అయోధ్య అంటే యుద్దం చేయడానికి శక్యం కానిది. నగరం తొమ్మిది వైపులా తొమ్మిది ద్వారాలున్నాయంట. అయోధ్య సరిహద్దు గోడపైన అన్ని వైపుల్లో.. అన్ని కోణాలు.. అన్ని దిక్కులను కవర్ చేసేలా వందల సంఖ్యలో శతఘ్నులు ఏర్పాటుచేశారు. చుట్టూ ఉన్నతమైన ప్రాకారం అయోధ్యకు వడ్డాణంలా ఉన్నదిట. నగరం చుట్టూ లోతుగా అగడ్త ఉన్నది. ఈ అగడ్త ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలతో నిండి ఉన్నది. ఈ అగడ్తను దాటి శత్రువు అనేవాడు ఎవరూ అయోధ్యలోకి ప్రవేశించలేరు. నగరంలో అస్త్రాలతోనూ.. అస్త్రాలు లేకుండా కూడా యుద్ధం చేయగల అసాధారణ వీరులున్నారు. నగరానికి బయటివైపు.. వర్తులాకారంగా దాదాపు 24 కిలోమీటర్లదాకా సెక్యూరిటీ వ్యవస్థను అత్యంత పటిష్ఠంగా ఏర్పాటు చేశారు. శత్రువు అనేవాడు ఇన్ని అంచెల రక్షణ వలయాలను దాటుకొని నగరంలోకి ప్రవేశించడం దుస్సాధ్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి