29, నవంబర్ 2010, సోమవారం

జగన్‌ రాజీనామా చేశారు

జగన్‌ రాజీనామా చేశారు.. పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో  సంచలనానికి తెరతీశారు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు కెసిఆర్‌ ఆమరణ దీక్ష సందర్భంగా రాష్ట్ర రాజకీయం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి మొదలైంది. జగన్‌  రాజీనామా పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి తప్పదు..  అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌కు జగన్‌ రాజీనామా శరాఘాతమే. కాంగ్రెస్‌కు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న స్థానాలు157 మాత్రమే. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్ర  శాసనసభలో మ్యాజిక్‌ ఫిగర్‌ 147. అంటే పది మంది సభ్యులు రాజీనామా చేస్తే సర్కారు మైనారిటీలో పడిపోతుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి మద్దతు తీసుకుంటే ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. దీనికి తోడుగా ఎంఐఎం నుంచి 7 సీట్ల మద్దతు ఎలాగూ లభిస్తుంది. అంటే 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఈ రెండు పార్టీల నుంచి లభిస్తుందన్నమాట. అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటమో, జగన్‌ వర్గం వైపు వెళ్లటమో జరిగితే సర్కారు ఖచ్చితంగా మైనార్టీలో పడిపోతుంది. అంటే జగన్‌ కనీసం 40 మంది ఎమ్మెల్యేలను చీల్చగలిగితే స్పష్టంగా సర్కారు మైనార్టీలో పడిపోతుంది. జగన్‌ వర్గానికి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్న. కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన మరునాడు జగన్‌ ఇంట్లో 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. వీరిలో చివరి వరకు ఆయన వెంట ఎంతమంది కొనసాగుతారు.. కాంగ్రెస్‌లో మరెంత మంది ఆయన వెంట వస్తారనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.. మొత్తానికి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రమాణం చేసిన మరునాటి నుంచే సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.. దీన్ని ఎలా అధిగమిస్తారో, ఏ విధంగా చక్రం తిప్పుతారో చూడాలి.

19, నవంబర్ 2010, శుక్రవారం

సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 1.. వీడియో

సీక్రెట్‌ ఆఫ్‌ గాడ్‌‌స పార్‌‌ట 1.. వీడియో
please click link to this post







వీడియోలో నా ప్రోగ్రామ్‌లు చూడండి

కొన్ని రోజులుగా నేను పోస్‌‌ట చేస్తున్న టపాలకు సంబంధించిన ఫీచర్‌  ప్రోగ్రామ్‌ క్లిప్‌‌సను బ్లాగ్‌లో ఉంచమని కొందరు కోరుతున్నారు. వారికి నా ధన్యవాదాలు. గత కొంతకాలంగా  జీ 24 గంటలులో చేసిన కొన్ని  ఎపిసోడ్‌‌సను ఇక నుంచి పోస్‌‌ట చేస్తాను.. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

అఘోరా










ఎస్‌ఐ పరీక్షలు వాయిదా..

ఫ్రీజోన్‌ వివాదం ముదిరిన నేపథ్యంలో ఎస్‌ఐ పరీక్షల నియామకాలకు సంబంధించిన రాత పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గత అయిదారు రోజులుగా హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఫ్రీజోన్‌ వివాదంపై చేస్తున్న ఆందోళనలకు మొదట ప్రతికూలంగా మాట్లాడినా, చివరకు అనుకూలంగా స్పందించింది. 14 ఎఫ్‌ వివాదం సమసేంత వరకూ అని చెప్పకపోయినా, ప్రస్తుతానికైతే ఎస్‌ఐ పరీక్షలను వాయిదా వేశారు.

15, నవంబర్ 2010, సోమవారం

కైలాసంపై శివుడున్నాడా?

మంచుకొండల్లో.. వెండి వెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతు పట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో
సైన్‌‌సకు అందని అసాధారణ వ్యవస్థ
కైలాసం
పరమ శివుడి ఆవాసం
ఆదిశక్తి పార్వతి నివాసం
రావణుడు పది తలలతో ఎత్తిన కైలాసం
ఈ భూమిపైనే ఉంది..
మన కళ్ల ముందు ఉంది
మనకు కనిపిస్తోంది
భూమిపైనే దేవుడు కొలువై ఉన్నాడు
భక్తులకు
శివ అనుగ్రహం లభిస్తోంది..
సముద్ర మట్టానికి
21,778 అడుగుల ఎత్తులో
52 కిలోమీటర్ల విస్తీర్ణంలో
మంచుకొండల నడుమ
 కైలాస పర్వతం
ఈ కొండపైనే రుద్రతాండవం
లయకారుడి లయవిన్యాసం
త్రినేత్రుడి సాక్షాత్కారం
కైలాసంపై ఈశ్వరుడి ఉనికి నిజం
దైవత్వానికి మహాదేవుని నిర్వచనం
కైలాస పర్వతంపైభాగంలో ఏముంది?
ఎవరికీ తెలియని అంతులేని రహస్యం ఏమిటి?
భూమిపైనే ఈశ్వరుడి ఉనికి నిజమేనా? 

.............
నిజమే---- పరమేశ్వరుడు ఈ భూమిపైనే ఉన్నాడు.. మనముంటున్న ఈ నేలపైనే నివాసమున్నాడు.. అవును ఇది అక్షరాలా నిజం.. ఇక్కడే.. ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఆయన ఉన్నాడు.. భక్తులకు సాక్షాత్కరిస్తున్నాడు.. వారి మనోరథాల్ని నెరవేరుస్తున్నాడు.. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది.. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది.. సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుమ ఉంది. ఈ కైలాసంపైనే శివుడు ఉన్నాడు.. ఆయన ఉనికి అక్కడ స్పష్టంగా ఉంది.. సైన్‌‌సకు అంతుపట్టని అపురూప శక్తి ఏదో అక్కడ దాగి ఉంది.
....
సశరీరంతో కైలాసానికి  వెళ్లటం గురించి విన్నాం.. కానీ, ఇప్పుడు ఇది వాస్తవం.. కైలాసానికి మనం బొందితోనే వెళ్లవచ్చు.. తిరిగి రానూ వచ్చు. కాకపోతే కొద్దిగా ఫిట్‌నెస్‌ అవసరం. ఫిట్‌నెస్‌ ఉంటే కైలాసానికి వెళ్లి పరమ శివుని చూసి చక్కగా తిరిగి రావచ్చు.
కైలాసానికి శరీరంతో ఎలా వెళ్లగలమని ఆలోచించకండి.. కైలాసం మన భూమిపైనే ఉంది. హిమాలయ పర్వతాలలో ఉంది. సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో ఉంది.. టిబెట్‌ భూభాగంపై ఉన్నది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు.. వేలాది భక్తులకు దర్శనమిస్తున్నారు..
  మౌంట్‌ కైలాస్‌ ప్రపంచంలో స్పిర్చు్యవాలిటీ  సంపూర్ణంగా  వ్యాపించిన ఏకైక  ప్రాంతం. ఇక్కడికి వెళ్లి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం జరుగుతోంది.
ఉమాశంకరులే కాదు.. శివపార్వతుల ఫ్యామిలీ అంతా ఇక్కడ కొలువై ఉన్నది. కైలాస పర్వతం చుట్టూ ట్రెకింగ్‌ చేస్తున్న కొద్దీ ఒక్కో రూపం మనకు దర్శనమిస్తుంది. నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఒక్కో చోట  ఒక్కో రూపంలో భక్తులకు కనిపిస్తారు..
మౌంట్‌ కైలాస్‌ ఎవరికీ తెలియని ఓ రహస్యమే. ఇది మామూలు పర్వతం కాదు.. హిమాలయ శ్రేణుల్లో ఏ పర్వతానికీ లేని ప్రత్యేకతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. అర్థం కాని రహస్యాలు అనేకం ఇక్కడ దాగున్నాయి. ఇది నాలుగు వైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రత్నాల్లో , నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంది. ప్రపంచంలోని వండర్‌‌స అన్నింటికీ వండర్‌ మౌంట్‌ కైలాస్‌.   

-1-
దేవుణ్ణి దర్శించాలంటే కఠిన మైన నియమాలు పాటించాలి. తపస్సు చేయాలి. ఉపాసన చేయాలి. యజ్ఞ యాగాదులు చేయాలి.. ఇంకా ఏవేవో చెప్తారు మన పెద్దలు.. దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు..ఎంత కష్టపడితే తప్ప.. సాధ్యం కాదని చెప్పటమే వీటన్నింటి ఉద్దేశం..
కైలాస్‌ మానస్‌ సరోవర్‌ యాత్ర అచ్చంగా అలాంటిదే.. అన్ని కష్టాలకూ పరాకాష్ట.. ఊపిరి కూడా తీసుకోవటం కష్టమైన యాత్ర..సముద్ర మట్టానికి ఎన్నో వేల అడుగుల ఎత్తు... ఆక్సీజన్‌ అంతంత మాత్రం.. అసలు వేడి అంటే ఏమిటో మచ్చుకైనా తెలియని వాతావరణం.. శరీరం రాయిలా బిగుసుకుపోయేంత చలి.. ఇతర తీర్థయాత్రా స్థలాల్లో కనిపించే కనీస సౌకర్యాలు ఉండవు.. ఇలాంటి చోట 52 కిలోమీటర్లు ట్రెకింగ్‌  చేయాలి..
ఈ యాత్ర ఒక జీవిత కాలం తపస్సు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఖాట్మండు మీదుగా ప్రారంభమయ్యే యాత్ర తారాపీఠ్‌, గౌరీకుండం మీదుగా కైలాస్‌ చేరుకుంటారు.. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగానే ఫిట్‌నెస్‌ చెక్‌ చేయించుకోవలసి ఉంటుంది.. అన్ని విధాలా ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే కైలాస్‌ యాత్రకు అనుమతిస్తారు...
కైలాస్‌ పర్వతానికి చేరుకోవటం అంటే మృత్యువును ఎదిరించి ముందుకు పోయినంత సాహసమే..పర్వతాన్ని ఒకసారి చుట్టి రావటానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుంది. ఆక్సీజన్‌ అతి తక్కువగా ఉన్న ప్రదేశంలో నాలుగు రోజుల పాటు నడవటం ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది?
శరీర కష్టం కంటే మానసిక సై్థర్యంపైనే, ఆధ్యాత్మిక బలంపైనే కైలాస్‌ పర్యటన కొనసాగుతుంది. కైలాసం శివుడి పూర్ణస్వరూపమని విశ్వాసం. అక్కడకు వెళ్లిన అనేక మంది భక్తులకు పర్వతం ఆసాంతం శివరూపంగా దర్శనమిచ్చిన తార్కాణాలు ఉన్నాయి. విచిత్రమేమంటే కైలాస పర్వతం దగ్గరకు వెళ్లిన యాత్రికులు, పర్వతాన్ని మాత్రం అధిరోహించే ప్రయత్నం చేయరు.. పర్వత పాదాన్ని తాకే ప్రయత్నమైనా చేయరు.. వెళ్లేందుకు ఎవరు సాహసించినా అంతే సంగతులని చెప్తారు. ఇది ఎంతవరకు నిజం.. ఎవరెస్టును సైతం అధిరోహించిన మనిషి  కైలాస పర్వతంపైకి మాత్రం ఎందుకు వెళ్లలేకపోతున్నాడు..
కైలాస పర్వతం పైకి అధిరోహించటం అంత తేలికైన సంగతేం కాదు.. పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేయటం తప్ప, దాన్ని తాకేందుకు కూడా ప్రజలు భయపడతారు..ఎవరెస్టు ఎక్కటానికి లేని భయం కైలాసం తాకటానికి ఎందుకు? కైలాసం ఉపరితలంపై ఏముంది.. కనీసం హెలికాప్టర్లు కూడా దీని పైభాగం నుంచి వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి వెనుక మర్మమేమిటి?

-2-
ఈ భూమిపై హిమాలయాలు ఏర్పడి సుమారు పది మిలియన్ల సంవత్సరాలు అయినట్లు సైంటిస్టులు చెప్తారు. కైలాస్‌ పర్వతం వయసు కూడా బహుశా అంతే అయి ఉండవచ్చు.  అయితే మిగతా హిమాలయ పర్వతాలకు, కైలాసానికి స్పష్టమైన తేడా ఉంటుంది. కైలాస్‌ పర్వతం ఒకప్పటి అఖండ భారతానికి సెంటర్‌ పాయింట్‌లో ఉంది. గురుత్వాకర్షణ శక్తికి గరిమనాభి ఎలాంటిదో.. అఖండభారతానికి సెంటర్‌ పాయింట్‌ కైలాసం..
ఆరు హిమాలయ పర్వత శ్రేణులకు మధ్యలో కైలాస పర్వతం ఉంది.. ఒక విధంగా చూస్తే కమలం ఆకారంలో కనిపిస్తుంది..
కైలాస్‌ పర్వతం నాలుగు వైపుల నాలుగు రంగుల్లో కనిపిస్తుంది. ఒక వైపు నుంచి చూస్తే పూర్తిగా స్ఫటికంలా కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే బంగారు వర్ణం గోచరిస్తుంది.. మూడో వైపు రూబీలాగా, నాలుగో వైపు నీలం రాయిగా గోచరిస్తుంది.
అంతే కాదు..  కైలాసానికి నాలుగు రూపాలూ ఉన్నాయి. ఒకవైపు గుర్రంగా, ఇంకోవైపు సింహంగా, మూడో వైపు ఏనుగుగా, నాలుగో వైపు నెమలిగా కనిపిస్తాయి.. ఇందులో  గుర్రం హయగ్రీవ రూపం కాగా, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుడికి ప్రతీక అయితే, నెమలి కుమారస్వామికి వాహనం.. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెప్తాయి.
కైలాస్‌ పర్వతంలో అత్యంత కీలకమైన విషయం దక్షిణ ఆసియాను సస్యశ్యామలం చేస్తున్న  నాలుగు పవిత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవించటం..గంగ, సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్‌ నదులు ఇక్కడి నుంచే కిందకు ప్రవహిస్తాయి..
మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అద్భుతం. ఈ పర్వత పాదపీఠంలో బ్రహ్మమానస సరోవరం మరో అపురూపం.. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి ఉండదని చెప్పే సైన్‌‌స మాటను నిజం చేసే సరస్సు ఇది. నీటికి ఇంత స్వచ్ఛత ఈ భూమిపై కన్ను పొడుచుకుని చూసినా కనిపించదు. పరమేశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం..కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
కైలాసం పైకి అధిరోహించటం ఇప్పటికి ఎవరి వల్లా సాధ్యం కాలేదు. పదవ శతాబ్దంలో బౌద్ధ మతగురువు మిర్లెపా కైలాస పర్వతాన్ని ఎక్కినట్లు చెప్తారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ, ఎవరూ దీన్ని స్పృశించేందుకు కూడా సాహసించలేదు.. సాహసించిన వారు కనిపించకుండా అదృశ్యమైపోయారని చెప్తారు.. 1954లో కైలాస్‌ యాత్రను నిషేధించిన చైనా కూడా  దీనిపై ప్రయోగం చేసి విఫలమైంది. రెండుసార్లు హెలికాప్టర్లు పంపిస్తే  అవి తిరిగి రాలేదు. ఆ తరువాత ఎవరూ సాహసించలేదు...
ఎన్నో ప్రయోగాలు జరిగాయి.. ఏమీ తేలలేదు.. ఇప్పటి వరకు కైలాస్‌ పర్వతం అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన వాళ్లే తప్ప ఇన్నర్‌ సర్కిల్‌లోకి ప్రవేశించిన వాళూ్ల లేరు.. 21సార్లు అవుటర్‌ సర్కిల్‌లో తిరిగిన తరువాత ఇన్నర్‌ సర్కిల్‌లోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. అది అంత తేలిక కాదు.. అఘోరాల్లాంటి వాళ్లకు కానీ సాధ్యం కాదు.. ఇంత క్లిష్టమైన పర్వతం ఉపరిభాగంపై ఏమున్నదన్నది సైన్‌‌సకు మాత్రం అందలేదు.. భక్తులకు మాత్రం కైలాసంపై శివుడు సాకారంగా సాక్షాత్కరిస్తున్నాడు.. ధ్యానముద్రలో కనిపిస్తున్నాడు. లింగరూపుడై దర్శనమిస్తున్నాడు. కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు....ఇది విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు అతీతమైంది.. అంతు చిక్కనిది.
కైలాస్‌ దర్శనం భక్తులకు ఒక అపూర్వ అనుభూతి.. హిమాలయ సానువుల్లో సువర్ణభాండం.. పరమేశ్వరుడి దివ్యధామం.. పార్వతి దేవీ కొలువైన పవిత్ర క్షేత్రం. అణువణువులోనూ శివస్వరూపాన్ని నింపుకున్న ప్రాంతం. మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది. అందుకే భక్తులు మానస సరోవరాన్ని భూలోక కైలాసంగా పిలుచుకుంటారు.

12, నవంబర్ 2010, శుక్రవారం

మీ పిల్లల్ని మీరు చంపేస్తున్నారు

ఒక చిరు తిండి మీ చిన్నారి ప్రాణాల్ని హరించేస్తున్నది
అందంగా కనిపిస్తూనే అంతం చేస్తోంది
కమ్మకమ్మగా ఖతం చేస్తోంది
జ్యూసీగా జ్యూసీగా విషం లోపలికి ఇంజెక్ట్‌ అవుతోంది
రక్తంలో కలిసిపోతోంది
మీరే మీ పిల్లలకు విషాన్ని అందిస్తున్నారు
అన్నం బదులు రసాయనాలను తినిపిస్తున్నారు
పురుగుమందులను తాగిస్తున్నారు
పిజ్జాలు..
బర్గర్లు..
పావ్‌ బాజీలు..
కట్‌లెట్‌ రగడా..
హమ్‌బర్గర్స్‌
హాట్‌ డాగ్స్‌
ఐస్‌క్రీమ్‌
కేక్‌
ఫ్రెంచ్‌ ఫ్రైస్‌
ఆనియన్‌ రింగ్స్‌
డోనట్స్‌
సాఫ్ట్‌ డ్రింక్స్‌
-----------------------------------------------

1
హాలీడే వచ్చేసిందంటే చాలా మందికి జాలీడే.. పిల్లలతో షికార్లు.. మెక్‌డోనాల్డ్స్‌లో పిజ్జాలు.. బర్గర్‌లు.. ఐమాక్స్‌లో సినిమా.. వీడియో గేమ్స్‌తో హల్‌చల్‌.. గోకుల్‌ చాట్‌లో చాట్‌, పానీపురీ, పావ్‌బాజీ.. ఫుల్‌ హంగామా.. వారం రోజుల పాటు రోజూ పది, పన్నెండు గంటలు పని చేసి హాలీడే వచ్చిందంటే, పిల్లలతో హ్యాపీగా గడపడం, వాళ్లడిగింది కొనివ్వటం దగ్గరుండి రకరకాల ఫుడ్స్‌ తినిపించటం.. ఓ రిలాక్స్‌.. ఓ ఆనందం.. పిల్లలూ హ్యాపీ.. మనమూ హ్యాపీ..,..... ఈ హ్యాపీ హ్యాపీయేనా? మీ పిల్లలకు కోరిందల్లా కొనివ్వటమే హ్యాపీయా? కాదు.. మీకు తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నారు.. కోరి కోరి మృత్యుముఖంలోకి నెట్టేస్తున్నారు.. పిల్లలను మృత్యువు దగ్గరకు మీరే పంపిస్తున్నారు.. ఇది పుక్కిటి పురాణం కాదు. పిట్టకథ కాదు.. మీకు ఓ హెచ్చరిక.
మీ పిల్లలకు అన్నీ ఇష్టమే.. మీకూ ఇష్టమే.. వాళ్లు అన్నం తినకపోయినా సరే.. పిజ్జా తింటే చాలు.. పసిపాపకు తిండి అంటే ఫ్రెంచ్‌ఫ్రై, డోనట్సే.. ఇక ఐస్‌క్రీమ్‌లకు, కూల్‌డ్రింక్‌లకూ కొరవేముంది... ఏదీ తిండికి అనర్హం కాదు.. ఏదీ తాగటానికి అనర్హం కాదు.. ఎక్సెప్ట్‌ అన్నం తప్ప..

ఇక్కడే ఓ ప్రశ్న ఉదయిస్తుంది. వీకెండ్స్‌లో కూడా ఇంట్లోనే తినాలా? అదీ అన్నం తినాలా? పిల్లల సూటి ప్రశ్న ఇది. అవును.. నిజమే.. రోజూ ఏదో అన్నం తింటున్నాం.. సరదాగా వీకెండ్స్‌లో మరేదైనా తినిపించవచ్చు కదా.. లాజిక్‌ బాగానే ఉంది. పిల్లల్ని హ్యాపీగా ఉంచటం ముఖ్యం వాళ్లకు ఇష్టమైంది తినిపించకపోతే మనమెందుకు అని పేరెంట్స్‌ ఫీల్‌ కావటమూ లాజిక్కే.  ఈ మాత్రం దానికి పిల్లలకు విషం తినిపిస్తున్నామని, వాళ్లను చంపేస్తున్నామని అడ్డగోలుగా వాదించటం, భయపెట్టడం సబబేనా?  అంటే నిజమే.. కానీ, దీని వెనుక కారణం ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించాలి.
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకువెళ్లేదే, ఫుడ్‌కోర్ట్‌కో, సినిమాకో, వీకెండ్‌ స్పాట్స్‌కో.. ఫుడ్‌ కోర్ట్‌కు వెళ్లినప్పుడు అక్కడ పులిహోరో, అన్నం పాయసమో అమ్మరు కదా.. అక్కడ అమ్మేదే ఫాస్ట్‌ ఫుడ్‌... అదీ పిజ్జా, బర్గర్లు, చాట్‌, పానీపూరీలు..రెస్టారెంట్‌  టైప్‌ అయితే బిర్యానీ, రుమాలీ రోటీ, చైనీస్‌ ఫుడ్‌.. అవే ఉంటాయి. అవే తినాలి. అవి తినేందుకే పేరెంట్స్‌ వెళ్తారు. పిల్లల్ని వెంటేసుకుని మరీ వెళ్తారు. వాళ్లు పిజ్జా తింటుంటే హ్యాపీగా ఫీలవుతారు..
ఇప్పుడు ఈ తిండే పెద్ద సమస్యగా మారింది. ప్రాణాంతకంగా మారింది. పిల్లలను మృత్యుముఖంలోకి నెట్టేస్తుంది. మీ పిల్లల ప్రాణాలను తోడేసేది ఎవరో కాదు.. పిజ్జా.. బర్గర్‌, పావ్‌, కురుకురే.. ఎస్‌.. వీటికి ముద్దు పేరు జంక్‌ ఫుడ్‌.. జస్ట్‌ అచ్చతెలుగులో అనువదిస్తే చెత్త ఆహారం అని అర్థం.. అలా అనడానికి మనసొప్పదు కాబట్టి చిరుతిండి అని కూల్‌గా పిలుచుకుంటాం...
మీ పిల్లలకు తినిపిస్తున్న పిజ్జా, బర్గర్‌, డోనట్‌.. వాళ్ల శరీరాల్లో చెత్తలా పేరుకుపోతోంది. ఎక్కడ పడితే అక్కడ చేరిపోతోంది. అది కొండలా పెరిగిపోతోంది. పిల్లకాయల్ని బెలూన్లా ఊరేలా చేస్తోంది. నాలుగేళ్ల వయసుకే వంద కిలోల బరువెక్కి, బతుకే భారంగా మారేట్లు చేస్తోంది.
రెండేళ్ల నుంచి ౧౯ఏళ్ల వరకు ఆడ, మగ తేడా లేకుండా అందరిలోనూ ఫుడ్‌ సెユ్టల్‌ మారిపోయింది. అన్నం అంటే సెユ్టల్‌గా పిలుచుకుంటే వైట్‌రైస్‌ అనేది లైట్‌గా తీసుకోవటం, సైడ్‌ ఫుడ్స్‌ తెగ మెక్కేయటం అలవాటుగా మారిపోయింది.

ఇది అంత ఆషామాషీగా తీసుకోవద్దు.. మీ పిల్లల్లో అవాంఛనీయమైన ఊబకాయానికి ఈ తిండ్లే కారణమని గ్రహించండి.. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి మీ పిల్లల్ని ఎదగనీయవు.. జీవన పరిమాణాన్ని అమాంతంగా తగ్గించేస్తాయి. మీ జనరేషన్‌  వాళ్లు కనీసం 60-70 ఏళ్లయినా బతుకుతున్నారు. మీ పిల్లల జనరేషన్‌ 40 ఏళ్లు దాటితే గొప్పే...
-----------------------------

3
ఎందుకింతగా భయపెడుతున్నారు? అని అందరికీ సందేహం కలుగుతుంది.. కానీ, ఇది భయపెట్టడం కాదు.. హెచ్చరించటం.. నిజంగా ఇది యంగ్‌ పేరెంట్స్‌కు ఓ హెచ్చరిక.. ఫాస్ట్‌ఫుడ్‌ మేనియాలో పడి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడమని హంబుల్‌ రిక్వెస్ట్‌.  ఈ చిన్న కథలాంటి వాస్తవాన్ని ఒకసారి చదవండి..
జనవరి ౧, ౧౯౮౯ సాన్‌ఫ్రాన్సిస్కో అమెరికాలో మాట్‌ మామ్‌గ్రమ్‌ అనే యువకుడు ఓ పిజ్జా హట్‌లోకి వెళ్లాడు. రెండు బర్గర్లు తీసుకున్నాడు.  ఒక బర్గర్‌ తినేసి, మరో బర్గర్‌ను కోటు జేబులో  పెట్టుకున్నాడు. ఆ తరువాత దాని సంగతే మరిచిపోయాడు. ఏడాది పాటు ఆ కోటునే వేసుకోలేదు.  సరిగ్గా సంవత్సరం తరువాత మాట్‌ తన పాత కోటు తీశాడు. కోటు జేబులో ఏదో తగిలిందని చూస్తే, ఏడాది క్రితం నాటి బర్గర్‌
ఆశ్చర్యం వేసింది. తాను కొన్నప్పుడు ఎలా ఉందో.. ఎలాంటి వాసన వచ్చిందో అలాగే ఉంది..తాను కనుగొన్న ఈ డిస్కవరీని తన ఫ్రెండ్స్‌తో పంచుకున్నాడు. ఎవరూ అతణ్ణి నమ్మలేదు. కొత్త బర్గర్‌ కొని అబద్ధమాడావన్నారు. అప్పటి నుంచి మాట్‌ బర్గర్ల కలెక్షన్‌ ప్రారంభించాడు.  వాటిని టీపాయ్‌ కింద బేస్‌మెంట్‌లో దాచాడు. ఇదంతా జరిగి ౨౧ సంవత్సరాలు పూర్తయ్యాయి.  ఇవాళ మాట్‌ దగ్గర సూపర్‌ బర్గర్‌ కలెక్షన్‌ తయారైంది.
ఎప్పటికీ చెడిపోని బర్గర్లు.. డబుల్‌ చీజ్‌ బర్గర్లు.. హమ్‌బర్గర్లు.. ప్రపంచంలో కనీవినీ ఎరుగని కలెక్షన్‌ ఇది. ఇప్పుడాయన బర్గర్‌ మ్యూజియం నిర్వహిస్తున్నాడు.

ఒక ఆహార పదార్థం ఎన్నాళ్లయినా పాడు కాకుండా ఉండటం ఎలా సాధ్యం? వీటిలో ఏయే పదార్థాలు వాడారు.. ఎందుకలా చెడిపోకుండా ఉన్నాయి. ఇలాంటి పదార్థాలు తింటే, మీరు తినిపిస్తే.. మీ పిల్లలు ఏమై పోతారు.. ఒక్కసారి కూల్‌గా ఆలోచించండి..
అమెరికాలో మాట్‌  మామ్‌గ్రమ్‌ స్టోరీ కల్పితం కాదు. నిజం.. ఈ బర్గర్‌లలో వాడిన ఇన్‌గ్రెడెంట్స్‌ వింటే దిమ్మ తిరిగిపోతాయి.
ఆవుమాంసం
ట్రెユక్లోరోథిన్‌
క్లోరోఫామ్‌
డిడిటి
ఇథైల్‌ బెంజిన్‌
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రసాయనాలు కనిపిస్తాయి. ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు, రుచికరంగా ఉండేందుకు, చాలా వస్తువులు ఇందులో కలుస్తాయి. ప్రపంచం అంతా ఇదే జరుగుతోంది. ఇందుకు మన దేశం మినహాయింపేమీ కాదు. ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు.. వీటివల్ల జంక్‌ఫుడ్‌ లోపలికి వెళ్లి పూర్తిగా జీర్ణం కాక రక్తనాళాల పక్కన కొలెస్ట్రాల్‌గా మారి నిలిచిపోతుంది. ఫలితం.. ఊబకాయం...
ప్రతి వందమంది పిల్లల్లో  ౩౫ శాతం మంది అండర్‌ వెయిట్‌ ఉంటే, ౫౫ శాతం మంది ఓవర్‌ వెయిట్‌ ఉన్నారు.. కేవలం పది శాతం మంది మాత్రమే వయసుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉంటున్నారు. మిగతా వాళ్లందరికీ ఎప్పుడూ ఏదో సమస్యే... ఏ చిన్న ప్రతికూల వాతావరణాన్ని కూడా భరించలేని పరిస్థితి. ఎక్కువ వేడిని తట్టుకోలేరు.. ఎక్కువ చల్లదనాన్ని తట్టుకోలేరు.. చిన్న చిన్న వాటికే కిందామీదా పడిపోతారు.. మీరే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆలోచించండి.. నెలకు మీ పిల్లల మెడిసిన్స్‌ ఖర్చు ఎంతవుతోందో లెక్కలేసుకోండి.. మీకే అర్థమవుతుంది.. మీ పిల్లలెంత బాగా ఉన్నారో.. వారి ఆరోగ్యాన్ని మీరెంతగా చెడగొడుతున్నారో..

చెత్త తిండి, అదేనండి.. జంక్‌ ఫుడ్‌ తినిపిస్తే మీ పిల్లల్లో  ఒబెసిటీ పెరగడమే కాదు.. మామూలు భోజన అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. తిండి సరిగా తినరు.. జంక్‌ఫుడ్‌పై చూపే మోజు, మామూలు అన్నంపై చూపించరు. తొందరగా అలిసిపోతారు. కాళ్ల నొప్పులంటారు... కడుపు నొప్పంటారు.. తరచూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. ప్రతి చిన్న దానికి భయపడిపోతుంటారు. నిద్ర సరిగా పట్టదు.. ఒకదాని వెంట ఒకటిగా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. డాక్టర్లను పేరెంట్స్‌ పోషిస్తూనే ఉంటారు. దటీజ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ జంక్‌ఫుడ్‌.

ఈ ఒబెసిటీ జాడ్యం కూడా పాశ్చాత్య దేశాల నుంచే మనకు పట్టుకుంది. అన్నింటా అమెరికాను ఆదర్శంగా తీసుకోవటం, అడ్డమైన ఫుడ్డూ తినటం, మన తరువాతి జనరేషన్‌ ఆయుర్దాయానికే ఎసరు తెచ్చిపెడ్తోంది. అసలు వాళ్ల లైఫ్‌సెユ్టల్‌నే అది పూర్తిగా మార్చేస్తోంది.    
ఇప్పుడు మన లైఫ్‌ అంతా అమెరికా సెユ్టల్‌.. లండన్‌ సెユ్టల్‌.. సిడ్నీ సెユ్టల్‌.. అంతే తప్ప.. హైదరాబాదీ సెユ్టల్‌ అనేది లేనే లేదు. నగరాల్లో కాలుష్యం ఓ నరకం అయితే, ఫాస్ట్‌ఫుడ్‌ డైరెక్ట్‌ పాయిజన్‌గా ఇంజెక్ట్‌ అవుతోంది. మన రాజధానిలో నెలకు రెండు  వందల కోట్ల రూపాయల వరకు రకరకాల రూపాల్లో ఫాస్ట్‌ఫుడ్‌ బిజినెస్‌ జరుగుతోందంటేనే, నగర ప్రజలు ఏ స్థాయిలో అడిక్ట్‌ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
అమ్మాయిల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది.. ఇలాంటి జంక్‌ఫుడ్‌ కారణంగా అమ్మాయిల్లో హార్మోన్లు వ్యాకోచించి తొందరగా ఎదిగిపోతున్నారు.. చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు. పెద్ద వాళ్లలో ఉన్న లక్షణాలన్నీ ముందే వచ్చేస్తున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారుతోంది.
ఈ సమస్యంతా నగరాల్లో ఉన్న పిల్లల విషయంలోనే జరుగతోంది. ఫాస్ట్‌ఫుడ్‌.. జంక్‌ఫుడ్‌.. చెత్త తిండి అంతా నగరాల్లోనే దొరుకుతోంది.. ఇంకా పల్లె సీమలకు ఎక్కువగా విస్తరించకపోవటం వల్ల అక్కడి పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలు అక్కడికి పాకలేదు. నగరాల్లోనే ఈ విషం పిల్లల రక్తనాళాల్లో వేగంగా వ్యాపిస్తోంది.  ఏ దశలోనూ  పిల్లలకు పోషకాహారం లభించటం లేదన్న వాస్తవాన్ని  తల్లిదండ్రులు గుర్తించటం లేదు. ఒకవేళ గుర్తించినా, ఆ పోషకాహారాన్ని అందించే పరిస్థితీ, వాతావరణం లేనే లేదు. ఇది ఇంతమందిలో ఉంది.. జంక్‌ఫుడ్‌ ప్రభావం ఇంతమందిలో లేదు అన్న లెక్కలు పత్రాలు అవసరం లేదు. ప్రతి ఇంట్లో, పిల్లలందరికీ విస్తరించిన జాడ్యం. దీన్ని నిర్మూలించటం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న వేయవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా ఆపగలం అని అడగవచ్చు. కానీ, దాన్ని కనీస స్థాయికి తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. పీజ్జాలతో చెలగాటం.. మీ పిల్లలకు ప్రాణసంకటం అని గ్రహించండి...జస్ట్‌ అవాయిడ్‌ జంక్‌ఫుడ్‌.. సేవ్‌ యువర్‌ కిడ్స్‌..

10, నవంబర్ 2010, బుధవారం

వైట్‌హౌస్‌ అలియాస్‌ రెసిడెన్సీ

కోఠీ రెసిడెన్సీ.. ఒకప్పుడు నిజాం వైభవానికి నిలువెత్తు నిదర్శనం... ఇప్పుడు అగ్రరాజ్యం అధిపతి నివాసంగా మారింది. మన రెసిడెన్సీని ప్రపంచ పోలీసు ఎత్తుకెళ్లిపోయాడు.. అక్కడి నుంచే అధికారాన్నంతా చెలాయిస్తున్నాడు.. ఒకప్పటి మన రెసిడెన్సీ.. బ్రిటిష్‌ వారి మెప్పు కోసం, మెహర్బానీ కోసం నిజాం నిర్మించి ఇచ్చిన గొప్ప ప్యాలెస్‌ ఇప్పుడు పేరు మార్చుకుని వాషింగ్టన్‌ డిసికి తరలిపోయింది.. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసంగా మారిపోయింది. ఇది వింతవార్త కాదు.. పుకారు కాదు.. విచిత్రం కాదు.. నిజం..
1
ఇదేమీ కట్టుకథ కాదు.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే వాస్తవం.. మనకు తెలియకుండానే మన భవనం అమెరికా అధ్యక్షుడి నివాసమైపోయింది. ఇదెలా జరిగింది? ఇప్పుడు యావత్ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రశ్న. హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న వాస్తవం.. రెసిడెన్సీ ఏ విధంగా తరలిపోయింది? ఎలా పేరు మార్చుకుంది? అంతటి అగ్రరాజ్యానికి మన రెసిడెన్సీయే ఎందుకు కావలసి వచ్చింది? వినడానికి విచిత్రంగానే ఉండొచ్చు.. కానీ, ఇది వాస్తవం..  
మనకు తెలిసిన అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్‌.. రాజధాని వాషింగ్టన్‌ డిసిలో కొలువై ఉన్న శ్వేత సౌధం.. కనుసైగతో ప్రపంచాన్ని శాసించే అత్యంత శక్తిమంతమైన రాజ్యాధిపతి అధికార దర్పానికి నిలువుటద్దం. శ్వేతసౌధంలో అధికార లాంఛనాలతో రెడ్‌కార్పెట్‌ స్వాగతం స్వీకరించేందుకు ఉబలాటపడని ప్రపంచదేశాధి నేతలు ఉండరు.. మన మన్మోహన్‌ సింగ్‌ సైతం జార్జిబుష్‌ ఇచ్చిన విందుకు సంబరపడే అణు ఒప్పందంపై రాజీ లేకుండా సంతకం చేసేశారు..
ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా మొట్టమొదటి సమాచారం వైట్‌హౌస్‌కు చేరుతుంది. ఏ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చూసేందుకు వేలాది డేగకళ్లకు శ్వేతసౌధం నివాసం. ఒక్క మీట నొక్కితే మూడు వేల సార్లు భూమిని నాశనం చేసే అణ్వసా్తల్రను పేల్చే బ్లాక్‌ బాక్‌‌స భద్రంగా ఉన్న భవనం.
అమెరికా సంయుక్తరాషా్టల్ర అధ్యక్షుడి నివాసంతో పాటు ఆయన పరిపాలనా విభాగాలన్నీ వైట్‌హౌస్‌లోనే కొలువై ఉంటాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయమైనా ఈ భవనంలోనే రూపొందుతుంది.. ఇక్కడే అమలు జరుగుతుంది. తాను కావాలనుకుంటే యుద్ధం.. వద్దనుకుంటే శాంతి.. వార్‌కైనా, పీస్‌ కైనా ఇక్కడే నాంది పలుకుతుంది.. ఇక్కడి నుంచే ఆపరేషన్‌ స్టార్‌‌ట అవుతుంది..
అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే నియంతృత్వ అమెరికాకు శ్వేతసౌధం కేంద్రకం. ఇందులో ఎవరికీ ఆక్షేపణ లేదు.. అభ్యంతరం అంతకంటే లేదు.. మరి ఎక్కడో భారత్‌లో ఓ మూలన హైదరాబాద్‌లో ఉన్న కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి ఉన్న సంబంధం ఏమిటి? రెసిడెన్సీ వైట్‌హౌస్‌గా ఎలా మారిపోయింది? ఎవరు మార్చాల్సి వచ్చింది. వైట్‌హౌస్‌ను అలియాస్‌ రెసిడెన్సీగా ఎందుకు పిలవాలి? వాట్‌ ఈజ్‌ ది సీక్రెట్‌?

2
అంతా అయోమయంగా ఉందని అనుకోకండి.. ఇందులో విశేషమే ఉంది. మన కోఠీ రెసిడెన్సీని, అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను ఒక్కసారి నిశితంగా గమనించండి.. పరిశీలించండి.. అణువణువూ పరికించండి.. మర్మం ఏమిటో మీకే తెలుస్తుంది. కోఠీ రెసిడెన్సీకి, వైట్‌హౌస్‌కి అణువంతైనా తేడా లేదని.. అచ్చంగా మన రెసిడెన్సీకి కవల పిల్లలా ఉందని మీకే అర్థమవుతుంది.              
మనలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది.. భారతీయులందరిలోనూ ఉన్న లక్షణమే అది.. ఏమంటే.. మనకు ఎలాంటి తెలివీ లేదని.. ఎవడో బయటివాడు వచ్చి మనకు నేర్పితే కొని తెచ్చుకున్న కొంచెపు తెలివే తప్ప.. మనకంటూ సహజంగా ఉన్నది సున్నాయేనని ఓ గట్టి నమ్మకం. అమెరికా వోడు ఆరోగ్యానికి పెరుగన్నం తినమంటే ఆహా, ఓహో అంటూ తినేస్తాం... వైట్‌హౌస్‌ నుంచి కూచోమని ఆదేశమొస్తే కూచుంటాం.. నిలుచోమంటే నిలుచుంటాం.. మన మంచి మనకంటే వాడికే ఎక్కువ తెలుసని మనమే దబాయించి వాదిస్తాం మరి..
కానీ, ఇదిగో ఒక్కసారి ఆలోచించండి.. మన వారికి ఉన్న తెలివేంటో తెలుసుకోండి.. మన వారిని మనం వదిలేసుకున్నాం.. కానీ, అదే అమెరికావోడు తెలివిగా పట్టేసుకున్నాడు.. మనకున్న నైపుణ్యాన్ని వాళు్ల నిస్సిగ్గుగా తమ దగ్గరకు తీసుకెళ్లిపోయారు.. అందుకు ఉదాహరణే హైదరాబాద్‌ కోఠీలోని ఒకప్పటి బ్రిటిష్‌ రెసిడెన్సీ.. ఇప్పటి వుమెన్‌‌స కాలేజి. జస్‌‌ట లుక్‌ ఇన్‌టు ఇట్‌..
కోఠీ రెసిడెన్సీ, వైట్‌హౌస్‌ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉంటాయి.. ఉన్నాయి. ముఖద్వారం నుంచి, వెనుక ఉన్న ఫౌంటెన్‌ దాకా, స్తంభాల దగ్గరి నుంచి వాటిపై ఏర్పరిచిన అలంకారాల దాకా కోఠీ రెసిడెన్సీకి ఓ కార్బన్‌ కాపీలా వైట్‌హౌస్‌ ఉంటుంది.
కొద్దిగా కూడా తేడా కనిపించదు.. ఒకే ముఖం.. ఒకే ఎత్తు.. ఒకే శిల్పం.. ఒకే నిర్మాణ రీతి.. చూస్తుంటే ఒంట్లో ఒక రకమైన కదలిక వచ్చేస్తుంది.. ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి.. ఇది ఎలా సాధ్యపడింది? కోఠీలో బ్రిటిష్‌ వారి రెసిడెన్సీ ఆర్కిటెక్చర్‌ను వైట్‌హౌస్‌ అనుకరించిందా? వైట్‌హౌస్‌ ఆర్కిటెక్చర్‌ను నాటి నిజాం అనుకరించాడా?
అవును.. మీ అనుమానం నిజమే.. మన నైపుణ్యాన్నే వైట్‌హౌస్‌ నిర్మాతలు తేలిగ్గా కొట్టేశారు.. హాలీవుడ్‌ సినిమాల్లో సీన్లను కాపీ కొట్టి తెలుగు సినిమాల్లో యథాతథంగా వాడుకున్నట్లే.. మన రెసిడెన్సీ నిర్మాణశైలిని ఉన్నది ఉన్నట్లుగా అగ్రరాజ్యం కాపీ కొట్టింది..
3
ఎక్కడి వైట్‌ హౌస్‌.. ఎక్కడి కోఠీ రెసిడెన్సీ.. రెండూ ఒకే లాగా ఎలా నిర్మించారు.. రెండింటి ఆర్కిటెక్‌‌ట ఒక్కరేనా? లేక ఒకదాని నమూనాతో మరొకటి నిర్మించారా? ఇన్నాళూ్ల బయటి ప్రపంచానికి తెలియని ఓ పెద్ద మిస్టరీ.. రెండూ ఒకే రీతిలో నిర్మాణం జరగడానికి వెనుక కారకులెవరైనా ఉన్నారా?
వైట్‌ హౌస్‌.. కోఠీ రెసిడెన్సీ.. ఒకటి అగ్రరాజ్యం అధినేత నివాసం.. మరొకటి ఒకనాటి బ్రిటిషర్లు, నిజాం నవాబు వైభవానికి నిదర్శనం.. ఒకటి తూర్పు.. మరొకటి పడమర.. రెండూ ఒకేలాగా ఉండటం ఎలా సాధ్యపడింది? ఒకటి కాదు.. రెండు కాదు.. రెంటికీ బోలెడు పోలికలు ఉన్నాయి...
రెండింటినీ దక్షిణాభిముఖంగానే నిర్మించారు.

రెండింటి ఫ్రంటల్‌ వూ్య ఒకే విధంగా ఉంటుంది.

రెండింటికీ సెమీ సర్కిల్‌ పోర్టికో ఉంది.

ఈ పోర్టికోలో నిలుచునే అమెరికా అధ్యక్షుడు ప్రసంగం చేసే సంప్రదాయం ఉంది. బ్రిటిష్‌ రెసిడెన్సీలోనూ గవర్నర్‌ జనరల్‌ ఇదే పోర్టికోలో నిలుచుని ప్రజలను అడ్రస్‌ చేసేవారు.

సెమిసర్కిల్‌ పోర్టికోలో ఉన్న స్తంభాలు రెండింటిలోనూ ఒకే ఎత్తులో ఉంటాయి

రెండింటి పునాది ఒకే ఎత్తులో ఉంది.

రెండింటికీ సెల్లార్‌లో నిర్మాణం జరిగింది.

వైట్‌ హౌస్‌లో మొత్తం సెల్లార్‌ నుంచి పై వరకు మొత్తం ఆరు అంతస్థులు ఉంటే, కోఠీ రెసిడెన్సీలో  సెల్లార్‌, గ్రౌండ్‌, ఫస్‌‌ట ఫ్లోర్లు ఉన్నాయి.

బయటినుంచి చూస్తే రెండు భవనాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

భవనాలకు ఉత్తరాభిముఖంలో కనిపించే ట్రయాంగిల్‌  పోర్టికో కూడా ఒకే విధంగా ఉంటుంది.

స్తంభాల అంచుల్లో డిజైనింగ్‌ అచ్చుగుద్దినట్లే ఉంటుంది.

లోపల తలుపులపై వెంటిలేటర్ల నిర్మాణం కానీ, రూఫ్‌ డిజైనింగ్‌లో కూడా తేడా ఇసుమంతైనా కనిపించదు..

సీలింగ్‌, పిల్లర్లు మాత్రమే కాదు.. లోపల దర్బార్‌ హాల్‌ నిర్మాణం కూడా రెండింటిలోనూ ఒకే రకంగా కనిపిస్తుంది.

భవనం లోపలి భాగంలో పిల్లర్ల ఏర్పాటులో కూడా ఏక రూపత కనిపిస్తుంది. ఒక పిల్లర్‌ దాని తరువాత రెండు పిల్లర్లు ఆ తరువాత ఒక పిల్లర్లను ఏర్పాటు చేయటం రెట్టింపు ఎత్తులో ఉన్న సీలింగ్‌కు భద్రత కల్పించటం కోసం ఈ రకమైన స్తంభాల ఏర్పాటు చేశారు.
రెండు భవనాల్లోనూ ఉత్తరం వైపు పెద్ద గార్డెన్‌ ఉంది.. ఈ రెండు తోటల్లోనూ వలయాకారంలో ఉన్న ఫౌంటెన్‌లను చూడవచ్చు.
వైట్‌హౌస్‌లో మెట్లు బయటి నుంచి ఉంటే, కోఠీ రెసిడెన్సీలో మెట్లు లోపలి నుంచి కనిపిస్తాయి. రెయిలింగ్‌ డిజైనింగ్‌ ఒకే రకంగా ఉంటుంది.
రెండు భవనాలకు రెండువైపులా అదనపు నిర్మాణాలు జరిగాయి.
కిటికీల డిజైనింగ్‌ కానీ, బాల్కనీ అంచులపై ఉన్న డిజైనింగ్‌ కానీ రెండింటిలోనూ ఒకేరకంగా ఉంటుంది.
4
వైట్‌హౌస్‌, కోఠీ రెసిడెన్సీలు రెంటిలోనూ ఇన్ని కామన్‌ ఎలిమెంట్లు ఎలా సాధ్యమైందన్నది ఇప్పటివరకూ అంతుపట్టని విషయం.. కోఠీ రెసిడెన్సీని చూసి వైట్‌హౌస్‌ను నిర్మించారా? లేక సొంత డిజైనింగేనా? సొంతంగా అగ్రరాజ్యం డిజైన్‌ చేయించినట్లయితే ఇన్ని సిమిలారిటీస్‌ కనిపించటం అసాధ్యమైన పని. కానీ, ఎలా సాధ్యపడింది?
వైట్‌హౌస్‌ను మొట్టమొదట నిర్మించింది 1792లో.. అమెరికా అప్పటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ ఈ భవంతికి రూపకర్త.. ఐరిష్‌కు చెందిన జేమ్‌‌స హోబన్‌ ఈ భవనానికి డిజైన్‌ చేశాడు.. జాన్‌ ఆడమ్‌‌స అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకు అందరు ప్రెసిడెంట్లకూ ఇది అధికార నివాసంగా ఉంటూ వచ్చింది. 1792లో ఈ బిల్డింగ్‌ను నిర్మించినప్పుడు ఆక్వా సాండ్‌ స్టోన్‌ వాడారు.. అప్పుడు దీన్ని వైట్‌ హౌస్‌ అని పిలవలేదు. ఎగ్గిక్యూటివ్‌ మాన్హన్‌ అని, మరి కొన్ని పేర్లతో దీన్ని పిలిచారు. 1801లో థామస్‌ జెఫర్‌సన్‌ ప్రెసిడెంట్‌ అయ్యాక దీని బయటి వైపు విస్తరించాడు.
1814లో బ్రిటిష్‌ ఆర్మీతో యుద్ధం జరిగిన సమయంలో ఈ భవంతి పూర్తిగా కాలిపోయింది. బ్రిటిష్‌ సైన్యం పూర్తిగా దీన్ని ధ్వంసం చేసింది.  ఆ తరువాత దీన్ని మళ్లీ నిర్మించారు.. పాత డిజైన్‌లోనే మళ్లీ నిర్మించినా, ఇంటీరియర్‌, ఎక్సీ్టరియర్‌ డిజైనింగ్‌లో మార్పు వచ్చింది. 1829 నాటికి సౌత్‌ పోర్టికో వచ్చేసింది. తూర్పు, పడమరల వైపు విస్తరణ జరిగింది. ఈ ఆల్టరేషన్‌‌స 1948 దాకా జరుగుతూనే వచ్చాయి.  అధ్యక్షుడు మారుతున్న కొద్దీ ఒక్కో మార్పు జరుగుతూ వచ్చింది. 1948 నాటికి కానీ, ఇవాళ మనం చూస్తున్న వైట్‌హౌస్‌ ఒక రూపానికి రాలేదు..

శాండ్‌స్టోన్‌ బిల్డింగ్‌కు 1829లో పునర్నిర్మాణం జరిగిన తరువాత వైట్‌పెయింట్‌ వేశారు. అప్పటి నుంచీ దీన్ని వైట్‌హౌస్‌గా పిలవటం ప్రారంభించారు.
ఇక కోఠీ రెసిడెన్సీ విషయానికి వస్తే, 1798లో హైదరాబాద్‌ కోఠీలో నిర్మించారు. ఇప్పటి వరకూ అందరికీ తెలిసినట్లుగా బ్రిటిష్‌ రెసిడెంట్‌ గవర్నర్‌ జేమ్‌‌స కిర్‌‌కపాట్రిక్‌ తన భార్య ఖైరున్నీసా కోసం నిర్మించారన్నది పచ్చి అబద్ధం.. నిజాం రాజు బ్రిటిష్‌ వాళ్ల దగ్గర తన ప్రాపకాన్ని పెంచుకునేందుకు, వారి నుంచి తన అధికారానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు తానే భూమిని సమకూర్చి, తన నిధులతో, తన మనుషులతో  అద్భుతమైన రెసిడెన్సీని నిర్మించి ఇచ్చాడు. దీన్ని ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీగా పిలిచారు.
నిజానికి వైట్‌హౌస్‌ కోఠీ రెసిడెన్సీ కంటే  ముందే నిర్మించారు. కానీ, మొదట నిర్మించినప్పుడు వైట్‌హౌస్‌ డిజైన్‌ వేరు.. దాని నిర్మాణంలోని తీరు వేరు. 1814లో అది పూర్తిగా తగలబడిపోయిన తరువాత దాని డిజైన్‌ మారిపోయింది. మార్పులు, చేర్పులతో పూర్తిగా కోఠీ రెసిడెన్సీకి కవలగా రూపు మార్చుకుంది.

రెండు నిర్మాణాలకు ఎందుకింత సారూప్యం ఉందంటే అందుకు రీజన్‌ లేకపోలేదు.. మన నిర్మాణ రీతులను అప్పటికే ఐరోపా దేశాలు అనుకరిస్తూ వస్తున్నాయి. చాలా దేశాల్లో ప్రెసిడెన్షియల్‌ భవనాలు కానీ, ఇతర పెద్ద భవనాలు కానీ, భారతీయ నిర్మాణాన్ని పోలి ఉండటం గమనించవచ్చు. బ్రిటిష్‌ రెసిడెన్సీ దగ్గరకు వచ్చేసరికి దీని డిజైనింగ్‌ లండన్‌లో జరిగింది. విచిత్రమేమంటే, ఇక్కడి నిర్మాణశైలిని వంటబట్టించుకున్న తెల్లవాడు, అదే డిజైనింగ్‌ను మళ్లీ నిజాంకు ఇచ్చాడు. అదే శైలిలో రెసిడెన్సీ కట్టారు..

ఇదే సమయంలో వైట్‌హౌస్‌ నిర్మాణానికీ ఐరోపాకు చెందిన డిజైనరే, అంటే ఐరిష్‌ ఆర్కిటెక్‌‌ట హోబన్‌ ప్లాన్‌ వేశారు. దీని రూపురేఖలను మార్చిన థామస్‌ జెఫర్‌సన్‌ అంతకు ముందు ఫ్రాన్‌‌స మినిస్టర్‌గా పనిచేశారు కూడా.. అందుకే వారిపై భారతీయ నిర్మాణాల ప్రభావం ఎక్కువగా పడింది. వైట్‌హౌస్‌ ఆ ప్రభావానికి లోనైన నిర్మాణమే. అచ్చంగా మన రెసిడెన్సీకి కాపీయే. కాకపోతే మన రెసిడెన్సీ ఇవాళ ఓ మహిళా కళాశాలగా మాత్రమే అందరికీ తెలుసు.. సర్కార్లు కళు్ల తెరిస్తే, దాని గొప్పతనం జనం ముందుకు వస్తుంది.