6, జులై 2023, గురువారం

ఇదే జరిగితే.. బీజేపీ కి సున్నాయే.. #bjptelangana #congresstelangana



బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్,  కరీంనగర్, నిజామాబాద్,  ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మంట్ లలో కాషాయపార్టీ కొంత మాత్రమే   బలహీనపడితే అక్కడ బీఆర్ఎస్ కే లాభం కలగొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. అదే  బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన  చేవెళ్ల, జహీరాబాద్ లలో బీజేపీ బలహీనపడితే  కాంగ్రెస్ కు లాభం కలగవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలలో  బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో ఉంది. ఇక  బీజేపీ రెండో స్థానంలో ఉన్న మహబూబ్ నగర్ లో ఈ సారి కూడా గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. బీజేపీ పూర్తిగా బలహీనపడితే కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఉంటుంది.  అంటే ఇపుడు వచ్చే ఎన్నికలలో ఫలితాలను ఒక రకంగా బీజేపీ డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు.

రావణ లంకలో అంతా రామమయం..కల్పవృక్ష వ్యాఖ్యానం-సుప్రసన్న #telugu #కవిత #సా...



రావణ లంకలో అంతా రామమయం.. ఆచార్య కోవెల సుప్రసన్న రామాయణ కల్పవృక్ష వ్యాఖ్యానం

3, జులై 2023, సోమవారం

తరువాతి టార్గెట్ నితిశ్ కుమారే.. #bjptelangana #brs #congresstelangana


బీజేపీ వ్యూహమేంటో విపక్షాలకు ఇపుడిపుడే అర్థమవుతోంది. ఓవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న సమయంలోనే మహారాష్ట్రలో ఎన్సీపీను చీల్చిన కాషాయపార్టీ విపక్ష కూటమికి పెద్ద షాకే ఇచ్చింది. బీజేపీ దూకుడు ఇంతటితో ఆగదని కూడా  అనుకుంటున్నారు. విపక్షాలు ఏకమయ్యేమాట అటుంచితే ఇపుడు అవి తమ సొంత పార్టీలను కాపాడుకునే పనిలో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. 

ఉమ్మడి పౌరస్మృతి పై వివాదం దేనికి? తెలుగు మీడియాలో తొలిసారి సమగ్ర విశ్లే...


 మళ్లీ ఇప్పుడు యూసీసీ చర్చ మొదలైంది. యూసీసీ బిల్లు తీసుకురావడం వల్ల కేవలం ముస్లింలపైనే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన పర్సనల్ చట్టాలలో మార్పులు వస్తాయి. హిందూ అవిభాజ్య కుటుంబాలకు సంబంధించిన చట్టాలతోపాటు, సిక్కులు, పార్శీలు, జైనులు, క్రైస్తవులకు చెందిన పలు చట్టాలనూ సవరించాల్సి వస్తుంది.  యూసీసీ పై తెలుగు మీడియాలో తొలిసారి సమగ్రంగా విశ్లేషించిన కథనం.. 

1, జులై 2023, శనివారం

ఇలా అయితే వచ్చేది లేదు.. తెలంగాణ బీజేపీ నేతలకు మోడీ హెచ్చరిక #bjptelanga...



తెలంగాణ బీజేపీ తీవ్ర అయోమయంలో పడింది. బయటి నుంచి వచ్చిన నాయకులు.. లోపల ముందు నుంచి ఉన్న నాయకుల మధ్య పొసగడం లేదు. ఈ పరిస్థితి ప్రధాని మోడీ సహా, జాతీయ నాయకత్వానికి తీవ్ర సమస్యగా మారింది.