21, జులై 2023, శుక్రవారం

మీ స్వాతంత్య్రం మేం పెట్టిన భిక్ష.. ఆయన చేసిందేమీ లేదు.. #ramambhajeshya...



ఆధునిక పాశ్చాత్య ఔదార్యవాదము.. పాశ్చాత్య దేశాలు ఆధునిక ప్రపంచానికి పెట్టిన భిక్ష. నా దేశీయులు భారతదేశంపై తమ పరిపాలనాధిపత్యాన్ని వదులుకొని భారత ప్రభుత్వ యంత్రాంగాన్ని భారత ప్రజలు ఎన్నుకొన్న నాయకుల ఆధీనంచేసి తరలిపోవడమనేది ఔదార్యవాదము యొక్క పర్యవసానమే. ఏ నాయకులకు తాము ప్రభుత్వాన్ని అప్పగింత పెట్టారో.. వారినే ఒకప్పుడు కారాగారాలలో బంధించారు. తిరిగి వారికే అధికారమార్పిడి జరిగింది. పాశ్చాత్య ఔదార్యవాదం యొక్క ఈ పర్యవసానానికి నేను మిక్కిలి గర్విస్తున్నాను. అంతేకాదు.. మీరు మీ రాజకీయ స్వాతంత్ర్యం పొందిన పిమ్మట మీ దేశ పరిపాలన నిమిత్తం పాశ్యాత్య విధానపు పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిపాలనా వ్యవస్థను స్వీకరించవలెనన్న నిర్ణయం గైకొని తద్వారా పాశ్చాత్య ఔదార్యవాదంపై మీకుగల ఆదరాభిమానాలను వ్యక్తంచేశారు. ఇదికూడా పాశ్చాత్య ఔదార్యవాద ఫలితమే. రామం భజే శ్యామలం 6వ భాగం. ramam bhaje shyamalam 6

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వారు పెట్టిన భిక్ష అని పూర్తిగా అనలేం కానీ .. నేనెక్కడో చదివిన మరో విశ్లేషణ ప్రకారం … రెండవ ప్రపంచ యుద్ధం లో తలమునకలై ఉండడం వల్ల, వలస రాజ్యాల మీద దృష్టి పెట్టలేక, ఇక మెల్లిగా వలస రాజ్యాలకు స్వాతంత్ర్యం ఇచ్చేసి తప్పుకుందామనే ఆలోచన బలీయంగా ప్రవేశించడం వల్ల మనకు స్వాతంత్ర్యం ఇవ్వడానికి దోహదం చేసిందని. నిజమెంతో తెలియదు.

శ్రీశ్రీ గారి పాటలో అన్నట్లు -
“ఏది సత్యం, ఏదసత్యం”
గుర్తుకు వస్తే తప్పు లేదు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.