బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మంట్ లలో కాషాయపార్టీ కొంత మాత్రమే బలహీనపడితే అక్కడ బీఆర్ఎస్ కే లాభం కలగొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్యే ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. అదే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన చేవెళ్ల, జహీరాబాద్ లలో బీజేపీ బలహీనపడితే కాంగ్రెస్ కు లాభం కలగవచ్చు. ఎందుకంటే గత ఎన్నికలలో బీజేపీ ఇక్కడ మూడో స్థానంలో ఉంది. ఇక బీజేపీ రెండో స్థానంలో ఉన్న మహబూబ్ నగర్ లో ఈ సారి కూడా గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. బీజేపీ పూర్తిగా బలహీనపడితే కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఉంటుంది. అంటే ఇపుడు వచ్చే ఎన్నికలలో ఫలితాలను ఒక రకంగా బీజేపీ డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి