29, మే 2010, శనివారం
కూలిందా? కూల్చారా? రాజగోపుర రహస్యం
శ్రీకాళహస్తిలో రాజగోపురం కూలిపోయింది. అయిదు శతాబ్దాల చరిత్ర అంతా చూస్తుండగానే నిట్టనిలువునా సమాధి అయిపోయింది. విజయనగర సామ్రాజ్య విజయ పతాక పతనమైపోయింది.. ఎందుకిలా జరిగింది? అత్యంత పురాతనమైన నిర్మాణం ఎలా కూలిపోయింది? అది సహజంగా కూలిపోయిందా? అసహజంగా కూల్చేశారా? రాజగోపురం కూలిపోవటానికి ముందు ఏం జరిగింది? అన్నీ అనుమానాలే.. అన్నీ సందేహాలే.. లోగుట్టు తెలిసేదెవరికి.. సాక్షాత్తూ వాయులింగేశ్వరునికైనా తెలుసా?
శ్రీకాళహస్తి రాజగోపురం ఎలా కూలిపోయింది?
కూలిందా? కూల్చేశారా?
ఒకవైపు మాత్రమే బీటలు వారిన గోపురం నిట్టనిలువునా ఎలా కూలింది?
గోపురం కూలిపోవటానికి పదిహేను నిమిషాలకు ముందు దానిపైకి ఎక్కిన ఇద్దరు ఎవరు?
గోపురం రెండో అంతస్థులోకి ప్రవేశించిన ఆ ఇద్దరు అక్కడ ఏం చేశారు?
గోపురం రెండో అంతస్థులో జరిగింది ఏమిటి?
గోపురం కూలేముందు ఎలాంటి శబ్దాలు వచ్చాయి?
గోపురంలో సౌండ్‌ప్రూఫ్ బాంబులు పెట్టి పేల్చారా?
శిథిలాల తొలగింపునకు అప్పటికప్పుడు చెనై్న నుంచి వాహనాలు ఎలా వచ్చాయి?
అంతా పథకం ప్రకారమే జరిగిందా?
కూల్చివేత పథకానికి సూత్రధారులు ఎవరు?
part-1
నిజం.. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని రాజగోపురం కూలిపోవటంపై అనుమానాలు తీవ్రమవుతూనే ఉన్నాయి.. దేవాలయ అధికారులు.. దేవాదాయశాఖ అధికారులు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అనుసరించిన విధానం గోపురాన్ని అసహజంగా కూల్చివేశారనే వాదనలకే బలం చేకూరుతోంది.. దీనికి ఎవరు బాధ్యులు.. ? ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందెవరు?
శ్రీకాళహస్తి పవిత్ర రాజగోపురం నిట్టనిలువునా కూలిపోవటానికి కారకులు ఎవరు? రాష్ర్టంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందూ భక్తులను తొలుస్తున్న ప్రశ్న.. రాజగోపురం ఒక్కసారిగా కుప్పకూలటం సంచలనం సృష్టించింది.. ఎందుకు, ఎలా కూలిపోయింది? పరిరక్షించే ప్రయత్నాలు ఎందుకు జరగలేదన్నది జవాబులు దొరకని ప్రశ్నలు...
1517 తొలినాళ్లలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు గజపతులపై తన సమరాంగణ విజయ చిహ్నంగా కాళహస్తీశ్వరునికి కట్టిచ్చిన రాజగోపురం ఇది. ఇందులోని తొలి రెండు ప్రాకారాలు రాతితో నిర్మించినా.. మిగతా అయిదు ప్రాకారాలు ఇటుకతో నిర్మించారు.. 1979లోనే తొలిసారి రాజగోపురంపై పగుళ్లను గుర్తించారు.. దీన్ని పరిరక్షించే విషయంలో దేవాదాయ శాఖలో ఫైలు అటూ ఇటూ తెగ తిరిగింది.. 1990లలో మరోసారి దీనిపై పగుళ్లను పరిశీలించారు.. గోపురం కుడివైపు నెరల్రు వాచిన ప్రాంతంలో కొన్ని మరమ్మతులైతే చేశారు.. కానీ, గోపురాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ ఏనాడూ వహించలేదు..
గోపురం గురించి కొన్నాళ్ల క్రితం ప్రస్తుత ఇఓ ఎంతో గొప్పలు చెప్పారు.. పురాతన స్మృతి చిహ్నమైన కాళహస్తి రాజగోపురాన్ని కాపాడుకునేందుకు ఎంతో చేస్తున్నట్లు భుజాలు తడుముకున్నారు..
ఇదే పెద్ద మనిషి, వీర శివ భక్తుడు.. గోపురం కూలిన తరువాత వేదాంతం మాట్లాడటం మొదలు పెట్టారు..ఏ కట్టడానికైనా అంతం తప్పదంటున్నారు..కానీ, తమిళనాడులో వేల ఏళ్ల నాటి గుళు్ల, చారిత్రక ఆనవాళు్ల ఎలా పరిరక్షింపబడుతున్నాయో ఈయనగారికి కాస్తంతైనా తెలియదు..
ఇఓ మాటల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యమే రాజగోపురం కూలిపోవటానికి కారణం. గోపురాన్ని ఎలా రక్షించాలో తెలియక, దాని గురించి ఆలోచించనైనా ఆలోచించక నిష్కర్షగా కూల్చివేశారా? ఇది ప్రజల భావోద్వేగంతో ఆడుకున్నట్లు కాదా?
part-2
రాజగోపురాన్ని కూలిపోకముందే కూల్చేశారన్న వాదన ఎందుకు పెరుగుతోంది? దీని వెనుక వాస్తవాలు ఏమిటి? కూలిపోవటానికి ముందు కాళహస్తిలో ఏం జరిగింది? కేవలం ఒక వైపు మాత్రమే నెరల్రు వాచిన గోపురం మొత్తంగా కుప్పకూలటం సహజంగా జరిగిందేనా?
మే 26 న రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి రాజగోపురం నిట్టనిలువునా కూలిపోయింది? అంతకు ముందు నాలుగు రోజుల నుంచి రాజగోపురం శిథిలావస్థపై కథనాలు వినవస్తూనే ఉన్నాయి. ఐఐటి నిపుణులు, పురావస్తుశాఖ నిపుణులు వచ్చి పరిశీలించి మరీ వెళ్లారు.. ఏ క్షణానై్ననా కూలే అవకాశం ఉందంటూ నిపుణులు అప్పుడే చెప్పారు.
నిపుణులు హెచ్చరించిన మర్నాడే రాజగోపురం కూలిపోయింది.. మట్టిదిబ్బలా మారిపోయింది.. ఎలా సాధ్యమైందన్నదే అంతుపట్టని ప్రశ్న.. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి..
(అనుమానం నెం1)
రాజగోపురానికి కుడివైపున మూడు ఫీట్ల విస్తీర్ణంలో నిట్టనిలువునా పగులు ఏర్పడింది.. ఎడమ వైపున 75 శాతం గోపురం అంతా బాగానే ఉంది.. ఒకవేళ పగులు ఏర్పడిన భాగానికి ప్రధాన భాగానికి దూరం పెరిగితే కుడివైపు మొత్తం పడిపోవాలి. కానీ, గోపురం మొత్తం కూలిపోయింది.. ఇదెలా జరిగింది..?
కుడివైపున మాత్రమే పునాదులు కదిలినట్లు అధికారులే స్పష్టంగా చెప్తున్నారు..
(అనుమానం నెం2)
ఎడమ వైపు పటిష్ఠంగానే ఉందని చెప్పకనే చెప్తున్నారు.. అలాంటప్పుడు గోపురం మొత్తంగా నిట్టనిలువునా కూలే అవకాశాలు చాలా తక్కువని ఇంజనీర్లే అంటున్నారు.. కానీ, గోపురం పూర్తిగా పేకమేడలా ఎలా కూలిపోయింది?
(అనుమానం నెం.3)
రెండో అంతస్థు వరకు రాతికట్టడం ఉంది.. ఆ తరువాత ఇటుక కట్టడం ఉంది.. రెండో అంతస్థు పైనుంచి మిగతా గోపుర ప్రాకారాలన్నీ నిట్ట నిలువునా కూలిపోయింది...ఏం జరిగింది?
(అనుమానం నెం.4)
గోపురం కూలిపోవటానికి సరిగ్గా పదిహేను నిమిషాలకు ముందు ఇద్దరు వ్యక్తులు గోపురంలోని రెండో అంతస్థు లోకి వెళ్లి దాదాపు పదిహేను నిమిషాలు గడిపి వచ్చారు.. వారిద్దరు ఎవరు? రెండో అంతస్థులో వారేం చేశారు?
(అనుమానం నెం.5)
ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సెక్యూరిటీ చీఫ్‌లు ఇద్దరే లోపలికి వెళ్లి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షు్యల వాదన.. వాళ్లిద్దరు కానీ, ఇతర అధికారులు కానీ, ఎందుకు మౌనంగా ఉన్నారు?
(అనుమానం నెం. 6)
గోపురం కూలిపోయిన తరువాత తెల్లవారి ఉదయం దాకా శిథిలాలను తొలగించేందుకు ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు.. దేవాదాయ శాఖ కమిషనర్ వచ్చాక కానీ, తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేది లేదని అధికారులు చెప్పారు.. కమిషనర్ మధ్యాహ్నం రెండు గంటలకు కానీ రాలేదు.. కానీ, శిథిలాల తొలగింపును ఉదయం పదకొండు గంటలకు గుడి వెనుక వైపు నుంచి రహస్యంగా ప్రారంభించారు.. ఈ కార్యక్రమాన్ని కూడా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది..?
(అనుమానం నెం.7)
దేవాదాయ శాఖ కమిషనర్ వచ్చి వెళ్లిన కొద్ది సేపటికే చెనై్న నుంచి మూడు పొక్లయినర్లు, 12 ట్రక్కులు వచ్చేశాయి.. ఎలాంటి పక్కా ప్రణాళిక లేకుండా ఇవి కాళహస్తికి ఎలా చేరుకున్నాయి..
గోపురం కూలినప్పుడు పిడుగులాంటి శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.. ఇది బాంబు పేల్చిన శబ్దమా? చారిత్రక ఆనవాలును ఎంతో అపురూపంగా కాపాడుకోవలసిన జాతి, బ్యూరోక్రసీ నిర్లక్ష్యానికి సమాధి అవుతున్న శిథిల చరిత్రను మౌనంగా చూసి రోదించాల్సిన స్థితి నెలకొంది..
part-3
శ్రీకాళహస్తి రాజగోపురం సహజంగా కూలిపోలేదనటానికి మరో బలమైన ఆధారం ఉంది.. గోపురం కూలిపోయిన నాటి నుంచి ముగ్గురు వ్యక్తుల జాడ తెలియటం లేదు.. శిథిలాల కింది నుంచి దుర్వాసన కూడా వస్తోంది.. ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఎవరి దగ్గరా లేదు.. దీని వెనుక మతలబు ఏమిటి? అధికారులు ఏదైనా వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా?
శ్రీకాళహస్తి రాజగోపురానికి అతి దగ్గరలో న్యూ గణేశ్ హోటల్ ఉంది.. ఈ హోటల్‌లో ఉన్న పనిచేసే రాజా అనే కార్మికుడు గోపురం కూలిన రాత్రి నుంచి కనిపించటం లేదు. అన్న జాడ వెతుక్కుంటూ రాజా తము్మడు రమేశ్ నెల్లూరు నుంచి కాళహస్తికి వచ్చి వాకబు చేస్తే, హోటల్ యజమాని తనకేం తెలియదన్నాడు.. మధ్యాహ్నమే వెళ్లిపోయాడన్నాడు..
నిజానికి హోటల్ వెనుక భాగంలో ఒక రేకుల షెడ్డు ఉంది.. గోపురం కూలినప్పుడు అది కూడా పూర్తిగా నేలమట్టమైంది.. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ముక్కు పుటాలు అదిరేలా దుర్గంధ వాసన బయటకు వస్తోంది.. ఈ శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు సమాధి అయినట్లు ప్రచారం జరిగింది.. అంతే కాదు.. అక్కడే ఉన్న స్టేట్‌బ్యాంక్ పరిసరాల నుంచి కూడా ఇదే రకమైన వాసన వస్తోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.. కారణం మాత్రం తెలియదు.. జాడ తెలియకుండా పోయిన వారిలో ఆలయ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నట్లు సమాచారం వస్తోంది.. వీరికి సంబంధించిన అన్ని రికార్డులనూ మాయం చేసినట్లు తెలుస్తోంది.. అధికారులు ఎందుకిలా చేశారు.? కారణం ఏమిటి? ఆలయ గోపురం ప్రమాద వశాత్తు కూలిపోవటం వాస్తవమే అయితే దుర్గంధం వస్తున్న చోట శిథిలాలను ఇంకా ఎందుకు తొలగించటం లేదు..? జాడ తెలియకుండా పోయిన వారి వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు?
గోపుర శిథిలాల కింద ఎవరైనా చనిపోవటం అంటూ జరిగితే అందుకు ఎవరు బాధ్యులు..? గోపురాన్ని అధికారులు కావాలనే కూల్చి వేసినట్లయితే, చుట్టుపక్కల ఎవరూ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని తీరాలి... అలా కాకుండా అన్నీ చూసుకోకుండా తొందరపడి ఉంటే, ఎలాంటి అనర్థం జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. ప్రజల నుంచి, మిస్సింగ్ అయిన వారి బంధువుల నుంచి వెల్లువెత్తుతున్న అనుమానాలకు, ఆరోపణలకు జవాబు ఇవ్వలేని అధికార గణం రాజగోపుర రహస్యాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది..
22, మే 2010, శనివారం
సత్యానికి సంకెళ్లు
సత్యంబాబు తప్పించుకున్నాడు.. సత్యంబాబు దొరికిపోయాడు.. తప్పించకుకోవటమే ఒక విచిత్రం.. పారిపోయిన వాడు దొరకడం మరో విచిత్రం.. అయిదు గంటల హైడ్రామాలో విజయవాడ పోలీసులు నిర్వహించిన పాత్ర రిలీజ్ కంటే ముందే సంచలనం సృష్టిస్తున్న రాంగోపాల్‌వర్మ రక్తచరిత్రను మించిపోయింది.. అనేక ట్విస్ట్‌లు.. జవాబు లేని ప్రశ్నలు.. అనుమానాలు... ఆరోపణలు.. ఏం జరిగింది? దోషులెవరు? ఒక హత్య కేసులో నేరం రుజువు చేయటం కంటే ఇతర అంశాలపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలకు జవాబుదారీ ఎవరు?
ఉదయం పది గంటలు...
అయేషా మీరా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు తప్పిపోయాడన్న వార్త దావానలంలా పాకింది...
ఉదయం 11 గంటలు..
మీడియాలో హడావుడి..
మధ్యాహ్నం 12గంటలు..
సత్యంబాబు తప్పించుకున్న కేసులో ఎస్కార్ట్ పోలీసుల సస్పెన్షన్
మధ్యాహ్నం 1 గంట..
సత్యంబాబును ఎన్‌కౌంటర్ చేశారన్న అనుమానాలు..
మధ్యాహ్నం 3 గంటలు..
సత్యంబాబు దొరికాడన్న వార్త...
మొత్తం అయిదు గంటలు.. శనివారం మధ్యాహ్నం పోలీసులు ఓ మ్యాట్నీ షోను చూపించారు.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన సత్యంబాబు స్టోరీలో పోలీసులు మాత్రం ఫెయిలయ్యారు.. మొత్తం స్టోరీలో అన్నీ ట్విస్ట్‌లే.. అన్నీ సంచలనాలే.. మరెన్నో అనుమానాలే.. ? కొసమెరుపేమిటంటే పోలీసుల నుంచి తప్పించుకున్న సత్యంబాబు పోలీసులకే దొరకడం...
అయేషా హత్య కేసులో నడవలేని స్థితిలో ఉన్న నిందితుడు సత్యం బాబును మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెండు రోజుల క్రితం తీసుకువచ్చారు... నిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన తరువాత పోలీసులు తిరిగి విజయవాడకు బయలు దేరారు.. సూర్యాపేట దగ్గరకు వచ్చిన తరువాత భోజనం కోసం ఆగినప్పుడు సత్యం బాబు సంకెళ్లను తెంచుకుని పారిపోయాడు... వెంట ఉన్న పోలీసులందరినీ విజయవాడ సిపి సీతారామాంజనేయులు సస్పెండ్ చేశారు...
సత్యం ఎలా పారిపోయాడు? సంకెళ్లు తెంచుకుని పదిమంది పోలీసుల కళ్లు కప్పి పారిపోయే అవకాశం సత్యంకు ఉందా? సత్యం కేసులో సత్యానికి సంకెళ్లు వేస్తున్నది ఎవరు?
అయేషామీరా హత్యకేసులో అరెస్టు చేసిన తరువాత విచిత్ర పరిస్థితుల్లో సత్యం బాబు ఆరోగ్యం చెడిపోయింది... పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే విచిత్రమైన సిండ్రోమ్ అతణ్ణి పట్టుకుంది.. కనీసం నడిచే పరిస్థితిలో కూడా అతను లేడు.. కోర్డుకు సైతం పోలీసులు చేతుల మీద మోసుకురావలసిన పరిస్థితి. అంత అనారోగ్యంతో ఉన్న సత్యం బాబు చేతులకు ఉన్న సంకెళ్లు.. కాళ్లకు వేసుకున్న గొలుసులను తెంచుకొని ఎలా పారిపోగలిగాడు? అతనికి అంత శక్తి ఉందా? ఒక వేళ తెంచుకున్నాడే అనుకుంటే... నడిచే పరిస్థితిలోనే లేని వాడు.. పదిమంది పోలీసుల కళ్లు గప్పి ఎలా పారిపోగలిగాడు? ఇది సాధ్యమేనా? ఎలా జరిగింది..?
నిమ్స్‌లో ఉన్న రెండు రోజుల్లోనే సత్యం బాబు పూర్తి ఆరోగ్యవంతుడై పిటి ఉషలా పరిగెత్తే స్థాయికి చేరుకున్నాడా? అలా కానప్పుడు పారిపోవటం ఎలా సాధ్యపడింది? ఈ అనుమానాలే.. సత్యం పారిపోవటం వెనుక పోలీసుల పాత్రను అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.. సత్యంను ఎన్‌కౌంటర్ చేసేందుకు పోలీసులు ఎత్తుగడ వేశారా? చివరకు పోలీసుల పాచిక ఫలించకుండా మీడియా అడ్డుపడటంతో సత్యంను తిరిగి వెలుగులోకి తెచ్చారా?
సత్యం బాబు సూర్యాపేటలో కళ్లు కప్పి ౮౦ కిలోమీటర్ల దూరంలోని నందిగామలోని డిఎస్‌పి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు.. సత్యం తప్పించుకుని ఎలా వెళ్లాడు? అతను మార్చుకున్న చొక్కా ఎవరిచ్చారు? సత్యం జిల్లా పరిధులు ఎట్లా దాటి వెళ్లగలిగాడు? అంటే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదా? పది మందిని మాత్రం సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారా? అయేషా హత్య కేసు మిస్టరీలాగానే, సత్యం పరారీ కూడా మిగలనుందా?

19, మే 2010, బుధవారం
గుర్తుకొస్తున్నాయి...
రాష్ట్ర రాజకీయాల్లో మే 20 , 2009 ఒక సంచలనాన్ని నమోదు చేసిన రోజు.. తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించి వరుసగా రెండోసారి వైఎస్‌ఆర్ అధికార ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. ఏడాది తిరిగిపోయింది.. అంతలోనే ఎంత మార్పు...వైఎస్‌ఆర్ అకాల మరణం రాష్ట్ర రాజకీయాల రూపు రేఖల్ని సమూలంగా మార్చేసింది.. అధికార పార్టీలో నిరుటి వెలుగులు ఇవాళ కనిపించటం లేదు..
ఆరేళ్ల పాటు ఏక వ్యక్తి నేతృత్వంలో విజయపరంపరలతో కొనసాగిన కాంగ్రెస్ ఇప్పుడు బేలగా ఎందుకు తయారైంది.....
సరిగ్గా ఏడాది క్రితం లాల్‌బహదూర్ స్టేడియంలో అశేష జనవాహిని సాక్షిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్న కలలను కల్లలు చేయటమే కాదు.. తెలంగాణా రాష్ట్ర సమితి తో సహా ప్రతిపక్షాలన్నింటినీ గుక్క తిప్పుకోకుండా చేసి చీలికలు, పేలికలు అయ్యే పరిస్థితిని తీసుకువచ్చారు..
వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతిపక్షాలకు ఊపిరి తీసుకోవటమే కష్టమైంది. ఆపరేషన్ ఆకర్ష కానీ, ఆపరేషన్ స్వగృహలు కానీ, మరే పేరు కానీ,,, రాజకీయాల్లో చాణుక్యుడనుకున్న చంద్రబాబులో సైతం కల్లోలం రేపిన రాజకీయం వైఎస్‌ఆర్‌ది..
తొలిసారి అధికారంలోకి వచ్చి అయిదేళ్లూ, మూడు సంక్షేమాలు.. ఆరు ప్రాజెక్టులన్న రీతిలో విజయవంతంగా పూర్తి చేశారు... సాధారణ మెజారిటీయే అయినా, వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి వైఎస్ అందరినీ ఆశ్చర్యపరిచారు.. రాష్ట్రంలోనే సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రికార్డు సృష్టిస్తారనీ అంతా భావించారు. రెండో టర్మ్ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో విపక్షాలకు ఉనికే లేకుండా చేస్తారని భావించారు..కానీ అంతలోనే జరగరాని అనర్థం జరిగిపోయింది.. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా రాష్ట్ర ప్రజానీకానికి శాశ్వతంగా దూరమైపోయారు..
అప్పుడే తొమ్మిది నెలలు గడిచిపోయాయి.. వైఎస్‌ఆర్ లేరన్న లోటు స్పష్టంగానే కనిపిస్తోంది. అటు ప్రజల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ.. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ను వైఎస్ లోటు చీలికలు పేలికలు చేసింది...
కాలం చక్రంలా తిరుగుతూనే ఉంది.. వైఎస్ లేకపోవటం అన్నది ఇవాళ్టికీ అనూహ్యమైంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలు సంభవించిన ప్రతిసారీ, కొత్త సమీకరణాలు చోటు చేసుకున్న ప్రతిసారీ వైఎస్-- అధికార, విపక్షాలకు గుర్తుకురాని సందర్భం ఉండదు.. వైఎస్ అధికారంలో ఉన్నప్పటి రాజకీయానికీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ఎక్కడైనా పొంతన ఉందా?
వైఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది.. ఆ తరువాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత వైఎస్‌కు ఎదురే లేకుండా పోయింది.. ౨౦౦౪లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2009 సెప్టెంబర్ 2న ఆయన ప్రమాద వశాత్తూ మరణించేంత వరకూ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా చేశారు.. అధిష్ఠానానికి ఏపి వైపు కన్నెత్తి చూసే అవసరమే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్‌కు అన్నీ తానే అయ్యారు..
కాంగ్రెస్‌లో వైఎస్ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఆయన నాయకత్వంలో ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరం మచ్చుకైనా వినిపించలేదు.. ఆయన వినిపించనివ్వలేదు.. అధిష్ఠానానికి ఫిర్యాదులు లేవు.. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంలా మారిపోయింది..
కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలా ఉంటే విపక్షాల పరిస్థితి అయోమయంలా మారిపోయింది.. వైఎస్ ఉన్నంతకాలం టిడిపి, టిఆర్‌ఎస్‌ల నాయకత్వాలు దాదాపుగా నిద్రలేని రాత్రులనే గడిపాయని చెప్పవచ్చు. నిత్య అసమ్మతులు, రాజీనామాలతో రెండు ప్రధాన పార్టీలు గందరగోళంలో పడిపోయాయి..
ఇప్పుడు.........వైఎస్ లేరు.. విపక్షాలు పుంజుకుంటున్నాయి.. కాంగ్రెస్‌లో పాత సంస్కృతి పూర్తిగా జడలు విప్పుకుంది... అధిష్ఠానం ఆశీస్సులతో మాత్రమే కొనసాగే ముఖ్యమంత్రి.. సహకరించని మంత్రులు.. అసమ్మతులు... పరస్పర ఆరోపణలు.. కాంగ్రెస్‌లో ఇంతకాలం మౌనంగా ఉన్న గొంతులన్నీ ఇప్పుడు స్వరం పెంచాయి.. అధిష్ఠానానికి ఫిర్యాదుల పైన ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మీడియాలో ఒకరినొకరు తిట్టుకుంటున్నా ఆపేవారు లేరు..
రాజకీయం ఇలా ఉంటే.. వైఎస్ ప్రారంభించిన సంక్షేమం మరోదారిలో వెళ్తోంది.. ఆయన అధికారంలో ఉన్నంతకాలం ప్రకటించిన సంక్షేమ పథకాలను ఏ విధమైన ఆర్థిక నిర్వహణతో ఆయన కొనసాగించారో.. ఆ విధమైన నిర్వహణ ఇప్పుడు కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు.. వైఎస్ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన రోశయ్యే ఇప్పుడు సిఎంగా ఉన్నారు.. కానీ, ఆర్థిక నిర్వహణ మాత్రం భారంగా మారింది. వైఎస్ మొదలు పెట్టిన స్కీములన్నింటికీ క్రమంగా మంగళం పాడే పనిలో పడ్డారు.. ఎంతోమంది లబ్ధి పొందుతున్న ఈ స్కీములు ఆగిపోతే పరిస్థితి ఏమిటి అన్నది సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్న.. వైఎస్ ఒక నిర్దిష్టమైన దారిలో నడిపించిన కాంగ్రెస్ ఇప్పుడు దారీ తెన్నూ లేకుండా పోతోంది.. వైఎస్ ఒక ప్రణాళిక ప్రకారం మొదలు పెట్టిన పథకాలు ఒక్కటొక్కటిగా కనుమరుగవుతాయని వినిపిస్తోంది.. వైఎస్ మాత్రం అందరికీ గుర్తుకు వస్తూనే ఉన్నారు...

17, మే 2010, సోమవారం
స్నేహితుడే హంతకుడు
నరహంతకుడు రామారావు హత్య కేసు మిస్టరీ వీడిపోతోంది.. పోలీసుల కళ్లు గప్పి ఇన్నాళ్లూ ఎవరి పంచన తలదాచుకుంటూ వస్తున్నాడో.. ఎవరి ద్వారా అన్ని రకాల సహాయాన్ని పొందుతూ వస్తున్నాడో.. ఇంతకాలం ఎవరిని అత్యంత విశ్వాస పాత్రుడిగా భావించాడో.. ఆ మిత్రుడే హంతకుడుగా స్పష్టమవుతోంది.. పోలీసులు ఈ విషయంలో దాదాపుగా నిర్థారణకు వచ్చేశారు..
నరహంతకుడు రామారావు ఎంత కిరాతకంగా మనుషుల్ని హతమార్చాడో.. అంతకంటే కిరాతకంగా అతను చనిపోయాడు.. రామారావు హత్య ఎవరినీ బాధపెట్టలేదు.. పైగా అందరినీ సంతోషపరిచింది.. చిక్కినట్లే చిక్కి ఎప్పటికప్పుడు పారిపోతూ, కనిపించిన చోటల్లా దోపిడీలు, హత్యలు చేస్తూ ఒకటిన్నర దశాబ్దంగా అల్లాడిస్తున్న రామారావు చనిపోవటం పోలీసులకు సైతం ఒకవిధంగా నమ్మశక్యం కావటం లేదు. రామారావు శవం ముందుగా కనిపించినప్పుడు పోలీసులే మట్టుబెట్టారని అంతా భావించారు. తమదైన రీతిలో ట్రీట్‌మెంట్ ఇచ్చి హతమార్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఓ మహిళతో అక్రమసంబంధం ఉన్న దన్న ఆరోపణపై ఆమె భర్తను విచారించినప్పుడు కేసు చిక్కుముడి నెమ్మదిగా వీడిపోవటం మొదలైంది..
పోలీసులు అరెస్టు చేసిన రాణి మేకల చలపతిరావుకు, రామారావుకు మొదట్నుంచీ స్నేహం ఉంది.. ఇద్దరూ కలిసి కొన్ని దొంగతనాలు కూడా చేసినట్లు సమాచారం.. దీని ప్రకారం.. జైలు నుంచి రామారావు పరారయి వచ్చిన ప్రతిసారీ, చలపతిరావే అతనికి షెల్టర్ ఇచ్చేవాడు.. మందు, మగువలను ఏర్పాటు చేసేవాడు.. అదే విధంగా ఈ నెల ౮న శ్రీకాకుళం జైలు నుంచి తప్పించుకున్న రామారావు కృష్ణా జిల్లా అగిరిపల్లికి నేరుగా చేరుకున్నాడు.. చలపతిరావు ఇంట్లోనే ఆశ్రయం పొందాడు.. కానీ, ఈసారి రామారావు స్నేహితుడికే ఎసరు పెట్టాడు.. తిన్నింటి వాసాలు లెక్కించాడు. చలపతి రావు భార్యపై రామారావు కన్నేయటంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.. ఆ కారణంగానే చలపతిరావు రామారావును హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది..
విచిత్రమేమంటే రామారావు హత్య జరిగిన ౪౮ గంటల తరువాత అతని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.. కానీ, అతనికి అంత్యక్రియలు చేసే దిక్కు లేకుండా పోయింది.. మృతదేహాన్ని గుర్తించేందుకు వచ్చిన బంధువులు సైతం పోస్ట్‌మార్టమ్ తరువాత దాన్ని తీసుకుపోయేందుకు రానే లేదు.. ఇన్నేళ్ల పాటు కిరాతకుడుగా అందరినీ గడగడలాడించిన రామారావు చివరకు ఎవరికీ కాకుండా పోయాడు..

15, మే 2010, శనివారం
అమ్మతో మాట్లాడుతున్నారా?
అమ్మ.... రెండు అక్షరాలు.. నిఘంటు అర్థాలకు అతీతమైనవి... మనిషి పుట్టుకకు మరో పేరు అమ్మ. నిశ్శబ్దంలోనూ వినిపించే ఒకే ఒక్క శబ్దం అమ్మ.. అమె తనువు బిడ్డలది.. ఆమె తపన తీరనిది.. ఆమె మమత కాలం కంటే వేగంగా హృదయాలను తాకేది.. అమ్మ గురించి ఎందరు ఎన్ని రాసినా ఏం చాలుతుంది.. సృష్టే ఆమె అయినప్పుడు ఆమెను సంపూర్ణంగా చూసేందుకు ఎన్ని కళ్లు చాలుతాయి?
మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? భయంతో వణికిపోతున్నారా? జీవితంలో అన్నీ కోల్పోయానన్న ఆందోళనలో ఉన్నారా? ఏం చేయాలో తోచక.. దారి కనిపించక.. జీవితంపై విరక్తి కలిగినప్పుడు మీరేం చేస్తారు.. అర్థం కావటం లేదా? ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడండి.. ఒక్క క్షణం ఆప్యాయంగా ఆమె పలుకులు వినండి.. ఆమె మాట మీకు స్వాంతన చేకూరుస్తుంది.. అన్ని టెన్షన్లూ మటుమాయమవుతాయి.. ఎందుకంటారా? ఆమె అమ్మ కాబట్టి..
కాలంతో పోటీ పడి గెలిచే వాళ్లు ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున చెప్పగలిగే ఒకే ఒక్క జవాబు అమ్మ..
జన్మనిచ్చినప్పటి నుంచీ అమ్మకు పిల్లలే లోకం.. పిల్లలే తనువు.. పిల్లలే సర్వస్వం...
అన్నం తినటం దగ్గర నుంచి అక్షరాలు నేర్చే దాకా ఆదిగురువు అమ్మ..
మాట నేర్పేది అమ్మ.. మంచి నేర్పేది అమ్మ.. తన కళ్లతో లోకాన్ని చూపించేది అమ్మ..
బుడిబుడి అడుగులతో నడవటానికి ప్రయత్నిస్తూ బిడ్డ తడబడ్డప్పుడు ఆ తడబాటును సరిదిద్దేది అమ్మ..
పెద్దగా పెరిగాక తప్పు చేస్తే, ఆ తప్పును కాచి బిడ్డను తన చాటున ఉంచుకుని కాపాడుకునే ఆత్మబంధువు అమ్మ
మోకాలిపైదాకా చీర కట్టి ఎంత కష్టమైనా పడుతుందేమో కానీ, కన్నబిడ్డ కష్టాన్ని ఒక్కక్షణం కూడా చూడలేదు అమ్మ..
తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పుడు ఆమె స్పర్శ మనకు కలిగించే స్వాంతన ఎంత గొప్పది..
మనం ఆందోళనలో ఉన్నప్పుడు తలలో వేళ్లు ఉంచి సున్నితంగా నిమురుతూ అమ్మ ఇచ్చే ఓదార్పు మరెక్కడ లభిస్తుంది?
ఇవాళ ఉద్యోగాల కోసమో..వ్యాపారం కోసమో ఎక్కడెక్కడికో వలసలు వచ్చి బతుకుతున్న వాళ్లు ఎందరో ఉన్నారు.. ఎక్కడో సుదూరంగా ఊళ్లో ఉన్న తల్లి.. ఇంకెక్కడో నగరాల్లో క్షణమైనా తీరిక లేని సంతానం.. ఇద్దరి మధ్య పలుకే కరవైన పరిస్థితి.. ఈ దశలో ఒక్కసారి ఫోన్‌లోనైనా ఆమ్మ మాట వింటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఎంత ఉల్లాసంగా ఉంటుంది? ఇది ఎవరికి వారికే కలిగే అనుభవం...
విస్కాన్సన్ యూనివర్సిటీ దీనికోసం ఓ పెద్ద పరిశోధన చేసి మన ఒత్తిళ్లనుంచి దూరం చేసేది అమ్మ మాట అని తేల్చింది... ఇందుకోసం ఇంత పరిశోధన దేనికో అర్థం కాదు.. మన కల్చర్‌లోనే నరనరానా జీర్ణించుకుని పోయిన పదం అమ్మ... ఇంత గొప్ప సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.. ఇక్కడ అమ్మ అన్న మాట అత్యంత సాధారణంగా వినిపించేది..
కాస్త పక్కకు జరుగమ్మా..
ఏమ్మా బాగున్నావా
అలా కాదమ్మా ఇలా చేయి..
అనే మాటలు మన దగ్గర ఎక్కడైనా వినిపించేవి.. చిన్న దెబ్బ తగిలితే మొదట మన నోటి వెంట వచ్చే మాట అమ్మ.. అమ్మ ఆప్యాయతకు ఇంతకంటే అర్థం ఏం కావాలి.. అమ్మ.. తొలి అక్షరంతో పెదవి విచ్చుకుంటే.. మలి అక్షరంతో పెదవులు కలిసిపోతాయి.. మధ్యలో ఉన్న సమస్త సృష్టి రహస్యమే అమ్మ... అందుకే టెన్షన్‌లో ఉన్నప్పుడు అమ్మతో మాట్లాడండి.. హాపీగా ఉండండి..

టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..
పాతబస్తీ... ఈ పేరు చెప్తేనే ఏదో గుబులు పుడుతోంది. శాంతి లేదు.. భద్రత లేదు.. ఎవరైనా.. ఎప్పుడైనా, యథేచ్ఛగా రావచ్చు. ఎన్నాళెユ్లనా ఉండవచ్చు. ఏమైనా చేయవచ్చు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా మారిపోయింది పాతబస్తీ.. అక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ దాని ఉనికి నామమాత్రమే.. అందుకే టెర్రరిజం పాతబస్తీని క్యాన్సర్‌లా కాల్చేస్తోంది..
ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక అమాయక కానిస్టేబుల్ అన్యాయంగా చనిపోవటానికి బాధ్యులు ఎవరు? పోలీసుల నిర్లక్ష్యం మాత్రమే కారణమా? టెర్రరిస్టులు పాతబస్తీలో తమ ఇష్టం వచ్చినట్లు మోటార్ సైకిళ్లపై తిరుగుతుంటే ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదు..? అసలు వాళ్లు అలా ఎలా తిరగగలుగుతున్నారు? హుస్సేనీ ఆలం దగ్గర కానిస్టేబుల్ రమేశ్‌ను కాల్చి చంపి మహరాజుల్లా టెర్రరిస్టులు వెళ్లిపోయిన తరువాత ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్నలివి....
రాష్ట్ర రాజధానిలో మరెక్కడా లేని నిరంకుశత్వం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. రాజధానిలో మరో ప్రాంతంలో ఎవరైనా కాస్త ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు వాళ్ల వెంట బడి తరిమి తరిమి పట్టుకుని జరిమానా విధిస్తారు.. నియమావళిని ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తారు.. కానీ, పాతబస్తీకి వచ్చేసరికి ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది.. అక్కడ ఏం చేసినా పోలీసులు ప్రశ్నించే సాహసం చేయరు.. నిలువరించే ప్రయత్నం చేయరు.. ఏకాస్త ప్రయత్నం జరిగినా అంతే సంగతులు..
పోలీసులకు కాళ్లూ చేతులూ కట్టేశారు.. నిఘా పూర్తిగా నీరుగారిపోయింది. అందువల్లే స్లీపర్‌సెల్స్ విజృంభిస్తున్నా ఏం చేయలేకపోయారు.. మానవబాంబులు ప్రవేశించాయని తెలిసినా ఏం చేయలేకపోయారు.. వీసా గడువు తీరిపోయిన తరువాత కూడా అక్రమంగా ఇక్కడ ఉంటున్న వాళ్ల సంగతి సరేసరి.. సెటిల్మెంట్లకయితే లెక్కే లేదు.. పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా పోలీసులు కానీ, పాలకులు కానీ, సీరియస్‌గా తీసుకోకపోవటానికి కారణం ఒక్కటే... మత సంప్రదాయం మాటున ఉగ్రవాదం పాతబస్తీలో రాజ్యమేలుతోంది. మొదట్నుంచీ పాలకవర్గం ఈ అంశంపై దృష్టి సారించలేకపోవటం వల్లనే ఉగ్రవాదులకు సేఫ్ డెన్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో ఉదారవాదులను ఎవరినీ ఎదగనీయకపోవటం, సంప్రదాయమే డామినేట్ చేయటం వల్ల దాని మాటున దాగున్న ఉగ్రవాదాన్ని నియంత్రించటం, నిరోధించటం సాధ్యం కావటం లేదు.. ఉగ్రవాదానికి మతం అంటూ ఉండదన్న వాస్తవాన్ని సామాన్య ప్రజానీకానికి తెలుసు. మతం వేరు.. టెర్రరిజం వేరు.. దురదృష్ట వశాత్తూ మన దేశంలో ఈ రెంటినీ ఒకే గాటన కట్టి చూడటం పాలకులకు, రాజకీయ పార్టీలకు అవసరమైంది కాబట్టే పాతబస్తీ టెర్రరిజం అనే క్యాన్సర్ బారిన పడి అల్లాడిపోతోంది.. దీనికి చికిత్స చేసేదెవరు? చేయటం సాధ్యమేనా?

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)