18, జనవరి 2010, సోమవారం

విషాద వచనం

ఇవాళ మనకు కనిపిస్తున్న దృశ్యం సుస్పష్టం. నేటి పోరాటం ఆత్మగౌరవ ఆస్తిత్వ రేఖాచిత్రం. ఆర్థిక ఆధిక్యత తాత్కాలికం. రాజకీయపు పెత్తనాలు దీర్ఘకాలికం. కానీ సాంస్కృతికమైన పెత్తందారీతనం మాత్రం శాశ్వతం. ఇదిగో.. ఈ శాశ్వత ముద్రలు వేస్తున్న సాంస్కృతిక ఆధిపత్య దాడుల ప్రతిస్పందనలే జన హృదయ ఘోషలు. ఆకాశాన్నంటుతున్న విషాద పాటలు నెత్తుటి సంతకాలు.
ఇది నిజం.. నేటి తెలంగాణ గ్రామీణ జీవన విధ్వంసపు విషాద వచనం. ఇది సత్యం, తల్లడిల్లుతున్న పల్లె తెలంగాణ ఘోషలకు అక్షర రూపం. ఇది వాస్తవం, నాలుగు కోట్ల రతనాల వీణ వీర గాధల పల్లవుల పునాదుల అన్వేషణ. ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాత ధనిక నియంత ఏడవ నిజాం నవాబు రుబాబుకు పోరాటపు జవాబు చెప్పిన తెలంగాణ అంతరంగపు సాంస్కృతిక విచ్ఛిన్న నేపథ్యం ఇది.
ఇది ఇవాళ్టి ధ్వంస రచన కాదు.. ఏడు శతాబ్దాల విధ్వంస రచన.. దాదాపు ఏడు వందల సంవత్సరాలుగా నిర్నిరోధంగా అట్టడుగుకు అణచివేయడానికి అనేక శక్తులు అనేక మార్గాల నుంచి చేస్తున్న ప్రయత్నాలను నిలువరించటానికి, నిర్మూలించటానికి నిరంతరంగా తెలంగాణ ప్రజలు చేస్తున్న బతుకు పోరాటం పతాక స్థాయికి చేరుకున్న వేళ ఇది. ఇప్పుడు గెలుపు సాధించకపోతే మరెప్పుడూ సాధించలేమని దృఢ నిశ్చయం చేసుకున్న సందర్భం ఇది.
ఎందుకిలా జరుగుతోంది..? స్వతంత్ర భారతం షష్టిపూర్తి చేసుకుని ఇన్నేళ్లయిన తరువాత కూడా భారత దేశంలో ఒక ప్రాంతం ఇంతగా అల్లాడిపోవలసిన అవసరం ఎందుకొచ్చింది? తమ ప్రాంతానికి స్వాతంత్య్రమే రాలేదన్నంతగా ఇక్కడి ప్రజలు ఎందుకు విలవిల్లాడిపోవలసి వస్తోంది? ఎంత ఎత్తో తెలియనంత ఎత్తుకు ఎగసిన ఒక గొప్ప సంస్కృతి అస్తిత్వాన్ని నిలబెట్టడానికి నాలుగు కోట్ల ఊపిరులు బిగపట్టి ఉద్యమిస్తున్నాయి.
ఏమిటీ సంస్కృతి గొప్పతనం? దీని పట్ల ఎందుకింత ద్వేషం? దీన్ని అణచివేయటానికి ఎందుకింతమంది ఒకరివెంట ఒకరుగా దాడులు చేస్తున్నారు..? ఆక్రమించుకోజూస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి... మన మూలాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకోండి..

తెలంగాణా అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం అని అర్థం.. అంటే అచ్చమైన తెలుగు భాష ను మాతృభాషగా వ్యవహరించే జాతి జీవించే ప్రాంతం తెలంగాణా అని అర్థం. నిజమైన తెలుగుదనం కనిపించే ప్రాంతం తెలంగాణాయే అనటంలో సందేహం లేదు.. కాకతీయుల పతనానంతరం 1323 తరువాత కాలం నుంచి 1948 వరకు రకరకాలుగా తెలంగాణ ప్రజల భాషాసంస్కృతులను అణచివేసే ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే వచ్చింది. అయితే ఈ ఆరువందల ఏళ్లలో జరిగిన అన్యాయం ఒక ఎత్తు అయితే, గత 50 సంవత్సరాలలో తెలంగాణాకు జరిగిన అన్యాయం మరో ఎత్తు.. అంతకు ముందు ఆరువందల సంవత్సరాలలో రాజులు, జమీందారులు తెలుగు భాషను కానీ, వారి సంస్కృతిని కానీ పట్టించుకోలేదు.. పక్కన పెట్టారు.. తమ మతాన్ని, భాషను రుద్దే ప్రయత్నం చేశారు. ఇంత నిర్బంధంలోనూ ఇక్కడ అసాధారణంగా సంస్కృతి, సాహిత్యం దేశంలోని మరే ప్రాంతానికీ తీసిపోని స్థాయిలో విలసిల్లింది. తెలుగుగడ్డపై తొలి సారి అక్షరాలను కూర్చిన గుణాఢ్యుడు బృహత్కథను రాసింది మెదక్‌ జిల్లా కొండాపూర్‌లో.. రామాయణం తొలి అనువాదం భాస్కర రామాయణం తెలంగాణాలో పుట్టింది. తొలి పురాణ అనువాదం మార్కండేయ పురాణం తెలంగాణా ప్రాంతంలోనే పుట్టింది. ఇక భాగవతం సంగతి సరేసరి.. బమ్మెర పోతన భాగవతం తెలుగు సాహిత్యంలో అజరామరమైన ఇతిహాసం. యక్షగానాలు మనదగ్గరే పుట్టాయి. శతకం తెలంగాణాలోనే పుట్టింది. బొమ్మల్లో పద్యాలు రాయటం వంటి గొప్ప ప్రక్రియ తెలంగాణ సొంతం. వీటన్నింటికీ ఆంధ్ర ప్రాంతంలో కొనసాగింపులే జరిగాయి తప్ప అక్కడ సృజనాత్మకతకు ఉన్న చోటు ఏమిటంటే ఏమీ చెప్పలేం.. గురజాడ అప్పారావు తొలి తెలుగు కథ రాశాడని చెప్పుకున్నారే కానీ, దానిపైన వివాదం రేగింది. కందుకూరి వీరేశలింగం తొలి తెలుగు నవల రాశానని తాను చెప్పుకున్నారే తప్ప అదీ వివాదాస్పదమే అయింది. ఆ ప్రాంతంలో తొలిసారి వెలుగులోకి వచ్చిందని చెప్పుకున్న ఏ ప్రక్రియా దాదాపుగా వివాదానికి చోటు చేసుకోకుండా ఉండలేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉప్పొంగిన సృజన మరెక్కడా మచ్చుకైనా కనిపించదు..
అందుకే 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం విలీనం అయిన తరువాత సాహిత్య విధ్వంసం నాందిగా సాంస్కృతిక ధ్వంస రచనకు శ్రీకారం జరిగింది. మొట్టమొదట ఇక్కడ ఎలాంటి సృజన అన్నది జరగనే లేదని చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.. బమ్మెర పోతన్నను వరంగల్‌ వాడు కాదని, కడప జిల్లా ఒంటిమిట్ట వాడని కనీవినీ ఎరుగని వాదనను లేవదీశారు.. అదే నిజమేనేమో అన్నంతగా ప్రచారం చేశారు.. వేముల వాడ భీమకవిని ద్రాక్షారామానికి చెందిన వాడంటూ మరో కథను సృష్టించారు. పాల్కురికి సోమనాథుడు కర్ణాటకలో ఎక్కడో హాల్కురికి అనే ఊరుందని, అక్కడి నుంచి వచ్చినవాడన్నారు.. మల్లినాథసూరిని, అప్పకవిని.. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఓ పాటో, ఓ పద్యమో, ఓ కథో, ఓ కవితో , ఓ విప్లవమో ఏదైనా ఒక సృష్టి జరిగితే, దాన్ని సృష్టించిన వాడు తెలంగాణా ప్రాంతం వాడు కాదని నిరూపించేందుకు విపరీతమైన ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రతిఘటించాల్సి వచ్చింది. మల్లినాథసూరి మెదక్‌ జిల్లా కొలిచెలిమ ప్రాంతానికి చెందిన వాడు. కాకునూరి అప్పకవి మహబూబ్‌ నగర్‌ వాసి. ఇక్కడి మేధావులు గట్టిగా తిప్పికొట్టారు కాబట్టి ఈ జాతి సృజన జీవనం ఈకాస్తయినా మిగిలింది. వాళ్ల ప్రాంతం వాళ్లయితే వాళ్లలో ప్రతిభ ఉన్నా లేకపోయినా నెత్తిన పెట్టుకుని మరీ వాళ్లకోసం మార్కెటింగ్‌ చేశారు. ఒక్క విజయనగరం ప్రాంతానికి సంబంధించిన మాండలికంలో కన్యాశుల్కం నాటకం రాసినందుకు గురజాడను వైతాళికుడని కీర్తించారు.. కానీ అదే సమయంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాకతీయ ప్రతాపరుద్రుని కథాంశంతో, పాత్రోచిత వ్యవహార భాషలో ప్రతాపరుద్రీయం నాటకం వస్తే.. అది ఈ ప్రాంతానిది చెందింది కాబట్టి `ఇగ్నోర్‌' చేసి వదిలేశారు. దాన్ని నామరూపాలు లేకుండా అణచివేశారు.. విశేషం ఏమంటే ఆ నాటకం రాసింది ఆ ప్రాంతం వాడే అయిన వేదం వెంకట రాయశాస్త్రి.. అయినా సరే. .నాటకం తెలంగాణాది కావటమే అభ్యంతరం... ఇవాళ అలాంటి నాటకం ఒకటుందని ఎంతమందికి తెలుసు?
తెలుగువాళ్లను అందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి పరిపాలించింది మొట్టమొదట శాతవాహనులు.. వారి రాజధాని ప్రస్తుతం మహారాష్టల్రోని ఔరంగాబాద్‌ సమీపంలో ఉన్న ప్రతిష్ఠానపురం... ఇది తెలంగాణా ప్రాంతానికి చెందినదే.. కానీ, శాతవాహనులను తమ సొంతం చేసుకునేందుకు వాళ్ల రెండోరాజధాని ధనుష్కోటి అయి ఉండవచ్చన్న ప్రచారం చేశారు.. ఇప్పటికీ దానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు...అటు తరువాత తెలుగువాళ్లను ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాళ్లు కాకతీయులు. వాళ్ల రాజధాని కూడా ఓరుగల్లు... అయితే వీరికి మరో రాజధానిని ఆంధ్రప్రాంతంలో సృష్టించే అవకాశం లభించలేదు.. కానీ, వీరిని తమవాళు్లగా చెప్పుకునే ప్రయత్నాలు మాత్రం విస్తృతంగా జరిగాయి. కాకతీయులు తమ వర్గం వారని, వాళు్ల ఆంధ్రప్రాంతం నుంచే వలస వచ్చి ఓరుగల్లులో స్థిరపడిపోయినట్లుగా నిరూపించటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు.. రాజమహేంద్రవరంపై ఆరుద్ర రాసిన పాటలో కాకతీయుల పేరు వాడుకుని కాకతీయుల్ని తమ సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. 1960లలో నల్గొండ జిల్లాకు చెందిన ప్రసిద్ధ శాసనకారుడు బిఎన్‌ శాస్త్రిగారి వద్దకు కొందరు ఆంధ్ర పెద్దలు వచ్చి కాకతీయులకు సంబంధించిన ఏదైనా శాసనంలో అర్థం మార్చమని కోరినట్లుగా అందుకు కొంత సొము్మ ఇవ్వజూపినట్లుగా కూడా శాస్త్రిగారే కొందరి వద్ద వాపోయారు. ఈ రకమైన ప్రయత్నం ఇప్పటికీ ఆగలేదు.. వాళ్ల వ్యాపార సంస్థలకు, విద్యాసంస్థలకు కాకతీయ పేరును వాడుకోవటం మనం స్పష్టంగానే గమనించవచ్చు.
తెలంగాణ ప్రాంతంలో చేసుకునే ఏ పండుగైనా మట్టివాసనతో ముడిపడి ఉంటుంది. మట్టిని కాదని ఇక్కడి ప్రజలు బతకలేరు.. దేశమంటే మట్టికాదోయ్‌ అని మట్టిని విస్మరించి బతకటం ఇక్కడి ప్రజలకు చేతకాదు.. అసలు తెలంగాణ పేరులోనే మట్టి అస్తిత్వం గోచరిస్తుంది. తెలుగుల మాగాణం తెలంగాణం అని అన్నారు.. తెలుగును సిరులుగా పండించే భూమి అని అర్థం. అందుకే ఇక్కడ ప్రతి పండుగా ఆ మట్టితోనే ముడిపడి ఉంటుంది. తెలంగాణ పద సీమల్లో ప్రకృతి పరవశించి తాండవం చేస్తుంది. దానికి ప్రతిరూపమే తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగ బొడ్డెమ్మ, బతుకమ్మ. దసరాకు ముందు ఇరవై రోజుల పాటు చేసుకునే పండుగలివి. మొదటి తొమ్మిది రోజులు మట్టితో బొడ్డెమ్మను చేసి పాటలు పాడుకుంటూ కన్నెపిల్లలు పండుగ చేసుకుంటే, తరువాత పూలతో జరుపుకునే పండుగ బతుకమ్మ.. ప్రపంచంలో పూవులతో తొమ్మిది రోజులపాటు పండుగ జరుపుకునే సంస్కృతి ఉన్న ఏకైక జాతి తెలంగాణాయే అనటంలో సందేహం లేదు.. దీని గురించి వర్ణించేందుకు ఎన్ని వర్ణనలైనా చాలవు. రాష్ట్రంలో పది జిల్లాల్లో అంటే దాదాపు యాభై శాతం రాష్ట్రం వైభవంగా జరుపుకునే ఈ పండుగను ఏనాడు ప్రభుత్వాలు గుర్తించలేదు. ఇది కూడా ఓ పండుగేనా అన్న ఈసడింపులు కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి. బతుకమ్మను ఒక పండుగగా ఇవాళ్టికీ పరిగణించని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరువాత కానీ బతుకమ్మ చర్చలోకి రాలేదు.
అదే విధంగా బోనాలు.. రాష్ట్ర రాజధానిలో నెల రోజుల పాటు నిరంతరంగా జరిగే పండుగ బోనాలు.. అమ్మవారికి భోజనాలు పెట్టడమే బోనాలు.. ఇది కూడా వ్యవసాయంతో ముడిపడి ఉన్నదే. ప్రతి ముఖ్యమంత్రి బోనాల నాడు సికిందరాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి రావటం మినహా దీన్ని పట్టించుకున్న నాథుడు లేడు..
ఇక మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర.. మూడు రాషా్టల్ర నుంచి దాదాపు కోటి మంది భక్తులు రెండేళ్లకోసారి చేసుకునే పండుగకు నాలుగు దశాబ్దాల పాటు పోరాడితే కానీ, రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టలేకపోయింది. భారీ ఎత్తున జనం రావటం, హుండీలు నిండటం వల్ల ఆ ఆదాయాన్ని క్రమబద్దీకరించే నెపంతో దేవాదాయ శాఖ వేలు పెట్టింది. కానీ, మేడారంలో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అక్కడి జంపన్న వాగు శుద్ధి జరగలేదు.. అక్కడి ప్రజలు బాగుపడిందీ లేదు.
కొమరవెల్లి , ఐనవోలు, కురవి, కొండగట్టు, వేములవాడ ఇలా తెలంగాణాలోని ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో ఎప్పుడూ ఏదో ఒక జాతర జరుగుతూనే ఉంటుంది. ఇక్కడి ప్రతి పండుగా సామూహికంగా, సమష్టిగా జరుపుకునేవే. కులభేదాలు లేకుండా అంతా ఒక్కటై నిర్వహించే పర్వదినాలు తెలంగాణాలో ఉన్నన్ని మరెక్కడా లేవు. చిన్నాపెద్దా తేడా లేకుండా, వయోభేదం లేకుండా, కులమతాల భేషజాలు లేకుండా నిర్వహించుకునే ఈ పండుగలను, జాతరలను పండుగలే కావన్నారు.. జాతరలే కావన్నారు.. ఇవి కూడా పండుగలేనా అని నిరసించారు.. ఇవి కూడా వేడుకలేనా అని ఎద్దేవా చేశారు.. అనాగరకులు చేసుకునే పండుగలన్నారు.. తెలంగాణ ప్రాంతానికి మహారాష్టత్రో ఉన్న సంబంధాల కారణంగా హోళీ తెలంగాణకు ప్రధానమైన పండుగ అయింది. జాతీయోద్యమంలో భాగంగా మహారాష్టల్రో ప్రారంభమైన వినాయకచవితి ఉత్సవాలు తెలంగాణాలోనూ వైభవంగా జరుగుతాయి. పీర్ల పండుగను ఇక్కడి ప్రజలు సమష్టిగా చేసుకుంటారు.. కానీ, ఇవేవీ పండుగల్లా అక్కడి ప్రాంతం వాళ్లకు కనిపించలేదు. క్రమంగా తెలంగాణ పండుగలపై వాళ్ల పండుగలు సూపర్‌ ఇంపోజ్‌ అయ్యాయి. అవే గొప్ప పండుగలని, తెలంగాణలోని పండుగలు పండుగలే కాదన్నంత భావనను ప్రచారం చేశారు.. 50 ఏళు్లగా ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు బతుకమ్మను జరుపుకోరు.. బోనాల వంకైనా చూడరు.. కానీ, తెలంగాణ ప్రజలు సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టడం అలవాటు చేసుకున్నారు.. కానీ, ఆంధ్రప్రాంత ప్రజలు తెలంగాణా పండుగల్లో ఒక్కనాడు కూడా మమేకం అయిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించదు.. పండుగలకు సమైక్యతకు సంబంధం ఏమిటి అని అడగవచ్చు. ఉంది. ఇవాళ సమైక్యం గురించి వాదిస్తున్న వాళ్లంతా తెలుగు వాళ్లందరూ ఒకటేనని, తెలుగు జాతి ఒకటే అని, పాలుపొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దనే కదా అంటున్నారు.. మరి అం తా ఒకటే అయినప్పుడు.. అన్ని సంస్కృతులను తమవిగా భావించాలి కదా.. తెలంగాణా వాళు్ల ఆ పని చేస్తున్నారు..చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలను తమ వాళు్లగా, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా ఆదరించారు.. అక్కున చేర్చుకున్నారు.. ఆప్యాయంగా పలకరించారు.. మరి వాళు్ల , తెలంగాణా ప్రజలతో కలిసిమెలిసి ఉందామని హృదయపూర్వకంగా భావిస్తున్నామని చెప్పుకుంటున్న వాళు్ల యాభై ఏళ్లలో ఒక్కనాడైనా తెలంగాణ సంస్కృతిని తమదిగా భావించి, ఆదరించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు కదా.. ఏనాడైనా వాళ్లకు బతుకమ్మ తెలుసా? బోనాలు తెలుసా? జాతరల్లో జన జాతరల గురించి తెలుసా? వాళ్ల దృష్టిలో ఇవేవీ పండుగలు కావు.. అనాగరికులు.. అజ్ఞానులు, మూఢులు, చేసుకునే కిందిస్థాయి సంబరాలు మాత్రమే.. వాటికి తెలుగు పండుగలన్న హోదా కల్పించటం కూడా వారి దృష్టిలో అతి పెద్ద ద్రోహం కింద లెక్క.
జానపదం అంటే అంటే అనాగరికులని, చదువుకున్న వాళు్ల కాదనే ఒకానొక భ్రమ ఆంధ్రప్రాంతం వాళ్లలో ఉంది.. జానపదులంటే వాళ్లకు చదువు లేదని, ఏవో పదాలు పాడుకుంటూ బాంచన్‌ కాల్మొక్తా అంటూ దొరల దగ్గర వెట్టి చేసుకుని బతికిన వాళ్లే తెలంగాణ వాళ్లని, ఆంధ్రప్రదే శ్‌ ఏర్పడిన తరువాతే ఈమాత్రమైనా పురోగతి సాధించారని చెప్తారు. ప్రచారం చేస్తారు.. నమ్మబలుకుతారు.. దాండిగతనం ప్రదర్శిస్తారు. కానీ తెలంగాణ మాండలికం (ఇప్పుడు అధికారికంగా వాడుతున్న రెండున్నర జిల్లాల భాష కానిదేదైనా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో మాండలికంగానే గుర్తింపు ఉంది.) తెలంగాణ జనులు వ్యవహారంలో వాడే భాష,ను అనాగరకుల, అజ్ఞానుల నిరక్షరులి యాస అంటూ తీసిపారేశారు.. వెటకారం చేశారు.. అదేమంటే ఆటపట్టించాం అంటారు.. మా మాండలికాన్ని కూడా ఆటపట్టిస్తున్నారు అంటారు..నిజమే అన్ని ప్రాంతాల మాండలికాల్ని ఆటపట్టిస్తున్నారంటే దాన్ని కాదనాల్సిన పని లేదు. ఆట పట్టింపును స్పోర్టివ్‌గా తీసుకోవాలి.. కానీ, ఆటపట్టింపుకు, వెటకారానికి మధ్య తేడా చాలా ఉంది. ర్యాగింగ్‌ పేరుతో ఆటపట్టించటానికి, వేధించటానికి ఉన్న తేడాయే ఇక్కడ కూడా ఉంటుంది. మిగతా మాండలికాల విషయంలో జరిగింది ఆటపట్టింపు.. తెలంగాణా భాష విషయంలో జరిగింది వెటకారం. ఈ వెటకారం కేవలం సినిమాల్లోనే కాదు.. సాధారణ జనజీవనంలో కూడా తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు.. ఎదుర్కొంటున్నారు.. చివరకు పరిస్థితి ఎలా తయారైందంటే తెలంగాణ భాషలో మాట్లాడితే అదొక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్‌‌సకు లోనయ్యే దశకు చేరుకుంది. ఈ విధంగా భాషను మాట్లాడనీయకుండా చేయటంలో వారు సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. నిజానికి తెలంగాణాలో మాట్లాడే భాష తెలుగుకు ఓ ప్రాంత మాండలికం కానే కాదు.. ఇది పూర్తి స్థాయి భాష. సంపూర్థంగా వికసించిన భాష. దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు ప్రభుత్వ పోషణ లేక, ఆదరణ లేక పోవటం వల్లనే తెలంగాణాలో తెలుగు భాష కలుషితం కాలేదు.. అధికారుల స్థాయిల్లో, పరిపాలన స్థాయిలో ఉర్దూయే రాజభాషగా ఉండటం వల్ల, ఇక్కడి ప్రజలు తమ తెలుగును తామే పరిరక్షించుకున్నారు. పట్టణాల్లోనైనా, పల్లెల్లో అయినా, పాట పుట్టినా, ఆట పుట్టినా, తిరుగుబాటైనా, సంప్రదాయమైనా, గ్రామీణమైనా, ఏ ఒక్కదాన్నీ ఏ ఒక్కటీ నిరసించలేదు. ఇక్కడ అన్నీ కలగలిసే ముందుకు సాగాయి. పల్లే కన్నీరూ పెడుతుందో అన్నా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, అన్నా పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం అన్నా.. అచ్చమైన తెలుగులోని అసాధారణ పదవిన్యాసమే కనిపిస్తుంది. ఇక్కడ జానపదానికి, సంప్రదాయానికి పెద్దగా తేడా కనిపించదు. జాను తెనుగు గుభాళించిన సాహిత్య సంస్కృతులు ఇక్కడి కణ కణంలో విలసిల్లాయి. అందుకే ఇక్కడ సహజ పాండిత్యంతో ఒక బమ్మెర పోతన పుట్టాడు ఆకాలంలో.. అక్షరాభ్యాసం అంటే ఏమీ తెలియకుండానే, చదువు సంధ్యల జ్ఞానం సముపార్జించకుండానే గొప్ప ప్రజాకవిగా అందెశ్రీ జన్మించాడు ఈకాలంలో... తెలంగాణ గడ్డపైనే సృజన మూలాలు విస్తరించి ఉన్నాయి. వాటిని పెకిలించటం ఎవరితరం? తెలంగాణేతర తెలుగు ప్రాంతాల్లో బ్రిటిష్‌ ఇంగ్లీష్‌ తెలుగును ఆక్రమించుకుంది. అక్కడి భాష సంకరమైంది. ఇప్పుడు ఆ సంకర భాషను ప్రామాణికం చేసేసుకుని దాన్ని నిజమైన తెలుగు భాషపై రుద్ది, దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ అది సాధ్యమయ్యే పనేనా?
తెలంగాణ నగర జీవితాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడటం చాలా సులువే.. కానీ వాస్తవాల్ని అంగీకరించగలగటం చాలా కష్టం. తెలంగాణలో నాగరికత 1956 వరకు లేదన్న వాదనే ఇంతకాలం బలంగా వినిపిస్తూ వస్తున్నారు.. కానీ భారత దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా వేగంగా నాగరికత విలసిల్లిన ప్రాంతం తెలంగాణా.. దీన్ని రుజువు చేసేందుకు పెద్దగా శాస్త్ర పరిజ్ఞానం అక్కర లేదు. పుస్తకాలు, శాసనాలు చదవక్కరలేదు. ఇక్కడి జనజీవనాన్ని అధ్యయనం చేయటానికి ఈ ప్రాంతంలోని దేవాలయాలను సందర్శిస్తే చాలు.. అక్కడి శిల్పాల్లోనే తెలంగాణా జనజీవితం ప్రతిబింబిస్తుంది. రామప్ప ఆలయంలోని శిల్పాల్లో ఓ యువతి ఎత్తు మడమల చెప్పులు వేసుకుని కనిపిస్తుంది. మరో యువతి వేషధారణ, జడకట్టు ఈ తరానికి ఎంతమాత్రం తీసిపోనట్లుగా ఉంటుంది. ఇలాంటి శిల్పాలు ఎన్నెన్నో కనిపిస్తాయి. ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం చెక్కిన శిల్పాలు ఇవి. నీటి పునాదులపై వేయి స్తంభాల ఆలయం నిర్మించిన ఘనత తెలంగాణాది. నీటిపై తేలే ఇటుకలను రూపొందించిన నైపుణ్యం తెలంగాణాది. దేశంలో ఏ మూలకు వెళ్లినా పాలమూరు నిర్మాణ నిపుణుల ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలంపూరు దేవాలయం నీట మునిగితే యథాతథం గా తరలించి మరో చోట మూల నిర్మాణానికి అంగుళం కూడా తేడా రాకుండా నిర్మించగలిగిన మేధ తెలంగాణాది. అగ్గిపెట్టెలో ఆరంగుళాల చీరను పట్టించిన నేతన్నలు పుట్టిన నేల ఇది... ఇవాళ ఆ నిర్మాణ నిపుణులంతా పొట్ట గడవక , బతుకు భారమై భారతదేశంలోని మూల మూలకు వెళ్లి రూపాయి యాచించుకోవలసిన దుస్థితిలో ఉన్నాడు. ఇక నేతన్నకు బతుకే హేయమై బలవంతంగా ఉసురు తీసుకుంటున్నాడు..
తెలంగాణా సంస్కృతిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినవి లలిత కళలు. అందులో నృత్యం ముఖ్యమైంది. ఇక్కడ ఓ విచిత్రం జరిగింది. తమిళనాడుకు భరత నాట్యం ఎలాగో , ఒరిస్సాకు ఒడిస్సీ ఎలాగో, కేరళకు కథాకళి ఎలాగో తెలుగు వారికి కూడా కూచిపూడి ఓ ప్రత్యేకమైన నృత్య సంప్రదాయమని, దాన్ని కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో సిద్దేంద్ర యోగి దాని రూపశిల్పి అని మనం అంతా గౌరవిస్తున్నాం.. ఆ నృత్యాన్ని ఆచరిస్తున్నాం. కానీ, ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలోనే కూచిపూడిపై వివాదం చెలరేగింది. తమ భరతనాట్యానికి కొంత నాటకీయత చేర్చి దాన్నే కూచిపూడిగా చెప్తున్నారని తమిళులు పెద్ద వివాదాన్ని రేపారు.. దీనిపై వాదోపవాదాలు తీవ్రంగానే జరిగాయి. ఇందులో వాస్తవం ఏమిటన్న లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయితే వివాదాలకు తావు లేని విధంగా, మనదైన, మనకు మాత్రమే పరిమితమైన, మనకు మాత్రమే ప్రత్యేకమైన నృత్య కళ తెలంగాణాలో వెయ్యేళ్ల క్రితమే ఆవిర్భవించింది. కాకతీయుల సేనానిగా ఉన్న జాయపసేనాని నృత్త రత్నావళి అన్న పేరుతో ఓ శాసా్తన్న్రే రచించాడు... దాని ఆధారంగానే రామప్పలో నృత్య భంగిమల్లో శిల్పాలు విలసిల్లాయి. పేరిణీ నృత్యం పుట్టింది. దీనిపై ఎలాంటి వివాదాలకు తావు లేదు. కానీ దీన్ని ఒక జానపద, గ్రామీణ నృత్యరీతి స్థాయికి దిగజార్చడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. దీన్ని తెలుగువారి నృత్యంగా, నృత్తరత్నావళిని తెలుగువారి నాట్యశాస్త్రం గా అంగీకరించే మనసు లేకుండా పోయింది.
తెలంగాణ సంస్కృతిలో మర్యాదలు, మన్ననలు విశిష్టంగా ఉంటాయి. కులభేదాలకు అతీతంగా ఉంటాయి. గ్రామానికి గ్రామాలు ఒక కుటుంబంగా ఉంటాయి. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, తమ్మలి, దళిత, బేగారె, నీరడి కులాలెన్నో తెలంగాణా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ల మధ్య అనూహ్యమైన అనుబంధాలు, బంధుత్వ పిలుపులు కనిపిస్తాయి. వినిపిస్తాయి. వారిలో ఒకరికి ఒకరు అన్న, మామ, బావ, వదిన, అక్క, ఇలా రకరకాల బంధాలు ప్రజల అనుబంధాలను పెనవేస్తాయి. ఇళ్లల్లో కూడా ఇదే రకమైన విధానం కనిపిస్తుంది. ``ఏందె నాయినా'' అని పిలవటంలో ఉండే ఆత్మీయత, నాన్నగారూ...వదినగారూ.. మరిదిగారూ.. అని పిలవటంలో ఉండదు. ఎవరినైనా ఆప్యాయంగా అక్కున చేర్చుకోవటంలో కానీ, సహాయపడటంలో కానీ, తెలంగాణా ప్రజలు ముందుంటారు.. ఈ గుణం తెలంగాణ ప్రజల్లో అధికంగా ఉంటుందని సుప్రసిద్ధ పరిశోధకులు బిఎన్‌ శాస్త్రి వ్యాఖ్యానించారు.. దీనికి కారణం భౌగోళిక పరిస్థితులేనని ఆయన అంటారు. ఒక ప్రదేశంలోని భౌగోళిక స్థితిగతులు అక్కడి సమాజంపైనా, వ్యక్తిగత జీవితంపైనా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. మైదాన ప్రాంతాల్లో జీవించే వారికి, పీఠ భూముల్లో నివసించే వారికి మధ్య అంతరం ఎంతో ఉంటుంది. మైదాన ప్రాంతాల వారు లౌక్యంగా వ్యవహరిస్తారు.. హుందాగా కనిపిస్తారు.. పీఠభూమి ప్రాంత వాసులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు.. సూటిగా ఉంటారు. తెలంగాణ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఎక్కువ . ఈ స్థితిలోనూ వర్షాధార సేద్యానికి అలవాటు పడ్డవాళు్ల కాబట్టే, తెలంగాణ ప్రజలు బుద్ధి కంటే ఎక్కువగా హృదయాన్ని అభిమానించారు. బుద్ధికి పదును పెట్టిన వారు, దానితో ఈ హృదయాన్ని ముక్కలు చేశారు..

మనుగడ కోసం పోరాటం అనే డార్విన్‌ సూత్రం తెలంగాణ జనజీవనంలో ప్రతి అడుగులో కనిపిస్తుంది. నిరంతర అణచివేత కుట్రల కారణంగానే తెలంగాణ ప్రజలు తెగింపును సాధించుకున్నారు. ప్రాచీన భారతంలో హర్హవర్థనుడు, మధ్యయుగంలో ఖిల్జీలు, తుగ్లక్‌లు, ఆ తరువాత బహుమనీలు, కుతుబుషాహీలు, అసఫ్‌ జాహీలు.. స్వాతంత్య్రం తరువాత ఇప్పటి పాలకవర్గం తెలంగాణాపై దండయాత్రకు వెళ్లారు.. ఎందుకంటే ఉత్తర దక్షిణ భారత దేశాలకు తెలంగాణ ప్రాంతం ఒక అనుబంధ సేతువు. ఇదొక వూ్యహాత్మక స్థావరం. దక్షిణ భారత దేశంలో పెత్తనం నిలుపుకోవ…ననికి ఇది కీలక స్థావరం. అందుకే నిరంతర యుద్ధాలతో, పోరాటాలతో తెలంగాణా రణస్థలికి పర్యాయపదంగా మారిపోయింది. నాడు పోరాట బాటలో నడిచిన రాజులు వారి సిపాయిల కోసం నల్లగొండ, దేవరకొండ, వేల్పుగొండ, కొయ్యలకొండ, ఉండ్రకొండ, కవులాస్‌, రాచకొండ, మెదక్‌ మానుగల్లు, గోలకొండ, ఖమ్మం వంటి చోట్ల దుర్గాలు నిర్మించుకున్నారు.. మరి ఈనాడు పోరాట బాట పట్టిన వారికి ఆయుధాలు లేవు. అహింసతోనే అడుగులు ముందుకు కదులుతున్నాయి. వీరికి దుర్గాలు వేరే అక్కర లేదు. లక్ష్యం సాధించేవరకూ ఈ ఉద్యమకారుల కాళ్లకు అలుపు ఉండదు.. వీరికి వెన్నూ దన్నూ నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమే.

13 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Adbhutam ga vivarinchru, nijanga paristutulanu kallku kattinattuga vivarincharu. Ingitagnanan unna evarikayina ee vishayam ardham avutunnadi.

అజ్ఞాత చెప్పారు...

మీ ఏరియా ఫీలింగ్ చాలా గొప్పది. So typical of all Telangana bigots. తెలంగాణవారికున్నంత సంకుచిత ఏరియా ఫీలింగ్ నేను ఎక్కడా చూడలేదు. మీరేమో "వారు అందఱినీ ఆదరిస్తారు. అక్కున చేర్చుకుంటారు అని చాలా చాలా గొప్పలు చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రాంతీయుల పట్ల ద్వేషం కూడా ఎక్కువే కనిపిస్తున్నది. ఒకపక్క "మాది స్వచ్ఛమైన తెలుగు" అని చెబుతూ మఱోపక్క ఇతరతెలుగుప్రాంతాల కవుల్నీ, కళాకారుల్నీ హీనపఱచడానికి మీరు వెనుకాడ్డం లేదు. మీరు తెలంగాణ గుఱించి ఎన్ని గొప్పలు చెప్పినా అవన్నీ ప్రాచీనకాలానికి చెందినవే తప్ప ఇటీవలి చరిత్ర ఆట్టే ఉజ్జ్వలమైనది కాదని మీకూ తెలుసు, మాకూ తెలుసు. చూడబోతే, మీరు ఆంధ్రప్రాంతం పట్ల చాలా అపోహలు కలిగి ఉన్నారు. కొంతకాలం మీరు ఆంధ్రా ఏరియాలో నివసిస్తే వారి మంచితనాన్ని, గొప్పతనాన్నీ గ్రహించగలుగుతారు.

Srinivas చెప్పారు...

Honestly, I have some respect with your support for Telengana.Now you are trying to say something different by spitting venom on Andhra people. Thats not correct. I don't live in India now. I see lot of people celebrating Bathukamma in USA. If you are not sure about it, please don't write such things.

kovela santosh kumar చెప్పారు...

mr.lbs.. ji...
telangana variki sankuchitamaina
feelings unte.. ikkada parsilu vache vallu karu..arabbulu undevaru karu.. iranianlu.. itara aneka prantalato idi mamekam ayi undedi kadu.. ika andhra pranta sahityakaarulaku avamanam jaragaledu.. vaarini nethina pettukunnaru telangana vaalu.. gurajaada, veeresalingam, kuchipudi la vishayamlo vivadam regindanna prastavana tappa vallanu vyatirekinchaledu..vishayam cheppataniki vidveshinchataniki teda undi.. vaallanta mahaanubhavule.. ade samayam lo ikkadi mahanubhavulanu kaavaalani ignore chesarane telangana vaalla bhadha.
ika itivali kaalam lo telangana anta ujjvalamga ledani angikarincharu.. santosham. telanganaa vaallu modati nunchi mothukuntunnadi kuda ade.. nati ujjvalata anta emaindi.. ela nasanamaindane prashnistunnaru... meeru oppukunnaru. dhanyadalu..
srinivaas gaariki.. bathukamma nu usalo celbrate cheyatam ledani nenu analedu.. kalisi undamanukone sodarulu telangana pandugalanu tamaviga adopt chesukoleka poyaarani anna... meeru daanni dayachesi vakrikarncharemo.. alochinchandani manavi

అజ్ఞాత చెప్పారు...

when you go back to kakateeya days, T is not just your 10 districts. Many other A & R places are collated as Kakatiya kingdom.

your T problem is that, you have been raped by Nizams during the 1800s & 1900s. Because of which, you did not have great "modern" telugu poets. That is why gurajada & kandukuri have lived thru T.

A & R did not try to suprress your batukamma/bonalu. if you read your history, Nizam suppressed it. he made your sisters play nude batukamma.

parsilu are there wherever they can go. not just T

arabbulu: mana bokkaliraggotti, they invaded all over India

masi poosi maaredu kaaya chesinattu, now dont claim that it is your T magnanimity to accept gurajada etc.

m.lakshminarayana చెప్పారు...

సంతోష్‌ కుమార్‌ గారూ మంచి విశ్లేషణ.. చాలా విషయాలు చెప్పారు కానీ, ఇంకా మీరు ప్రస్తావించని అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి. నాకు తెలిసిన మరి కొన్ని విషయాలు నేను చెప్తాను.. దీనిపైనా పైన కామెంట్‌ చేసినట్లుగానే కొందరు అజ్ఞాతలు అజ్ఞానంతో కువిమర్శలైతే చేయవచ్చు. వాళ్లు వాస్తవాలు అంగీకరించే పరిస్థితిలో లేరు.. దాష్టీకంతో తాము అనుకున్నది సాధించుకోదలచుకున్నారు...
వీళ్లు మామూలోళ్లు కారు సార్‌..... శ్రీశ్రీ గురజాడల గురించి గొప్పలు చెప్పుకుంటారు.. అఫ్‌కోర్స్‌ మీరు కూడా గురజాడను గొప్పవాడన్న సెన్స్‌లో కామెంట్లో రాశారనుకోండి.. కానీ, గురజాడ ఎలాంటి కవి అయితేమాత్రమేం.. ఈ దేశాన్ని దోచుకోవటానికి వచ్చిన బ్రిటిష్‌ వారిని, వారి పాలనను మెచ్చుకుంటూ, వారికి అవసరమైన సైనిక సహాయాన్ని కూడా ఇస్తామని లేఖ రాసిన మహానుభావుడు.. ఆంగిలేయుల ధర్మరాజ్యము వర్థిల్లాలంటూ తెగ పొగిడినవాడు.. ఇక శ్రీశ్రీ - చైనా ఈ దేశం మీద దండెత్తితే, ఎర్రకోటపై చైనా ఎర్రజెండా ఎగరాలంటూ కవిత్వాలు రాసుకున్నవాడు.. ఇలాంటి వాళ్లను.. దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను వీళ్లు నెత్తిన పెట్టుకుంటారు.. వీళ్లు సామరస్యం గురించి మాట్లాడతారు.. ఇంతెందుకు.. వీళ్ల ప్రాంతం నుంచి వచ్చిన వాడే కదా.. కవిసమ్రాట్‌ విశ్వనాథ.. భారత దేశపు వందేళ్ల భవిష్యత్తును ఎంతో ముందుగానే దర్శించిన మహానుభావుడే.. ప్రపంచ సాహిత్యంలో తెలుగు సారస్వతాన్ని తలమానికంగా నిలిపిన మహాకవి, తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆయన్ను, ఆయన సాహిత్యాన్ని సైతం అణచివేసేందుకు తెగ ప్రయత్నించారు. కనీసం ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా వీరికి సమ్మతం కాలేదు... వీళ్ల బుద్ధులు ఏమిటో ఇక్కడే తెలుస్తోంది. చివరకు విశ్వనాథ సాహిత్యాన్ని ఓ తెలంగాణ పెద్దమనిషే ఓ సాహిత్యపీఠాన్ని ఏర్పాటు చేసుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.. తెలంగాణ వాళ్లు అందరినీ ఆదరిస్తారనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? tobe continued

m.lakshminarayana చెప్పారు...

వీళ్ల కుయుక్తులు అన్నీ ఇన్నీ కారు.. ఆరుద్ర వేదంలా ఘోషించే గోదావరి అని రాశారు.. అందులో రాజరాజ నరేంద్రుడు కాకతీయులు అని కలిపేసుకున్నారు.. వీళ్ల ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదా? కాకతీయులు తమ ప్రాంతం వారని దుష్ప్రచారం చేసుకునే దుర్బుద్ది కాకపోతే మరేమిటి? అది పూర్తిగా రాజమహేంద్రవరానికి సంబంధించిన పాట. అక్కడికి ఓరుగల్లు రాజధానిగా పాలించిన కాకతీయులు ఎక్కడి నుంచి వచ్చారు...రాజులంతా తమవాళ్లే అనుకున్నప్పుడు శాతవాహనులు.. విష్ణు కుండినులను కూడా కలుపుకుంటే పోయేది.. అంతా రాజమండ్రి వాళ్లే అని చెప్పేసుకుంటే సరిపోయేది...
సరే ఈ అజ్ఞాత కొన్నికథలు చెప్పాడు.. కాకతీయుల కాలంలో తెలంగాణతో పాటు మిగతా జిల్లాలు కూడా ఉండేవన్నారు.. ఇందులో విభేదించింది ఎవరు? ఆనాడు తెలుగు సంస్కృతి ఓరుగల్లు కేంద్రంగా మిగతా ప్రాంతాలకు విస్తరించింది. అంతే కానీ అటు నుంచి ఇటు ప్రసారం కాలేదు. తిక్కన మహాభారతం రాయటానికి ప్రోత్సహించింది కాకతి గణపతి దేవుడే తప్ప వాళ్లు కారు.. నన్నయ్య రెండున్నర పర్వాలు, ఎర్రన అరపర్వం రాశాడు కానీ, మిగతా పదిహేను పర్వాలూ గణపతి దేవుని ప్రోత్సాహం వల్లనే లభించిందన్న వాస్తవం కూడా వాళ్లకు తెలియదు..మొండిగా వాదించటం ఒక్కటే వాళ్లకు తెలిసింది. ఎదుటివాళ్లను తిట్టడం మాత్రమే వారికి తెలుసు. గట్టిగా అరవటం ద్వారా ఎదుటివాళ్ల నోళ్లు మూస్తూ ఇంతకాలం గడిపారు.. ఇకపై అలా సాగదు.. బతుకమ్మ, బోనాలు పండుగలను ఆంధ్రులు అణచివేశారని ఎవరన్నారు.. వాటిని చిన్నచూపు చూశారన్నారు. వాటిని పండుగలే కాదని ఈసడించారన్నారు.. ఒకే జాతి, ఒకే భాష అనే వాళ్లు కనీసం వీటిని తమవిగా అడాప్ట్‌ చేసుకోలేదన్నారు.. తిక్కలోళ్లకేం తెలుసన్నా... రాసిందేదో కూడా అర్థం చదువుకోకుండా అడ్డగోలుగా కామెంట్లు చేయటం వాళ్లకు అలవాటే కదా..పార్సీలు తెలంగాణలో ఉన్నారు అంటే మిగతా ప్రాంతాల్లో లేరనా అర్థం.. ఇదేదో రాజుగారి మొదటి భార్య పతివ్రత అన్నట్లుంది... ఎవరెన్ని మాట్లాడినా చరిత్రను మార్చలేరు కదా..
జై తెలంగాణ

అజ్ఞాత చెప్పారు...

అన్నా లచ్చన్నా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నా!

మన తెలంగాణా కి మాంఛి సపోర్టు ఇస్తున్న ఆన్నలందరూ చైనా/రష్యా చంక నాకుతుంటారన్నా!

m.lakshminarayana చెప్పారు...

ఓయి వెర్రి నాగన్నా.. నీ పేరు తెలియదు.. నువ్వు చెప్పవు.. నీకు కొంచెం అతి తెలివి ఉందని అర్థమవుతూనే ఉంది. తెలంగాణాను సపోర్ట్‌ చేస్తున్న అన్నలు చైనారష్యాల చంకలు నాకితే మాకేం.. మేమేం మీలాగా వాళ్లను బుజాన పెట్టుకొని మోయటం లేదు.. దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పని చేసిన వాళ్లను చంకల్లో పెట్టుకుని తిరగటం మీకు మాత్రమే సాధ్యం. నిజమే.. కడుపు చించుకుంటే కాళ్లమీదే పడుతుంది మరి..

అజ్ఞాత చెప్పారు...

లచ్చన్నా,

నువ్వు బురదలో పడి, దానికి కారణం అటుగా పోతూ కనిపించిన ఆంధ్రొడే అనుకొవడం, అవివేకం.

ఎదుటొడ్ని ఎదవ అని తిట్టే ముందు, మనం ఎంత ఎదవలమో ఆలొచించుకోక పోవడం; తెలివితక్కువతనం

గురువింద గింజ లాగ ఆంధ్రోల్లు/శ్రీశ్రీ గురించి రాసేముందు, ఆ శ్రీశ్రీ - విరసం - వరవర రావు - గద్దర్, తెలంగాణా ఉద్యమం లో వాల్లని మీరంత చంకమెక్కించుకున్న విషయం మరవటం, నీ బుర్ర లేని తనానికి నిదర్శనం.


నీ వెర్రి నాగన్న.

m.lakshminarayana చెప్పారు...

వెర్రి నాగన్నా నీకు ఈ పేరు బాగుందన్నా.. నేను అన్న మాటే నువ్వూ అంటే ఎలా. వరవర రావు గద్దర్ లు నక్సల్ సానుభుతిపరులే అన్న విషయాన్ని నువ్వు గుర్తించినట్లు లేదు..విచిత్రమేమంటే.. గురివింద గింజ ఎవరన్నదీ నీకు అర్థం కావటం లేదు.. సరిగ్గా విమర్శించటమే చేత కావటం లేదు.. నేను బురదలో పడలేదు.. నువ్వు తోసావు.. ఇంతకాలం పైన ఉండి తమాషా చూశావు.. ఇప్పుడు నేను పైకి వచ్చి నిన్ను నిలదీస్తుంటే తట్టుకోలేక నానా అవస్థ పడుతున్నావు.. జవాబు చెప్పలేకే అడ్డగోలుగా మాట్లాడుతున్నావ్..పాపం.. ఐ పిటి యు

అజ్ఞాత చెప్పారు...

lacchanna:

lack of coherence in your argument (and that of the author of this blog) are the prime reasons of why you did not get T till now, and why you will not get it in future too.

if you realize that, you will atleast will come out of your self deceit.

you claim that the A&R poets are traitors & A&R people are praising those poets. When I pointed out that it is the same with T poets & T ppl, you are distancing your self from that.

grow up. or else, you continue to waste your time in this T nuisance.

I decided not to waste my time in writing on this blog.

m.lakshminarayana చెప్పారు...

anjnata garu.. this is not lack of coherence..telangna comes or not.. we are not the competant authority to decide that..the fact is you are not ready to agrree such things.. which are only truth. maoists defenetly there in telangan forests.. that is not mean that telangana entire region is supporting them. when a person went in wrong way..and make wrong statements or creations, telangana people distance them self from those people. who ever be there.. wheather he rayaprolu or chennareddy or kcr.. and who ever.. although they have tobe a great poets or great leaders,we never forgive them. telangana is not nuisance.. it is telangana people's fight for living right. if you think one secon as positive.. then you will come out from illusion. thank you for great conversation with you.