మౌర్యుల నుంచి బహుమనీల దాకా.. దాదాపు 14 రాజ్య వ్యవస్థలు.. వాటి పరిపాలన తీరు తెన్నులను మొట్ట మొదటి సారి సవివరంగా.. అన్ని అంశాలతో మీ ముందుంచుతున్నాం. ఇది బృహత్ప్రయత్నం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ రాజ్య వ్యవస్థలను.. పరిపాలన తీరు తెన్నులను పరిశీలిస్తే అనేక అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాజరికంలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అమలయిందో అర్థమవుతుంది. కేంద్రీకృత పాలన, వికేంద్రీకృత పరిపాలన వ్యవస్థలు కనిపిస్తాయి. అనేక రూపాల్లో సైనిక వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అధికారాల విభజన ఎట్లా ఉన్నదో స్పష్టంగానే తెలుస్తుంది. ప్రపంచంలోనే బృహత్తరమైన రాజ్యాంగాన్ని రచించిన నిర్మాతలకు సరిహద్దులకు ఆవల కనిపించిన మంచి, ప్రామాణిక అంశాలు.. అమలు చేయదగ్గ విషయాలు.. దేశంలో అంతర్గతంగా ఉన్న ఈ వ్యవస్థల్లో ఒక్కటి కూడా కనిపించలేదా? అని కూడాఅనిపిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి