దసరా సందర్భంగా
అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనము్మల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్
అని బమ్మెర పోతనామాత్యుడు పరాత్పర అయిన ఆ ఆదిశక్తిని ఆరాధించాడు. భారతీయ ఆధ్యాత్మిక భావ భూమిక మహాశక్తి ప్రాతిపదికనే ఏర్పడింది. ఈ విశ్వంలో సమస్త సృష్టికి ఆమెయే చైతన్యం. ఆమెయే బుద్ధి, ఆమెయే నిద్ర.. మూల ప్రకృతి స్వరూపిణి ఆమె. త్రిమూర్తులైన సృష్టి, స్థితి, లయకారకులకు అమ్మవారే ఆలంబన. ఆమె శక్తి.. ఆమే సంపద.. ఆమే విద్య. దశమహా విద్యలకు అధిదేవత ఆమె. మృత్యువుకు, జరామరణాలకు అందనంత ఎత్తులో, అనంతమైన ఆనందామృత స్థితికి ఆమె అధినాయిక. రామాయణ, మహాభారతాలకు స్త్రీమూర్తే కేంద్ర బిందువై దుష్ట శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించింది. మహిషాసుర, నరకాసురాది అసుర శక్తుల సంహార విధుల్ని నిర్వర్తించింది. మన దేశంలో శక్తి స్వరూపిణి అయిన స్త్రీమూర్తిని ఆరాధించడం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అనేక స్థాయిల్లో, అనేక దశల్లో, అనేక రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. అధోలోకం నుంచి ఊర్ధ్వలోకాల దాకా అనేక అంశల్లో అమ్మవారు పూజలందుకుంటుంటారు. తెలంగాణ ప్రాంతంలో చెరువు కట్టల వద్ద నెలకొన్న కట్టమైసమ్మ, గండి మైసమ్మ రూపాల నుంచి.. వారణాసిలో అన్నపూర్ణాదేవి వరకూ అనేక రూపాలలో అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న దేవీ ఆలయాల్లో మైసూరు సమీపంలోని చాముండేశ్వరీ దేవి ఆలయం మూర్తీభవించిన మహా శక్తి తత్తా్వనికి ప్రతీక. మైసూరు మహారాజా వారి రాజమందిరానికి, దసరా ఉత్సవాలకు మాత్రమే ప్రఖ్యాతి కాదు.. అంతకుమించి ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. మైసూరుకు సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో ఎతై్తన కొండపై చాముండేశ్వరి దేవాలయం విరాజిల్లుతోంది. ఈ కొండ సైతం అమ్మవారి పేరుతోనే సార్థకమైంది. మైసూరు పట్టణం నుంచి చాముండి కొండవైపు చూస్తే అత్యద్భుతంగా కనిపిస్తుంది. మైసూరు సంస్థానాన్ని పరిపాలించిన మహారాజులంతా ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి పరిచారు. దాదాపు వెయ్యి సంవత్సరాల ప్రాచీనమైనదైన ఈ ఆలయానికి 1794-1860 వరకు మైసూరును పాలించిన కృష్ణరాజ వొడియార్ అమ్మవారికి మహారాజ గోపుర నిర్మాణాన్ని గావించారు. ద్రవిడ సంప్రదాయం ప్రకారం నిర్మించిన ఈ గోపురం సుమారు నలభై అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు వేల అడుగులకు మించిన ఎత్తుండటం వల్ల చాముండి కొండ మైసూరు పట్టణానికే తలమానికంగా నిలిచింది. కాలిబాటన వెళ్లాలంటే ఈ కొండకు అక్షరాలా వెయ్యి మెట్లు ఎక్కాలి. గుడికి వెళ్లడానికి ఘాట్‌రోడ్డును కూడా నిర్మించారు. వెండి తొడుగుతో నిర్మించిన చాముండేశ్వరీదేవి ఆలయ ప్రధాన ద్వారంపై అమ్మవారి వివిధ అంశలు, పౌరాణిక గాధల చిత్రాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఇక గర్భగుడి సంగతి చూడాల్సిందే తప్ప వర్ణించడం సాధ్యం కాదు. మొత్తం పసిడి కాంతులు వెదజల్లుతుండే అమ్మవారి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. సాక్షాత్తు ఆదిశక్తి స్వయంభువుగా వెలసిన క్షేత్రం కాబట్టి గర్భగుడిలో ప్రవేశించగానే ఆమె ఆప్యాయంగా భక్తులను పలుకరిస్తుంది. ఆమె ప్రసన్న దృక్కులు భక్తుల మనసులను పరిశుద్ధి చేస్తాయి. ఆ కాలంలో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజించారు. ఆలయ సమీపంలో అతి పెద్ద మహిషాసురుడి విగ్రహం సైతం కనిపిస్తుంది. ఈ కొండపైనే మహిషాసురుని అమ్మవారు వధించారని స్థల పురాణం చెప్తుంది. మైసూరు పట్టణమే శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందంటే అందుకు కారణం చాముండేశ్వరి దేవి అనుగ్రహమే. అంతేకాదు.. ఇక్కడ శివకేశవులకు కూడా ఎలాంటి భేదం లేకుండా పూజలు జరుగుతాయి. శివుడిని మహాబలేశ్వరుడిగా, విష్ణువును నారాయణుడిగా పూజిస్తారు. ఆలయానికి వెళు్తంటే మార్గమధ్యంలో మహా నందీశ్వరుడి విగ్రహం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు అయిదు మీటర్ల ఎత్తు, ఎనిమిది మీటర్ల పొడవున్న గొప్ప విగ్రహం ఇది. ఇది పేరుకు విగ్రహమే అయినా, సజీవంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే, ఈ విధంగా జీవంతం చేయడమే అని చెప్పవచ్చు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, మన రాష్ట్రంలోని లేపాక్షి ఆలయంలోని నందీశ్వరులతో సమాన స్థాయిలో ఉన్న బృహన్నంది ఇది.
ఈ కొండకు దక్షిణం వైపున మార్కండేశ ముని ఆశ్రమం ఎంతో ప్రశాంత వాతావరణంలో మనకు కనిపిస్తుంది. దీనికి సమీపంలో జ్వాలాముఖి త్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ కొండపైన ఎప్పటికీ నిండుకోని పవిత్ర జలాశయాలు రెండు ఉన్నాయి. ఒకటి దేవ గంగ కాగా.. మరొకటి పాతాళ వాహిని. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఈ రెంటిలో పవిత్ర స్నానాలు చేస్తారు.
ఈ ఆలయ సందర్శనం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. ఎతై్తన కొండపై అంతకంటే ఎత్తున, అద్భుత నిర్మాణ రీతిలో అలరారే ఆలయాన్ని చూడటానికి వేయి కన్నులు చాలవు.
28, సెప్టెంబర్ 2009, సోమవారం
27, సెప్టెంబర్ 2009, ఆదివారం
ఆరని రుధిరజ్వాల భగత్‌సింగ్....
నేడు భగత్‌సింగ్ జయంతి
ఒక వీరుడి మరణం.. శత యోధుల జననం..వీరుడి మరణంతోనే అతడి చరిత్ర అంతం కాబోదు... అతడి శరీరం నుంచి చిందిన వెచ్చని నెత్తుటి చుక్క ఒక్కొక్కటి ఒక్కో వీరుడికి ఊపిరి పోస్తుంది... ఆ రక్తపు చుక్కల్లోని వేడి ఎన్నటికీ చల్లారదు.. ఆ మృత వీరుడి శరీరంలోని సత్తువ ఎప్పటికీ వ్యర్థం కాదు.. అతడిలో ఉన్న కసి వెయ్యింతలై శత్రువుపై పోరాడుతుంది. ఆ వీరుడు భగత్ సింగ్... ఆ రక్తం రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష... ఆ సత్తువ ఉవ్వెత్తున ఎగిసిపడే యువకెరటం...
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షలాది మంది పాల్గొన్నారు... ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడారు.. బ్రిటిష్ వారి దురాగతాలకు బలైపోయారు... ఉరికొయ్యలను సంతోషంగా ముద్దాడారు... కానీ వారందరిలో ఓ చిన్న కుర్రాడు... నూనూగు మీసాలైనా రాని 22 ఏళ్ల యువకుడు యావత్ జాతి దృష్టిని ఎలా మళ్లించాడు..? కనుమరుగై ఎనభై సంవత్సరాల తరువాత ఈరోజుకు కూడా జాతికి ఎలా ప్రేరణ అవుతున్నాడు?
దాదాపు వందేళ్ల స్వాతంత్య్ర సంగ్రామంలో అతనిది చాలా చిన్న పాత్ర... పట్టుమని పది సంవత్సరాలైనా లేని పోరాట చరిత్ర అతనిది... ఆ స్వల్పకాలమే అతనికి సరిపోయింది. దొంగల్లా వచ్చిన తెల్ల దొరలను నిలువెల్లా వణికించటానికి... దేశంలోని విప్లవకారులందరికీ మకుటాయమానంగా నిలవటానికి అతనికి ఆ కొద్ది సమయమే సరిపోయింది. అతణ్ణి ఒక్క క్షణం బతకనిస్తే... తమ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించివేస్తారన్న భయాన్ని బ్రిటిష్ పాలకుల్లో కలిగేలా చేసిన విప్లవ జ్యోతి అతడు.. 22 సంవత్సరాల చిన్న జీవితంలో యావజ్జాతిలో స్వాతంత్య్ర జ్వాలను రగిలించిన వీరుడు... భగత్ సింగ్.....
===============================
మనల్ని చీల్చుకుని వెళ్లిపోయిన ఇవాళ్టి పాకిస్తాన్‌లో ఓ రాష్ట్రం పంజాబ్.... ఇందులోని లాయల్‌పూర్ జిల్లా ఖట్‌కర్ కలాన్ గ్రామంలో సాధారణ సంధూ జాట్ కుటుంబంలో 1907 సెప్టెంబర్ 27న భగత్‌సింగ్ అనే వెలుగు మొలక మొగ్గ తొడిగింది. ఈ మొలకే అనతికాలంలో మహా విప్లవ జ్వాలగా పరిణమిస్తుందని తండ్రి కిషన్‌సింగ్ సంధూ కానీ, తల్లి విద్యావతి కానీ ఎంతవరకు ఊహించారో తెలియదు.. కానీ, స్వాతంత్య్ర పోరాటంలో వారి వారసత్వాన్ని అంత త్వరగా అందిపుచ్చుకుంటాడని మాత్రం ఊహించి ఉండరు...
కానీ అదే జరిగింది. భగత్‌సింగ్ తాతగారు అర్జున్‌సింగ్, ఆర్యసంస్కర్త స్వామి దయానంద సరస్వతి అనుయాయి. ఆర్యసమాజం ద్వారా జాతీయోద్యమంలో పాల్గొన్న వ్యక్తి.. ఇక కిషన్‌సింగ్, అతని ఇద్దరు బావలు అజిత్‌సింగ్, స్వరణ్‌జిత్ సింగ్‌లు అంతా గధర్ పార్టీ సభ్యులే... భారత దేశాన్ని బ్రిటిష్ వారి నుంచి విముక్తం చేయటం కోసం అమెరికా, కెనడాల్లోని భారతీయులు స్థాపించిన విప్లవ సంస్థ ఇది. ఇది స్వాతంత్య్రోద్యమంలో రహస్య కార్యకలాపాలను కూడా నిర్వహించింది. ఈ సంస్థలో భగత్ సింగ్ కుటుంబ పెద్దలు సభ్యులు కావటం విశేషం... 1925లో కాకోరీ రైలు దోపిడీ కేసులో స్వరణ్‌జిత్‌సింగ్‌ను దోషిగా నిర్ధారించి 1927లో ఉరితీశారు...
తన మామను ఉరి తీసిన తరువాతి క్షణం నుంచీ భగత్‌సింగ్‌లో విప్లవ భావాలు మరింత వేగంగా పెరిగాయి. అంతకు ముందు సింగ్ తోటి విద్యార్థుల్లా ఖల్సా హైస్కూల్‌లో చేరలేదు.. బ్రిటిష్ పాలకులకు విధేయులుగా ఉండేందుకు సింగ్ తాత ఒప్పుకోకపోవటంతో భగత్ ఆర్యసమాజ్ వేద విద్యాలయంలో చేరాడు.. అక్కడే చదువుకున్నారు...13వ ఏట భగత్ సింగ్ తొలిసారి మహాత్మాగాంధీ గురించి విన్నాడు.. ఆయన్ను అనుసరించటం ప్రారంభించాడు...బ్రిటిష్ పుస్తకాలను తగులబెట్టడం, బట్టలను తగులబెట్టడం, సహాయ నిరాకరణోద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనటం అన్నీ చేశాడు...స్వాతంత్య్రోద్యమంలో భగత్ సింగ్ వేసిన తొలి అడుగులు అవి.....
======================
1922లో సహాయ నిరాకరణోద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు.. ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్‌లోని చౌరీచౌరాలో రెండువేల మంది ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ప్రారంభించారు...పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.. నిరసనకారులు భయపడకపోగా తిరగబడ్డారు.. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.. పోలీసులు నేరుగా కాల్పులు ప్రారంభించటంతో ఉద్యమకారులు స్టేషన్‌పై దాడి చేసారు.. దాదాపు 22 మంది పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు..
ఈ ఘటనకు చలించిపోయిన మహాత్మాగాంధీ, సహాయ నిరాకరణోద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు.. ఇది భగత్ సింగ్‌ను కలచివేసింది. వేలాది భారతీయులను పొట్టన పెట్టుకున్న బ్రిటిష్ తొత్తులకు చౌరీచౌరాలో వేసిన శిక్ష చాలదని ఆయన భావించాడు.. అతని మార్గం అప్పటి నుంచి మారింది....
==================================
మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో విభేదించిన తరువాత భగత్ సింగ్ పూర్తిగా మార్కి్సస్‌ట భావజాలం వైపు మళ్లాడు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాదిరిగా, హింసామార్గంలోనే స్వాతంత్య్రం సిద్ధిస్తుందన్న విశ్వాసం ఆయనలో క్రమంగా బలపడుతూ వచ్చింది. .
గాంధేయ వాదం నుంచి పక్కకు మళ్లిన భగత్ సింగ్ పూర్తిగా మారిపోయాడు...దీనికి తోడు మామ స్వరణ్‌జిత్ సింగ్ ఉరితీత ఆయన్ను కదిలించింది. అంతే... వెనక్కి తిరిగి చూడలేదు.. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు.. శివరామ్ రాజ్‌గురు, సుఖదేవ్ థాపర్‌లు భగత్ సింగ్‌కు అక్కడే కలిసారు... ముగ్గురూ కలిసి విప్లవ కార్యక్రమాలను అమలు పరిచేవారు...
1928లో భారత్‌లో అప్పటి రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసేందుకు సర్ జాన్ సైమన్‌తో బ్రిటిష్ సర్కారు ఓ కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ దేశమంతటా నిరసనలు మిన్నుముట్టాయి. సైమన్ గోబ్యాక్ అంటూ సమర యోధులు నినదించారు...మన రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు వంటివారు పోలీసు తుపాకీ గుండుకు ఎదురుగా గుండె నిలిపారు..లాహోర్‌లో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు లాలా లజపతిరాయ్ నిరసనకు నాయకత్వం వహించారు.. ఆయనపై పోలీసులు లాఠీ ఝళిపించారు.. తీవ్ర గాయాలతో లాలా కన్నుమూశారు.. ఈ ఘటనకు భగత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి...
ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ నిశ్చయించుకున్నాడు.. లాలాను చిత్రహింసల పాల్జేసిన పోలీస్ ఛీఫ్ స్కాట్‌ను కాల్చి చంపాలని ప్లాన్ వేశారు.. సుఖ్‌దేవ్, రాజ్‌గురులు ఆయనకు సహకరించారు.. కానీ, అనుకున్నదొకటి అయింది ఇంకొకటి...స్కాట్‌ను కాల్చాలని అనుకున్న వీరులు గుర్తించటంలో పొరపాటు పడి డిఎస్‌పి జెపి సాండర్‌సను కాల్చారు.. వెంటనే పోలీసులకు చిక్కకుండా పారిపోయి, సిక్కు మతానికి వ్యతిరేకమే అయినా, గడ్డం తీసివేసి, పాగా తీసి, టోపీ పెట్టుకుని కొత్త వేషం ధరించాడు భగత్‌సింగ్....
1929లో బ్రిటిష్ ప్రభుత్వం పోలీసులకు అపరిమిత అధికారాలను కట్టబెడుతూ డిఫెన్‌స ఆఫ్ ఇండియా యాక్‌టను తీసుకురావటం భగత్‌సింగ్ సహించలేకపోయాడు... ఇలాంటి చట్టాలు ఎన్ని తీసుకువచ్చినా విప్లవకారులను అణచివేయటం సాధ్యం కాదని తెల్లదొరలకు తెలిసేలా చేయాలనుకున్నాడు..అంతే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు వేయాలని నిర్ణయించుకున్నాడు.. తన మిత్రుడు భుక్తేశ్వర్ దత్‌తో కలిసి బాంబు వేసే పథకం రచించాడు.. మరో విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ పోలీసులకు పట్టుబడరాదని వారించాడు.. .. కానీ, భగత్ సింగ్ కావాలనే పట్టుబడాలని నిర్ణయించుకున్నాడు...... తక్కువ తీవ్రత ఉన్న బాంబును 1929 ఏప్రిల్ 29న అసెంబ్లీలో విసిరాడు భగత్... జిన్నాలాంటి ప్రముఖులంతా ఉన్న సమయంలోనే భగత్ బాంబు విసిరాడు.. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. బాంబును కావాలనే జనానికి దూరంగా విసిరాడు భగత్... తాను కావాలనే ఈ పని చేసినట్లు నిర్భయంగా ఒప్పుకున్నాడు... పోలీసులకు దొరికిపోయాడు...
అరెస్టయిన వెంటనే విచారణ ప్రారంభమైంది. దీనికి లాహోర్ కుట్ర కేసుగా పేరు పెట్టారు.. నేరం రుజువైనట్లు అనతికాలంలోనే న్యాయమూర్తులు నిర్ణయించారు.. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు ఉరిశిక్షనూ విధించారు... వారిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు నినదించారు.. కాంగ్రెస్ పైనా, మహాత్మాగాంధీ పైనా భగత్‌సింగ్‌ను విడుదల చేయించాలని ఒత్తిడి పెరిగింది. కానీ, నాడు కాంగ్రెస్ కానీ, గాంధీజీ కానీ భగత్‌సింగ్‌ను కాపాడే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించదు.. ఆ రోజుల్లో గాంధీజీ లేఖ రాస్తే రాజకీయ ఖైదీలను బ్రిటిష్ సర్కారు విడిచిపెట్టేది.. దాదాపు 90 వేల మందిని ఆయన విడిపించారు కూడా.. కానీ భగత్ సింగ్ ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించలేదన్న అపవాదు గాంధీపై ఉంది. పైగా ఎవరినైనా కాపాడటానికి నాకెలాంటి అధికారం లేదు.. దేవుడే అన్నీ నిర్ణయిస్తాడంటూ నిర్లిప్తంగా గాంధీ ఆ తరువాత మాట్లాడినట్లు రికార్డు ఉంది. 1931 మార్చి 20న అంటే ఉరిశిక్ష అమలు చేసేందుకు మూడు రోజుల ముందు భగత్ సింగ్ మిత్రుడు ప్రాణనాథ్ మెహతా క్షమాభిక్ష దరఖాస్తు తీసుకెళ్తే.. విప్లవ జ్యోతి నిర్ద్వంద్వంగా ఖండించాడు... ఎవరినీ ప్రాణాలకోసం వేడుకునేది లేదని తేల్చి చెప్పాడు.. ఆ తరువాత మార్చి 23న ప్రజలంతా గుమికూడకుండానే ఉదయం ఏడు గంటలకు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ ముష్కరులు ఉరితీశారు..ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతోనే ముగ్గురు వీరులూ అమరులయ్యారు...
నిజానికి లాహోర్ జైలు నుంచి తప్పించుకుని వెళ్లేందుకు భగత్‌సింగ్‌కు అవకాశం ఉండింది... కొందరు దేశభక్త పోలీసులు అందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా.. కానీ, భగత్ సింగ్ ఆ పని చేయలేదు.. దేశంలోని మిగతా యువతకు ఆదర్శంగా నిలవాలనుకున్నాడు.. ధృవతారలా నిలిచాడు.. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారినందరినీ మరచిపోతామేమో కానీ, భగత్‌సింగ్‌ను మరవటం భారతీయుడైన ఏ ఒక్కరికీ సాధ్యం అయ్యే పని కాదు...
19, సెప్టెంబర్ 2009, శనివారం
ఉన్మాదమేనా ప్రేమంటే?
ప్రేమ మళ్లీ వెర్రితలలు వేస్తోంది... ప్రేమ పేరుతో ఉన్మాదం విచ్చలవిడిగా పేట్రేగిపోతోంది... ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి... పోలీసులు కౌన్సిలింగ్ చేస్తున్నారు.. మానసిక వైద్యనిపుణులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు... కానీ, ఉన్మాదం జడలు విప్పుకొని నాట్యం చేస్తూనే ఉంది. మొన్న శ్రీలక్ష్మి, నిన్న స్వప్నిక, నేడు అనూష... తమ ప్రేమను తిరస్కరించారని ప్రియులమనుకునే మగాళు్ల... అమ్మాయిలపై అమానుషంగా దాడులు చేయటం హత్యలు చేయటం అడ్డొచ్చిన వాళ్లను చంపేయటం ఇదేనా ప్రేమంటే... ఇది ప్రేమోన్మాదమా? కామోన్మాదమా?
ఆకర్షణ మరోసారి ప్రేమ ముసుగు తొడుక్కుంది... ఆ ప్రేమను వద్దన్న పాపానికి ఓ అమాయకురాలు భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. ఆమెను చంపేందుకు వచ్చిన ప్రబుద్ధుడు.. అడ్డం వచ్చినందుకు అమ్మాయి తల్లిదండ్రులనే చంపేశాడు... ఏమిటీ దారుణం...? ఎందుకీ ఉన్మాదం..? పెడదారి పట్టిన యువత వికృత విశ్వరూపానికి ఇది పరాకాష్ట...
పైశాచిక ప్రేమకు రాజమండ్రిలో మరో అమ్మాయి బలైంది. తన ప్రేమను తిరస్కరించిందంటూ ప్రియురాలు అనూషపై రాజేశ్ అనే ఉన్మాది.. ఆవేశంతో దాడి చేసి దారుణానికి ఒడిగట్టాడు... ప్రియురాలి గొంతు కోశాడు... అడ్డం వచ్చిన తల్లిదండ్రులను అడ్డంగా నరికేశాడు... అనూష ప్రాణాపాయం నుంచి బయటపడిందే కానీ, తనకూ, చెల్లెళ్లకూ ప్రాణాధారమైన తల్లిదండ్రులను మాత్రం ఆమె కోల్పోయింది. ఉన్మాది ఆవేశానికి ఒక కుటుంబం క్షణాల్లో అనాధగా మారిపోయింది...తండ్రి ఆటో నడిపి తెచ్చే సంపాదనే వారికి ఇంతకాలం ఆధారం.. ఇప్పుడు జీవించడమెలాగో కూడా తెలియని పరిస్థితి... ఎందుకిలా జరిగింది? ఎవరీ రాజేశ్... అనూష కుటుంబంపై ఎందుకింత కక్ష కట్టాల్సి వచ్చింది?
అనూష కుటుంబంపై దాడి చేసిన రాజేశ్‌ది కాలేజీ ప్రేమ కాదు.. ఇంకా చెప్పాలంటే రాజేశ్ పెద్దగా చదువుకున్న వాడు కాదు... అసలు అతని కుటుంబం పేద, మధ్యతరగతిలకు మధ్యస్థంగా ఉండే కుటుంబం... బిల్డింగ్ మెటీరియల్ కమిషన్ ఏజెంట్ బాబూరావు కొడుకు ఈ రాజేశ్.... రెండేళ్ల క్రితం వీళ్ల కుటుంబం రాజమండ్రిలోని ఇంటి పైభాగంలో అద్దెకు ఉండేవారు.. అతను చిన్న చిన్న పనులతో కాలక్షేపం తప్ప పెద్దగా చదువుకున్నది లేదు.. కొన్నాళు్ల వీధి వీధి తిరిగి పాలు పోశాడు.. ఆ తరువాత ఓ కొరియర్ సంస్థలో పని చేశాడు.. అనూష వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడే, ఆమెతో రాజేశ్ సన్నిహితంగా మెలిగే వాడు... తాను అతణ్ణి అన్నా అని కూడా సంబోధించినట్లు అనూష చెప్తోంది...
చాలా కాలం పాటు అనూషను ప్రేమిస్తున్నానంటూ రాజేశ్ వేధించటంతో ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. రాజేశ్‌పై పోలీసు కేసు కూడా అమ్మాయి తల్లిదండ్రులు పెట్టారు.. కొంతకాలం లాకప్‌లో కూడా ఉండి వచ్చాడు.. అప్పుడే రాజేశ్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు... బుద్ధి చెప్పారు... మారిపోతాడని భావించి ఇంటికి పంపించేశారు... అటు రాజేశ్ తల్లిదండ్రులు, అనూష తల్లిదండ్రులతో రాజీ కూడా కుదుర్చుకున్నారు... అందులో భాగంగానే అనూష ఇంటిని ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోయారు...
ఆరు నెలలు మామూలుగానే గడిచిపోయాయి. అంతా చక్కగానే ఉందనుకున్నారు.. ఏమైందో తెలియదు.. రాజేశ్ బుర్ర మళ్లీ వెనక్కి తిరిగింది. అనూషకు అదే పనిగా ఫోన్లు చేయటం ప్రారంభించాడు.. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు.. కాలేజీకి వెళు్తంటే వెంటపడి వేధించాడు.. హింసించాడు.. చివరకు మనశ్శాంతి కరవై అనూష మూడు నెలలుగా కాలేజీకి వెళ్లడమే మానేసింది... మళ్లీ పోలీసులను ఆశ్రయిద్దామని అనూష తల్లిదండ్రులకు చెప్పింది... పోనీలే.. వాడి పాపాన వాడు పోతాడంటూ వాళు్ల వ్యవహారాన్ని సాగదీశారు... అమ్మాయికి పెళ్లి చేస్తే పరిస్థితి చక్కబడుతుందనీ అనుకున్నారు.. పెళ్లి సెటిల్ చేశారు కూడా. కానీ ఫలితం లేకపోయింది... రాజేశ్ ఆగ్రహానికి, ఆలోచన లేని ఆవేశానికి తల్లిదండ్రులు బలికావలసి వచ్చింది.
రాజేశ్ ఎందుకిలా మారాడంటే పోలీసులు ఇప్పుడే చెప్పలేమంటున్నారు.. భయపడ్డ రాజేశ్ తల్లిదండ్రులను బంధువులు ఊరు దాటించేశారు.. రాజేశ్ జనం కొట్టిన దెబ్బలకు చావు తప్పి, కన్నులొట్టబొయినట్లు తయారై పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కిస్తున్నాడు...విచిత్రమేమంటే రాజేశ్ కుటుంబంలో ఎవరికీ ఇలాంటి వికృత లక్షణాలు లేవు. అతనికి అక్క, అన్న ఉన్నారు.. కానీ, వాళ్ల జీవితాలేవో.. వాళు్ల గడుపుకుంటున్నారు. రాజేశ్ ఒక్కడికే చిల్లర వేషాలున్నాయి. అయితే అతను రౌడీషీటర్ కాడు.. అతనిపై క్రిమినల్ రికార్డులూ ఏమీ లేవు.. ఉన్న కేసల్లా అనూషను వేధించాడన్నదే.. తనకు కావలసింది దక్కకపోయేసరికి దాన్ని ఎలాగైనా దక్కించుకోవడం కోసం మృగంగా మారిన వ్యక్తి రాజేశ్... అతని మానసిక పరిస్థితి ఉన్మాదంతోనే పూర్తిగా నిండిపోయింది. ఆ ఉన్మాదంలోనే ఇంత ఘాతుకానికి పూనుకున్నాడు...
ఇలాంటి ప్రతి ఘటన జరిగిన తరువాత ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు.. మహిళా సంఘాలు హడావుడి చేస్తూనే ఉన్నాయి. నాలుగు రోజుల తరువాత మర్చిపోతున్నారు... మరో ఘటన జరిగేదాకా దాని ఊసెత్తరు.. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఘటన జరిగింది. మళ్లీ ఈ సంఘాల వాళ్లందరూ ఆందోళనలు ప్రారంభించారు.. హోంమంత్రి కూడా ఈ ఘటనపై స్పందించారు...
ఇలాంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం చట్టాలు చేయగలదు కానీ, ప్రతి మనిషి వెనుకా పోలీసును కాపలా ఉంచటం సాధ్యం కాదు. పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపిస్తున్నారే కానీ, ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను పరిశీలించటం అసాధ్యం.. పిల్లల విషయంలో ఎవరికి వారు వాళ్లకు అవసరమైన వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకోవటం అవసరం... కట్టుబాట్లు లేకుండా పిల్లల్ని పెంచటం, విచ్చలవిడి శృంగారం, నేర ఘటనల ప్రభావం రాజేశ్ లాంటి ఎందరి జీవితాలనో నాశనం చేస్తున్నాయి... ఈ విషయాన్ని పెద్దలు గ్రహిస్తే... పిల్లలు నియంత్రణలో ఉంటారు...
17, సెప్టెంబర్ 2009, గురువారం
అట బొమ్మ తెలంగాణ
నాలుగు వేల మంది అమరవీరుల బలిదానం.. వేలాది ప్రజల త్యాగ ఫలితంగా తెలంగాణకు పదమూడు మాసాలు ఆలస్యంగా స్వతంత్రం వచ్చింది. దురాగతాలు చేసిన నిజాం రాజు భారత యూనియన్‌కు లొంగిపోయాడు.. కాశిం రజ్వీ జైలుపాలయ్యాడు.. తెలంగాణ భారతదేశంలో కలిసిపోయింది కానీ, ప్రజలకు మాత్రం సమస్యలు తీరలేదు... అరాచకం పోయి, రాజకీయం పేరుతో వారికి మరో ముప్పు వచ్చి పడింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అండగా నిలవాల్సిన రాజకీయ ప్రక్రియ.. తెలంగాణా ప్రజలకు మాత్రం పెద్దగా మేలు చేసింది లేదు... వెరసి నాలుగు శతాబ్దాల బానిసత్వం... ఆరు దశాబ్దాల రాజకీయం... తెలంగాణను ఆటబొమ్మగా మార్చాయి...
తెలంగాణ 1
సంవత్సరాల తరబడి నిర్వహించిన పోరాటం... రక్కసిమూక రజాకార్లపై గ్రామగ్రామాన చేసిన తిరుగుబాటు.. వేలాది ప్రజల ఊచకోత... విప్లవవీరుల బలిదానం... తురుపుముక్కగా చివరలో పనిచేసిన పోలీస్ యాక్షన్ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నుంచి విముక్తం చేసింది. భారత స్వాతంత్య్ర సమరానికి ఏమాత్రం తీసిపోని యుద్ధం తెలంగాణ ప్రజలది... దేశంలోనే వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగ ఫలాలు ఇవాళ ఏమయ్యాయి? రాజకీయం మాటున కనుమరుగయ్యాయి...
నియంత నిజాంపై జరిగిన రైతాంగ సాయుధ పోరాటం చరిత్రాత్మకమైంది. మూడు వేల గ్రామాల్లో వందలాది యువకులు ఆయుధాలు పట్టి, నవాబు తొత్తుల్ని తరిమి తరిమి కొట్టారు... వాస్తవానికి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రాథమికంగా నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైంది కాదు... గ్రామాల్లో నిజాం తొత్తులుగా మారిన భూస్వాములను తరిమికొట్టి, భూసంస్కరణల దిశగా ప్రారంభమైన ఉద్యమం అది...వామపక్ష ఉద్యమ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం అత్యంత కీలకమైంది. రష్యా విప్లవ స్ఫూర్తితో, భూస్వాములను, రజాకార్లను ఎదుర్కోవటానికి మొదటిసారి దేశంలో విప్లవ భావాలతో గెరిల్లా యుద్ధానికి నాంది పలికింది కూడా ఈ పోరాటమే... ఎర్ర జెండా రెపరెపల మధ్య కామ్రేడ్‌ల నేతృత్వంలో దేశంలోనే పలు సంస్కరణలకు దారి తీసిన ఉద్యమమూ ఇదే... కమూ్యనిస్టు పార్టీలను జాతీయ స్థాయిలో పతాక స్థాయికి చేర్చింది కూడా రైతాంగ సాయుధ పోరాటమే... ఇప్పటికీ తెలంగాణ ప్రాంతాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయంటే.... అందుకు కారణమూ తెలంగాణ పోరాటమే... సాయుధ పోరాట జ్ఖాపకాలు ఇవాళ్టికీ వామపక్షాలు వీధి వీధినా ఆడుతాయి.. పాడుతాయంటే... వామపక్ష భావజాలాన్ని తెలంగాణ సాయుధ పోరాటం ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు....
భూస్వామ్య వ్యవస్థ నిజాంకు అనుకూలంగా ఉండటం వల్ల తెలంగాణ సాయుధ పోరాటం సహజంగానే నిజాం వ్యతిరేక ఉద్యమంగా మారింది. నిజాం పోలీసుల చేతిలో నాలుగున్నర వేల మంది వీరులు అమరులయ్యారు.. ఉధృతంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటం వల్లనే నాడు భారత యూనియన్ సైన్యం హైదరాబాద్‌కు కదిలింది... నిజాంను పారద్రోలింది... కానీ, ఇక్కడే వామపక్షాల ధోరణి మారిపోయింది. హైదరాబాద్ స్టేట్‌ను నిజాం స్వతంత్రంగా ఉంచాలనుకున్నట్లే... వామపక్షాలూ భావించాయి... స్వతంత్ర భారతావనిలో తెలంగాణాను భాగంగా కలపకుండా.. ప్రత్యేక విముక్తి ప్రాంతంగా ప్రకటించటం వల్ల వామపక్ష ఉద్యమం విజయవంతమవుతుందని భావించాయి. అందుకే అప్పటిదాకా నిజాం సైన్యాలపై పోరాడిన వామపక్ష వీరులు.. తమ తుపాకులను భారత సైన్యంపైనే ఎక్కుపెట్టారు...ఇది నాడే అంత వివాదాస్పదమైంది.
నిజాం సంస్థానంలో వామపక్ష ఉద్యమం సక్సెస్ కావటం వల్లనే వామపక్షాలు నాడు రష్యా, చైనా మాదిరిగా మరో వామపక్ష స్టేట్‌ను సాధించాలని నాటి నేతలు భావించి ఉండవచ్చు... నాడు తెలంగాణ విషయంలో స్వతంత్ర రాజ్యం కావాలంటూ పట్టుబట్టి పోరాటం చేసిన వామపక్షాలు.. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.. సాయుధ పోరాటాన్ని భారత వ్యతిరేక పోరాటంగా చేయాలన్న విషయంపై చీలిక దాకా సాగిన వామపక్ష ప్రస్థానం... ఇప్పుడు కూడా అదే తీరులో కొనసాగుతోంది. తెలంగాణను ప్రత్యేక విముక్తి ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన నాటి సిపిఎం ఇవాళ ప్రత్యేక రాష్టమ్రే అక్కర్లేదని, సమైక్యాంద్ర ముద్దని వాదిస్తోంది. ఇక సిపిఎంతో రాజకీయ పొత్తు కొనసాగిస్తూనే తెలంగాణ ప్రత్యేక రాషా్టన్రికి మొగ్గు చూపిన పార్టీ సిపిఐ... ఉద్యమ బాలో ఇద్దరి దారీ ఒకటే... నిర్ణయాల్లో మాత్రం ఎవరి దారి వారిదే... విచిత్రమేమంటే... ఇదే లెఫ్‌ట తాను నుంచి విడిగా సాయుధ పోరాటం ఇవాళ్టికీ చేస్తున్న మావోయిస్టులు తెలంగాణ ప్రత్యేక రాష్టాన్ని పరోక్షంగా సమర్థిస్తారు... అదే నక్సలైట్ల గ్రూపుల్లో ఒక గ్రూపు జనశక్తికి నేతృత్వం వహించి వెలుపలికి వచ్చిన కూర రాజన్న ప్రత్యేక దేశం అంటారు.. భారత సర్కారు తెలంగాణను దురాక్రమించింది అంటారు... ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు...తెలంగాణను తమ ఆత్మగా వామపక్ష వాదులు భావిస్తారు.. అలాంటి లెఫ్‌టఫ్రంట్‌లో ఈ విషయంలో ఇన్ని వైరుధ్యాలు.. ఇన్ని వైఖరులు.... ఎప్పుడు ఎవరి వైఖరి ఎలా ఉంటుందో తెలియని అయోమయాన్ని నేతలే సృష్టిస్తే ఇక ప్రజల పరిస్థితి ఏమిటి?
తెలంగాణ 2
ఇక తెలంగాణకు సోల్ గుత్తేదార్లమనుకునే నాయకుల సంగతి.... ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఈ నాయకులు ఎటు వైపు తీసుకెళు్తన్నారో తెలియని అయోమయం, సందిగ్ధం ప్రజలను మొదట్నుంచీ వెంటాడుతోంది. నాడు తెలంగాణ ప్రజాసమితి.. నేడు తెలంగాణ రాష్ర్ట సమితి, మధ్యలో వచ్చిన చిన్నా చితకా పార్టీలు మధ్యలోనే వెళ్లిపోయాయి. లేక మరో దాంట్లో విలీనమైపోయాయి... ఉద్యమాన్ని స్థిరంగా, నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళ్లటంలో విఫలం కావటం వల్ల ప్రతిసారీ తెలంగాణ అపహాస్యం పాలవుతోంది...
.....................................................................................
రైతాంగ సాయుధ పోరాటం తరువాత రాషా్టల్ర ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విలీనమైంది కానీ, ఆ అంశం మాత్రం తెరమరుగు కాలేదు.. నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. 1969 నాటికి మర్రి చెన్నారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఆందోళనను రాజకీయంగా హైజాక్ చేశారు. హింసాత్మకంగా మారిన ఆ ఆందోళనలో దాదాపు 360 మంది విద్యార్థులు మరణించారు.... ఆనాడు తెలంగాణ ప్రజలు మర్రిచెన్నారెడ్డిని విశ్వసించారు.. ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాసమితికి బ్రహ్మరథం పట్టారు.. భారీ మెజార్టీతో గెలిపించారు... తెలంగాణను ఎన్నికల అంశంగా వినియోగించుకుని గెలిచిన చెన్నారెడ్డి చల్లగా ఢిల్లీ వెళ్లి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు... అక్కడితో తెలంగాణ ఉద్యమం సశేషంగా మిగిలిపోయింది. 2001 సంవత్సరం చివరి వరకూ కూడా తెలంగాణ గురించి అంత తీవ్రంగా మాట్లాడిన వాళ్లే లేరు...2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్టస్రమితితో కె.చంద్రశేఖర్ రావు ఒక్కసారిగా తెరముందుకు వచ్చారు.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి రాజకీయ రంగస్థలం మీదకు తీసుకువచ్చారు.. ఈ విషయంలో చెన్నారెడ్డి కంటే ఆయన విజయం సాధించారనే చెప్పాలి.. శాంతియుతంగానే అయినా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర రాజకీయ వ్యవస్థను పునాదుల నుంచి కదిలించిందనే చెప్పాలి... ఆంధ్ర పాలకులను వలసవాదులుగా పేర్కొంటూ భావోద్వేగాల్ని రగిలించటంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు..
అయితే విచిత్రమేమంటే ఆయన వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు.. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో టిఆర్‌ఎస్ సీనియర్‌లకే అంతుపట్టదు... తెలంగాణ నిజాం నుంచి విముక్తి పొందినందుకు స్వాతంత్య్ర దినం నిర్వహించాలంటారు... అదే సమయంలో నిజాం గొప్ప రాజని పొగడుతారు... మీరు బ్రిటిష్ వాళ్లను పొగిడితే తప్పులేనప్పుడు మేం నిజాంను కీర్తిస్తే తప్పేంటంటారు...
నిజమే... బ్రిటిష్‌వాడు వాడి ప్రయోజనం కోసం చేసుకున్న కొన్ని పనులు ప్రజలకు మేలు చేసాయి... కాటన్ కావచ్చు... బ్రౌన్ కావచ్చు... మరే బ్రిటిష్ దొర కావచ్చు...అంతమాత్రాన తెల్లవాణ్ణి ఏనాటికీ మనం సమర్థించలేం... అలాగే నిజాం కూడా... ఆయన నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టినంత మాత్రాన రాచరికపు దురాగతాలను ఇక్కడి ప్రజానీకం అంత తేలిగ్గా మర్చిపోగలుగుతుందా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నిజాంను పొగుడుతున్నారు. నిజాం గోరీ దగ్గరకు వెళ్లి ఆయన్ను పొగడటం వెనుక రాజకీయ ప్రయోజనం తప్ప మరేముంది.. అంతేకాదు... సెప్టెంబర్ 17 వచ్చిన వెంటనే టిఆర్‌ఎస్ మొదట చేసే డిమాండ్ అధికారిక ఉత్సవాలు నిర్వహించాలని...
నిజమే... స్వాతంత్య్ర దినంగా చేసుకోవాలన్న డిమాండ్‌పై ఎవరికీ ఆక్షేపణలు ఉండాల్సిన అవసరం లేదు..కానీ, కెసిఆర్ కాంగ్రెస్‌తో అదికారాన్ని కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పంచుకున్నప్పుడు ఏం చేశారు..? యుపిఎ ప్రభుత్వానికి మద్దతునిచ్చేముందు డిఎంకె షరతులు విధించినట్లు తాను విధించి ఉంటే సర్కారు ఒప్పుకుని ఉండేది కాదా? అధికారంలో ఉండి కనీసం తెలంగాణ సమర యోధులకు గుర్తింపును సాధించలేకపోయారు... తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేస్తూనే... కనీసం ప్రాథమిక డిమాండ్లనైనా సాధించలేదు.. అందుకోసం ప్రయత్నించలేదు.. ఇవాళ మీరు ఉత్సవాలు చేయటం లేదంటూ నిందిస్తారు...? ఈ ద్వంద్వనీతి ప్రజల్లో టిఆర్‌ఎస్ పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేయటానికి కారణమవుతోంది....
తెలంగాణ 3
తెలంగాణ విషయంలో మిగతా రాజకీయ పార్టీల సంగతి సరేసరి... కాంగ్రెస్ కర్ర విరక్కూడదు.. పాము చావకూడదన్నట్లు గా వ్యవహరిస్తుంది... తెలుగుదేశం సమైక్యం సమైక్యం అంటూనే ప్రత్యేకం వైపు మళ్లింది... ఇక పిఆర్‌పి.. మీరంతా ఎటు వెళ్తే.. మేమూ అటే వెళ్తామంటుంది... ఇక భారతీయ జనతాపార్టీ రాజకీయం అన్నింటికంటే విభిన్నం....విచిత్రం,,, కాకినాడలో తెలంగాణ అనుకూలంగా తీర్మానం చేసింది... ఆరేళ్ల పాటు అధికారం అనుభవించినప్పుడు తెలంగాణా గుర్తుకైనా రాలేదు.. అదేమంటే తెలుగుదేశం అడ్డంటారు... తరువాత ఎన్నికలు ముంచుకొచ్చేసరికి అద్వానీ చేత వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చేస్తామనిపించింది. పాపం ఆ మాటలు నమ్మే.. అద్వానీ ప్రధాని అవుతారనే కెసిఆర్ నాడు భ్రమపడ్డారు.. ఆ తరువాత వారం రోజులకే నరేంద్రమోడీ హైదరాబాద్ సభ పెడితే...తెలంగాణ పేరు నామమాత్రంగానైనా ఎత్తలేదు..తాజాగా జరిగిన విమోచన దినోత్సవంలో ఆ మాటే ప్రస్తావించకుండా విమోచన దినోత్సవంలో పాల్గొన్నది... రాజకీయ లబ్ధి కోసం తెలంగాణాను ఎంత చక్కగా వినియోగించుకోవచ్చో బిజెపికి బాగా తెలుసు....
ఒక ఓటు రెండు రాషా్టల్రన్న పేరుతో కాకినాడలో తీర్మానం చేసింది మొదలు భారతీయ జనతాపార్టీ తెలంగాణ స్టాండ్ ఓ బ్రహ్మపదార్థంలా మారింది. తాను అధికారంలో ఉన్నంత కాలం తెలుగుదేశం పొత్తు కోసం తెలంగాణ అంశాన్ని అటకెక్కించిన కమలనాథులు మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చేస్తామన్నారు... హామీ మీద హామీ ఇచ్చారు.. అద్వానీ సహా బిజెపి సీనియర్ నాయకులంతా తెలంగాణకు సై అన్నారు.... తెలంగాణ విషయంలో ఎన్నిసార్లు బిజెపి తన వైఖరి మార్చుకుందో లెక్కలేదు... ఇప్పుడు మరోసారి తెలంగాణను అటకెక్కించింది. ఇందుకూ కారణం లేకపోలేదు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తుండటం, జంటనగరాల్లో తెలంగాణేతర ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటమే బిజెపి వైఖరిలో మార్పునకు కారణం. తాజాగా హైదరాబాద్ విమోచన సభలో నలుగురు రాష్ట్ర స్థాయి నాయకులు ప్రసంగించారు... నలుగురు కూడా తమ ప్రసంగాల్లో ఎక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన చేయలేదు... కనీసం నినాదాల్లో కూడా పార్టీ సంప్రదాయ నినాదాలనే వాడుకున్నారు...
తెలంగాణ జిల్లాల్లో మాత్రం బిజెపి నేతలు తెలంగాణ వైఖరికి కొంతవరకైనా కట్టుబడి ఉన్నారు.. ఎందుకంటే వారి రాజకీయ అస్తిత్వం ఈ అంశంతోనే ముడిపడి ఉంది కాబట్టి....
.......................................................................
ఏడాది క్రితం వరకు తెలుగుదేశం వైఖరి సమైక్య నినాదమే... 2009 ఎన్నికలకు ముందే సడన్‌గా పార్టీ తీరు మారిపోయింది. కాంగ్రెస్‌ను ఓడించటమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌తో జత కట్టింది. ఎన్నికల్లో ఫలితం రాకపోవటంతో మళ్లీ తెలంగాణ ఊసెత్తలేదు.. ఇప్పుడు హైదరాబాద్ విమోచనం రోజునే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ గుర్తుకు వచ్చినట్లయింది. అధికారికంగా ఉత్సవాలు జరపాలంటూ డిమాండ్ చేసింది.
......................................................................
ఇక కాంగ్రెస్‌ది విచిత్ర వైఖరి.. తెలంగాణ ఇస్తానంటుందో.. ఇవ్వనంటుందో తెలియదు.. తెలంగాణకు అనుకూలమో కాదో తెలియదు.. సమైక్యమంటారు.. తెలంగాణ అంటారు... రెండో ఎస్సార్సీ అంటారు.. రోశయ్య కమిటీ అంటారు..ఏకాభిప్రాయం అంటారు... ఏదీ తేల్చరు... మళ్లీ అభివృద్ధి మంత్రం పఠిస్తారు... కాంగ్రెస్ ధోరణి చూస్తే ఎవరైనా సరే తల పట్టుకోవలసిందే....

ఇక ఇప్పుడే పుట్టిన పార్టీ ప్రజారాజ్యం ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి అది ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చూపే ప్రభావం తక్కువే.. పార్టీ ప్రారంభం అయినప్పటి నుంచీ అంతా ఓకే అంటే తాను కూడా సై అనే చిరంజీవి అంటున్నారు... ఇప్పుడూ అదే అంటున్నారు... అంతా స్వార్థ రాజకీయాల కోసమే తెలంగాణను వాడుకుంటున్నారనీ వ్యాఖ్యానిస్తున్నారు... పార్టీ బలం మరి కాస్త పెరిగాక ఈ వైఖరిలో ఎలాంటి మార్పు వస్తుందనేది ఇప్పటికి మాత్రం ఊహా జనితమే...
..................................................................
తెలంగాణను అన్ని పార్టీలు తలో రకంగా విశ్లేషిస్తున్నాయి... తలో రకంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. ఎవరికి ఎలాంటి అవసరం వస్తే దానికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఒక అంశాన్ని ఎవరికీ అంతుపట్టని, అర్థం కాని బ్రహ్మపదార్థంగా మార్చేస్తే... అది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగా శాశ్వతంగా మిగిలిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎవరు పడితే వారు.. ఎలా కావలిస్తే అలా వాడుకునే ఆటబొమ్మలా మారుతుంది. దాశరథి మహాకవి తెలంగాణను కోటి రతనాల వీణగా అభివర్ణించారు.. కానీ, ఇవాళ్టి తెలంగాణ ఓ రాజకీయ తోలుబొమ్మలాట మాత్రమే...

16, సెప్టెంబర్ 2009, బుధవారం
తరతరాల బూజు... నిజాం నవాబు..
దురంతాల నిజాం పిశాచపు దుర్మార్గాలు...
రజాకార్ల అరాచకం...అత్యాచారాలు..
అల్లాడిపోయిన హైదరాబాద్ సంస్థానం
విముక్తి కోసం విప్లవోద్యమం...
ఓ పక్క ఆర్యసమాజం, మరో పక్క వామపక్షాలు
సత్యాగ్రహం... సాయుధ పోరాటం...
నిజాంపై సమాంతరంగా సాగిన మహాయుద్ధం...
పోలీస్ యాక్షన్‌తో పిశాచం పరారీ..
జనారణ్యాన్ని వదిలి దెయ్యాల దేశానికి పరారైన శుభదినం...
రాజు ముసుగులో రాక్షసుడు నిజాం నుంచి విముక్తి పొందిన శుభదినం..సెప్టెంబర్ 17... హైదరాబాద్‌కు ముక్తి లభించిన సమయం... నిజాం నేలలో ఆలస్యంగా ఉదయించిన స్వతంత్ర సూర్యుడు...
ఇంకా చదవండి ........
భారత దేశ చరిత్రలో అదొక రక్తసిక్తమైన అధ్యాయం.... దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్ సంస్థానంలో రక్తపుటేర్లు పారాయి. దక్షిణ పాకిస్తాన్‌గా తన్ను తాను ప్రకటించుకోజూసిన నిజాం రక్కసిమూకలు రజాకార్ల పేరుతో మానవ మహా మారణకాండను యథేచ్చగా నిర్వహించాయి. నిజాం నుంచి విముక్తి కోసం వామపక్షాలు సాయుధ పోరాటం ఉద్దృతంగా చేశాయి... దీనికి సమాంతరంగా ఆర్యసమాజం నిజాం పై యుద్ధాన్ని చేసింది. భారత దేశం పదమూడు మాసాల పాటు స్వతంత్ర ఫలాలను అనుభవించిన తరువాత కానీ, నిజాం చెర నుంచి హైదరాబాద్ ముక్తి పొందలేదు.. పోలీసు చర్య ఒక పైశాచిక పాలనకు చరమగీతం పాడింది...
దేశం ముక్కలైనా స్వాతంత్య్రం వచ్చిందే పదివేలంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా సంబరాలు జరుపుకుంటున్నారు... పండిట్ నెహ్రూ జెండా ఎగరేసి భావి భారతం గురించి ఉపన్యసిస్తున్నారు.. కానీ, స్వాతంత్య్రం వెంటే దక్కను పీఠభూమిలో రక్తతర్పణమూ జరిగింది. నిజాం సంస్థానం రక్తసిక్తమైపోయింది. మతోన్మాద నియంత నిజాం దురంతాలు సంస్థానాన్ని ఎరుపుమయం చేసింది. మధ్యయుగపు ఆటవిక మూక... మహా మారణకాండకు ఒడిగట్టింది...
``బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్ల పోతవు కొడుకో... నైజాము సర్కరోడా...'' ఇది అందరికీ సుపరిచితమైన పాటే...
నాజీలను మించిన నిజాం కిరాతకం హైదరాబాద్ సంస్థానాన్ని అతలాకుతలం చేసిన తీరుకు విప్లవ వీరుడు బండి యాదగిరి రాసిన ఈ గీతం నిలువుటద్దం... ఓ పక్క భారత దేశం అంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితేలుతుంటే... నిజాం పాలనలో ఉన్న దాదాపు కోటిన్నర మంది ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.. ఏ క్షణంలో రజాకార్ల రక్షస మూక విరుచుకుపడుతుందో తెలియక భయంతో అల్లాడుతున్నారు.. ఎక్కడ చూసినా వేడిగా పారుతున్న రక్తపు మరకలే కనిపిస్తున్నాయి... సంస్థానంలోని పది జిల్లాల్లో రజాకార్లు విశృంఖలంగా వీర విహారం చేస్తున్నారు.. కనపడ్డ వాళ్లను కనపడ్డట్లు నరికి పారేశారు... కాల్చిపారేశారు.. చెట్లకు కట్టి చిత్రహింసలు చేశారు.. ఆడవాళ్లనైతే అమానుషంగా మానభంగం చేశారు.. సామూహికంగా చెరిచారు.. ముక్కలు ముక్కలు చేసి విసిరేశారు.. ఒక నరహంతక భూతం జడలు విప్పి నాట్యం చేసిన కాలం అది..
ప్రపంచ చరిత్రను రక్తసిక్తం చేసిన సందర్భాలు అనేకం ఉండవచ్చు.. వేలాది మందిని ఊచకోసిన నియంతలనూ మనం చూశాం... కానీ, వారందరినీ తలదన్నేలా అరాచకాన్ని సృష్టించిన నవాబు.. ఏడవ నిజాం... సంస్థానంలో 99శాతం ఉన్న హిందువులను మైనార్టీలోకి మార్చటానికి నిజాం చేయని అకృత్యమంటూ లేదు.. మతోన్మాదం ముదిరిన తీవ్రవాది నిజాం...రజాకార్ల పేరుతో ఓ ప్రైవేటు సైన్యాన్ని రూపొందించిన కాశిం రజ్వీకి తనతో సమానమైన అధికారాలు దఖలుపరచిన పాపం.. నిజాం సంస్థానంలోని సమస్త ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రజల్లో ఆత్మాభిమానం చచ్చిపోయి జీవచ్ఛవాల్లా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ పడితే అక్కడ రజాకార్ల అరాచకం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోయింది. పూలదుకాణాల చాటున, గాజుల దుకాణాల చాటున సాగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు... బతుకుమీద ఆశ ఉన్నవాడెవ్వడూ ఆ దారుణాల గురించి గుసగుసలుగా కూడా మాట్లాడుకునే సాహసం చేయలేదు.. బలవంతపు మతమార్పిళు్ల జరిగాయి. పండిన పంటను ఊడ్చిపెట్టుకెళ్లారు... జనానికి తిండి లేదు.. నీళు్ల లేవు.. బట్ట లేదు.. బతుకే హేయమైపోయిన దుస్థితి... పారిపోదామన్నా ఎక్కడ పట్టుకుని చంపేస్తారేమోనన్న భయం.. కాశింరజ్వీ నాయకత్వంలో ఊళ్లకు ఊళు్ల దోచుకున్నా అడిగే నాథుడు లేడు.. అడ్డు చెప్తే... సామూహిక మారణకాండే...పదుల సంఖ్యలో చంపేసి బావుల్లో పూడ్డిపెట్టిన దుర్మార్గులు రజాకార్లు...
1947లోనైతే... వాడీ నుంచి బయలుదేరిన ఓ రైలును గాండ్లాపూర్ స్టేషన్ వద్ద ఆపేసి అందులోనుంచి మహిళలను దింపి వివస్త్రలను చేసి నగ్నంగా బతుకమ్మను ఆడించిన క్రూరత్వం రజాకార్లది... వందలాది మందిని జైళ్లలో నిర్బంధించి ఏమయ్యారో కూడా తెలియకుండా చంపేసింది నిజాం ప్రభుత్వం... దీనికి మించి భూస్వామ్య వ్యవస్థ పల్లె జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం సంస్థానంలో ప్రజల జీవితం జంతువుల కంటే హీనంగా మారింది..
...............2...............
నాజీని మించిన నిజాం పరిపాలనపై నెమ్మదిగా ప్రారంభమైన ప్రతికూలత క్రమంగా ఉవ్వెత్తున ఎగసింది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ పేరుతో కాశింరజ్వీ తొత్తులు రజాకార్ల దురంతాలను గ్రామాల్లో క్రమంగా ప్రజానీకం ఎదిరించటం ప్రారంభించారు... శాంతియుతంగా మొదలైన నిరసన క్రమంగా సాయుధ పోరాటంగా మారింది... ఓ పక్క కమూ్యనిస్టుల సాయుధ పోరాటం... మరో పక్క ఆర్యసమాజం సత్యాగ్రహోద్యమం, ఇంకో పక్క కాంగ్రెస్ పోరాటం... నిజాంకు వ్యతిరేకంగా ముప్పేట దాడిగా మారిపోయింది. గ్రామాల్లో యువకులతో బృందాలు ఏర్పడ్డాయి. నిజాంకు వ్యతిరేకంగాఆర్యసమాజం తీవ్రస్థాయిలో ఉద్యమం నిర్వహించింది. పండిత నరేంద్ర, విద్యాలంకార్ చంద్రపాల్, శ్యామలరావు, బన్సీలాల్ వంటి వారు తీవ్ర స్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేశారు.. ఆర్యసమాజ్ కార్యకలాపాలను నిజాం నిషేదించాడు.. కార్యకర్తలను అరెస్టు చేశాడు... నిజాం సంస్థానం అంతటా పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు చేశారు... ఇంకోవైపు వామపక్షాలు సాయుధ పోరాటం వైపు మళ్లాయి. నిజాం నిరంకుశ పాలనకు మూలస్తంభాలైన భూస్వాములను తరిమి కొట్టడం కోసం గ్రామాల్లో యువకులు ఆయుధాలు చేపట్టారు.. జైళ్లపాలయ్యారు..
ఇక నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో కాశిం రజ్వీ మూక మరింత ఘోరానికి ఒడిగట్టింది. నిజాంకు వ్యతిరేకంగా సమావేశమయ్యారని రెండు వందల మందిని ఊచకోత కోసింది. ఒక్కొక్కరికి ఒక్కో తూటా వేస్‌ట చేయటమెందుకని, పదిమందిని వరుసగా నిలబెట్టి గుండెల్లో తూటా పేల్చింది. రెండువందల శవాలను గుండ్రాంపల్లి బావిలో వేసి గ్రామస్థుల చేతితోనే పూడ్చిపెట్టింది...
పులిగిల్ల, కొలనుపాక, ఆలేరుల్లో కూడా నిజాం దాష్టీకానికి బలైన వాళ్ళెందరో... ఇక వరంగల్ జిల్లా పరకాల నిజాం దాష్టీకానికి మరో జలియన్ వాలాబాగ్‌గా మారిపోయింది. 1947 సెప్టెంబర్‌లో పట్టపగలు ఒకే చోట 23మందిని ఊచకోత కోసారు...
వరంగల్ జిల్లా బైరాన్‌పల్లిలో రజాకార్లపై తిరుగుబాటు చేసిన ఫలితం 86మంది యువకుల బలి... బైరాన్‌పల్లిలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన దొడ్డి కొమరయ్య అమరవీరుడు... ఇక తెలంగాణలో భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ.... పాలకుర్తిలో నిజాం తొత్తుగా ఉన్న భూస్వామి రామచంద్రారెడ్డి అనుచరులను తరిమికొట్టింది..
నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మారింది. వామపక్షాలు దానికి నాయకత్వం వహించాయి. నిజాం పాలనలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది సాయుధ పోరాటం...
రజాకార్లతో పాటు, జమీన్ దార్ల ప్రైవేటు సైన్యాలతో కూడా పోరాటం జరపాల్సి వచ్చింది. 1947 నాటికి పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. గెరిల్లా యోధులు తయారయ్యారు... ఫలితం,. పది లక్షల ఎకరాలను పంచిపెట్టారు..
నిజాం దురంతానికి చెరమగీతం పాడుతూనే వ్యవసాయ విప్లవ సమస్యను తెరమీదకు తీసుకువచ్చిన ఘనత ప్రతిఘటనోద్యమానికే దక్కుతుంది....నిజాం తరువాత కూడా ప్రభుత్వాలు భూసంస్కరణలు చేపట్టాయంటే, తెలంగాణ సాయుధ పోరాటం ఫలితమే...
3
వీరోచిత రైతాంగ పోరాటంలో దాదాపు నాలుగువేల మంది అమరులయ్యారు... పది వేల మంది జైళ్లలో మగ్గారు.. వామపక్ష యోధులు ఒకవైపు.. ఆర్యసమాజ వీరులు మరోవైపు తీవ్రంగా అణచివేతకు గురైనా యుద్దం ఆగలేదు. దాదాపు సంవత్సరం పాటు భారత ప్రభుత్వం పట్టించుకోలేదు... కానీ, ఉద్యమం తీవ్రమైన కొద్దీ భారత యూనియన్ కదలక తప్పలేదు.. సర్దార్ పటేల్ పూనికతో ప్రారంభమైన సైనిక చర్య అయిదు రోజుల్లోనే నిజాంను కరాచీ దాకా తరిమికొట్టింది...
``భారత స్వాతంత్య్రం వల్ల ఏర్పడే సమస్యల గురించి, పేదల గురించి నేను 1947 జూన్ 12తేదీన్నే చెప్పాను... మళ్లీ 1947 జూలై 14న పబ్లిగ్గా ఉపన్యసించాను.. ఇప్పుడు మళ్లీ అదే చెప్తున్నా.. ఈ నా సంస్థానానికి సంబందించినంత వరకు నేను స్వతంత్ర ప్రభువును.. బ్రిటిష్ వారు ఇంటిదారి పట్టడంతో నేను సంపూర్ణంగా స్వతంత్రుడనైనట్లు ప్రకటిస్తున్నా..'' ఇది నిజాం నవాబు పలికిన బీరాలు.. ఓవైపు తనకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేస్తూనే దక్షిణ పాకిస్తాన్‌గా హైదరాబాద్‌ను మార్చే దుష్ట పన్నాగం పన్నిన వాడు నిజాం... అతడి ఆగడాలను నిరోధించాలన్న ఆలోచన చేయటానికి భారత ప్రభుత్వానికి స్వతంత్రం వచ్చిన తరువాత 13 మాసాలు పట్టింది. వేలమంది అమరులైన సమాచారం అందినా మొదట్లో మీనమేషాలు లెక్కించిన నెహ్రూ సర్కారు.. చివరకు సర్దార్ పటేల్ చొరవతో సైనిక చర్యకు పూనుకుంది. 1948 సెప్టెంబర్ 13న నిజాంపై సైనిక చర్య ప్రారంభమైంది. మొదట్లో బీరాలు పలికిన నిజాం అయిదు రోజుల్లోనే తోకముడిచాడు...సెప్టెంబర్ 17న పటేల్ ముందు మోకరిల్లి, పాకిస్తాన్‌కు పారిపోయాడు..
హైదరాబాద్‌కు విమోచనం అలా లభించింది. భారత యూనియన్‌లో కలిసింది. జీవచ్ఛవాలుగా మారిన ప్రజల కళ్లల్లో మళ్లీ జీవం తొణికిసలాడింది. కానీ, ఇక్కడే తెలంగాణ సాయుధ పోరాటం కొత్త మలుపులు తిరిగింది. ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఉద్యమం ఆర్జించిన లాభం ఎంతో నష్టమూ అంతే...వామపక్ష విప్లవయోధులు నిజాం తొత్తులపై ఎక్కుపెట్టిన తుపాకులను భారత సైన్యం వైపు తిప్పారు... హైదరాబాద్‌ను స్వతంత్రం చేయాలన్న నాటి కమూ్యనిస్టు నాయకుల తలంపు తెలంగాణ యోధులకు నేటికీ గుర్తింపు లేకుండా చేసింది. మిగతా స్వాతంత్య్ర యోధులకు ప్రభుత్వం వల్ల లభించిన ప్రయోజనాలు వీరికి దక్కకుండా పోయాయి. నిజాం పాలిత ప్రాంతాల్లో తాము సాధించిన విజయాలు, తెలంగాణాను భారతావనిలో భాగంగా కాకుండా, ప్రత్యేక విముక్తి ప్రాంతంగా ప్రకటించేలా చేయాలన్న తలంపు వివాదాస్పదమైంది.
కమూ్యనిస్టు నేత నిర్ణయంతో దాదాపు రెండు వేల మంది గెరిల్లా యోధులు 50వేల మంది భారత సైనికులతో పోరాడాల్సి వచ్చింది. వేల మంది డిటెన్షన్ సెంటర్లలో, జైళ్లల్లో భారత సైన్యంపై పోరాటం చేయాల్సి రావటం ఎంతవరకు సమంజసమనే మీమాంస కమూ్యనిస్టుల్లోనే మొదలైంది. ఒక వర్గం పోరాటాన్ని కొనసాగించాలంటే, మరో వర్గం వద్దని వారించటం.. మొత్తం మీద ఉద్యమం నీరుగారిపోయింది.
ఈ కారణంగానే భారత స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు, నిజాం నియంతకు వ్యతిరేకంగా చేసిన పోరాట యోధులు మాత్రం చీకటిమాటునే కనుమరుగు కావలసి వచ్చింది. కమూ్యనిస్టులు చీలిపోవటానికి కారణం ఏదైనప్పటికీ, సామూహిక జనహననానికి కారణమైన నిజాంను ఎదిరించిన వీరులు అన్యాయమైపోయారు..
9, సెప్టెంబర్ 2009, బుధవారం
సంకుల సమరం
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తలపండిన రాజకీయ విశ్లేషకుడికైనా ఒక పట్టాన అర్థం కావు... జాతీయ రాజకీయ సమీకరణల చట్రంలోనే ప్రాంతీయ రాజకీయాలను బేరీజు వేసుకుంటుంది. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎప్పుడు అధికారం అప్పజెప్పాలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వం నిర్ణయానికి ఎవరైనా తలొగ్గాల్సిందే... ఒత్తిళు్ల వచ్చినా, లాబీయింగ్ జరిపినా.. కాంగ్రెస్ నేతృత్వం తాను అనుకున్నదే చేస్తుంది... అయితే మన రాష్ట్రంలో వైఎస్ ఈ పద్ధతిని సమూలంగా మార్చేశారు.. తానే అధిష్ఠానం అన్నంతగా ఎదిగిపోయారు.. ఇప్పుడాయన లేరు.. ఆయన ఉన్నప్పుడు ఓ పక్కగా ఒదిగి ఉన్న పాములన్నీ ఇప్పుడు బుసలు కొడుతున్నాయి... ఈ పరిస్థితిని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎలా హ్యాండిల్ చేస్తారు?
.....
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీది ఓ విభిన్నమైన సంస్కృతి...ఏ చిన్న నిర్ణయానై్ననా అధిష్ఠానం ఆమోద ముద్ర లేకుండా రాష్ట్ర స్థాయిలో తీసుకోవటం ఏ నాయకుడికీ సాధ్యం కాని విషయం... రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే పనిని మరో రాషా్టన్రికి చెందిన నాయకుడికి అప్పజెప్తారు.. నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతాయి.. ఎవరెన్ని లాబీలు నడిపినా అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే సుప్రీం... అసమ్మతులు... అసంతుష్ఠులనూ ఓ పక్క ప్రోత్సహిస్తూనే.. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు చెక్ పెట్టి నడిపించటం కాంగ్రెస్ ప్రత్యేక సై్టల్...
2.
కాంగ్రెస్ పార్టీ అంటే ఓ మహా సముద్రం.. సముద్రంలో అనేక జీవరాశులు ఉన్నట్లే... కాంగ్రెస్‌లోనూ రకరకాల మనస్తత్వాలున్న నేతలు ఉంటారు.. అధికారం, లాబీయింగ్, ముఠాలు, గ్రూపులు, కొట్లాటలు... ఆందోళనలు కాంగ్రెస్ రక్తంలో జీర్ణించుకుపోయిన పదాలు.. అవి లేకుండా ప్రశాంతంగా రాజకీయం నడపడం కాంగ్రెస్ నేతల వల్ల అయ్యేపనే కాదు.. ఏ నాయకుడైనా, ఏదైనా మాట్లాడవచ్చు. ఎవరినైనా నిందించవచ్చు. ఎవరికి వ్యతిరేకంగానైనా గ్రూపులు కట్టవచ్చు... ప్రతి నాయకుడికీ ఆ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది. కుము్మలాటలు ఎనై్ననా అధిష్ఠానం పట్టించుకోదు.. కాంగ్రెస్‌లో ఉండేందుకు ఎవరికైనా ఉండాల్సిన అర్హత ఒక్కటే.. అది నెహ్రూ కుటుంబం పట్ల అపారమైన విధేయత... లాయల్టీ అన్నదే కాంగ్రెస్‌లో నాయకుడు కావటానికి ఏకైక ప్రాతిపదిక... నెహ్రూ కుటుంబం పట్ల, వారి వారసుల పట్ల విధేయంగా ఉంటూనే కాంగ్రెస్‌లో రాజకీయాలు నడపవచ్చు. పార్టీలోని నేతలంతా ఈ రకమైన ధోరణికి అలవాటు పడే ఉంటారు..
అధిష్ఠానం కూడా ప్రాంతీయ స్థాయిలో నాయకులపై ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉంటుంది. మన రాష్ట్ర పార్టీ వ్యవహారాలను కర్ణాటకకు చెందిన వీరప్ప మొయిలీనో.. అంతకు ముందు దిగ్విజయ్ సింగ్ చూసినట్లే.... మరో రాష్ట్రంలో మరొకరు ఆధిపత్యం చెలాయిస్తారు...నేతలంతా పార్టీ అధ్యక్షురాలికో... మొయిలీకో విధేయంగా ఉంటారు తప్ప... పిసిసి అధ్యక్షుడికి ఎంతమాత్రం ఉండరు.. అవసరమైతే ఆయనకే వ్యతిరేకంగా డౌన్‌డౌన్ నినాదాలు చేసేస్తుంటారు..
ఇందిరా గాంధీ హయాం నుంచీ కాంగ్రెస్‌లో ఈ రకమైన సంస్కృతి అధికమైంది... ఆమె అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి కాంగ్రెస్‌లో కుము్మలాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ రెండుగా చీలిక కావటమూ అప్పుడే జరిగింది. పార్టీని పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవటానికి ఇందిరాగాంధీ చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచీ పార్టీని తనదైన సై్టల్‌లో చక్కబెట్టుకొచ్చారు.. తాను తప్ప మరో వాయిస్ లేకుండా చేసుకోగలిగారు.. రాషా్టల్ల్రో ప్రజాదరణ ఉన్న మరో నాయకుడు శక్తిమంతుడు కాకుండా చూడటంలో ఆమె సక్సెస్ అయ్యారు.. రాషా్టల్ల్రో తరచూ ముఖ్యమంత్రులను మార్చే పద్ధతీ ఆమే ప్రారంభించారు.. ఏ ముఖ్యమంత్రి ఎంతకాలం ఆ పదవిలో ఉంటారో తెలియని అభద్రతాభావాన్ని కల్పించి అధిష్ఠానానికి విధేయులుగా ఉండేట్లు చేసుకున్నారు.. పివి నరసింహరావు, జలగం వెంగళరావు, అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్థనరెడ్డి ఎవరూ కూడా పూర్తికాలం ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన వారు కారు.. రాజీవ్ గాంధీ కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తూ వచ్చారు.. ఓ మూ్యజికల్ చైర్ ఆట లాగా సిఎంల మార్పిడి జరుగుతూ వచ్చింది.
కాంగ్రెస్ రాజకీయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ఎలా ఎంపిక చేసుకుంటారో.. ఎలాంటి సమీకణాలను అంచనా వేసుకుంటారో ఒక పట్టాన విశ్లేషించటం సాధ్యం కాదు... మహారాష్టన్రే ఉదాహరణగా తీసుకుంటే... అయిదేళ్ల క్రితం సుశీల్‌కుమార్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లారు.. తీరా ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను ముఖ్యమంత్రిని చేశారు.. నిరుడు ముంబైపై టెరర్రిస్టుల దాడి అనంతరం అప్పటివరకు ఒక సామాన్య మంత్రిగా ఉన్న అశోక్‌చౌహాన్‌ను అనూహ్యంగా తెరమీదకు తీసుకువచ్చి ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెట్టారు.... అశోక్‌చౌహాన్ సిఎం అవుతారని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు... అంతెందుకు రాష్టప్రతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనుకున్నప్పుడు ప్రతిభాపాటిల్ పేరును ఎవరైనా ఊహించారా? లేదు.. అంతెందుకు.. గత ఎన్నికలకు ముందు మన పిసిసి అధ్యక్షుడుగా డి.శ్రీనివాస్‌ను నియమించటం కూడా అనూహ్యమే... ఆయన సోనియాను కలిసి వచ్చేంత వరకూ కూడా ఎవరికీ సమాచారం లేదు.. కాంగ్రెస్ అధిష్ఠానం రాజకీయం సై్టలే అంత...
అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఎలాగూ అనూహ్యం... రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయాలు ముళ్ల పొదలా సంక్లిష్టంగా ఉంటాయి. ముల్లు గుచ్చుకోకుండా లోపలికి చొచ్చుకుపోవటం అసాధ్యమైన పని... అందితే జుట్టు.. అందకపోతే కాళు్ల అన్నట్లుగా కాంగ్రెస్‌లో అనేక మంది నాయకుల తీరు ఉంటుంది. ప్రత్యర్థిని ఎదురుదెబ్బతీయటానికి కాంగ్రెస్‌లో నాయకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.. కేంద్రంలో రాజకీయాలను చక్కబెట్టడం ఒక ఎతె్తైతే... మన రాష్ర్ట రాజకీయాలను గాడిలో ఉంచటం అధిష్ఠానానికి పెద్ద సవాలు... వైఎస్ అంత్యక్రియలకు ముందే పార్టీలో ప్రారంభమైన సంక్షోభం ఇందుకు తార్కాణం.
కాంగ్రెస్‌లో అధిష్ఠానం సర్వాంతర్యామి అనీ, అధినేత్రిని ఎవరూ సవాలు చేయలేరన్న విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు... ఏ నిర్ణయమైనా కాంగ్రెస్‌లో అధినేత్రి ఇష్టానుసారమే జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఇందిరాగాంధీ కాలం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు నిత్యం సంకుల సమరంలాగా ఉండేవి... ఒకరు ఓ మెట్టు ఎక్కితే రెండు మెట్లు కిందకు లాగే వాళు్ల కొల్లలు.. కోరిన నేతకు ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌నే తగులబెట్టిన ప్రబుద్ధులు కాంగ్రెస్‌లో ఉన్నారు.. తమ పార్టీ కార్యాలయాన్ని తామే విధ్వంసం చేసిన కార్యకర్తలున్న కాంగ్రెస్ ఇది.
1989లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి కాంగ్రెస్ మూ్యజికల్ చైర్ రాజకీయాలకు పరాకాష్ట. 1989లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తరువాత రెండేళ్లయినా ఆయన్ను అధికారంలో ఉండనివ్వలేదు.. ఆ తరువాత నేదురుమిల్లి జనార్ధనరెడ్డి సిఎం అయినా అదే పరిస్థితి.. చివరి దశలో కోట్ల విజయభాస్కరరెడ్డి తన చేతుల మీదుగా ఎన్టీరామారావుకు అధికార పీఠాన్ని అప్పజెప్పారు.. అప్పుడు కాంగ్రెస్‌లో అతి పెద్ద అసమ్మతి వాదిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుమోశారు కూడా..... కాంగ్రెస్ యంగ్‌టర్‌కలతో ప్రత్యేక వర్గం ఏర్పాటైంది... పివి నరసింహరావు లాంటి వ్యక్తి కూడా ఆయన్ను పక్కన పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు... అంతకుముందు 1978లో కూడా అయిదేళ్లలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు.. చివరకు కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రులను మార్చే పార్టీగా ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. ప్రభుత్వంలో నిత్యం అస్థిరత నెలకొని ఉండటం, ముఖ్యమంత్రుల్లో అభద్రతాభావం ఉండటం తెలుగుదేశం పార్టీ కి వరంగా మారింది. కాంగ్రెస్‌లో అస్థిరత్వం తెలుగుదేశానికి అప్పనంగా అధికారం వచ్చేలా చేసింది.
వైఎస్ పాదయాత్రతో పదేళ్ల విరామం తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా ఆవేశంతోనే ఉన్నారు.. వెనుకటి దూకుడును కొనసాగించారు..ముఖ్యమంత్రి పదవికి వైఎస్‌తో నాడు పోటీపడిన వారు చాలా మందే ఉన్నారు... అప్పుడు కూడా పిసిసి అధ్యక్షుడుగా ఉన్న డిఎస్‌కూడా రేసులో చాలా దూరమే దూసుకుపోయారు.. కానీ.. వైఎస్ వూ్యహం ఆయన్ను తిరుగులేని నాయకుడుగా నిలబెట్టింది. వైఎస్ తానే అధిష్ఠానం అన్నట్లుగా రాష్ట్రంలో వ్యవహరించారు.. ఆరేళ్ల పాటు అన్నీ తానే అయి నడిపించారు కూడా... అయితే ఇక్కడా అధిష్ఠానం ఆయనకు చెక్ పెట్టిన సందర్భాలు లేకపోలేదు.. అధిష్టానానికి తన వూ్యహాల్ని, ఎత్తుగడలని చెప్పి కన్విన్‌స చేసుకున్న సందర్భాల్లో ఆయన మాట చెల్లింది. అయితే అన్ని సందర్భాల్లో అది జరగలేదన్నది మాత్రం నిర్వివాదం... తన ప్రాణస్నేహితుడు కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ టిక్కెట్ ఇప్పించుకోవటానికి వైఎస్ నాలుగేళు్ల వేచి చూడాల్సి వచ్చింది... ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్ఠానంతో వ్యవహరించటం ఎంతటి నాయకుడికైనా అంత తేలిక కాదు.. అధినేత్రి సోనియాను కలవటమే మహద్భాగ్యంగా భావించే వ్యవస్థ అది. అలాంటి అధినేత్రిని ఒప్పించి, మెప్పించి అధికారాన్ని అందుకోవటం ఆ పార్టీలో ఏ నాయకుడికైనా గొప్ప విజయమే....
3
వైఎస్ జీవించి ఉన్నంత కాలం అధిష్ఠానానికి ఎలాంటి సందిగ్ధత ఎదురుకాలేదు.. వైఎస్ పై పూర్తి నమ్మకంతో రాష్ట్ర రాజకీయాలను అంతగా పట్టించుకోలేదు. వైఎస్ మాటపైనే అంతా నడిచింది. ఇప్పుడు ఇంత సంక్షోభ పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటోంది..? వైఎస్ వారసుడి ఎంపిక చేయటం అధిష్ఠానానికి తలబొప్పి కట్టించటానికి కారణం ఏమిటి?
2004లో వైఎస్ ఓ యుద్ధభూమిలో అడుగుపెట్టినట్లు అధికారంలోకి వచ్చారు.. అప్పుడు కాంగ్రెస్‌లో సీనియర్, జూనియర్ తరమంతా రెట్టించిన ఉత్సాహంతో ఉన్నది. అలాంటి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటానికి వైఎస్ చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ చివరకు రాష్ర్టంలో ప్రత్యామ్నాయమే లేకుండా చేశారు.. ఇప్పుడు అకస్మాత్తుగా వైఎస్ మరణించటంతో కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో వైఎస్‌కు దీటైన నాయకుడు దొరుకుతారా అన్నది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వాన్ని ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న... ఎవరికి వారు సిఎం కుర్చీకోసం లాబీయింగ్ నడుపుకుంటున్నా.. అధ్యక్షురాలు మాత్రం ప్రస్తుతం మౌనాన్నే ఆశ్రయించారు.. ఆమెను కలిసిన నేతలు మాత్రం అంతా అమ్మ ఆదేశాల ప్రకారమే జరుగుతుందని చెప్పుతున్నారు..
వైఎస్ భౌతిక దేహం ఇంకా ఆయన నివాసానికి చేరుకోకముందే వారసుడిగా జగన్‌ను ఎంపిక చేయాలంటూ ఆందోళన ప్రారంభమైందంటే... వైఎస్ అనుచరగణం ఎంత అభద్రతాభావానికి గురైందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు వైఎస్ పార్థివ దేహాన్ని తీసుకువస్తున్న సందర్భంలోనే ఎమ్మెల్యేలు, ఎంపిలు లేక్‌వూ్య గెస్‌టహౌస్‌లో సమావేశాలు పెట్టుకున్నారు.. సంతకాల ఉద్యమం చేపట్టారు.. జగనే మా నాయకుడన్నారు.. ఆయన్నే ముఖ్యమంత్రిని చేయాలన్నారు..
ఓ పక్క క్యాంపు కార్యాలయంలో నివాళులర్పిస్తూనే సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ వ్యవహారంపై పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యతిరేకంగా వ్యాఖ్యానించినందుకు ఆయనపై కార్యకర్తలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు...గాంధీభవన్‌లో సంతాపసభ జరిగినప్పుడు వీరంగం సృష్టించారు.. డిఎస్ మైకు వదిలి వెళ్లిపోయేంతవరకు వదిలిపెట్టలేదు.. దీంతో ఆయన, జానారెడ్డి కలిసి క్యాంప్ ఆఫీసుకు వెళ్లి జగన్‌ను పరామర్శించి రావలసి వచ్చింది. జానారెడ్డి మరో అడుగు ముందుకేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ లేఖ కూడా రాశారు.. జగన్‌కు అనుకూలంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇప్పటికే బలంగా వాదిస్తూ వస్తున్నారు.. సోనియాగాంధీని కలిసి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు....అమ్మదే తుది నిర్ణయమంటూనే... జగన్‌ను సిఎం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు...
జగన్‌ను ఎంపిక చేయడమా లేదా అన్నది ఇప్పుడు అధిష్ఠానం ముందున్న రాజకీయ సమీకరణలపై ఆధారపడి ఉంటుంది. సమీప భవిష్యత్తులో గ్రేటర్ ఎన్నికలు జరుగనున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలూ ముంచుకు వస్తున్నాయి... ఈ నేపథ్యంలో జగన్‌ను సిఎంను చేయటం వల్ల పార్టీకి ఎంతవరకు ప్రయోజనం అన్నది అధినేత్రి ఆలోచిస్తున్న అంశం.. జగన్‌ను కాకుండా మరొకర్ని ఎంపిక చేస్తే... అన్ని వర్గాలను కలుపుకుని పోయి, ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెట్టగల సామర్థ్యం ఎవరికైనా ఉందా? జగన్‌ను సిఎంగా ఎంపిక చేయకపోతే.. తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంతమంది ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సపోర్‌ట చేస్తున్న తరుణంలో జగన్‌ను కాదంటే పార్టీలో చీలిక ఏర్పడే ప్రమాదాన్నీ అధిష్ఠానం సంకోచిస్తోంది. అన్ని పరిణామాలను అంచనా వేసుకున్న తరువాతే సోనియా తుది నిర్ణయానికి రావచ్చని కాంగ్రెస్ నేతలు ఊహిస్తున్నారు.. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, సోనియా నిర్ణయమే తుది నిర్ణయం.. ఆమె నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్లే సాహసం చేయగల సమర్థులు ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో లేరనే చెప్పాలి...

5, సెప్టెంబర్ 2009, శనివారం
రూటు ఎందుకు మారింది?
విఐపిలు ప్రయాణించే హెలికాప్టర్లు తరచూ ఎందుకు ప్రమాదానికి కారణమవుతున్నాయి. రోడ్డుపై ప్రయాణించేప్పుడు జామర్లనీ, పైలట్ కార్లనీ... రకరకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారే.. మరి ఎయిర్ క్రాఫ్‌ట విషయంలో ఎందుకు ఇంత అలసత్వం... లోపం ఎక్కడుంది... ? కొంచెం ముందు జాగ్రత్త తీసుకుని ఉంటే ప్రమాదాల్ని నివారించటం సాధ్యం కాదా? మరి తప్పిదం ఎక్కడ జరుగుతోంది... ? జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగాక... తీరా ఇప్పుడు విచారణలనీ, నివేదికలనీ.. ఎన్ని చేస్తే మాత్రం ఏం ప్రయోజనం?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం మిస్టరీగా మారింది. అనుభవజ్ఞులైన పైలెట్లు... అత్యాధునిక వ్యవస్థ కలిగి ఉన్న హెలికాప్టర్ ఉన్నప్పటికీ, ప్రమాదం ఎందుకు జరిగింది? మామూలుగా వెళ్లాల్సిన రూట్‌లో కాకుండా ఎందుకు దారి మళ్లింది?
వైఎస్ రచ్చబండ కార్యక్రమానికి ఉపయోగించిన హెలికాప్టర్ భెల్ కంపెనీకి చెందింది. ఇది సాధారణ హెలికాప్టర్ కాదు.. పదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడు కొన్నదే అయినప్పటికీ, ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న హెలికాప్టర్... నైట్ విజన్ కెపాసిటీ బ్రహ్మాండంగా ఉన్న చాపర్ అది.. ఒకవేళ ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నా... సునాయాసంగా వెనక్కి మరలే అవకాశం ఉంది. ఇంత సౌకర్యంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ఎందుకు వెనక్కి తిరగలేదు.. తాను వెళ్లాల్సిన రూటులో కాకుండా దారి మళ్లటానికి కారణం ఏమిటి? ఇప్పటి వరకు అధికారులకు అంతుచిక్కని ప్రశ్న ఇది... ముందుగా నిర్ధారించిన ప్రకారం ముఖ్యమంత్రి హెలికాప్టర్ నంద్యాల, బద్వేలు, రేణిగుంట మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉంది. కానీ, ఇది కర్నూలు, నందికొట్కూరు, పాములపాడు, వెలుగోడు మీదుగా ప్రయాణించింది. సాఫీగా సాగే దారిని వదిలి కర్నూలు
మీదుగా నల్లమలలోకి ఎందుకు ప్రవేశించిందనేది అంతుపట్టడం లేదు. దారి తప్పటం వల్లనే ప్రమాదం జరిగిన స్థలాన్ని గుర్తుపట్టడం లేటయింది.
హెలికాప్టర్ కాక్‌పిట్‌లో ప్రయాణించాల్సిన దారి విస్పష్టంగా కనిపిస్తుంది. అయినా రూటు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అత్యంత క్లిష్టపరిస్థితిలోనూ విమానాన్ని నడపగల సామర్థ్యం ఉన్న పైలట్ భాటియా... పొరపాటు పడే చాన్‌స చాలా తక్కువ...
హెలికాప్టర్ కూలిపోక ముందు ఆ ప్రాంతంలో ఆరు చక్కర్లు కొట్టినట్లు స్థానికులంటున్నారు... అంటే పైలెట్లు ముందుగానే ప్రమాదాన్ని ఊహించారా? ఒకవేళ ఊహించి ఉంటే ముఖ్యమంత్రికి ప్రమాదం గురించి చెప్పి ఉండేవారే కదా.. అంతా కలిసి చర్చించి ఏదో ఒక అవకాశాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.. అందులో భాగంగానే దారి మళ్లించారా? ఎక్కడైనా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి సాధ్యం కాక పైకి లేవటం వల్ల కొండను ఢీకొన్నారా? అన్నీ సవ్యంగా ఉండి కూడా ప్రమాదం ఎందుకైందో అర్థం కాక అధికారులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.. కారణాలను తెలుసుకోవటానికి వారి దగ్గరున్న ఆధారం ఒక్కటే.. అది బ్లాక్ బాక్‌స.. ప్రమాదం జరగటానికి 25 గంటల ముందు నుంచీ ఇందులో హెలికాప్టర్ సంభాషణలు రికార్డు అవుతాయి. దీన్ని డీకోడ్ చేస్తే తప్ప ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తేలవు...
ఇప్పుడు ప్రమాదానికి కారణాలు తెలిసేదెలా? విచారణాధికారుల ముందున్న ఒకే ఒక ఆప్షన్ బ్లాక్ బాక్‌స... హెలికాప్టర్ కూలి ముక్కలైనా సరే... సురక్షితంగా ఉండే ఏకైక వస్తువు బ్లాక్ బాక్‌స... ఇందులో రికార్డు అయిన వాయిస్ ద్వారానే ప్రమాదానికి కారణాలు.. చివరి నిమిషంలో చాసర్ ఉన్న పరిస్థితిపై సవివరంగా తెలుసుకునే అవకాశం ఉంది.
బ్లాక్ బాక్‌స... విమానానికైనా, హెలికాప్టర్‌కైనా అత్యంత కీలకమైన పరికరం బ్లాక్ బాక్‌స... వైఎస్ మరణానికి కారణాలు కూడా ఈ బ్లాక్ బాక్సే గుట్టు విప్పాల్సి ఉంది. బ్లాక్ బాక్‌స రెండు భాగాలుగా ఉంటుంది. ఒక మాక్‌స ఫై్లట్‌లో డేటాను రికార్‌డ చేస్తుంది. మరొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. ప్రమాదం సంభవించినప్పుడు, పేలిపోయినప్పుడు దీనికి మాత్రం ఏం జరగదు.. నిప్పలో ఇది కాలదు. ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సమాచారాన్ని తనలో నిక్షిప్తం చేస్తుంది. ఇందులో సేవ్ అయిన సమాచారాన్ని బయటకు తీసేందుకు ప్రత్యేక ఏర్పాటు వేరే ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు అది ఎక్కడ పడిపోయినా, నీటిలో మునిగిపోయినా దాన్ని గుర్తించేందుకు ప్రత్యేక సిగ్నల్‌స వస్తాయి.
ప్రమాదానికి ముందు పైలట్లు, వైఎస్ మాట్లాడుకుని ఉంటే, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో ఖచ్చితంగా నమోదయి ఉంటుంది. ప్రమాదం జరగటానికి ముందు వాతావరణ పరిస్థితిపై ఎటిసికి చివరిగా ఎలాంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేశారో కూడా రికార్డు అవుతుంది. దీన్ని డీకోడ్ చేస్తే ప్రమాదానికి సంబంధించిన వివరాలు తేలిగ్గా తెలుసుకోవచ్చు.
బాక్‌సలో సమాచారాన్ని మార్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు.. దీన్ని విశ్లేషించటానికి కనీసం అయిదు నుంచి ఆరు గంటల సమయం పట్టవచ్చు.
విచారణలో ఫై్లట్ డేటా రికార్డర్‌లో సేవ్ అయిన సమాచారం కూడా ముఖ్యమే కానీ, సివిఆర్‌లోని మెసేజే కీలకం. బేగంపేటలో వైఎస్ హెలికాప్టర్ ప్రయాణించడం మొదలు పెట్టినప్పటి నుంచీ ప్రమాదం జరిగే సమయం వరకూ కూడా హెలికాప్టర్ ప్రయాణిస్తున్న తీరుతెన్నులను ఎఫ్‌డిఆర్ రికార్డు చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ఇంజన్ సామర్థ్యం, ఇంధనం సరఫరా.. అందుబాటులో ఉన్న ఇంధనం, పేలిపోవటానికి ముందు ఎంత ఇంధనం వెలుపలికి వచ్చిందీ... ఈ సమచారం అంతా ఎఫ్‌డిఆర్‌లో నమోదవుతుంది. ప్రమాద సమయంలోనే కాదు.. సాధారణ సమయంలో కూడా హెలికాప్టర్ కాబిన్‌లో, బయట ఎంత ఉష్ణోగ్రత ఉన్నదీ ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సమాచారాన్ని డీకోడ్ చేయాల్సిన బాధ్యత బెల్ అధికారులది... ఇది డీకోడ్ అయితే కానీ, ప్రమాదం ఎందుకు జరిగిందీ అర్థం కాదు...
ఎందుకిలా జరుగుతోంది..? ప్రమాదం జరిగిన తరువాత కారణాలను అన్వేషించటం కంటే... ప్రమాదం జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో మన అధికారులు, పైలట్లు ఎందుకు విఫలమవుతున్నారు?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం మరోసారి విఐపి ఎయిర్‌క్రాఫ్‌ట నిబంధనలను ప్రశ్నార్ణకం చేశాయి. పావురాల గుట్ట ప్రమాదం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. విఐపి ఎయిర్‌క్రాఫ్‌టల రూల్‌సను వెంటనే సవరించాలనీ నిర్ణయించారు.. ఇంతకు ముందు నిబంధనలంటూ లేకపోలేదు.. కానీ.. వాటిని పాటించటంలో డొల్లతనం తాజా ప్రమాదంతో బయటపడింది. హెలికాప్టర్‌లో ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్‌సపాండర్ అసలు పనే చేయలేదు. ప్రయాణం ప్రారంభించటానికి ముందే ఏ యంత్రం ఎలా పనిచేస్తున్నది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. కానీ, పైలట్లు ఆ పని చేయలేదు. దీనికి తోడు శాటిలైట్ ఫోన్ ఒకటి ఉంచుకోవాలన్న ఆలోచనా అధికారులకు రాలేదు.. అదేమంటే మర్చిపోయామంటారు... ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమైన నాయకుడు చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్లినా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అధికారులు ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు.. శాటిలైట్ ఫోన్ అనేది ఏ విధంగా చూసినా ముఖ్యమంత్రి పర్యటన విషయంలో అధికారులు కొంత అలసత్వంగా ఉన్నారన్నది వాస్తవం...
శాటిలైట్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా వైర్‌లెస్ సమాచారాన్ని సక్సెస్‌ఫుల్‌గా అందిస్తున్న ఫోన్... మోడల్‌ను బట్టి, ప్రాంతాలను బట్టి శాటిలైట్ ఫోన్లు పని చేస్తాయి. ఈ ఫోన్లలో రిటాక్ట్రబుల్ యాంటెన్నా ఉంటుంది. దీని వల్ల దీన్ని సెన్సార్ చేయటం కానీ, ట్యాపింగ్ చేయటం కానీ సాధ్యం కాదు.. భూకక్ష్యలో స్థిరంగా ఉండే ఉపగ్రహాలు ఆకాశంలో స్థిరంగా ఉంటాయి... అలాంటి ఉపగ్రహాల మీద ఆధారపడే ఫోన్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. భూ దిగువ కక్ష్యలో ఉండే ఉపగ్రహాల ద్వారా వినియోగించే వాటిని లియో శాటిలైట్ ఫోన్లంటారు.. వీటి నుంచి నిరాటంకంగా వైర్‌లెస్ సేవలను పొందవచ్చు. పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో కూడా ఈ శాటిలైట్ ఫోన్ల సంకేతాలు తెగిపోవు... ఒకవేళ పోయినా నిమిషాల్లో సంకేతాలు అందుతాయి... శాటిలైట్ ఫోన్ ఖరీదు చాలా ఎక్కువ. గ్లోబల్ స్టార్ అనే కంపెనీ వీటిని ఎక్కువగా తయారు చేస్తుంది. ప్రపంచంలో ఒక్క బర్మాలో మాత్రం వీటిని నిషేధించారు.
ఇంత ఆధునిక పరిజ్ఞానం ఉన్న ఈ శాటిలైట్ ఫోన్లను ఇప్పటి వరకు మన విఐపి ఎయిర్‌క్రాఫ్‌టలలో తప్పనిసరి చేయకపోవటం వల్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొనలేదు.. ఇప్పుడు కేంద్రప్రభుత్వం కళు్ల తెరిచి అన్ని విఐపి ఎయిర్‌క్రాఫ్‌టలలో శాటిలైట్ ఫోన్ ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేస్తున్నది... ముందు ముందైనా ఇలాంటి ప్రమాదాలను వీలైనంతగా నివారించే ప్రయత్నం చేయటం మంచిది. ముఖ్యంగా జనం కోసం జనంమనిషిగా జీవించే నాయకుల ప్రాణాలు అత్యంత విలువైనవి. వీటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత.. ఏ చిన్నపాటి నిర్లక్ష్యమూ క్షంతవ్యం కాదు..

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం
ఈ లోటు పూడ్చేదెవరు?
ఒక మహా నేత అర్ధంతరంగా నిష్ర్కమించినప్పుడు ఆ నష్టాన్ని భరించటం అంత సామాన్యమేం కాదు.. జనం గుండెల్లో గూడుకట్టుకునే నాయకులు నూటికో కోటికో ఒక్కరు పుడతారు.. వన్‌మ్యాన్ ఆర్మీలాగా తన పని తాను వేగంగా చేసుకుని వెళ్లిపోతారు.. ఒక ఎన్టీరామారావు, ఒక పి.జనార్ధన్‌రెడ్డి.. ఒక వైఎస్‌ఆర్. ఇలాంటి వాళు్ల చాలా అరుదుగా చరిత్రలో కనిపిస్తారు..
జనం కోసమే తానుగా.. తానే జనంగా జీవించిన మనీషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఎవరేమన్నా లెక్కచేయని మనస్తత్వం ఆయనది.. తాను నమ్మిన వాళ్లను ఎలాంటి వారైనా సరే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కున చేర్చుకునే అరుదైన నేత... కాంగ్రెస్ పార్టీకే కాదు.. రాషా్టన్రికి లభించిన అపర భగీరథుడాయన... ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను లేకుండా రాషా్టన్న్రి ఊహించుకునే స్థితిలో తెలుగు ప్రజ లేదు.. మరి ఆ లోటు పూడ్చేదెవరు..? అలాంటి నాయకత్వం మళ్లీ సాధ్యమేనా?
================
దాదాపు దశాబ్దం క్రితం మాట.. కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ విదేశీయతను వ్యతిరేకిస్తూ... కొత్త కుంపటి పెట్టుకున్న శరద్‌పవార్ ప్రజాదరణ అపారంగా ఉన్న నాయకులకు కాంగ్రెస్‌లో స్థానం లేనే లేదని వాపోయారు... పదేళ్ల కాలచక్రం గిర్రున తిరిగింది. నాడు పవార్ అన్న మాటల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే అవి ఎంత అబద్దాలో ఇవాళ వైఎస్‌ఆర్ స్థాయిని, ప్రతిష్ఠను చూస్తే అర్థం అవుతుంది. ప్రాంతీయంగా, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడుగా, కాంగ్రెస్ అధిష్ఠానాన్నే శాసించగలిగే స్థాయిలో ఎదిగిన నాయకుడు వైఎస్‌ఆర్...అలాంటి నాయకుడిని ఎదిగేలా చేసిన పార్టీ.. అంతటి నాయకత్వాన్ని తిరిగి సాధించటం తేలికేమీ కాదు...
1.
మహానేత మహాభినిష్ర్కమణం జరిగిపోయింది. ఎవరు ఆపాలనుకున్నా అందనంత దూరానికి జన హృదయనేత వెళ్లిపోయాడు.. ప్రతి కుటుంబం శోకతప్త హృదయంతో తపించిపోతున్నది. తమ అభిమాన నేత ఇక లేరని తెలిసి 68 హృదయాలు స్పందించటం మానేశాయి. నేల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయింది. అగాధం ఏర్పడింది. ఈ అగాధాన్ని ఇక పూడ్చేదెవరు? అంతటి జననేతను సమీకరించుకోవటం రాషా్టన్రికి, కాంగ్రెస్ పార్టీకి సాధ్యమేనా? ఒంటిగా ముందుకు వెళ్లి ముపై్ఫమూడు మంది ఎంపిలను గెలిపించిన బలమైన నాయకుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకెవరున్నారు? ఇప్పుడు అధిష్ఠానాన్ని, రాష్ట్ర పార్టీని అమితంగా వేధిస్తున్న ప్రశ్న... ఎవరికి వారు అప్పుడే వైఎస్‌ఆర్ వారసత్వంపై తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు.. రకరకాల పేర్లు ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు.. మహానాయకుడికి నివాళులు అర్పిస్తూనే, తరువాత ఎవరు? అన్న దానిపై చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఎందుకిలా? పార్టీలో, ప్రజల్లో వైఎస్ వారసత్వంపై ఇంత ఆందోళన అవసరమా?
2004కు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో వరుసగా విఫలమవుతున్న నాయకుడు.. 1994లో ఆయన నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది. కేవలం 26 సీట్లే గెలుచుకోగలిగింది. 99లోనూ పెద్దగా సాధించింది ఏమీ లేదు.. 2004లోనూ కాంగ్రెస్ అధిష్ఠానానికి వైఎస్‌పై పెద్దగా నమ్మకం లేదు.. దీనికి తోడు రాష్ట్ర పార్టీలో ఆయన మూటగట్టుకున్న వ్యతిరేకత అంతా ఇంతాకాదు..
2003 నాటికి పరిస్థితి క్రమంగా వైఎస్‌కు అనుకూలంగా మారుతూ వచ్చింది.. 68 రోజుల పాటు వందలాది కిలోమీటర్లు నిర్వహించిన పాదయాత్ర వైఎస్‌ను అమాంతంగా జననేతగా మలచింది. కాంగ్రెస్‌లో ఆయన స్థాయి పెరుగుతూ వచ్చింది. మౌనంగానే ఆయన ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చారు.. 2004 ఎన్నికల్లో లెఫ్‌ట, టిఆర్‌ఎస్‌లతో పొత్తు పెట్టుకుని గెలిచిన తరువాత వైఎస్ నాయకత్వానికి తిరుగులేకుండా పోయింది. అప్పుడంతా పొత్తువల్లే గెలుపు సాధ్యమైందనుకున్నారు... తరువాత పార్టీలో ప్రతిఒక్కరిపైనా పట్టు సాధించారు.. 2008 ఉప ఎన్నికల తరువాత పరిస్థితి అంతా మారిపోయింది. టిఆర్‌ఎస్‌ను మట్టి కరిపించి ఆరు సీట్లు గెలుచుకోవటంతో వైఎస్‌ను సోనియా పూర్తిగా విశ్వసించారు.. 2009 ఎన్నికల్లో అంతా ఆయన కోరుకున్నట్లే జరిగింది. మాటిచ్చిన మేరకు 33 మంది ఎంపిలను గెలిపించుకొచ్చారు. కాంగ్రెస్‌లో అధిష్ఠానానికి విధేయులుగా ఉండే నాయకులే అందరికీ తెలుసు. కానీ, అధిష్ఠానాన్ని సైతం శాసించగల నేతగా వైఎస్ ఎదగడం ఒక చరిత్ర..
వైఎస్ కంటే ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులది మూ్యజికల్ చైర్ టైప్ రాజకీయాలు.. సిఎంలను తరచూ మార్చే అరాచక రాజకీయానికి నాటి కాంగ్రెస్ పెట్టింది పేరు.. వైఎస్ ఆ చరిత్రనే మార్చేశారు.. వన్‌మ్యాన్ ఆర్మీలాగా అన్నీ తానే అయి నడిపించారు.. చివరకు అధిష్ఠానానికి వైఎస్‌తో రాజకీయంగా వ్యవహరించటం కంటే ఆయన మానాన ఆయన్ను వదిలేయటమే మంచిదన్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించటమే కాకుండా, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా, సంఖ్యాపరంగా కూడా బలోపేతం చేసిన నేత వైఎస్.
మరో కోణంలో ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి.. ఎన్టీయార్‌లో ఉన్న ఆకర్షణ వైఎస్‌కు లేకపోవచ్చు... కానీ సంక్షేమ దృక్పథంలో వైఎస్‌కు సాటిరాగల వారు లేరు.. ఆమ్ ఆద్మీ మద్దతును దృష్టిలో ఉంచుకుని నడిపించిన రాజకీయం ఆయన్ను రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు అలాంటి నాయకుడు కాంగ్రెస్‌కు దొరకటం కష్టం. వైఎస్ వచ్చాక కాంగ్రెస్‌లోని సీనియర్ తరం అంతా స్తబ్దుగా ఉండిపోయింది. వైఎస్ స్థాయిలో కాంగ్రెస్‌కు బలాన్నివ్వగల వారు ఎవరన్నది అంతుపట్టనిది. ఆయన వారసుడిగా జగన్‌ను రంగం మీదకు అప్పుడే ఒక లాబీ తీసుకువచ్చింది. ఒక బలహీనమైన నాయకుడిని అకస్మాత్తుగా తెరమీదకు తెచ్చి సిఎం కుర్చీపై కూర్చోబెట్టే పరిస్థితి గతంలో ఉండేదేమో కానీ, ఇప్పటి కాంగ్రెస్‌కు లేదు. యువకుడైన జగన్‌ను వారసుడిగా చేస్తే, వైఎస్ స్థాయికి ఎదగ గలరా అన్నది మరో ప్రశ్న.. ఆయనకున్న రాజకీయ అనుభవం కేవలం వంద రోజులే.. కొద్ది రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మరో నాయకుడిని చేస్తే ఎంతవరకు లబ్ది పొందగలరన్నది అనుమానం.. ఇంకోవైపు 2014 నాటికి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ఇప్పటినుంచే ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాషా్టల్ల్రో యువ నాయకత్వాన్ని ఎదగనివ్వటం రాహుల్‌కు అవసరం. మరి కాంగ్రెస్ అధిష్ఠానం వూ్యహం ఎలా ఉంటుందో వేచి చూడాలి...

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)