ఒక చిరు తిండి మీ చిన్నారి ప్రాణాల్ని హరించేస్తున్నది
అందంగా కనిపిస్తూనే అంతం చేస్తోంది
కమ్మకమ్మగా ఖతం చేస్తోంది
జ్యూసీగా జ్యూసీగా విషం లోపలికి ఇంజెక్ట్ అవుతోంది
రక్తంలో కలిసిపోతోంది
మీరే మీ పిల్లలకు విషాన్ని అందిస్తున్నారు
అన్నం బదులు రసాయనాలను తినిపిస్తున్నారు
పురుగుమందులను తాగిస్తున్నారు
పిజ్జాలు..
బర్గర్లు..
పావ్ బాజీలు..
కట్‌లెట్ రగడా..
హమ్‌బర్గర్స్
హాట్ డాగ్స్
ఐస్‌క్రీమ్
కేక్
ఫ్రెంచ్ ఫ్రైస్
ఆనియన్ రింగ్స్
డోనట్స్
సాఫ్ట్ డ్రింక్స్
-----------------------------------------------
1
హాలీడే వచ్చేసిందంటే చాలా మందికి జాలీడే.. పిల్లలతో షికార్లు.. మెక్‌డోనాల్డ్స్‌లో పిజ్జాలు.. బర్గర్‌లు.. ఐమాక్స్‌లో సినిమా.. వీడియో గేమ్స్‌తో హల్‌చల్.. గోకుల్ చాట్‌లో చాట్, పానీపురీ, పావ్‌బాజీ.. ఫుల్ హంగామా.. వారం రోజుల పాటు రోజూ పది, పన్నెండు గంటలు పని చేసి హాలీడే వచ్చిందంటే, పిల్లలతో హ్యాపీగా గడపడం, వాళ్లడిగింది కొనివ్వటం దగ్గరుండి రకరకాల ఫుడ్స్ తినిపించటం.. ఓ రిలాక్స్.. ఓ ఆనందం.. పిల్లలూ హ్యాపీ.. మనమూ హ్యాపీ..,..... ఈ హ్యాపీ హ్యాపీయేనా? మీ పిల్లలకు కోరిందల్లా కొనివ్వటమే హ్యాపీయా? కాదు.. మీకు తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని హరిస్తున్నారు.. కోరి కోరి మృత్యుముఖంలోకి నెట్టేస్తున్నారు.. పిల్లలను మృత్యువు దగ్గరకు మీరే పంపిస్తున్నారు.. ఇది పుక్కిటి పురాణం కాదు. పిట్టకథ కాదు.. మీకు ఓ హెచ్చరిక.
మీ పిల్లలకు అన్నీ ఇష్టమే.. మీకూ ఇష్టమే.. వాళ్లు అన్నం తినకపోయినా సరే.. పిజ్జా తింటే చాలు.. పసిపాపకు తిండి అంటే ఫ్రెంచ్‌ఫ్రై, డోనట్సే.. ఇక ఐస్‌క్రీమ్‌లకు, కూల్‌డ్రింక్‌లకూ కొరవేముంది... ఏదీ తిండికి అనర్హం కాదు.. ఏదీ తాగటానికి అనర్హం కాదు.. ఎక్సెప్ట్ అన్నం తప్ప..
ఇక్కడే ఓ ప్రశ్న ఉదయిస్తుంది. వీకెండ్స్‌లో కూడా ఇంట్లోనే తినాలా? అదీ అన్నం తినాలా? పిల్లల సూటి ప్రశ్న ఇది. అవును.. నిజమే.. రోజూ ఏదో అన్నం తింటున్నాం.. సరదాగా వీకెండ్స్‌లో మరేదైనా తినిపించవచ్చు కదా.. లాజిక్ బాగానే ఉంది. పిల్లల్ని హ్యాపీగా ఉంచటం ముఖ్యం వాళ్లకు ఇష్టమైంది తినిపించకపోతే మనమెందుకు అని పేరెంట్స్ ఫీల్ కావటమూ లాజిక్కే. ఈ మాత్రం దానికి పిల్లలకు విషం తినిపిస్తున్నామని, వాళ్లను చంపేస్తున్నామని అడ్డగోలుగా వాదించటం, భయపెట్టడం సబబేనా? అంటే నిజమే.. కానీ, దీని వెనుక కారణం ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించాలి.
పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకువెళ్లేదే, ఫుడ్‌కోర్ట్‌కో, సినిమాకో, వీకెండ్ స్పాట్స్‌కో.. ఫుడ్ కోర్ట్‌కు వెళ్లినప్పుడు అక్కడ పులిహోరో, అన్నం పాయసమో అమ్మరు కదా.. అక్కడ అమ్మేదే ఫాస్ట్ ఫుడ్... అదీ పిజ్జా, బర్గర్లు, చాట్, పానీపూరీలు..రెస్టారెంట్ టైప్ అయితే బిర్యానీ, రుమాలీ రోటీ, చైనీస్ ఫుడ్.. అవే ఉంటాయి. అవే తినాలి. అవి తినేందుకే పేరెంట్స్ వెళ్తారు. పిల్లల్ని వెంటేసుకుని మరీ వెళ్తారు. వాళ్లు పిజ్జా తింటుంటే హ్యాపీగా ఫీలవుతారు..
ఇప్పుడు ఈ తిండే పెద్ద సమస్యగా మారింది. ప్రాణాంతకంగా మారింది. పిల్లలను మృత్యుముఖంలోకి నెట్టేస్తుంది. మీ పిల్లల ప్రాణాలను తోడేసేది ఎవరో కాదు.. పిజ్జా.. బర్గర్, పావ్, కురుకురే.. ఎస్.. వీటికి ముద్దు పేరు జంక్ ఫుడ్.. జస్ట్ అచ్చతెలుగులో అనువదిస్తే చెత్త ఆహారం అని అర్థం.. అలా అనడానికి మనసొప్పదు కాబట్టి చిరుతిండి అని కూల్‌గా పిలుచుకుంటాం...
మీ పిల్లలకు తినిపిస్తున్న పిజ్జా, బర్గర్, డోనట్.. వాళ్ల శరీరాల్లో చెత్తలా పేరుకుపోతోంది. ఎక్కడ పడితే అక్కడ చేరిపోతోంది. అది కొండలా పెరిగిపోతోంది. పిల్లకాయల్ని బెలూన్లా ఊరేలా చేస్తోంది. నాలుగేళ్ల వయసుకే వంద కిలోల బరువెక్కి, బతుకే భారంగా మారేట్లు చేస్తోంది.
రెండేళ్ల నుంచి ౧౯ఏళ్ల వరకు ఆడ, మగ తేడా లేకుండా అందరిలోనూ ఫుడ్ సెユ్టల్ మారిపోయింది. అన్నం అంటే సెユ్టల్‌గా పిలుచుకుంటే వైట్‌రైస్ అనేది లైట్‌గా తీసుకోవటం, సైడ్ ఫుడ్స్ తెగ మెక్కేయటం అలవాటుగా మారిపోయింది.
ఇది అంత ఆషామాషీగా తీసుకోవద్దు.. మీ పిల్లల్లో అవాంఛనీయమైన ఊబకాయానికి ఈ తిండ్లే కారణమని గ్రహించండి.. దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవి మీ పిల్లల్ని ఎదగనీయవు.. జీవన పరిమాణాన్ని అమాంతంగా తగ్గించేస్తాయి. మీ జనరేషన్ వాళ్లు కనీసం 60-70 ఏళ్లయినా బతుకుతున్నారు. మీ పిల్లల జనరేషన్ 40 ఏళ్లు దాటితే గొప్పే...
-----------------------------
3
ఎందుకింతగా భయపెడుతున్నారు? అని అందరికీ సందేహం కలుగుతుంది.. కానీ, ఇది భయపెట్టడం కాదు.. హెచ్చరించటం.. నిజంగా ఇది యంగ్ పేరెంట్స్‌కు ఓ హెచ్చరిక.. ఫాస్ట్‌ఫుడ్ మేనియాలో పడి కొట్టుకుపోకుండా జాగ్రత్త పడమని హంబుల్ రిక్వెస్ట్. ఈ చిన్న కథలాంటి వాస్తవాన్ని ఒకసారి చదవండి..
జనవరి ౧, ౧౯౮౯ సాన్‌ఫ్రాన్సిస్కో అమెరికాలో మాట్ మామ్‌గ్రమ్ అనే యువకుడు ఓ పిజ్జా హట్‌లోకి వెళ్లాడు. రెండు బర్గర్లు తీసుకున్నాడు. ఒక బర్గర్ తినేసి, మరో బర్గర్‌ను కోటు జేబులో పెట్టుకున్నాడు. ఆ తరువాత దాని సంగతే మరిచిపోయాడు. ఏడాది పాటు ఆ కోటునే వేసుకోలేదు. సరిగ్గా సంవత్సరం తరువాత మాట్ తన పాత కోటు తీశాడు. కోటు జేబులో ఏదో తగిలిందని చూస్తే, ఏడాది క్రితం నాటి బర్గర్
ఆశ్చర్యం వేసింది. తాను కొన్నప్పుడు ఎలా ఉందో.. ఎలాంటి వాసన వచ్చిందో అలాగే ఉంది..తాను కనుగొన్న ఈ డిస్కవరీని తన ఫ్రెండ్స్‌తో పంచుకున్నాడు. ఎవరూ అతణ్ణి నమ్మలేదు. కొత్త బర్గర్ కొని అబద్ధమాడావన్నారు. అప్పటి నుంచి మాట్ బర్గర్ల కలెక్షన్ ప్రారంభించాడు. వాటిని టీపాయ్ కింద బేస్‌మెంట్‌లో దాచాడు. ఇదంతా జరిగి ౨౧ సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇవాళ మాట్ దగ్గర సూపర్ బర్గర్ కలెక్షన్ తయారైంది.
ఎప్పటికీ చెడిపోని బర్గర్లు.. డబుల్ చీజ్ బర్గర్లు.. హమ్‌బర్గర్లు.. ప్రపంచంలో కనీవినీ ఎరుగని కలెక్షన్ ఇది. ఇప్పుడాయన బర్గర్ మ్యూజియం నిర్వహిస్తున్నాడు.
ఒక ఆహార పదార్థం ఎన్నాళ్లయినా పాడు కాకుండా ఉండటం ఎలా సాధ్యం? వీటిలో ఏయే పదార్థాలు వాడారు.. ఎందుకలా చెడిపోకుండా ఉన్నాయి. ఇలాంటి పదార్థాలు తింటే, మీరు తినిపిస్తే.. మీ పిల్లలు ఏమై పోతారు.. ఒక్కసారి కూల్‌గా ఆలోచించండి..
అమెరికాలో మాట్ మామ్‌గ్రమ్ స్టోరీ కల్పితం కాదు. నిజం.. ఈ బర్గర్‌లలో వాడిన ఇన్‌గ్రెడెంట్స్ వింటే దిమ్మ తిరిగిపోతాయి.
ఆవుమాంసం
ట్రెユక్లోరోథిన్
క్లోరోఫామ్
డిడిటి
ఇథైల్ బెంజిన్
అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రసాయనాలు కనిపిస్తాయి. ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు, రుచికరంగా ఉండేందుకు, చాలా వస్తువులు ఇందులో కలుస్తాయి. ప్రపంచం అంతా ఇదే జరుగుతోంది. ఇందుకు మన దేశం మినహాయింపేమీ కాదు. ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు.. వీటివల్ల జంక్‌ఫుడ్ లోపలికి వెళ్లి పూర్తిగా జీర్ణం కాక రక్తనాళాల పక్కన కొలెస్ట్రాల్‌గా మారి నిలిచిపోతుంది. ఫలితం.. ఊబకాయం...
ప్రతి వందమంది పిల్లల్లో ౩౫ శాతం మంది అండర్ వెయిట్ ఉంటే, ౫౫ శాతం మంది ఓవర్ వెయిట్ ఉన్నారు.. కేవలం పది శాతం మంది మాత్రమే వయసుకు తగ్గ బరువుతో ఆరోగ్యంగా ఉంటున్నారు. మిగతా వాళ్లందరికీ ఎప్పుడూ ఏదో సమస్యే... ఏ చిన్న ప్రతికూల వాతావరణాన్ని కూడా భరించలేని పరిస్థితి. ఎక్కువ వేడిని తట్టుకోలేరు.. ఎక్కువ చల్లదనాన్ని తట్టుకోలేరు.. చిన్న చిన్న వాటికే కిందామీదా పడిపోతారు.. మీరే ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆలోచించండి.. నెలకు మీ పిల్లల మెడిసిన్స్ ఖర్చు ఎంతవుతోందో లెక్కలేసుకోండి.. మీకే అర్థమవుతుంది.. మీ పిల్లలెంత బాగా ఉన్నారో.. వారి ఆరోగ్యాన్ని మీరెంతగా చెడగొడుతున్నారో..
చెత్త తిండి, అదేనండి.. జంక్ ఫుడ్ తినిపిస్తే మీ పిల్లల్లో ఒబెసిటీ పెరగడమే కాదు.. మామూలు భోజన అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. తిండి సరిగా తినరు.. జంక్‌ఫుడ్‌పై చూపే మోజు, మామూలు అన్నంపై చూపించరు. తొందరగా అలిసిపోతారు. కాళ్ల నొప్పులంటారు... కడుపు నొప్పంటారు.. తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్రతి చిన్న దానికి భయపడిపోతుంటారు. నిద్ర సరిగా పట్టదు.. ఒకదాని వెంట ఒకటిగా ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి.. డాక్టర్లను పేరెంట్స్ పోషిస్తూనే ఉంటారు. దటీజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జంక్‌ఫుడ్.
ఈ ఒబెసిటీ జాడ్యం కూడా పాశ్చాత్య దేశాల నుంచే మనకు పట్టుకుంది. అన్నింటా అమెరికాను ఆదర్శంగా తీసుకోవటం, అడ్డమైన ఫుడ్డూ తినటం, మన తరువాతి జనరేషన్ ఆయుర్దాయానికే ఎసరు తెచ్చిపెడ్తోంది. అసలు వాళ్ల లైఫ్‌సెユ్టల్‌నే అది పూర్తిగా మార్చేస్తోంది.
ఇప్పుడు మన లైఫ్ అంతా అమెరికా సెユ్టల్.. లండన్ సెユ్టల్.. సిడ్నీ సెユ్టల్.. అంతే తప్ప.. హైదరాబాదీ సెユ్టల్ అనేది లేనే లేదు. నగరాల్లో కాలుష్యం ఓ నరకం అయితే, ఫాస్ట్‌ఫుడ్ డైరెక్ట్ పాయిజన్‌గా ఇంజెక్ట్ అవుతోంది. మన రాజధానిలో నెలకు రెండు వందల కోట్ల రూపాయల వరకు రకరకాల రూపాల్లో ఫాస్ట్‌ఫుడ్ బిజినెస్ జరుగుతోందంటేనే, నగర ప్రజలు ఏ స్థాయిలో అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.
అమ్మాయిల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది.. ఇలాంటి జంక్‌ఫుడ్ కారణంగా అమ్మాయిల్లో హార్మోన్లు వ్యాకోచించి తొందరగా ఎదిగిపోతున్నారు.. చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు. పెద్ద వాళ్లలో ఉన్న లక్షణాలన్నీ ముందే వచ్చేస్తున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారుతోంది.
ఈ సమస్యంతా నగరాల్లో ఉన్న పిల్లల విషయంలోనే జరుగతోంది. ఫాస్ట్‌ఫుడ్.. జంక్‌ఫుడ్.. చెత్త తిండి అంతా నగరాల్లోనే దొరుకుతోంది.. ఇంకా పల్లె సీమలకు ఎక్కువగా విస్తరించకపోవటం వల్ల అక్కడి పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలు అక్కడికి పాకలేదు. నగరాల్లోనే ఈ విషం పిల్లల రక్తనాళాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఏ దశలోనూ పిల్లలకు పోషకాహారం లభించటం లేదన్న వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించటం లేదు. ఒకవేళ గుర్తించినా, ఆ పోషకాహారాన్ని అందించే పరిస్థితీ, వాతావరణం లేనే లేదు. ఇది ఇంతమందిలో ఉంది.. జంక్‌ఫుడ్ ప్రభావం ఇంతమందిలో లేదు అన్న లెక్కలు పత్రాలు అవసరం లేదు. ప్రతి ఇంట్లో, పిల్లలందరికీ విస్తరించిన జాడ్యం. దీన్ని నిర్మూలించటం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న వేయవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా ఆపగలం అని అడగవచ్చు. కానీ, దాన్ని కనీస స్థాయికి తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. పీజ్జాలతో చెలగాటం.. మీ పిల్లలకు ప్రాణసంకటం అని గ్రహించండి...జస్ట్ అవాయిడ్ జంక్‌ఫుడ్.. సేవ్ యువర్ కిడ్స్..
5 కామెంట్‌లు:
నాకు తెలిసిన ఒకావిడ ప్రతిరోజూ 2 వ తరగతి చదివే తనకూతురికి బడి నుంచి వచ్చేసరికి ఇలాంటివి కొని పెడుతూ ఉంటుంది. పైగా గొప్పగా చెప్పుకుంటుంది. నన్ను పీనాసిగా లెక్కకట్టి మాట్లాడింది. నేనూ చెప్పాను- నా కొడుక్కి నా చేతులతొ విషం పెట్టదల్చుకోలేదు అని . అవాక్కైంది. ఈమధ్య ఎక్కడ తెలుసుకుందో తెలీదు. ఈ అలవాటు తగ్గించుకుంది.
సగం వ్యాఖ్య మాత్రమే పెట్టినట్టున్నాను.
మా అబ్బాయి అప్పుడప్పుడూ మాత్రం ఇష్టపడేవాడు. 3,4 ఏళ్ళుగా బొత్తిగా అనుకోనే అనుకోడు. నూడుల్స్ మాత్రం ఇంకా వదల్లేదు.
ఊర్కోండి ! మీరు మరీనూ! పిల్లలంతా చక్కగా గుండుగా , బండగా, ఊబకాయంతో అలరారుతూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది?
మీరు చెప్పారని మానేస్తే పిజ్జాలు, బర్గర్లు అమ్ముకునేవాళ్ళేమైపోతారు. వందలాది మందికి జంక్ ఫుడ్డు కలిపించే ఉపాధి ఊడిపోతే వాళ్లంతా ఏమైపోతారు?
వాడికో, దానికో ఇరవై ఏళ్లకే కీళ్లనొప్పులు, హార్టు ప్రాబ్లంసు వస్తే ఆనందపడే డాక్టర్లు ఏమైపోతారు.?
అలా అలా తినేసి ఉబ్బేసిన బలూన్ పగిలినట్టు ఆ పిల్లల ఆయుష్షు కూడా పేలిపోతే ఏడుస్తూ తాము పెట్టిన పిజ్జాలే తన బుజ్జాయిని దూరం చేసిందని తెలుసుకున్నా ఏమీ చెయ్యలేని ఆ మాతాపితలను చూస్తే అమితమైన సంతోషం!.
ఈ టపా చదివినంతసేపేనండీ చదివిన మనిషికి మనసు జివ్వుమనటం. పేజీ మూసేసాక, మళ్లీ మామూలే! :) వింతలోకం, మాయాలోకం, మంచి చెప్పినా వినని లోకం!
కానీ మీరు మటుకు మానొద్దు ఇవి రాయటం...ఎక్కడో ఒక్క ఇంట్లోనోనన్నా మార్పొస్తే అదే సంతోషం!
meeru cheppindi aksharala nijam... ikkada americalOnE.. pillalaku junk food avoid chestunnamu.. mari India lo antha craze enduko?
మంచి ప్రయోజనకరమయిన టపా !
కామెంట్‌ను పోస్ట్ చేయండి