24, అక్టోబర్ 2011, సోమవారం

ఇప్పుడు తెలంగాణాకు ఓ అర్జునుడు కావాలి

  
రాజ్యం వీరభోజ్యం అన్నాడు భీష్మపితామహుడు మహాభారతంలో ధర్మరాజుకు రాజధర్మాన్ని బోధిస్తూ... ఎప్పుడో అయిదున్నర వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 3102లో చెప్పిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా మారాయి. అవును ఇప్పుడు వీరులు గెలుస్తున్నారు.. భీరువులు బీరాలు పలికి.. పలికి ఒక్కొక్కరే జారుకుంటున్నారు. గోగ్రహణం సమయంలో కౌరవ సైన్యాన్ని చూస్తేనే వణికిపోయిన ఉత్తర కుమారుడు అప్పటిదాకా కౌరవ నాయకులను చీల్చి చెండాడేస్తానంటూ కత్తిని ఆడవాళ్ల ముందు తిప్పేసి రణరంగానికి వచ్చేసరికి ఒక్కక్షణంలో పారిపోయాడు.. అలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే నాయకత్వం నీడలో బతుకుతున్న ప్రజలకు ఎలాంటి డిమాండ్లు చేసే అర్హత లేదు.. వాళ్లు ఇలా బతుకులు తెల్లవార్చుకోవలసిందే.. ఎందుకంటే విరాటనగరం కీచకుడి కాలం నుంచీ నరకం అనుభవించింది..విలవిల్లాడింది.. అతను చెప్పింది వేదం.. చేసింది శాసనం.. చివరి రోజుల్లో అతను చేసిన అరాచకాలకు అంతే లేదు.. కౌరవ రాజు అండతో అతను మరింత రెచ్చిపోయాడు.. కానీ, ఉక్కుమనిషి భీమసేనుడి పుణ్యమా అని కీచకుడి దురాగతాలు అంతమయ్యాయి. ఆ తరువాత కౌరవ సైన్యం ఆధిపత్యాన్ని అంతం చేస్తానంటూ ఉత్తరకుమారుడు తెగ మాటలు మాట్లాడాడు.. కానీ, అసలు సమయానికి వచ్చేసరికి తుస్సుమన్నాడు.. అప్పుడు అర్జునుడు అతనికి అండగా నిలవటం వల్ల కౌరవులు తోకలు కత్తిరించుకుని వెనక్కి వెళ్లిపోయారు..
ఇప్పుడు తెలంగాణాకు ఓ అర్జునుడు కావాలి.. వాళ్ల కష్టాలు కడతేర్చేందుకు.. కౌరవసైన్యాన్ని తునుమాడేందుకు సవ్యసాచి కావాలి.. ఇప్పుడు తెలంగాణా ఒక అనాధ.. ప్రజలకు అండగా నిలిచి వాళ్లకోసం ఏదైనా చేయగల నాథుడు లేక దిక్కులేని ఓ విరాటనగరం.. ఇక్కడ ఒకరు కాదు.. వందల మంది ఉత్తరకుమారులున్నారు.. వేల మంది ఖడ్గతిక్కనలు ఉన్నారు. నాడు ఖడ్గతిక్కన పసుపు రాసుకుని గాజులు తొడుక్కొమ్మంటే పౌరుషం వచ్చి యుద్ధరంగానికి తిరిగి వెళ్లిపోయాడు.. ఇప్పుడిక్కడ ఖడ్గతిక్కనలు గాజులు తొడుక్కోవటానికి ఎలాంటి సందేహపడరు.. పసుపు రాసుకోవటానికైనా, చీరలు కట్టుకోవటానికైనా వెనుకాడరు. నిజంగా ఈ ప్రజలు ఇవాళ అనాధలు.. అన్నదమ్ములమని చెప్పుతూనే.. అడ్డగోలుగా తమపైనా తమ సమస్యలపైనా, తమ వ్యక్తిత్వంపైనా, తమ జనజీవన విధానంపైనా ఫ్యాషనబుల్‌గా ఖండనమండనలు చేస్తుంటే, కళ్లు మిటకరిస్తుంటే.. మీరేం చేసినా అనుకున్నది సాధించలేరంటూ బల్లగుద్ది చెప్తుంటే... నాయకులు అని చెప్పుకునేవాళ్లు కొల్లలుగా బీరాలు పలుకుతుంటే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణా నిస్సహాయంగా చేతులు చాచి తమకు చేయినందించి ముందుకు నడిపించే సవ్యసాచి కోసం నిద్రాహారాలు మాని వెతుకుతున్నది. తాము చేస్తున్న ఉద్యమాన్ని సమర్థంగా ఏకగళంతో నడిపించే విజయుడి కోసం ఆరాటపడుతున్నది..
రెండు సంవత్సరాలుగా తెలంగాణాలోని నాలుగు కోట్ల ప్రజలు వీధుల్లో నిలుచుని ఉన్నారు.. ఏదో జరుగుతుందని.. తమ పిల్లల నోటికాడి ముద్దను తన్నుకుని పోయిన గద్దల్ని తరిమికొట్టి మళ్లీ తమ కడుపు నింపుతారని భావించిన ప్రజానీకం- రాజకీయ నాయకత్వం తమ వాళ్లతోనే తమాషా చేయటాన్ని సహించలేకపోతున్నది.. ఉద్యమాన్ని ఎప్పుడు ఎగిసేలా చేస్తారో.. ఎప్పుడు సడలిస్తారో తెలియని అయోమయం.. ఎందుకు తీవ్రతరం అవుతుందో.. ఎందుకు చల్లబడుతుందో అర్థం కాని ఆందోళన.. ఎప్పుడు నిర్ణయం వస్తుందో.. అసలు వస్తుందో రాదో తెలియని భయం.. ఆశలన్నీ నిరాశగా నీరుగారుతున్న సందర్భం.. ఏడువందల మంది అమాయకుల ప్రాణ త్యాగాలు వృథా పోతున్న ఆవేదన..
అసలు తెలంగాణాలో ఏం జరుగుతోంది.. సమ్మెనా.. ఉద్యమమా? ఆందోళనా? రాజకీయమా? ఎవరికీ ఏమీ తెలియదు.. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే అనే వాళ్లు అంతలోనే చల్లబడుతారు.. ఒకరినొకరు తిట్టుకుంటారు.. దుమ్మెత్తి పోసుకుంటారు.. ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటారు.. ఒకరి మాట మరొకరు వినరు.. ఎవరికైనా కావలసింది ఆధిపత్యం.. ఎవరికైనా కావలసింది క్రెడిట్..
తెలంగాణకు ఒక దౌర్భాగ్యమైన దుస్థితి దాపురించింది. మొదటి నుంచీ దీనికి నాయకత్వం లేదు.. సమర్థుడని చెప్పుకోవటానికి ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడు తెలంగాణకు లభించకపోవటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఒకరిద్దరు ఉన్నారని అనుకున్నా.. వాళ్లు జాతీయ స్థాయికి వెళ్లి అక్కడే సెటిలై తెలంగాణకు తిలోదకాలిచ్చినవాళ్లే.. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చారని.. తమకు అన్ని విధాలా అండగా నిలబడతారని ఆశించినంతలోనే నిట్టనిలువునా ద్రోహం చేసి.. శత్రువుతో చేతులు కలిపి వెళ్లిన వారే.. దీనికి ఆదిపురుషుడు మర్రి చెన్నారెడ్డి అయితే.. ఆయనకు అంతేవాసులు ఇప్పటి నాయక గణం. ఎంతమంది నాయకులు.. ఓ కెసిఆర్.. ఓ జానా.. ఓ ఎర్రబెల్లి.. ఓ పొన్నం.. ఓ గద్దర్.. విమల.. సంధ్య.. సబిత, సునిత, గీత, కెకె.. కోమటిరెడ్డి.. లెక్కించుకుంటూ పోతే.. ఎన్ని వేళ్లున్నా సరిపోవు.. అన్నింటినీ మించి కోదండరామ్.. అందరికీ తెలంగాణ కావాలి.. ఎవరి ప్రయోజనాలూ కోల్పోవద్దు.. ఎవరి వ్యాపారాలు నష్టపోవద్దు.. ఎవరి రాజకీయ భవిష్యత్తు నష్టపోవద్దు.. తెలంగాణ రావాలి.. వద్దు.. ఎవరి అజెండా వారిది. ఎవరి జెండా వారిది.. ఒకరికొకరు.. ఒకరిపై ఒకరు కుట్రలు.. కుతంత్రాలు.. అడపా దడపా రోకోలు.. ధర్నాలు.. బంద్‌లు.. జైతెలంగాణ నినాదాలు..
దీనికి పరిష్కారం ఉందో లేదో తెలియదు.. ఉంటే ఏ విధంగా ఉంటుందో అంతకంటే తెలియదు.. ఎలా ముగింపునిస్తారో అర్థం కాదు.. తెలియని అయోమయం తెలంగాణాలోని ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అర్థం లేని ఆందోళన వేటాడుతోంది.. ఎంతో స్థిరచిత్తంతో ఉన్న సామాన్య తెలంగాణా పౌరులు సైతం ఒక దశలో తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితులు.. సందర్భాలు కొల్లలు.
తెలంగాణా జెండాను.. అజెండాను భుజానికి ఎత్తుకుని పదకొండేళ్ల నుంచి మోస్తున్న వీరుడి స్థిరచిత్తం ఏమిటో తెలంగాణా ప్రజానీకానికి అంతుపట్టని వ్యవహారం.. 2001లో ఉద్యమ పార్టీగా మొదలైన కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఏ దిశగా ఉద్యమాన్ని తీసుకుపోతోంది.. కెసిఆర్‌కు మినహా ఎవ్వరికీ తెలియదు.. తారకరాముడికీ, కవితమ్మకూ, మేనల్లుడికీ కూడా అంతుపట్టని ధృతరాష్ట్ర వ్యూహం కెసిఆర్‌ది. సడన్‌గా తెరపైకి వస్తారు.. డెడ్‌లైన్‌లు.. డెత్‌వారంట్లూ జారీ చేసేస్తారు.. ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేస్తారు.. ఏదో జరిగిపోతుందన్న భ్రమలు కలిపిస్తారు.. ఆర్‌యాపార్ అనేస్తారు.. ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. ఆమరణ దీక్షతో మొదలైంది.. రాజీనామాల పర్వంతో ఊపందుకుంది.. వచ్చింది వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోవటంతో తీవ్రమైన నిరసనగా పెల్లుబికింది.. రెండేళ్లు గడిచిపోయాయి.. ఏం సాధించామో తెలియదు..? ఎలా సాధిస్తామన్నది ఎంతకీ అంతుపట్టదు.. ఇంతకీ సాధించేది ఏమిటో అర్థం కాదు.. అసలు ఏదైనా సాధిస్తామా లేదా అన్నదీ జవాబులేని ప్రశ్నే..
ఇప్పుడు అన్నీ ప్రశ్నలే.. అన్నీ సందేహాలే..
ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని రిమోట్‌తో కంట్రోల్ చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు..?
ఉస్మానియాలో ప్రారంభమైన విద్యార్థి ఉద్యమాన్ని హైజాక్ చేసింది ఎవరు? దాన్ని నామమాత్రంగా మార్చటానికి కారకులెవరు?
అర్థం లేని భ్రమలు కల్పించి.. దాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లి ఒక్కుదుటున చల్లార్చటానికి కారణం ఏమిటి?
మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చి ప్రజలందరూ సమాయత్తం అయిన తరువాత ఢిల్లీకి వెళ్లి మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ప్రయత్నించింది ఎందుకోసం?
తప్పనిసరిగా నిర్వహించుకున్న మిలియన్ మార్చ్‌లో చివరినిమిషంలో పాల్గొని నామమాత్రంగా ముగింపుపలకటానికి కారణం ఏమిటి?
సహాయ నిరాకరణ ఎందుకోసం జరిగింది? ఏం సాధించారని ముగిసింది? దీని వల్ల ఎవరిపై ఒత్తిడి పెంచగలిగారు? ఎవరిని సంఘటితం చేయగలిగారు? లక్ష్యసాధన దిశలో సాధించిన ఫలితం ఏమిటి?
కేసుల ఎత్తివేతకోసం దీక్షల డ్రామా ఎవరిని మెప్పించేందుకు జరిగింది? ఆ తరువాతైనా ఎత్తివేయటం సాధ్యమైందా?
అంతిమ ఘట్టంలో చేపట్టాల్సిన అస్త్రాన్ని ముందే ప్రయోగించి విఫలం చేసేందుకు కారకులు ఎవరు?
లక్ష్యం సాధించేంత వరకు పట్టు వీడేది లేదంటూ ప్రతి వేదికపైనా పిడికిలి బిగించిన మహానేత ఆ పిడికిలిలోని ఒక్కో వేలిని ఎందుకు సడలించుకుంటూ వెళ్లిపోయాడు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమాధానం.. సకలజనుల సమ్మెను ప్రారంభించేనాడు ఈ బుద్ధేమైంది.. దీని వల్ల ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారన్న ఆలోచన ఆనాడేమైంది?
నలభైరోజుల సకలజనుల సమ్మెతో సాధించింది ఏమిటి? దీనివల్ల ఎవరిపై ఒత్తిడి పెంచగలిగారు..నిన్ను నువ్వు హింసించుకోవటం వల్ల ఎవరికి నష్టం.. ఏడువందల మంది ఆత్మహత్య చేసుకుంటే జరిగిన నష్టం వాళ్ల కుటుంబాలకే తప్ప మిగతా రాష్ట్రానికి కాదు.. సకల జనుల సమ్మె వల్ల జరిగిందీ అదే.. మీరు వ్యక్తం చేస్తున్న నిరసన ఎవరిపైన? మీరు చేస్తున్న సమ్మె ఎవరిపైన? దాని వల్ల ఎవరిపై ఒత్తిడి పడింది? ప్రత్యర్థికి కష్టం కలిగినప్పుడు అతను ఒత్తిడిని ఫీలవుతాడు.. ఆ ఒత్తిడిని తగ్గించుకోవటం కోసం ప్రయత్నిస్తాడు.. కానీ, ఇప్పుడు జరిగిన సకలజనుల సమ్మె తెలంగాణా నాయకత్వంతెలంగాణాపైనే ఒత్తిడి తెచ్చిపెట్టింది... తాను కొనితెచ్చుకున్న ఒత్తిడిని తానే తాళలేక ఒక్కో అడుగు వెనక్కి తీసుకుంది.. ఇది నాయకత్వ లక్షణమా?
ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ఒక భాగం కాదని ముఖ్యమంత్రి సహా సమస్త పాలకగణం భావిస్తున్నది.. తెలంగాణా అన్న ప్రాంతం భారతదేశంలో ఒక భాగం కాదేమోనన్న భ్రమలో నిర్లిప్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇక్కడి నిరసనలకు విలువ లేదు.. ఆందోళనలకు విలువ లేదు.. సమ్మెలకు విలువ లేదు.. సహాయ నిరాకరణలకు విలువ లేదు.. హింస జరగనంత వరకూ.. అహింసాయుతంగా ఎన్ని సమ్మెలు నడిచినా.. మాటలతూటాలు పేలినా, ఆర్థిక నష్టం వాటిల్లినా.. ఎవరికీ పట్టదు. హింస జరిగితే అణచివేయటానికి సైన్యం ఎలాగూ రెడీగా ఉంటుంది కదా.. మన సైన్యం ఉన్నదే సొంత ప్రజల మీద ప్రతాపం చూపేందుకు...
ఏ యుద్ధంలోనైనా శత్రువును అష్టదిగ్బంధనం చేసి పరాజితుని చేయటం ప్రత్యర్థి లక్షణం.. తెలంగాణా నాయకత్వం తనపైనే తాను అస్త్రాలు సంధించుకుంది.. తన ప్రజలపైనే బాణ వర్షం కురిపించింది. ఆత్మహింస చేసుకుంటున్న ప్రత్యర్థిని చూసి శత్రువు చిద్విలాసంగా ఫిడేలు వాయించుకుంటున్నాడు.. అడపాదడపా ఒకట్రెండు అస్త్రాలు సంధిస్తూ మాటలతూటాలు పేలుస్తూ ఆటాడుకుంటోంది..
తెలంగాణాను ఇప్పుడు నిస్సత్తువ ఆవరించింది.. తనకు పరిష్కారం వస్తుందన్న ఆలోచన పూర్తిగా చచ్చిపోతున్నది. విద్యార్థులు అలసిపోయారు..లాయర్లు అలసిపోయారు.. కార్మికులు అలసిపోయారు.. ఉద్యోగులు అలసిపోయారు.. సామాన్య ప్రజలు అలసిపోయారు.. నాయకులు మాత్రం ఇంకా అలసిపోలేదు.. ఏసిరూముల్లో కూచుని ఇంకా వ్యూహరచనలు చేస్తూనే ఉన్నారు.. వారి వ్యూహాలకు వెర్రిబాగుల జనాలు తలలూపుతూనే ఉన్నారు.. ఊపకపోతే తెలంగాణా కాజ్ ఏమైపోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఎందుకంటే శత్రువు కాచుకుని రెడీగా ఉన్నాడు.. ఏమాత్రం అవకాశమిచ్చినా.. అదిగో తెలంగాణా లేదు.. ఏమీ లేదనటానికి.. సిద్ధంగా ఉన్నాడు.. అందుకే దాన్ని బతికించటం కోసం తెలంగాణా సామాన్యుడు నానా అవస్థ పడుతున్నాడు..
ఇక తెలంగాణ వస్తుందన్న ఆశ లేదు. ఈ ఉత్తరకుమారులు సాధించేది ఏమీ లేదు.. ఇవాళ వాళ్లు వీరులు.. వాళ్లే గెలుస్తున్నారు.. గెలుస్తారు.. అరిచిగీపెట్టినా తెలంగాణా రానివ్వరు.. పైవాళ్లు ఇస్తామన్నా.. ఇవ్వనివ్వరు.. ఇది వీరుడి జన్మలక్షణం.. వాళ్ల కూటనీతి ముందు మరో ఓటమిని చవిచూసేందుకు తెలంగాణా సిద్ధమవుతోంది.. ఎంతైనా లగడపాటి రాజగోపాల్ నిజమే చెప్పారు.. సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని.. తెలంగాణా చచ్చినా రాదని.. పాపం సీమాంధ్రులే.. సారీ.. సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుకోని సమైక్యాంధ్ర మాత్రమే కావాలని కోరుకునే ఔత్సాహికులే పదిపదిహేను మంది గుంపులుగా ఏర్పడి సరదాగా ఆందోళనలు చేసుకుంటున్నారు..

12, అక్టోబర్ 2011, బుధవారం

లగడపాటి ఇప్పుడేమంటారు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతామంటేనే గుండె రెండుగా చీలిపోయినట్లుగా లగడపాటి రాజగోపాల్‌ తెగ బాధపడిపోయారు.. దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లిపోయిందని బాధపడిపోయారు.. ఇప్పుడు ప్రశాంత్‌భూషణ్‌ ఏకంగా కాశ్మీర్‌నే పాకిస్తాన్‌కు ఇచ్చేయమని సలహా ఇస్తున్నారు.. ఈ మాట విని లగడపాటి గుండె తట్టుకుంటుందా? ఇప్పుడు కెసిఆర్‌కు పంపించినట్లుగా సీడీలు, పుస్తకాలు ప్రశాంత్‌భూషణ్‌కు కూడా పంపిస్తారా?

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఉత్తర కిష్కింధ (నాటిక)

కొడవటిగంటి కుటుంబరావు గారు ఎప్పుడో 1952లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు రాసిన నాటిక ఇది.. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.. ఇప్పుడు రాష్ట్రంలో  ఎవరికి వారు తాము నిర్వహిస్తున్న పాత్రలను చూసి ఉలిక్కిపడేలా చేసిన నాటిక ఇది..

ఉత్తర కిష్కింధ (నాటిక)
రచన : కొడవటిగంటి కుటుంబరావు


కొడవటిగంటి కుటుంబరావు
10-28-1909  –-  08-17-1980

[ఈనాటిక మొదటిసారిగా అక్టోబర్ 1952 లో ఆంధ్రజ్యోతి మాసపత్రిక లో ప్రచురింపబడింది. ఈ నాటిక రాసినప్పుడు కుటుంబరావు గారు ఎటువంటి సమకాలీన రాజకీయాలను గురించి ఆలోచించారో గాని, ఎప్పటికైనా అటువంటివాటికి ప్రజలు పూనుకోవాల్సిందేననే స్పష్టమైన అవగాహన మాత్రం ఆయనకు ఉండిందని తెలుస్తుంది. ఇటువంటివి ఈనాడు జరగటంలేదనీ అనలేము. ఈ నాటిక ప్రచురించడానికి అనుమతిని ఇవ్వడామే కాక టైపు కూడా చేసి ఇచ్చిన కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి కృతజ్ఞతలు. -సంపాదకులు]

మొదటి రంగం

(కిష్కింధ రాజభవనం)

హనుమంతుడు: జయము జయము మహారాజా! సుగ్రీవ సార్వభౌమా!

సుగ్రీవుడు: సార్వభౌమత్వం ఏడిచినట్టే వుంది. మనవాళ్ళంతా చేరి నా ఎముకలు కొరికేస్తున్నారు. వెనక రుష్యమూకం మీద మనం అజ్ఞాతవాసం చేసిన రోజులు హాయిగా ఉన్నాయనిపిస్తోంది.

హను: ఇప్పుడేం వచ్చిందీ? హాయిగా మనం మళ్ళీ రాజ్యం తెచ్చుకున్నాంగా ఆ శ్రీరామచంద్రమూర్తి కృపచేతా?

సుగ్రీ: ఆ జాంబవంతుడేమంటున్నాడో విన్నావా? మనం వట్టి దద్దమ్మలంట. మన బలగంతో శ్రీరామచంద్రుడు ఆసేతుహిమాచలం జయించి తన రాజ్యం ఏర్పాటు చేసుకున్నాట్ట. రామరావణ యుద్ధంలో నిజమైన ఆర్యుడి రక్తం ఒక్క బొట్టు కూడా చిందలేదట. ఈ ఆర్యపాలకులకు సామంతులు కావటం తప్ప మనకు గతే లేదట! విన్నావా?

హను: అంత పచ్చి అబద్ధాలాడతాడా జాంబవంతుడు!

సుగ్రీ: నీ మొహంలా వుంది. వాడనేవి అబద్ధాలైతే ఏ చిక్కూ లేదు. నిజం కాబట్టే చిక్కు. రావణుడికి కూడా తలవంచని కిష్కింధకు దాస్యపు రోజులు వచ్చాయని జాంబవంతుడంటున్నాడు. అందరూ వింటున్నారు. నేను వాలిని చంపించింది కిష్కింధకు దాస్యం అంటగట్టటానికే నంటున్నారు.

హను: మనం రామరాజ్యంలో ఉండమని ఖచ్చితంగా చెప్పెయ్యకూడదూ?

సుగ్రీ: అమ్మో ఇంకేమన్నా ఉందా? నా పుచ్చె యెగిరిపోదూ?

హను: మరయితే ఏమిటి ఉపాయం?

సుగ్రీ: చూడు హనుమంతుడూ, నీవు కాస్త నలుగురు బలవంతుల్ని సామంతులు చేద్దూ. వాళ్ళకి మంత్రి పదవులన్నా పారేస్తాను!

హను: అట్లా వస్తారా?

సుగ్రీ: ఆఁ రాకేంచేస్తారు? మంత్రిపదవులంటే అంతా వస్తారు. రుష్యమూకుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టుండు. రుష్యమూకం కిష్కింధలోది కాదని వాడంటున్నాట్ట. వాడి వాలకం చూస్తే వాడు మన మాట వినేట్టు లేడు. రుష్యమూకాన్ని కిష్కింధలో చేర్పిస్తానని నాకు లక్ష్మణుడు మాట యిచ్చాడు. తీరా ఏం చేస్తాడో?

హను: అంగదుడు మన మాట వింటాడు లెండి. నలుడూ, నీలుడూ, జాంబవంతుడూ చాలా దగ్గిర స్నేహితులు.

సుగ్రీ: వాళ్ళని ఎట్లాగైనా విడగొట్టుదూ

హను: ప్రయత్నిస్తా, సెలవు!

రెండో రంగం

(కిష్కింధ వెలుపల)

జాంబవంతుడు: జై స్వతంత్ర కిష్కింధకూ …

అందరూ: జై!

జాంబ: మిత్రులారా! ఇవాళ చాలా సుదినం. నా పిలుపు విని మీరంతా వస్తారని నాకు తెలుసు. నేను రాజకీయవేత్తను కానని మీరెరుగుదురు. నేను యుద్ధ నిపుణుణ్ణి. అనేక యుద్ధాల్లో ఆరితేరినవాణ్ణి. ఆ సంగతి నేను మీకు మనవి చేయనక్కర్లేదు. నాకిప్పటికి ఎనభై ఏళ్ళు. కాని నా జీవితంలో యుద్ధంలో గెలిచి, రాజకీయంగా ఓడటమనేది ఎరగను. ఈ దుర్దశ మనకీ రామరావణ యుద్ధంతో సంప్రాప్తం అయిందని చెప్పటానికి నాకు చాలా చిన్నతనంగా ఉంది. ఈ యుద్ధం గెలిపించిందెవరు? మనం. మన గతి ఏం కానున్నది? అ మనం అయోధ్యకు దాస్యం చెయ్యనున్నాం. శ్రీరామపట్టాభిషేకం ఇక్కడ వైభవంగా జరపాలట. సుగ్రీవుడుగా రాజ్ఞాపించాడు. దీన్ని మనం ఎలా సహించగలం? ఏం నలా, నీలా, మాట్లాడరేం?

నలుడు: ఏం మాట్లాడం? నువేమన్నా తప్పు చెప్పావు కనకనా?

నీలుడు: నువ్వే పెద్దవాడివి. సలహా చెప్పు, ఏం చెయ్యమంటావో?

జాంబ: ఇంకేం చెయ్యాలి, మనం స్వతంత్ర కిష్కింధ నినాదం లేవదీయాలి. సుగ్రీవుడు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు. లేదా మరొకరు పరిపాలన చేస్తారు. సుగ్రీవుడే పరిపాలన చెయ్యాలని ఏ వేదాల్లో రాసిపెట్టి ఉంది?

నలు: ఒకవేళ సుగ్రీవుడు వినకపోతే?

జాంబ: వినకపోతే మనం అతని పరిపాలనకు తోడ్పడవద్దు. తన మంత్రుల పేర్ల జాబితా అయోధ్యకు రహస్యంగా పంపాట్ట. అక్కడ ఆ పేర్లు ఆమోదించబడాలన్నమాట! ఎన్నడన్నా ఈ ఘోరం ఎరుగుదుమా?

పిపీలిక: ఏం జాంబవంతుడూ? అందులో నీ పేరు లేదా ఏం?

జాంబ: నోరుముయ్యరా, పిపీలికా! నేను ముష్టి మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాననుకున్నావా? ఈసారి మళ్ళీ ఆ మాటంటే, సున్నంలోకి ఎముక ఉండదు జాగర్త…నేననేదేమిటంటే, మనం ఐక్యంగా ఉంటే ఈ సుగ్రీవుడు మన మాట వినకేంజేస్తాడు?

గదుడు: అది కాదే తాతా! ఒకవేళ సుగ్రీవుడి కిష్టమైతే మాత్రం అయోధ్యవాళ్ళు కిష్కింధకు స్వాతంత్ర్యం ఇవ్వకపోతే అప్పుడేం చేయటమని?

జాంబ: ఒరే గదుడూ? అన్నీ తెలిసి నువ్వే అట్లా అడుగుతావేం? శ్రీరాముడికి జయించిపెట్టినవాళ్ళం, మన స్వాతంత్ర్యం కోసం పోరలేమా? ఏమిటో అనబోయావు దీర్ఘవాలా?

దీర్ఘవాలుడు: ఏమీలేదు. స్వతంత్ర రుష్యమూక నినాదం ఏం చేస్తామని!

జాంబ: వాళ్ళు అజ్ఞానం చేత ఆ నినాదం లేవదీశారు. ఈ ఉద్యమం నడిచేది కాదు.

దీర్ఘ: వాళ్ళు వాలిని గొప్పవాణ్ణి చేసి, సుగ్రీవుణ్ణి భ్రాతృహంతకుడుగా ప్రచారం చేస్తున్నారు. నిజానికి వాలి రుష్యమూకంవారి స్వాతంత్ర్యాన్ని గౌరవించాడు.

జాంబ: ఇదంతా వట్టి భ్రమ. కిష్కింధలో అంతర్భాగంగా తప్ప రుష్యమూకం అభివృద్ధి చెందలేదు. అందుచేత మీరంతా ఇప్పుడు ప్రమాణాలు చెయ్యండి. స్వతంత్ర కిష్కింధ ఏర్పడితే తప్ప సుగ్రీవుడి ప్రభుత్వంతో సహకరించమని.

అందరూ: చేస్తాం! అలాగే చేస్తాం!

దీర్ఘ: ఏమో! నేనింకా ఆలోచించుకోవాలి.

మూడో రంగం

(కిష్కింధలో రాజభవనం)

సుగ్రీ: పిపీలికా, రా! కూర్చో, ఏమిటి విశేషాలు?ఎల్లుండి అయోధ్యలో జరగనున్న రామ పట్టాభిషేకం మనం ఇక్కడ జరపబోతున్నాం. భారీగా ఏర్పాట్లు కావలసి ఉన్నాయి. నీబోటి మిత్రులంతా పట్టించుకోకుండా తిరిగితే ఎట్లా?

పిపీలిక: ఆ నాదేముందిలెండి, నా మొహం! అందరూ సహకరిస్తేగాని జయించలేని ఆ జాంబవంతుడే నన్ను తీసిపారేస్తున్నాడు.

సుగ్రీ: నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావటంలేదు. జాంబవంతుడేమిటి, జయించటమేమిటి?

పిపీ: మీరింకా వినలేదా? వాళ్లంతా రామ పట్టాభిషేక మహోత్సవాన్ని బహిష్కరిస్తారుట.

సుగ్రీ: జాంబవంతుడే ? అట్లా ఎన్నటికీ జరగదు. నేను నమ్మను.

పిపీ: జరిగినా జరక్కపోయినా ఇప్పటికి వాళ్ళ ఉద్దేశమదే.

సుగ్రీ: వాళ్ళతో నీకెందుకులే. నువు చాలా బుద్ధిమంతుడివి. అయోధ్యకు నా ప్రతినిధిగా హనుమంతుణ్ణి పంపేశాను. అక్కడ వారు కిష్కింధకు అఖండగౌరవం చెస్తారు. ఇక్కడ మనం అయోధ్యకు అఖండగౌరవం చెయ్యాలి. ఉత్సవం ఏర్పాట్లన్నీ నీ చేతిలో పెడదామనుకుంటున్నా, ఏమంటావు మరి?

పిపీ: మీరు చెప్పినదానికి ఎదురుంటుందా? కానివ్వండి. (సంతోషం వెలిబుచ్చుతాడు)

సుగ్రీ: అయితే మరి నువ్వు వెంటనే అంగదుణ్ణి కలుసుకుని ఏర్పాట్లు చేయించు.

(నలుడు, నీలుడు ప్రవేశం)

సుగ్రీ: రండి రండి. కూర్చో నలా, కూర్చో నీలా, మీ కోసమే ఎదురుచూస్తున్నా. నా కాబోయే మంత్రులై ఉండి మీరు తప్పించుకు తిరగటం ఏమీ భావ్యంగా లేదు. రేపుగాక ఎల్లుండే రామ పట్టాభిషేకం.

నలుడు: మాకు మంత్రిత్వాలు అక్కర్లేదు, రామ పట్టాభిషేకమూ అక్కర్లేదు. మాకు కావలసింది సుగ్రీవ పట్టాభిషేకం.

సుగ్రీ: పిచ్చివాడా, ఎట్లాగూ జరిగేదదే. మీ అభిప్రాయాలు నేనెరుగుదును. నా అభిప్రాయాలూ అవే. కాని ఒకటి అడుగుతాను. స్వాతంత్ర్యం పేరిట ఈ భరతఖండం ఇంకెంతకాలం విచ్ఛిన్నం కావాలని?

నీలుడు: ఐక్యత పేర మనం దాస్యం ఎందుకు తెచ్చుకోవాలన్న ప్రశ్న ఉండొద్దా?

సుగ్రీ: మిమ్మల్ని చూస్తే నాకు విచారంగా ఉంది. మీరేమో నిస్వార్థంగా ఆదర్శం ఆలోచిస్తున్నారుగాని, మీ మనస్సులు పాడుచేసే ఆ ముసలి జాంబవంతుడు కేవలం స్వార్థం ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఎవరితోనూ అనకండి. ఈ జాంబవంతుడు నన్ను రెండు విషయాలడిగాడు. అయోధ్యకు కిష్కింధ ప్రతినిధిగా తనను పంపమన్నాడు. తనను ప్రధానమంత్రి చెయ్యమన్నాడు. అయోధ్యకు వెళ్ళటానికి హనుమంతుడికన్న తగినవాడు లేనేలేడని ఎవరైనా ఒప్పుకుంటారు. నామటుకు నేనే పనికిరాను. పోతే ఈ ముసలాణ్ణి ప్రధానమంత్రిగా చేసుకుని మీవంటి యువకులకు అన్యాయం చేయనా? పైగా జాంబవంతుడు యోధుడు. రాజకీయవేత్త కాడు. ఆ సంగతి కిష్కింధ స్వతంత్ర్యోద్యమం చూస్తేనే తెలుస్తున్నది. ఈ ఉద్యమం గురించి అయోధ్యలో అంతా నవ్వుకుంటున్నారు. మనలో చీలికలు మనకే హానిచేస్తాయి. పైవారికేం?

నలుడు: జాంబవంతుడి వ్యక్తిగత ఆశయాలతో మాకు నిమిత్తం లేదు. అతడు చెప్పేది మాకు సరిగా తోచింది. ఈ ఉద్యమాన్ని మేం బలపరిచి తీరుతాం.

సుగ్రీ: సరే మీ యిష్టం, నేను చెప్పవలసింది చెప్పాను. రేపు జాంబవంతుడు మిమ్మల్ని విడిచినప్పుడుగాని మీరు పశ్చాత్తాపపడరు. ఇక మీరు వెళ్ళవచ్చు.

రుష్యమూకుడు: నమస్కారం మహారాజా! నన్నెందుకు పిలిపించారట?

సుగ్రీ: రా, కూర్చో, రుష్యమూకా, ఒక శుభవార్త తెలుపటానికే నిన్ను రమ్మన్నాను. రామరాజ్యంలో రుష్యమూకానికి మహోన్నతస్థానం ఇవ్వవలసిందిగా సీతామహాదేవి శ్రీరామచంద్రుణ్ణి కోరిందట. "నాకు అయోధ్య కన్న రుష్యమూకం ప్రియతమమైంది. నేను నా సింహాసనం కంటే రుష్యమూకంతో స్నేహం ఎక్కువగా భావిస్తాను" అని శ్రీరామచంద్రులవారు హనుమంతుడితో అన్నారట. నా నమ్మకం ఏమిటో తెలుసా? కిష్కింధకు ఇకమీదట రుష్యమూకమే రాజధాని అవుతుందని.

రుష్య: చాలా సంతోషం. ఈ వార్త విని నా చెవులు పవిత్రమయాయి. రామ పట్టాభిషేకం రుష్యమూకం మీద మహావైభవంగా జరిపిస్తాను. వ్యవధి లేదు. వెళ్ళిరానా? సెలవా?

సుగ్రీ: మంచిది, నాయనా వెళ్ళిరా..ఒరే, ఎవడ్రా అక్కడా?

సేవకుడు: ప్రభూ!

సుగ్రీ: జాంబవంతుడింకా రాలేదా?

సేవ: ఇంతకు ముందే వచ్చి మీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు, ప్రభూ!

సుగ్రీ: రమ్మను, రమ్మను…రా, బాబాయ్! ఇదేమిటి బాబాయ్? ఈ సమయంలో అందరికన్న ముందుండి మమ్మల్ని నడిపించాలిసినవాడివి నాతో సహాయనిరాకరణ చేస్తావా? ఇదేమన్నా బాగుందా?

జాంబ: ఒరే, నీ నక్క వినయాలు కట్టిపెట్టు! నువు రాముడికి అమ్ముడుపోయావ్. ఎందుకు పిలిపించావో చెప్పు.

సుగ్రీ: కిష్కింధ స్వాతంత్ర్యం గురించి నీ ఒక్కడికే పట్టిందనీ, మాకెవరికీ లేదని నీ అభిప్రాయం, అవునా? హనుమంతుడి ద్వారా నేను ఖచ్చితంగా అయోధ్యకు కబురుచేశాను. కిష్కింధ సర్వస్వతంత్రం కావాలనీ, కిష్కింధ భవితవ్యం కిష్కింధ ప్రజలే నిర్ణయించుకుంటారనీనూ.

జాంబ: నిన్ను నేను నమ్మను.

సుగ్రీ: అయోధ్యవారు దీనికి ఒప్పుకుంటారంటేనన్నా నమ్ముతావా?

జాంబ: వాళ్ళు ఒప్పుకున్నారు కూడానా? నిజమా?

సుగ్రీ: అవును బాబాయ్, ఎందుకు ఒప్పుకోరూ? వాళ్ళు రుష్యమూకం స్వాతంత్ర్యం కూడా ఒప్పుకుంటేనూ?

జాంబ: రుష్యమూక స్వాతంత్ర్యమా? అదెట్లా కుదురుతుందీ?

సుగ్రీ: ఎందుకు కుదరదూ?

జాంబ: మనకూ రుష్యమూకానికీ మధ్యగోడా? వాలి ఈ రెంటినీ కలపక విభేదాలు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ విభేదాలు కావాలా?

సుగ్రీ: పిచ్చివాడా, శ్రీరామచంద్రుడు దేశమంతా ఏకం చెయ్యాలని చూస్తున్నాడు. నీకు రుచించిందా? మనం ఎంతసేపూ విభేదాల కోసమే చూస్తున్నాం. ఎక్కడో ఉన్న అయోధ్య మన స్వాతంత్ర్యాన్ని అపహరిస్తుందని భయపడి మనం మన పక్క ఉన్న రుష్యమూకాన్ని పోగొట్టుకుంటున్నాం. అయోధ్య మనల్ని పాలించటం నామమాత్రం. మనకూ రుష్యమూకానికీ మధ్య గోడలు ప్రత్యక్షం.

జాంబ: (అరుస్తూ) రుష్యమూకం లేని కిష్కింధకు ఈ జాంబవంతుడెన్నటికీ ఒప్పడు.

సుగ్రీ: ఆ మాటమీదే ఉండు బాబాయ్.

నాలుగో రంగం

(కిష్కింధ పురవీధులలో ఉత్సవం, కోలాహలం, బాకాలు, మేళాలు, భజనలు)

1వ గొంతు: ఆహా! ఏమి వైభవంగా జరుగుతోంది పట్టాభిషేక మహోత్సవం.

2వ గొంతు: పేరు రాముడిది, అనుభవం సుగ్రీవుడిదీనూ. అంబారీలో ఎట్లా కూచున్నాడో రాజాధిరాజల్లే.

3వ గొంతు: పక్కన జాంబవంతుడు చూశావా? నిన్న మొన్న కూడా ఈ ఉత్సవాన్ని బహిష్కరిస్తున్నామనే అన్నాడు. అవకాశం దొరికేసరికి అంబారీ ఎక్కి కూచున్నాడు చూసుకో.

4వ గొంతు: అంతా ప్రగల్భాలు చెప్పేవారే. వీళ్ళని నమ్మితే ఏమవుతుందయ్యా? దేనికైనా ప్రజలం పూనుకోవాల్సిందేగాని!

-అక్టోబర్ 1952, ఆంధ్రజ్యోతి మాసపత్రిక

8, ఆగస్టు 2011, సోమవారం

7, ఆగస్టు 2011, ఆదివారం

వైరి చక్రాన్ని తప్పక అతిక్రమిస్తాం

ఏ దేవతలూ రక్షించటం లేదు
ఏ మహాత్ములూ కాపాడటం లేదు
నమ్మకం కోల్పోయి కాళ్ల కింద భూమి తొలగిపోయి
ఎక్కడా నిలువ లేక తల్లీ తెలంగాణమా.. ఒక్కరొక్కరుగా నీ దరికి చేరిపోతున్నారు
తెలంగాణమొక ఆకాశసముద్రంగా మారిపోయింది
ఈ సముద్రంలో ఎంతసేపు ఈదినా శరీరం అలసిపోదు...
ఎప్పటికీ చేతికి ఏదీ అందదు.
క్షణక్షణం మారే రంగులతో సమైక్యవాది వలె
ఈ ఆకాశం అంచనాలకు అందటం లేదు
దూరం తెలియనంత గమ్యంలో 
తెలంగాణం కనిపిస్తోంది.. ఆ
ఆ దూరం తరగటం లేదు.. గమ్యం చేరటం లేదు
మన ప్రయాణంలో ఆయుధాలను వారు దొంగలిస్తున్నారు
గమ్యం చేరకముందే రైలుపట్టాలను తొలగిస్తున్నారు
సంకల్పాలను విషపూరితం చేస్తున్నారు
సామరస్య ద్వారాలను మూయిస్తున్నారు
మృత్యు శార్దూలాలై మీదపడి దొంగదెబ్బ తీస్తున్నారు
డిసెంబర్ 9  బర్త్‌డే గిఫ్ట్‌ప్యాక్‌ను దారిదోపిడీగాళ్లు దోచుకుపోయారు
వైఫల్యమే ఫలించబోతోందా అన్న అనుమానం
తెలంగాణమా నీ బిడ్డలు ఒక్కొక్కరే నీలో సంలీనమవుతున్నారు
అయినా ఇక్కడ ఎవరూ బలహీనులు లేరు
వర్చస్సు కోసం.. బలం కోసం.. శక్తి కోసం
ఈ మృత వీరులు శ్రీకాంత్.. యాదిరెడ్డిల హస్తాల నుంచి ధనస్సులు అందుకుంటున్నాం
మీరూ.. మేమూ.. మనం అంతా కలిసి 
తెలంగాణమంతటా ఆవరించిన వైరి చక్రాన్ని తప్పక అతిక్రమిస్తాం
ఈ వీరులను తెలంగాణ మాతృభూమి ఒడిలోకి 
అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకే చేరుస్తున్నాం
తల్లీ నీ బిడ్డను బలంగా నొక్కకు.. 
ఆవేదనతో నీ దరికి చేరుతున్నారు
శిరీషకోమల శరీరాల్ని సుకుమారంగా నీలో పొదువుకో
తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగించుకున్నట్లుగా ఒదిగించుకో
మేము తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చుతాము
వేయి అమర నక్షత్రాల సాక్షిగా తెలంగాణ మహోదయాన్ని స్వాగతిస్తాం 


దగా పడ్డ తెలంగాణలో మరో నిశ్శబ్ద హత్య

దగా పడిన తెలంగాణలో మరో చావు! ఆత్మహత్య మాటున సర్కారీ హత్య! నాలుగు కోట్ల మంది ఆకాంక్షలను చులకన చేస్తున్న సమైక్యవాదం తీసిన ప్రాణం! మొన్న ఆజాద్ వ్యాఖ్యలతో కలత చెంది.. పార్లమెంటు సాక్షిగా యాదిడ్డి చేసిన బలిదానం స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే మరో ఆత్మత్యాగం! ఇప్పుడు దోషి చిదంబరం! యాదిరెడ్డి అమరత్వాన్ని ప్రశ్నించిన మంత్రి తెలంగాణ విద్యాకుసుమాన్ని తన కరకు వ్యాఖ్యలతో చిదిమేసిన వైనం! శుక్రవారం లోక్‌సభలో చిదంబరం వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన ఆర్ శ్రీకాంత్ పాతికేళ్లకే నూరేళ్లూ నింపుకొన్నాడు. తెలంగాణ చూడటానికి బతికుందామని ఉద్యమం మొత్తుకుంటున్నా.. జాతీయనేతలు ధైర్యం చెబుతున్నా, కుటిల నేతల కపట నాటకాలతో చిన్నబోయిన చిన్ని మనసు.. తీవ్ర నిర్ణయమే తీసుకుంది. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు నమస్తే తెలంగాణకు ఈమెయిల్‌లో ఆత్మహత్య లేఖ పంపాడు శ్రీకాంత్. 

దాన్ని గమనించి, వెంటనే అతడికి ఫోన్ చేసేలోపే.. ఈ లోకం విడిచి బిడ్డ పోయిన దుఖఃంతో కన్నతల్లి కుమిలిపోతున్నది! ఇంకెన్ని బలిదానాలంటూ ఉద్యమం భోరుమంటున్నది! కావూరీ ఈ అమరత్వాన్ని ఎలా చులకన చేస్తావు? లగడపాటీ ఏమిటి నీ జవాబు? చిదంబరా... ఇప్పుడు నీ ప్రకటనేంటి? అంటూ తెలంగాణ గుండె నిగ్గదీస్తోంది! బతికి సాధిద్దాం.. మన తెలంగాణలో మనం బతుకుదాం.. అంటూ యువతకు కన్నీటితో విన్నవించుకుంటోంది!!


తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న యాదిడ్డి విషాదంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. తానూ తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నానని పేర్కొంటూ తన ఆత్మహత్యను మరోలా చిత్రీకరించవద్దని కోరాడు. తెలంగాణ కోసం తనదే చివరి ఆత్మహత్య కావాలని ఆకాంక్షించాడు. 

ఆత్మహత్యకు ముందు శ్రీకాంత్ ‘నమస్తే తెలంగాణ’ దినపవూతికకు ఈ మెయిల్‌లో ఎడిటర్‌ను ఉద్దేశించి లేఖ పంపించాడు. సబ్జెక్ట్‌లో.. మై సూసైడ్ నోట్ ఫర్ తెలంగాణ అని పేర్కొన్నాడు. లేఖ పాఠం..
నా పేరు శ్రీకాంత్. జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లో ఎంటెక్ చదువుతున్నాను. నా తల్లిదంవూడులకు నేను ఒక్కడినే కొడుకును. తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. రెడ్డి ఆత్మహత్య గురించి పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటన నాకు నిజంగా ఎంతో బాధ కలిగించింది. దయచేసి నా ఆత్మహత్యను తప్పుడు ఆత్మహత్యగా చేయొద్దు. నా సూసైడ్ నోట్‌ను ఇక్కడ జతపరుస్తున్నాను.
పాస్‌వర్డ్: జైతెలంగాణ.
ఆర్.శ్రీకాంత్
ఎంటెక్ మెకావూటానిక్స్ సీఆర్
జేఎన్‌టీయూ విద్యార్థి
హైదరాబాద్ ఏరియా, ఇండియా
+91-9052559413


తెలంగాణ కోసం తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ శ్రీకాంత్ 
ఈ-మెయిల్‌లో పంపించిన లేఖ (సూసైడ్ నోట్) పూర్తి పాఠం.. 
ప్రియమైన టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నేతలకు, తెలుగుదేశం పార్టీకి కాదు
నా తల్లిదంవూడులకు నేను ఏకైక మగబిడ్డను. నేనూ తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నాను. తెలంగాణ నిజమైన హీరోలు కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులే. ఇప్పుడిప్పుడే తెలంగాణ టీ కాంగ్రెస్ నేతలు హీరోలుగా మారుతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలి. వాటిని ఆమోదింపజేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ ఆ పార్టీ నుంచి బయటకు రావాలి. ప్రత్యేకంగా టీ-కాంక్షిగెస్ పార్టీని స్థాపించాలి లేదా టీఆర్‌ఎస్‌లో చేరాలి లేదా స్వతంత్ర అభ్యర్థులుగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి. మేము తెలంగాణ ప్రజలము ఉప ఎన్నికల్లో మిమ్మల్ని మరోసారి గెలిపించుకుంటాము. కేంద్రానికి తెలంగాణ శక్తిని చూపుతాము. దయచేసి (నాయకులారా) తెలంగాణ కోసం పోరాడుతున్నట్టుగా నటించకండి. నిజమైన పోరాటంతో మీ శక్తిని హైకమాండ్‌కు తెలియచేయండి. 
జైపాల్‌డ్డి, దానం నాగేందర్.. తెలంగాణకు మద్దతు ఇవ్వని ఇతరుల వైఖరి చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటంతో తెలంగాణ మొత్తం భగ్గుమంటోంది. కాని ఈ తెలంగాణ వ్యతిరేక నాయకులు తమ పదవులకు అంటిపెట్టుకుని ఉన్నారు.

ప్రియమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, గవర్నర్ నరసింహన్.. దయచేసి 14ఎఫ్ రద్దు చేసి పరీక్షలు నిర్వహించండి. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి (సోనియాగాంధీకి) తెలియజేయండి. 
తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు తెలుపుతున్న ప్రియమైన టీఆర్‌ఎస్ (కేసీఆర్, కేటీఆర్, ఈటెల, హరీష్‌రావు), బీజేపీ (సుష్మాస్వరాజ్, ముండే, దత్తావూతేయ), సీపీఐ (గురుదాస్ దాస్ గుప్తా), కాంగ్రెస్ (కేకే, జూపల్లి, మధుతోపాటు అంతా), నాగం, గద్దర్, అన్ని జాక్‌ల నాయకులు.. పోరాటం ఆపొద్దు. మనం దాదాపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుదాకా వచ్చాం. నా ప్రాణం మీ బలాన్ని పెంచుతుందని, తెలంగాణ ప్రజలు మరింతగా పోరాడేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నా. 

ప్రియమైన సుష్మాస్వరాజ్, గురుదాస్ దాస్‌గుప్తాగారు.. తెలంగాణపై మీరు పార్లమెంట్‌లో మాట్లాడిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ తెలంగాణలోని పరిస్థితులను సీమాంధ్ర ఎంపీలు అర్థం చేసుకోవటం లేదు. కాని బయటి ప్రజలు తెలంగాణ బాధను అర్థం చేసుకుంటున్నారు. మేడం, సర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం దయతో మాకు మద్దతు ఇవ్వండి. 

ప్రియమైన కేసీఆర్‌గారు మీ బలాన్ని మరోసారి చూపించండి. ఈ చివరి పరిస్థితిలో నిశ్శబ్దంగా ఉండకండి. మీరు నిజమైన హీరో. తెలంగాణ రాష్ట్ర కలను వాస్తవం చేసింది మీరే. నేను మీ అభిమానిని. నేనూ, మా స్నేహితులమందరం మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రానికి మామయ్యా అని పిలుచుకుంటాం. ఐ లవ్ యు సర్ కేసీఆర్.. ప్రొఫెసర్ జయశంకర్‌గారి అస్తమయం ఎంతో బాధను కలిగించింది. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా పోరాటం కొనసాగించాలి. 

కోదండరాం సర్, టీ జాక్.. తెలంగాణ రాష్ట్రాన్ని త్వరగా తెచ్చేందుకు దయచేసి మంచి ఆలోచనలు, మార్గాలు చూడండి. సకల జనుల సమ్మెలాంటి సరికొత్త పద్దతులు అనుసరించాలి.
డియర్ కేకే సర్, టీ కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితుల్లో మీరు ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు, ప్రస్తుతం తెలంగాణ కోసం మీరు గొప్పగా పనిచేస్తున్నారు. మీ ప్రతిదాడుల ద్వారా హైకమాండ్‌కు ముచ్చెమటలు పట్టించండి. 

నాగం జనార్దన్‌డ్డిగారు, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులారా.. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిజంగా అభినందిస్తున్నారు. అయితే నాదో సలహా. ఒంటరిగా ఉండకండి. యుద్ధం చేయండి. టీఆర్‌ఎస్ లేదా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న మరేదైనా పార్టీతో జతకట్టి ఉద్యమాన్ని నడిపించండి. దేవేందర్‌గౌడ్‌లా మిగిలిపోకండి. 

గద్దర్‌గారు.. మీరు తెలంగాణ కోసం బాగా పనిచేస్తున్నారు. అయితే మీలో మరింత శక్తి ఉంది. దానిని మీరు కనబరచటం లేదనిపిస్తోంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర అవసరం కోసం రాష్ట్రానికి, కేంద్రానికి మీ శక్తిని ప్రదర్శించండి. నేను నా చిన్నప్పటి నుంచి మీ అద్భుత గళానిన వింటున్నాను.
సోనియాగాంధీ, యువ రాహుల్‌గాంధీ.. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోండి. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వండి. మరిన్ని ఆత్మహత్యలు జరగకుండా చూడండి. తెలంగాణ కోసం నాదే చివరి ఆత్మహత్య కావాలని కోరుకుంటున్నాను.

తెలంగాణ కోసం ఢిల్లీలో ప్రాణాలు తీసుకున్న యాదిడ్డి ఉదంతంపై కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో మాట్లాడుతూ అది నిజమైన ఆత్మహత్యో? కాదో? అన్నట్టు వ్యాఖ్యానించారు. దొరికిన సూసైడ్ యాదిడ్డి రాసిందో? కాదో? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది నన్నెంతో బాధించింది. మేం నిజంగా హృదయపూర్వకంగా తెలంగాణ కోసమే ప్రాణాలు తీసుకుంటున్నాం. దయచేసి నా ఆత్మహత్యను తప్పుగా చిత్రీకరించవద్దు. చిదంబరంగారూ నా ఆత్మహత్యతోనైనా స్పష్టత తెచ్చుకోండి. తెలంగాణ కోసమే ప్రాణాలు తీసుకుంటున్నానన్న విషయాన్ని అర్థం చేసుకోండి. 

తెలంగాణ ఏర్పడిన తరువాత దయచేసి ఇవి కల్పించండి:
1. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలి. 
2. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివినవారికి ఉపాధిని కల్పించాలి. వీలైనంత ఎక్కువమందికి ఉద్యోగాలు ఇవ్వాలి. 
3. అక్షరాస్యత, ఉపాధి, వనరుల వినియోగం, పరిక్షిశమలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలి. పర్యాటకపరంగా, చారివూతకంగా విశిష్టత చాటాలి. 
4. తెలంగాణను కుల రహిత రాష్ట్రంగా చేయండి. అందరినీ ఒకేలా చూడాలి. 
ఈ సమయంలో నేను చెబుతున్న మరో మాట సహేతుకమో? కాదో? తెలియదుగానీ ఈ చివరి క్షణాల్లో నాకు తెలియజేయడానికి వేరే దారి లేదు. 
అన్ని పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి, సింగరేణి కాలరీస్ యాజమాన్యాన్ని ఉద్దేశించి చెబుతున్నాను.. గతంలో గనుల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం ఇవ్వాలన్న ఒప్పందం ఉండేది. అయితే, చంద్రబాబునాయుడు ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పట్లో ఓ సింగరేణి కాలరీస్ కార్మికసంఘం దీనికి వంతపాడింది. దీనివల్ల సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయాయి. సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్టింగ్ విధానానికి పెద్దపీట వేస్తుండటంతో పర్యావరణానికి నష్టం కలగటంతోపాటు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. దయచేసి ఉద్యోగి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించండి. ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపండి. 
నేను దీనికోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని ఏమాత్రం అనుకోవద్దు. జేఎన్‌టీయూలో ఎంటెక్ చేస్తున్న నేను ఉద్యోగం సంపాదించుకోవటం పెద్ద కష్టం కాదు. 
తెలంగాణ ప్రజలు, నాయకులు అన్నాహజారే లోక్‌పాల్ బిల్లుకు మద్దతునివ్వాలి.

తెలంగాణ ఉద్యమం కోసం మరో విద్యా కుసుమం రాలిపోయింది. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రి చిదంబరం శుక్రవారం నాడు పార్లమెంటులో చేసిన తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన గని కార్మికుని బిడ్డ శ్రీకాంత్ శనివారం సాయంత్రం తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మందమపూరిలోని రామన్ కాలనీ నివాసి రామటెంకి చిన్న సమయ్య కాసిపేట గనిలో కార్మికుడు. ఆయన ఏకైక సంతానం శ్రీకాంత్. పాతికేళ్ల యువకుడు. ఇటీవలే బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేశాడు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఆకాంక్షతో ఉండేవాడు. గత నెల జూలై 30వ తేదీనే మరణశాసనం రాసుకున్నాడు.

ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో తాను మృత్యువుకు దగ్గరవుతున్నానని, బహుశా ఆగస్టు మొదటి వారంలో చనిపోతానని మెసేజ్ కూడా పెట్టాడు. కొందరు స్నేహితులు అతడిని వారించారు. అయితే.. చెప్పినట్లే ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకుంటాడని వారు కూడా ఊహించలేక పోయారు. చనిపోవడానికి కొద్ది సేపటి ముందు నమస్తే తెలంగాణ పత్రికకు తన ఆత్మహత్య లేఖను ఈమెయిల్ చేశాడు. తాను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడో సవివరంగా ఆంగ్లంలో రాశాడు. తెలంగాణను అడ్డుకుంటున్నారంటూ చిదంబరంతో పాటు పలువురు సీమాంధ్ర నేతల కుటిల పన్నాగాలను నిరసించాడు. పలువురు తెలంగాణ నేతలకు సూచనలు చేశాడు. ఆ ఈమెయిల్ నమస్తే తెలంగాణకు అందిన వెంటనే కాపాడేందుకు వెంటనే ఫోన్ చేసినా.. అప్పటికే శ్రీకాంత్ ఇల్లు రోదనలతో నిండిపోయింది! 

రెండు రోజుల కిందటే ఇంటికి
రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చిన శ్రీకాంత్, శుక్రవారం టీవీలో పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను చూశాడు. ఆ తర్వాత చాలా నిరుత్సాహంగా కనిపించాడని తల్లిదంవూడులు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తన ల్యాప్‌టాప్ తీసుకొని ‘నేను చదువుకుంటాను. బ్యాంకు పరీక్షలకు సిద్ధం కావాలి’ అని చెప్పి, గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. సాయంత్రం వేళ కరెంట్ పోయినా బయటకు రాలేదు. తలుపు తట్టినా, సెల్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. ఆందోళనకు గురైన కుటుంబీకులు కిటికీ తొలగించి చూడగా చీరతో దూలానికి ఉరేసుకుని కనిపించాడు.
తండ్రి, కొడుకులు ఇద్దరు ఉత్తములే సింగరేణి కార్మికుడైన సమ్మయ్య 2009లో ఉత్తమ కార్మికుడిగా ఎంపికయ్యారు. శ్రీకాంత్ కూడా చదువులో ఉత్తముడే. సమ్మయ్యది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. 1998లో మందమపూరికి బదిలీపై వచ్చాడు. ఎస్సెస్సీ, ఇంటర్ శ్రీకాంత్ కొత్తగూడెంలోనే చదివాడు. వరంగల్ వాగ్దేవి కాలేజీలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎంటెక్ చదివాడు. అతనికి ముగ్గురు అక్కా, చెల్లెళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లయాయి.


DEAR SIR/MADAM,

THIS IS SRIKANTH PURSUING MTECH JNTUH CAMPUS , 
I AM THE ONLY SON TO MY PARENTS AND I WANT TO BECOME THE PART OF TELANGANA AGITATION.
I REALLY FEEL BAD FOR THE STATEMENT CHIDHAMBARAM IN PARLIAMENT REGARDING SUICIDE OF REDDY,
PLEASE DONT MAKE MY SUICIDE A FALSE SUICIDE . 
I AM ENCLOSING MY SUICIDE NOTE HERE, PASSWORD : jaitelangana 

R.srikanth,
Mtech Mechatronics CR
Student at Jawaharlal Nehru Technological University 
Hyderabad Area, India
AP : +91-9052559413
TAMILNADU : +91-7845361351
KARNATAKA :+91-8095069951



FROM 
R.SRIKANTH, MTECH MECHTRONICS, CITD + JNTUH, 
(srikanth.sooth@gmail.com, ramatenkkisrikanth@gmail.com)

TO 
DEAR PARTY LEADERS OF TRS, BJP, CPI AND CONGRESS, ALL JAC and NOT TO TDP.
I AM THE ONLY SON TO MY PARENTS AND I WANT TO BECOME PART OF TELANGANA AGITATION.THE REAL TELANGANA HEROS ARE KCR AND TRS LEADERS ONLY, NOW SLOWLY T-CONGRESS SOME LEADERS ALSO COMING INTO THE HEROS LIST.
ALL TELANGANA MPS, MLAS, MLCS MUST AND SHOULD RESIGN FROM THEIR POST AND MUST ACCEPT THEIR RESIGNATIలON AT RESPECTIVE SPEAKERS. IF NOTHING POSITIVE RESPONSE REGARDING T-STATE FORMING NOT COME FROM CENTRAL , THEN ALL CONGRESS PARTY LEADERS SHOULD COME OUT OF CONGRESS PARTY AND MAKE SEPARATE T-CONGRESS PARTY OR ALLIGN WITH TRS OR CONTEST AS INDEPENDENT IN BI-ELECTION , 
WE T-PEOPLE WILL DEFINETLY MAKE YOU WIN AGAIN IN BI-ELECTION AND SHOW THE T-POWER TO CENTRAL AND PLEASE (LEADERS) DONT ACT LIKE REALLY FIGHTING FOR T-STATE, SHOW YOURS POWER TO HIGH COMMAND.
JAIPAL REDDY, DANAM NAGENDER AND OTHER LEADERS WHO ARE NOT SUPPORTING TO STATE, I FEEL ASHAMED OF THEM. THE T-PEOPLE AND T-STATE BURNING WITH AGITATIONS BUT THESE ANTI T-STATE LEADERS ARE GLUED TO THEIR POSTS.
DEAR CM KIRAN KUMAR READY AND GOVERNER NARSHIMHAN PLEASE CANCEL 14F AND CONDUCT EXAMS AND EXPRESS, DELIVER REAL FACTS IN T-STATE TO CENTRAL (SONIA GANDHI).
DEAR TRS (KCR, KTR,ETALA,HARISH RAO),BJP(SUSHMA SWARAJ,MUNDE, DATHATREYA), CPI(GURDAS GUPTA) AND CONGRESS(KK,JUPALLI,MADHU AND ALL),NAGAM AND GADAR , ALL JAC , WHO ALL SUPPORTING FOR TELANGANA STATE , DONT STOP FIGHTING , WE ALMOST CAME TO SEPARATE T-STATE FORMING, I HOPE MY LIFE WILL LIGTHEN OR BOOST UP YOUR STRENGTH AND ALLOW OR RISE ALL T-PEOPLE TO FIGHT FOR T-STATE.
DEAR SUSHMA SWARAJ AND GURUDAS GUPTA GARU, I REALLY IMPRESSED WITH YOUR SPEECHS IN PARLIAMENT AND HERE SIMA ANDHRA MPS NOT UNDERSTADING THE SITUATIONS IN T-STATE BUT AP OUTSIDE PEOPLE UNDERSTANDING THE PAIN, MAM AND SIR KINDLY SUPPORT US FOR FORMING OF SEPARATE T-STATE. 
DEAR KCR GARU PLEASE SHOW YOUR STRENGTH AGAIN , DONT BE CLAM IN THIS LAST SITUATIONS ,,,,,,,YOURE THE REAL HERO WHO MADE THE T-STATE DREAM INTO REALITY.I AM FAN TO YOU AND WE FRIENDS CALL YOU AS MAMAYA TO T-STATE LOVE YOU SIR KCR AND I AM REALLY SORRY FOR PROFESSOR JAYA SHANKER SIR, WE ALL PEOPLE LIKE SIR VERY MUCH AND HIS LIFE IS MOTIVATION TO ALL
SIR KODANDA RAM GARU AND T-JAC PLEASE MAKE GOOD IDEAS OR WAYS, HOW TO GET T-STATE QUICKLY EVENTS LIKE SAKALA JANULA SAMME AND MORE
DEAR KK SIR AND T-CONGRESS PEOPLE DONT FALL BACK ,YOU LEADERS DOING GREAT JOB NOW AND RISE THE TEMPERATURE OF HIGH COMMAND MORE AND MORE WITH YOUR REVERSE ATTACKING.
NAGAM JANARDAN AND LEADERS WHO CAME OUT OF TDP FOR T-STATE , I AND WE T-STATE PEOPLE REALLY APPRECIATING YOU, BUT 1 SUGGESTION TO YOU SIR DONT BE SINGLE AND DO WAR AND JOIN IN TRS OR ANY PARTY OR OTHER SOURCE WHO REALLY FIGHTING FOR T-STATE..DONT MAKE YOUR CAREER LIKE DEVENDAR GOUD
GADAR SIR.YOUR REALLY DOING GOOD , YOU HAVE MUCH POWER TO SHOW THE THINKS TO HAPPEN AS MY KNOWLEDGE YOUR NOT SHOWING THAT MUCH EFFORT.. SO SIR KINDLY SHOW YOUR POWER TO STATE AND CENTRAL,THE NEED OF SEPARATE T-STATE. I FROM CHILDHOOD LISTING YOUR GREAT VOICE.
SONIA GANDHI AND YOUNG RAHUL GANDHI, PLEASE RECOGNISE THE REAL FACT IN TELANGANA STATE AND GIVE SEPARETE STATE AS EARLY AS POSSIBLE. DONT MAKE MORE PEOPLE TO DIE FOR T-STATE. I HOPE THIS IS MY LAST SUICIDE FOR T-STATE.
TODAY 5-8-11 CHIDAMBARAM TOLD IN PARLIAMENT THAT REDDY SUICDE IS NOT REAL OR HE ONLY WRITTEN SUICDE STATEMENT OR SOME OTHER, I FEEL BAD FOR THE STATEMENT; WE PEOPLE REALLY HEARTFULLY COMMITING SUICIDE AND PLEASE DONT MAKE MY DEATH AS FALSE SUICIDE ,CHIDAMBARAM GET CLARITY WITH MY SUICIDE ,THAT I AM COMMITING SUICIDE FOR T-STATE FORMATION ONLY. 
AFTER T-STATE FORMING PLEASE PROVIDE 
1. FREE EDUCATION TO ALL STUDENTS FROM KG TO PG.
2. PROVIDE MAXIMUM JOBS TO ALL STUDY COMPLETED STUDENTS (FROM XTH TO PG).
3. PLEASE MAKE T-STATE AS NUMBER 1 STATE IN WORLD IN MATTER OF LITERACY, JOBS, RESOURCES UTILIZING, INDUSTRIES, CORE AND SOFTWARE JOBS AND IN ALL OTHER EVENTS OR ACTIVITES LIKE TOURISM,HISTORICAL 
4. MAKE T-STATE AS CASTE FREE STATE AND GIVE ALL PEOPLE SAME IMPOTANCE. 
HERE I WOULD LIKE TO EXPRESS MY INNER FEELING, WHETHER THIS IS RIGHT TIME TO EXPRESS OR NOT .BUT IN LAST MOMENTS, I HAVE NO OTHER WAY TO DELIVER, SO.
TO
ALL PARTY LEADERS AND CM AND CHAIRMAN OF SCCL,
IN MY CHILDHOOD SINGARENI SCCL COMPANY HAVING 1 AGREEMENT THAT PEOPLE WORKING IN MINES THAT MAN 1 CHILD BOY OR GIRL CAN GET HIS JOB.
BUT THAT AGREEMENT WAS CANCELLED BY THE TDP CHANDRABABU NAIDU AND SOME SCCL UNION AT THAT TIME, WITH THAT ACTION MADE, MANY SCCL FAMILIES WENT TO DARKNESS AND STILL FACING LOT OF PROBLEMS.STILL UNDER GROUND MINING WORKERS FACING MANY PROBLEMS AND COMPANY GOING FOR OPENCAST MINING, WHICH EFFECT BAD ENVIRONMENT TO NATURE ,PEOPLE LIVING NEAR BY PLACES AND ALSO DECREASE MAN POWER,WHICH LEAD S TO LESS JOBS.
PLEASE AGAIN BRING THAT AGREEMENT TO EXISTENCE IN SCCL COMPANY AND MAKE MINE WORKERS FAMILY BRIGHTFULL FUTURE.THESE CAN HELP MANY WORKERS FAMILIES IN MINING REGION.
DONT CONSIDER ME, I AM SUICIDING FOR SCCL JOB SAKE, NO WITH MY QUALIFICATION FROM JNTU AND CITD CAMPUS, I WILL GET JOB WITH MY MTECH.
WE T-STATE PEOPLE AND LEADER SHOULD SUPPORT ANNA HAZARE LOKPALL BILL.

3, ఆగస్టు 2011, బుధవారం

2జి స్పెక్ట్రమ్ అంటే ఏంటిసార్

ఢిల్లీలో ఒక బార్బర్ వద్దకు చిదంబరం కటింగ్ కోసం వచ్చాడు. సార్ ఈ 2జి స్పెక్ట్రమ్ అంటే ఏంటిసార్ అని బార్బర్ అడిగాడు. కటింగ్ చేయించుకుని చిదంబరం ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయాడు. తరువాత మన్ మోహన్‌సింగ్ వచ్చాడు, అతన్ని అలానే అడిగాడు, తరువాత ప్రణబ్ ముఖర్జీ వంతు మళ్లీ అదే తంతు. రాత్రికి రాత్రి పోలీసులు బార్బర్‌ను కిడ్నాప్ చేసుకెళ్లారు. నువ్వెవరివో చెప్పు సిఐఎ ఏజెంట్‌వా? ఐఎస్‌ఐ ఏజెంట్‌వా? తీవ్రవాదివా? ఎవరివో నిజం చెప్పు అని చితగ్గొట్టారు. బాబోయ్ నాకేం తెలియదు 2జి స్పెక్ట్రమ్ పేరు వినగానే కాంగ్రెస్ నాయకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. దాని వల్ల నేను సులభంగా కటింగ్ చేయగలుగుతున్నాను ఇంతకు మించి నాకేం తెలియదు అని మొత్తుకున్నాడు.

1, ఆగస్టు 2011, సోమవారం

పిచ్చిదంబరం...

రావణ కాష్టాన్ని ఆరిపోకుండా రగిల్చడం ఎట్లాగో చిదంబరంకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.. తెలంగాణాను ఎంత వివాదం చేయాలో.. ఎంత రాద్ధాంతం చేయాలో  ఆయనకు చాలా బాగా తెలుసు... సీమాంధ్ర లాబీయింగ్‌ ఆయనపైనా, అధిష్ఠానంపైనా ఎంత తీవ్రంగా ప్రభావం చూపుతోందో... ఆయన ప్రకటనలను చూస్తేనే అర్థమవుతుంది. ఉద్యోగులు ఎప్పట్నుంచో కోరుతున్న ౧౪ ఎఫ్‌ను తొలగించటంపై వివాదాస్పద కామెంట్లను చిదంబరం చేశారు.. తీర్మానాన్ని తొలగించటానికి రాష్ట్రపతికి రికమెండ్‌ చేస్తామంటూనే అందుకు రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేయాలని మెలిక పెట్టారు.. ౨౦౧౦ జనవరిలో అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూనే మరోసారి తీర్మానం చేయాలని సిఎంను కోరినట్లు ప్రకటించారు. ౧౪ ఎఫ్‌పై ఇప్పుడు ఏకాభిప్రాయం ఉందో లేదో తెలుసుకోవటానికే తీర్మానం చేయాలని కోరామన్నారు. సిసిపిఏనే ఈ తీర్మానం చేయాలని కోరిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ౧౪ఎఫ్‌పై తీర్మానం అన్నది సాధ్యం కాదని బుర్ర ఉన్నవాళ్లకెవరికైనా అర్థమవుతుంది.. అంటే ఎస్‌ఐ రాతపరీక్షలకు సంబంధించిన వివాదం ఇప్పట్లో సద్దుమణగదు. ఫ్రీజోన్‌గా హైదరాబాద్‌ను తొలగించాలన్న తెలంగాణా వాదుల డిమాండ్‌ నెరవేరదు..తెలంగాణ మరోసారి మోసపోవటానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. తెలంగాణా నాయకుల బుద్ధిమాలిన తనం.. ఐక్యత లేని డొల్లతనం.. బలంగా ఏకగళాన్ని వినిపించలేని చేతకానితనం.. టివి గొట్టాల ముందు డాంబికాలు.. లోలోపల సేఫ్‌ ఫేస్‌ అవుట్‌కు మంతనాలు జరిపే హీనాతి హీనమైన నాయకత్వం తెలంగాణాకు శాపంగా పరిణమించింది. ఈ నాయకత్వానికి తెలంగాణా తెచ్చే సత్తా లేదు.. వీళ్లు దౌర్భాగ్యులు.. నీచాతి నీచంగా సీమాంధ్ర నాయకత్వం అవహేళన చేస్తున్నా.... వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నా తుడుచుకుపోతున్న పనికిమాలిన వాళ్లు. పైకి రాజీనామాలు చేసి ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని దొంగచాటుగా సంతకాలు చేస్తూ జీతాలు దండుకుంటున్న నికృష్ట నేతలున్న తెలంగాణాకు ఇక విముక్తి లేదు.. ఇదొక సోమాలియాలాగా తయారవుతుంది.. రానున్న కాలంలో బానిసల కంటే హీనంగా చూడబడతారు.. రోదన తప్ప వీరికి మిగిలేది లేదు.. ఉపాధి ఉండదు.. నీళ్లుండవు.. నిప్పులుండవు.. భాష లేదు.. సంస్కృతి లేదు.. అనాగరిక జాతిగా ఆఖరి శవాన్ని రాబందులు పీక్కుతినేంతదాకా ఈ ప్రాంతం రోదిస్తూ ఉండాల్సిందే.

29, జులై 2011, శుక్రవారం

విభజన'లో బహుజన హితం - కొత్త శివమూర్తి

 extracted from a facebook post
సీమాంధ్రలో ప్రత్యేకాంధ్ర అన్న వారిని శత్రువుగా చూస్తున్నారు. 1972లో రాయలసీమ నాయకుడు బి.వి.సుబ్బారెడ్డి, కోస్తా నేత కాకాని వెంకటరత్నం నాయకత్వంలో ప్రత్యేకాంధ్ర కావాలని సీమాంధ్ర ప్రజలు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని చేశారు. ఇప్పుడు ప్రత్యేకాంధ్రను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర రాజకీయ నేతలు, ప్రజలు ఆ చరిత్రను మర్చిపోయినట్టున్నారు.

తెలంగాణలో సమైక్యాంధ్రవాదాన్ని ప్రచారం చేయకుండా ప్రత్యేక తెలంగాణ వాదులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని సీమాంధ్ర నేతలు విమర్శిస్తున్నారు కదా. మరి సీమాంధ్రలో ప్రత్యేకాంధ్రవాద ప్రచారానికి ఆటంకాలు కల్గించడం ప్రజాస్వామికమేనా? అసలు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకొంటున్నారు? సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర అని ఎందుకంటున్నారు?

మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న సీమాంధ్రులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేసి మద్రాసులేని ఆంధ్రరాష్ట్రాన్ని 1953లో సాధించుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం 1956లో విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఇంతవరకు నాలుగు జిల్లాల రాయలసీమ నుంచి ఆరుగురు నాయకులు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులయ్యారు. తొమ్మిది జిల్లాల తెలంగాణ నుంచి నలుగురు ముఖ్యమంత్రులయ్యారు.

అయిదు కోస్తాంధ్ర జిల్లాల నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులయ్యారు. మూడు జిల్లాలు గల గల ఉత్తరాంధ్ర నుంచి ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు శాసిస్తున్నారని ఆ ప్రాం తాల నేతలు ముఖ్యమంత్రులై న విధానం స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రులలో పదిమంది రెడ్లు, ముగ్గురు కమ్మలు, ఇద్దరు బ్రాహ్మిణ్స్ కాగా మాల, వైశ్య, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒకొక్కరు చొప్పున ఉన్నారు.

ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు శాసిస్తున్నాయని తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలుగా విభజిస్తే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల రాజకీయ ఆధిపత్యం బలహీన పడుతుంది. కనుక రెడ్డి, కమ్మ వర్గాలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నందున సమైక్యాంధ్ర నినాదం ఉనికిలోకి వచ్చింది.

తెలంగాణ శాసనసభ్యులు 119 మంది కాగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు 175 మంది ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు మైనార్టీగా ఉండగా, సీమాంధ్ర వారు మెజారిటీగా ఉన్నారు. మెజార్టీ సభ్యల నిర్ణయానికి మైనార్టీ వారు కట్టుబడి ఉం డాలి అనేది ప్రజాస్వామిక సూత్రం. కనుక అన్ని సందర్భాలలోను తెలంగాణ వారిమీద సీమాంధ్రులే రాజకీయ ఆధిపత్యం చెలాయించగలుగుతున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ నేత అయినా సీమా ంధ్ర ఎమ్మెల్యేలు బలపర్చకపోతే ముఖ్యమంత్రిగా ఉండలేడు.

దీంతో తెలంగాణ వారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో సీమాంధ్ర వా రి చెప్పుచేతల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. పదవుల కోసం తమ ప్రా ంత నాయకులు కేంద్ర పాలకులకు, సీమాంధ్ర నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వెన్నెముక లేని నాయకులుగా రాజకీయ రంగంలో ఉన్నారని తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. వెన్నెముక లేని తెలంగాణ నేతలు, సీమాంధ్ర నేతల రాజకీయాధిపత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిననాటి నుంచీ అన్ని రంగాల్లో తమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంగానే వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొంటున్నారు.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపక ముందు అవి విడివిడిగా ఉన్నాయి. తెలంగాణ సుమారు ఐదు శతాబ్దాల కాలం ముస్లిం రాజుల పాలనలో ఉంది. సీమాంధ్ర రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వలసపాలనలో మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. తెలంగాణలో ఉర్దూ పాలనా భాషగా ఉండగా, సీమాంధ్రలో ప్రభుత్వ పా లన ఇంగ్లీషు భాషలో కొనసాగింది. యూరోప్‌లో జరిగిన పారిశ్రామి క విప్లవాన్ని ఆధారం చేసుకొని మనదేశంలో బ్రిటిష్ వలసపాలన ఏర్పడింది.

యూరోప్‌లోని పారిశ్రామిక సమాజ దోపిడీ అవసరంలో భాగంగా సీమాంధ్రలో విద్యా, వ్యవసాయ, వ్యాపార రంగాలు అభివృద్ధి చేయబడ్డాయి. నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణ అ న్ని రంగాలలో వెనుకబడిపోయింది. దీంతో పాటు ఆంధ్ర, తెలంగా ణ ప్రాంతాల ప్రజల్లో ఆచారాల వ్యవహారాలలోను, కట్టు బొట్టులలో ను, వేష భాషలలోను తేడా ఉంది. ఇలా ఆర్థిక, రాజకీయ, సామాజి క, సాంస్కృతిక రంగాల్లో వ్యత్యాసంగల ఆంధ్ర, తెలంగాణను భాషపేరుతో ఒకరాష్ట్రంగా ప్రకటించారు కేంద్ర కాంగ్రెస్ పాలకులు.

నిజానికి భాష పేరుతో ఆంధ్ర, తెలంగాణలను కలిపారనే ప్రచారం అసత్యం అని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు, నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయని భావించడానికి బలమైన ఆధారాలున్నాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమ బలం పెరుగుతుందని భావించి కమ్యూనిస్టులు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ప్రచారం చేసి ఉండవచ్చు.

ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిస్తే తమకు మంచి రాజధాని దక్కడంతో పాటు తమ దోపిడీ ఆధిపత్యానికి తెలంగాణ ప్రాంతం ఒక వనరుగా ఉంటుందని సీమాంధ్ర రాజకీయ నాయకులు భావించి ఉండవచ్చు. తెలంగాణలో ముస్లిం రాజుల పాలన కొనసాగినందున ఆ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కమ్యూనిస్టులు సాయుధపోరాటం చేసినందున ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపితే ఇస్లాం అతి వాదులను, కమ్యూనిస్టు అతివాదులను అణచివేయవచ్చు అని కేంద్ర పాలకులు భావించి ఉండవచ్చు. ఇటువంటి అనేక కారణాల వల్ల ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలపబడ్డాయి.

తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు ఆమోదించినందునే రెండు ప్రాంతాలు కలపబడ్డాయని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? ఫజులాలీ కమిషన్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపడానికి ఆమోదించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాలను కలపాలని భావిస్తే 1962లో జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో మూడు వంతుల మంది ఆమోదిస్తేనే రెండు ప్రాంతాలను కలపాలని సూచించింది. కానీ ఫజులాలీ కమిషన్ సూచనకు విలువ నివ్వకుండా కేంద్ర పాలకులు, 1956లోనే రెండు ప్రాంతాలను కలిపారు. ఇందుకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆధారం చేసుకున్నారు.

ఈ ఒప్పందం ద్వారా రెండు ప్రాంతాలు కలపబడ్డాయి అంటే అర్థమేమిటి? తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా కలవలేదని కొన్ని షరతులకు లోబడి కలిశారని పెద్దమనుషుల ఒప్పందం తెలియజేస్తుంది. అలాగే ఆనాటి ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలు కూడా తెలంగాణ ప్రజలు కొన్ని షరతులకు లోబడి కలవడానికి ఆమోదించారని తెలియజేస్తుంది. షరతుల ద్వారా కలిసిన వారికి షరతులను అమలు చేయనప్పుడు విడిపోయే హక్కు కూడా ఉంటుంది. దీనినే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దమనుషుల ఒప్పందం అమలుచేయలేదు. ఆరు సూత్రాల పథకం అమలుచేయలేదు. జి.వో 610 అమలు చేయలేదు.

అంటే అర్థం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హా మీలను సీమాంధ్ర నాయకులు నెరవేర్చలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరేవేర్చనందున వారు తమకు ఆంధ్రా నుం చి విడిపోయే హక్కు ఉందంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనివారికి కలిసి ఉం డమని అడిగే హక్కు ఉండదు అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఉన్నా, విడిపోయినా రెండు ప్రాంతాలలోని సామా న్య ప్రజలకు పెద్దగా లాభంకాని, నష్టంకాని ఉండదు. కానీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విడిపోతే అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్య ం బలహీనపడడంతో పాటు తెలంగాణ ప్రాంతం మీద సీమాంధ్ర నాయకుల దోపిడీ రాజకీయ ఆధిపత్యం అంతమవుతుంది. అందుకే సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టారు.

సీమాంధ్ర ప్రాంతంలో వందలాది సంవత్సరాల నుంచి అణిచివేత, డోపిడీకి గురైన బహుజనులు సమైక్యాంధ్ర వాదాన్ని బలపరచడం అంటే, సీమాంధ్రలోని అగ్రకుల రాజకీయ నాయకుల స్వార్థానికి బలిపశువులు కావడమే. అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని బలహీనం చేయడం కోసం సమైక్యాంధ్ర నినాదానికి సమాధికట్టి జైఆంధ్ర నినాదానికి పట్టం కట్టాలి. అప్పుడే వారు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు న్యాయం చేసిన వారవుతారు.

అంంతేకాక జైఆంధ్ర ఉద్యమం ద్వారా సీమాంధ్ర ప్రాంతాలలో అగ్రకులాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని ఎదిరించే బహుజనుల నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్నవారవుతారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో స్వార్థపరులైన రాజకీయ నాయకుల అనుసరిస్తున్న విధానాలకు బహుజన బిడ్డలు బలౌతున్నారు. ఈ విధానం అంతం కావడానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటే పరిష్కారం. అందువల్ల సీమాంధ్రలోని బహుజనులు సమైక్యాంధ్రను వ్యతిరేకిస్తూ జైఆంధ్ర ఉద్యమాన్ని చేపట్టినప్పుడు రెండు ప్రాంతాల ప్రజల మధ్య సోదర భావం ఏర్పడుతుంది.

- కొత్త శివమూర్తి, ప్రత్యేకాంధ్రవాది, తూ.గో.జిల్లా

కిరణ్‌ బాధను కాంగ్రెస్‌‌ హైకమాండే అర్థం చేసుకోవాలి

కరవమంటే కప్పకు కోపం...విడవమంటే పాముకు కోపం...ఇప్పుడు సీఎం కిరణ్ పరిస్థితి ఇలాగే ఉంది...
సకల జనుల సమ్మె...ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగులు సందించిన బ్రహ్యాస్త్రం....ఈపదం వింటేనే సిఎం గుండెగుబేల్‌ మంటోంది...పొలిటికల్‌ క్రైసెస్‌ను పొలిటికల్‌గా ఎదుర్కొంటున్న ఆయన ఉద్యోగుల విషయంలో ఎలా స్పందించాలో అర్థంకాక తల పట్టుకొంటున్నారు....పీఆర్సీ జీతభత్యాల వ్యత్యాసాలను సరిదిద్దాలని ఉద్యోగ సంఘాల జాక్‌ సందించిన సమ్మె అస్త్రాన్ని కిరణ్‌ సర్కార్‌ రెండురోజుల్లోనే తేల్చింది. వారిచ్చిన డిమాండ్లన్నింటికి క్యాబినెట్‌ ఓకే చెప్పింది. ఇక ఆతరువాత తెలంగాణ ఉద్యోగులు చేసిన  సహయ నిరాకరణను కూడా ..కిరణ్ సమర్థంగానే ఎదుర్కొన్నారు. తాత్కాలికంగా గండం గడిచినా...ఇపుడు  తాజాగా సకల జన సమ్మె సర్కార్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది..పైకి ఎస్మా విధిస్తామని ఉద్యోగులను  మానసికంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నా... అది సాధ్యపడదని సర్కార్‌కు ఇప్పటికే బోధపడింది. పోనీ ఉద్యోగులు ఏకరువు పెట్టిన
డిమాండ్లన్నింటికి అంగీకరిద్దామంటే....మరోప్రాంత నాయకులు అడ్డుతగులుతారన్న బెంగపట్టుకుంది.. జనాభా ప్రాతిపదికన తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన 42 శాతం ఉద్యోగాలకు రిటన్‌ గ్యారంటీ ఇద్దామని సిఎం ప్రయత్నిస్తే కొంత మంది మంత్రులు అడ్డుతగిలినట్లు సమాచారం. 610 ఉత్తర్వుల అమలుకు జ్యుడీషియల్‌ కమీషన్‌  వేద్దామన్నా ఇదే పరిస్థితి. ఇక 14 F వివాదం కూడా  ఇప్పట్లో తేలేలా లేదు...పోనీ గతంలోహామీ  ఇచ్చిన GHMC స్థానికేతర ఉద్యోగులను పంపిద్దామన్నా తేనె తుట్టను కదిపినట్లవుతుందన్నది కిరణ్‌ భావిస్తున్నారు... ఇక కిరణ్‌ దగ్గరున్న రెండో  వ్యూహం సమ్మె అణిచివేత.  ఈనిర్ణయం తీసుకొంటే తెలంగాణ ప్రాంతంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసు బాసులు విశ్లేషిస్తున్నారు. అదే గనక జరిగితే ఇప్పటికే అధిష్టానం దగ్గర అంతంత మాత్రంగానే ఉన్న తన పరువు పూర్తి గా మంటగలుస్తుందని కిరణ్ ఆందోళన చెందుతున్నారు....ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోయినా పర్వాలేదు ...కనీసం లా అండ్‌ ఆర్డర్‌ అయినా...సక్రమంగా నిర్వహించలేడనే అపవాదు వస్తుందన్నది ఆయన అంతరంగం. సమ్మె గనక జరిగితే ...వ్యవస్థ స్తంబించి పోవడం ఖాయం....మొత్తం మీద సకల జనసమ్మె కిరణ్‌  మెడకు పడ్డ పాములా తయారైంది. తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గితే...సీమాంద్ర నేతలకు గిట్టటం లేదు. అణిచివేద్దామంటే...తెలంగాణ నేతలు  -ఉద్యోగులు ఒంటి కాలుపై లేస్తున్నారు. పాపం కిరణ్‌.....కిరణ్‌ బాధను కాంగ్రెస్‌‌ హైకమాండే అర్థం చేసుకోవాలి మరి.....

బాబు స్పందించాలి

తెలంగాణ,సమైక్యాంద్ర సెంటిమెంట్లు రెంటిని గౌరవిస్తానంటున్న చంద్రబాబుకు... టిడిపి లో ఏకాభిప్రాయం సాధించే దిశగా చర్చలు ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది.
అధికారంలో ఉండగా ఎన్నో సమస్యలు అవలీలగా పరిష్కరించి చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న బాబు తెలంగాణ పై పార్టీనేతలను ఒకే మాట మీదకు తీసుకురావాలనే డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.
తెలంగాణ పై కాంగ్రెస్‌ తరహాలోనే టిడిపిలో అంతర్గత చర్చలు ప్రారంభించి జటిల సమస్యకు ముగింపు పలకాల్సిన బాధ్యత బాబుకు ఉన్నదన్న వాదనలూ రోజురోజుకు పెరుగుతున్నాయి....2009 ఎన్నికలకు ముందు తెలంగాణ పై వైఖరి చెప్పడానికి ఇరు ప్రాంతాల నేతలతో కమిటి వేసిన చంద్రబాబు పార్టీ విధానాన్ని మెనిఫెస్టో లో కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ పై కాంగ్రెస్‌ ఇవ్వని స్పష్టత టిడిపి ఇచ్చిందని బాబు అప్పట్లో ప్రశంసలందుకున్నారు కూడా...అయితే డిసెంబర్‌ తొమ్మిది తర్వాత ఆయన రెండు కళ్ల సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చి  తెలంగాణలో టీడీపీని అగ్నిపరీక్షకు నిలిపారు...
 ఇప్పటికే పలువురు సీనియర్లు ,వేల సంఖ్యలో కార్యకర్తలు ఆ ప్రాంతంలో పార్టీని వీడారు.తెలంగాణ లో పార్టీ నేతలు చనిపోయినా వారి అంత్యక్రియలకు హాజరుకాని స్థితికి చంద్రబాబు చేరుకున్నారంటే ఆ తీవ్రత ఎక్కడికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు.
 ఇలాంటి వాతావరణంలోనూ తెలంగాణ పై చెప్పాల్సింది చెప్పాం ...ఇక చెప్పేదేమీలేదు అని బాబు మాట్లాడుతుండడం టిడిపి నేతలకే కాక రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అధికారంలో ఉండగా విజన్‌ 2020 అని అన్ని అంశాలపై ఓ విధానాన్ని ప్రకటించిన మాజీ సీఎం కనీసం కొత్త రాష్ట్రాల ఏర్పాటు పై తన మనోగతాన్నెనా చెబితే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది.రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఓ పెద్ద సమస్యపై ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరు బాబు ఇమేజ్‌ ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
 తెలంగాణ పై తనకో వైఖరి లేక పోవడంతో కాంగ్రెస్‌ తప్పటడుగులను ప్రశ్నించ లేని స్థితికి ఆయన చేరారు..ఏ ప్రాంతానికి దగ్గట్టు ఆ ప్రాంత పార్టీ నేతలు వ్యవహరించాలని దిశానిర్దేశం చేస్తున్న బాబు సమస్య అలాగే ఉండాలని కోరుకుంటున్నారా అనే అనుమానాలకు దారితీస్తున్నాయి...
తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేస్తామంటున్న టిడిపి అధినేత ఉద్యమాల విషయంలోనూ తటస్థ వైఖరి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
 కాంగ్రెస్ ఇపుడిపుడే తెలంగాణ పై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతుంటే టిడిపిలో మాత్రం ఆప్రయత్నమే జరగడం లేదు...డిసెంబర్‌ తొమ్మిది తర్వాత వైఖరి మారడానికి కారణాలు వివరించకుండా కేవలం రెండు కళ్ల సిద్దాంతామంటూ ఇంకా చెబితే... చంద్రబాబుకు ఇరు ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 తన వైఖరితో తెలంగాణలో పట్టు కోల్పోయిన బాబు ఆంధ్రాలో అదనంగా పొందిన లాభం కూడా ఎదీ లేదని కడప ఉప ఎన్నికలు కూడా రుజువు చేశాయి.
 రాజకీయ నాయకులు సాహోసోపేతంగా వ్యవహరించకుండా ఎపుడూ లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ గడిపితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గతంలో అనేక ఉదంతాలు రుజువు చేశాయి.
 చంద్రబాబు ఆ జాబితాలో చేరకూడదంటే ఆయన కూడా టిడిపిలో తెలంగాణ పై చర్చను పారదర్శకంగా మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎంత అవునన్నా..కాదన్నా చిదంబరం చేసిన సూచనపై బాబు స్పందించాలి....పార్టీలో తెలంగాణ పై చర్చించాలి...ఓ పరిష్కారం చూపాలి...

28, జులై 2011, గురువారం

ఆజాద్ ను అతిగా నమ్మితే....

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు అధిష్టానం పై మళ్లీ  నమ్మకం పెరుగుతోంది.ఆజాద్‌తో చర్చల తర్వాత రాష్ట్ర విభజన జరుగుతుందన్న ఆశలు చిగురించాయి...ఎన్నడూ లేనివిధంగా హై కమాండ్ శ్రద్దతో తమ వాదనలు విన్నదన్న భావనలో ఉన్న వారు....తెలంగాణ ఏర్పాటుకు బలమైన కారణాలు గుర్తించిందని వారు ఓ అంచనాకు వస్తున్నారు. నమ్మకం కుదిరింది.....రెండు నెళ్లు కాదు....నెల రోజుల్లోనే తెలంగాణకు పరిష్కారం...ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల అంతరంగం...
ఆజాద్‌ ను తిట్టిన నోళ్లే ఇపుడు పొగడుతున్నాయి. ఆంధ్రోళ్లకే ఆయన ఇంచార్జ్‌ అనే దాకా వెళ్లిన టీ కాంగ్రెస్‌ నేతల తీరు ఇపుడు మారుతోంది. ఆజాద్ తో మూడో భేటీ తర్వాత వారి స్వరాలు ఒక్క సారిగా వేరే రూపు తీసుకున్నాయి.తెలంగాణతో ముడిపడి ఉన్న హైదరాబాద్‌,నదీజలాల పంపిణీ అంశాలపై తాము వివరించిన తీరు ఆయన్ను ఆకట్టుకుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 2004 నుంచి ఎపీ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న తనకు తెలంగాణ డిమాండ్‌లో ఇంత నిజాయితీ ఉందన్న సంగతి ఇప్పటి వరకు  తెలియదని ఆజాద్ ...వారితో చెప్పినట్టు సమాచారం.తెలంగాణ వ్యతిరేకించడానికి చూపుతున్న కారణాలు వాదనకు పెడితే నిలువవని ఆయన చెప్పడం టీ కాంగ్రెస్‌ నేతలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అందరూ చెబుతున్నట్టు రెండు నెలల్లో కాకుండా .. ముఫ్పై రోజుల్లోనే సమస్యకు పరిష్కారం దొరకొచ్చని ఆజాద్‌ భేటీలోఅన్నారని వారు ప్రచారం చేసుకుంటున్నారు.ఆజాద్ తీరు ఇలానే చివరి దాకా కొనసాగితే తెలంగాణ రాకుండా పోదని ఢిల్లీ భేటీలో పాల్గొన్న యువ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు....  ఢిల్లీ పెద్దల తీరును ఎంతో కాలం నుంచి గమనిస్తున్న కొందరు సీనియర్లు మాత్రం ఇంచార్జి వైఖరి పై తుది నిర్ణయానికి రావడానికి మరింత సమయం తీసుకోవాలనే భావనలో ఉన్నారు జాదూ గా పేరున్న ఆజాద్ సీమాంద్ర నేతలతో మాట్లాడిన తర్వాతే ఆయన తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అనే నిర్ధారనకు రావచ్చని అప్పటిదాకా ఓపిక పట్టాలనే భావన వారిలో కనిపిస్తోంది.  ఆజాద్ ను అతిగా నమ్మితే హై కమాండ్ ట్రాప్‌లో పడ్డట్టే అవుతుందని మరి కొంత మంది టీ కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.ఏమైనా ఆజాద్ పై మునుపటంత ఆగ్రహం ప్రదర్శంచకుండా తెలివిగా ఆయన్ను తెలంగాణ దారికి తెచ్చుకోవాలనే అభిప్రాయం మాత్రం అందరిలో వ్యక్తమవుతోంది....

27, జులై 2011, బుధవారం

మీకు మీరే మాకు మేమే.....

మీకు మీరే మాకు మేమే.....ఇదీ ఇప్పుడు సీమ,ఆంధ్ర నేతల్లో వినిపిస్తోన్న కొత్త స్వరం....సీమాంధ్ర నేతల్లో సమైక్యవాద ఉధృతిని తగ్గించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం వేసిన తొలి అడుగులో భాగమే ఈ కొత్త స్వరం...
ఇంతకాలం ఒకే ప్రతినిధి బృందంగా సీమాంధ్ర అభిప్రాయాలు విన్న హైకమాండ్... ఇప్పుడు ఆరెండు ప్రాంతాల నేతలతో విడివిడిగా చర్చించడానికి రంగం సిద్దం చేస్తోంది....పీసీసీ చీఫ్ సత్తిబాబు ఆపనిలో బిజీబిజీగా ఉన్నారు..
రాష్ట్రాన్ని కలిపి ఉంచినా,విభజించినా తనకొచ్చే రాజకీయ ప్రయోజనాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రదానంగా దృష్టి సారించింది.తెలంగాణ ఇస్తే లాభ నష్టాలను ఇప్పటికే తెలంగాణ నేతలతో చర్చించిన ఆజాద్‌ ఇక సీమాంధ్ర నాయకులతో చర్చలపై దృష్టిపెట్టారు.

 సీమాంద్ర నేతలు ఓ బృందంగా రావడం వల్ల ఆ రెండు ప్రాంతాల్లో విభజన కోరుకుంటున్న వారి వాదనకు అవకాశముండడం లేదన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన.... సీమ,ఆంధ్రా ల నుంచి వేర్వేరు బృందాలను చర్చలకు ఆహ్వానించారు.  ఇదే అంశంపై బొత్స రాయలసీమ కు చెందిన శైలజానాధ్‌,కోస్తా నేత కావూరిలతో కసరత్తు జరిపి విడివిడిగా వెళ్లేందుకు ఒప్పించారు. దీంతో సమైక్యవాదం పలుచబడేందుకు మార్గం ఏర్పడిందనే వాదన కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది. కొందరి మెప్పుకోసం పెదవుల పైనే సమైక్యరాగం వినిపిస్తున్న నేతలు ....వేర్వేరుగా ఢిల్లీ వెళితే నిజంగా మనసులో ఏముందో తెలిసే అవకాశం కూడా ఢిల్లీకి కలుగనుంది. మంత్రులు టీజీ వెంకటేష్,ఏరాసు ప్రతాప రెడ్డి ఇప్పటికే గ్రేటర్‌ రాయలసీమ వాదన వినిపిస్తుండగా .. బొత్స తో భేటీ తర్వాత మరో మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా అదే వైఖరిని చాటారు. తెలంగాణ రాష్ట్రానికి మొగ్గు చూపినా.. భవిష్యత్‌లో సీమాంధ్ర ఒక్క రాష్ట్రంగా ఉండలేదన్న భావన చాలా మంది కాంగ్రెస్ నేతల్లో ఉంది.అందుకే ఒకే సారి మూడు రాష్ట్రాల ఏర్పాటు సూత్రం కాంగ్రెస్ లో తెరపైకి వస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు,జగన్‌ లకు చెక్‌ పెట్టాలంటే త్రీ స్టేట్స్‌ థియరీయే కరెక్ట్‌ అని కొందరు పాలక పక్ష నేతలు కూడా భావిస్తున్నారు.ఈ వాదనకు బొత్స ఆశీస్సులు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సత్తిబాబు పిసిసి చీఫ్ గా ఉండడంతో అధిష్టానానికి సమైక్య వాదుల్లో చీలిక తేవడం తేలిక అనే అభిప్రాయం వినిపిస్తోంది.ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీమాంద్ర నేతల బృందంలో తన ప్రాంతానికి చెందిన నేతలు పాల్గొనకుండా బొత్స గట్టిగా ప్రయత్నించారన్న వాదనలు జోరుగానే వినిపించాయి...
 అంతేకాదు ..భవిష్యత్‌ లో అవసరమైతే జై ఆంధ్రా వాదన వినిపించేందుకు తన వెంట వచ్చే నేతల చిట్టాను కూడా ఆయన సిద్దం చేసుకుంటున్నారని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దగ్గుబాటి లాంటి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే గట్టిగా సమైక్యవాదాన్ని వినిపించే నేతల సంఖ్యను వీలైనంత తగ్గించాలనే హై కమాండ్ యత్నాలకు బొత్స తనవంతు సహకరిస్తున్నారు.
తెలంగాణ పై హై కమాండ్ తమను అవమానిస్తోందన్న అభిప్రాయంతో ఉన్న టీ కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు కొంతలో కొంత ఉపశమనివ్వక మానవు.

మన జంట నగరాలు

హైదరాబాద్‌-సికిందరాబాద్‌ జంటనగరాల్లో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది. ఇక్కడ బతికిన వాళ్లు.. బతుకుతున్న వారందరికీ ఇది అనుభవమైనదే. జంటనగరాల ఆశ్రయాన్ని ఒకసారి పొందిన వారు తిరిగి ఆ ప్రాంతం నుంచి కదిలేందుకు ఇష్టపడరు...

మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలం వరకు హైదరాబాద్‌  గోలకొండ ప్రాంతం నుంచే నగర పరిపాలన సాగింది.


జంటనగరాల్లో ఈనాటికీ నికార్సైన తెలుగుదనం కనిపించదు. తెలంగాణ జిల్లాల ప్రజల భాష. ఆంధ్ర తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, తమిళ, ఇరానియన్‌ తదితర భాషలతో భాగ్యనగరం బహుభాషా నిలయంగా రూపుదిద్దుకుంది.
హైదరాబాద్‌లో విలసిల్లిన సంస్కృతి దక్కనీ సంస్కృతి. తెలుగు, మరాఠీ, కన్నడ భాషల ప్రజలు.. ఇరానియన్‌ దక్కన్‌ ప్రవాసుల భాషలతో కలగలిసిన భాషగా దక్కనీ భాష పుట్టుకొచ్చింది. ఇవాళ ఇది నిర్లక్ష్యానికి గురైంది.


19వ శతాబ్దంలోనే భాగ్యనగరానికి వలసలు ఆరంభమయ్యాయి. ఉత్తర భారతం నుంచి కాయస్థులు, ముస్లింలు తరలివచ్చారు. నిజాం సర్కారులో ఉన్నతోద్యోగాలు సంపాదించారు. రాజస్థానీ మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. 1948 తరువాత ఆంధ్రప్రాంతం నుంచి వలసలు మొదలయ్యాయి. 1956 తరువాత ఉద్ధృతమయ్యాయి. గుంటూరు పల్లెలు అప్పుడు ఏర్పడినవే.


1938 దాకా హైదరాబాద్‌ నగరంలో చిన్నస్థాయి మతకల్లోలం కూడా జరగలేదు.. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సామరస్యంతో జీవించారు.

హైదరాబాద్‌ నగర పాలన విషయంలో నిజాం రాజ్యవ్యవస్థ అపరిమితమైన ఆసక్తిని చూపించింది. దేశం మొత్తం మీద తొలి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఘనత హైదరాబాద్‌దే.


ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్న పంజగుట్ట ప్రాంతం ఒకనాడు నగరానికి నాలుగుమైళ్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతం అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి విద్యానగర్‌ ప్రాంతం కూడా అడవే.. అక్కడ పశువులను మేతకు తీసుకువెళ్లేవారట...


మహానగరిలో అడవిని నిర్మించిన ఘనత కూడా ఆనాటి పరిపాలకుల ఖాతాలోకే  చేరుతుంది. నాంపల్లిలో కృత్రిమ అటవీ నిర్మాణం జరిగింది. అదే ఇవాళ్టి పబ్లిక్‌ గార్డెన్స్‌... దీన్ని ఆ కాలంలో ‘బాగే ఆమ్‌’ అని పిలిచేవారు. ఇందులోనే ఓ మూల జూ ఉండేది. బాగ్‌ అంటే తోట అని అర్థం. 


 ఒకనాటి భాగ్యనగరం కాలుష్యానికి ఆమడ దూరంలో ఉండేది. పటాన్‌ చెరువు, జీడిమెట్ల, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చాలాకాలం క్రితమే భారీ పరిశ్రమలు విస్తరించాయి. అయినా ఆనాడు అవి నగర శివార్లలో ఉన్నవే. నగరం నగరం నలువైపులా చమన్లు, తోటలు పెంచటంతో కాలుష్యానికి తావే లేకుండాపోయింది.


1922నాటికే హైదరాబాద్‌లో వస్త్ర పరిశ్రమకు పునాదులు పడ్డాయి. దివాన్‌ బహదూర్‌ రాంగోపాల్‌ మిల్లుల్లో ౧౩౦౦ మంది కార్మికులు పనిచేసేవారు.. 

 జంటనగరాల్లో 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు మోటర్‌ కారు అంటే తెలియదు. ఎక్బాలుద్దౌలా అనే ఆయన మొట్టమొదటిసారి మోటారు కారును హైదరాబాద్‌ వీధుల్లో  నడిపించారు. ఆయన వాడింది ఆనాటికే పాతబడిన మోటారు కారు..  ఆ తరువాత ముసల్లింజంగ్‌, కమాల్‌యార్‌జంగ్‌, రాజారామ్‌రాయన్‌, లక్ష్మణ్‌రాజ్‌లు కొత్త తరహా మోటారు కార్లు కొన్నారు.. వీరంతా ఆనాటి హైదరాబాద్‌ ప్రముఖులు.


 1911 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఉన్న మోటారు కార్ల సంఖ్య 118 అని నిజాం ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. 1934లో గాంధీజీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు సంపన్నుడైన ధన్‌రాజ్‌ గిర్‌జీ తన రోల్స్‌రాయిస్‌ కారును ఆయన కోసం అందుబాటులో ఉంచారు. అప్పటికే రోల్స్‌రాయిస్‌ కారు హైదరాబాద్‌ వీధుల్లో తిరిగింది.


 1920 నాటికి హైదరాబాద్‌ జనాభా నాలుగు లక్షలు. మోటారు కార్ల సంఖ్య తక్కువ. అప్పుడు రిక్షాలు లేవు. ఆటోరిక్షాలు అంతకంటే లేవు. సంపన్నులకు బగ్గీలు ఉండేవి. అద్దె టాంగాలు ఉండేవి. సైకిళ్ల సంఖ్య మాత్రం వేల సంఖ్యలో ఉండేవి. మోటారు వాహనం వస్తుందంటే ట్రాఫిక్‌ పోలీసు సీటీ ఊదేవాడు..ప్రజలంతా ఆ మోటారును విచిత్రంగా చూసేవారు.


 1930వ దశకంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తీవ్రత తక్కువైనా పూర్తిస్థాయి ట్రాఫిక్‌ క్రమశిక్షణను పాటించేవారు. రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండేవి.. టాంగాలు ఎక్కువ. రోడ్ల మీద కొంత కొంత దూరాలకు రేకులు, తట్టలు పట్టుకుని కొందరు మనుష్యులు ఉండేవారు. గుర్రం లద్ది పెట్టినా, చెత్త పడినా వెంటనే తీసేవారు. 


 హైదరాబాద్‌ నగరంలో  దేవిడీల సంస్కృతి ఎక్కువ. ఢిల్లీ, లక్నో, కాశీ వంటి నగరాల మాదిరిగానే ఇక్కడా దేవిడీలు ఎక్కువగానే ఉన్నాయి. ఆనాటి నవాబులు, జమీందారులు దేవిడీలు నిర్మించుకుని అందులో దర్జాగా నివసించేవారు. ఇప్పటికీ కొన్ని దేవిడీలు నేటికీ నగరంలో కనిపిస్తాయి.



20వ శతాబ్దం ప్రారంభం కావటానికి ముందువరకు హైదరాబాద్‌లో హోటళ్లు, వసతి గృహాలు లేవు. ధర్మశాలలే ఉండేవి. హైదరాబాద్‌కు వచ్చిన వారు ధర్మశాలలో వండుకుని తినే వారు. ఉచితంగా అన్నదానం కూడా చేసేవారు.
1943లో ఉస్మానియా ఆసుపత్రి ఎదురుగా చింతల నర్సమ్మ భోజనశాల ఉండేది. అన్నం, పప్పు, రెండు కూరలు, ఊరగాయ, కాచిన నెయ్యి, గడ్డ పెరుగుతో భోజనం లభించేది. రెండుపూటల భోజనానికి రెండు రూపాయలు, వసతికి మరో రెండురూపాయలు తీసుకునేవారు. 


  హైదరాబాద్‌లో హోటళ్లు ప్రారంభమైన తొలినాళ్లలో విచిత్రమైన పరిస్థితి ఉండేది. జనం హోటళ్లకు వెళడానికి మొహమాటపడేవారు.. ఆనాడు హోటళ్లను చాయ్‌ఖానా అని పిలిచేవారు.. చాయ్‌ఖానాకు వెళ్లడం అంటే సారాయి దుకాణానికి వెళ్లినట్లు భయపడేవారు.. 


1920 నాటికి కానీ హైదరాబాద్‌లో హోటళ్లు రాలేదు. టీ, కాఫీలతో పాటు ఉప్మా, వడ,దోశ వంటి టిఫిన్లు ఎక్కడో అరుదుగా లభించేవి. గౌలిగూడ రామమందిరం ప్రాంతంలో సుబ్బారావు హోటల్‌ అనేది తొలి హోటళ్లలో ఒకటి. 


 1920లలో హైదరాబాద్‌లో నాష్తాలు ఖాజీ పకోడా, పూరీసాగ్‌, పూరీచూన్‌లు.. మాంసాహారంలో మేక కాళ్ల ముక్కల పులుసు(పాయ), బన్ను రొట్టెలు ఆనాటి టిఫిన్లు..


 హైదరాబాద్‌లో ఇరానీచాయ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. 1920లలో గౌలిగూడెంలోని శంకర్‌షేర్‌ అనే హోటల్‌లో మలాయ్‌దార్‌(మీగడతో కూడిన) చాయ్‌ ఆనాడు ఫేమస్‌.. మూడు పైసలకు చాయ్‌.. ఒక పైసకు లవంగం గుచ్చిన పాన్‌.. ఒక పైసకు నాలుగు చార్మినార్‌ సిగరెట్లు.. ఇవీ ఆనాటి హైదరాబాద్‌ ధరలు..



హైదరాబాద్‌ ప్రజలకు టీ ని అలవాటు చేసేందుకు టీ కంపెనీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో బహిరంగంగా స్టౌ వెలిగించి అందరిముందే టీని తయారు చేసేవారు. ఒకరు టీ వల్ల వచ్చే లాభాలను గురించి చెప్పేవారు.. మరొకరు తయారు చేసిన టీని ఉచితంగా అందరికీ పంచేవారు.. టీ గొప్పతనాన్ని గురించి ఇంకొకరు ప్రసంగించేవారు.. తరువాత ఇంటింటికీ తిరిగి టీని పంపిణీ చేసేవారు. మొత్తం మీద టీ ని జనానికి అలవాటు చేసి కానీ కంపెనీలు విడిచిపెట్టలేదు..

 గండిపేట్‌కీ పానీ, మదీనాకీ బిర్యానీ హైదరాబాద్‌ ప్రత్యేకతలు.. గండిపేట నీటిలో  తేటదనం ఎక్కువగా ఉంటుంది. మదీనా బిర్యానీలో నిర్వచనాలకే అందని రుచి ఉంటుంది.

 1950 వదశకంలోనే హైదరాబాద్‌లో సినిమాలు వచ్చాయి. ఆనాడు ఆబిడ్స్‌లో సాగర్‌ టాకీస్‌ ప్రసిద్ధమైంది. నాంపల్లిలో మోతీమహల్‌ టాకీసులో హిందీ సినిమాలు వచ్చేవి. 1956లో ఈ మోతీమహల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కొంతకాలం తరువాత దిల్‌షాద్‌ అని పేరు మార్చుకుని తిరిగి ప్రారంభమైంది.

 1908 సెప్టెంబర్‌లో రెండు రోజుల్లో 19 అంగుళాల వర్షం కురిసింది. మూసీ నది కట్టలు తెంచుకుంది. 221 చెరువులు తెగిపోయాయి. నాలుగు వంతెనలు మునిగిపోయాయి. 15వేల మంది మరణించారు. 20వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.

  మూసీ వరదలకు దానిపై నిర్మించిన మూడు వంతెనలు చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌, నయాపూల్‌లు పూర్తిగా మునిగిపోయాయి. చెన్నరాయని గుట్ట(నేటి చాంద్రాయణ గుట్ట) నుంచి షాలిబండ వరకు నగరం పూర్తిగా మునిగిపోయింది.

 మూసీ వరదలు నిజాం సర్కారుకు నేర్పిన గుణపాఠాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి పిలిచి ఆయన సారథ్యంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లు నిర్మించారు. భూగర్భ డ్రెనేజీ వ్యవస్థను నెలకొల్పారు. మురికివాడల స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించారు.. భారీ ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రదర్శించిన చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.


1911లో హైదరాబాద్‌లో ప్లేగు రోగం విస్తరించింది. ప్లేగు గత్తరల వల్ల 15 వేల మంది మృత్యువాత పడ్డారు. చలికాలంలో హైదరాబాద్‌ రావాలంటేనే జనం భయపడేవారు.

1919లో  ఇన్‌ఫ్లూయెంజా తీవ్రంగా వ్యాపించింది. భాగ్యనగరంలో రోజూ కనీసం 500 మంది మరణించేవారని నిజాం సర్కారు రికార్డులు చెప్తున్నాయి.

 1936లో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పరిపాలనా రజతోత్సవాలను నిర్వహించారు. జూబ్లీహాల్‌ అప్పడు కట్టిందే. జూబ్లీహిల్స్‌, జూబ్లీ క్లబ్‌, జూబ్లీ బజార్‌ వంటివన్నీ అప్పుడు పెట్టిన పేర్లే.

 మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ గోలకొండపై దండెత్తి కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాను జయించాడు. అప్పుడు మొగలాᅣూ సైనికులు నిలిచిన చోటును ఫతే మైదాన్‌ అని పిలిచారు.. ఇదే ఇప్పుడు లాల్‌బహదూర్‌ స్టేడియంగా మారింది.

 తానీషాను ఓడించిన తరువాత ఫతేమైదాన్‌ పక్కనే ఉన్న కొండపైన ఔరంగజేబ్‌ సైనికులు నగారా మోగించారు. అదే నౌబత్‌పహాడ్‌... ఇప్పుడు నగరం సిగలో మల్లెపూవులా వెలిగిపోతున్న బిర్లామందిర్‌ ఉన్న కొండ అదే.
 హైదరాబాద్‌లో రెసిడెన్సీ ప్రాంతం బ్రిటిష్‌ పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలో నిజాం చట్టాలు అమలు కాలేదు.. పోలీస్‌ చర్య తరువాత కోఠీలోని రెసిడెన్సీ భవనాన్ని పోలీసు కేంద్ర కార్యాలయానికి ఇవ్వాలని ఆనాటి సైనిక అధికారి జె.ఎన్‌.చౌదరి ప్రభుత్వాన్ని కోరారు.. కానీ, దాన్ని మహిళా కళాశాలకు ఇచ్చారు.. అదే ఇవాళ్టి కోఠీ మహిళా కళాశాల.

 కోఠీలో మొదట రెసిడెన్సీరోడ్డుగా పిలిచిన ప్రాంతం ఆ తరువాత తుర్రేబాజ్‌ఖాన్‌ రోడ్డుగా మారింది. ౧౮౫౭లో తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో తుర్రెబాజ్‌ఖాన్‌ బలమైన తిరుగుబాటుదారు.. అతని స్మృతి చిహ్నంగానే తుర్రెబాజ్‌ఖాన్‌ రోడ్డు ఏర్పడింది.

 హైదరాబాద్‌-సికిందరాబాద్‌ల మధ్య ప్రజల వ్యవహారంలో చాలా తేడాలు ఉండేవి. హైదరాబాద్‌ను పట్నం అని పిలిచేవారు.. సికిందరాబాద్‌ను లష్కర్‌ అని పిలిచేవారు. నాడు సికిందరాబాద్‌ ముందు బెజవాడ చిన్న పల్లెలా కనిపించేది.



వేములవాడ భీమకవిని అణగదొక్కిన నన్నయ

by- వి.ఆర్.తూములూరి
courtesy.. namasthe telangana e-paper
రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవును అణగదొక్కి పైకి వచ్చాడు, చివరికి వారి గ్రంథాలు చించి వేయడం, తగుల పెట్టటం చేశాడు.

ఆధునిక , సమకాలీన తెలంగాణ సాహిత్య చరిత్ర మొత్తం అణిచివేతల లేదంటే అవహేళనల మయం. ఇందుకు ప్రాచీన సాహిత్య చరిత్ర మినహాయింపేమి కాదన్నది వెలుగులోకి వస్తోన్న వాస్తవం. ఇందుకు బీజాలు ఆదికవిగా ప్రచారం చేయబడిన నన్నయ చేతనే నాటబడడం గమనార్హం. క్రీ. శ 11 వ శతాబ్దిలో రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాణుక్య రాజైన రాజరాజ నరేంవూదుని ఆస్థాన కవిగా ఉన్న నన్నయ తన సమకాలీనులైన కవులను అణగదొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గంథ్రాలు చించివేయడం, తగుల పెట్టటం చేశాడని ఆధునిక యుగ సంస్కర్తగా పేరొందిన కందుకూరి వీరేశ లింగం తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో విస్పష్టంగా రాశాడు.

తెలంగాణలోని వేములవాడకు చెందిన భీమ కవి, నన్నయ కన్నా ముందుగానే’ రాఘవ పాండవీయము అనే గ్రంథం రాసి, దానిని రాజైన రాజరాజనరేంవూదునికి చూపించి రాజ సన్మానం పొందడం కోసం రాజమహేంవూదవరం చేరాడు. విష్ణు వర్ధనుడిగా పేరొందిన రాజరాజ నరేంవూదుని ఆస్థాన కవి నన్నయ. రాజసన్మానం పొందకోరిన ఏ కవి అయినా నన్నయ ద్వారా రాజుకు పరిచయం కావలసిందే. దానితో వేములవాడ భీమకవి తన రచన అయిన ‘రాఘవ పాండవీయము’ ను నన్నయకు అప్పగించారు. ఆది చదివిన నన్నయ భీమకవి కవిత్వం అమోఘంగా ఉండటం, అది వెలుగులోకి వస్తే తన ప్రాభవం తగ్గుతుందని భావించి ఆ గ్రంథాన్ని తగుల బెట్టించాడని వీరేశ లింగం వివరించాడు.కందుకూరి వీరేశ లింగం రాసిన ‘ ఆంధ్ర కవుల చరిత్ర’ నుండి ఈ ఉటంకింపును చూడండి.


‘‘నన్నయ భట్టారకుడు తాను రచియింప నారంభించిన శ్రీ మహాభారతమును సంపూర్ణముగా నాంధ్రీకరింపలేక పోవుటకు కారణములు పలువురు పలు విధముగా చెప్పుదురు. కొందరు వేములవాడ భీమకవి శాపము చేత గలిగిన మరణము కారణమందురు. మరి కొందరు యధర్వాణాచార్యులు తెలిగించుచుండిన భారతమును తగుల బెట్టించుట చేత గలిగిన చిత్త చాంచల్యము కారణమందురు. ఈ రెండు కారణములో నేది నిజమైనను ఈ కవి పరోత్కర్షమును సహింపజాలని దుస్స్వభావము కలవాడయినట్టూ హింపదగియున్నది.

ఈయన తోడి సమకాలినుడైన వేముల వాడ భీమకవి రాఘవపాండవీయమును కవిజనాక్షిశయములో జేర్చి యొక్క వ్యాకరణ మును చేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంవూదపురమునకు దెచ్చి విష్ణువర్ధనుని యాస్థాన పండితుండయి యున్న నన్నయ భట్టునకు జూపగా నతడా కవిత్వ ము మిక్కిలి శ్లాఘ పాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడల దన పుస్తకములకు బ్రసిద్ధి రానేరదని యెంచి వానిని తగులబెట్టించినట్లును, అటు మీదట నతడింట లేనప్పుడు భీమకవి వచ్చి అతని భార్యను నీ భర్త ఏమి చేయుచున్నాడని యడిగి యామె తన భర్త రహస్య స్థలమున ఉండి యరణ్య పర్వం రచించుచున్నాడని చెప్పిన మీదట యతనింకను నరణ్యములోనే ఉన్నాడా యట్లే యుండునుగాక అని శపించి తన పుస్తకముల నణగదొక్కేనన్న కోపము చేత నన్నయభట్టు రచించిన ఛందస్సును వ్యాకరణమును భార్య నడిగి పుచ్చుకొని దానిని చించి గోదావరి లో గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖము చేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, అతని శాపము తగిలి నన్నయ భట్టు వనములో మృతి నొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్ధులలో గలిసిన సారంగధరుడు తన చిన్నతనములో నేర్చుకొని యుండుట చేత మల బాల సరస్వతి యను బ్రహ్మణునకు జెప్పి నట్లును లోక ప్రవాదము కలిగి యున్నది.

తన కాలం నాటికి బహుళ ప్రచారంలో ఉన్న విషయాన్ని కందుకూరి వీరేశలింగం తన ‘ ఆంధ్ర కవుల చరిత్ర’ లో ఉటంకించారు. ఈ కథనం మీద చారివూతక చర్చ జరగవలసి ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి ప్రసిద్ధి పొందకుండా, తొలి గ్రంథంగా భావించబడిన తన రచన మహాభారత ఆంధ్రీకరణ కన్నా మరో రచన ముందు వెలుగు చూడకుండా చేసిన కుట్ర ఇందులో దాగి ఉంది. ఆంధ్రుల ఆధిపత్య అభిజాత్యం ఆది కవిగా పిలవబడిన నన్నయ నుంచే ఆరంభమైందని ఈ ఘటన రుజువు చేస్తోంది

21, జులై 2011, గురువారం

బంద్ అంటే ఇదేనా..?

పార్లమెంటులో తెలంగాణ బిల్లును డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల క్రితం రెండురోజుల పాటు బంద్ నిర్వహించారు. ఇప్పుడు సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలంటూ కడప జిల్లాలో గురువారం (20/07/11)న బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది. అంతా స్వచ్ఛంధంగా బంద్ లో పాల్గొనాలని కోరింది. అంతా బాగానే ఉన్నా, బంద్ పాటించని కొంతమందిపై దాడులు జరగడమే ఆందోళనను కలిగిస్తోంది. సీమాంధ్రలో సాగుతోంది ప్రజా ఉద్యమమని అక్కడి నేతలు చెబుతున్నారు. కానీ, కడప జిల్లాలో ఈ రోజు ఉదయం విచారకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేతలు బలవంతంగా బంద్ ను నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లలో వీరంగం సృష్టించారు. బస్సుల టైర్లలో నుంచి గాలి తీసేశారు. అద్దాలు పగలగొట్టారు. ఉదయాన్నే షాపులు తెరిచిన చిన్న చిన్న వ్యాపారులపై దాడులు చేశారు. బలవంతంగా దుకాణాలు మూయించారు. పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. పెట్రోల్ నింపుకుంటున్న వారిని బెదిరించారు. బాటిల్ లో పెట్రోల్ పట్టుకుంటున్ ఓ వ్యక్తి చేతిలో నుంచి దాన్ని లాక్కొని విసిరి పారేశారు. ఆటో డ్రైవర్లను కొట్టారు. చిన్న చిన్న వారిపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఇదేనా స్వచ్ఛంద బంద్..? ఇదేనా ప్రజా ఉద్యమం..?

21, జూన్ 2011, మంగళవారం

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా తెలంగాణాది

కోటి గొంతులను ఒక్కటిగా ముడి బిగించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. నాలుగు కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిలించిన చైతన్య జ్యోతి ఆరిపోయింది. తెలంగాణా పోరాట అస్తిత్వ రేఖాచిత్రం కనుమరుగైపోయింది.  జనం కోసం ఇంతగా గళం విప్పిన వ్యక్తి.. ధిక్కారమే జీవితంగా  గడిపిన వ్యవస్థ.. ప్రజల బాధల్ని తన బాధలుగా మలచుకున్న మనీషి.. పోరు గడ్డ ఓరుగల్లు నుంచి జ్వాలగా ఎగసి విప్లవ వీరులను శాసించిన యోధుడు.. కొత్తపల్లి జయశంకర్‌..
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది.. జీవితమంతా లోకం కోసం ధారపోసిన కాళోజీ మాటలను నిజం చేసినవాడు.  అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఊపిరి ఉన్నంతకాలం ఉద్యమించిన వాడు.. ప్రజల్ని చైతన్యపరిచేందుకు  విప్లవోద్యమ పూలను లోకమంతటా విరజిమ్మిన వాడు..
తన ప్రజల కోసం.. తన సమాజం కోసం ఇంతగా పరితపించిన వాడు గత దశాబ్ది కాలంలో మరొకరు లేరు.. వ్యక్తిత్వాన్ని మించిన వ్యవస్థ జయశంకర్‌. తానే ఉద్యమమై.. తానే సిద్ధాంతమై.. ఊపిరై నిలిచిన వాడు..  తెలంగాణా చుట్టూ కమ్ముకున్న చీకట్లను తొలగించేందుకు ఊపిరున్నంత కాలం ప్రయత్నించాడు. ఎవరినీ నొప్పించిన వాడు కాదు.. ఆ సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్లూ.. లేని వాళ్లూ సైతం ఆయన పట్ల ఆప్యాయత ప్రకటించుకునేలా చేసుకున్నవాడు.. సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం అన్నది అరుదుగా కనిపించే విషయం. ఆ సిద్ధాంతం కోసమే ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు.. తెలంగాణ ఉద్యమం గురించి ఆయనతో ప్రస్తావించినప్పుడల్లా.. మా పోరాటం ఫలితమిస్తే.. ఆ ఫలాల్ని మీకందించాలన్నదే నా తపన అని అన్నవాడు.. తెలంగాణా తప్ప ఆయన దేన్నీ స్వీకరించలేదు..అంగీకరించలేదు.. మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయాలను రాసుకుతిరగలేదు.. తెలంగాణ రాష్ట్రసమితి తన మాటే వేదంగా భావించినా.. సలహాలకే తప్ప సభ్యత్వం జోలికి కూడా పోని వాడు. నాలుగున్నర దశాబ్దాల ఉద్యమానికి ఆయన సాక్షీభూతం. దశాబ్దకాలపు పోరాటానికి విజయసారథి.  తన వారికి విముక్తి కల్పించటం కోసం.. తన వారికి భుక్తి కల్పించటం కోసం.. తాను పుట్టిన నేలను స్వర్ణమయం చేయటం కోసం అంపశయ్యపై కూడా శ్రమించాడు.. ఆయనకు ఇజాలు లేవు.. ఉన్నదల్లా తెలంగాణాయే.. ఆయన కోరుకున్నదల్లా తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం అంతరించటాన్నే.. ఆ అన్యాయాన్ని ఎదిరించేందుకు.. ఆ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన వాడు. అతిథి మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తూనే అంతా తానే అయి నడిపించాడు.. పల్లెలు.. పట్టణాలు అనక.. పల్లేరు కాయై తిరిగిన వాడు.. తన కలను నిజం చేసుకోకుండానే అవని విడిచి వెళ్లిపోయాడు..

జయశంకర్‌ కన్నుమూశారు

తెలంగాణా సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ (76) ఈ ఉదయం హన్మకొండలో కన్నుమూశారు.. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు.. రేపు మధ్యాహ్నం వరంగల్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

19, జూన్ 2011, ఆదివారం

మేధావులకు వందనం

శ్రీ తాడేపల్లి లలితా సృబ్రహ్మణ్యం గారు...
నమస్కారం..
మీరు తాజాగా చేసిన వ్యాఖ్య మరోసారి ఆలోచించేదిగా ఉంది. ధన్యవాదములు.. తెలంగాణా కోసం జరుగుతున్న చర్చలో మీరు మేధావి.. నిజమే.. మీ లాంటి వారు ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొనటం చాలా అవసరమే.. తెలంగాణా రాకపోవటం ఎందుకు మంచిదో మీరు ముందు నుంచీ వివరిస్తున్నారు.. వీళ్లకే అర్థం కావటం లేదు.. మీరు ప్రస్తావించిన అంశాలనే నేనూ చర్చించదలచుకున్నాను.. అంశాల ప్రాతిపదికన ఒక్కొక్కటే మాట్లాడుకుందాం..వీలైతే.. టైమ్ ఉంటే.. అంశాల వారిగా విడివిడిగా..డొంకతిరుగుడు లేకుండా సూటిగా చర్చించండి..
తెలంగాణా గురించి కాసింత మంచి మాట్లాడే వారందరికీ తలపొగరని మీరు భావిస్తున్నారు.. సంతోషం.. ఇక్కడ మేధావి తనానికి అవకాశం లేదనీ మీరన్నారు. కానీ, మీరు మాట్లాడుతుంటే తెలంగాణా వాదులనుకునే మేతావులంతా వింటున్నారు.. తెలంగాణా భావోద్వేగాలను పనికిమాలినవిగా కొట్టిపారేశారు ధన్యవాదములు.. తెలంగాణా గురించి మాట్లాడే వాళ్లంతా మెదడు లేకుండా.. మాట్లాడుతున్నారనీ ఎద్దేవా చేశారు.. సంతోషం.. మేధావితనం అంటే ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా తాము మాట్లాడేది మాత్రమే సరైనది.. ఇదే కరెక్టని.. దీన్నే ఎదుటివాళ్లు ఇష్టం ఉన్నా..లేకున్నా అంగీకరించాలని భావించటమో.. ఏమో.. చిన్నవాణ్ణి నాకైతే తెలియదు.. నేను మేధావిని కాను.. మీరు చెప్తే తెలుసుకుంటా..
తెలంగాణా రాష్ట్రం ఎందుకు రాకూడదో.. మీరు తొలి కామెంటులో కొన్ని కారణాలు చెప్పారు.. వాటిని గురించి ప్రస్తావించాలి.. తెలంగాణాలో బాగుపడాలంటే ఇక్కడ పని సంస్కృతి మెరుగుపడాలని మీరే చెప్పారు.. మీకు అవగాహన ఎంత వరకు ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఇక్కడ ఏసి రూముల్లో కూర్చుని.. ఏసి కార్లలో తిరిగే అలవాటు కానీ, స్థోమత కానీ ఎవరికీ తెలియదు.. ఇక్కడ పని చేస్తేనే గుక్కెడు నీళ్లు.. పిడికెడు కూడు దొరుకుతుంది. (కూడు అన్నది అచ్చమైన తెలుగు పదం.. అన్నం అన్నది సంస్కృతం..) పని చేయటం మాత్రమే ఇక్కడి వాళ్లకు తెలిసిన ఒకే ఒక విద్య.. గొడ్డు చాకిరీ చేయటం తప్ప.. దాష్టీకం చేయటం ఇక్కడి వాళ్లకు తెలియదు.. శాతవాహనుల కాలం నుంచి వాళ్లు చేస్తున్నది పనే.. వాళ్లు పని చేయటం వల్లనే ఇక్కడి నుంచి అద్భుతమైన నిర్మాణాలు వెలుగుచూశాయి. దాదాపు 280 కోటలు.. బురుజులు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయి. ఆ తరువాత నిజాం కాలంలోనూ వాళ్లే పని చేశారు.. ఇప్పుడు దురదృష్టవశాత్తూ తోటి తెలుగువాళ్లమని చెప్పుకునే వారి కాలంలోనూ వాళ్లే పని చేస్తున్నారు.. గతంలో సర్దార్ పాపారాయుడు అని ఎన్టీరామారావుగారు ఒక సినిమా తీశారు 1984లో.. అందులో ఓ కేరెక్టర్ చెప్తుంది.. ‘‘ మా వంటవాడు భారతీయుడు.. మా తోట వాడు భారతీయుడు.. మా పని వాడు భారతీయుడు..’’ అని అంటూనే.. భారతీయులంతా నా సోదరులని చెప్తాడు.. ఇప్పుడు ఉన్నది అచ్చంగా అదే పరిస్థితి..
ఇక రెండవది.. ఇక్కడ అక్షరాస్యత మెరుగుపడటం.. 1956కు ముందు నిజాం కాలంలో ఉన్న చదువు సంధ్యలకు ఇప్పటికి ఉన్న తేడా మీకు తెలియకపోవచ్చు..నిజాం కాలంలో చదువుకుని మేధావులైన మహాపురుషులెందరో అటు నిజాం రాజ్యాన్ని వైభవోపేతం చేశారన్న సంగతి మీకు తెలుసనే అనుకుంటున్నా..వలస వచ్చిన ముస్లిం అధికారులు అధికారాన్ని చెలాయించారే తప్ప.. ఇక్కడ రాజ్యాన్ని సుశ్యామలం చేసి దేశంలోనే సంపన్నతను సాధించి పెట్టిన వాళ్లు తెలంగాణా ప్రజలే. ఇక్కడి వ్యవసాయం.. ఇక్కడి నిర్మాణ నైపుణ్యం.. ఇక్కడి విద్యావైభవంతో నిర్వహించిన పత్రికలు..సెంట్రలైజ్‌డ్ ఏసి వంటి టెక్నాలజీ..  మద్రాసు కంటే ముందు ఇక్కడ జరిగిన విద్యుదుత్పత్తి.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి ఇక్కడ ఉండింది..  కాకపోతే దాన్ని మీరు కప్పిపుచ్చుతున్నారు.. (వాస్తవానికి ఈ వనరుల కోసమే..ఆంధ్ర తెలంగాణాను బలవంతంగా కలుపుకుంది). చదువులో వెనుకబడటానికి కారణం 1956 మెర్జ్ మాత్రమే.. 1956 మెర్జ్ తరువాత ఇక్కడ డెలిబరేట్‌గా విద్యావకాశాలను తొక్కి పారేశారు.. తాము అక్రమంగా ఆక్రమించుకున్న హైదరాబాద్‌లో మాత్రం విద్యకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేసుకుని.. మిగతా తొమ్మిది జిల్లాలకు మొండిచెయ్యి చూపించారు.. తెలంగాణా అంటే హైదరాబాద్ మాత్రమే అని ఒకానొక భావనలో ఉండిపోయారు. కాగితాల్లో లెక్కల్లోకొచ్చేసరికి తెగ చెప్పేస్తారు..  తొమ్మిది జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నదన్నది ఎవరికీ అక్కర్లేదు.. వీటి గురించి మాట్లాడితే మీకు తలపొగరుగా కనిపిస్తుంది.. మెదడు లేని వాళ్లుగా కనిపిస్తారు.. తెలంగాణాలో అక్షరాస్యత పెరగాలన్నారు.. ఎలా చేసే పెరుగుతుందో మీరు చెప్పగలరా? శ్రీచైతన్య, నారాయణ టెక్నోస్కూళ్లు గల్లీకొకొటి కుప్పలు తెప్పలుగా తెచ్చిపోసి ఎల్‌కెజికి 50 వేల చొప్పున నిలువుదోపిడీ చేయించుకోవటం వల్ల పెరుగుతుందా? ఈ స్కూళ్లలో చదువుకోవటమేనా అక్షరాస్యత పెరగటం? తొమ్మిది జిల్లాల్లో అక్షరాస్యత ఎలా పెరుగుతుంది? బాసరలో ఐఐటి పెట్టాలంటే.. దాన్ని దిగ్విజయంగా గండికొట్టి అది కూడా తెచ్చి హైదరాబాద్‌లో పడేసిన మేధావితనం ఎవరిది? ఎయిర్‌పోర్ట్ లేదనో.. మరో కుంటి కారణాలు తెచ్చి చూపి.. అక్కడ ఒక పెద్ద విద్యాసంస్థ రాకుండా చేసిన ఘనత ఎవరిది? ఒక సంస్థను ఏర్పాటు చేయమని ఎందుకు కోరతారో మేధావులైన మీకు తెలియంది కాదనే నేననుకుంటున్నా... ఒక సంస్థను ఏర్పాటు చేయటం వల్ల దానికి అనుబంధంగా ఆ ప్రాంతానికి చాలా సౌకర్యాలు వస్తాయి.. దాని వల్ల మౌలిక వనరులు.. సదుపాయాలు పెరుగుతాయి. దాని వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. అక్కడ ఏమీ లేదనే అది కావాలని అడిగింది.. అది వస్తే అన్నీ వస్తాయని ఆశపడింది.. అది లేకుండా.. రాకుండా చేసిందెవరు? తోటి తెలుగువాడు. తెలంగాణా అభివృద్ధికి ఇది ఒక మచ్చుతునక.
ఇక తరువాతి విషయం.. ఇక్కడ మొబిలిటీ లేదన్నారు.. మొబిలిటీ అంటే కేవలం హైదరాబాద్‌కు మాత్రమే వచ్చి ఉండటం కాదని నేననుకుంటున్నా.. నిజమేమిటో మీరే చెప్పాలి.. మొబిలిటీ అంటే ఇక్కడ ఉపాధి దొరక్కపోతే దొరికిన చోటికి వెళ్లి ఎంత కష్టపడైనా సరే సంపాదించటం.. గల్ఫ్ దేశాలకు వెళ్లటం.. మహారాష్టక్రు వెళ్లటం.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లటం.. పాట్నా వెళ్లటం... ఐరోపా దేశాలకు వెళ్లటం.. రష్యాకు వెళ్లటం.. ఎక్కడైనా.. సరే.. నాలుగు రాళ్లు దొరికితే కుటుంబాన్ని పోషించగలిగితే సంతృప్తి చెందటం..ఇది మాత్రమే వాళ్లకు తెలిసిన విద్య.. దీన్ని ఇంగ్లీషులో సోకుగా మొబిలిటీ అంటారన్న విషయం కూడా వారికి తెలియదు.. పొట్ట కట్టేసుకుని రాత్రికి రాత్రి డాలర్లు సంపాదించి.. ఆ డాలర్లను తల్లిదండ్రులకు పంపించి వాటితో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసి ఏసి కార్లలో తిరగటం కాదు మొబిలిటీ అంటే... ఎక్కడికైనా వెళ్లి బతకటమే వాళ్లకు తెలిసింది.. తామున్న దగ్గరికే అన్నీ రావాలనుకుంటారనటం తమ ఆలోచనను ఎదుటివాళ్లపై ఆపాదించటమే అవుతుంది. ఇక్కడి వాళ్లు ఎక్కడికైనా వెళ్లి దుకాణాలు పెట్టుకునో.. ఉద్యోగాలు చూసుకునో బతుకుతారు.. కానీ, తోటి తెలుగు ప్రాంతానికి మాత్రం వెళ్లలేరు.. ఎందుకంటే వాళ్లను అక్కడ సహించేవాళ్లే లేరు.. అక్కడ అక్కున చేర్చుకుని సోదరులుగా ఆదరించే వాళ్లు లేరు.. అక్కడ వాళ్లకు మీరు ఇంగ్లీష్‌లో రూమ్ అన్నారే.. అది కూడా దొరకదు.. ఇది నిజం. దీని గురించి మీరు మాట్లాడరు.. ఒప్పుకోరు.. రజాకారులు దుర్మార్గంగా ప్రజలపై దాడి చేస్తున్న కాలంలో ప్రాణాలరచేత పట్టుకుని ఒక్కుదుటున పక్కనున్న విజయవాడకు వెళ్లిన తోటి తెలుగు ప్రజలను ‘గాడిద కొడుకులు ఇక్కడికి వచ్చారు.. మా ప్రాణం మీదకు’’ అని ముఖం మీదే తిట్టిన ఉదారవాద సంస్కృతి నిజంగా మేధావి వర్గానికే సాధ్యమైంది.
ప్రజాస్వామిక భావనలు లేని వారు తెలంగాణ ప్రజలని చెప్పుకొచ్చారు.. ప్రజాస్వామిక భావనలు అంటే ఏమిటి? ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలే లేకపోతే.. 1940లలోనే ఇక్కడికి వలసలు ప్రారంభమయ్యేవి కావు.. అన్ని జిల్లాల్లో రాత్రికి రాత్రి గుంటూరు పల్లెలు పుట్టుకొచ్చేవి కావు. ఇక్కడి వాళ్లకు ప్రజాస్వామిక భావనలు లేకపోతే.. ఎక్కడికక్కడ మండలాలకు మండలాలే ఇతర ప్రాంతాల వాళ్ల పాలన పడేవి కావు. తోటి తెలుగువారితో ఇంటిగ్రిటీ కోసం ప్రయత్నించే వాళ్లు కారు. తోటి సంస్కృతిని తమదిగా సొంతం చేసుకుని తమలో అబ్సార్బ్ చేసుకునే వాళ్లు కారు. పొరుగు పండుగలను తమవిగా చేసుకుని ఆనందంగా సంబురాలు చేసుకునే వారు  కారు. ఆ ఔదార్యం ఇక్కడి సంస్కృతిలో భాగం.. అందరినీ తమవాళ్లని అనుకోవటం ఇక్కడి అమాయకత్వం.. బతుకమ్మ పండుగను మీరు ఎన్నడైనా చేసుకున్నారా? బతుకమ్మ అంటే అదీ ఒక పండుగేనా.. గడ్డిపూలు పెట్టి చుట్టూ తిరుగుళ్లు తిరిగి వెఱ్రి పాటలు పాడుకోవటం కూడా ఓ పండుగేనా అని ఎద్దేవా చేయటం ప్రజాస్వామిక భావనా? తోటి తెలుగువాణ్ణి తమ ప్రాంతంలో అడుగుపెడితే సహించలేకపోవటం.. చాపకింద నీరులా అతణ్ణి వెనక్కి వెళ్లిపోయేలా చేయటం ప్రజాస్వామిక భావనా? స్థానిక ఉద్యోగాలను రాష్ట్ర ఉద్యోగాలుగా జీవోల్లో మార్చేసుకుని స్థానికుల నోట్లో మట్టి కొట్టడమేనా ప్రజాస్వామిక భావన? మీకు తెలుసా? నీటిపారుదల శాఖలో తెలంగాణా అన్న ఒకే ఒక్క కారణం వల్ల దాదాపు రెండు వందల మంది ప్రమోషన్లు ఆగిపోయాయన్న విషయం? జిహెచ్‌ఎంసి అనే ఒక లోకల్ బాడీ సంస్థలో 80శాతంమంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లన్న విషయం మీకు తెలుసా? చివరకు అటవీ శాఖలో పూర్తిగా లోకల్ ఉద్యోగాలను భర్తీ చేయమని 152 జివో ఇస్తే.. వాటిని రాత్రికి రాత్రి రాష్ట్ర పోస్టులుగా మార్చి అడవితో సంబంధం లేని విజయవాడ.. గుంటూరు.. రాజమండ్రి వారికి వాటిని కట్టబెట్టిన సంగతి మీకు తెలుసా? 1969లో 24వేల ఉద్యోగాలను తెలంగాణా పొట్ట కొట్టి ఇతర ప్రాంతాల వారికి ఇచ్చారన్న ప్రాతిపదికపై ఆందోళన జరిగితే.. దాన్ని రెక్టిఫై చేసేందుకు కాసుబ్రహ్మానందరెడ్డి జివో నెం.36 రిలీజ్ చేస్తే ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా? 1985లో 58, 962 ఉద్యోగాలు అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇచ్చిన పొరపాటును సవరిస్తూ.. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసైనా సరే తెలంగాణా ప్రాంతం వారికి న్యాయం చేయాలని ఎన్టీరామారావు విడుదల చేసిన జీవో ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదో మీరు చెప్పగలరా?  సాగర్ డామ్ కట్టి గ్రావిటీతో కృష్ణా డెల్టాకు సులభంగా నీళ్లు వదులుకుని నల్గొండకు చుక్క నీరు కూడా వదలకుండా ఆ జిల్లాను ఫ్లోరిన్ బాధితురాలిగా ఎందుకు చేశారో చెప్పగలరా? ఆ జిల్లాలో డ్యామ్ కట్టి ఆ జిల్లా కోసం కట్టిన కెనాల్‌ను ఎందుకు పనిచేయకుండా ఆపేశారు? ఒక్కసారి చెప్పండి? వ్యవసాయానికి చుక్కనీరు రాకుండా చేసి.. బోర్లమీద బోర్లు వేసుకుని దిక్కులేని పరిస్థితుల్లో  వచ్చినప్పుడు కరెంటు వేసుకుని నీళ్లు వాడుకుంటే.. ఓహో.. విద్యుత్తు వినియోగంలో తెలంగాణా నెంబర్ వన్ అంటారు.. 50 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటంటే ఒక్క డ్యామ్ పూర్తి చేయకుండా.. ఎవరి మేలును ఆకాక్షించినట్లు..ఎవరికి సంక్షేమం చేసినట్లు? తోటి తెలుగువాడిగా ఇక్కడే ఉంటున్న వారిగా.. బహుశా మీరు హైదరాబాద్ కావచ్చు.. మిగతా తెలంగాణా గురించి మీకు ఎంత వరకు ఆవేదన ఉందోలేదో నాకైతే తెలియదు..
తెలంగాణాకు లేనివన్నీ ఉన్నాయని చెప్తున్నారన్నారు? ఏవి లేవో మీరు చెప్పలేదు.. మీరు చెప్పినవి అక్షరాస్యత లేదన్నది.. కానీ, ఇక్కడ అక్షరాస్యత ఉంది.. మీరు చెప్పింది మొబిలిటీ లేదన్నది.. ఇక్కడ మాత్రమే మొబిలిటీ ఉంది...మీరు చెప్పింది పని సంస్కృతి లేదన్నది అన్నింటికీ మించి ఇక్కడ మాత్రమే పని సంస్కృతి ఉంది. ఇక్కడ సోమరులు లేరు.. ఎందుకంటే మిగతా చోట్ల పని చేసినా జీవితం నడుస్తుంది.. ఇక్కడ పని చేయకపోతే పూట గడవదు.. ఇక్కడి ప్రజానీకానికి పెరిగిపోయిన సంపన్నతతో ఎంజాయ్ చేయటానికి హంసమేడలు లేవు.. వీరికి తెలిసిన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా మాత్రమే. మీరు చెప్పింది ఇక్కడ ప్రజాస్వామిక భావనలు లేవన్నది ఇక్కడ మాత్రమే ప్రజాస్వామిక భావనలు ఉన్నవి. ఇక్కడ సృజన ఉంది.. అక్షరం రాయటం రాకపోయినా.. అద్భుతమైన సారస్వత పంటను పండించే వేనవేల పోతన్నలు ఉన్నారు..ఇక్కడి పోతన్నను అక్కడికి లాక్కుపోవాలని చూడటం వారికి తెలియదు.. ఇక్కడి కాకతీయులను రాజమండ్రికి పరిమితం చేయటం వీరికి తెలియదు.. ఇక్కడి సోమనాథుని హాల్కురికి తీసుకుపోవటం తెలియదు. మల్లినాథసూరిని.. అప్పకవిని ఎత్తుకుపోవటం వీరికి తెలియదు.. వీరికి తెలిసిందల్లా బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించటం. ఇక్కడి సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామానికి గ్రామాలు ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగారె, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా  ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ‘‘ఏందె నాయినా’’ అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ...వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు..
సరే మళ్లీ విషయానికి వద్దాం.. తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఒక్కసారి చెప్పండి? ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ అయిన సమయానికి తెలంగాణా బడ్జెట్ 63 కోట్ల మిగులు.. ఆంధ్ర బడ్జెట్ మైనస్ 24 కోట్లు.. ఈ డబ్బు కోసమే.. ఈ మౌలిక వనరుల కోసమే.. ఈ మానవ వనరుల కోసమే.. ఆదరాబాదరాగా.. టెంట్ల కింద దిక్కులేకుండా నడుస్తున్న పాలనను చక్కదిద్దుకోవటం కోసమే షరతులతో మెర్జ్ చేసుకున్నారు. అంతే తప్ప తెలుగు వారినంతా ఒక్కటిగా చేయటం కోసం కాదన్నది మీరు గ్రహించాలి.. తెలంగాణాను బేషరతుగా కలుపుకోలేదు.. ఒప్పందం చేసుకుని మరీ కలుపుకున్నారు. ఒప్పందం ఉల్లంఘన జరిగింది కాబట్టే ఉద్యమాలు జరుగుతున్నాయి.
తోటి తెలుగువారు మీరు.. తెలుగువారు సంపూర్ణంగా సమైక్యంగా ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ నిజామాబాద్‌లో ఉన్న ప్రజానీకానికి విశాఖపట్నం గురించి ఎంతవరకు తెలుసు.. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఒక జిల్లాలో ఉన్నవారికి తెలంగాణా జిల్లాల గురించి ఎంతవరకు అవగాహన ఉంది.. రెండు ప్రాంతాల మధ్య ఇంటిగ్రిటీ కోసం ఏనాడైనా.. ఎవరైనా ప్రయత్నించారా? ఇంతెందుకు? ఉద్యోగం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్లు ఎవరైనా తెలంగాణా వారితో మమేకం కావటానికి ఒక్కసారైనా ప్రయత్నించారా? ఇక్కడి సంస్కృతిని తమదిగా చేసుకున్న సందర్భం ఉందా? తెలంగాణాకు సంబంధించిన పండుగలను, పబ్బాలను, పిండి వంటలను ఏనాడైనా తమ ఇళ్లల్లో చేసుకున్నారా? ఇలా ప్రశ్నిస్తే.. మీదీ ఓ పండుగేనా? మీ తిండీ ఓ తిండేనా అంటారు? ఇక్కడి వాళ్లతో కలిసి ఉండరు.. వీళ్లను మాత్రం మీతో కలిసి ఉండాలంటారు.. అసలు మమేకమే కానప్పుడు కలిసి ఉండటం ఎలా సాధ్యమవుతుంది?
మీకు తెలియంది మరొకటుంది.. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటం లేదు.. ఎనిమిది సంవత్సరాల పాటు సంపన్నంగా విలసిల్లిన రాష్ట్రాన్ని తిరిగి తీసుకోవాలనుకుంటోంది.
చివరగా ఒకటి సుస్పష్టం.. తెలంగాణా, ఆంధ్రా అన్నవి రెండు జాతులు.. రెండు సంస్కృతులు.. రెండు భాషలు.. రెండు జనజీవన విధానాలు.. ఇవి రెండు ఎప్పటికీ కలవవు.. బలవంతంగా రెంటినీ కలిపారు.. ఈ రెండూ కలిసి ఉండటం అసాధ్యం. ఇప్పుడు విడిపోవటాన్ని ఆపవచ్చు. కానీ, మానసికంగా విడిగా ఉన్న జాతులను శాశ్వతంగా కలిపి ఉంచటం ఎవరివల్లా అయ్యేపని కాదు.