29, నవంబర్ 2019, శుక్రవారం

పాత్రికేయ ద్రోణాచార్యుడు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ జ్నాపకాలు ఆయన స్వీయ స...



తెలుగు పాత్రికేయ ప్రపంచంలో జగమెరిగిన వాడు. 1990 నుంచి ఒక దశాబ్దం పాటు వేలాది పాత్రికేయులను తీర్చిదిద్దినవాడు. పాత్రికేయ ద్రోణాచార్యుడు.. శ్రీ బూదరాజు రాధాకృఫ్ణ గారు. మాటల మాష్టారు. ఆయనకు చిన్నతనం నుంచే పద్య రచన ఎలా అలవడింది.. కవిత్వానికి పద్యానికి తేడా ఏమిటి? తన ఉద్యోగ జీవితంలో .. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సన్నివేశాలు.. వాటిని పద్య రూపంలో ఎలా వ్యక్తపరిచేది.. ఈ విషయాలన్నీ ఆయన అపూర్వ గళంలోనే విందాం. ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగత జీవితం గురించి.. సాహిత్య జీవితం గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఇప్పుడా విశేషాలను తెలుసుకోండి. ఈ అపూర్వ గళాన్ని పూర్తిగా వినండి. మన మార్గదర్శకులు వీరు. ప్రతి పాత్రకేయుడు తప్పనిసరిగా ప్రేరణ పొందాల్సిన అనేక అంశాలు ఆయన స్వరంలోనే తప్పకుండా వినండి.

మరికొందరు మహాపురుషుల మరిన్ని స్వరాలను మీకు అందిస్తుంది సాధ్యాయ. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి స్వాధ్యాయ చానల్ను.