2, జూన్ 2023, శుక్రవారం

గాంధీ విద్యావిధానం ఏమైంది?- రామం భజే శ్యామలం భాగం 5 #telugu #ramakatha




వార్ధా సదస్సుకు పలువురు విద్యావేత్తలు, ఏడు ప్రావిన్సులకు సంబంధించిన కాంగ్రెస్ విద్యామంత్రులు హాజరయ్యారు. గాంధీజీ ప్రతిపాదనలపై తీవ్రంగా చర్చ జరిగింది. విద్యావిధానంతోపాటు సంపూర్ణ మద్య నిషేధం గురించి కూడా గాంధీ ఈ సదస్సులో గట్టిగా పట్టుబట్టారు. దీనిపై రెండురోజుల పాటు పెద్ద చర్చే జరిగింది. గాంధీ ప్రతిపాదించినట్టుగా తప్పనిసరిగా మాతృభాషలో విద్యాబోధన చేయాలంటే చాలా డబ్బులు అవసరమవుతాయని.. ఇందుకోసం కొత్త పన్నులు విధించాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలే అన్నారు. దీంతోపాటు మద్యనిషేధం విధిస్తే భారీగా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని గాంధీజీ సముఖంలోనే తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 

కామెంట్‌లు లేవు: