ఎవరు ఆపాలి...ఈ ఆత్మహత్యల పరంపరని... రాజకీయ నాయకులు చప్పబడిపోయారు.. తమ వ్యవహారాలను బహుబాగా చక్కబెట్టుకుంటున్నారు.. నిరాహార దీక్షల శిబిరాలు బోసిపోయాయి.. శ్రీకృష్ణ కమిటీ వచ్చింది.. వెళ్లింది.. ఎవరైనా నివేదికలు ఇవ్వవచ్చంటూ ఓ మాటనేసి పాపం న్యాయమూర్తి వెళ్లిపోయారు.. కానీ, తెలంగాణాలో పిల్లల భావోద్వేగాలు, లోలోపల రేగుతున్న అలజడులు ఎంతమాత్రం చల్లారటం లేదు.. ప్రతిక్షణం ఒకే ఆలోచన.. ఏం జరుగుతుంది? తెలంగాణా వస్తుందా? రాదా? ఇక రాదేమో.. ఈ చేవచచ్చిన, చేతకాని రాజకీయ నాయకుల వల్ల సాధించేదేమీ ఇక లేదు.. ఈ మానసిక ఆందోళనలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్న వాళ్లెవరూ లేరు.. నిన్నటికి నిన్న వరంగల్ నగరంలో ప్రజాశక్తి పత్రిక విలేఖరి సునీల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని అంతిమ యాత్ర అక్కడ కొనసాగుతుండగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం మినీటెక్ హాస్టల్లో నల్గొండ జిల్లా కోదాడకు చెందిన సాయికుమార్ ఉరివేసుకున్నాడు.
. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదంటూ ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్తున్నా.. వీళ్లను కన్విన్స్ చేయలేకపోతున్నాయి..ఒక పరిష్కారాన్ని సాధించుకోవటానికి మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ వదిలేసి ఆత్మహత్యలు చేసుకోవటం ద్వారా వాళ్లనుకున్న లక్ష్యం ఎలా సాధ్యమవుతుంది? అమరులవటం వల్ల తల్లిదండ్రులకు గర్భశోకం.. స్నేహితులకు విషాదం... తల్లి తెలంగాణాకు తీరని దుఃఖం.. దీన్ని గ్రహించాలి.. నేతలు చేస్తున్న ద్రోహానికి వాళ్లను నిలదీయాలి.. పోరాటం దిశగా వాళ్లను కదిలించండి... మరింత ఉధృతంగా పోరాటం చేయండి.. లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం యుద్ధం నుంచి పిరికివాళ్లలా పారిపోవటం లాంటిదే... ఉన్నతంగా సాగుతున్న పోరాటంలో ఒక ఆత్మహత్య జరిగితే , . ఉద్యమించిన సైన్యంలో ఒక యోధుడు తగ్గినట్లేనని భావించాలి...తెలంగాణాకు నిజమైన రాజకీయ నాయకత్వం అనేది ఉండి ఉంటే తెలంగాణ అసలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యేదే కాదు.. ఈ సత్యాన్ని గ్రహించండి.. తెలంగాణాకు రాజకీయ నాయకత్వం అంటూ లేనే లేదు.. చెన్నారెడ్డి అయినా, కెసిఆర్ అయినా.. ఆ రాజకీయ నాయకత్వానికి ముసుగుల్లాంటి వారే.. ముసుగు తొలగిస్తే.. అంతా డొల్లే.. తెలంగాణా ప్రజను ముందుండి నడిపించే, మార్గదర్శనం చేసే నాయకత్వాన్ని ముందుగా పెంపొందించుకోవాలి.. సైన్యాధ్యక్షుడు లేకుండా సైన్యం తలోదిక్కున పయనిస్తే.. ఎదురయ్యేది ఇదిగో.. ఇలాంటి ఓటమే... దీన్ని అధిగమించటానికి ఏం చేయాలో.. ఎలా ముందుకు సాగాలో ఆలోచించుకోవాలి కానీ, ఆత్మహత్యలు చేసుకోవటం సరి కాదు.. మనం జీవించి ఉండి కలల్ని సాకారం చేసుకోవాలి కానీ, జీవితాన్ని అంతం చేసుకున్న తరువాత ఏం సాధించినా ఏం ఫలితం?
4 కామెంట్లు:
గుండె కన్నీటి ధారలను కురుస్తున్నది ...
దాఋణం. యువకులను నైరాశ్యంలో ముంచి, ఆత్మహత్యలవైపు మళ్ళించి, ఎవడి వ్యాపారాలు వాడు చేసుకుంటున్న నాయకులందరినీ ప్రజలు నిలదీయాలి.తమ భావితరం యిలా మసికావడాన్ని ఆపాలి.
మొన్నటి వరకు ఈ ఆవేదన అంతా ఏమైంది? ఆత్మత్యాగం, బలిదానం, ఉరితాళ్ళను ముద్దాడుతున్నారు, అగ్నికీలల్ని కౌగిలించుకుంటున్నారు అంటూ వ్యాసాలు రాశారుగా?(కొణతం దిలీప్ కూడా రాశాడు).
అప్పుడే ఆ పడికట్టు పదాలతో మాయజాలం చేయకుండా, ఈ ఘాటైనపదజాలంతో అందరినీ తిడితే, ఏమన్నా అర్ధం వుండేది.
అయ్యా ఫణీంద్ర గారు,
మీ గుండె కన్నీటి ధారలు కురుస్తూవుంది.. సరే.. ఆ చనిపోయినవారి తల్లిదండ్రుల గుండె రక్తధారలు కారుస్తూవుంది. పీక కోసుకుంటా అనేవాడొకదు, ఉత్తుత్తి పేట్రొల్ పోసుకునేవాడొకడు, ప్రాణాలైనా ఇస్తా అనే వాడొకదు.. వాళ్ళందరికి చిడతలు వాయించేటప్పుడు తెలియలేదా ఇలా జరగొచ్చని? ఉస్మానియాలో ఆ బేకార్ నాయాళ్ళందరు ఇలాంటి మాటలు మాట్లడేటప్పుడే చెప్పుతో కొట్టుంటే, ఏమన్నా ఉపయోగం వుండేదేమో.
agnaata gaaru......uu.. atma tyagam balidanam, uritallu anevi ee chanipoyina vaari gurinchi rasinave.. oka bhavanni vyaktham cheste.. vaatini padikattu padalani vetakaram cheyatam meeku maatrme sadhyam.. memu ennadu maa prantam loni netalanu meelaaga guddiga venukesukoni raaledu.. maa bangaram manchidaite telangana eppudo vachedi.. chidatalu vaayinchindi meeru.. lagadapaati vishayamlo ela chesaro andariki telusu.. nagam vishayam lo ikkada em jarigindo telusu.. moorkhanga nindincatam maani.. vingntato matladatam nerchukondi...artham leni vyangyam tappu.. maya meedi.. mantram meedi.. ave vaste..ila vundevallam kaadu lendi..
కామెంట్‌ను పోస్ట్ చేయండి