తక్కెడలో కప్పలు కొట్టుకుంటున్నాయి
ఒకదానిపై ఇంకొకటి కుట్ర చే సుకుంటున్నాయి.
అన్ని కప్పలూ ఒక్కసారే తక్కెడలోకి చేరినవే..
ఒక కప్ప మాట మరో కప్పకు సరిపడదు..
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌లో ఉండేందుకే
అన్ని కప్పల ప్రయత్నం..
అన్నింటిపై ఆధిపత్యం కోసమే తాపత్రయం..
ఈ కొట్లాటల్లో ఈ కప్పల తక్కెడ చిల్లుపడిపోయింది
తక్కెడ ముక్కలు ముక్కలవుతోంది..
అది ముక్కలైతే.. ఏ కప్పకూ నిలువ నీడ ఉండదు..
ఇప్పుడు తక్కెడను కాపాడటం ఎలా?
ఇంతకీ ఆ తక్కెడ ఏమిటో తెలుసా?
మన రాష్ట్ర కాంగ్రెస్....
ఈ కప్పలన్నీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం
నివేదికలిచ్చుకోవటం..
ఏసిబి విచారణలు జరిపించుకోవటం..
వెరసి కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో గందరగోళానికి దారి తీసింది..
రాష్ట్రంలో ఏం జరుగుతోందో అధిష్ఠానానికి అంతుపట్టటం లేదు
ఒకరి తరువాత మరొక దూత వస్తున్నారు..
మంతనాలు జరుపుతున్నారు...
రిపోర్టుల మీద రిపోర్టులు సమర్పించుకుంటున్నారు..
కనీ వినీ ఎరుగని సంక్షోభం..
పార్టీ అస్తిత్వానికే ప్రమాదకరమైన పరిస్థితిలో కాంగ్రెస్
కర్ర విరగొద్దు.. పాము చావొద్దు...
పార్టీ నిలబడాలి.. ఏం చేయాలి?
ఎలా కాపాడుకోవాలి..?
నేతల మధ్య సమన్వయం సాధ్యమేనా?
జగన్‌ను, తెలంగాణాను సమన్వయం చేయటం కుదిరేపనేనా?
కాంగ్రెస్ రెంటికి చెడ్డ రేవడి అవుతుందా?
రెంటినీ బ్యాలెన్స్ చేస్తుందా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి