాడుల్లో పోలీసులకు చిక్కిన ఏకైక టెరర్రిస్టు కసబ్. సముద్ర మార్గం మీదుగా తమను కరాచీ నుంచి తరలించింది లష్కర్ ఎ తొయెబా కమాండర్ ఇన్ ఛీఫ్ జకీ ఉర్ రహమాన్, అబు హమ్‌జా అని గుట్టు రట్టు చేశాడు. కసబ్ కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌తో డిఫెన్‌స లాయర్ కళు్ల బైర్లు కమ్మాయంటేనే అర్థం చేసుకోవచ్చు, కసబ్ ఎలాంటి షాక్ ఇచ్చాడో. పాకిస్తాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన కసబ్ 150 మందిని ప్రాణాలు బలిగొన్న ముంబై దాడుల ఘటనలో కసబ్ కీలక నిందితుడు. పాకిస్తాన్ నౌకాదళం ఇతనికి పూర్తిస్థాయి సైనిక శిక్షణ ఇచ్చింది. సముద్ర గర్భంలో ఎక్కువకాలం ఉండి పోరాడే శిక్షణ కూడా కసబ్ పొందాడు. వీళ్లందిరనీ లష్కర్ చీఫ్ లఖ్వీ తన కనుసన్నల్లో ముందుకు నడిపించాడు. ఈ విషయాన్ని భారత దర్యాప్తు బృందం దాడులు జరిగిన రోజుల వ్యవధిలోనే వెల్లడించింది.. పాక్ సర్కారుకు ఆధారాలతో సహా రుజువులు చూపించింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురండంటూ అమెరికా బాసులకు భారత సర్కారు వినతులు చేసుకుంది. బాబ్బాబూ.. కాస్త మా వైపు చూడకుండా హెచ్చరించండంటూ వైట్‌హౌస్‌లో అప్పటి దొర బుష్‌ను వేడుకుంది. బుషూ్ష కాసేపు బుసకొట్టాడు. ఆయన వందిమాగధ బృందమూ తందానా పాడింది. తరువాత వచ్చిన ఒబామా గద్దెనెక్కక ముందునుంచే నిప్పులు కక్కాడు. మనం ఇస్తున్న సాయాన్నంతా పాకిస్తాన్ భారత్‌పై అణు దాడికి సన్నద్ధం కావటానికే వాడుకుంటోందని తెగ ఆవేదన చెందాడు. తీరా పీఠం పై కూర్చున్నాక ఆ సంగతే మర్చిపోయాడు. ఎప్పటిలాగే నిధుల మంజూరీని ఉదారంగా ఇచ్చేస్తున్నారు. పాక్‌కు ఈ సంగతులన్నీ తెలుసు కాబట్టే.. కసబ్ అనేవాడు తమ దేశానికి చెందిన వాడు కానే కాదంది. ప్రపంచం మెహర్బానీ కోసం లఖ్వీని అరెస్టు చేసినట్లే చేసి విడుదల చేసేసింది. అసలు భారత్ ఇచ్చినవి సాక్ష్యాలే కాదు పొమ్మంది. తరువాత కసబ్ తమవాడేనని చిన్నగా ఒప్పుకుంది. కానీ, 26/11 దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదన్న పాత పల్లవిని మాత్రం వదల్లేదు. పైగా బలూచిస్తాన్‌లో భారత్ తాలిబన్లతో కుమ్మకై్క తమపై దాడులకు దిగుతోందని ఆరోపించింది. మన ప్రధానమంత్రి మహా ఉదారులు కదా.... మొన్న కైరోలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈ మాట అన్నదే తడవుగా దానిపై చర్చకు సిద్ధమని అజెండాలో చేర్చేశారు. బలూచిస్తాన్‌లో దాడులపై చర్చకు భారత్ ఒప్పుకుంది కానీ, భారత్‌పై ఉగ్రవాదాన్ని ప్రేరేపింస్తున్నారన్న ఆరోపణలపై మాత్రం చర్చించరట. ఉగ్రవాదుల ఊసు లేకుండానే చర్చలు జరిపేందుకు సింగ్‌జీ క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నారు. ఇదేమిటని విపక్షాలు ప్రశ్నేస్తే.. అదంతే లెమ్మని కొట్టిపారేశారు. ఇవాళ కసబ్ పాక్ ముసుగును పూర్తిగా తొలగించాడు. మరి సింగ్‌జీ ఇప్పుడేం చేస్తారు? ఇంకా శాంతి పన్నాలు పలుకుతూనే ఉంటారా? అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇప్పుడిక్కడే ఉన్నారు కదా? ఈ స్టేట్‌మెంట్‌పై ఆమె కామెంట్ ఏమిటని ప్రశ్నించవచ్చు కదా? మన ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా? ఇప్పటికైనా పాకిస్తాన్‌ను నిలదీసే ధైర్యం మన్మోహన్‌కు ఉందా? అంటే అనుమానమే. పాకిస్తాన్ వద్ద అణ్వస్త్రం ఉందన్న కారణం చేతనో, మరో రాజకీయ సమీకరణాల వల్లనో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను విచ్ఛిన్నం చేయటంలో ముందడుగు వేయలేకపోతున్నాయి.

16, జులై 2009, గురువారం
మొత్తానికి అరెస్టయిన చిరంజీవి.....
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తొలిసారి పోలీసు స్టేషన్ గడప తొక్కారు. రాజకీయ నాయకుడుగా పార్టీ పెట్టిన ఏడాది తరువాత ఆయన రికార్డుల్లో తొలి అరెస్టు నమోదయింది. ఆయన పార్టీ ప్రజారాజ్యం ప్రజల సమస్యలపై మొట్టమొదటి ప్రత్యక్ష ఆందోళన రాష్ట్ర వ్యాప్తం నిర్వహించింది. దేశ రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన ఏడాది తరువాత కానీ ప్రత్యక్ష ఆందోళనలకు దిగకపోవటం నిజంగా ఒక చరిత్రే...
మెగాస్టార్ కటిక నేలపై కూర్చున్నాడు.. ప్లకార్డులు పట్టుకున్నాడు.. కూరగాయల దండను మెళ్లో వేసుకుని, కందిపప్పు చేతపట్టుకుని నినాదాలు చేశాడు..
ఇదంతా ఏ సినిమాలో సన్నివేశం కాదు.. అయినా సినిమాలు మానేశానన్న చిరంజీవి మళ్లీ సినిమాల్లో నటించటానికి వేసిన కొత్త వేశం అంతకంటే కాదు... చిరంజీవి లాంటి గొప్ప నటుడు, నాయకుడు ఇలా రోడ్డున పడి ఆందోళన చేస్తాడని సగటు అభిమాని కల్లో కూడా ఊహించి ఉండడు. బెంజికారు తప్ప మరొకటి ఎరుగని మెగాస్టార్‌ను సాధారణ ఆందోళన కారులను తీసుకుపోయినట్లు పాత డిసిఎం వ్యాన్‌లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు...అక్కడ చెక్క కుర్చీలో కూర్చోపెట్టారు.. కాసేపుంచి వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
సికిందరాబాద్ ఛీఫ్ రేషనింగ్ కార్యాలయం ముందు ప్రజారాజ్యం పార్టీ నిర్వహించిన ధర్నాలో కళ్లముందు జరిగిన వాస్తవం ఇది. రాజకీయాలు అంటే తెల్లని దుస్తులు ధరించి చైతన్య రథాల్లో ఊరేగుతూ, ప్రజలకు చేతులూపుతూ.. ఉపన్యాసాలు దంచుతూ తిరగటం కాదని చిరంజీవికి పార్టీ పెట్టిన ఏడాది తరువాత కానీ తెలిసి వచ్చినట్లు లేదు. పాజిటివ్ పాలిటిక్‌స అంటూ, సామాజిక న్యాయం అంటూ రకరకాల నినాదాలతో తెరమీదకు వచ్చిన చిరంజీవికి ఎన్నికల్లో పోటీ చేయటం తప్ప, కొన్ని ప్రాంతాల్లో పీడితులను పరామర్శించటం తప్ప, సమస్యలను తనవిగా చేసుకుని వారి పక్షాన వీధుల్లోకి వచ్చి పోరాడిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు.
వాస్తవానికి రాజకీయ పార్టీలకు, ప్రజల సమస్యలపై పోరాటాలకు మధ్య బంధం పెనవేసుకుని ఉంటుంది. ఒక పోరాటాన్ని ఆసరా చేసుకునో.. సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునో ఒక పార్టీ పుట్టడం ఇప్పటివరకు దేశ రాజకీయాల్లో జరుగుతున్న తీరు. కానీ, ప్రజారాజ్యం పుట్టుక విచిత్రం... మనుగడ మరో చిత్రం. వచ్చేవాళు్ల.. పోయేవాళ్ల జాతరలతోనే కాలం గడిచిపోతోంది తప్ప.. ప్రజారాజ్యానికి ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపై ఆలోచించే సమయమే చిక్కటం లేదు. పార్టీ ఉనికిని కాపాడుకోవటమే కష్టమైన పరిస్థితి ప్రస్తుతం పిఆర్‌పిది. కనీసం ఇంతకాలానికైనా ఏదో ఒక ప్రజా సమస్యపై పోరాడాలన్న ఆలోచన మెగాస్టార్‌కు వచ్చినందుకు సంతోషించాలి. చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తే పార్టీ ఉనికిని ప్రజలే కాపాడతారు.. చిరంజీవి ఈ సూత్రం ఒక్కటి తెలుసుకుంటే రాజకీయాల్లో మెగానేత కావటానికి ఎంతో సమయం పట్టదు...

12, జులై 2009, ఆదివారం
కొత్త గుర్తింపు
రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టు, సోషల్ సెక్యూరిటీ కార్డు.... మన రాష్ట్రంలో అయితే ఆరోగ్యశ్రీకార్డు కూడా ఉంది.. వీటన్నింటి బదులు ఇప్పుడు ఇంకో కార్డు వస్తోంది. దేశంలోని ప్రజలందరికీ ఓ ప్రత్యేక గుర్తింపు కార్డు రాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఏ ప్రయోజనమైనా పొందడానికి, దేశ పౌరుడిగా పూర్తి సంరక్షణ లభించటానికి ఉపకరించేలా ఓ కార్డును కేంద్ర ప్రభుత్వం 113 కోట్ల మంది భారతీయ ప్రజలకు అందించబోతోంది. అదే బయోమెట్రిక్ కార్డు...
బయో మెట్రిక్ గుర్తింపు కార్డు... ఇది దేశ ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందించే కార్డు. దేశంలోని ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కల్పిస్తూ కార్డును ఇవ్వటానికి ఓ భారీ కార్యక్రమాన్నే కేంద్ర సర్కారు చేపట్టింది. ప్రజలకు బహుళ ప్రయోజనాలను కల్పించే లక్ష్యంతో అత్యంత పకడ్బందీగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డు రూపొందుతోంది.
దేశంలో జరుగుతున్న అనేక అవకతవకలకు, అక్రమాలకు.. భయపెడ్తున్న ఆందోళనకు, అభద్రతకు అన్నింటికీ పరిష్కారంగా బయో మెట్రిక్ కార్డు రూపొందుతోంది. పది వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్డులను రూపొందిస్తున్నారు. ప్రతి పౌరుడికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డును ఇస్తారు. ఇది మిగతా కార్డుల మాదిరిగా కాకుండా సదరు పౌరుడికి మాత్రమే పరిమితమైన, ప్రత్యేకమైనదిగా తయారవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పౌరుల గుర్తింపు వ్యవస్థ ఇది. క్రెడిట్ కార్డు మాదిరిగానే ఓ స్మార్‌ట కార్డు బయోమెట్రిక్ పరిజ్ఞానంతో రూపొందుతుంది. ఇందులో వ్యక్తులకు సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. బయోమెట్రిక్ ఇమేజి అంటే మన వేలి ముద్రను అందులో రికార్డు చేసి ఉంచుతారు. దీంతో పాటు మన ఫోటో కూడా అందులో ఉంటుంది. ఐడి సిస్టమ్‌లో మనం ఎన్‌రోల్ అయినప్పుడే మన ఫోటోను కూడా హైక్వాలిటీలో రికార్డు చేస్తారు. పైగా ఇది చాలా చౌకగా కూడా తయారవుతుంది. బయో మెట్రిక్ టెక్నాలజీ ద్వారా రూపొందిన ఈ కార్డు వల్ల అందులోని సమాచారం చాలా భద్రంగా ఉంటుంది. వ్యక్తులు తమ సమాచారాన్ని అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. కార్డులో వేలిముద్రలు కూడా ఉండటం వల్ల సెక్యూరిటీ పెరుగుతుంది. అంతర్గత భద్రతపై విశ్వాసం పెరుగుతుంది. ఈ కార్డు ఇవ్వటం వల్ల ప్రత్యేకంగా పాన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఓటరు కార్డులు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అన్నింటీకీ కేంద్రీకృతమైన డేటాబేస్‌తో ఒకే కార్డుతో బహుళ ప్రయోజనాలను పౌరులకు కల్పించవచ్చు.
బయో మెట్రిక్ కార్డును పౌరులకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ శాఖల సమన్వయంతో దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇన్ఫోసిస్ మాజీ సిఇఓ నందన్ నీలేకనిని కేబినెట్ మంత్రి హోదాతో నియమించి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను బయోమెట్రిక్ కార్డు రూపకల్పన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్ మాజీ సిఇఓ నందన్ నీలేకని దీనికి అధిపతి. భారత్ భవిష్యత్తుపై సంపూర్ణ అవగాహన ఉన్న నీలేకని వంటి వ్యక్తికి ఈ ప్రాజెక్టును అప్పజెప్పటం అభినందనీయం.ఈ అథారిటీ ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మొన్న ప్రవేశపెట్టిన వంద కోట్ల రూపాయలు కేటాయించారు.
నీలేకని పని మొదలు పెట్టారు కానీ, దీన్ని సాధించటం అంత తేలికేమీ కాదు. మనది ఏ అమెరికా, బ్రిటన్ వంటి చిన్న చిన్న దేశమేం కాదు.. ఒక్కో రాష్ర్టం ఒక్కో బ్రిటన్ అంతగా ఉన్నంత పెద్ద దేశం. దాదాపు 113 కోట్ల మంది ప్రజానీకానికి ఈ కార్డులు అందించాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధించకుండా, సహకారం తీసుకోకుండా ఇంత భారీ యత్నం సాధ్యం కానే కాదు. ఇదే నీలేకని ముందున్న పెద్ద సవాలు. 113 కోట్ల కార్డులను తయారు చేయటం ఒక ఎతె్తైతే, అవి ట్యాంపర్ కాకుండా సాంకేతికంగా పకడ్బందీగా రూపొందించటం అంతకంటే పెద్ద సవాలు.
ముందుగా 18 ఏళ్ల పైబడ్డ వయోజనుల వివరాలను డేటాబేస్‌లో భద్రపరుస్తారు. 2011 జనగణన తోనే ఇది జరుగుతుంది. దీంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉన్న ఓటర్ల వివరాలనూ సేకరిస్తారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని యుఐఏఐతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఇసి ప్రకటించింది కూడా. అయితే ఈ కార్డుల తయారీ ఏ ఒక్క కంపెనీ వల్లనొ సాధ్యం కాదు. మూడు నాలుగు పెద్ద కంపెనీలు పూనుకుంటే తప్ప కార్యక్రమం వేగంగా పూర్తి కాదు. సవాళ్లను సంతోషంగా స్వీకరించే మనస్తత్వం ఉన్న నీలేకని ఉత్సాహంతోనే బాధ్యతలను స్వీకరించారు. మరి ఆయనకు వివిధ విభాగాల్లోని బ్యూరోక్రసీ ఏమేరకు సహకరిస్తుందో చూడాలి?
బయో మెట్రిక్ కార్డు జారీ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మన దేశంలో లోపాలకు తావు లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా, అవినీతి చొరబడకుండా కార్డులను జారీ చేయటం సాధ్యమవుతుందా? మాఫియాలు, టెరర్రిస్టులు, అక్రమచొరబాటు దారులు ఈ కార్డులను సంపాదించుకునే అడ్డదారులు మూతబడతాయా?
మన దేశంలో తలచుకుంటే సాధ్యం కానిదేదీ ఉండదు. ముంబయిలో బీభత్సం సృష్టించిన దావూద్ ఇబ్రహింకు ఈజీగా పాస్‌పోర్‌ట దొరుకుతుంది. అబూసలేం ప్రియురాలు మోనికాబేడీకి కర్నూలు నుంచి రెసిడెన్‌స సర్టిఫికేట్ లభిస్తుంది. అబ్దుల్ కరీం తెల్గీకి ఏకంగా నాసిక్ ప్రభుత్వ ముద్రణాలయాల లోపలి నుంచే స్టాంపు కాగితాల డైలు లభిస్తాయి. వాటిని తీసుకుని అతను వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంపులు తయారు చేస్తాడు.. ఇక కార్డుల సంగతి చెప్పేదేముంది? ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్న కుటుంబాల కంటే ఎక్కువగా రేషను కార్డులు జారీ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు వాటిని ఎలా ఏరివేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత చక్కగా ఉన్న వ్యవస్థలో మోసానికి తావు లేకుండా, బోగస్‌కు అవకాశం ఇవ్వకుండా బయోమెట్రిక్ కార్డును తయారు చేయటం సాధ్యమేనా? అంటే అనుమానమే. ఈ విషయాన్ని నందన్‌నీలకేని కూడా అంగీకరిస్తున్నారు. టాంపర్ ప్రూఫ్ కార్డును రూపొందించటమే తన లక్ష్యమంటున్నారు. కార్డు టాంపర్ ప్రూఫ్ కావచ్చు. కానీ, జారీ చేయటంలో ఎలాటంటి లోపాలు తలెత్తవన్న గ్యారంటీ ఏమిటి? ఇందులో ఓటు బ్యాంకురాజకీయాలు జోక్యం చేసుకోవన్న నమ్మకం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఎవరిదగ్గరా జవాబు లేదు. ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు పెరిగిపోయారు. ఎల్‌ఓసి నుంచి పాక్ తీవ్రవాదుల ప్రవేశం సంగతి సరేసరి. అటు మావోయిస్టులు నేపాల్ దాకా రెడ్‌కారిడార్ నిర్మించుకుంటున్నారు. ఈశాన్యంలో చైనా నుంచీ ముప్పు పొంచి ఉంది. ఇటు శ్రీలంకలో యుద్ధం ముగిసినా, దేశంలోకి వలస వస్తున్న శరణార్థుల వల్ల దక్షిణ భారత దేశంలో ఆందోళన తీవ్రమైంది. హైదరాబాద్‌లో వీసాల గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నవారూ తక్కువేం కాదు.. యూనిక్ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే వీరందరినీ విడిగా గుర్తించాల్సి ఉంటుంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. దేశద్రోహులను తరిమేయాల్సి ఉంటుంది. ఓటుబ్యాంకురాజకీయాల్లో నిండామునిగిన రాజకీయవ్యవస్థలో ఇది సాధ్యమవుతుందని భావించలేం. అదే జరిగితే యూనిక్ ఐడెంటిటీ కార్డు దేశ భవిష్యత్తును బంగారు బాటవైపు మళ్లిస్తుందనటంలో సందేహం లేదు.

7, జులై 2009, మంగళవారం
ఇదేమి బడ్జెట్?
సంస్కరణలు లేవు.. సంక్షేమం లేదు.. మాంద్యానికి మందు లేదు.. ధరల తగ్గింపు ఊసు లేదు.. యుపిఎ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువా త కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరిది. దేశంలో ఏ ఒక్క రంగానికీ రుచించని ఏకైక బడ్జెట్ స్వతంత్ర భారతంలో బహుశా ఇదే మొదటిదేమో... స్లోడౌన్ అయిన ఎకానమీ, మైనస్‌లోకి పడిపోయిన ఇన్ఫే్లషన్‌ల నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశ ప్రజలకు ప్రణబ్ పద్దు నిరాశనే మిగిల్చింది.
వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో తాము చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకునే దిశగా యుపిఎ సర్కారు బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసినవారికి ఆశాభంగమే ఎదురైంది. మింటికెక్కిన ధరలను నేలకు దించటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కనీసం ప్రస్తావనైనా చేయలేదు. గ్లోబల్ ఎకానమీ స్లోడౌన్‌ను ఎదుర్కోవటానికి, దేశాన్ని గట్టెంకించటానికి ప్యాకేజీలను ప్రకటించారు. పన్ను రిలీఫ్, పబ్లిక్ ప్రాజెక్టుల్లో ఖర్చు మొత్తాన్ని పెంచటం వంటి చర్యలు ప్రకటించారు కానీ, దాని ప్రభావం పరిస్థితిలో అంత వేగంగా మార్పు తేలేకపోవచ్చు. 200809లో స్థూల జాతీయోత్పత్తి రేటు 6.7 శాతం ఉంది. దీన్ని వీలైనంత త్వరగా 9శాతం తీసుకువస్తామని ప్రణబ్ ముచ్చటగా చెప్తున్నారు. దేశాభివృద్ధి కోసం లోతైన, విస్తారమైన అజెండాను అమలు చేస్తామన్న ఆర్థిక మంత్రి అదేమిటన్నది మాత్రం వివరించలేదు. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి చేరువయ్యేలా చేయటం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలుగా ప్రణబ్ చెప్పుకొచ్చారు. మరి అందుకోసం ఎలాంటి చర్యలూ బడ్జెట్‌లో ప్రసంగంలో కన్పించలేదు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో బడ్జెట్ ప్రసంగం స్పష్టంగానే ఆవిష్కరించింది.
గత మూడేళ్లలో జిడిపి 9 శాతం నుంచి 6.7శాతానికి పడిపోయింది.
నిరుడు 13 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం మైనస్‌లోకి పడింది.
జిడిపిలో సర్వీసుల రంగం వాటా 50 శాతం చేరుకుంది.
దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సంగతిని స్వయంగా అంగీకరించిన ప్రణబ్ ఇందుకోసం చేశారంటే జవాబు మాత్రం దొరకదు. దేశ చరిత్రలో మొత్తం వ్యయం మొట్ట మొదటిసారిగా పది లక్షల కోట్లను దాటిపోయింది. ఇది ఒక రికార్డుగా ప్రణబ్ చెప్పుకున్నారు. ప్రణాళికా వ్యయాన్ని 37శాతం పెంచితే, ప్రణాళికేతర వ్యయాన్ని 34శాతం పెంచారు. ఖర్చు పెరిగింది.. కానీ దాని వల్ల ఒరిగేదేమీ లేదు. వడ్డీ చెల్లింపులు 2.25లక్షల కోట్లు దాటింది. సబ్సిడీలేమో 1.11లక్షల కోట్లను మించిపోయాయి. ద్రవ్యలోటు జిడిపిలో 6.8 శాతం పెరిగింది. రెవెన్యూ లోటు కొద్దిగా తక్కువగా 4.8శాతం ఉంది. వీటిని నియంత్రించే మెకానిజం ఏమిటో ప్రణబ్ బడ్జెట్‌లో దుర్భిణీ వేసి వెతికినా కనపడదు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సిఫారసు చేశారనో.. సోనియాగాంధీ కోరారనో, ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాక్షించారనో.. ఒకటి రెండు రాయితీలు, ప్రధాని ఆదర్శ గ్రామ్ వంటి ఓ సంక్షేమ పథకాన్ని ప్రకటించారే తప్ప, బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటం, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించటం అన్నవి ఆయనకు గుర్తుకు వచ్చినట్లు లేదు. ఈ బడ్జెట్‌లో ఆయన చేసిందంటూ ఏదైనా ఉన్నదంటే అది మౌలిక వసతుల రంగానికి భారీగా వరాలు కుమ్మరించారు. జాతీయ మౌలిక వసతుల ఆర్థిక సంస్థను ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఇన్‌ఫ్రా రంగం బాగోగుల్ని పర్యవేక్షిస్తారు. మౌలిక వసతులకు సంబంధించిన అన్ని విభాగాలకూ ప్రోత్సాహకాలు ఇచ్చారు. మరో పక్క వ్యవసాయ రంగంపైనా పెద్దగా వరాలిచ్చిందేమీ లేదు. ఉన్న వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించారు. రుణమాఫీ పథకాన్ని మాత్రం మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఇంతకు మించి వ్యవసాయ రంగానికి ఆయర చేసిన, చెప్పుకోదగినంత మేలు ఇంకోటి లేదు. బడ్జెట్ కేటాయింపులను నామమాత్రంగా పెంచారు. అరవై శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటించాలన్న డిమాండ్ వస్తుంటే, ఆ రంగానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం ఇదేనని తెలిశాక ముక్కున వేలేసుకోని వారు ఉంటారా? పోనీ మధ్య తరగతి ఉద్యోగులకు ఊరట లభించిందా అంటే పన్ను రాయితీని పదివేల రూపాయలు పెంచి చేతులు దులుపుకున్నారు. పరోక్ష పన్నుల విషయంలోనూ ఆయన వేళ్లపై లెక్కించదగిన వస్తువుల విషయంలో మాత్రమే మార్పులు చేశారు. చాలా వస్తువులు, ఉత్పత్తుల గురించి పట్టించుకోలేదు. గ్లోబల్ రెసిషన్ కారణంగా తీవ్ర ప్రభావం పడ్డ టెక్‌సటైల్ రంగాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇరిగేషన్ రంగంపైనా ప్రణబ్ చిన్న చూపే చూశారు. ఉన్నత విద్యకు పెద్ద పీట వేసిన ప్రణబ్ వైద్యరంగంలో కొన్ని లైఫ్‌సేవింగ్ డ్రగ్‌సపై ధరలు తగ్గించి ఊరుకున్నారు జాతీయ ఆరోగ్యబీమా పథకం పరిధిలోకి బిపిఎల్ కుటుంబాలన్నింటినీ తీసుకువచ్చారు.
మొత్తం మీద ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ మూడు పొడిగింపులు, ఆరు కొనసాగింపులన్నట్లుగా సాగింది. పట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఈ బడ్జెట్ ఎలాంటి దిశ, దశా చూపించలేదు. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై క్షణాల్లోనే పడింది. ఎవరికీ మింగుడుపడని, అంతుపట్టని, అనూహ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రణబ్ ముఖర్జీకే చెల్లింది.

5, జులై 2009, ఆదివారం
అన్యాయం అంతరిస్తేనే నా గొడవకు సంత్రుప్తి
వ్యక్తిగా ఆయన ఎనభై తొమ్మిదేళు్ల జీవించినంతకాలం కూడా అన్నచాటు తము్మడే. ఆయన కంటే కొద్దికాలం ముందు అన్నగారు అస్తమించినా ఆయన మాత్రం అన్న లేని లోటును భావించలేదు. ఆయన తనతో సశరీరుడై ఉన్నట్లుగానే హైదరాబాద్ నిమ్‌స ఆసుపత్రిలో చేరేంతవరకూ కూడా భావించాడు. తాము మరణించిన తరువాత తమ పార్థివ శరీరాన్ని వృథాగా దహనం చేయకుండా వైద్య పరిశోధనల నిమిత్తం కాకతీయ వైద్య కళాశాలకు విరాళంగా అందించిన మహానుభావులు ఈ ఇద్దరు సోదరులు. పురాణకాలంలో ఆదర్శ అన్నదము్మలైన రామలక్ష్మణుల కథలు వినడమే కానీ, కాళోజీ సోదరుల మధ్య ఉన్న అన్యోన్యత, అనుబంధం రామలక్ష్మణుల కంటే మించినది
అన్నకు తము్మడిపై ఉన్న ప్రేమ ఎంతో.. తము్మడికీ అన్నగారంటే అంత అభిమానం. ఎక్కడైనా అన్నదము్మలు పెరిగి పెద్దవారై, ఎవరి సంసారాలు వారు ఏర్పరుచుకున్న తరువాత క్రమంగా దాయాదులుగా మారటం మనం సహజంగా చూస్తుంటాం. కాళోజీ సోదరులు మాత్రం ఆజన్మాంతం ఒకరితో ఒకరు మమేకమై, రెండు శరీరాలు ఒకటిగా కలిసి జీవించారు. ఉర్దూ, తెలుగు కవిత్వాల సంగమం కాళోజీ సోదరుల జీవితంగా కనిపిస్తుంది. తాను ఓ ముళ్ల కిరీటాన్నని, ఆ కిరీటాన్ని ఏసుక్రీస్తులా తన అన్నగారు జీవితాంతం మోసారని కాళోజీ నారాయణరావు అనటం ఆయన నిజాయితీకి నిదర్శనం. ``ఎన్నేండ్లు వచ్చినను చిన్నవాడనటంచు అతి గారాబము తోడ అన్ని సమకూర్చుచు ఆటపాటల కెంతో అవకాశమిచ్చిన అన్నయ్య'' అంటూ కాళోజీ రామేశ్వరరావుకు నాగొడవ కవితా సంపుటిని అంకితమిస్తూ ప్రజాకవి అన్నమాటలు అక్షర సత్యాలు. ఆయన ఏనాడూ కుటుంబ బాధ్యతలను స్వీకరించేలేదు. పాటించలేదు. తన కుటుంబాన్ని, తము్మడి కుటుంబాన్ని అంతా తానే అయి నడిపించినవాడు అన్నయ్యే. రామేశ్వర రావు కూడా మంచి కవి. ఉర్దూలో మనవాడని చెప్పుకోదగిన కవి రామేశ్వరరావు ఒక్కరు. తము్మడ్ని స్వేచ్ఛగా వదిలిపెట్టిన కారణంగానే కాళోజీ ప్రజా ఉద్యమాల్లో కీలకంగా, క్రియాశీలంగా పాల్గొనేందుకు అవకాశం లభించింది.
కాళోజీ పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వరంగల్లు జిల్లా మడికొండ ప్రాంతానికి వలస వచ్చింది. ఆయన తల్లి మరాఠీలో జాతీయోద్యమ నాయకుల కథలను అద్భుతంగా చెప్పేది. వాటన్నింటిలోనూ మహారాష్ట్ర నుంచి స్వాతంత్య్రోద్యమంలో అత్యంత సాహసోపేతంగా పాల్గొన్న వీర సావర్కర్ గాథలను, స్వాతంత్య్రం నా జన్మహక్కు అని బ్రిటిష్ వారి గుండెలదిరేలా నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గాథలు తనను ఎంతో ప్రేరేపించినవని కాళోజీ ఎన్నో వేదికలపై బహిరంగంగా చెప్పారు. వివిధ ఇంటర్వూ్యలలో కూడా దీని ప్రస్తావన ఉంది. కుటుంబం నేపథ్యం మహారాష్ట్ర కావటం వల్ల మరాఠా యోధుల ప్రేరణ కాళోజీ కుటుంబంపై తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు. బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయోద్యమంలో భాగంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను విద్యార్థి దశలో కాళోజీ ఘనంగా నిర్వహించారు. గణపతి ఉత్సవాలను నిర్వహించి ప్రభుత్వానికి విరుద్ధంగా ఊరేగింపులు నిర్వహించేవారు. ఈ ఊరేగింపుపై ఒకసారి ముస్లిం మతోన్మాదులు చేసిన దాడిలో కాళోజీ గాయపడ్డారు కూడా. కాళోజీ జీవితంలో ముఖ్యమైన సందర్భం ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో పాల్గొనటం. 1920లలోనే ఆయన ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆర్యసమాజ్ పద్ధతిలో యజ్ఞం కూడా నిర్వహించారు. ఆనాటి కాలం హైదరాబాద్ సంస్థానంలో అత్యంత దుర్భరమైన కాలం. తెలుగు అంటే ఉర్దూకు వ్యతిరేకం. ఉర్దూకు వ్యతిరేకం కాబట్టి అది ఇస్లాం మతానికే వ్యతిరేకం.. అంటే అంతిమంగా ఇస్లాంకు చెందిన రాజుకు వ్యతిరేకం అనే దురభిప్రాయాన్ని ప్రచారం చేసి ముస్లిం మతోన్మాదులు దాష్టీకం చేసిన రోజులవి. ముస్లింలు కాని వాళ్లందరినీ నిజాం రాజుకు ద్రోహులుగా సందేహించే రోజుల్లో కాళోజీ ఆర్యసమాజాన్ని ఆసరా చేసుకుని ప్రజా ఉద్యమబాటలో ముందు కురికాడు. ఓ పక్క నిరంకుశ ఇస్లాం రాజ్యం, మరోపక్క గ్రామాల్లో పెత్తందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల దురాగతాలు..వీటన్నింటి నడుమ బలవంతపు మతమార్పిళు్ల అన్నీ కలిసి తెలుగువారి పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఈ వాతావరణంలో నాడు ఆర్యసమాజం నిర్వహించిన భూమిక అనిర్వచనీయమైనది. బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చిన వారినందరికీ ఆర్యసమాజం శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి మార్చటం ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. కాళోజీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేసిందీ ఉద్యమం. నాటి నిజాం మత దురహంకారానికి వ్యతిరేకంగా కాళోజీ పోరాడాడు. ఆ తరువాత ఆంగ్లేయుల వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమంలో కీలక భూమిక నిర్వహించిన గ్రంథాలయోద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడు. ప్రజలను చైతన్యపరచి, బ్రిటిష్, నిజాం వారి ప్రజా వ్యతిరేక చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపరచటమే లక్ష్యంగా కాళోజీ ఆ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
ఆయన దేన్నీ తిరస్కరించలేదు. అలాగే దేన్నీ అక్కున చేర్చుకోలేదు. ప్రాచీన భారతీయ సంప్రదాయం నుంచి ఆధునిక వామపక్ష సంప్రదాయం దాకా, సనాతన ధర్మం నుంచి, మావో సిద్ధాంతం దాకా అన్నింటినీ చదివాడు.. అవగాహన చేసుకున్నాడు.. వాటిలోని మంచిని స్వీకరించాడు.. చెడును నిష్ఠురంగా తిరస్కరించాడు. తాను చేసిందే తన హితులకు చెప్పాడు. ప్రతిద్వంద్వులకూ అదే చెప్పాడు. ఆర్యసమాజం నుంచి పౌరహక్కుల ఉద్యమం దాకా అన్నింటా పాల్గొన్నాడు. అందరికీ ఆప్తుడయ్యాడు. కానీ తామరాకు మీద నీటిబొట్టులా దేన్నీ అంటిపెట్టుకుని ఉండలేదు. నిజాం రాజ్యంలో ప్రజల హక్కులకు భంగం కలిగితే నిరసించిన గళం, ప్రజాస్వామ్య స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అదే పరిస్థితి నెలకొంటే మరింత తీవ్రంగా నిరసించింది. ఎవరి సిద్ధాంతం వారిదే. ఒకరి సిద్ధాంతంతో అంతా ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఏకీభవించకపోతే పీక నొక్కేస్తామంటేనే సమస్య. దీన్నే ఫాసిజం అని కాళోజీ స్పష్టంగా చెప్పాడు. ఇందుకోసం ఆయన పౌరాణిక గాథ అయిన ప్రహ్లాద చరిత్రను ఉదాహరణగా చూపడం విశేషం. ఇందిరాగాంధీ భారత దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కాళోజీనారాయణరావు చేసిన గొప్ప పని ప్రహ్లాద చరిత్రను పఠిస్తూ ఆంధ్రదేశమంతటా పర్యటించటం. `హిరణ్యకశిపుడు ఫాసిస్టు. వానిది రాజ్యహింస. ప్రహ్లాదుడు సత్యాగ్రహి. సత్యాగ్రహం ఫలితం ఇవ్వలేదు. నరసింహుడు ప్రతిహింస చేయవలసి వచ్చింది.'' ఇది ప్రహ్లాద చరిత్రకు ఆయన చేసిన వ్యాఖ్యానం. ఆయన వ్యక్తిత్వాన్ని, ఉద్యమ జీవితాన్ని వేరు చేసి చూడటం సాధ్యం కాదు. పైకి ఒకలాగా, లోపల మరోలాగ ఉండటం ఆయనకు సాధ్యం కాదు. ప్రభుత్వం ప్రజలను హింసిస్తోందని, తుపాకి గొట్టం ద్వారా ప్రజారాజ్యం తీసుకురావాలని మావోయిస్టులుగా మారిన నక్సలైట్లు పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల పదఘట్టనల మధ్య నలిగిన పేద ప్రజానీకాన్ని ఉద్ధరించడం కోసం వారికి భూమిని ఇప్పించటం కోసం, వారికి భుక్తి కల్పించటం కోసం, దొరల గడిల నుంచి వారికి విముక్తిని కల్పించటం కోసం నక్సలైట్లు మూడున్నర దశాబ్దాలుగా సాగించిన ఉద్యమాన్ని ఆయన సమర్థించాడు. కాలం గడుస్తున్న కొద్దీ వాళు్ల పక్కదారి పట్టినప్పుడు హెచ్చరించాడు. వారి తొందరపాటు చర్యలను, నిర్ణయాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అంతేకానీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆయన తిరస్కరించలేదు. వ్యవస్థ ఏదైనా సరే, సామాన్యుడికి అన్యాయం చేయరాదన్నదే ఆయన సిద్ధాంతంగా కొనసాగింది. మొత్తం వ్యవస్థనే మార్చాలన్నది ఆయన ఉద్దేశం కాదు. వ్యవస్థలో లోపాలను సరిదిద్ది ప్రజలకు అవినీతి రహిత రాజ్యాన్ని అందించాలనే చివరికంటా కోరుకున్నాడు. తమ మాట వినక పోతే అమాయక గిరిజనులనైనా కిరాతకంగా హతమార్చడాన్ని ఆయన ఎంతమాత్రం సమర్థించలేదు.
1947 ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి మరో ఏడాది పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన గుల్బర్గా జైలులోనే గడపాల్సి వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కాళోజీతో సహా అనేకులు ఆనాడు ఆ పరిణామాన్ని స్వాగతించినవారే. తెలుగువారంతా ఒక్కటిగా ఒకే రాష్ట్రంలో ఉంటే తెలంగాణంతో సహా అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరుగుతుందని అమాయకంగా విశ్వసించారు. పద్యాలు రాశారు. కానీ కొన్నాళ్లకే తెలిసింది, ఇదంతా బూటకమని, వేర్వేరు ప్రాంతాల తెలుగు ప్రజలు సమైక్యంగా ఉండటం సాధ్యం కాదని. అందుకే ఆంధ్రప్రదేశ్ అవతరణను ఆహ్వానించిన కాళోజీయే `భాష పేర సాలెగూడు భద్రమనకు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మళ్లీ చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని, భాషను, యాసను, సంస్కృతిని, నాగరకతను, పండుగలను, సారస్వతాన్ని కించపరిచే ప్రయత్నాలను కఠినంగా నిరసించాడు. ఆ తరువాత ఎన్నడూ ఆయన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను జరుపుకోలేదంటే, ఒక అభిప్రాయానికి వస్తే కాళోజీ ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఒక ఉదాహరణ చెప్పాలి. ఒకానొక నవంబర్ ఒకటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు దినపత్రికలో పెద్దల అభిప్రాయాలను ప్రోది చేసి ఒక ప్రత్యేక కథనం రాయాలనే తలంపుతో తాతగారి (కాళోజీని నేను తాతగారు అని పిలుస్తాను) దగ్గరకు వెళ్లాను. నక్కలగుట్టలోని ఆయన స్వగృహంలో మొక్కలకు నీళు్ల పోస్తూ వ్యవసాయం చేస్తున్నారాయన. ఆయన దగ్గరకు వెళ్లి నేను ఫలానావారి అబ్బాయిని.. ఈనాడులో పనిచేస్తున్నాను.. నవంబర్ ఒకటి సందర్భంగా మీ అభిప్రాయం ప్రచురిద్దామని వచ్చానని చెప్పా. ఆయన చాలా సౌమ్యంగా మనవడా అని దగ్గరకు తీసుకునేసరికి నేను చాలా సంబరపడ్డా. అప్పుడు ఆయన చెప్పింది వింటే విస్మయం కలుగుతుంది. ``ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి నేను చెప్పేదేం లేదు. ఒకవేళ నేనేం చెప్పినా అది మీ పత్రికలో ప్రచురణ జరగదు. ఉన్నదున్నట్లు రాసినా, మీ రామోజీరావు వేసుకోడు.. అయినా సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ విమోచన దినోత్సవం జరపని ప్రభుత్వానికి నవంబర్ ఒకటిన వేడుకలు జరిపే హక్కు ఎక్కడిది?'' అని విస్పష్టంగా వెల్లడించాడు. ఒకరిపై వారు ఎంతటి వారైనా నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించటంలో కాళోజీ ఎంతటి వారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంత కఠిన హృదయుడో అంత నిజాయితీపరుడు. తాను ఒకటి చేయడానికైనా, చెప్పటానికైనా ఒప్పుకుంటే బ్రహ్మరుద్రాదులు అడ్డం వచ్చినా వెనక్కి తగ్గరు. ఇందుకు ఉదాహరణ కూడా ఈనాడుతో ముడిపడిందే. ఈనాడు టెలివిజన్ ప్రారంభించిన తొలినాళ్లలో ప్రముఖుల జీవితాలు, వారి అభిప్రాయాలతో ప్రత్యేక కార్యక్రమాలను కొంతకాలం ప్రసారం చేసారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఓ విలేఖరి (అరుణారవికుమార్), కెమెరా బృందం వరంగల్ వచ్చింది. వారికి కాళోజీని పరిచయం చేసేందుకు తోడుగా నేను వెళ్లాను. ఇంతకు ముందు ఈనాడును తిరస్కరించిన కాళోజీయే, ఇంటర్వూ్య ఇవ్వమనగానే కాదనకుండా ముందుకు వచ్చారు.
ఆయన ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఓ చిన్న వేదిక మాదిరిగా ఉన్న బండ వద్ద కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు. దాదాపు అరగంటకు పైగా ఆయనతో ఇంటర్వూ్య జరిగింది. అంతా పూర్తయిన తరువాత ఇంటి ముందున్న అరుగుమీదకు వెళ్లి కూర్చొని కాళ్లపైన చేతులతో కాళోజీ రాసుకుంటున్నారు. అదేమిటని అడిగితే ఇంటర్వూ్య జరిగిన ప్రదేశంలో ఎర్ర చీమలు ఆయన కాళ్లను విపరీతంగా కుట్టాయి. కాళు్ల ఎర్రబారాయి. ఈ సన్నివేశం చూసి ఈటీవి బృందం అవాక్కయింది. ముందే చెప్తే ఇంటర్వూ్య ఆపేసి వేరే చోట చేసేవాళ్లం కదా అని ఆందోళన చెందింది. కానీ, ఆయన మాత్రం చిరునవు్వ నవ్వి పరవాలేదు.. మీకు మాత్రం ఇబ్బంది కలిగించటం ఎందుకని నేను మధ్యలో ఆపలేదు అన్నారు. కాళోజీ అన్న ఈ మాటలకు ఏమని వ్యాఖ్యానం చేసేది? ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆప్తుడని ఆయన అన్నాడు. నేనంటే తిరుగుబాటు దారు.. నాగొడవే తిరుగుబాటు అని నినదించాడు. మనం అన్యాయానికి సాక్షీభూతులుగా మనం ఉండరాదు. మన ఇళ్లను కొల్లగొట్టి, మన వాళ్లను చెరిచి, హతమార్చిన వాళ్లను వెంటాడి, వేటాడాలన్నాడు. తరిమి తరిమి కొట్టాలన్నాడు.
అన్యాయాన్నెదిరిస్తే
నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించిన వాడు
నాకు ఆరాధ్యుడు.
ఇందులో ఇజాల మాట లేదు. సిద్ధాంతాల మాట అంతకన్నా లేదు. వ్యవస్థల జోలి లేదు. ఉద్యమాల ఊసు అంతకన్నా లేదు. కాళోజీ ఈ మాటలు అన్ని సిద్ధాంతాల వారికీ, అన్ని ఉద్యమాల నాయకులకూ , పాలక వర్గానికీ, పాలిత వర్గానికీ అందరికీ ఆచరణీయంగా వర్తిస్తుంది. `పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది' అని జయప్రకాష్ నారాయణ్ మరణించినప్పుడు అన్న కాళోజీని ఏమని పొగిడేది? ఏమని వివరించేది?
వేయి అద్భుతాలు - వేయి స్తంభాలు
ఒక మహా సామ్రాజ్యం ఔన్నత్యం అన్నది అది నిర్మించిన భవంతుల పైనో... దేవాలయాల పైనో నిలబడదు. ఆ రాజులు పోషించిన లలిత కళల పైనా, సాహిత్య, సంప్రదాయాలపైనా ఆధారపడదు. వారు సాగించిన జైత్రయాత్రల వల్లనో, రాజ్య విస్తరణ కారణంగానో దాని అస్తిత్వం ఎంతోకాలం మనుగడ సాగించలేదు. ఆ సామ్రాజ్యం అంతమైపోయి ఎంతోకాలం గడిచిన తరువాత కూడా ఆ ప్రాంతంలోని ప్రజలు తమ భూభాగాన్ని ఏలిన రాజుల చరిత్రను, వారి పరిపాలనా రీతిని నిరంతరం జ్ఞప్తికి తెచ్చుకోవడంపైనే ఆ సామ్రాజ్యపు ఉన్నతి కలకాలం నిలబడుతుంది. వారి పరిపాలన ఫలాలను వందల సంవత్సరాల తరువాత కూడా ప్రజలు అనుభవించడం ఆ సామ్రాజ్యం చిరస్థాయిగా చరిత్రపుటల్లో నిలబడటానికి దోహదపడుతుంది.
దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం వరంగల్లు నగరాన్ని రాజధానిగా చేసుకొని తెలుగు గడ్డను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యపు ప్రశస్తి ఈనాటికీ తెలంగాణ ప్రాంత వాసుల్లో కణకణం ప్రతిస్పందిస్తుంటుంది. ఇక వరంగల్లు పట్టణ వాసులయితే వారిని తలవని క్షణం ఉండదు.
ఈ నగరంలో చిన్న సంస్థల నుంచి, పెద్ద పెద్ద సంస్థల వరకు `కాకతీయ' నామం ఉండటం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ ప్రజల హృదయాలను నిత్యం స్పర్శిస్తూ ఉన్న కాకతీయ శబ్దం కేవలం కేవలం ధ్వనిమాత్రం కాదు... ఆ శబ్దాన్ని యాదృచ్చికంగా ఉపయోగిస్తున్నారని తేలిగ్గా కొట్టిపారేయలేం. తెలుగు వారిని ఎందరో రాజులు పరిపాలించారు.. అత్యున్నతమైన పరిపాలనను అందించారు. కానీ, కాకతీయ రాజ్యానికి ఇవాళ్టికీ లభిస్తున్న ప్రశంస మరే రాజ్య వంశానికీ లభించలేదంటే అది అత్యుక్తి ఎంతమాత్రం కానేరదు. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణ దేవరాయలను సైతం సాహితీసమరాంగణ సార్వభౌముడిగా గుర్తిస్తామే తప్ప, పరిపాలనా పరంగా కాకతీయుల సామ్రాజ్యనిరా్మణ వూ్యహం ముందు నిలువదగిన వారు అరుదనేచెప్పాలి.
ఇప్పుడు ఇంత హఠాత్తుగా కాకతీయుల ప్రసక్తి తీసుకురావడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించవచ్చు. ఎప్పుడో ఏడువందల సంవత్సరాల క్రితం గతించిపోయిన సామ్రాజ్యాన్ని గురించిన ప్రస్తావన వెనుక విశేష చారిత్రకాంశం దాగి ఉంది. కాకతీయులు నిర్మించిన అద్భుత నిరా్మణాలలో రుద్రదేవ మహారాజు నిర్మించిన వేయి స్తంభముల దేవాలయం అపూర్వమైనది. ఇక్కడి ప్రసిద్ధమైన త్రికూటాలయం ఎదురుగా ఒక కళ్యాణ మంటపం ఉండేది. ఈ మంటపానికి ఉన్న కొన్ని స్తంభాలు కదులుతుండటంతో, దాన్ని పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఇందుకు వీలుగా మంటపానికి ఆధారభూతంగా ఉన్న స్తంభాలను, ఉపరితలానికి ఉపయోగించిన కొండ రాళ్లను తొలగించి ఆ ప్రాంతాన్ని చదును చేశారు. కాకతీయులు నిర్మించిన విధంగానే ఈ మంటపాన్ని అదే స్థలంలో యథాతథంగా తిరిగి నిలబెట్టడం కోసం ప్రభుత్వం మూడున్నర కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. అంతే కాదు..వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నిపుణుల పర్యవేక్షణలో పునర్మిరా్మణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇంతవరకు బాగాసే ఉంది. ఇక్కడే అసలు అయోమయం మొదలయింది.
కళ్యాణ మంటప నిరా్మణం కోసం పునాదుల తవ్వకం మొదలయింది. భూమి అడుగున తవ్వకం ప్రారంభించిన వెంటసే ఇసుక బయటపడింది. రెండు మీటర్ల ఇసుక తొలగించగాసే అందులోంచి భారీగా నీరు బయటకు ఉబికి రావడం మొదలయింది. ఇవాళ అన్ని సందేహాలకూ ఈ నీరే కారణమైంది. నీటిని ఎంతగా తొలగించాలని ప్రయత్నించినా ప్రవాహం మాత్రం ఆగలేదు. దాదాపు రెండు రోజుల పాటు భారీ మోటార్లను ఉపయోగించి నీరు బయటకు తీసినా నీరు అనంతంగా ఉబికివస్తూనే ఉన్నది. వేయి స్తంభాల గుడికి చుట్టుపక్కలా వరంగల్ నగరం విస్తృతంగా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఇళ్లకోసం బోరు బావులు వేసుకోవాలంటే కనీసం రెండుమూడు వందల అడుగుల దాకా డ్రిల్లింగ్ చేయవలసిందే. అలాంటిది ఇక్కడ పునాది స్థాయిలోనే నీరు బయటపడటం ఏమిటి? నీటి పునాదిపై భారీ రాతి స్తంభాలతో నిరా్మణం సాగించడం సాధ్యమయ్యే పనేనా? ప్రపంచంలో ఇంతవరకు జరిగిన చారిత్రక పరిశోధనల్లో నీరు, ఇసుక కలిసిన పునాదిపై నిరా్మణాలు చేసినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. తవ్విన కొద్దీ ఇసుక, నీరు తప్ప మరే నిరా్మణ సామాగ్రి కనిపించడం లేదు. ఈ నీరు ఎక్కడినుంచి వస్తున్నదనే విషయమై మరింత తవ్వి చూస్తే ఇనుప గొట్టాలు బయటపడ్డాయి. ఈ గొట్టాల నుంచే నీరు వస్తున్నట్లు నిపుణులు కనుగొన్నారు. అయితే ఈ గొట్టాలు ఎక్కడిదాకా ఉన్నాయన్నది మాత్రం అంతుచిక్కలేదు. వేయి స్తంభాల గుడికి సమీపంలో ఉన్న భద్రకాళి చెరువు, పద్మాక్షి గుండం నుంచి నిరంతరంగా నీరు పునాదికి చేరేందుకు వీలుగా ఈ గొట్టాలను ఏరా్పటు చేశారేమో కనుక్కోవలసి ఉంది. నీటి తొలగింపు సాధ్యం కాకపోవడంతో తప్పనిసరిగా పునర్నిరా్మణ పనులను ఆపివేయవలసి వచ్చింది. చివరకు ఈ అపురూప నిరా్మణపు సాంకేతికత ఆనుపానులను కనుక్కొనే బాధ్యతను పురాతత్త్వ శాఖకు ప్రభుత్వం అప్పగించింది.
తెలుగు దేశం అంతటినీ ఒక్కటి చేసి శాతవాహనులు పరిపాలించిన వెయ్యేళ్ల తరువాత తిరిగి తెలుగువారందరినీ ఒకే ఏలుబడిలోకి తీసుకువచ్చిన వారు కాకతీయులు. దాదాపురెండు శతాబ్దాల పాటు తెలుగుదేశాన్ని పరిపాలించి రాజకీయంగానూ, సాంఘికంగానూ తెలుగుజాతికి విశ్వవ్యాప్తమైన కీర్తి ప్రతిష్ఠలు కల్పించిన వారు కాకతీయులు. దక్షిణాన కంచి నుంచి తూర్పున దక్షిణ కళింగ వరకు, కోస్తా, తెలంగాణా ప్రాంతాలతో పాటు, ఆదోని, రాయచూరు, బీదరు కోటల దాకా కాకతీయ సామ్రాజ్యం విస్తరిల్లింది. క్రీస్తు శకం 1050 సంవత్సరంలో మొదటి ప్రోలరాజుతో ప్రారంభమైన కాకతీయుల పరిపాలన క్రీస్తు శకం 1323 వరకు అప్రతిహతంగా కొనసాగింది. కాకతీయులు మొదట జైన మతావలంబులు. ఈ ప్రాంతంలో వీరశైవం ప్రబలిన తరువాత కాకతీయులు కూడా శైవమతాన్ని అవలంబించారు. కాకతీయ ధ్వజంపై విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ మూర్తి చిహ్నంగా ఉన్నప్పటికీ వీరు మాత్రం శైవాన్ని పెంచి పోషించారు. జైనమతాన్ని అవలంబించిన కాలం నాటి అనేక నిరా్మణాలు ఇవాళ్టికీ వరంగల్లు చుట్టుపక్కల కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో కనీసం అయిదు వందల జైన ఆవాసాలు ఉండి ఉండవచ్చన్నది చరిత్రకారుల అంచనా. హనుమకొండలోని పద్మాక్షి గుట్టపై జైన తీర్థంకరులు, యక్షిణుల విగ్రహాలు ఉన్నాయి. నాడు వీరశైవులు జైనులను ఓంు్టగల్లు నగరానికి కనీసం వంద కిలోమీటర్ల దూరం వరకు కనపడకుండా తరిమికొట్టారని కథనం. నాటి జైనుల ప్రాభవానికి వరంగల్లు సరిహద్దుల్లోని కొలనుపాక జైన దేవాలయం దర్పణం పడుతుంది. కాకతీయులు శైవాన్ని పోషించడం ప్రారంభించిన తరువాత అనేక జైన మంటపాలను కళ్యాణ మంటపాలుగా, శైవ మందిరాలుగా మారా్చరని భావన. వేయి స్తంభాల దేవాలయంలో ప్రస్తుతం పునర్నిరా్మణం కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ మంటపం కూడా ఇలాంటి జైన మంటపమేనని అనుమానం. సాధారణంగా జైన మంటప స్తంభాలపై పూర్ణకుంభాలు కనిపిస్తాయి. ఇతర ఆలయ స్తంభాలపై వీటి జాడ ఉండదు. వేయి స్తంభాల గుడిలోని కళ్యాణమంటపంపై కూడా పూర్ణ కుంభాలు కనిపించడం గమనార్హం. కానీ, ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో ఇవి ఉండవు.
సహస్ర స్తంభ దేవాలయం
కాకతి రుద్రదేవుడు హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని సహస్ర స్తంభ మంటప సమేతంగా సరిగ్గా 843 సంవత్సరాల క్రితం 1163లో నిర్మించాడు. ఒక వైపు త్రికూటాలయం కాగా దాని ఎదురుగా కళ్యాణ మంటపం, మధ్యలో నంది మంటపం వైభవంగా అలరారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోనే లోతైన తటాకాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయ నిరా్మణమే ఒక అద్భుతమైనది. భారతీయ నిరా్మణ చరిత్రలో దీనికి సాటి వచ్చు నిరా్మణం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని రెండు విభాగాలుగా నిర్మించారు. చుట్టూ ఒక పటిష్ఠమైన ఆవరణాన్ని ఒకటి నిర్మించి దానికి దక్షిణ దిశలో ఒక ద్వారాన్ని, ఉత్తర దిశలో మరొక ద్వారాన్ని ఏరా్పటు చేశారు. ప్రస్తుతం ఆలయంలోకి ఉత్తర దిశ నుంచే ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఈ దిశలో ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే ఎడమ వైపున అతి పెద్ద పుష్కరిణి కనిపిస్తుంది. కుడివైపున ఎతె్తైన శిలావేదికపై త్రికూటాలయం ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉన్నప్పటికీ గరా్భలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఆలయమంతా నక్షత్ర ఆకృతి కలిగిన పెద్ద పెద్ద రాతి పునాదులపై నిర్మించబడింది. భూమట్టము నుంచి దాదాపు ఏడెనిమిది అడుగుల ఎత్తున అలయ నిరా్మణం జరిగింది. ఆలయ నిరా్మణం అంతా నల్లని గ్రాసైటు రాళ్లతోనే జరిగింది. ప్రతి స్తంభంపైన కనిపించే నగిషీ సౌందరా్యన్ని వర్ణించడం సామాన్యుడి తరం కాదు. స్తంభాలు మాత్రమే కాదు.. ఆలయ ఉపరిభాగంలో కూడా శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. చతురస్ర, చతుష్కోణ, వలయాకారంలో రాతి శిల్పాలను ఆలయ ఉపరిభాగంలో అమర్చడం తెలుగువాడి శిల్పకళా సైపుణ్యానికి మచ్చుతునక. దేవీ దేవతల విగ్రహాలు, నానా రకాల నాట్య భంగిమలు, కమల దళ శిల్పాలు, ఏనుగులు, గుర్రాల వంటి జంతువులు ఈ శిల్పాలలో కనిపిస్తాయి. భూమట్టానికి దాదాపు పదిహేను అడుగుల ఎత్తున ఉపరిభాగంలో ఈ శిల్పసౌందర్యం పోగుపడి ఉన్నప్పటికీ పరా్యటకులకు స్పష్టంగా గోచరించడం ఇందులోని విశేషం. ఈ ఆలయం ప్రధానంగా త్రికూటాలయం. ఇందులో రుద్రేశ్వర స్వామితో పాటు, వాసుదేవ, సూర్యదేవ ఆలయాలు కూడా ఉన్నాయి. సూర్యదేవుడి ఆలయాన్ని నిర్మించడానికి కారణం జైనమతావలంబులను సంతృప్తిపరచేందుకేనని కొందరి అభిప్రాయం. ప్రస్తుతం వాసుదేవ, సూర్యదేవ ఆలయాలు కేవలం సాధారణ గదులుగా మారిపోయాయి. ఇందులోని విగ్రహాలు ఏమైపోయినాయో తెలియదు. రుద్రేశ్వర స్వామి స్వయంభు శివలింగం మాత్రం ఈనాటికీ భక్తులను అనుగ్రహిస్తున్నది.
రుద్రేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న నందిమంటపంలో ఏకశిలపై రూపొందించిన నందీశ్వరుడి మహాద్భుత విగ్రహం ఉత్తరాభిముఖమై దర్శనమిస్తుంది. ఈ మంటపానికి ఎదురుగా ఇప్పుడు పునర్నిర్మించ తలపెట్టిన కళ్యాణ మంటపం ఉండేది. దీన్ని తొలగించడానికి ముందు ఉన్న రూపం ఈ విధంగా ఉంది. ఇది భూమట్టానికి మూడు నాలుగు అడుగుల ఎత్తుపై తెల్లని ఇసుకరాళ్లతో నిర్మితమైంది. (ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో స్వామి నారాయణ్ ట్రస్‌టవారు అపురూపంగా నిర్మించిన అక్షర ధామ్ ఆలయానికి వాడినవి ఎరన్రి ఇసుక రాయి కావడం గమనార్హం.) ఈ మంటపం ప్రారంభంలోనే అనేక స్తంభాలపై నిర్మించిన రెండు వసారాలు ఉంటాయి. ఈ వసారాల నడుమ ప్రధాన ద్వారం ఉంది. ప్రధాన ద్వారం దాటి లోపలికి వెళ్లిన తరువాత పదహారు స్తంభాలపై నిర్మించిన చతురస్ర ప్రాంతాన్ని చూస్తాం. కాస్త కిందకు వెళ్తే మూడు నాలుగు అంగుళముల ఎత్తున నాలుగు శిలాస్తంభాల వంటి ఒక వలయం కనిపిస్తుంది. ఈ చతురస్ర ప్రాంతంలోని పదహారు స్తంభాలు కూడా పై భాగంలో కొంత చెక్కినట్లు ఉంటాయి. ఈ మంటపానికి తూర్పువైపున మూడు నాలుగు అడుగుల ఎత్తున మరో వసారా ఉంటుంది. అదే విధంగా పడమటి వైపున మరో వసారా ఉంటుంది. ఈ వసారా అన్ని వైపులా తెరిచే ఉండటం, మధ్యలో ఒక వేదిక ఉండటాన్ని పరిశీలిస్తే ఇది ఒక చిన్న ఆలయంగా ఉపయోగించినట్లు భావించవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా ఈ మంటపానికి వసారాలు నిర్మించి ఉన్నాయి. ఇప్పుడీ మంటపాన్ని యథాతథంగా నిర్మించడానికి పురాతత్త్వ శాఖ ప్రయత్నిస్తున్నది.
అపురూప నిరా్మణాలు...
కాకతీయులు నిర్మించిన ఆలయాలు కానీ, చెరువులు కానీ, కోటలు కానీ, భవంతులు కానీ, వేటికవే సాటి. కాకతీయుల శిల్ప నిరా్మణంలో రాష్టక్రూటులు, చాళుక్యుల శైలి కొట్టొచ్చినట్లు కనిపించినప్పటికీ, నిరా్మణ శైలిలో కాకతీయుల ప్రత్యేకత విశిష్టమైనదసే చెప్పాలి. రామప్ప, లక్నవరం, పాకాల, మడికొండ, ధర్మసాగర్ తదితర ప్రాంతాల్లో కాకతీయులు నిర్మించిన చెరువులు ఇవాళ్టికీ వేల ఎకరాల పంటపొలాలను సస్యశా్యమలం చేస్తున్నాయి. వారి తరువాత ఈ ఎనిమిది వందల సంవత్సరాలలో ఒక్క రిజరా్వయర్ కానీ, ఒక్క చెరువు కానీ వరంగల్ ప్రజలకు పరిపాలకులు అందించలేకపోయారు. ఏకశిలా నగరాన్ని అత్యున్నత మైన సాంకేతిక ప్రమాణాలతో వారు నిర్మించారు. కాకతీయుల నాలుగు కీర్తి తోరణాలు రుద్రదేవ, గణపతి, రుద్రమ, ప్రతాపరుద్రుల కీర్తి పతాకలుగా ఈనాటికీ సగర్వంగా నిలబడి ఉన్నట్లు గోచరిస్తాయి. సౌందర్యశాస్త్రాన్ని కాకతీయులు కాచివడబోశారా అన్నట్లు వారి నిరా్మణాలు కనిపిస్తాయి. పాలంపేటలోని రామప్ప దేవాలయం, హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం వారి నిరా్మణ వైచిత్రికి ఉజ్వలమైన తారా్కణాలు.
సాంకేతికత విషయానికి వస్తే వారు చేసిన నిరా్మణాలన్నింటిలోనూ ఇసుక ప్రధాన పాత్ర వహించింది. కీర్తి తోరణాలసే పరిశీలించినట్లయితే అందులో దాదాపు మూడున్నర మీటర్ల లోతున భూగరా్భన్ని పూర్తిగా ఇసుకతో నింపారు. ఆ తరువాత దానిపైన నలభై సెంటీమీటర్ల మందంతో 3.65 మీటర్ల పొడవున్న గ్రాసైట్‌రాతి `బీమ్'ను ఏరా్పటు చేశారు. ఈ బీమ్‌కు రెండు వైపుల నుంచి కూడా నిర్దిష్ట పరిమాణంలో చిన్న గ్రాసైట్ రాతి బ్లాక్‌లను భూమట్టం దాకా ఏరా్పటు చేసి పునాదిని పటిష్ఠపరిచారు. ఆ పైన కీర్తితోరణాన్ని నిలబెట్టారు. ఈ కీర్తితోరణ స్తంభాలు ఒక్కొక్కటి సుమారు తొమ్మిది మీటర్ల ఎత్తు ఉంటాయి.
వేయి స్తంభాల గుడిలోని ప్రస్తుత కళ్యాణ మంటపం విషయానికి వస్తే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు చేసిన పరిశోధన ప్రకారం ఇక్కడి పునాది కూడాప్రధానంగా ఇసుకపైనే ఆధారపడి ఉంది. అయితే ఇసుక కంటే ముందుగా దాదాపు మూడున్నర మీటర్ల మేర మొరంతో నింపి దానిపై మరో రెండున్నర మీటర్ల మేర బంకమన్ను దాని పైన సుమారు నాలుగు మీటర్ల వరకు ఇసుకను నింపారు. దీనిపైన భూమట్టంపై ఒక బీమ్‌ను నిర్మించి, `ఫ్లోర్ స్లాబ్'ను వేశారు. ఈ బీమ్‌ను ఆధారం చేసుకొని స్తంభాలను నిలబెట్టడం జరిగింది. స్తంభాలకు కింది బీమ్‌కు, పైనున్న బీమ్‌లకు మధ్య అవసరమైనంత ఖాళీ స్థలం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం కూడా భవన పటిష్ఠతలో భాగమే. నల్లరేగడి మన్ను భూమిలో ఉండే ప్రాంతాలలో ఇవాళ్టికీ ఇసుకతో పునాదులను పటిష్ఠం చేసే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే తాజా తవ్వకాల్లో నీరు ఉబికిరావడం అందుకోసం ఇనుప కేసింగ్ బయటపడటం అన్నది నాటి నిట్ నిపుణులు అంచనా వేయలేదు. నీటిపొరపై కళ్యాణ మంటపం నిర్మించినట్లు ఊహించడానికి తగిన ఆధారాలు కూడా వారికి కనిపించలేదు. దీని ఆనుపానులు కనుక్కోవడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నీరు భద్రకాళి చెరువు, పద్మాక్షి గుండంల నుంచి వస్తున్నదని తొలుత భావించినప్పటికీ అందులో నిజానిజాలు ఎంతమాత్రమన్నది తేలాల్సి ఉంది. అయితే, కళ్యాణ మంటపానికి ఎదురుగా ఉన్న నందిమంటపం వద్ద ఒరల బావి ఒకటి ఉండేదని, ఈ బావిలోని నీరే కళ్యాణ మంటపం పునాదుల్లోకి చేరిందా అన్నది చరిత్రకారుల సందేహం. మొరం, బంకమన్ను, ఇసుక కలిపి దాదాపు పది అడుగుల మేర పునాది ఉన్నదని నిట్ నిపుణులు భావించిన మాటే నిజమైతే, మరి ఇప్పుడు రెండు మీటర్ల ఇసుక తవ్వగాసే నీరు ఉబికి రావడం వెనుక మర్మమేమిటి? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ఈ రహస్యాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాబోదు. ఈ రహస్యాన్ని కనుక్కోవడమే కాకుండా వీలైనంత త్వరగా కళ్యాణ మంటపాన్ని పూర్వరూపంలో పూర్వ స్థానంలో యథాతథంగా నిలబెట్టడానికి కృషి చేయడం అవసరం. నాడు మహబూబ్ నగర్ జిల్లాలో అలంపురం దేవాలయాలను రూపం మారకుండా స్థాన చలనం చేసినట్లు, నేడు సహస్ర స్తంభ దేవాలయంలోని కళ్యాణ మంటపాన్ని కూడా కాకతీయుల కళా ప్రాభవం చెడకుండా నిలబెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
4, జులై 2009, శనివారం
సంస్కరణలా? సమర్పణలా?
ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం చేతుల్లోనుంచి ప్రైవేటు చేతుల్లో పెట్టబోతోందా? పార్లమెంటులో ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వే ఈ అనుమానాలనే బలపరుస్తోంది. రక్షణ రంగంతో సహా పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సర్వేలోని అనేక అంశాలు చెప్పకనే చెప్తున్నాయి. అదే జరిగితే దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను ఏ దిశలో ముందుకు తీసుకువెళ్లనుంది?
సబ్సిడీల తొలగింపు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు విస్తారంగా తలుపులు తెరవటం, పలు కీలక రంగాల్లో ప్రయివేటీకరణకు ప్రోత్సాహాల్ని కల్పించటం......... కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే చేసిన సిఫార్సుల్లో కీలకమైనవి ఇవి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో లక్షకోట్లకు పైగా అత్యధిక నిధుల కేటాయింపు జరిగే రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని సర్వే నిష్కర్షగా చెప్పింది. దాదాపు 49 శాతం ఫారిన్ ఇన్వెస్‌టమెంట్‌కు అనుమతించాలని సిఫార్సులు ఉంటున్నాయి. రక్షణ రంగంలో ప్రయివేటు పాత్ర ఎలా ఉండాలనే విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటన్నది తెలియదు. ఓ పక్క పొరుగు దేశాలతో నిరంతరం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగంలో ప్రయివేటు పాత్ర ఎంతవరకు సమంజసం అన్నది నిపుణులే చెప్పాలి. వాస్తవానికి బడ్జెట్ కేటాయింపుల్లో లక్ష కోట్లకు పైగా రక్షణ రంగానికే వెళు్తన్నాయి. ఇంత ఖర్చును తగ్గించుకోవటం కోసమే సర్వేలో ఈ ప్రతిపాదన చేసినట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. రక్షణ రంగం విషయంలో డబ్బులు, కేటాయింపులు, జమా ఖర్చుల గురించి ఆలోచిస్తూ పోతే.. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావచ్చు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు తెగించి ప్రధానశత్రువు పీచమణచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తే, కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తే, సైన్యం అవసరాలు సహజంగానే తగ్గిపోతాయి. ఈ దిశగా కృషి చేయకుండా, ఆలోచించకుండా, వూ్యహరచన చేయకుండా, గుడ్డిగా విదేశీ పెట్టుబడులను డిఫెన్‌స ఫీల్‌డలోకి ఆహ్వానించటం ఎంతవరకు సబబు?
అటు బీమా రంగంలోనూ ప్రైవేటు పాత్రను కీలకం చేయాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే బీమాలోకి అనేక ప్రయివేటు సంస్థలు ప్రవేశించాయి. విదేశీ సంస్థలు కూడా భారత ఇన్సూ్యరెన్‌స మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసి, జిఐసి వంటి సంస్థల్లోనూ ప్రయివేటు పెట్టుబడులకు ఆస్కారమిస్తే దేశంలో ఇప్పటివరకు వాటికి ఉన్న గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. అది సామాన్య ప్రజానీకానికి మేలు చేసే మాటెలా ఉన్నా, ప్రభుత్వం వాటాలను ఉపసంహరించుకుంటే ఆర్థిక భారం నుంచి తప్పించుకుంటుంది. ప్రభుత్వానికి కావలసింది ఇదేనేమో... ఇంకోపక్క రిటైల్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలని డిమాండ్ విస్తృతమవుతుంటే, ఆర్థిక సర్వే మాత్రం ఈ రంగంలో విదేశీయులకు రాచబాట వేయాలని సూచిస్తోంది. రిలయన్‌స, హెరిటేజ్, ఫుడ్‌బజార్ వంటి వాటితో చిల్లర కిరాణా వ్యాపారం దారుణంగా దెబ్బతింది. కులవృత్తులు పోయినట్లే... చిల్లర వ్యాపారమూ క్రమంగా కనుమరుగవుతోంది. అదే జరిగితే చిన్న వ్యాపారులంతా రోడ్డున పడతారు. మరి వారికి ఉపాధి కల్పించేదెవరు?
అన్నింటికీ మించి ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్నాలను పక్కన పెట్టి మిగతా అన్ని సంస్థల్లోనూ తక్కువలో తక్కువ పది శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. చివరకు బొగ్గు, ఇంధనంపైనా ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నది. అణు ఇంధన విషయంలోఇ ప్పటికే రిమోట్ కంట్రోల్ అమెరికా చేతుల్లోకి ఇప్పటికే వెళ్లిపోయింది. ఇంకా ప్రైవేటు చేస్తే... మన దేశ భద్రత మేడిపండు చందంగా మారవచ్చు. ఈ విషయంలో ప్రణబ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. దేశంలో ప్రత్యేకతను సంతరించుకుని స్వయంగా లాభాలను ఆర్జిస్తున్న రైల్వేల్లోనూ ప్రైవేటు చేతులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరిన్ని ఎఫ్‌డిఐలను ఆహ్వానిస్తామని మమత తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా పేర్కొన్నారు. అదే జరిగితే ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యం తగ్గి వ్యాపార ధోరణి ప్రబలిపోతుంది.
ఏ ఆర్థిక వ్యవస్థకైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఊతాన్నిచ్చేవే. ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఆక్షేపణలూ ఉండక్కర్లేదు. కానీ ఆ ఎఫ్‌డిఐలు మనకు మేలు చేసేవిగా ఉండాలి కానీ, మనల్ని, మన ఆధిపత్యాన్ని కబళించేలా ఉండకూడదు. మన నియంత్రణలో విదేశీ సంస్థలు ఉండాలి కానీ, వాటి నియంత్రణలోకి మనం వెళ్లకూడదు. వివిధ విభాగాల్లో ఎఫ్‌డిఐలను ఆహ్వానించే ముందు ప్రణబ్ దా... ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే చాలు..

2, జులై 2009, గురువారం
మన ఎంపిలు మహా....................నుభావులు
రైల్వే బడ్జెట్ సీజన్ వచ్చిన ప్రతిసారీ మనకు అన్యాయం జరుగుతోందని వాపోవటం.. రైల్వే మంత్రిని నిందించటం.. రెండు రోజులు హడావుడి చేయటం.. ఆ తరువాత యథావిధిగా మరచిపోవటం ఎప్పుడూ జరుగుతున్న తంతే ఇది. ఒకటి కాదు. రెండు కాదు.. దశాబ్దాలుగా మనకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎవరూ ఏనాడూ ప్రశ్నించింది లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నా, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో చక్రం తిప్పినా, మన
వాడు ప్రధానమంత్రి అయినా, మన రాషా్టన్రికి రైల్వే ఎప్పుడూ న్యాయం అన్న మాట లేదు. ఇందుకు కారణం ఏమిటి?
రైల్వేలకు మన రాషా్టన్రికీ దూరం చాలా ఎక్కువ... రైల్వే మంత్రులకు మన రాష్టం అంటూ ఒకటున్నదన్న స్పృహ కూడా ఉండదు.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన ప్రతిసారీ, అన్ని ప్రాంతాలతో పాటు మన రాషా్టన్రికీ ఏవో కొన్ని అరకొర కేటాయింపులను విదిలిస్తారు. అంతటితో ఆ సంవత్సరం గడిచిపోతుంది. ఘనత వహించిన మన పార్లమెంటు సభ్యులకు మాత్రం వీటి గురించి పట్టదు.. కనీసం అవగాహనైనా ఉండదు.. విచిత్రమేమిటంటే ఈ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో ప్రభుత్వానికి దన్నుగా ఎంపిలను ఇక్కడి ప్రజలు గెలిపిస్తారు. ఇక్కడా, అక్కడా ఒకే పార్టీ రాజ్యమేలుతుంటుంది. అయినా మన వాళు్ల నోరు తెరిచి మాకివి కావాలని అడిగే సాహసం చేయలేరు. ఇవ్వకపోతే ఇదేమని అడిగే ధైర్యమూ వారికి లేదు. 2004 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ఎంపిలు 29 మంది ఎన్నికయ్యారు. అప్పటికి మిత్రపక్షంగా ఉండటం వల్ల టిఆర్‌ఎస్ నుంచి మరో ుగురు ఎంపిలు ఎన్నికయ్యారు. వీరిలో ఇద్దరు కేంద్రమంత్రి పదవులనూ దక్కించుకున్నారు. అక్షరాలా 34 మంది ఎంపిలను మనం పాలక పక్షానికి అందించాం... అయినా మనకు రైల్వేల పరంగా ఒరిగిందేమీ లేదు. గత కేబినెట్‌లో రైల్వే బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ఎంపిలు అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను నిలదీశారు. ఆయన వారిపై చిరాకు ప్రదర్శించి మీ మేడమ్‌తో చెప్పుకోపొండంటూ చీదరించుకున్నా, మనవాళు్ల చేసిందేమీ లేదు. ఇప్పుడు సైతం 33మంది ఎంపిలు కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. దేశంలో ఇంతఎక్కువ స్థాయిలో కాంగ్రెస్‌కు ఎంపిలను అందించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇలాంటి రాషా్టన్రికి కీలకమైన ఏ ఒక్క శాఖ కూడా మంత్రివర్గంలో దక్కలేదు. పనికిమాలిన సహాయమంత్రి పదవులను అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖలు రెండూ బెంగాలీలు దక్కించుకున్నారు. పదవుల కోసం పట్టుబడలేదు.. సరికదా... కనీసం నిధులు, పథకాలనైనా సాధించుకొస్తారా అంటే ఆ నమ్మకమూ లేదు. మనకు అవి కావాలి.. ఇవి కావాలి అని మాత్రం మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి తనయుడు కడప ఎంపి వైఎస్ జగన్ నేతృత్వంలో కొందరు ఎంపిలు వెళ్లి రైల్వే మంత్రి మమతా బెనర్జీని కలిసి మెమొరాండం సమర్పించారు. అపరిష్కృతంగా ఉన్న కొన్ని డిమాండ్లను పరిష్కరించాలంటూ వేడుకున్నారు. కానీ, ఆ వేడుకోళ్లను ఆమె ఎంతవరకు వింటారనేది అనుమానమే.
ఎందుకంటే ప్రతి సంవత్సరం మన పార్లమెంటు సభ్యులు రైళ్ల మంత్రిని కలవటం, కొన్ని డిమాండ్లను సమర్పించటం.... వాటిని వారు పట్టించుకోకపోవటం రెగ్యులర్‌గా జరుగుతున్న వ్యవహారమే... ఒకటీ, అరా తప్ప వాస్తవంగా మన అవసరాలను తీర్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. 40 ఏళ్ల కాలంలో కేవలం 440 కిలోమీటర్ల రైలు మార్గమే పూర్తయిందంటే మన రాష్ట్రం రైల్వేల విషయంలో ఎంత దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన ఎంపిలు తమ అధిష్ఠానానికి వారి బలాన్ని, ఇక్కడి ప్రజల అవసరాల్ని గుర్తించే విధంగా కార్యాచరణకు పూనుకోనంత వరకు ఈ పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదు...
రైల్వేల్లో మనకు న్యాయం జరిగే అవకాశమే లేదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి యాభై ఏళు్ల దాటిపోయింది. సగటున లెక్కేసుకున్నా ఏడాదికి కనీసం పది కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వే లైను వేయగలిగారంటే ముక్కున వేలేసుకోవలసిందే. కానీ ఇది కఠిన వాస్తవం. గత నలభై ఏళ్లలో మన రాష్ట్రంలో పూర్తయిన రైలు మార్గం కేవలం 440 కిలోమీటర్లే..ఇక మిగతా పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఏమని చెప్పేది.. ? ఎంత చెప్పుకున్నా ఏం ప్రయోజనం..?
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం రైల్వేల ప్రధాన బాధ్యత. కానీ ఆ బాధ్యతను రైలే శాఖ పూర్తిగా విస్మరించింది. కాదు.. కాదు.. రైల్వే మంత్రులు మర్చిపోయినట్లు నటిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన కేంద్రం మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ, తమిళనాడు వారికి ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయి. అయినా అడిగేవారుండరు. అత్యధిక ఆదాయం ఇక్కడి నుంచే రైల్వేలకు లభిస్తున్నా, కనీసం ప్రాజెక్టులైనా మనకు సక్రమంగా దక్కవు. కనీసం మంజూరైన ప్రాజెక్టులకైనా నిధులు అవసరమైనన్ని కేటాయిస్తారా అంటే అదీ లేదు.. ఉదాహరణకు 500 కోట్ల రూపాయలు అవసరమైన చోట యాభై లక్షలు విదిలిస్తారు.. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. కొత్త ప్రాజెక్టు ప్రకటించటానికి పెద్దగా అభ్యంతరం ఉండదు. ప్రాజెక్టులు ప్రకటించగానే అది సర్వేతో మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. ఇలా మన రాష్ట్రంలో సర్వేలు పూర్తి చేసుకుని, అసలు పని కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు కొల్లలుగా ఉన్నాయి. ఎన్‌డిఏ హయాంలో రైల్వే శాఖకు సహాయమంత్రిగా మన రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ పనిచేసినప్పటికీ, ఆయన వల్ల ఒనగూరిన ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే...
దత్తాత్రేయ ఎన్ని మాటలైనా చెప్పవచ్చు గాక.. ఒకటి రెండు రైళు్ల తెస్తే తెచ్చి ఉండవచ్చు గాక.. కానీ... వాస్తవంగా మన రాషా్టన్రికి సంతృప్తి కర స్థాయిలో మేలు జరగటం కల్లో మాట. పోనీ మంజూరైన పథకాలనైనా సక్రమంగా పూర్తి చేశారా అంటే అదీ లేదు. గతంలో ఒకసారి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. సర్వే చేయించారు. ఆ తరువాత రాజీవ్ గాంధీ గారు.. దాన్ని పంజాబ్‌కు తరలించుకుపోయారు. మొన్నటికి మొన్న అదే కాజీపేటలో ఎలక్ట్రిక్ రైలింజన్ వర్‌కషాప్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లే ఇచ్చి, లాలూ ప్రసాద్‌యాదవ్ బీహార్‌లోని తన నియోజక వర్గానికి తరలించుకుపోయారు. ఇదేమని ఆ మంత్రిని నిలదీసిన ఎంపిలు లేరు.
1993 నుంచి 2007 వరకు మన రాషా్టన్రికి ఆరు మాత్రమే కొత్త రైలు మార్గాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. నిధులు కూడా అప్పుడప్పుడూ విడుదలవుతూ వచ్చాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదంటే, రైల్వే శాఖ ఎంత గొప్పగా మన పట్ల వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 199394లో 517.63 కోట్ల రూపాయల వ్యయంతో పెద్దపల్లికరీంనగర్‌నిజామాబాద్ మార్గంలో 177.37 కిలోమీటర్ల పొడవున రైలు మార్గం పనులు మొదలయ్యాయి. సక్రమంగా నిధులు విడుదల చేస్తే అనుకున్న ప్రకారం రైలు మార్గం పూర్తయ్యేది. కానీ, నిధులు సరిగ్గా ఇవ్వకపోవటం, పనుల్లో అసాధారణ జాప్యం ప్రాజెక్టు విలువను అమాంతంగా పెంచేసింది. దీని ఫలితం ప్రాజెక్టు విలువ నాలుగు వేల ఎనభై మూడు కోట్లకు చేరుకుంది. ఇక నంద్యాలఎరగ్రుంట్ల, మునీరాబాద్‌రాయచూర్, గద్వాలరాయచూర్, జగ్గయ్యపేటమేళ్ల చెరువు మార్గాల పనులూ నత్త నడకనే నడుస్తున్నాయి. భూసేకరణలో జరిగిన జాప్యమే పనులు ఆలస్యం కావటానికి కారణమని అధికారులు అంటున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయకపోవటం కూడా సమస్యే. కడప బెంగుళూరు మార్గంలో వెయ్యి కోట్ల వ్యయంతో 255 కిలోమీటర్ల పనులకు గత సంవత్సరంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అదీ ఇదే కారణంతో ఆగిపోయింది. కొత్తపల్లిమనోహరాబాద్ మార్గంలో కొత్త లైను ఏర్పాటుకు సంబంధించి కేవలం సర్వే మాత్రమే పూర్తయింది. పనుల నిధులను మాత్రం విడుదల చేయలేదు.
రెండోసారి విజయం సాధించటమే కాకుండా, కాంగ్రెస్‌కు కేంద్రంలో తిరుగులేని అధికారాన్ని దక్కించటంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ మమతాబెనర్జీ నుంచి ఏమాత్రం సాధించినా రాషా్టన్రికి మేలు జరుగుతుంది
ఎంఎంటిఎస్ రెండో దశకైనా మోక్షం లభిస్తుందా?
రాజధాని నగరంలో సునాయాసంగా రవాణాకు దోహదపడుతున్న వ్యవస్థ ఎంఎంటిఎస్. ఏటేటా లక్షల సంఖ్యలో రోడ్ల పైకి వస్తున్న వాహనాల కారణంగా నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా నిలిచిన వ్యవస్థ. 2003లో 9 రైళ్లతో ప్రారంభమైన ఈ వ్యవస్థ రెండో దశ ప్రారంభం కోసం నిరీక్షిస్తుంది. ఈసారైనా రైల్వే మంత్రి తన బడ్జెట్‌లో కరుణిస్తారా లేదా చూడాలి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లక్షలాది ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న కల ఎంఎం టిఎస్ రెండోదశ. పాతకాలం నాటి లోకల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా వేగంగా ప్రయాణించే ఎంఎంటిఎస్ రైళ్లను రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రైల్వే శాఖ చేపట్టింది. 9 రైళు్ల , 64 ట్రిప్పులకో రోజూ దాదాపు 60 వేల మంది ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 16కు చేరుకుంది. లక్షమంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.
ఎంఎం టిఎస్ రెండోదశ ప్రతిపాదనల పట్ల రైల్వే శాఖ దోబూచులాడుతోంది. భువనగిరిసికిందరాబాద్, మనోహరాబాద్‌సికిందరాబాద్, ఉందానగర్‌శంషాబాద్ తదితర ప్రాంతాలకు ఎంఎంటిఎస్ సేవలను విస్తరించాలన్నది ఈ ప్రతిపాదనల సారాంశం. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో ఈ పనులకు సంబంధించిన ప్రకటన వస్తుందని ఆశించటం, ఏమీ రాకపోవటంతో నిరాశపడటం మామూలైపోయింది. రాజధానిలో మెట్రో రైలు ప్రాజెక్టు సత్యం స్కాం కారణంగా నిలిచిపోవటంతో ఎంఎంటిఎస్ రెండో దశ అయినా పూర్తయితే, కొంత వరకైనా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ స్వయంగా పూనుకుని 614 కోట్ల రూపాయలతో రెండో దశ పనులను చేపట్టాలని కేంద్రాన్ని కోరారు. ఎంఎంటిఎస్ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ప్రజలు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణ ఎక్‌సప్రెస్ రైళు్ల నడుస్తున్న ట్రాక్‌లనే ఎంఎంటిఎస్‌లు కూడా వినియోగించుకోవటం వల్ల ఆలస్యంగా గమ్యం చేరటం ఇబ్బందిగా మారింది.
రైల్వే శాఖపై అవసరమైన స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తే ఎంఎంటిఎస్ రెండో దశ కష్టమేం కాదు..
సికిందరాబాద్‌ను మమత కరుణిస్తుందా?
రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఎలాగూ అన్యాయం జరుగుతూనే ఉంది. కనీసం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ విషయంలోనైనా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందా అంటే అదీ లేదు.. దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రమైన సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని కాగితాలపైనైతే హామీలు కురిపించారు. రైల్వే మంత్రిత్వ శాఖకు మాత్రం దీని ప్రతిపాదనలు పట్టించుకునే తీరికా లేదు.. ఓపికా లేదు.. మన ఎంపిలకు రైలు మంత్రిని అడిగే సత్తా అంతకంటే లేదు... దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటి గ్రేటర్ హైదరాబాద్.. దక్షిణమధ్య రైల్వేకు కేంద్ర స్థానం సికిందరాబాద్.. రైల్వేలకు అత్యధిక ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న జోన్ దక్షిణ మధ్య రైల్వే.. రోజూ లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తోడ్పడుతున్న స్టేషన్... దక్షిణాదిలో అతి పెద్దరైల్వే స్టేషన్లలో ఒకటైన సికిందరాబాద్.. స్టేషన్ వివక్షకు గురి అయినంతగా మరే స్టేషనూ కాలేదేమో... ఇంత కీలకమైన స్టేషన్ విషయంలో రైల్వే శాఖ ఎప్పటికప్పుడు వాగ్దానాలు చేయటం తప్ప నిర్మాణాత్మకంగా చేసింది ఏమీ లేదు. 4వేల కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మించటం, హోటళు్ల, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్‌స, బ్యాంకులు, ఎటిఎంల వంటి సదుపాయాలతో స్టేషన్‌ను ఆధునీకరించాలని ప్రతిపాదించారు. అధిక భాగం ప్రైవేటు భాగస్వామ్యంతోనే దీన్ని పూర్తి చేయాలనీ అనుకున్నారు. ఇందుకోసం సర్వే కూడా పూర్తయింది. కానీ, బడ్జెట్ కేటాయింపుల దగ్గరకు వచ్చేసరికి సదరు మంత్రులు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారు. భద్రతా చర్యల విషయంలోనైనా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదు. విమానాశ్రయాల్లో మాదిరిగా సికిందరాబాద్ స్టేషన్‌లోనూ బ్యాగేజీ స్కానర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మరి కొన్ని భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. అదీ లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు తమకేమీ పట్టనట్లు వ్యవహరించటం పెద్ద సమస్య. దీనివల్లే అంతర్జాతీయ స్థాయిగా ఎదుగుతుందనుకున్న సికిందరాబాద్ స్టేషన్ జాతీయ స్థాయి సౌకర్యాలకైనా నోచుకోలేని పరిస్థితి నెలకొంది.
1, జులై 2009, బుధవారం
textail కు దిక్కేది? దక్కేదేమిటి?
బడ్టెట్ నుంచి రాయితీలు దండిగా ఆశిస్తున్న శాఖ textail... గత రెండుమూడేళు్లగా textail ఇండస్ట్రీకి బడ్జెట్‌లో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఈసారి ఈ మంత్రిత్వ శాఖ దయానిధి మారన్ చేతుల్లోకి వెళ్లటంతో ఆయన అనేక ప్రతిపాదనలు చేస్తున్నారు. మరి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వస్త్ర రంగంపై వరాలు కురిపిస్తారా? నిరాశ పరుస్తారా? ఎందుకంటే బడ్జెట్ సీజన్ వచ్చిందంటేనే మిగతా రంగాలతో పాటు వస్త్ర పరిశ్రమ ఆశలు పెట్టుకోవటం సహజం...కానీ ప్రతిసారీ వస్త్ర ప్రరిశ్రమకు మొండిచెయ్యే మిగులుతోంది. దేశంలో వ్యవసాయం తరువాత అతి పెద్ద రంగం వస్త్ర పరిశ్రమ. విదేశాలకు మనం చేస్తున్న ఎగుమతుల్లో textail రంగానిదే పెద్ద పీట. స్థూల జాతీయోత్పత్తిలో textail నాలుగు శాతం అందిస్తోంది. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తిలో 14 శాతం ఈ రంగానిదే. దేశంలోని కార్మిక వర్గంలోనూ 21 శాతం వసా్తల్ర తయారీలోనే ఉన్నారు. ఇక ఎగుమతుల ఆదాయంలో 17 శాతం ఈ రంగం నుంచే మనకు లభిస్తోంది. జూట్ ఉత్పత్తితో కలిసి ప్రపంచ వస్త్ర ఉత్పత్తిలో మన వాటా 12శాతం. ఇంత కీలకమైన శాఖకు ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తుందంటే మాత్రం అంతంత మాత్రమేనని చెప్పాలి. అందునా చేనేత పరిశ్రమలో భారత దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 4.6 మిలియన్ల హాండ్‌లూమ్‌స ఉంటే అందులో 3.9 మిలియన్లు.. అంటే 85 శాంతం మన దేశంలోనే ఉన్నాయి. అత్యధిక మగ్గాలు కూడా కుటీర పరిశ్రమల్లోనే ఉన్నాయి. కార్మికులు కూడా చిన్న మగ్గాలపై నేసేవారి సంఖ్య లక్షల సంఖ్యల్లో ఉంటుంది. ఉదాహరణకు మన రాష్ట్రంలోనే చేనేత కార్మికుల సంఖ్య అధికం. ఒక్క సిరిసిల్లలోనే లక్షమంది జనాభా ఉంటే, అందులో 90 శాతం మంది చేనేత మగ్గాలపైనే జీవితాల్ని గడుపుతున్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు ప్రారంభమైన తరువాత అప్పటిదాకా ఎగుమతుల విషయంలో అప్పటిదాకా అమల్లో ఉన్న కోటా పద్ధతిని ఎత్తివేశారు. అప్పటి నుంచి కొంత వరకు textail ఎగుమతులు మెరుగుపడిన మాట వాస్తవమే. ప్రత్యేకించి చేనేత వసా్తల్ర ఎగుమతులు 3.17 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెడీమెడ్ వసా్తల్ర ఎగుమతులూ పెరిగాయి. దాదాపు 15 బిలియన్ డాలర్ల వ్యాపారం వస్త్ర రంగం విదేశాలతో చేస్తోంది. కానీ, ఆసియా మార్కెట్ వాటాలో చైనా సింహభాగాన్ని కొట్టేసింది. దీనికి తోడు ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం దేశంలో వస్త్ర పరిశ్రమను కునారిల్లేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమను ప్రణబ్ ముఖర్జీ ఏ విధంగా ఆదుకుంటారో చూడాలి. వాస్తవానికి గత ఫిబ్రవరిలోనే కొన్ని పన్నులు తగ్గించాలంటూ టెక్సటైల్ ఇండస్ట్రీ ప్రభుత్వాన్ని కోరింది. కానీ మన్మోహన్ సర్కారు అంతగా కనికరించలేదు. అప్పుడు ఓట్ ఆన్ అక్కౌంట్ అని సర్దిపెట్టుకున్నా, ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి ప్రణబ్ బాబూ కొన్ని వరాలైనా ఇస్తారని ఇండస్ట్రీ కోరుకుంటోంది. డ్యూటీ డ్రా బ్యాక్.. డిడిబి, డ్యూటీ ఎన్‌టైటిల్‌మెంట్ పాస్‌బుక్ రేట్లను పునరుద్ధరించాలని textail ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. ఎగుమతి సంబంధిత సేవలపై సర్వీసు టాక్‌సను వెనక్కి చెల్లించాలని textail ఎక్‌సపోర్‌ట కౌన్సిల్ డిమాండ్ చేస్తోంది. దేశంలో కొత్త ఫైబర్ పాలసీని రూపొందించాలని జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్ భావిస్తున్నారు. దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతర్జాతీయ మార్కెట్ షేర్‌లో చైనా వాటా 12 శాతం నుంచి 17 శాతానికి పెరిగితే, మన వాటా తగ్గిపోతోంది. అటు పాకిస్తాన్ కూడా మనతో పోటీ పడుతోంది. ఆర్ అండ్ డి రిబేట్ 7.5 శాతం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎగుమతుల ద్వారా గ్లోబల్ మార్కెట్ వాటాను పెంచుకోవటానికి ప్రణబ్ ఎలాంటి ఉపాయాలు సూచిస్తారో తెలియదు..అంతే కాకుండా డొమెస్టిక్ మార్కెట్‌లో కూడా వాణిజ్యాన్ని పెంచటం కూడా ప్రణబ్ ముందున్న పెద్ద సవాలు.. అంతకు మించి మన రాష్ట్రంతో పాటు దేశంలో చితికి పోతున్న చేనేత కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకోవటానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కూడా చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న డిమాండ్.... దీన్ని ఎంతవరకు తీరుస్తారో చూడాలి. జౌళి మంత్రి దయానిధి మారన్ మాత్రం ఆర్థికమంత్రి ప్రణబ్‌పై బోలెడు ఆశలు పెట్టుకుని వందరోజుల అజెండాను కూడా ప్రకటించేశారు..మరి...
బడ్జెట్‌బ్రహ్మపదార్థమా? బడ్జెట్ అంటే మీకేం తెలుసు...?
మళ్లీ బడ్జెట్ సీజన్ వచ్చేసింది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో మాత్రమే వచ్చే బడ్జెట్ సీజన్ ఈసారి రెండుసార్లు వచ్చింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగటం వల్ల ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడ్తున్నారు... అప్పుడే హడావుడి మొదలైంది. ఎక్కడ చూసినా బడ్జెట్ చర్చే జరుగుతోంది. ఇంతకీ ఏమిటి ఈ బడ్జెట్? బడ్జెట్‌లో ఏ యే వివరాలు ఉంటాయి? నిజానికి దీని గురించి దేశంలో ఎంతమందికి అవగాహన ఉంది? కేవలం జమా ఖర్చుల వివరాలేనా? మరేదైనా మతలబు ఉందా? బడ్జెట్ అనగానే మామూలు ప్రజలకు అర్థమయ్యేది ఒకే ఒక్కటి.. ధరలు.. ఏ వస్తువు ధర పెరిగింది? ఏ వస్తువు ధర తగ్గింది? రైతులకైతే.. అప్పులేమైనా మాఫీ చేస్తున్నారా? విత్తనాలపై సబ్సిడీ ఇస్తున్నారా అనేదే తెలుస్తుంది. ఇక ఉద్యోగుస్థులైతే ఇన్‌కమ్‌టాక్‌స పరిమితి ఏమైనా పెంచారా? లేదా? అన్నది తెలుసుకుంటే చాలనుకుంటారు.. బడ్జెట్ అంటే ఇంతేనా? ఇంకేమైనా ఉందా? అంటే బోలెడు ఉందనే చెప్పాలి.. అంతా అనుకున్నట్లు బడ్జెట్ బ్రహ్మపదార్థమేం కాదు.. కొంత మనసు పెట్టి గమనిస్తే.. చాలా తేలిగ్గా అర్థమవుతుంది...
ప్రతి వ్రభుత్వానికి ప్రజల పట్ల తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించటానికి మానవ వనరులతో పాటు ఆర్థిక వనరుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చుల కోసం పన్నులు, సుంకాలు, సెస్‌లు, అప్పులు ఇతర రూపాలలో నిధులు సమీకరిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం పార్లమెంటులో వార్షిక ఆర్థిక ప్రతిపాదనలు చేసి ఆమోదం పొందుతుంది. సదరు ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రతిపాదనలనే ఆమలు చేస్తారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఖర్చు చేయాల్సి ఉంటుంది.రాజ్యాంగంలోని 112 వ అధికరణం ప్రకారం రాష్టప్రతి పేరు మీదుగా ఆర్థిక సంవత్సరపు వార్షిక స్టేట్‌మెంట్ తయారవుతుంది. అయితే దాన్ని తయారు చేసే బాధ్యత 77(3)వ అధికరణం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రిపై ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్‌కే బడ్జెట్ అని పేరు.కేంద్ర ఆర్థిక మంత్రి జనరల్ బడ్జెట్‌తో పాటు రాష్టప్రతి పాలన అమల్లో ఉన్న రాషా్టల్ర బడ్జెట్ కూడా పార్లమెంటులో ప్రవేశపెడతారు.
బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకునే విభాగాలు...విధులు* కేంద్ర ప్రణాళికా సంఘం...అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది ఓవరాల్ టార్గెట్‌లను నిర్దేశిస్తుంది. * కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్...(కాగ్)అక్కౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. నిఘా వేస్తుంది. * అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్.. ప్రణాళికా ప్రాధాన్యాలను నిర్ణయించేముందు ఆర్థిక మంత్రి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్ విభాగాన్ని తప్పక సంప్రతిస్తారు. * వ్యయం.. ఖర్చుకు సంబంధించిన రెవెన్యూ విభాగం...*నాన్‌టాక్‌స ఆర్థిక వ్యవహారాల విభాగం*పన్నులు రెవెన్యూ విభాగం*లోటుఆర్థిక వ్యవహారాల విభాగం
నిజానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రక్రియ సెప్టెంబర్‌లోనే ప్రారంభమవుతుంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అన్ని మంత్రిత్వ శాఖలకు, రాషా్టల్రకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, వివిధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శాఖలకు బడ్జెట్ సర్కు్యలర్ విడుదల చేయటంతో ప్రారంభమవుతుంది. ఆయా విభాగాలు, రాషా్టల్రు నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి తమ అంచనాలను సవరించుకోవటంతో పాటు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి తమ ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు పంపిస్తాయి. ఈ ప్రతిపాదనలన్నీ అందిన తరువాత అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీస్, ఇతర కీలక విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తుంది. అవసరమైన వ్యయ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దేశంలోని వివిధ వర్గాల నుంచి తమకు లభించే ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంది. వ్యవసాయం, రైతులు, కార్మికులు, సామాజిక వర్గాల నుంచి వచ్చే ఆదాయాలను బేరీజు వేస్తుంది. ఆదాయ వనరుల సమీకరణ ఎలా చేయాలో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో రెవిన్యూ విభాగంతో సంప్రతించి ప్రతిపాదనలు రెడీ చేస్తారు...ఆ తరువాత ఖర్చుల అంచనాలను తయారు చేస్తారు. ప్రీ బడ్జెట్ మీటింగ్‌లు అయిపోయిన తరువాత స్టేట్‌మెంట్ బడ్జెట్ ఎస్టిమేట్‌సను బడ్జెట్ డివిజన్‌కు పంపిస్తారు. అక్కడ తుది పన్నుల ప్రతిపాదనలు తయారవుతాయి. ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి వీటికి తుదిరూపాన్ని ఇస్తారు.....చివరకు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం తయారవుతుంది. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో సాధారణ ఆర్థిక వ్యవహారాలు, విధాన ప్రకటనలు ఉంటాయి. రెండో భాగంలో వివిధ రకాల పన్నుల గురించిన ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత రాజ్యసభలోనూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే లోక్‌సభ దానిపై చర్చ ప్రారంభిస్తుంది. సభ్యుల సూచనలు సలహాలు తీసుకున్న తరువాత ఆర్థిక మంత్రి జవాబిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలపై ఓటింగ్ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో పార్లమెంటు దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఓడిపోతే.. రాజీనామా చేయాల్సి ఉంటుంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)