25, సెప్టెంబర్ 2023, సోమవారం

కస్తూరి రంగ రంగా... పాట.. 1930 నాటి రేడియో రికార్డు..



కస్తూరి రంగ రంగా.. మా యన్న కావేటి రంగ రంగా.. అన్న పాట చిన్నప్పుడు మన నానమ్మలు, అమ్మమ్మల నోట వినని వారు బహుశా అరుదు... ఆ పాట బహుశా మొట్టమొదట 1930లో జీ సుబ్బులు అనే గాయని స్వరంలో రేడియో వారు రికార్డు చేశారు. ఈ సుబ్బులు గారు గుంటూరు, ప్రకాశం ప్రాంతాలకు చెందిన వారని కొంత సమాచారం. వారి గురించి పూర్తి వివరాలు మద్రాసు ఆకాశవాణి రికార్డుల్లో ఉన్నదని తెలుస్తున్నది. చాలా సంప్రదాయమైన, హార్మోనియంపై వినసొంపుగా ఉన్న ఈ పాటను వీనుల విందుగా వినండి..

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మా చిన్నప్పుడు పెద్దవాళ్లు (తల్లి, మేనత్తలు) పాడుతుండేవారు 🙏.
హృద్యమైన పాట 👏.