7, సెప్టెంబర్ 2023, గురువారం

ఇక అఖండ భారత కూటమి...? #bjptelangana #bjpandhrapradesh #congresstelangan...

రామాయణంలో.. పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది.. అయినా మనం ఎందుకు అరువు తెచ్చుకొ...



రామాయణం అంటే కేవలం సీతను ఎత్తుకుపోవడమో.. లేక రావణుణ్ణి చంపడమో కాదు.. అంతకు మించి. రామరాజ్యం అంటే ఏమిటో వాల్మీకి రామాయణం ఏం చెప్పుతున్నదో చూడండి. అయినా మనం బయటి నుంచి అరువు తెచ్చుకొన్నాం. సూపర్.. ఉదాహరణకు ఒకటి రెండు పాయింట్లు.. మీకోసం..మొత్తం వీడియో చూడండి.. చాలా విషయాలు అర్థమవుతాయి. రాజు నిద్రమత్తులో ఉండకూడదు. తెల్లవారుజామునే లేచి ఆ రోజు చేయాల్సిన పనులను గురించి ఆలోచించాలి. • తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం వచ్చే పనిని చేపట్టి.. దాన్ని కూడా ఆలస్యం చేయకుండా ప్రారంభించాలి. • రాజు పూర్తిచేసిన పనులు మాత్రమే ఇతరులకు తెలియాలి. ముందుముందు చేయతలపెట్టిన పనులు బయటకు తెలియకూడదు. • ఇతరులు లేదా ప్రత్యర్థులు తమ తెలివితో.. లేక ఇతర అడ్డదారుల్లో మన రహస్యాలను తెలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రామం భజే శ్యామలం- కోవెల సంతోష్ కుమార్ 8వ అధ్యాయంలో రెండోభాగం

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

దేశం పేరు మార్పు.. గుట్టు రట్టు #congresstelangana #bjptelangana #brs



ఇండియా పేరును తొలగిస్తూ.. కేవలం భారత్ అని ఒకటే పేరు ఉండేలా పేరు మార్పు ప్రక్రియకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. దీని వెనుక నేపథ్యం ఏమిటి? హఠాత్తుగా దేశం పేర్లలో ఒకదాన్ని మాత్రమే ఎందుకు ఉంచుతున్నారు?

4, సెప్టెంబర్ 2023, సోమవారం

వేదాలు చెత్త పుస్తకాలా? #vedamu #ramayan #ramambhajeshyamalam #kovelasan...



వేదాల్లో అన్నీ ఉన్నాయిష అని వెటకారం చేసిన వాడెవడికీ వేదాలు తెలియవు. సంస్కృత భాషే రాదు. ఇక అర్థమేం తెలుస్తుంది. ఎవడో చెప్పిన నాలుగు ముక్కలను పట్టుకొని.. ఎద్దేవాలు చేస్తుంటారు. ముందు చదివి అర్థం చేసుకుంటే కదా.. అందులో ఏమున్నదో తెలిసేది. ఆ తరువాత తిట్టినా అర్థం ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనట్టు.. ఒక్కో దేశం నుంచి అరువు తెచ్చుకొని ఓహో అన్నట్టు పే...ద్ద ఉద్గ్రంథం రాసుకొని ఊరేగుతున్నాం. ఇక్కడ ఉన్నవేవో తెలుసుకొని అందులో పనికొచ్చేవాటిని తీసుకొని రాసుకొని ఉంటే.. ఇంతకంటే పెద్ద గ్రంథమే అయ్యేది కాదా.. ?