29, మార్చి 2020, ఆదివారం
vishwanatha poem in his voice
ఆకాశవాణి కవిసమ్మేళనంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యగానం. వినండి. పదిమందికి వినిపించండి. స్వాధ్యాయ లో భాగస్వాములు కండి.
28, మార్చి 2020, శనివారం
srisri poem on occation of gandhi centenery celebrations
శ్రీశ్రీ .. శ్రీరంగం శ్రీనివాసరావు 1969లో గాంధీ శతజయంతి సందర్భంగా ‘చూశావా గాంధీ’ పేరుతో ఆకాశవాణి కవిసమ్మేళనంలో చదివిన కవిత ఇది. ఈ అపూర్వ స్వరాన్ని పదిమందికి తప్పకుండా వినిపించండి. షేర్ చేయండి. ఇది స్వాధ్యాయ సమర్పణ.. కోవెల సంతోష్ కుమార్
voice of poet kundurti anjaneyulu
వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు . ఫ్రీవర్స్ ఫ్రంట్ ద్వారా వచనకవితావ్యాప్తికి కృషి చేసిన ఈ నయాగరా కవి.. కవిత్వము గతమని, వచన కవిత్వము వర్తమానమని చాటాడు. ఆయన అపూర్వ స్వరాన్ని వినండి. మన కవుల అపూర్వ గళాలు వర్ధమాన సాహితీవేత్తలకు కవులకు ప్రేరణలు . ఈ అపూర్వ స్వరాలను పదిమందికి పంచండి. ఇది స్వాధ్యాయ సమర్పణ.
25, మార్చి 2020, బుధవారం
voice of telugu poet ajanta
స్వప్నలిపికారుడు అజంతా (పెనుమర్తి విశ్వనాథశాస్త్రి). 1997లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆకాశవాణి చేసిన ఇంటర్వ్యూ ఇది. ఆయన అవార్డు స్వీకరించిన సమయంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఆయన్ను కలిసే అవకాశం నాకు అలా లభించింది. ఆ సమావేశంలో ఆయన అనారోగ్యంతో మాట్లాడలేకపోతే శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు ఆయన తరపున ప్రసంగించారు. ఆయన అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో సైతం ఆయన ప్రసంగం ఆయాసంతో కొనసాగింది. అవార్డు లభించిన తర్వాత కొన్నాళ్లకే 1999లో అజంతా కన్నుమూశారు. ఆడియో కొంత నాయిసీగా ఉన్నప్పటికీ.. ఆయన అపూర్వ స్వరాన్ని పదిలపరచడం కోసం స్వాధ్యాయ చేసిన ప్రయత్నమిది. ఆయన సాహిత్య ప్రస్థానాన్ని తప్పక వినండి. స్వాధ్యాయలో భాగస్వాములు కండి. చేతులు కలపండి. చేరండి. పదిమందికి సాహితీ ఆణిముత్యాలను పంచండి.
23, మార్చి 2020, సోమవారం
voice of devarakonda balagangadhara tilak
కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించాడు.. అంతటి అద్భుత కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ స్వీయ కవితాగానం.. ఆయన అపూర్వ స్వరంలో వినండి. పదిమందికి పంచండి. ఇది స్వాధ్యాయ సగర్వ సమర్పణ
9, మార్చి 2020, సోమవారం
gurajada apparao kanyasulkam play.. part-1
తొలి తెలుగు ఆధునిక నాటకం గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం. 99 టీవీ గతంలో ప్లే చేసిన ఈ నాటకం మీకోసం స్వాధ్యయ తిరిగి అందిస్తున్నది. ఈ నాటకం మొత్తం ఆరు గంటల నాటకం. మొత్తం నాలుగుభాగాలుగా ఈ నాటకం స్వాధ్యాయ మీకు అందిస్తున్నది. ఇదిగో ఇది తొలి భాగం. తప్పక చూడండి.
7, మార్చి 2020, శనివారం
keshavareddy
ప్రముఖ రచయిత కేశవరెడ్డి తో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మూడుగంటలకు పైగా ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూను డాక్టర్ పతంజలి నిర్వహించారు. తన యావత్ సాహిత్యం గురించి వివరించిన ఈ ఆరుభాగాల ఇంటర్వ్యూ వర్ధమాన రచయితలకు ఎంతగానో దోహదపడుతుందని స్వాధ్యాయ అభిప్రాయం. తప్పక వినండి.
writer keshavareddy interview part-6
ప్రముఖ రచయిత కేశవరెడ్డితో డాక్టర్ పతంజలి చేసిన ఇంటర్వ్యూ ఆరోభాగం.. వర్ధమానరచయితలు తప్పకుండా అనుసరించాల్సిన వీడియో , ఆడియో ఇది.
writer keshavareddy interview part 4
ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత కేశవరెడ్డి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మూడు గంటలకు పైగా చేసిన ఇంటర్వ్యూ. తన సాహిత్యంపై తానే పూర్తిగా చర్చించిన ఇంటర్వ్యూ లో నాలుగో భాగం ఇది. డా. పతంజలి ఈ ఇంటర్వ్యూనుచేశారు.
keshavareddy interview part-3
ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత కేశవరెడ్డి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మూడు గంటలకు పైగా చేసిన ఇంటర్వ్యూ. తాను రాసిన అతడు అడవిని జయించాడు నవలపై అనేక అంశాలు చర్చించిన భాగం ఇది. సాహిత్యంపై తానే పూర్తిగా చర్చించిన ఇంటర్వ్యూ లో మూడో భాగం ఇది. డా. పతంజలి ఈ ఇంటర్వ్యూనుచేశారు.
3, మార్చి 2020, మంగళవారం
interview with dr. keshavareddy part1
2, మార్చి 2020, సోమవారం
voice of cuttamanchi ramalingareddy
raktakanneeru by nagabhushanam
shadow astrology
నీడ జ్యోతిషం గురించి విన్నారా? మహారాష్ట్రలో ఏడు తరాలుగా ఛాయా జ్యోతిషం చెప్తున్న వారు దాని గురించి ఏం చేప్తున్నారో చూడండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)