26, జనవరి 2024, శుక్రవారం

gyanvapi a hindu temple: అతి పెద్ద హిందూ దేవాలయంపై మసీదు కట్టారు

అయోధ్యలో రాముడు వచ్చిన వేళ అన్నీ శుభ శకునాలు కనిపిస్తున్నాయి. తాజాగా పవిత్ర వారణాసి విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని గ్యాన్వాపీ డొల్లతనం ఏఎస్ఐ సర్వేలో బయటపడింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పవిత్ర కాశీ విశ్వనాథుడి ప్రాంగణంలోని గ్యాన్ వాపీ కట్టడం కింద అతి పెద్ద హిందూ దేవాలయం ఉన్నట్టు అక్కడ సర్వే నిర్వహించిన భారత పురాతత్వశాఖ ప్రకటించింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా న్యాయస్థానానికి సమర్పించిన 839 పేజీల సుదీర్ఘ నివేదిక ఇందుకు సంబంధించి అనేక ఆధారాలు ఫొటోలు, మెజర్ మెంట్లతో సహా సంచలన విషయాలు వెల్లడించింది. గ్యాన్ వాపీలో ప్రస్తుతం ఉన్న కట్టడానికి ముందు అక్కడ భవ్యమైన హిందూ దేవాలయం ఉన్నట్లు సుమారు 32 ఆధారాలను ఏఎస్ఐ ఈ నివేదికలో వెల్లడించింది.  ప్రస్తుత కట్టడంలోని పశ్చిమ భాగంలో ఒక గదిలో లభించిన శాసనం ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్టు ఉన్నదని నివేదికలో పేర్కొన్నారు. ఈ శాసనం పర్షియన్ భాషలో లిఖించబడి ఉన్నదని వివరించింది. ఈ శాసనాలతో పాటు ఆంజనేయ స్వామి, వినాయకుడు, శివలింగం, పానవట్టం, విష్ణు విగ్రహాలు ఉన్నట్టు ఫొటోలు ప్రకటించింది. వీటితో పాటు ఒక ఇసుకరాయితో చేసిన శ్లాబ్ పై దేవనాగరిలో రామ అన్న అక్షరాలు ఉన్నట్టు తెలిపింది. ఈ విగ్రహాలు 3 సెంటీ మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు ఉన్నాయని వెల్లడించింది. దీంతో కాశీ విశ్వనాథుని మందిర ప్రాంగణంలోని ఈ కట్టడం ఒక భారీ హిందూ దేవాలయంపై నిర్మించినట్టు స్పష్టమైంది. ఈ విషయంలో దాదాపు 355 సంవత్సరాలుగా  హిందూ వాదులు ఇంతకాలం చేస్తున్న పోరాటానికి ఇప్పటికి వాస్తవాలు వెల్లడయ్యాయి. దీనిపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందనేది చర్చనీయాంశమైంది.


కామెంట్‌లు లేవు: