ayodhya architecture: నాటి అయోధ్య నగర నిర్మాణం ఎలా ఉన్నది? లే అవుట్, ప్లానింగ్ చిత్రాలతో చూడండి.
అయోధ్య 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు కలిగి ఉన్నది
అయోధ్య నగరం దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నది.
జూదమాడే పీట లాగా ఉన్నది
విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లను ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ, పూలు చల్లుతూ ఉండే ప్రత్యేక సిబ్బంది ఉండేవారు.
ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండటం కోసం ప్రత్యేక వ్యవస్థనే ఉన్నది.
శత్రువు అయోధ్యలోకి రావాలంటే..
ముందుగా అడవి..
అందులో క్రూర మృగాలు..
ఆ తరువాత అగడ్త,
అనంతరం ప్రాకారం,
ఆపై బురుజులపై నున్న శతఘ్నులు,
దృఢమైన తలుపులు..
బలిష్ఠులైన సైనికులను దాటితే కానీ సాధ్యం కాదన్నమాట.
రాముడి నివాస భవనానికి పెద్ద పెద్ద ఎత్తైన తలుపులు ఉన్నాయి.
ఇంటిముందు వందల కొద్దీ అరుగులు ఉన్నాయి.
ఇంటిపై శిఖరంపైన బంగారు శిల్పాలను ఏర్పాటు చేశారు.
ప్యాలెస్‌లో అక్కడక్కడా నెమళ్లు, కోయిలలు వంటి పెంపుడు జంతువులు, పక్షులు ఉన్నాయి.
చందనాగరు పర్ఫ్యూమ్‌లతో ఆ మందిరం నిరంతరం సువాసనలు వెదజల్లుతున్నది.
రాముడి ఇంటి తలుపులను రాయి, చెక్క, బంగారు, వెండి లోహములతో తయారుచేశారు.
రామంభజే శ్యామలం 14 వ భాగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి