ఒక్కటి సుస్పష్టం. మనది భారతవర్షం. ఆర్యావర్తం. జంబూద్వీపం. మనం భారతీయులం మాత్రమే. ఇక్కడ ఎవరి మతాలు వాళ్లకున్నాయి. శైవం ఒక మతం, వైష్ణవం ఒక మతం, శాక్తేయం ఒక మతం, బౌద్ధం ఒక మతం, జైనం ఒక మతం, సిక్కు ఒక మతం.. చివరకు చార్వాకం (నాస్తికత్వం) కూడా ఒక మతమే. అంతేకాదు. ఆది శంకరులకు షణ్మతస్థాపకులు అని పేరు. ఆ షణ్మతాలు ఆనాటికే ప్రసిద్ధిలో ఉన్నాయి. శైవము, వైష్ణవము, శాక్తము, సౌరము, కౌమారము, గాణాపత్యము. ఈ దేశంలో ప్రాథమికంగా ఉన్న మతాలు ఇవే. ఆ తరువాతే బౌద్ధం, జైనం వచ్చాయి. ఇంత ఫ్లెక్సిబులిటీ ఉన్న సాంఘిక ధార్మిక సమాజ జీవనంలో హిందూ అనే మాటకు అస్తిత్వం ఎక్కడున్నది? ఎవడో బయటినుంచి వచ్చి నోరు తిరక్క.. ఏదో ఒక నది కనిపిస్తే.. దాని పేరును జాతి నామవాచకంగా మార్చి పిలిస్తే.. దాన్ని మనం మతవాచకంగా మార్చుకొని జీవిస్తున్నామంటే.. ఇంతకంటే దురదృష్టం ఏమున్నది? విభజన విషవృక్షం 4 వ ప్రసంగం వినండి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి