ఒక నీలి నీడ మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతోంది... స్థిమితంగా ఉండనివ్వకుండా కేకలు పెడుతోంది... ఏదో చేసేస్తానంటూ అరుస్తోంది.. నిలుచున్నా, నడుస్తున్నా, కూచున్నా, లేచినా, నిద్రపోతున్నా, కళ్లు తెరిచి ఉన్నా.. వేధిస్తూనే ఉంది.. దాన్ని చూస్తేనే ఉలికిపాటు.. తలుచుకుంటే గగుర్పాటు.. ఆలోచనల్లో అదురుపాటు.. శరీరం చెమటలు కక్కుతోంది.. ఒళ్లు వణికిపోతోంది.. గుండె తన వేగాన్ని పెంచేసింది.. ఊపిరి భారంగా మారిపోయింది.. ఆర్చేవారు లేరు.. తీర్చేవారు లేరు.. ఆ నీడను తరిమేసే వారు లేరు.. అది నీడ కాదు.. దాని పేరు భయం..
మానవాళి నెత్తిపై ఇప్పుడు భయం మరో శత్రువుగా రాజ్యమేలుతోంది... ఇది మానసిక శత్రువు.. ఈ తరాన్ని అదే పనిగా వేధిస్తున్న శత్రువు.. ధైర్యం, సాహసం, నమ్మకం లాంటి పదాలకు చోటు లేని లోకంలో మనుషుల్ని ఆమాంతంగా మింగేస్తోంది.. చిన్నతనంలోనే చిదిమేస్తోంది.. అర్థం లేని కారణాలతో జీవితాల్ని అనర్థంగా నాశనం చేసేస్తోంది...
--------------1----------------
అమ్మ కడుపులో ఆటలాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం...
ఆందోళన అంటే ఏమిటో తెలియని ఒక అద్భుతమైన లోకం అమ్మ కడుపు..
ఆ కడుపులోంచి బయట పడినప్పుడు
సడన్‌గా ఏదో శత్రులోకంలోకి వచ్చిన ఫీలింగ్
అప్పుడు శిశువు మొదలు పెట్టే ఏడుపు పేరు భయం..
అన్నం తిననంటూ మారాం చేస్తుంటే..
అమ్మ చూపించే బూచీ పేరు భయం..
స్కూలుకు ఎగ్గొట్టినప్పుడు
నాన్న కోపంగా చూసే చూపు పేరు భయం..
హోం వర్క్ చేయకపోతే..
మాస్టారు చూపే బెత్తం పేరు భయం..
ఇంటర్‌లో మార్కులు సరిగా రాకపోతే..
అంతా ఏమంటారో అన్న ఆందోళన పేరు భయం...
పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయకపోతే
ఆఫీస్‌లో బాస్ ఇచ్చే వార్నింగ్ పేరు భయం..
అజ్ఞానం, అమాయకత్వం జతకడితే
వెంటాడే అతీంద్రియ శక్తుల పేరు భయం..
వెంటాడే జ్ఞాపకాల నీడ భయం..
చెట్టు భయం..
పుట్ట భయం..
పురుగు భయం..
నీడను చూసినా భయం..
మనిషి మనిషిని చూస్తే భయం...
-----------2-----------
భయం అన్న పదాన్ని కొంత పాలిష్డ్‌గా వాడితే దానిపేరు ఫోబియా... ప్రతి మనిషి మనసు లోపలి పొరల్లో ఈ ఫోబియా ఏదోరకంగా మనిషిని వెంటాడుతూనే ఉంది.. కారణాలు ఉండవు.. అర్థం ఉండదు.. ఏదో ఆలోచన.. ఏదో సంఘటన... ఒక ఓటమి.. ఈ ఫోబియాను సృష్టిస్తుంది.. పెను భూతంగా మార్చేస్తోంది.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది రకరకాల ఫోబియాలతో బాధపడుతున్నారట.
ఊహ తెలియని రోజుల్లో ఏదో చిన్న ఘటన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.. పెరిగిన కొద్దీ ఆ ఘటన మర్చిపోతాం.. ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు.. కానీ దాని ఛాయలు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రూపాల్లో వేటాడుతుంది..
కొందరికి కొన్ని రూపాలను చూస్తే భయం.. కొందరికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయం.. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా భయం కలుగుతుంది.. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? మెదడులో జరిగే రసాయనిక ప్రక్రియలో సంతులనం తప్పితే వచ్చే అనర్థాలివి...
ప్రతి వాళ్లలోనూ భయం ఛాయలు ఉంటాయి.. ఎవరూ బయటపడరు.. ఎప్పుడూ అవి కనిపించవు.. ఇవి ఉన్నట్లు కూడా వారికి తెలియదు.. చిన్న విషయం పెద్దదై... చూస్తుండగానే భయంకరమైందిగా మారిపోతుంది..
పాలుగారే పిల్లవాడు పరుగులు పెట్టి డాలర్లు సంపాదించాలనే ట్రెండ్ ఉన్న సొసైటీ మనది.. ఈ ఒత్తిడి పిల్లలపై పడి.. నూటికి నూరుశాతం మార్కులు రాకపోతే ఏమవుతుందోనన్న టెన్షన్ భయంగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఎన్నెన్నో.. సరదాగా చదువుకోవాల్సిన పిల్లలు భయంతో చదువుతున్నారు.. ఈ భయం వాళ్లను బలవన్మరణానికి పురికొల్పుతోంది..
నిజానికి ఈ భయం అనవసరమైంది.. కానీ, దీన్ని సృష్టించింది మన సొసైటీయే.. పసివాళ్ల లేత నరాలను చదువు పేరుతో పట్టి పిండేస్తున్నదీ సొసైటీ..
ఆడపిల్లల్లో ఈ ఫోబియా మరీ దారుణం.. చిన్నప్పుడు కుటుంబంలో.. పెద్దయిన కొద్దీ స్కూల్‌లో, ఉద్యోగంలో.. లైంగిక వేధింపులు వాళ్ల మానసిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది.. ఇది పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి మారుతుంది.. అర్థంతరంగా జీవితాన్ని ముగించాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిని కలిపిస్తుంది...
భయం చిన్నగానే మొదలవుతుంది.. అది పెద్దగా మారుతున్నప్పుడే మెదడులో టెన్షన్ పెరుగుతుంది.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు.
----------------3----------------------
ఏ రకమైన భయం ఎందుకు కలుగుతుందో తెలియని పరిస్థితి... ఈ భయాలు ఎలా ఉంటాయంటే వినటానికి సిల్లీగా.. మనకే నవ్వు వచ్చేలా ఉంటాయి.. కానీ, భయపడుతున్న వ్యక్తికి మాత్రం అది ఒక పెను ముప్పుగా కనిపిస్తుంది.. ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు జనాలను వేధిస్తున్నాయో మీకు తెలుసా.. పదివేల వరకూ ఉన్నాయిట..
ఫోబియా అనేది విచిత్రం.. దానికి ఎలాంటి కారణాలు ఉండవు.. ఎందుకు కలుగుతుందో తెలియదు.. దానికి చిన్నాపెద్దా తేడా ఉండదు.. ఊహ తెలియని రోజుల్లో ఎప్పుడో ఏదో రకంగా పుట్టిన భయం.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది..
మాడొన్నా.. ఆ వంపులు వయ్యారంగా సయ్యాటలాడుతుంటే, కళ్లల్లో కసి రేపుతుంటే, కనుగుడ్డు కదిలించకుండా చూడని వాడు ఈ తరంలో ఎవరుంటారు చెప్పండి...
ఇంతటి మడొన్నాకు ఓ ఫోబియా ఉంది.. పది కిలోమీటర్ల దూరంలో పిడుగు పడిన శబ్దం వినిపించినా ఇంతే సంగతులు.. బెడ్‌పై ఎగిరి గంతేసి భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది..
నికొల్ కిడ్‌మాన్..... నాలుగేళ్ల క్రితం ఆస్కార్‌లో హల్‌చల్ సృష్టించిన లేడీ బాస్.. హాలీవుడ్‌ను ఒక ఊపేసిన బ్యూటీస్టార్...
ఈ హాలీవుడ్ బ్యూటీకి నేచర్‌లో ఈమెతో పోటీ పడుతున్న బ్యూటీ బటర్‌ఫ్లైస్ అంటే చాలా భయం..షూటింగ్ స్పాట్‌లో ఒక బటర్‌ఫ్లై కనిపించినా ప్యాకప్పే...
స్కార్లెట్ జాన్సన్... అమెరికన్ బ్యూటీ.. నటి.. సింగర్.. ఈ న్యూయార్క్ బేబీ అమెరికన్లనే కాదు.. ప్రపంచ ఇంగ్లీష్ మూవీ వ్యూయర్స్ మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేసింది..
ఇంతటి పుత్తడి బొమ్మ దేన్ని చూస్తే భయపడుతుందో తెలుసా.. కాక్రోచెస్.. సింపుల్‌గా బొద్దింక.. అది ఏమీ చేయదని తెలుసు.. కానీ, అదంటే మాత్రం ఏదో తెలియని భయం..
బాలీవుడ్ సెక్సీగాళ్.. కంగనా రనౌత్ ... కళ్లతోనే కైపెక్కించే ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే....
ఇంత గొప్ప స్టార్‌కు కార్ లేకుండా ఎలా ఉంటుంది? కానీ, ఆమెకు కారు నడపాలంటే భయం.. కనీసం ముంబైలోని తన ఫ్లాట్ ఆవరణలో నడపాలన్నా గువ్వలా వణికిపోతుంది..
బిపాషా బసు.. బాలీవుడ్‌లో సెక్సీలెగ్ సుందరి.. ఈ అమ్మడితో నటించేందుకు బాలీవుడ్ హీరోలు క్యూ కట్టేస్తారు..
ఈమెకు ఉన్న ఫోబియా ఏంటో తెలుసా... సెల్‌ఫోన్‌లో మాట్లాడటం.. సెల్‌ఫోన్‌ను ముట్టుకోవటం.. ఎవరైనా ఫోన్ చేస్తే.. ఎస్‌ఎంఎస్ ఇవ్వండి అంటుందిట.. ఆ ఎస్‌ఎంఎస్‌ను సెక్రటరీ చదివి చెప్తే.. అవసరమైతే, ల్యాండ్‌లైన్ నుంచి కాల్ చేసి జవాబిస్తుందిట..
----------------------4---------
అసలు ఇవన్నీ భయాలేనా? బొద్దింకల్ని, సీతాకోక చిలుకల్ని చూస్తే భయపడటం ఏమిటి? అదే విచిత్రం.. వీటినే ఫోబియాలంటారు... ఎవరికి, దేన్ని చూస్తే, ఎందుకు భయమో అర్థం కాదు.. వారికే తెలియదు.. కారణాలు ఉండవు.. మనసులో ఏదో మూలన నక్కి ఉన్న గుబులు.. ఒక్కసారిగా బయటపడుతుంది.. శరీరంలోని అన్ని నరాలను కుదిపేస్తుంది. బ్రెయిన్‌ను ఇన్‌బ్యాలెన్స్ చేస్తుంది.
ఇరవై ఏళ్ల పాటు ఏ అలజడీ తెలియని ఓ అమ్మాయికి ఒక్కసారిగా ఉలికిపాటు మొదలవుతుంది.. టెలివిజన్‌లో మూవీ మసాలా వస్తోంది. అంతలోనే ఆందోళన.. తన వెనుక ఎవరో ఉన్నారన్న భ్రమ.. వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.
ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్తుంటే ఏదో దయ్యం తననే చూస్తున్నదన్న ఆలోచన ప్రియురాలికి చెమటలు పట్టిస్తుంది..
ఒకటి కాదు.. రెండు కాదు.. వేల రకాల భయాలు.. ఫోబియాలు ప్రజల్ని చిత్తడి చేస్తున్నాయి. తన భయానికి పరిష్కారమే లేదన్న ఆందోళన, జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తమలో కలుగుతున్న ఆందోళన ఏమిటని విశ్లేషించుకోలేరు.. తాము ఊహించుకున్నదే కరెక్టని అనుకుంటారు.. ఎవరితోనూ తమ భయాన్ని పంచుకోరు.. ఒకవేళ ఎవరికైనా చెప్పినా.. వారు చెప్పే మంచి మాటలకు అంత తేలిగ్గా కన్విన్స్ కారు. ఆ క్షణం వరకు కాస్త కన్విన్స్ అయినట్లు కనిపించినా.. లోలోపల గుబులు వెంటాడుతూనే ఉంటుంది.రకరకాల ఫోబియాలతో బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే దాదాపు ఆరు కోట్ల మంది దాకా ఉందంట.. అన్నీ ఉన్న అమెరికాలాంటి అగ్రదేశంలోనే ౫౦ లక్షల మంది ఈ ఫోబియాలతో అల్లాడిపోతుంటే ఇక మన దేశం సంగతి చెప్పేదేముంది?
ఆడపిల్లల్లో చిన్ననాట లైంగిక వేధింపులకు గురైతే.. దాని భయం.. పెద్దయ్యాక పడకగదిలో కూడా వెంటాడుతుంది..వింత వింతగా ప్రవర్తిస్తారు.. కారణాలు తెలియక, సరైన కౌన్సిలింగ్ చేయలేకపోవటం మహిళల పట్ల సమస్యాత్మకంగా మారుతోంది..
ఫోబియా.. భయం.. ఇదేమీ చిన్న విషయం కాదు.. అలా అని నిజంగా భయపడి పారిపోయేంత పెద్ద విషయమూ కాదు.. మనిషి లోపలి పొరల్లో దాక్కున్న దౌర్బల్యం అతణ్ణి ఫోబియా ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తోంది.. అందుకే గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే............అదే భయం..
26, జులై 2010, సోమవారం
3, జులై 2010, శనివారం
ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?
జీవితం మీద విసుగు... లోకం మీద ఆగ్రహం.. అంతా ఉండి ఎవరూ లేనితనం.. చీకటి తప్ప వెలుతురు కనపడని భవిష్యత్తు.. ఒకే ఒక్క క్షణం.. నిస్సహాయత ఆవరిస్తుంది... వ్యక్తిత్వాన్ని నిర్వీర్యం చేస్తుంది.. ఆలోచనలని చంపేస్తుంది.. బలవంతంగా లోకం నుంచి వెళ్లిపోవాలన్న నిర్ణయానికి ఉసికొల్పుతుంది.. ఆ క్షణం ఎంత భయంకరం?
చేతికొచ్చిన పంట వరదల పాలైన క్షణం... ముప్పిరిగొన్న అప్పులు.. రైతు మెడకు ఉరిగా మారింది...
ప్రియుడి వంచనను తట్టుకోలేక ప్రేయసి మనసు నిస్తేజమైపోయింది..
కార్పొరేట్ చదువుల ఒత్తిడిని భరించలేని పసి హృదయం వికలమైపోయింది.
ఆర్థిక బాధలు కుటుంబ పెద్దను పిల్లలకు దూరం చేశాయి.
చుట్టూ సమస్యలు.. కనిపించని పరిష్కారం.. సాయం చేయని చేతులు.. జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు.... భవిష్యత్తు ఏమిటో అంతుపట్టదు..ప్రపంచం అంత కుటుంబం ఉన్నా... ఒంటరితనం నీడలా వెంటాడుతుంది...నరాలు తెగిపోయేంత టెన్షన్... ఇక ఈ ప్రపంచంలో తనకేమీ మిగల్లేదు.. తాను బతికి ఉన్నా, లేకపోయినా ఒకటే... ఇక చావును ఆశ్రయించటమొక్కటే మార్గం... అదొక్కటే దారి.. చివరకు మిగిలేది ఈ చావే... చావే..
ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం జీవితంలో అత్యంత భయంకరమైన క్షణం. జీవితాన్ని నిలువునా దహించి వేసే క్షణం.. ఏం ఆలోచించినా చావే పరిష్కారంగా తోస్తుంది.. ఏ పని చేసినా నీరసం ఆవహిస్తుంది.. అనుక్షణం అదే ఆలోచన వెంటాడి వేధిస్తుంటుంది.. ఎవరితో ఏమీ చెప్పుకోలేని దారుణమైన నిశ్శబ్దం బలవన్మరణం వైపు లాక్కుపోతుంది...
ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం కోసం ఒకే ఒక్క క్షణం చాలు.. ఆ ఒక్క క్షణం ఆ ఒక్క ఆలోచన మెదడును పనిచేయకుండా అడ్డుకుంటుంది.. ముందుగా మెదడును చంపేస్తుంది.. ఆ తరువాత మనిషిని హతమారుస్తుంది...
మనిషిని శాశ్వతంగా మాయం చేసేది ఆ క్షణం.. ఆ ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చేందుకు తోడెవరూ ఉండరు.. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వ్యక్తి తనంత తానుగా ఒంటరితనంలోకి జారుకుంటాడు.. ఆ ఒంటరితనాన్నే నిరంతరం వెంటబెట్టుకుంటాడు.. నీడలా వెంటాడే ఆ ఒంటరితనం కొంత కాలానికి వ్యక్తిని పూర్తిగా కమ్మేస్తుంది.. చివరకు అదే డామినేట్ చేస్తుంది.. తన వెంటబెట్టుకుని కానరాని లోకాలకు తీసుకువెళ్తుంది..
-----2------
ఒక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చిన తరువాత మనిషి పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు.. ఎవరితోనూ మాట్లాడడు.. మనసులో చెలరేగుతున్న కల్లోలాన్ని ఏ ఒక్కరితోనూ పంచుకోడు.. చనిపోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి చనిపోవటానికి పూనుకునేంత వరకు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది.. మానసిక వేదన అంతుపట్టని తీరులో ఊహకందదు... చివరకు ఉరి వేసుకోవటమో.. పురుగు మందు తాగిన తరువాతో ఒక్కుదుటున మనసులో మార్పు కనిపిస్తుంది.. అప్పుడు బతకాలన్నా బతకలేని పరిస్థితి.. ఎవరూ వచ్చి కాపాడలేని దుస్థితి.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?
అదొక విచిత్రమైన పరిస్థితి... మానసికంగా కృంగిపోయిన మనిషి.. తనను తాను అంతం చేసుకుంటున్న దుస్థితి.. బలవన్మరణానికి పూనుకునేందుకు కొద్ది నిమిషాల ముందు మనిషి ఆలోచనలు చాలా ఆవేశంగా ఉంటాయి.. కూల్‌గా ఆలోచించే పరిస్థితి ఉండదు.. మెదడులోని అన్ని నరాలు ఎప్పుడు తెగిపోదామా అన్న స్థాయిలో కదిలిపోతుంటాయి.. బాధల్లోంచి కమ్ముకొచ్చిన డిప్రెషన్ కనీవినీ ఎరుగని దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది.. ఆ కొద్ది నిమిషాల్లో ఎన్నో ఆలోచనలు.. ఎంతో ఆవేదన.. ఎవరికీ ఏమీ చేయలేకపోయానన్న బాధ.. ఏమీ సాధించలేకపోయానన్న ఆందోళన.. అన్నీ కలిపి వ్యక్తిని చావు వైపు బలవంతంగా లాక్కుపోతుంది...
చనిపోదామని నిర్ణయించుకున్న తరువాత అందరికీ దూరంగా ఉండటం సహజంగానే జరుగుతుంది.. ఒంటరిగా, దూరంగా ఎవరికీ చెప్పకుండా బలవంతంగా మరణాన్ని కొని తెచ్చుకుంటారు.. ఆ క్షణంలో ఏం జరుగుతుంది..?
మెడకు ఉరి బిగుసుకుంది.. ఇక చావు ఎంతో దూరంలో లేదు.. అయిదు సెకన్లో.. ఆరో సెకన్లో... లేక పది సెకన్లు మాత్రమే మిగిలి ఉంది...
పురుగుల మందు, లేక విషం గొంతులోకి దిగింది.. ఒక్కో బొట్టు నరనరాల్లోకి పాకుతోంది.. ముందుగా మెదడులోకి ప్రసరిస్తుంది... చావు దగ్గర పడింది.. ముఫ్ఫై సెకన్లో, నలభై సెకన్లో మిగిలి ఉంది.. శరీరం దృఢమైంది అయితే, రెండు మూడు నిమిషాల సమయం మిగులుతుంది..
యాభై నిద్రమాత్రలు శరీరంలోకి ఒకేసారి వెళ్లిపోయాయి... ఒక్కో మాత్ర రక్తంలో కరిగిపోతోంది.. శరీరంపైకి నిద్ర కమ్ముకుంటూ వస్తోంది.. క్రమంగా మగతలోకి జారుకుంటున్న పరిస్థితి.. అయిదారు నిమిషాల్లో అంతా అయిపోతుంది....
ఆ కొద్ది క్షణాల్లో.. కొన్ని నిమిషాల్లో బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి ఆలోచనల్లో ఒక్కసారిగా మార్పు వచ్చేస్తుంది.. తాను తొందరపడ్డానన్న భావన ఒంట్లో గగుర్పాటు కలిగిస్తుంది.. ఎన్నెన్ని ఆలోచనలు ఒక్కసారిగా కమ్ముకుంటూ వచ్చేస్తాయి.. తన కుటుంబం గుర్తుకు వస్తుంది.. బంధువులు గుర్తుకు వస్తారు.. మిత్రులు గుర్తుకువస్తారు..
ఎలా.. ఏం చేయాలి.. ఒకే ఒక్క క్షణంలో తాను బతకాలి.. బతికి తీరాలి...అన్న ఆలోచన వచ్చేస్తుంది.. కానీ, ఎవరు కాపాడగలరు? బతకాలన్నా బ్రతికేది ఎలా? తాను ఒంటరిగా ఉన్నాడు.. చుట్టూ ఎవరూ లేరు.. కొన్నే కొన్ని క్షణాలు.. వేగంగా గడిచిపోతుంటే శరీరం నిస్తేజమైపోతుంటే.. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుండునన్న ఆలోచన కలచివేస్తూనే హృదయ స్పందన ఆగిపోతుంది..
ఎంత భయంకరమైన పరిస్థితి. శత్రువుకైనా రాకూడదనుకునే క్షణాలివి.. ఆ క్షణంలో బలవన్మరణానికి పూనుకోక ముందు ఒక్కరితో తన భావాలను ఒక్కసారి పంచుకున్నా, వ్యక్తిలో మార్పు వస్తుంది.. ఆ ఒక్క క్షణం కూల్‌గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు..?
--------3--------
అవును ఎందుకు అలోచించలేకపోతున్నారు..? చనిపోవాలనుకున్నప్పుడు క్షణికంగా నిర్ణయం తీసుకున్న వాళ్లు విషం లోపలికి దిగుతున్నప్పటి నుంచి ఏదో తప్పు చేశామన్న భావనలో కుమిలిపోవటం ప్రారంభిస్తారు.. అదృష్టవశాత్తూ బతికి బట్టకడితే అప్పుడు వాళ్ల మానసిక పరిస్థితిని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు.. ఇందుకు ఓ ఉదాహరణ చూడండి.. కడప జిల్లాలో రమేశ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు..అతని పరిస్థితి ఏమిటో చూడండి..
రమేశ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు రాస్తాడు...
అప్పులు.. ఆర్థిక బాధలు అతన్ని చిత్రహింసలకు గురి చేశాయి..
చావు తప్ప గత్యంతరం కనిపించలేదు..
ఆలోచనలు మరిచాడు..
విషం తీసుకున్నాడు
ఒంట్లో నరనరాల్లో మంట రేగినప్పుడు మొదలైంది పశ్చాత్తాపం..
భార్యాపిల్లల కోసమైనా బతకాలని, ఎవరైనా బతికించాలని కోరుకున్నాడు..
ఆ బాధ అతనికి తప్ప మరెవరికీ అర్థంకానిది..చెప్పటానికి కూడా శక్యం కానిది..
అదృష్టవశాత్తూ సమయానికి వైద్యం అందడంతో బతికాడు..
దగ్గరకు తెచ్చుకున్న చావును దూరం తరిమాడు..
ఇతను కేవలం ఒక ఉదాహరణ.. ఇలాంటి వారిలో బతికి బట్టకట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు ఉండే సమయం తక్కువ.. రక్షించే అవకాశాలు తక్కువ.. ఇలాంటి తక్కువ అవకాశాల్లో ప్రాణాలతో బయటపడిన వాళ్లు నిజంగా కోరుకునేది ఒక్కటే.. తనలాగా ఎవరికీ చావు రాకూడదని.. ఎవరూ తనలాగా బతికుండగానే నరకం అనుభవించరాదని...
------------4--------------
పురుగుల మందు తాగితే, విషం మింగితే, ఆ క్షణంలో ఏం జరుగుతుంది.. ఎలా ఉంటుంది.. పరిస్థితి తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చివరి నిమిషంలో ఎవరైనా గుర్తించి ఆసుపత్రికి తరలించి బతికించగలిగితే.. అప్పటికైతే బయటపడవచ్చు.. కానీ, ప్రాణాపాయం తప్పినట్లేనా? కాదు.. అపాయం నీడలా వెంటాడుతూనే ఉంటుంది.. స్లో పాయిజన్ మృత్యువును తోడు తీసుకుని కబళించేందుకు సిద్ధంగా ఉంటుంది..
గాఢమైన సాంద్రత కలిగిన రసాయనాలు కలిసిన పురుగుల మందులు, పేస్మాల్, హెయిర్ డై, ఇతర విష వస్తువులు తాగిన వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది. శరీరంలో నరనరానా ప్రసరిస్తున్నప్పుడు వెయ్యి తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. ఎందుకు మందు తాగానురా అని అనిపిస్తుంది.. భయమేస్తుంది. దీన్నుంచి ఎలా బయటపడాలా అని ఆరాటం మొదలవుతుంది..
ఆ క్షణాల్లో పరిస్థితి చెప్పనలవి కానిది.. ఆవేశంగానో, అనాలోచితంగానో చావాలనే నిర్ణయం తీసకున్న అజ్ఞానులు విషపూరిత రసాయనాలు సేవిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.. పురుగు మందుల కంటే హెయిర్‌డై చాలా డేంజర్, దాని కంటే పెస్మాల్ చావక ముందే నరకాన్ని చూపిస్తుంది.
ఈ విష రసాయనాలు సేవించిన వాళ్లకు మొట్టమొదట గొంతువాపు వస్తుంది.
తరువాత నాలుక పిడచకట్టుకుపోతుంది.
క్రమంగా గొంతులోపలికి దిగిపోతుంది..
రక్తకణాల్లోకి ప్రసరిస్తుంది..
గుండెకు, కిడ్నీలను వెంటనే ప్రభావితం చేస్తుంది.
ఇంకేం.. ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారుతుంది..
వెంటనే ఆపరేషన్ చేయకపోతే అంతే సంగతులు..ఆసుపత్రిలో ట్యూబ్ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తారు.. అయితే మోతాదుకు మించి పురుగుమందులు తాగినా, బలహీనమైన శరీరం ఉన్నా.. వైరస్ అటాక్ తప్పదు.
ఈ విష ప్రభావం వల్ల యూరిన్ రంగు మారుతుంది. తొందరగా చనిపోయే అవకాశం ఉంది.. విషం తీసుకున్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే బతికించేందుకు అవకాశాలు ఉండవచ్చు. వైద్యులు రకరకాల ప్రయత్నాలు చేసి తాగిన విషాన్ని కక్కిస్తారు.. ప్రాణాలను దక్కిస్తారు..
కానీ, అలా బతికినంత మాత్రాన ఆ తరువాత అంతా సవ్యంగా సాగుతుందా? అంటే అదీ లేదు.. ఒకసారి విషం శరీరంలోకి వెళ్లిన తరువాత దాన్ని ఎంత వెలుపలికి తీసినా, చివరలో ఒక్క కణమైనా శరీరంలో ఉండిపోతుంది.. దాని ప్రభావం జీవించి ఉన్నంత కాలం వెంటాడుతూనే ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో క్రమంగా విస్తరించి శరీరంలోని ఒక్కోభాగంపై ఎఫెక్ట్ చూపడం మొదలు పెడుతుంది.. చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.. బతికున్నన్నాళ్లూ నరకయాతన పడాల్సి వస్తుంది..
---------------5-------------
చావాలని ఒకే ఒక్క క్షణంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కొన్నే కొన్ని క్షణాల్లో అంతులేని నరకాన్ని చూపిస్తుంది. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని అంతం చేయటమే కాదు.. దానిపై ఆధారపడ్డ మరి కొన్ని జీవితాలకు అర్థమే లేకుండా చేస్తుంది.
చనిపోయే ఘడియల్లో అనుభవించే బాధ.. అంతకు ముందు ఆత్మహత్యకు పురికొల్పిన బాధల కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది.. ఇంత తీవ్రమైన బాధను అనుభవించటం, జీవితాన్ని అర్ధాంతరంగా ముగించటం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి..
ఆత్మహత్య అన్న ఆలోచన ఎందుకు వస్తుంది?
నిర్హేతుకమైన సుఖాల కోసం ఆలోచించినప్పుడు..
బాధ్యతలు భారంగా మారినప్పుడు..
అవసరం వేరు.. సుఖం వేరు..బాధ్యత వేరు.. బరువు వేరు..
సమస్యలు లేకుండా.. కష్టాలు రాకుండా.. జీవితం గడవాలంటే సాధ్యం కాదు..
ఒక సమస్య పరిష్కారమైతే.. దాడి చేసేందుకు మరో సమస్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. వాటి నుంచి పారిపోవాలనుకోవటం వెర్రితనం తప్ప ఇంకోటి కాదు. ఇలా పారిపోవాలనుకున్నప్పుడే, విరక్తి పెరిగిపోతుంది..
మనకు ఉన్నది ఒకే ఒక్క జీవితం.. ఇంకో జన్మ ఉన్నదనో.. వస్తుందనో ఆలోచించటం.. విశ్వసించటం కంటే, ఉన్న జీవితంలోనే ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నించటం అవసరం.. ఇప్పుడు చావాలని అనుకునే వాళ్లు, అదే క్షణంలో ఎందుకు చావాలి అని ఒక్కసారి ఆలోచిస్తే.. జీవితం సమూలంగా మారిపోతుంది.. ఆ ఒక్క క్షణమే.. జీవితాన్ని ముగించటానికో, కొనసాగించటానికో కారణమవుతుంది.
ఒక్కసారి ఆలోచించండి.. జీవితం ఒకేఒక్కసారి వస్తుంది.. ఆ జీవితాన్ని పూర్తిగా యుటిలైజ్ చేసుకోవటం ముఖ్యం.. సుఖంగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు.. ఆ సుఖాన్ని సాధించటం కోసం ప్రయత్నించాలి.. పోరాడాలి కానీ, సుఖం దక్కలేదని లోకం నుంచే మాయమైపోతానంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు..చావు కోసం మనల్ని నిర్వీర్యం చేసే క్షణాన్ని మనమే పూర్తిగా డామినేట్ చేయాలి.. అర్థం లేని ఆత్మహత్యలను దూరంగా తరిమికొట్టాలి..

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)