31, డిసెంబర్ 2019, మంగళవారం

bejawada gopalreddy

స్వాధ్యాయ సమర్పిస్తున్న మహత్తరమైన నాయకుడి అపూర్వ స్వరమిది. భారత దేశంలో మద్రాస్

ప్రెసిడెన్సీలో 1937లో ఏర్పడిన మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన

మంత్రిగా ప్రమాణంచేసిన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి 50 సంవత్సరాలకు పైగా రాజకీయ

అనుభవాల సారాంశం ఆయన స్వరంలోనే విందాం. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రరాష్ట్రం

ఏర్పడినంతవరకు ఆ తర్వాత కేంద్రమంత్రిగా, గవర్నర్గా పనిచేసి రాజకీయాలనుంచి వైదొలిగిన

తర్వాత చేసిన రేడియో రికార్డింగ్ ఇది. ఆ రోజుల్లో మంత్రిత్వశాఖలు.. అధికారాలు.. జీతభత్యాలు..

మంత్రులుగా ఎవరెవరు ఉండేవారు.. పరిపాలన ఎలా సాగింది అన్నింటిపైనా సమగ్రంగా

వివరించిన అత్యద్భుతమైన స్వరమాధురి ఇది. అందరూ తప్పనిసరిగా వినితీరాల్సిన ఆడియో

ఇది. కేవలం 22 నిమిషాల ఈ క్లిప్ ఆసాంతం వింటే.. ఆంధ్రరాష్ట్రంలో రాజకీయాల ఒక పరిణామ

క్రమం మనకు కొంతమేర అవగాహన కలిగే అవకాశం ఉన్నది. తప్పకుండా వినండి. పదిమందికి

వినిపించండి. ఇలాంటి మహానుభావులు మరికొందరి  స్వరాలు వినడానికి చానల్ ను సబ్స్క్రైబ్

చేయండి. వీడియోలను షేర్ చేయండి. లైక్ చేయండి. పదిమందికి చూపండి. వినిపించండి.

తెలుగువారందరికీ అత్యంత ముఖ్యమైనవి.. పదిలపరుచుకోదగినవి పదిమందికి చేరాలన్నదే

స్వాధ్యాయ లక్ష్యం. ధన్యవాదాలు.

28, డిసెంబర్ 2019, శనివారం

A rare artisans visuals in warangal, hyderabad in 1959

ఒక్కసారి మనం చూడని మన ఊళ్లను చూద్దాం. మొదటగా నేను పుట్టిన నా జన్మభూమి వరంగల్తో పాటు హైదరాబాద్ కు సంబంధించిన కొన్ని అరుదైన విజువల్స్ చూద్దాం. 1959లో హైదరాబాద్, వరంగల్ ఎలా ఉన్నాయి..  గాజులు తయారీచేసేవాళ్లు.. వెండి ఆకులు తయారుచేసేవారు.. డై తయారీ దారులు .. సంప్రదాయ వస్త్రధారణలో లంబాడా మహిళలు.. వరంగల్ కోట.. ఇలా పలు అంశాలను కలగలసిన విజువల్స్.. ఇవి. అరుదైన వీడియో.. తప్పక చూడండి.. మరికొన్ని అరుదైన వీడియోలు.. ప్రముఖుల ఆడియోలు కూడా చూద్దాం.. విందాం. ఈ అరుదైన వీడియోలు చూడటానికి.. స్వరాలు వినడానికి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలను షేర్ చేయండి. లైక్ చేయండి. పదిమందికి చూపండి. వినిపించండి. తెలుగువారందరికీ అత్యంత ముఖ్యమైనవి.. పదిలపరుచుకోదగినవి పదిమందికి చేరాలన్నదే స్వాధ్యాయ లక్ష్యం. ధన్యవాదాలు. 

25, డిసెంబర్ 2019, బుధవారం

legendery poet dasarathi interview

దేశం గర్వించదగ్గ మహాకవి.. మహాంధ్రోదయ కావ్యకర్త.. సినీగేయకవి.. దాశరథి క‌ృష్ణమాచార్య అపూర్వ గళాన్ని వినండి. ఆయన పశ్చిమ దేశాలను పర్యటించి వచ్చిన అనంతరం వేలూరు సహజానంద చేసిన ఇంటర్వ్యూ ఇది. తప్పక వినండి.. షేర్ చేయండి. లైక్ చేయండి. మరి కొందరు మహానుభావుల  స్వరాలను వినడానికి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అద్భుతమైన ఈ అపూర్వ వ్యక్తుల స్వరాలను పదిమందికి వినిపించండి. మీమీ పరిధిలో షేర్ చేయండి. అందరూ వినాలన్నదే ఈ చానల్ లక్ష్యం. ధన్యవాదాలు

17, డిసెంబర్ 2019, మంగళవారం

చలం గురించి.. మహానుభావులు ఏమనుకున్నారు?

చలం తన గురించి తానేమన్నాడో విన్నాం. చలం గురించి.. ఆయన రచనల గురించి.. రమణాశ్రమానికి చేరుకున్న తర్వాత మారిన చలం గురించి తెలుగు సాహిత్యలోకంలో ఇవాళ్టికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన గురించి ఆయన సమకాలంలో మహానుభావులు ఏమనుకున్నారు. సెలెక్టివ్ గా ఒక నలుగురి అభిప్రాయాలు విందాం. ఈ నలుగురు కూడా భిన్నమైన సాహిత్యవాదాలకు సంబంధించినవారు. వీరు 1. విశ్వనాథ సత్యనారాయణ, 2. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి, 3. ముప్పాళ్ల రంగనాయకమ్మ, 4. శ్రీరంగం శ్రీనివాసరావు. నాలుగు భిన్న ధ్రువాలు చలం గురించి వ్యక్తంచేసిన అభిప్రాయాలు తప్పక వినండి. ఈ చానల్ మీది. మరిన్ని ప్రముఖుల స్వరాలను, ఇతర అంశాలకు సంబంధించిన వీడియోలకోసం చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి

11, డిసెంబర్ 2019, బుధవారం

మేడారం.. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర

మేడారం.. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర. దీనిపై ఇప్పటివరకు ఎక్కడా రాని.. ఎవరూ సాహసించని, ఎవరికీ తెలియని సమగ్రమైన.. సంపూర్ణమైన సమాచారంతో చిత్రీకరించిన లఘుచిత్రం. కోటిన్నర మందికి పైగా పాల్గొనే ఏకైక గిరిజన పండుగపై డాక్యుమెంటరీని స్వాధ్యాయ సగర్వంగా సమర్పిస్తున్నది.. మేడారం జాతర గురించి చాలామందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. జనరల్ మీడియాలో వచ్చే కథాకథనం మినహా స్థల పురాణం తప్ప మరేమీ తెలియదు. జాతరకు వెళ్లిరావడమే తప్ప దాని గురించి సమగ్రమైన.. లోతైన అవగాహన ఉన్నవాళ్లు చాలా తక్కువ. అందరికీ తెలిసినంతమేరకు మేడారం నాలుగురోజుల పండుగ. కానీ.. మేడారం పండుగ మొత్తం నెలరోజులు చేసుకునే పండుగ. గుత్తికోయలు, పారకోయలు తదితర పన్నెండు రకాల తెగల కోయలు.. చెంచులు జరుపుకునే జాతర. పదిరకాల గోత్రీకులు పూజలు నిర్వహించే పండుగ. ఆడవారే పూజారులుగా పూజలు నిర్వహించే పండుగ. కంకబొంగు, నెమలినార, సొరకాయ, చిక్కుడు, వంటి ఎన్నో పదార్థాలతో ప్రకృతితో మమేకమై చేసుకొనే పండుగ. బెల్లాన్నే బంగారంగా సమర్పించుకునే జాతర. దాదాపు 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుపుకునే జాతర. వరం పట్టడం వంటి పదిరకాల మొక్కులు తీర్చుకునే జాతర. వీటి గురించి ఇప్పటి వరకు సమగ్రమైన సమాచారం ఎక్కడా అందుబాటులో లేదు. జాతర ఎప్పుడు.. ఎలా మొదలవుతుంది.. ఎలా నిర్వహిస్తారు అన్న సమాచారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు పూజారుల నోటివెంటే వినాలి. మేడారంపై సమగ్రంగా.. సంపూర్ణ సమాచారంతో.. ఉన్న 30 నిమిషాల డాక్యుమెంటరీ ఇది. తప్పకుండా చూడండి. తెలుగువారంతా తప్పకుండా తెలుసుకోవలసిన మన సంస్కృతి ఇది. ఈ డాక్యుమెంటరీని చూడండి. లైక్ చేయండి. షర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.

8, డిసెంబర్ 2019, ఆదివారం

మహాకవి శ్రీశ్రీ తో అభ్యుదయ కవి అనిశెట్టి



ఆయన కనులు మూస్తే పద్యం వచ్చింది.. పెదవి కదిపితే నాదమయింది. నినదిస్తే విప్లవమైంది.. నిలదీస్తే తిరుగుబాటు బావుటా ఎగిరింది..

శ్రీశ్రీకి కవిత్వం ఒక తీరని దాహం.. తాను కవిత్వం రాసేందుకు వస్తువు ప్రధానం కాలేదు.. శిల్పం అక్కరకు రాలేదు.. లయ అవసరం లేనే లేదు.. రసం దృష్టిలోనే లేదు.. ఆయన కవిత్వం ఒక నాదం... మనస్సులో ఒక్కుదుటున కలిగే ప్రకంపనలకు అక్షర రూపం ఇస్తే దానికి పేరు శ్రీశ్రీ కవిత్వం. అంతటి మహాకవి శ్రీశ్రీతో ప్రఖ్యాత అభ్యుదయ కవి అనిశెట్టి చేసిన మాటామంతి.. వారి అపూర్వ గళంలో వినండి... ఈ అపూర్వ గళాన్ని పూర్తిగా వినండి. మన మార్గదర్శకులు వీరు. ఇంతటి మహాపురుషుల మరిన్ని స్వరాలను మీకు  అందిస్తుంది సాధ్యాయ. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి స్వాధ్యాయ చానల్ను.

5, డిసెంబర్ 2019, గురువారం

సాక్షాత్ సరస్వతి.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గతంలో ఎవరూ వినని ...

స్వాధ్యాయ సగర్వంగా సమర్పిస్తున్న మరో అపూర్వ గళం .. సాక్షాత్తు సరస్వతి.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగతమిది. మునుపెన్నడూ వినని అంశాలు ఆయన స్వరంలో అరుదైన చిత్రాలతో సహా కనీ వినవచ్చు. తమవంటి శిష్యుడు చెళ్లపిళ్ల వారికి దక్కడం నన్నయ్యకు.. తిక్కనకు కూడా లేదని చెప్పగలిగిన మహాపురుషుడు. వారి తండ్రిగారు భూమిని ఎలా దానధర్మాలు చేసింది.. ఆ తర్వాత కిన్నెరసాని వాగును ఆయన ఎప్పుడు ఎలా చూశారు.. దాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతి.. వీటన్నింటి గురించి సవివరంగా ఆయన ప్రఖ్యాత సాహితీమూర్తులు శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, వేలూరి సహజానంద చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని విడి విడి అంశాల సమాహారం ఐదు నిమిషాల నిడివిలో... తప్పకుండా పూర్తిగా వినండి..

మన మార్గదర్శకులు వీరు. ఇంతటి మహాపురుషుల మరిన్ని స్వరాలను మీకు  అందిస్తుంది సాధ్యాయ. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి స్వాధ్యాయ చానల్ను.