29, మే 2023, సోమవారం

సృజనస్వరం- ఆశావాది ప్రకాశరావు..ఇంటర్వ్యూ.. 1వ భాగం.. కస్తూరి మురళీకృష్ణ ...

ప్రఖ్యాత రచయిత ఆశావాది ప్రకాశరావు అంతరంగం.. స్వాధ్యాయ సృజనస్వరం కార్యక్రమంలో.. ముఖాముఖి.. కస్తూరి మురళీకృష్ణ

కాంగ్రెస్ గూటికి షర్మిల.. ముహూర్తం ఫిక్స్ #sharmila #congresstelangana #...

నోటుకు ఓటు.. బాబు పాటు.. #chandrababu #telugudesampartyofficial

20, మే 2023, శనివారం

బ్రిటిష్‌వారి దత్తపుత్రులు- రామం భజే శ్యామలం భాగం 4 #telugu #ramakatha



మెకాలే లక్ష్యాన్ని బ్రిటిష్‌వారి దత్తపుత్రులు సంపూర్ణంగా నెరవేర్చారు. ఫలితంగానే నిరక్షరాస్యత పెరిగిపోయింది. నైపుణ్యం గల మానవ వనరులను ఇవాళ్టికీ అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. పాశ్చాత్యదేశాల్లో చీప్ లేబర్‌గా భారతీయులు బతకాల్సిన దుస్థితిలో ఇప్పటికీ ఈ దేశం కొట్టుమిట్టాడుతున్నదినెహ్రూ కొట్టిన ఈ దెబ్బతో స్వదేశంలో, స్వపరిపాలనలో కూడా మెకాలే లక్ష్యసాధనే కొనసాగింది. ఇంగ్లిష్ ఆధిపత్యం కొనసాగింపుతో భారతీయ విజ్ఞానం, సాహిత్యం, సమస్త సారస్వత సంపద పూర్తిగా బుట్టదాఖలైంది. మెకాలే కోరుకున్నట్టే మనవాళ్లు మన విజ్ఞానాన్ని ఏవగించుకోవడం మొదలుపెట్టారు.

16, మే 2023, మంగళవారం

పవన్ కల్యాణ్ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటున్నారా? #pawankalyan #janasena ...


ఏమీ చేయలేని నిస్సహాయత. తన బలహీనతపై తనకే జాలి.. జనం చేసిన తప్పుకు తాను ఇలా ఎంతకాలం బాధ పడాలన్న ఆక్రోశం..తాను ఎక్కడికి వెళ్లినా అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే ఏదో తెలియని ఉక్రోశం ..దీనికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో,ఎవరిపై తీర్చుకోవాలో అర్థం కాని పరిస్థితి. మరోసారి ఒంటరిగా బరిలోకి దిగాలంటే అదే భయం..తన బలం 2019 కన్నా పెరగలేదన్న అనుమానం. సాహసం చేస్తే అదే పరాభవం మళ్లీ జరుగుతుందేమోనన్న ఆందోళన.. అందుకే సీఎం పదవిపై చేతులెత్తేశారు.

మందుడనని నన్ను నిందజేసిన నేమి?, నరసింహ శతకం. పమిడికాల్వ మధుసూదన్ గాత్రంల...

15, మే 2023, సోమవారం

14, మే 2023, ఆదివారం

తెలంగాణలోనూ కర్ణాటక ఫలితం? #telanganacongress #telangananews


తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలు రానున్నాయా? కాంగ్రెస్ నాయకత్వం సమిష్టిగా కృషి చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై చూపే ప్రభావంపై సమగ్ర విశ్లేషణ

గురుతత్త్వ వైజయంతి సంగీత రూపకం తొలిభాగం.. సుప్రసన్న రచన


సద్గురు శ్రీ శివానందమూర్తి శ్రీచరణములకు సమర్పితంగా ఆచార్య సుప్రసన్న రచించిన సంగీత రూపకం గురుతత్త్వ వైజయంతి తొలిభాగం మీకోసం.. 

గురువందనం-దర్శనం ఆచార్య సుప్రసన్న తాత్త్విక విశ్లేషణ

13, మే 2023, శనివారం

ఓడారా? ఓడించారా? కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సమగ్ర విశ్లేషణ



కర్ణాటకలో బీజేపీ ఓడిందా? కాంగ్రెస్ఓడించిందా? కన్నడిగుల మన్ కీ బాత్ కమలానికి అర్థం కాలేదా? తెలుగు టీవీ లో ఇప్పటివరకూ రాని సమగ్రమైన.. సహేతుకమైన విశ్లేషణ..

10, మే 2023, బుధవారం

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం.. ఎగ్జిట్ పోల్ అంచనాలు.. #karnatak...


కర్ణాటకలో కాంగ్రెస్ దే విజయం.. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.. ఎగ్జిట్ పోల్ అంచనాలు.

ఇంతేనా? మన వాళ్లకు భద్రత లేనే లేదా? #amercafiring #texasshooting #telan...



అమెరికాకు వెళ్లుతున్నమన వాళ్లకు భద్రత లేదా? ఇదే రకమైన కాల్పులు భారతదేశంలో జరిగితే అమెరికా ఊరుకుంటుందా? ఇక్కడి అమెరికన్లకు హెచ్చరిక చేయకుండా ఉంటుందా? ఇక్కడి ప్రభుత్వాలను హెచ్చరించకుండా ఉంటుందా? భారతదేశం మాత్రం ఎందుకు చేయడం లేదు? అమెరికా అగ్రరాజ్యం కాబట్టి నోరుమూసుకొని ఉండాలా?

9, మే 2023, మంగళవారం

భారత్ కు శరణార్థిగా ఇమ్రాన్ ఖాన్.. #imrankhan #imrankhanspeech #indianews



సోనియా ఇంటికి కేసీఆర్ యూపీఏ చైర్మన్ గా బాధ్యతలు?! #kcrlatestspeech #tel...

బమ్మెర పోతన భాగవత పద్య వ్యాఖ్యానం.. గిరిజామనోహర్ బాబు#telugu #సాహితీ #కవ...


బమ్మెర పోతనామాత్యుడి విరచితమైన భాగవత పద్య వ్యాఖ్యానాన్ని ప్రఖ్యాత వ్యాఖ్యాత శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు గారు చేశారు. దానిపై స్పందనలు కూడా వారు వినిపిస్తున్నారు. అందరికీ తెలిసిన ఒకే ఒక్క పద్యంపై అద్భుతమైన ఈ వ్యాఖ్యానాన్ని పూర్తిగా వినండి. ఈ పద్య వ్యాఖ్యానాన్ని అందించిన అక్షరార్చన సమూహానికి కృతజ్ఞతలు. 

మల్కాజ్ గిరి బరిలో ప్రియాంక.. పోటీ ఖరారు.. priyanka contesting from malk...


రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారా? ఆమె పోటీని పార్టీ ఖరారు చేసినట్టు సమాచారం.

8, మే 2023, సోమవారం

బ్రాండ్ మోడీ సక్సెస్ అవుతుందా? #karnatakaelections2023 #bjpkarnataka #mo...


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ ప్రధాని మోడీ అన్నట్టుగా మారాయి. మోడీ బ్రాండ్ ఎలా పనిచేస్తుందో ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. బొమ్మై సర్కారు అవినీతి మరకను మోడీ ఇమేజ్ తుడిచివేస్తుందా అన్నది కూడా ఈ ఎన్నికలో తేలనుంది. అందుకే ఈ ఎన్నికలు మోడీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికను ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

4, మే 2023, గురువారం

ఈటల దూకుడు.. బండి బేజారు.. #bjptelangana #eetalarajender #bandisanjay



తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు ముదురుతున్నాయా? రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై  కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారా? ముఖ్యంగా చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ కు బండికి మధ్య దూరం పెరుగుతోందా? సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తే ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉందనే అనిపిస్తోంది. 

WOMEN SAFETY QR CODE.. JUST SCAN IT.. POLICE WILL PROTECT YOU #POLICE #T...


మహిళల హితం కోసం జారీ.. https://youtu.be/oif-i430zak

1, మే 2023, సోమవారం

కేసీఆర్ సార్.. ఈ హామీ ఏమైంది?



లక్ష రూపాయల లోపు రుణ మాఫీ ఎప్పుడని రైతలడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతారా? ఇప్పటికీ పాతిక వేల రూపాయల లోపు రుణాలను మాత్రమే పూర్తిగా మాఫీ చేశారు. బడ్జెట్ సమయంలో 90 వేల వరకు మాఫీ అవుతుందని ఊరించారు. కానీ ఇప్పటికీ ఆ మాటే లేదు. దాదాపు 36 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేయాల్సి ఉందని అంచనా. ఇందులో దాదాపు 6 లక్షల మంది రైతులకు రుణ మాఫీ అయ్యిందని భావిస్తున్నారు. మిగిలినవారు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.

గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?.. నరసింహ శతకం. శ్రీ పమిడికాల్వ మధుసూదన్ ...