31, డిసెంబర్ 2019, మంగళవారం

bejawada gopalreddy

స్వాధ్యాయ సమర్పిస్తున్న మహత్తరమైన నాయకుడి అపూర్వ స్వరమిది. భారత దేశంలో మద్రాస్

ప్రెసిడెన్సీలో 1937లో ఏర్పడిన మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన

మంత్రిగా ప్రమాణంచేసిన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి 50 సంవత్సరాలకు పైగా రాజకీయ

అనుభవాల సారాంశం ఆయన స్వరంలోనే విందాం. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రరాష్ట్రం

ఏర్పడినంతవరకు ఆ తర్వాత కేంద్రమంత్రిగా, గవర్నర్గా పనిచేసి రాజకీయాలనుంచి వైదొలిగిన

తర్వాత చేసిన రేడియో రికార్డింగ్ ఇది. ఆ రోజుల్లో మంత్రిత్వశాఖలు.. అధికారాలు.. జీతభత్యాలు..

మంత్రులుగా ఎవరెవరు ఉండేవారు.. పరిపాలన ఎలా సాగింది అన్నింటిపైనా సమగ్రంగా

వివరించిన అత్యద్భుతమైన స్వరమాధురి ఇది. అందరూ తప్పనిసరిగా వినితీరాల్సిన ఆడియో

ఇది. కేవలం 22 నిమిషాల ఈ క్లిప్ ఆసాంతం వింటే.. ఆంధ్రరాష్ట్రంలో రాజకీయాల ఒక పరిణామ

క్రమం మనకు కొంతమేర అవగాహన కలిగే అవకాశం ఉన్నది. తప్పకుండా వినండి. పదిమందికి

వినిపించండి. ఇలాంటి మహానుభావులు మరికొందరి  స్వరాలు వినడానికి చానల్ ను సబ్స్క్రైబ్

చేయండి. వీడియోలను షేర్ చేయండి. లైక్ చేయండి. పదిమందికి చూపండి. వినిపించండి.

తెలుగువారందరికీ అత్యంత ముఖ్యమైనవి.. పదిలపరుచుకోదగినవి పదిమందికి చేరాలన్నదే

స్వాధ్యాయ లక్ష్యం. ధన్యవాదాలు.

28, డిసెంబర్ 2019, శనివారం

A rare artisans visuals in warangal, hyderabad in 1959

ఒక్కసారి మనం చూడని మన ఊళ్లను చూద్దాం. మొదటగా నేను పుట్టిన నా జన్మభూమి వరంగల్తో పాటు హైదరాబాద్ కు సంబంధించిన కొన్ని అరుదైన విజువల్స్ చూద్దాం. 1959లో హైదరాబాద్, వరంగల్ ఎలా ఉన్నాయి..  గాజులు తయారీచేసేవాళ్లు.. వెండి ఆకులు తయారుచేసేవారు.. డై తయారీ దారులు .. సంప్రదాయ వస్త్రధారణలో లంబాడా మహిళలు.. వరంగల్ కోట.. ఇలా పలు అంశాలను కలగలసిన విజువల్స్.. ఇవి. అరుదైన వీడియో.. తప్పక చూడండి.. మరికొన్ని అరుదైన వీడియోలు.. ప్రముఖుల ఆడియోలు కూడా చూద్దాం.. విందాం. ఈ అరుదైన వీడియోలు చూడటానికి.. స్వరాలు వినడానికి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలను షేర్ చేయండి. లైక్ చేయండి. పదిమందికి చూపండి. వినిపించండి. తెలుగువారందరికీ అత్యంత ముఖ్యమైనవి.. పదిలపరుచుకోదగినవి పదిమందికి చేరాలన్నదే స్వాధ్యాయ లక్ష్యం. ధన్యవాదాలు. 

25, డిసెంబర్ 2019, బుధవారం

legendery poet dasarathi interview

దేశం గర్వించదగ్గ మహాకవి.. మహాంధ్రోదయ కావ్యకర్త.. సినీగేయకవి.. దాశరథి క‌ృష్ణమాచార్య అపూర్వ గళాన్ని వినండి. ఆయన పశ్చిమ దేశాలను పర్యటించి వచ్చిన అనంతరం వేలూరు సహజానంద చేసిన ఇంటర్వ్యూ ఇది. తప్పక వినండి.. షేర్ చేయండి. లైక్ చేయండి. మరి కొందరు మహానుభావుల  స్వరాలను వినడానికి చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అద్భుతమైన ఈ అపూర్వ వ్యక్తుల స్వరాలను పదిమందికి వినిపించండి. మీమీ పరిధిలో షేర్ చేయండి. అందరూ వినాలన్నదే ఈ చానల్ లక్ష్యం. ధన్యవాదాలు

17, డిసెంబర్ 2019, మంగళవారం

చలం గురించి.. మహానుభావులు ఏమనుకున్నారు?

చలం తన గురించి తానేమన్నాడో విన్నాం. చలం గురించి.. ఆయన రచనల గురించి.. రమణాశ్రమానికి చేరుకున్న తర్వాత మారిన చలం గురించి తెలుగు సాహిత్యలోకంలో ఇవాళ్టికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన గురించి ఆయన సమకాలంలో మహానుభావులు ఏమనుకున్నారు. సెలెక్టివ్ గా ఒక నలుగురి అభిప్రాయాలు విందాం. ఈ నలుగురు కూడా భిన్నమైన సాహిత్యవాదాలకు సంబంధించినవారు. వీరు 1. విశ్వనాథ సత్యనారాయణ, 2. ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి, 3. ముప్పాళ్ల రంగనాయకమ్మ, 4. శ్రీరంగం శ్రీనివాసరావు. నాలుగు భిన్న ధ్రువాలు చలం గురించి వ్యక్తంచేసిన అభిప్రాయాలు తప్పక వినండి. ఈ చానల్ మీది. మరిన్ని ప్రముఖుల స్వరాలను, ఇతర అంశాలకు సంబంధించిన వీడియోలకోసం చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి

11, డిసెంబర్ 2019, బుధవారం

మేడారం.. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర

మేడారం.. ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర. దీనిపై ఇప్పటివరకు ఎక్కడా రాని.. ఎవరూ సాహసించని, ఎవరికీ తెలియని సమగ్రమైన.. సంపూర్ణమైన సమాచారంతో చిత్రీకరించిన లఘుచిత్రం. కోటిన్నర మందికి పైగా పాల్గొనే ఏకైక గిరిజన పండుగపై డాక్యుమెంటరీని స్వాధ్యాయ సగర్వంగా సమర్పిస్తున్నది.. మేడారం జాతర గురించి చాలామందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. జనరల్ మీడియాలో వచ్చే కథాకథనం మినహా స్థల పురాణం తప్ప మరేమీ తెలియదు. జాతరకు వెళ్లిరావడమే తప్ప దాని గురించి సమగ్రమైన.. లోతైన అవగాహన ఉన్నవాళ్లు చాలా తక్కువ. అందరికీ తెలిసినంతమేరకు మేడారం నాలుగురోజుల పండుగ. కానీ.. మేడారం పండుగ మొత్తం నెలరోజులు చేసుకునే పండుగ. గుత్తికోయలు, పారకోయలు తదితర పన్నెండు రకాల తెగల కోయలు.. చెంచులు జరుపుకునే జాతర. పదిరకాల గోత్రీకులు పూజలు నిర్వహించే పండుగ. ఆడవారే పూజారులుగా పూజలు నిర్వహించే పండుగ. కంకబొంగు, నెమలినార, సొరకాయ, చిక్కుడు, వంటి ఎన్నో పదార్థాలతో ప్రకృతితో మమేకమై చేసుకొనే పండుగ. బెల్లాన్నే బంగారంగా సమర్పించుకునే జాతర. దాదాపు 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుపుకునే జాతర. వరం పట్టడం వంటి పదిరకాల మొక్కులు తీర్చుకునే జాతర. వీటి గురించి ఇప్పటి వరకు సమగ్రమైన సమాచారం ఎక్కడా అందుబాటులో లేదు. జాతర ఎప్పుడు.. ఎలా మొదలవుతుంది.. ఎలా నిర్వహిస్తారు అన్న సమాచారం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు పూజారుల నోటివెంటే వినాలి. మేడారంపై సమగ్రంగా.. సంపూర్ణ సమాచారంతో.. ఉన్న 30 నిమిషాల డాక్యుమెంటరీ ఇది. తప్పకుండా చూడండి. తెలుగువారంతా తప్పకుండా తెలుసుకోవలసిన మన సంస్కృతి ఇది. ఈ డాక్యుమెంటరీని చూడండి. లైక్ చేయండి. షర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.

8, డిసెంబర్ 2019, ఆదివారం

మహాకవి శ్రీశ్రీ తో అభ్యుదయ కవి అనిశెట్టి



ఆయన కనులు మూస్తే పద్యం వచ్చింది.. పెదవి కదిపితే నాదమయింది. నినదిస్తే విప్లవమైంది.. నిలదీస్తే తిరుగుబాటు బావుటా ఎగిరింది..

శ్రీశ్రీకి కవిత్వం ఒక తీరని దాహం.. తాను కవిత్వం రాసేందుకు వస్తువు ప్రధానం కాలేదు.. శిల్పం అక్కరకు రాలేదు.. లయ అవసరం లేనే లేదు.. రసం దృష్టిలోనే లేదు.. ఆయన కవిత్వం ఒక నాదం... మనస్సులో ఒక్కుదుటున కలిగే ప్రకంపనలకు అక్షర రూపం ఇస్తే దానికి పేరు శ్రీశ్రీ కవిత్వం. అంతటి మహాకవి శ్రీశ్రీతో ప్రఖ్యాత అభ్యుదయ కవి అనిశెట్టి చేసిన మాటామంతి.. వారి అపూర్వ గళంలో వినండి... ఈ అపూర్వ గళాన్ని పూర్తిగా వినండి. మన మార్గదర్శకులు వీరు. ఇంతటి మహాపురుషుల మరిన్ని స్వరాలను మీకు  అందిస్తుంది సాధ్యాయ. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి స్వాధ్యాయ చానల్ను.

5, డిసెంబర్ 2019, గురువారం

సాక్షాత్ సరస్వతి.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గతంలో ఎవరూ వినని ...

స్వాధ్యాయ సగర్వంగా సమర్పిస్తున్న మరో అపూర్వ గళం .. సాక్షాత్తు సరస్వతి.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ స్వగతమిది. మునుపెన్నడూ వినని అంశాలు ఆయన స్వరంలో అరుదైన చిత్రాలతో సహా కనీ వినవచ్చు. తమవంటి శిష్యుడు చెళ్లపిళ్ల వారికి దక్కడం నన్నయ్యకు.. తిక్కనకు కూడా లేదని చెప్పగలిగిన మహాపురుషుడు. వారి తండ్రిగారు భూమిని ఎలా దానధర్మాలు చేసింది.. ఆ తర్వాత కిన్నెరసాని వాగును ఆయన ఎప్పుడు ఎలా చూశారు.. దాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతి.. వీటన్నింటి గురించి సవివరంగా ఆయన ప్రఖ్యాత సాహితీమూర్తులు శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, వేలూరి సహజానంద చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని విడి విడి అంశాల సమాహారం ఐదు నిమిషాల నిడివిలో... తప్పకుండా పూర్తిగా వినండి..

మన మార్గదర్శకులు వీరు. ఇంతటి మహాపురుషుల మరిన్ని స్వరాలను మీకు  అందిస్తుంది సాధ్యాయ. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి స్వాధ్యాయ చానల్ను. 

29, నవంబర్ 2019, శుక్రవారం

పాత్రికేయ ద్రోణాచార్యుడు డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ జ్నాపకాలు ఆయన స్వీయ స...



తెలుగు పాత్రికేయ ప్రపంచంలో జగమెరిగిన వాడు. 1990 నుంచి ఒక దశాబ్దం పాటు వేలాది పాత్రికేయులను తీర్చిదిద్దినవాడు. పాత్రికేయ ద్రోణాచార్యుడు.. శ్రీ బూదరాజు రాధాకృఫ్ణ గారు. మాటల మాష్టారు. ఆయనకు చిన్నతనం నుంచే పద్య రచన ఎలా అలవడింది.. కవిత్వానికి పద్యానికి తేడా ఏమిటి? తన ఉద్యోగ జీవితంలో .. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సన్నివేశాలు.. వాటిని పద్య రూపంలో ఎలా వ్యక్తపరిచేది.. ఈ విషయాలన్నీ ఆయన అపూర్వ గళంలోనే విందాం. ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగత జీవితం గురించి.. సాహిత్య జీవితం గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఇప్పుడా విశేషాలను తెలుసుకోండి. ఈ అపూర్వ గళాన్ని పూర్తిగా వినండి. మన మార్గదర్శకులు వీరు. ప్రతి పాత్రకేయుడు తప్పనిసరిగా ప్రేరణ పొందాల్సిన అనేక అంశాలు ఆయన స్వరంలోనే తప్పకుండా వినండి.

మరికొందరు మహాపురుషుల మరిన్ని స్వరాలను మీకు అందిస్తుంది సాధ్యాయ. ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి స్వాధ్యాయ చానల్ను.

24, జులై 2019, బుధవారం

గణపతి ఎవరు?

గణనాథుడి ఆవిర్భావమే ఒక విశేషం. ఆయన అవతారం వెనుక అనేక అంశాలు దాగున్నాయి. ఆయన గజముఖం కూడా అలా సింబాలిక్ గానే భావించాలి. గాణపత్య మార్గంలో గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అనంతమైన శూన్యం నుంచి ముందు పదార్థం  (material)ఏర్పడింది.దాని నుంచి సమస్త జీవజాలం ఆవిర్బవించింది. గణపతి స్థూలకాయం మెటీరియల్ అయితే, ఏనుగుముఖం జీవజాలానికి ప్రతీక. మనిషి మానవుడిగా మాత్రమే కాకుండా దివ్య చైతన్యాన్ని సాధించే దిశగా జీవించాలని గణపతి సూచిస్తున్నాడు. గణేశుడికి సంబంధించిన రహస్య కథాకథనాలను రెండు భాగాలుగా ఈ వీడియోల్లో చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయండి.

ఎవరీ గణపతి?

ప్రపంచంలో తొలి సర్జన్ ఎవరు? చనిపోయిన వాళ్లను బతికించడం సాధ్యమేనా? ప్లాస్టిక్ సర్జరీ అతి పురాతనమైనదేనా? వినాయకుడి సృష్టి వెనుక ఉన్న రహస్యమేమిటి? తొలిపూజలు గణేశుడికే ఎందుకు చేయాలి? హిందూ దేవతలందరికీ అందమైన రూపాలు, అందమైన వాహనాలుండగా.. గణపతికి ఇంత వింతైన రూపం ఎందుకు ఉన్నది? అంత భారీ కాయానికి చిట్టెలుక వాహనంగా ఉండటమేమిటి? హిందూ మైథాలజీలో అత్యంత అద్భుతమైన దైవ స్వరూపం వెనుక ఉన్న రహస్య కథాకథనాన్ని గురించి తప్పక తెలుసుకోవాల్సిన వీడియో. గణేశుడి గురించిన సంపూర్ణమైన విశ్లేషణ రెండు భాగాలుగా వస్తున్నది. తప్పక చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే చానల్ను సబ్ స్క్రైబ్ చేయండి.. లైక్ చేయండి, షేర్ చేయండి

26, జూన్ 2019, బుధవారం

4, జూన్ 2019, మంగళవారం

టీకా మంచిదేనా ? (vaccinaton the hidden truth)


మీ పిల్లలకు టీకా వేయించారా
వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారా?
జాగ్రత్తగా గమనించండి
మీ పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరగటంలేదు
టీకాలు సరిగ్గా పనిచేయటంలేదు
వాక్సిన్లు వ్యాధి నిరోధకాలు కావా?
టీకా తాత్పర్యం ఏమిటి?
టీకా మంచిదేనా ?
watch the video
like it.. comment.. share it.. subscribe it..



1, జూన్ 2019, శనివారం

మూడో కన్ను (భృకుటి ముడిపడితే అంతే)

మహా ప్రళయాన్ని సృష్టించే కన్ను పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నదా? మనిషికి మూడో కన్ను ఉండే అవకాశం లేదా? ఉంటే ఎక్కడ ఉన్నది? మనకు కోపం వచ్చినప్పుడు భృకుటి ఎందుకు ముడిపడుతున్నది? అక్కడ మనకూ మూడో కన్ను ఉంటుందా? మన సబ్ కాన్షియస్ మైండ్ ను కంట్రోల్ లో ఉంచేది ఏమిటి?మనలో ఇంటర్నల్ లెవల్లో ప్రసరించే అనంతమైన కాంతికి మూలం ఎక్కడ ఉన్నది? శివలింగానికి మూడో కన్నుకు సంబంధంఏమిటి? కపాలమోక్షం అంటే.. మూడో కన్ను విచ్ఛిత్తి కావడమేనా? మూడో కన్ను సీక్రెట్ ఏమిటో తెలుసుకొండి..
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే.. చానల్ ను సబ్ స్ర్కైబ్ చేయండి. లైక్ చేయండి.. మీ మిత్రులకు షేర్ చేయండి. 

29, మే 2019, బుధవారం

ఎలా గెలిచారు?

యుద్ధంలో బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలిక కాదు. కేవలం ధర్మమే గెలుస్తుందనో.. నీతి నిజాయితీతోనే విజయం సాధిస్తామనో చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ప్రత్యర్థిని వీక్ చేసి గెలుపు సాధించడం ఒక గొప్ప విద్య. అదే యుద్ధ నీతి. ఆ విద్య, ఆ నీతి.. నేడు మోదీకి తెలిసిందంటే.. దాని మూలాలు.. ఎక్కడో లేవు. కురుక్షేత్రంలో ఉన్నాయి. ఒకరి తరవాత ఒకరిని ఎవరిని కలువకుండా.. చేస్తూ.. నాయకత్వమే బలంగా లేకుండా చేస్తూ.. గెలవడం పాండవులు చేసిన గొప్ప పని.  ఇంతకీ వాళ్ల విన్నిం గ్ స్ట్రాటజీ ఏమిటి? ఇవాళ విజేతలు అనుసరించిన వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే.. నాడు పాండవులు ఎలా గెలిచారన్నది తెలుసుకోవలసిందే.. ఈ వీడియో చూడండి..  please subscribe it. share it. like it

https://youtu.be/_W4yDX2FiL8

16, మే 2019, గురువారం

కైలాసం నుంచి శివుడు పారిపోయాడు. ఎక్కడికి వెళ్లాడు? ఎక్కడున్నాడు? పార్వతీదేవి ఆందోళన చెందుతున్నది.. ముక్కోటి దేవతలు సర్వలోకాలు వెతుకుతున్నారు. శంకరుడు ఎక్కడ?.... గుప్తమహాదేవుడి గురించిన సమగ్రమైన వివరాలు తెలుసుకొండి.. ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను తప్పక చూడండి...మరిన్ని  వీడియోలు మిస్ కాకుండా చూసేందుకు చానల్ను సబ్ స్క్రైబ్ చేయండి.
https://youtu.be/2rBTR_zw9-4https://youtu.be/2rBTR_zw9-4

9, మే 2019, గురువారం

అల్లూరి సీతారామరాజు అవతార పురుషుడా?

ప్రణవనాదం ఎక్కడ పుట్టింది? శివుడు ఢమరుకాన్ని.. త్రిశూలాన్ని ధరించిందెక్కడ? భరత మునికి నాట్యశాస్త్రాన్ని బోధించిందెక్కడ? నిశ్శబ్దంలోనూ వినిపించే ఏకైక ధ్వని.. దాని తరంగాలు ప్రతిధ్వనించే ప్రదేశం.. ఆకారంలో కూడా ఓంకారాన్ని ప్రతిఫలించే అద్భుత పర్వతమిది.. పరమేశ్వరుడి మొదటి కైలాసం.. ఆది కైలాసం... తప్పక చూడండి...
 ఈ వీడియోలు మిస్ కాకుండా చూసేందుకు చానల్ను సబ్ స్క్రైబ్ చేయండి.
like it.. subscribe the channel.. share it 

https://youtu.be/M1pkfQJtl7k

27, ఏప్రిల్ 2019, శనివారం

శ్రీకృష్ణుడు నిజమా? అబద్ధమా? నిజమే అయితే  దేవుడా? ఏలియనా? ఇదొక విచిత్రమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరైనా జవాబు చెప్పగలరా? పుడితే ఎప్పుడు పుట్టాడు. ఎన్నేండ్లు ఈ భూమ్మీద పుడితే ఎప్పుడు పుట్టాడు? మధురలో ఎన్నాళ్లు ఉన్నాడు? గోకులంలో ఎన్నాళ్లు ఉన్నాడు? ద్వారకలో ఎంతకాలం జీవించాడు? ఎన్నేండ్ల వయసులో భారత యుద్ధం జరిగింది? భాగవతంలో, భారతంలో కృష్ణుడి గురించి చాలా వివరాలున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త ఎస్ ఆర్ రావు, వీవీ వర్తక్ లు చెప్పిన వివరాలు ఏమిటి? తప్పక చూడాల్సిన వీడియో ఇది. like it.. subscribe it..


అపూర్వ గళాలు సిరీస్ లో ఇది మూడవ గళం. నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా గారి అపూర్వ గళమిది. అత్యంత అరుదైన స్వరమాధురి. నవయుగాది కవితాగానం చేసిన జాషువాగారి స్వరం వినండి. మిస్ కావద్దు. మరిన్ని స్వరాలను, వీడియోలను చూడటానికి ముందు చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. 

17, ఏప్రిల్ 2019, బుధవారం

రాముడికి సీత ఏమవుతుంది? విష్ణువైన రాముడిని ఆయన భార్య అయిన భూదేవి కూతురని భావిస్తున్న సీతాదేవి ఎలా వివాహం చేసుకున్నది? సీతారాముల జననం వెనుక దాగిన అతి గొప్ప రహస్యమేమిటి?  వాల్మీకి రామాయణం చెప్తున్నదేమిటి? తప్పకుండా చూడాల్సిన వీడియో..  please like and Subscribe.. and encourage the channel
visit our website : http://swadhyaaya.com

రాముడికి సీత ఏమవుతుంది?

13, ఏప్రిల్ 2019, శనివారం

18days- 4 Ancient World war

18 days -3 Ancient world War

మహాభారత యుద్ధంపై ప్రత్యేకమైన, హేతుబద్ధమైన విశ్లేషణతో వస్తున్న వీడియో పరంపరలో ఇది రెండవది. భారత యుద్ధంలో ఏరోజు ఏం జరిగిందన్నదే కాకుండా ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది? గెలుపే లక్ష్యంగా సాగిన ఈ యుద్ధంలో ఎవరి స్ట్రాటజీ ఏమిటి? ఎవరి రాజనీతి ఎలాంటిది? ఎవరి కూట నీతి ఎలాంటిది? కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలతో సాగిన యుద్ధంలో పాండవులు ఎలా గెలిచారన్న దానిపై విశ్లేషణాత్మక దృశ్య కథనాలు...... please like and Subscribe.. and encourage the channel
visit our website : http://swadhyaaya.com