మేడారం.. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర. దీనిపై ఇప్పటివరకు ఎక్కడా రాని.. ఎవరూ సాహసించని, ఎవరికీ తెలియని సమగ్రమైన.. సంపూర్ణమైన సమాచారంతో చిత్రీకరించిన లఘుచిత్రం. కోటిన్నర మందికి పైగా పాల్గొనే ఏకైక గిరిజన పండుగపై డాక్యుమెంటరీని స్వాధ్యాయ సగర్వంగా సమర్పిస్తున్నది.. మేడారం జాతర గురించి చాలామందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. జనరల్ మీడియాలో వచ్చే కథాకథనం మినహా స్థల పురాణం తప్ప మరేమీ తెలియదు. జాతరకు వెళ్లిరావడమే తప్ప దాని గురించి సమగ్రమైన.. లోతైన అవగాహన ఉన్నవాళ్లు చాలా తక్కువ. అందరికీ తెలిసినంతమేరకు మేడారం నాలుగురోజుల పండుగ. కానీ.. మేడారం పండుగ మొత్తం నెలరోజులు చేసుకునే పండుగ. గుత్తికోయలు, పారకోయలు తదితర పన్నెండు రకాల తెగల కోయలు.. చెంచులు జరుపుకునే జాతర. పదిరకాల గోత్రీకులు పూజలు నిర్వహించే పండుగ. ఆడవారే పూజారులుగా పూజలు నిర్వహించే పండుగ. కంకబొంగు, నెమలినార, సొరకాయ, చిక్కుడు, వంటి ఎన్నో పదార్థాలతో ప్రకృతితో మమేకమై చేసుకొనే పండుగ. బెల్లాన్నే బంగారంగా సమర్పించుకునే జాతర. దాదాపు 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుపుకునే జాతర. వరం పట్టడం వంటి పదిరకాల మొక్కులు తీర్చుకునే జాతర. వీటి గురించి ఇప్పటి వరకు సమగ్రమైన సమాచారం ఎక్కడా అందుబాటులో లేదు. జాతర ఎప్పుడు.. ఎలా మొదలవుతుంది.. ఎలా నిర్వహిస్తారు అన్న సమాచారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు పూజారుల నోటివెంటే వినాలి. మేడారంపై సమగ్రంగా.. సంపూర్ణ సమాచారంతో.. ఉన్న 30 నిమిషాల డాక్యుమెంటరీ ఇది. తప్పకుండా చూడండి. తెలుగువారంతా తప్పకుండా తెలుసుకోవలసిన మన సంస్కృతి ఇది. ఈ డాక్యుమెంటరీని చూడండి. లైక్ చేయండి. షర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి