రక్తచరిత్ర సినిమా నేపథ్యం ఏమిటి?
పగ, ప్రతీకారమే.. పరమ సోపానమా?
అనంతపురంలో ఇప్పుడు రక్తపుటేరులు పారుతున్నాయా?
రక్త చరిత్ర ద్వారా వర్మ కోరుకుంటున్నదేమిటి?
ప్రేక్షకులకు చెప్పదలచుకున్నదేమిటి?
ఫ్యాక్షన్ రాజకీయాలను వర్మ తిరగ దోడుతున్నారా?
మసకబారుతున్న గత చరిత్రకు మళ్లీ ఆజ్యం పోస్తున్నారా?
మరాట్వాడా రాజకీయ అధినేత బాల్ ఠాక్రే కథను తెరకెక్కించిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు అనంతపురం ఫ్యాక్షన్ పై దృష్టి పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఫ్యాక్షన్ నేతగా ముద్రపడ్డ పరిటాల రవి, మద్దెల చెరువుసూరి కుటుంబీకుల మధ్య నెలకొన్న ఫ్యాక్షన్ ఘర్షణలను ఇతివృత్తంగా తీసుకుని ‘రక్త చరిత్ర’ అనే పేరుతో రెండు భాగాలుగా సినిమాను చిత్రీకరించాడు. ఇంతకీ ఈ సినిమా ద్వారా వర్మ ఏం చెప్పబోతున్నాడు
రామ్‌గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్రలో పరిటాల రవిగా వివేక్ ఓబెరాయ్, పరిటాల సునీతగా రాధికా ఆప్టే, మద్దెలచెరువుసూరిగా తమిళ నటుడు సూర్య, ఎన్టిఆర్ పాత్రలో శత్రుఘ్నసిన్హా , మొద్దుశ్రీను పాత్రలో బాలీవుడ్ కొత్త నటుడు నటించాడు. ఈ సినిమాలో గంగుల భానుమతి పాత్రతో పాటు మొద్దుశ్రీనును చంపిన ఓం ప్రకాష్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. శ్రీరాములయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం రోజు ఫిలింనగర్లో జరిగిన బాంబు బ్లాస్ట్ వంటి యధార్థ సంఘటనలతో తెరకెక్కిన ఈ రక్తచరిత్ర రెండు పార్టులుగా జనం ముందుకు రానుంది. మొదటి భాగంలో పరిటాల రవి, రెండవ పార్ట్‌లో మద్దెల చెరువు సూరి కథ కనిపిస్తుందని వర్మ చెబుతున్నాడు.
వర్మ తీసిన సినిమాలో నిజాంగానే అనంతపురం ఫ్యాక్షనిజం, రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాడా? పరిటాల రవి హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా ఈ సినిమాలో చూడవచ్చంటున్నారు.. ఇప్పుడీ చరిత్రను తెరకెక్కించటం అవసరమా? అనంతపురం జిల్లా ఇవాళ్టికీ రక్తపుటేర్లలలోనే మునిగి ఉందన్నట్లుగా వర్మ తన ట్రయిలర్లో చెప్పుకొచ్చారు.. కురుక్షేత్రాన్ని మించిన యుద్ధభూమిని అనంతపురం తలపిస్తోందన్నట్లుగా చెప్తున్నారు..
ఇవాళ అనంతపురం అలా ఉందా? పరిటాల రవి హత్య జరిగిన తరువాత అనంతపురంలో పరిస్థితులు చాలావరకు మారాయి.. ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. పరిటాల, సూరి కుటుంబాలు ఎవరికి వారుగానే ఉండిపోయాయి.. కక్ష్యలు, కార్పణ్యాలు అంతగా కనిపించటం లేదు.. అలాంటప్పుడు ఇప్పుడీ సినిమాను తీయటం ద్వారా రాం గోపాల్ వర్మ ఏం చెప్ప దలచుకున్నాడు.. ఫ్యాక్షనిజం గురించి తాను మాట్లాడటం లేదని వర్మ చెప్తున్నా... ఇప్పుడు రక్తచరిత్ర రవి, సూరిల కథ అని స్పష్టంగానే తేలిపోయింది. ఇప్పుడు సినిమాలో ఏ వైపు బ్యాలెన్స్ ఏ కాస్త తప్పినా, ఒక వర్గం అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉంది.. ఆ పరిస్థితి గత కక్ష లను మళ్లీ రాజుకునేందుకు అవకాశం ఇస్తుందా? అదే జరిగితే అనంత పురం మరోసారి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.. వర్మ దీనికి ఏం జవాబు చెప్తాడు..
7 కామెంట్లు:
స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రని నెగటివ్ గా చూపించ బోతున్నాడని ఒక టాక్ ఇక్కడ చూడండి
హింస.హింస.హింస.
ఈ దర్శకుడికి బాగ తెలిసింది తెరమీద హింసని చూపడమే. ఇతన్ని చిన్నపిల్లలకోసం ఏనిమేషన్ సినిమా తీయమన్నా, అలాగే తీస్తాడు.
ఇక ఇతని సినిమాల వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, అతనికైతే ఉంది. మరి జనాలకి?
ఏమీ జరగదు. వారం రోజులు ఆడే సినిమాల గురించి ఏదో జరుగుతుంది అనుకోకండి. నాకూ రాము టెక్నికాలిటీ అంటే చాలా ఇష్టం. ఇట్లాంటి వెధవ సినిమాలు మాత్రం కాదు.
సీమలో ఫ్యాక్షన్లు ఉండొచ్చు. గత కొద్ది కాలంగా దాదాపు తగ్గుముఖం పట్టాయి. కొత్త తరం పిల్లలు డబ్బు సంపాదన ఇతర ఆదాయ మార్గాల గురించి ఎక్కువ ఆలోచించడం కారణం కావచ్చు.
అయితే అనంతపురం అంటే ఫ్యాక్షన్లే కాదు... వర్షం కోసం ప్రతి క్షణం పరితపించే పేద రైతులు, వర్షమే రాకపోతే గాల్లో కలిసిపోయే ప్రాణాలు, దిక్కుమాలిన వ్యవసాయం తప్ప మరో ఆదాయమార్గం లేని జీవితాలు, ఒక కుటుంబం మొత్తం కడుపు నింపుకోవడానికి ఇంట్లోని ఓ ఆడ కూతుర్ని పడుపు వృత్తికి పంపే సొంత తండ్రులు, ఉన్న నేల...
దీని గురించి ఎవరూ అలోచించరు. అదే విషాదం...
Movies valla faction malee raajukovadam anedi undadu andee..chedu tvaragaa talaki ekkutundi antaaremo kaani cinema choosi ventane kattulu bombs pattukuni tayarayyevallu evaru cheppandi ippatukippudu Anantapore lo?edo kaasta aaveshakaaveshalu raavacchu.idi ye cinema lo ayina jaarigede,maa hero ni takkuva chesi chooparano marotano cheppi godavalu sahajame kadaa,alaantive emayinaa jarugutaayemo tappa faction mallee raajujovadama nedi undadu.just movi vacchina first 2 days kaasta gola untundemo ante.media kooda ati chestundi lendi.vaalla meeda satires vesadu Ran lo ani(though that was a flop and not so ggod movie)media akkasu anukuntaa..
సొంత కథ రాసుకుని హిట్లు కొట్టలేని ప్రతీ తలమాసిన డైరెక్టరు మా సీమ లో జరిగిన వాటిన చిలువలు వలువలు గా చెప్పి కాసింత డబ్బు వెనకేసుకుంటారు.. ఇప్పుడు ఆ జాబితాలో రాము కూడా చేరాడు.. తెలుగులో బీ. గోపాల్ వగైరా ఉన్నారు కదా..
-కార్తీక్
I am sorry to say this but I agree with Santhosh Kumar Sir . Movies sure they won't effect elder people , but think about the young generation from 12 years to 26 years . Really they get effected with movies . No body is born with bad ideas . Society makes them like that . Movies are part of society .They are doing their best to spoil the Society .
Regards
telugukingdom.net
ram goapl varmaku dyyam pattindi.
himsa, bhyapeetadm lanti subject tappa inkemi tiyadam chetakadu.
Ante kadu na cinemalu cheste chudandi lekapote ledu Anna ahamkari. mally ayana cinema chudlante mankaina siggundali
కామెంట్‌ను పోస్ట్ చేయండి