12, జూన్ 2010, శనివారం

నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

పేరు సోషల్‌ సర్వీస్‌...
జంతువుల పరిరక్షణే ధ్యేయం..
పర్యావరణాన్ని రక్షించటమే తపన..
ప్రపంచశాంతి కోసం తెగ „పడి చస్తారు..
నిరసనల కోసం వలువలు విడుస్తారు..
నగ్నంగా ఆందోళనలు.. సమాజానికి సందేశాలు..
లాభసాటి వ్యాపారంగా సమాజ సేవ..
అంగడి సరుకు న్యూడిటీ..
పాపులారిటీ కోసం చీప్‌ ట్రిక్‌‌స
నిరసనలకు న్యూడిటీ అవసరమా?
నగ్న సత్యం అంటే నగ్నంగా చెప్పటమా?

ప్రపంచంలో అదో గొప్ప సంస్థ..పాపులారిటీలో దానికి సాటి లేదు.. యాడ్‌ కాంపెయిన్‌లో ఆ సంస్థ సిబ్బందిలో ఉన్న క్రియేటివిటీ అబ్బో ఎక్కడా కనిపించదు.. ఈ సంస్థ ఓ ఉద్యమ సంస్థ. అది చేసే ఉద్యమం సాదా సీదా ఉద్యమం కాదు.. ప్రపంచంలోని మనుషులందరినీ జంతు ప్రేమికులుగా మార్చేయటం.. అంతే కాదు.. వెజిటేరియన్‌లుగా మార్చేయటం.. ఇందుకోసం వారిలో చైతన్యం తీసుకురావటం కోసం ప్రచారం చేస్తుంటుంది..
దాని పేరు పెటా... పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్‌‌స...
అమెరికా లో జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న ఓ సంస్థ..
పేరులో గొప్ప ఆశయం?
జంతువుల సంరక్షణ ధ్యేయం..
వాటిని ఉద్ధరించటమే పరమావధి..
జంతు సంరక్షణ గురించి ప్రపంచానికి సందేశాన్ని అందించటం,
ప్రజలను జంతు ప్రేమికులుగా మార్చటం అ సంస్థ టార్గెట్‌..
ఓకే.. జంతువులను ప్రేమించటాన్ని ఎవరు మాత్రం కాదంటారు? జంతువులను కాపాడటం.. వారి యోగక్షేమాలను చూసుకోవటంపై ఎవరికి మాత్రం ఏం అభ్యంతరం? జంతు సంరక్షణ కోసం ప్రచారం చేయటమూ గొప్ప సంగతే... కానీ, పెటా ఇందుకోసం ఏం చేస్తుందో తెలుసా? దాని రూటే సపరేటు మరి..
జంతువుల పరిరక్షణ కోసం ప్రచారానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, పెటా మాత్రం అందుకు భిన్నంగా న్యూడిటీని ఎంచుకుంది. గొర్రెలను కాపాడాలంటూ ఓ నగ్న సుందరాంగి చేతిలో గొర్రెపిల్లను పెట్టి ఫోటో షూట్‌ చేస్తారు..
కోడిపిల్లలను కాపాడాలన్న ప్రకటనకు కూడా వలువలు లేని భామలే వారికి కావాలి..
జంతు చర్మాలతో తయారు చేసిన బట్టల వేసుకోవటం కంటే అసలు బట్టలే వేసుకోకుండా ఉండేందుకు ఇష్టపడతామంటూ నగ్న సుందరులను నిలబెడతారు..
ఈ సంస్థ తన ప్రచారాన్ని ఇంతటితో ఆపలేదు.. మనుషులంతా వెజిటేరియన్లుగా మారాలంటూ తెగ ఆరాటపడుతుంది.. దీనికి సంబంధించిన ప్రచారం విషయంలో పెటా మెంబర్లు కెమెరాకు ఇచ్చే పోజులే వేరు..
బాడీ పెయింటింగ్‌ వేసుకుంటారు.. రకరకాల వేషాలు వేసుకుంటారు.. ఆకులు కట్టుకుంటారు.. మాస్కులు వేసుకుంటారు.. అసలేమీ లేకుండా అడ్డగోలుగా ఫోటోషూట్‌లు చేసేసి ప్రపంచం మీదకు వదిలేస్తారు.. ఇంకేం ప్రచారానికి ప్రచారం... పాపులారిటీకి పాపులారిటీ...
2
వాళు్ల చేసేది సోషల్‌ సర్వీస్‌... ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై వాళు్ల ఉద్యమిస్తారు.. ఆందోళనలు చేస్తారు.. నిరసనలు వ్యక్తం చేస్తారు.. పక్కా ప్రొఫెషనల్‌‌స... కాకపోతే వాళ్ల ఆందోళనలు వినూత్నంగా ఉంటాయి.. క్షణాల్లో ప్రపంచమంతటా పాపులర్‌ అవుతాయి.. ఎందుకింత పాపులారిటీ వస్తుంది? అందులోనే ట్విస్‌‌ట ఉంది..
కొన్నాళు్లగా ప్రపంచంలో తీవ్రవాదుల మారణకాండ, మావోయిస్టుల హింసాకాండ, ఆకలి చావులు, జాతి వివక్షలు.. యుద్ధోన్మాదంతో ఊగిపోతున్న దేశాలు..ఈ ఉద్రిక్త వాతావరణంలో ప్రపంచ శాంతి సాధన కోసం ఆందోళన చెందుతున్న వారు ఎందరో ఉన్నారు.. కానీ, అదే ప్రపంచ శాంతిని కోరుకుంటున్న మరో జాతి ఉంది.. అందుకోసం ఆ జాతి చేసే ఫీట్లు స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంటాయి... ఈ ఆందోళనకారులు ఉద్యమించిన తీరును చూడండి...ప్రపంచ శాంతి కావాలంటే ప్లకార్డులు పట్టుకుని నగ్నంగా ప్రదర్శనలు చేయాలి... రకరకాల విన్యాసాలు చేయాలి.. ఇంగ్లీషు అక్షరాల ఆకారాల్లో పోజులివ్వాలి.. వావ్‌.. వీళ్లకు ఇంతకంటే మంచి ఆలోచన రాలేదు..
ప్రపంచ శాంతికి, నగ్న ప్రదర్శనకు లింకేమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు..ఇలా చేస్తేనే శాంతి సాధ్యమని ఎవరి మెదడుకు తోచిందో కానీ, వారికి జోహారు.. కానీ, శాంతి కోసం వీళు్ల తెగ ఆరాటపడిపోతున్నారన్న పాపులారిటీ క్షణాల్లో విశ్వవ్యాప్తంగా వచ్చేస్తుంది..
ఇంతేనా.. మరో ప్రదర్శన ఉంది.. అది భూగోళాన్నే రక్షించటం కోసం.. గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటూ ఆడా మగా కలిసి చల్లని మంచు ప్రదేశంలో నగ్నంగా ప్రదర్శన చేస్తారు.. దాన్ని ఫోటోలు తీసేసి ప్రచారం చేసేసుకుంటారు..
ఇక్కడితోనూ తృప్తి పడలేదు, నగ్నప్రియులు.. సందర్భం, సమయోచితం, విలువలు అన్న తేడా లేకుండా, ఇషూ్య ఏదైనా సరే, న్యూడ్‌గా పోజులివ్వటానికి ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తారు.. ఇదిగో బుల్‌ఫైట్‌ను నిషేధించాలంటూ ప్రదర్శన చేయటం ఇలాంటిదే...
నిస్సిగ్గుగా వీళు్ల చేసే ప్రదర్శనలకు, నిరసనలకూ అక్కడి సమాజాలూ అంగీకరిస్తాయి.. ప్రభుత్వాలూ పట్టించుకోవు.. నిర్వాహకులకు మాత్రం వారు చేసే ఈ సోషల్‌ సర్వీస్‌కు స్పాన్సరర్ల రూపంలో కాసులు మాత్రం సూపర్‌గా వచ్చిపడతాయి..
3
కాదేదీ వ్యాపారానికి అనర్హం.. కాసిన్ని సొము్మలు వచ్చి పడతాయంటే చాలు.. దేనికైనా బరితెగించే లోకంలో ఉన్నాం మనం.. డబ్బులతోనే అన్ని వ్యవహారాలు.. కాకపోతే ముసుగులే వేరు.. ఒకరు వ్యాపారం కోసం న్యూడిటీని అంగట్లో పెట్టి అము్మకుంటున్నారు.. మరొకరు సర్వీస్‌ ముసుగు వేసుకుని వ్యభిచారం చేస్తారు..

చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి వెకిలి చేష్టలు.. వీళ్ల పోస్టర్లపై చెప్పే మాటలు.. చేసే నినాదాలు.. ప్రతి మనిషికీ ఆదర్శంగా ఉంటాయి.. చూపించే బొమ్మలు మాత్రం జుగుప్స కలిగిస్తాయి.. గ్లోబల్‌ వార్మింగ్‌ కోసం, బుల్‌ఫైట్లను నిషేధించటం కోసం,
జంతు సంరక్షణ కోసం..విజిటేరియన్లుగా మార్చేయటం కోసం.. న్యూడిటీ అవసరమా? వలువలు లేని మనుషులతో ప్రచారం చేస్తే తప్ప ప్రపంచానికి సందేశం ఇచ్చే మార్గం ఇంకోటి లేదా?
వీళ్లంతా ఎందుకు న్యూడిటీనే ఆశ్రయిస్తున్నారు? వీళ్ల ప్రచారం కేవలం అడల్‌‌ట కోసమే కాదు కదా...జంతువుల సంరక్షణ గురించి, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి, విజిటేరియనిజం గురించి చిన్న పిల్లలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదా? లేక పిల్లలకు సైతం ఇలాంటి పోస్టర్లను, ప్రదర్శనలను చూపించటం వల్ల నష్టం లేదని వీళు్ల భావిస్తున్నారా?
టూమచ్‌ సెక్‌‌స ఆరోగ్యానికి హానికరం అని కూడా వీళు్ల తెగ ప్రచారం చేసేస్తుంటారు.. మరి వీళ్ల పోస్టర్లు దేనికి సంకేతాలు..? దేనికి ఉత్ప్రేరకాలు..?
తక్కువ డబ్బులకు ఎక్కువ అందాలు ఆరబోసే వాళ్లను తీసుకొచ్చి ఇలాంటి ఫోటోషూట్‌లు, ప్రదర్శనలు చేయిస్తారు... వీరికి చేంతాడంత స్పాన్సరర్ల లిస్‌‌ట ఉంటుంది.. పేరుకు చేసేది సేవ.. స్పాన్సరర్ల ద్వారా వచ్చేది సంపాదన... అది పెటా గానీ, మరేదైనా సంస్థ కానీ.. ఎవరైనా ఇంతే.. అందినకాడికి అందినంత దోచుకోవటమే వారికి కావలసింది.. చేసేదంతా వ్యాపారం.. పక్కా వ్యాపారం... చూపేది సర్వీస్‌.. సోషల్‌ సర్వీస్‌... కాదు కాదు.. న్యూడ్‌ సర్వీస్‌.. ఇప్పటికే జనం పర్వర్‌‌ట అయ్యే పరిస్థితి.. సర్వీసు చేయాలనుకుంటే దాని పద్ధతిలో అది చేయాలి.. కానీ, పాపులారిటీ కోసం న్యూడ్‌ ట్రిక్‌‌స ప్లే చేయటం దారుణం.. ఇప్పుడిప్పుడే ఇండియాలోకీ ఇది పాకింది.. షెర్లిన్‌ చోప్రా, నేహా దూఫియా వంటి వారు పాపులారిటీ కోసం దేనికైనా సిద్ధమేనని ప్రకటించేశారు.. న్యూడిటీయే అందమని, అదే గ్లామరనీ కూడా ప్రకటించారు.. దీన్ని విపరీత పోకడలంటే కొందరికి కోపం రావచ్చు... కానీ, ఇండియాలో.. ఇంతగా బరితెగించిన వాతావరణంలోనూ ఎక్కడో ఒక చోట కొంతైనా విలువలంటూ మిగిలి ఉన్నాయి. అందుకే ఈ దేశాన్ని, ఇక్కడి జన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటున్న వాళు్ల ఇంకా ఉన్నారు.. కాస్తో కూస్తో మిగిలి ఉన్న ఈ కాస్త విలువల వలువలు విప్పకుండా ఉంటే అదే పదివేలు.

కామెంట్‌లు లేవు: