ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారా? చేయరా? ఇపుడు తెలంగాణ రాజకీయాలలో ఇదే చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కవిత అరెస్టు తప్పదనే అనిపిస్తోంది. సీఎం కేసీఆర్ మొదటిసారిగా ఈ స్కాంపై స్పందించడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. అదానీ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిందని కేసీఆర్ విమర్శించారు. దీంతో ఈ వ్యవహారంలో ఏ పరిణామం జరిగినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి