12, ఆగస్టు 2023, శనివారం

పద్యాల రూపంలో సత్యనారాయణ వ్రత కథలు: రచన:రామక విఠలశర్మ, గానం కుందావఝల కృష...



తెలుగు సాహిత్యంలో ఇలాంటి ప్రయోగం మునుపెన్నడూ జరుగలేదు. సత్యనారాయణ వ్రతం గురించి తెలియని వారెవరు.. వ్రతం చేసుకోనివారూ చాలా అరుదే.. వ్రతకథలను కథలుగా వినడమే మనకు ఇప్పటివరకు తెలిసింది. కానీ.. పద్యాల రూపంలో.. వీనులకు విందుగా.. వినసొంపుగా.. మనసుకు హాయినిచ్చేలా రాగయుక్తంగా స్వరపరచి గానం చేస్తే.. ఊహించడానికే హాయిగా ఉంది కదూ.. మీ ఊహల్ని నిజం చేయడం కోసం శ్రీ రామక విఠల శర్మ శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకథలను పద్యాల రూపంలో అత్యంత అలతి పదాలతో అద్భుతంగా రచించారు. వాటిని ప్రఖ్యాత సాహిత్యవేత్త, గాయకుడు శ్రీ కుందావఝల కృష్ణమూర్తి అపూర్వంగా రాగం కట్టి ఆలపించి వ్యాఖ్యానం కూడా చేశారు. తప్పక వినండి. తరించండి. పది మందికి వినిపించండి..

కామెంట్‌లు లేవు: