ఘజ్‌నీ మహమ్మద్ అనేవాడు డబ్బుకోసం ఒకే ఒక్క గుడిపై అన్నిసార్లు దాడిచేశాడంటే.. ఆ గుడిలో ఎంత సంపద ఉండవచ్చు. గుడితోపాటు ఆనాటి ఆ సమాజంలో ఎంత సంపత్తి పోగుపడి ఉండవచ్చు.. రాజు దగ్గర ఎంత ఉండవచ్చు. ప్రజల దగ్గర ఎంత ఉండవచ్చు. ఎంత సంపదవుంటే భారతదేశాన్ని రత్నగర్భ అంటారు? ఈరకంగా దేశంలోని చాలాచోట్ల సంపద పోగుపడింది కాబట్టే ఘజ్‌నీ మహమ్మద్ నుంచి ఎలిబెత్ దాకా ఉరుకురికి వచ్చారు. నీదగ్గర ఏమైనా ఉన్నదంటేనే కదా.. దొంగోడైనా వచ్చి దోచుకొనేది. నీ దగ్గర ఏ కాణీ కూడా లేనప్పుడు ఎవరైనా నీదగ్గరకు ఎందుకొస్తారు? అయో.. మీ దగ్గర ఏమీ లేదు.. మీకు బతకడమెట్లాగో చేతకాదు.. మేం వచ్చి మీకు ఎట్లా బతకాలో చెప్తాం.. అన్నం తినడం నేర్పిస్తాం.. ఆవకాయ రుచి చూపిస్తామని వచ్చారా తెల్లవాళ్లు? రామం భజే శ్యామలం ఏడవ భాగం చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి