ప్లాస్టిక్ బాంబ్.. మీ పర్సులోనే ఉంది.. మీతో పాటు.. మీ వెంటనే నీడలా వస్తోంది.. తేనె పూసిన కత్తి లాంటిది.. మీకు తెలియకుండానే మీ గొంతు కోసేందుకు సిద్ధంగా ఉంది. మీకది ఓ సౌకర్యంగా కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ఉపకరణంగా అగుపిస్తోంది.. మీ పాలిట అది ప్లాస్టిక్ మనీ.. కానీ, మీకే తెలియని ప్లాస్టిక్ బాంబ్....
ఏమిటీ గోల..? ఎందుకింత భయపడాలి..? ప్లాస్టిక్ బాంబ్ అంటే ఏమిటి? అది జేబులో ఉండటం ఏమిటి? ఆశ్చర్యం వద్దు.. విస్మయం అంతకంటే వద్దు.. మీ పర్సులో ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులే బాంబు ఘంటికలు మోగిస్తున్నాయి.. మీకే తెలియని కాస్తంత నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారి తీస్తోంది..
క్రెడిట్ కార్డు.. ఇవాళ ఓ ఫ్యాషన్... ఓ స్టేటస్ సింబల్.. ఓ సరదా.. పర్సులో డబ్బులు పెట్టుకుని వెళ్లటం నామోషీ.. హోటల్లోనో, పబ్బుల్లోనో, షాపింగ్‌లోనో సెユ్టల్‌గా పర్స్ నుంచి కార్డు ఇచ్చి బిల్లు పే చేయటం స్టేటస్.. ఇవాళ్టి కల్చరే అది.. నోట్ల కట్టలు జేబులో పెట్టుకుని తిరగటం కంటే సింపుల్‌గా ఓ కార్డు పట్టుకుని వెళ్లటం సుఖం...
కార్డు ఉండటం అవసరమే కావచ్చు. ఇవాళ అది సహజమై ఉండవచ్చు. కానీ, కార్డు ఉంటే మీ డబ్బు సేఫ్‌గా ఉన్నట్లేనా? జస్ట్ థింక్ ఎబౌట్ ఇట్.. ఇంట్లో కంటే బ్యాంకులో డబ్బులు దాచుకోవటం ఒకప్పుడు చాలా సురక్షితం.. ఇప్పుడు కూడా అంతేనా? బ్యాంకులో సొమ్ములు ఎంత భద్రంగా ఉంటున్నాయి..?
లేదు.. మీ సొమ్ముల కోసం ఎవరో కాచుకుని ఉన్నారు.. ఎల్లవేళలా డబ్బులు అందుబాటులో ఉంచే సౌకర్యం కల్పించటం కోసం మీ సొమ్ముల్ని తమ దగ్గరుంచుకుని, వాటికి బదులుగా మీ జేబులోకి బదిలీ చేసిన ప్లాస్టిక్ మనీ.. అదే. బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్, డెబిట్ కార్డులు ఇప్పుడు మీ ఆర్థిక నిర్వహణతో చెలగాటమాడుతున్నాయి..మీకు తెలియకుండానే మీ కార్డు మీ చెంతనే ఉంటుంది.. మీకు తెలియకుండా దాని డేటా మరొకరి చేతిలోకీ వెళ్తుంది..
అదెలా సాధ్యం? కార్డు జేబులోనే ఉంది.. సీక్రెట్ పిన్ నెంబర్ ఉంది.. వెనుక మూడు నెంబర్ల సీక్రెట్ కోడ్ కూడా ఉంది.. గ్రిడ్ ఉంది.. ఇన్ని రకాల చెక్ అవుట్ ఉండి కూడా కార్డును చోరీ అదే డేటాను చోరీ చేయటం ఎలా వీలవుతుంది? ఈజిట్ పాజిబుల్.. ఎస్..ఇటీజ్ పాజిబుల్..
కార్డులోని డేటాను చోరీ చేయటం ఏ విధంగా కుదురుతుంది.. ఒకవేళ నెంబర్ చోరీ అయినా, పిన్ నెంబర్ ఉంటుంది కదా.. కానీ, అదే పొరపాటు.. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయితే.. దొంగలకు దొంగతనాలు చేయటం అంత ఈజీ అవుతుంది.. టెక్నాలజీ అనేది వాళ్లు ఉపయోగించినంతగా ఎవరూ ఉపయోగించుకోలేరు..
మీ క్రెడిట్ కార్డులు క్లోనింగ్ అవుతున్నాయి. మీ చేతులతో మీరు స్వయంగా ఇచ్చిన కార్డులతోనే దర్జాగా క్లోనింగ్ ప్రక్రియ సాగిపోతోంది.. ఇప్పటిదాకా ఎక్కడో అమెరికాకే పరిమితమైన ఈ క్లోనింగ్ టెక్నాలజీ ఇప్పుడు మన దేశాన్ని కుదిపేస్తోంది...
పెద్ద ఫ్యాక్టరీ, భారీ యంత్రసామాగ్రి దగ్గరకు మన క్రెడిట్ కార్డు ఎలా వెళ్లింది.. ? అదే విచిత్రం.. మీ కార్డును అదే.... నమూనాను మీరే అందించారు.. ఎలాగంటారా? సింపుల్.. మీరు హోటల్‌కు వెళ్లినప్పుడు, పబ్‌కు వెళ్లినప్పుడు బిల్ పే చేసేందుకు బేరర్‌కు కార్డు ఇస్తారే.. అదిగో అక్కడే ట్విస్ట్ ఉంది.. మీ కార్డు బిల్లు కోసమే కాదు.. మరో దానికోసమూ స్వాప్ అయిపోతుంది.. స్కిమ్మర్ మీ కార్డులోని డేటాను ఒకే ఒక్క సెకన్‌లో కొట్టేస్తుంది.
చేతిలో పట్టే చిన్న మిషన్.. అరచేతిలో పట్టుకుంటే కనీసం కనిపించనైనా కనిపించని యంత్రం.. మోసం చేయాలనుకునే వారు ఎవరైనా సరే శరీరంలో ఎక్కడైనా దాచుకోవచ్చు. ఎదుటి వాళ్ల నుంచి ఒక్క క్షణం కార్డు చేతిలోకి వస్తే.. మరుక్షణంలో స్వాప్ చేసేయవచ్చు.. అంతే సంగతులు.. మీ కార్డు క్లోనింగ్ అయిపోయినట్లే..స్వాప్ చేసిన స్కిమ్మర్ నుంచి కార్డులోని డేటాను ఎంత సింపుల్‌గా క్లోన్ చేయవచ్చో చూడండి..
బయట షాపింగ్‌లోనో, హోటళ్లలోనో, ఇతర పబ్బుల్లోనో క్రెడిట్ కార్డులను స్వాప్ చేస్తే అవి క్లోనింగ్ అవుతాయి... ఇంతటితో అయిపోయిందా? లేదు... మీ కార్డు చోరీ కావటానికి సవాలక్ష అవకాశాలు పొంచి ఉన్నాయి..
అవసరానికి డబ్బులు డ్రా చేయటానికి ఇప్పుడు ఎటిఎం చాలా కీలకమైన సౌకర్యం... కానీ, ఇప్పుడు అదే ఏటిఎం మన కొంపలార్చటానికి సిద్ధంగా ఉంది.. డబ్బులు డ్రా చేసుకోవటానికి ఎటిఎం సెంటర్‌కు వెళ్లితే అక్కడా ప్రమాదం రెడీగా ఉంటుంది.. ఏటిఎంలో మీ కార్డు యాక్సెస్ చేసే ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా దొంగ చిన్ని బాక్స్‌ను ఫిక్స్ చేసేయవచ్చు. ఓ గంట తరువాత తీరిగ్గా వచ్చి దాన్ని తీసుకుని వెళ్లిపోవచ్చు. కార్డ్ యాక్సెస్ ప్రాంతంలో మరో బాక్స్ ఉన్న సంగతి కూడా గుర్తించటం వీలు కాదు..
అంతే కాదు.. బ్రోచర్స్ బాక్స్‌లో సీక్రెట్ కెమెరాను ఉంచి దాని ద్వారానూ డేటాను సంపాదించేయవచ్చు..
ఒకటా, రెండా.. మీ కార్డు మీదగ్గరే ఉంచి డేటా దొంగిలించటానికి ఎన్ని అవకాశాలో... ఈ టెక్నాలజీని నిర్వీర్యం చేయటం పోలీసులకు సవాలుగా మారింది.. వీటి నుంచి తప్పించుకోవాలంటే కార్డు విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం తప్ప ప్రత్యామ్నాయం లేదు..
టెక్నాలజీ అంటారు.. ప్రపంచం ఓ కుగ్రామం అంటారు.. క్షణాల్లో కమ్యునికేషన్ చేర్చవచ్చంటారు.. కానీ, దేనికీ భద్రత లేదు.. ఎక్కడా ప్రెユవసీ లేదు..మరి టెక్నాలజీ వల్ల ఎవరికి ప్రయోజనం?
కార్డులు కొంప ముంచుతున్నాయి. ఫోన్లు ప్రెユవసీని కాజేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోకి వెళ్దామంటే ఫిషింగ్ సిస్టమ్ వచ్చేసింది.. బ్యాంకుల వెబ్‌సైట్లను కూడా క్లోన్ చేసే వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. మన బ్యాంకు వెబ్‌సైట్‌లాగే ఉంటుంది.. కానీ, సదరు బ్యాంకు సైట్ కాదు.. అక్కడ ఐడి, పాస్‌వర్డ్ కొట్టారో ఇక అంతే..
అందుకే ముందు జాగ్రత్త పడటం చాలా మంచిదని సైబర్ క్రెユం పోలీసులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
షాపులలో, హోటళ్లలో, పబ్‌లలో బిల్ పే చేసేందుకు కార్డులను ఎవరికీ ఇవ్వవద్దు.. మీ కళ్ల ముందే కార్డును స్వైప్ చేయించండి.. సంతకం చేయండి.. ఏదైనా అనుమానం వస్తే వెంటనే కస్టమర్‌కేర్‌ను సంప్రతించండి..
ఏటిఎంలో డబ్బులు డ్రా చేసే ముందు అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా అని పరికించండి.. ఏటిఎం కీపాడ్‌కు చుట్టుపక్కల వస్తువులను జాగ్రత్తగా చూసి డ్రా చేయండి..
కాల్‌సెంటర్ల నుంచి అపరిచిత కాల్స్‌ను అటెండ్ చేయవద్దు.. వాళ్లు లోతుగా మీ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు.
మొబైల్‌ఫోన్‌లను ఎవరికీ ఇవ్వకండి.. బ్లూటూత్ ఆప్షన్‌ను అవసరమైనప్పుడు తప్ప ఆన్ చేయకండి.. అపరిచితులకు బ్లూటూత్ ద్వారా ప్రవేశించేందుకు అనుమతించవద్దు
ఆన్‌లైన్ లావాదేవీలను సైబర్ కేఫ్‌ల నుంచి చేయవద్దు .. కీలాగర్లు మీ సొమ్మును హారతికర్పూరం చేస్తాయి.
సెక్యూరిటీ ప్రమాదం లేదని ధృవీకరించుకున్నాకే ఆన్‌లైన్ లావాదేవీలకు పూనుకోండి..
జాగ్రత్త,, తస్మాత్ జాగ్రత్త.. మీకు కావలసింది అప్రమత్తత.. ఆందోళన వద్దు.. భయం వద్దు.. కించిత్ ఆలోచించండి.. ఇంకొంచెం జాగ్రత్త పడండి.. మీ సొమ్ముల్ని కాపాడుకోండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి