29, ఏప్రిల్ 2023, శనివారం

కేసీఆర్ మాటల్లో నూతన సచివాలయం #brs #kcr #telangana



కేసీఆర్ మాటల్లో నూతన సచివాలయం.. దాని అవసరం ఏమిటి? అందులో ఏమున్నాయి?

బీజేపీలో రెజ్లర్ డాన్ (wrestler don in bjp) #bjptelangana #brs #congress...

who killed mounika మౌనికను చంపిందెవరు? #rains #rainsinhyderabad hyderabad

మతమార్పిళ్లను అడ్డుకొంటే తాట తీస్తా? రాష్ట్రాలకు నెహ్రూ హెచ్చరిక #secula...




28, ఏప్రిల్ 2023, శుక్రవారం

100 crores for mann ki baat (మనసులో మాటకు వంద కోట్లా?) #mankibaat #manki...


వందో ఎపిసోడ్ విషయంలోనే ప్రభుత్వ తీరు  చాలా మందికి నచ్చడం లేదు. దీనిని  ఒక అభివృద్ది  కార్యక్రమంలా నిర్వహించాలనుకోవడమే విమర్శలపాలవుతోంది. ఈ వందో ఎపిసోడ్ ను  గల్లీ నుంచి ఢిల్లీవరకే కాదు విదేశాల్లోనూ వినిపించాలనుకుంటున్నారు. అది కూడా దీనిని ప్రతీ చోటా కచ్చితంగా వినే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి దాదాపు వంద కోట్లు ఖర్చు చేయాలనుకోవడం పైనే చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  దీనిని ఇంత అట్టహాసంగా నిర్వహించాల్సిన అవసరముందా అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా టీవీలలో సీరియల్స్ వందో ఎపిసోడ్ కు  ప్రోమో  ఇచ్చినట్టుగా ఇపుడు మోడీ మన్ కీ బాత్ కు కూడా గట్టిగానే ప్రమోషన్ చేస్తున్నారు

26, ఏప్రిల్ 2023, బుధవారం

కిలో గంజాయి రవాణాకే ఉరి.. మరి వందల కిలోలు రవాణా చేస్తే ఏదీ శిక్ష? singap...



కిలో గంజాయి రవాణాకే ఉరి.. మరి వందల కిలోలు రవాణా చేస్తే ఏదీ శిక్ష? singapore death penalty #singapore

students opinions on literature (రచయితలారా, మా మాట వినండి.. మేం ఏం చదువు...



మేం ఏం చదువుతామో ముందు తెలుసుకోండి.. ఎలా చెప్తే మాకు తెలుస్తుందో.. అది తెలుసుకొని సృజన చేయండి.. భాషపై మాకు అభిమానం ఉన్నది. కానీ.. దాన్ని అందిపుచ్చుకోవడమెలా? మీరు ఫేస్ బుక్కుల్లో రాసుకొంటే.. మీరు మీ అభిమానులు చదువుకుంటే సరిపోతుందా? సంచిక స్వాధ్యాయ సమావేశంలో యువ విద్యార్థులు, ఉద్యోగుల ఆవేదన వినండి. రచయితలు పాఠకుల దగ్గరకు ఎలా వెళ్లాలో ఆలోచించండి. తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టేందుకు స్వాధ్యాయ సంచిక చేస్తున్నబృహత్ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి..

25, ఏప్రిల్ 2023, మంగళవారం

తెలంగాణలో ఆ 25 సీట్లే టార్గెటా? #bjptelangana #brs



ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్పడం ద్వారా బీజేపీ తెలంగాణలో సైతం హిందుత్వ ఓటు బ్యాంకు పైనే ఆధారపడినట్టు అర్థమవుతున్నది. ఇది తెలంగాణలో బీజేపీకి మేలు చేస్తుందా? లేక నష్టం చేస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో మతం ప్రభావం ఎంతుంటుంది?

22, ఏప్రిల్ 2023, శనివారం

ఐపాయె.. ఏపీలో టీడీపీ పని అయిపోయిందా? #tdpnews #tdp #chandrababu #chandra...

విపక్షాలు ఘోర విఫలం.. మోడీకే మళ్లీ అధికారం


దేశంలో మోడీని ఢీకొట్ట గలిగే నాయకుడు ఇప్పటికైతే లేడని మరో సర్వే తేల్చి చెప్పింది. దేశంలోని ఏ నాయకుడు కూడా మోడీకి దరిదాపుల్లో కూడా లేడని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే వెల్లడిస్తున్నది.

21, ఏప్రిల్ 2023, శుక్రవారం

శ్రీ నారసింహ శతక గానం.. శ్రీ పమిడికాల్వ మధుసూదన్



శేషప్ప కవి రచించిన శ్రీ నారసింహ శతక పద్యాలను ప్రముఖ జర్నలిస్టు, రచయిత, కవి.. శ్రీ పమిడికాల్వ మధుసూదన్ గారు గానం చేస్తున్నారు. అందులో ఒకటి మీకోసం.. ధారావాహికగా రానున్న ఈ శతక మాధుర్యాన్ని మధుగారి స్వరంలో మీరు విని ఆస్వాదించవచ్చు.

17, ఏప్రిల్ 2023, సోమవారం

కర్ణాటకలో బీఆర్ ఎస్ భయపడిందా? #brs #BRSPARTY #brsnews



కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్  ఎందుకు పోటీ చేయడం లేదన్న ప్రశ్న వస్తోంది.  జాతీయ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ బయట జరుగుతున్న ఎన్నికలు కావడంతో అంతా బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందని భావించారు. కర్ణాటక లో ఎంట్రీ తో పాన్ ఇండియా పార్టీగా  మారుతుందని అనుకున్నారు.  కానీ అలాంటిదేమీ జరగడం లేదు. ఆ పార్టీ నేతలు కర్ణాటక ఊసే ఎత్తడం లేదు. 

లిక్కర్ స్కాం విచారణలో ఈడీ ఫెయిల్ #brs #bjptelangana #aap


లిక్కర్ స్కాం విచారణలో ఈడీ, సీబీఐలు సంవత్సరకాలంగా తేల్చిందేమిటి? విచారణ అంతా డొల్లేనా? విచారణ తీరులో రోజురోజుకూ చోటు చేసుకొంటున్న పరిణామాలు పలు సందేహాలకు తావిస్తున్నాయి.

సృజనస్వరం- అన్నవరం దేవేందర్.. ఇంటర్వ్యూ.. 2వభాగం కస్తూరి మురళీకృష్ణ #స...


తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలతో వారి సృజనాత్మక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంపై ప్రత్యేకంగాచేసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్ అంతరంగం రెండో భాగం మీకోసం..

15, ఏప్రిల్ 2023, శనివారం

ఢిల్లీకి కొత్త సీఎం.. ఈయనే.. #kejriwal #bjptelangana #bjp



ఢిల్లీకి కొత్త సీఎం రాబోతున్నారా? ఎందుకంటే లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు దాదాపు ఖాయమైనట్టే అని అంటున్నారు. విచారణ కోసం రావలసిందిగా సీబీఐ ఆయనకు నోటీసులివ్వడమే దీనికి కారణం. కేజ్రీ మంత్రివర్గంలో ఇప్పటికే ఇద్దరిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. మొదట ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టు కాగా ,తర్వాత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలుకెళ్లారు. ఇపుడు ఏకంగా సీఎం కేజ్రీవాల్ వంతు వచ్చిందని అంటున్నారు. . ఇదే జరిగితే ఇపుడు డిల్లీ సీఎం గా ఎవరు అవుతారన్న ప్రశ్న వస్తోంది. 

ఇలా అయితే పవర్ లేని స్టారే..! #pawankalyan #pawan



పవన్ కల్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటి షూటింగ్ లో పవన్ బిజీ బీజీగా ఉన్నారు. ఇదీ ఇవాళ ఒక న్యూస్ పేపర్ లో కనిపించిన వార్త. ఈ వార్త చూసిన తర్వాత ఎవరైనా  పవన్ ఒక పార్టీ అధినేత అని అనుకుంటారా? అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నాడని భావిస్తారా?? అది కూడా ఒక రాష్ట్రానికి సీఎం కావడానికి ప్రయత్నించే నేతగా చూస్తారా?

అరుణాచల్ లో డ్రాగన్ కుట్ర



అరుణాచల్ ప్రదేశ్ తన అంతర్భాగమని పదే పదే చెప్తూ భారత్ ను రెచ్చగొడుతున్నది. సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్నది. గతంలో గాల్వన్ లాగానే ఇప్పుడు కూడా ఘర్షణ పడే పరిస్థితిని తీసుకొస్తున్నది.

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

వస్తున్నా కాచుకో.. #nitishkumar #narendramodi #rahulgandhi


మొత్తం మీద ఇన్నాళ్లకు విపక్ష కూటమికి నాయకత్వం వహించే నేత దొరికారు.ఆయనే బీహార్ సీఎం నితీష్ కుమార్ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా విపక్షాలు నితీష్ ను రంగంలోకి దించనున్నాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా నితీష్ కే మద్దతు ఇచ్చేట్టు కనిపిస్తోంది. .

13, ఏప్రిల్ 2023, గురువారం

మాఫియా మటాష్..#yogiadityanath #yogi


దేశవ్యాప్తంగా ఇపుడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పేరు మరోసారి మారుమోగుతోంది. యూపీలో మాఫియాను తుదముట్టిస్తామని ఫిబ్రవరిలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ అమలు దిశగా ఆయన మరో అడుగువేయడమే దీనికి కారణం. మాజీ ఎంపీ , ప్రస్తుతం జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ అతీఖ్ అహ్మద్ కొడుకు అసద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చడంతో యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది..

మామ పిలిచినా రాను.. #ntr #ntrnewmovie #rrr



వచ్చే ఎన్నికలలో హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తారా? పార్టీ  తరపున ప్రచారం చేస్తారా ? అన్న ప్రశ్నలు చాలా కాలంగా వస్తున్నాయి. దీనికి జూనియర్ సమాధానం చెప్పకోపోయినా అభిమానులు మాత్రం ఆయన రాకకోసం ఎదరుచూస్తూనే ఉన్నారు. ఏకంగా ఆయనను సీఎం చేయాలనే వరకు పోతున్నారు. ఇదే ఇపడు టీఢీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికరంగా మారుతోంది. అంతే కాదు  జూనియర్ పై  ఇపుడు  చంద్రబాబు వైఖరి మారే అవకాశమూ కనిపిస్తోంది. జూనియర్  వస్తానన్నా చంద్రబాబు వద్దంటారేమోనని భావిస్తున్నారు. 

బీజేపీకి కొత్త సారథి.. ఈటల!.. #eetalarajender #eetala #brs #bjptelangana



తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు రాబోతున్నాయా? ఏకంగా పార్టీ రాష్ట్ర శాఖ అధక్షుడినే మార్చబోతున్నారా? కొద్దిరోజులుగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. బీఆరెస్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే ఇది తప్పనిసరని పార్టీ అగ్రనేతలు అనుకుంటున్నారు. 

12, ఏప్రిల్ 2023, బుధవారం

రేవంత్ దూకుడు.. #revanthreddy #bandisanjay #brs


తెలంగాణలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ ఏ అంశాల ప్రాతిపదికన ప్రజల దగ్గరకు వెళ్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ నేతలు సైతం అధికార పార్టీని కార్నర్ చేయడానికి కుటుంబ పరిపాలన, అవినీతి అన్న రెండు అంశాలు తప్పిస్తే మరో అంశాన్ని ప్రస్తావించడం లేదన్నది వాస్తవం.

సమంత కథా చిత్రమ్ #samantharuthprabhu

10, ఏప్రిల్ 2023, సోమవారం

విశాఖ స్టీల్ సరే సరి.. బయ్యారం మాటేమిటి? #brs #visakhapatnam #visakhaste...


విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమించి సాధించుకున్న కర్మాగారం ఇది. అందువల్ల ప్రజల్లో ఒక విధమైన సెంటిమెంట్ ఉంటుంది. దీనిని ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనపై అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్ లో ఉంది. అందుకే ఆ  పార్టీ మొదటి నుంచీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. ఇపుడు ఏకంగా బిడ్డింగ్ లో పాల్గొనాలనే నిర్ణయమూ తీసుకుంది. ఇంతవరకూ ఓకే..కానీ దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలు నిజంగా నెరవేరుతాయా అన్న ప్రశ్న వస్తోంది. విభజన సమయంలో కేంద్రం హామి ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుందన్న ప్రశ్న వస్తోంది.. 

పొంగులేటి కొత్త పార్టీ పేరు ఇదే.. #ponguletisrinivasreddy #ponguletisrin...


తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందా ? బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు ఇప్పటికే ఇందుకోసం రంగం సిధ్దం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ పేరుతోనే కొత్త పార్టీ ఉండే అవకాశం ఉంది.

కాంగ్రెస్ కు ఆ ఒక్కటి చాలు..

ఏపీ బీజేపీకి కిరణ్ కుమారే దిక్కయ్యారా? #apbjp #kirankumarreddy



9, ఏప్రిల్ 2023, ఆదివారం

సూఫీ బాటలో మోడీ


మోడీ ఆయన పార్టీ హిందుత్వను పక్కన పెట్టి సూఫీ బాట పడుతున్నదా? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లింలకు సన్నిహితం కావడానికి ముఖ్యంగా యూపీలోొ బీజేపీ సూఫీ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. ఈ పరిణామం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నది.?

8, ఏప్రిల్ 2023, శనివారం

మోడీ ఫిక్స్ .. కవిత తరువాత ఆయనే.. #brs #bjptelangana


తెలంగాణలో వచ్చే ఎన్నికలలో బీజేపీ ఎజెండాను ప్రధాని మోడీ ఫిక్స్ చేశారు.  కేసీఆర్ ప్రభుత్వ కుటుంబ పాలనపైనే కాషాయ పార్టీ  ఎన్నికల బరిలోకి దిగనుంది.  అదే ఇపుడు ఆ పార్టీ ఏకైక ఎజెండా.. మోడీ తెలంగాణ పర్యటనలో ఇదే స్పష్టమైంది. 

కేసీఆర్, మోడీలతో రేవంత్ కు తిప్పలు #revanthreddy #brs #bjptelangana



6, ఏప్రిల్ 2023, గురువారం

నేనొస్తున్నా.. మాట్లాడుకుందాం రండి.. #modi #kcr #brs #narendramodi #bjpt...


దేశ ప్రధానిగా మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తించడం లేదా? అందుకోసమే మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినా ఆయనతో వేదికను పంచుకోవడానికి ఇష్టపడడం లేదా? కొంతకాలంగా కేసీఆర్ వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. దాదాపు రెండేళ్లుగా మోడీ, కేసీఆర్ లు నేరుగా ఎప్పుడూ కలుసుకోలేదు. 2021 సెప్టెంబర్ లో కేసీఆర్ చివరి సారిగా ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత ఆయన మొఖం కూడా చూడలేదు.

హిందూ కోడ్ బిల్.. సాంస్కృతిక విధ్వంసం || రామం భజే శ్యామలం ప్రత్యేక కథనా...

5, ఏప్రిల్ 2023, బుధవారం

సఖినేటి పల్లి ఊరుకు ఆ పేరు ఎలా వచ్చింది? #shortsfeed

సఖినేటి పల్లికి ఆ పేరు ఎలా వచ్చింది? రాముడికి ఆ ఊరికి సంబంధం ఏమిటి?

kamalam leaks (కమలం లీక్స్) #paperleakcase #paperleak #brs, #brsparty #b...


వరంగల్ లో హిందీ పేపర్ లీకేజీకి సంబంధించి విచారణలో భాగంగా సంజయ్ ను కూడా అరెస్టు చేసినట్టు భావిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తికి బీజేపీతో సంబంధాలున్నాయని అధికార పక్షం ఇప్పటికే ఆరోపించింది. బండి సంజయ్ తో అతను దిగిన ఫోటోలను కూడా విడుదల చేసింది. అటు పోలీసులు కూడా ఈ కేసులో నిందితుడు పరీక్షా పత్రాన్ని బండి సంజయ్ కు పంపినట్టు వెల్లడించారు. పక్కా ఆధారలతోనే సంజయ్ ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇదే ఇపుడు బీఆర్ఎస్ కు అస్త్రమవుతోంది. బీజేపీ మాత్రం ఈ విషయంలో ఢిఫెన్స్ లో పడినట్టుగా భావిస్తున్నారు. బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో  బీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందని అంటున్నారు. నిజానికి కాషాయపార్టీని అడ్డుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు

4, ఏప్రిల్ 2023, మంగళవారం

దిగి వచ్చిన దిల్ రాజు.. #balagammovie #balagam

లీకేజీలతో సర్కారు డ్యామేజీ #paperleak #paperleakcase


తెలంగాణలో ఇపుడు లీకేజీల వారోత్సవం నడుస్తున్నట్టుంది. టెన్త్ క్లాస్ నుంచి టీఎస్పీఎస్సీ వరకు ఇదే తంతు. తప్పెవరిదైనా కావొచ్చు కానీ అంతిమంగా విద్యార్థులే బలిపశువులవుతున్నారు. మొన్న టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీ ఘటనను మరవకముందే తాజాగా టెన్త్ పరీక్షా పత్రాలు కూడా లీక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. టెన్త్ తెలుగు, హిందీ ప్రశ్నాపత్రాలు వరసగా  లీక్ కావడంతో మొత్తం పరీక్షల నిర్వహణపైనే నమ్మకం పోతోంది. ఈ విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఇన్విజిలేటర్ గా ఉన్న ఉద్యోగే పేపర్ లీక్ చేసే అవకాశం ఉంటే ఇక దీనిని ఎలా అడ్డుకుంటారు? 

కేసీఆర్ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? #brs #brsparty

1, ఏప్రిల్ 2023, శనివారం

లీటర్ పెట్రోల్ 27 పైసలే.. ఆ రోజులే వేరు.. #shortsfeed #shortsvideo #shor...

తర్వాతి టార్గెట్ కేసీఆరే? #brsparty #brs #kcr #ktr #congress


తర్వాతి టార్గెట్ కేసీఆరే?

కేంద్రంలోని బీజేపీ సర్కారు తర్వాతి టార్గెట్ తెలంగాణ కేసీఆర్ కాబోతున్నారా? ఇప్పటిదాకా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, డిల్లీ సీఎం కేజ్రీవాల్ పైనే ప్రధానంగా దృష్టి సారించిన కేంద్రం తాజాగా కేసీఆర్ ను లక్ష్యం చేసుకోనుందన్న ప్రచారం జరుగుతోంది. మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న వివాదాస్పద సుకేష్ చంద్రశేఖర్ తాజాగా బీఆర్ఎస్ పై చేసిన ఆరోపణలే దీనికి కారణం. కేజ్రీవాల్ అందజేయమన్నట్టుగా 15 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరవేసినట్టు సుకేష్ తన లాయర్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు.