ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా బ్రసెల్స్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. హైదరాబాద్‌ను బ్రసెల్స్‌తో పోల్చటం అంటే ఇక్కడ కూడా ద్విభాష, ద్విజాతి సిద్ధాంతాలున్నాయని కమిటీ భావిస్తోందా? అంటే ఆంధ్ర, తెలంగాణా వాళ్లు మాట్లాడే భాషలు వేరని అనుకుందా? ఓ పక్క కామన్ కల్చర్ అంటూనే బ్రసెల్స్ ప్రస్తావన తీసుకురావటం వెనుక ఆంధ్ర, తెలంగాణ వేరు వేరని శ్రీకృష్ణ కమిటీ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి?
6, జనవరి 2011, గురువారం
హైదరాబాద్‌కు బ్రసెల్స్‌తో శ్రీకృష్ణ కమిటీ పోలిక
రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌ను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ బెల్జియంలోని బ్రసెల్స్‌తో పోల్చింది. ఇలా ఎందుకు పోల్చాల్సి వచ్చింది. కమిటీ విశ్లేషణ ప్రకారం 1968లో బెల్జియంలో బ్రసెల్స్ సిటీపై ఎవరికి హక్కులు ఉన్నాయన్న దానిపై వరుస అల్లర్లు జరిగాయి.. ఉత్తర ఫ్లామండ్ ప్రాంతం బ్రసెల్స్ సిటీ ఉంది. ఈ సమస్యను పరిష్కరించటానికి బెల్జియం రెండు సంస్కృతులు, మూడు ప్రాంతాలుగా ప్రకటించటం తప్ప మరో మార్గం కనిపించలేదు. బెల్జియంలో పది లక్షల జనాభా ఉంది. అందులో ఆరు లక్షల మంది ఫ్లెమిష్ మాట్లాడే ప్రజలు.. మిగతా నాలుగు లక్షల మంది ఫ్రెంచి మాట్లాడతారు.. చాలా తక్కువ మంది జర్మన్ మాట్లాడే వారు ఉన్నారు. ఈ రెండు వర్గాల కోసం రెండు భాషలకు సమాన రాజధాని ప్రాంతంగా, స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా బ్రసెల్స్‌ను ప్రకటించారు.
ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా బ్రసెల్స్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. హైదరాబాద్‌ను బ్రసెల్స్‌తో పోల్చటం అంటే ఇక్కడ కూడా ద్విభాష, ద్విజాతి సిద్ధాంతాలున్నాయని కమిటీ భావిస్తోందా? అంటే ఆంధ్ర, తెలంగాణా వాళ్లు మాట్లాడే భాషలు వేరని అనుకుందా? ఓ పక్క కామన్ కల్చర్ అంటూనే బ్రసెల్స్ ప్రస్తావన తీసుకురావటం వెనుక ఆంధ్ర, తెలంగాణ వేరు వేరని శ్రీకృష్ణ కమిటీ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి?
ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా బ్రసెల్స్ మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని శ్రీకృష్ణ కమిటీ పేర్కొంది. హైదరాబాద్‌ను బ్రసెల్స్‌తో పోల్చటం అంటే ఇక్కడ కూడా ద్విభాష, ద్విజాతి సిద్ధాంతాలున్నాయని కమిటీ భావిస్తోందా? అంటే ఆంధ్ర, తెలంగాణా వాళ్లు మాట్లాడే భాషలు వేరని అనుకుందా? ఓ పక్క కామన్ కల్చర్ అంటూనే బ్రసెల్స్ ప్రస్తావన తీసుకురావటం వెనుక ఆంధ్ర, తెలంగాణ వేరు వేరని శ్రీకృష్ణ కమిటీ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి?
ఇంతకీ వారేం చెప్పారో వారికైనా అర్థమైందా?
ఇంతకీ జస్టిస్ శ్రీకృష్ణ చెప్పిందేమిటి? వివాదానికి సంబంధించి జడ్జిమెంటును ఇవ్వబోతున్నానని చెప్పిన జస్టిస్ శ్రీకృష్ణ.. ఏం తీర్పు చెప్పారో కనీసం ఆయనకైనా అర్థమైందా? ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సమస్య ఉత్పన్నమైంది? దానికి ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వాలన్న దానిపై ఆయన స్పష్టతకు వచ్చారా? లేదా? అన్న సందేహం నివేదికలోని సిఫార్సులు పరిశీలించిన వారందరికీ వస్తుంది.. చెప్పిందే చెప్పి.. తాను చెప్పినదాన్ని తానే ఖండించి.. చివరకు ఏమీ తేల్చలేకపోయారు.
అయోమయం జగన్నాథం.. జగన్నాథుడంటే శ్రీకృష్ణుడే.. మన శ్రీకృష్ణుడే.. మన రాష్ట్రం భావి తల రాతను రాసిన శ్రీకృష్ణుడే.. జగన్నాథుడి పేరు పెట్టుకున్నందుకు ఈ కృష్ణుడు కూడా నివేదికలో అయోమయమైపోయారు.
ఏం జరుగుతుంది? రాష్ట్రాన్ని విభజిస్తారా? కలిపి ఉంచుతారా? హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి చీలుస్తారా? లేదా? రాష్ట్రమంతటా ఒకటే ఉత్కంఠ.. ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయిన జనం.. ఏదో ఒక పరిష్కారం కోసం ఆశగా ఊపిరి ఉగ్గబట్టుకుని చూసిన ప్రజలంతా ఇప్పుడు బుర్రలు గోక్కుంటున్నారు..
అయోధ్య తీర్పు మాదిరిగా కర్ర విరగకుండా, పాము చావకుండా ఆరు సిఫార్సులు చేసి నొప్పింపక, తానొవ్వక శ్రీకృష్ణుడు తప్పించుకుని పోయాడు బాగానే ఉంది. కనీసం ఆ సిఫార్సుల్లో తాను చెప్పిన దానికైనా చివరకంటా కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు.. నివేదికను బుద్ధుడి సూక్తితో మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ గెలవాలి.. ఏ ఒక్కరికీ ఓటమి ఎదురుకావద్దు అన్నట్లుగానే అందరికీ కోరినవన్నీ పంచి పెట్టారు. అదే నివేదిక చివరకు వచ్చేసరికి బుద్ధుడి సూక్తిని మరిచినట్లున్నారు. ఫస్ట్ హోం మినిస్టర్ పటేల్‌జీ గుర్తుకొచ్చారు.. గ్రౌండ్ రియాలిటీలను మరిస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న అంశంపై తాము బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తున్నామంటూనే తెలంగాణా ప్రత్యేక డిమాండ్ నిర్హేతుకం కాదని కూడా వ్యాఖ్యానించటం న్యాయమూర్తికే చెల్లింది.
అసలు శ్రీకృష్ణ కమిటీ మొత్తం ఎన్ని సిఫార్సులు చేసిందో మీకు తెలుసా? నాలుగు.. ఇదీ కృష్ణ లీలలో భాగమే.. ఒకటో సిఫారసుకు కొనసాగింపు ఆరో సిఫార్సు.. రెండో సిఫార్సుకు కొనసాగింపు నాలుగో సిఫార్సు.. ఇక మిగిలింది నాలుగే కదా..
మొదటి సిఫార్సులో రాష్ట్రాన్ని విడగొట్టొద్దన్నారు.. ఆరో సిఫార్సులో విడగొట్టకుండా తెలంగాణాకు రాజ్యాంగ పరమైన హక్కులేమివ్వాలో సూచించారు. రెండో సిఫార్సులో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నారు.. ఏయే ప్రాంతాలను కలిపి చేయాలో నాలుగో సిఫార్సులో చెప్పారు.
విచిత్రమేమంటే ఒకటో సిఫార్సులో యథాతథ స్థితిని కొనసాగించటం అసలు సాధ్యమే కాదని తేల్చి చెప్పారు.. ఆ సిఫార్సును తామే తిరస్కరించారు.. అదే ఆరో సిఫార్సు వచ్చేసరికి రాష్ట్రాన్ని ఇప్పుడున్నట్టుగా ఉంటూనే తెలంగాణాకు బోర్డులు, మండళ్లు, హక్కుల రూపంలో రాజ్యాంగ భద్రత కల్పించమన్నారు.. యథాతథ స్థితే సాధ్యం కాదన్నప్పుడు, ఇక హక్కులు కల్పించేదెలా సాధ్యపడుతుందో శ్రీకృష్ణే చెప్పాలి.
ఇక రెండో సిఫార్సు.. తెలంగాణా నుంచి హైదరాబాద్‌ను విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం.. తెలంగాణాలో ఇంటిగ్రల్ పార్ట్‌గా ఉన్న హైదరాబాద్‌ను కేంఅద పాలిత ప్రాంతంగా మారిస్తే తీవ్రమైన ఆందోళనలు కొనసాగుతాయని, దానికి తోడుగా మరిని కొత్త సమస్యలు వస్తాయని కాబట్టి ఇది ప్రాక్టికల్ కాదని తేల్చారు. అదే నాలుగో సిఫార్సు వచ్చేసరికి హైదరాబాద్ యూనియన్ టెర్రిటరీగా ఎలా చేయాలి? సరిహద్దులు ఏమిటన్నదీ విపులంగా వివరించారు.. ఒక సిఫార్సులో ఉన్నదాన్ని మరో సిఫార్సులో వాళ్లే ఖండించారు.. సూపర్..
తెలంగాణా ఏర్పాటు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని, దాని జిడిపి కొన్ని రాష్ట్రాల కంటే పెరుగుతుందనీ పేర్కొన్న కమిటీయే కొన్ని లైన్లు కిందకు వచ్చేసరికి మావోయిస్టు సమస్య పెచ్చరిల్లుతుందని, సంక్షోభం రేకెత్తుతుందని పేర్కొంది. ఈ రెంటికీ పొంతన ఎలా కుదురుతుందో చిదంబరం వారే చెప్పాలి.. ఎందుకంటే మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులన్నది వారి మాటే కదా..
ఇక మూడో సిఫార్సు సంగతి.. రాయల తెలంగాణా ప్రాక్టికల్ కాదని భావించినప్పుడు అసలు ఆ సిఫార్సు చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు.
ఇక మిగిలింది అయిదో సిఫార్సు.. అసలైన సిఫార్సు రెండు రాష్ట్రాలను ప్రస్తుత సరిహద్దుల ప్రకారం విడగొట్టమనటం.. చివరకు ఈ సిఫార్సుపైనైనా గట్టిగా కమిటీ నిలబడిందా అంటే అదీ లేదు.. అసలు ఇది రెండో బెస్ట్ ఆప్షన్.. అందరినీ కన్సల్ట్ చేసి మరీ డిసైడ్ చేసుకోండన్నారు.. ఇంతకీ వారేం చెప్పారో వారికైనా అర్థమైందా? ఏమో.. చిదంబరానికెరుక...

5, జనవరి 2011, బుధవారం
తెలుగు వారికి ఓ అరుదైన కానుక...
తెలంగాణా ప్రాంతంలో 1933లో వరంగల్ నుంచి2.5 సంవత్సరాల పాటు నడిచిన తెనుగు పత్రిక ఇ-బుక్‌ను ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తున్నా.. ఒద్దిరాజు సోదరులుగా పేరు పొందిన ఒద్దిరాజు రాఘవ రంగారావు, ఒద్దిరాజు సీతారామచంద్రరావు గార్లు ఈ పత్రికను నిర్వహించారు.. వీరు చిత్రలేఖనంలో, ఫోటోగ్రఫీలో, సైన్స్‌లో, సాహిత్యంలో, పాత్రికేయతలో ఇలా పలు రంగాలలో ప్రసిద్ధులు.. ఆరోజుల్లో లెటర్ ప్రెస్‌లకు సంబంధించిన అక్షరాల డైలను తామే స్వయంగా తయారు చేసుకుని ఈ పత్రికను నిర్వహించేవారని చెప్తారు.. దీన్ని కలకాలం భద్రపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికను విశ్వవ్యాప్తం చేస్తున్నా... చరిత్రలో నిలిచిపోయే పత్రిక తెనుగు పత్రిక....
తెనుగు పత్రిక
తెనుగు పత్రిక
30, డిసెంబర్ 2010, గురువారం
జనవరి ఆరున ప్రజల ముందుకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్
ఏడాది కాలంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌ను కమిటీ సభ్యులు ఈ రోజు మధ్యాహ్నం 2.3౦ గంటలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించారు. రెండు సంపుటాల్లో సుమారు ఆరు వందల పేజీల నివేదికను హోం మంత్రి చిదంబరం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నుంచి స్వీకరించారు. అయితే నివేదికలో తెలంగాణ గురించి కానీ, రాష్ట్ర విభజన అంశం గురించి కానీ కమిటీ ఏం చర్చించిందన్నది మాత్రం హోం శాఖ వెల్లడి చేయలేదు. జనవరి 6న ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నివేదిక గురించి చర్చిస్తామని చిదంబరం నివేదిక అందుకున్న తరువాత చెప్పారు. నివేదికల అంశాలను పార్టీలతో చర్చించిన తరువాత నివేదికను ప్రజల ముందుంచుతామన్నారు. అప్పటి వరకు సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తం మీద నివేదికలో అంశాలు తేటతెల్లం కావటానికి మరో వారం రోజుల పాటు ఎదురుచూడాల్సిందే.
జాతీయ మీడియా అంచనా ప్రకారం రాష్ట్ర విభజనలో కీలక భూమిక వ్యవహరించనున్న హైదరాబాద్ విషయంలో శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక సిఫార్సులు చేసిందని సమాచారం. భౌగోళికంగా చూస్తే హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి విడదీయటం సాధ్యం కాకపోయినప్పటికీ, చండీగఢ్ మాదిరిగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయటానికీ రాష్ట్ర ం మధ్యలో ఉన్న నగరానికి సాధ్యం కాకపోవచ్చు. అదే సమయంలో నాడు మద్రాసు మాదిరిగా హైదరాబాద్‌ను ఈరోజు వదులుకోవటానికి సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిపుణుల కమిటీని పంపించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

29, నవంబర్ 2010, సోమవారం
జగన్ రాజీనామా చేశారు
జగన్ రాజీనామా చేశారు.. పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనానికి తెరతీశారు.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు కెసిఆర్ ఆమరణ దీక్ష సందర్భంగా రాష్ట్ర రాజకీయం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి మొదలైంది. జగన్ రాజీనామా పరిణామాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి తప్పదు.. అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌కు జగన్ రాజీనామా శరాఘాతమే. కాంగ్రెస్‌కు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న స్థానాలు157 మాత్రమే. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్ర శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 147. అంటే పది మంది సభ్యులు రాజీనామా చేస్తే సర్కారు మైనారిటీలో పడిపోతుంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి మద్దతు తీసుకుంటే ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుంది. దీనికి తోడుగా ఎంఐఎం నుంచి 7 సీట్ల మద్దతు ఎలాగూ లభిస్తుంది. అంటే 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఈ రెండు పార్టీల నుంచి లభిస్తుందన్నమాట. అంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయటమో, జగన్ వర్గం వైపు వెళ్లటమో జరిగితే సర్కారు ఖచ్చితంగా మైనార్టీలో పడిపోతుంది. అంటే జగన్ కనీసం 40 మంది ఎమ్మెల్యేలను చీల్చగలిగితే స్పష్టంగా సర్కారు మైనార్టీలో పడిపోతుంది. జగన్ వర్గానికి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్న. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన మరునాడు జగన్ ఇంట్లో 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. వీరిలో చివరి వరకు ఆయన వెంట ఎంతమంది కొనసాగుతారు.. కాంగ్రెస్‌లో మరెంత మంది ఆయన వెంట వస్తారనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది.. మొత్తానికి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రమాణం చేసిన మరునాటి నుంచే సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.. దీన్ని ఎలా అధిగమిస్తారో, ఏ విధంగా చక్రం తిప్పుతారో చూడాలి.
20, నవంబర్ 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)