ధూమావతికి సంబంధించిన ఉపాసన చాలా తీవ్రమైంది. అష్టాక్షరీ మంత్రాన్ని లక్షసార్లు జపించాలి. శత్రువులపై, విరోధ శక్తులపై ఆధిపత్యానికి ఈ ఉపాసన అత్యంత ముఖ్యమైందని భావిస్తారు. ఇది శ్రీవిద్యామార్గంలో సాగే ఉపాసన. ఈమెను ఉపాసించేందుకు బీజాక్షరం ‘‘ధూం’’ తెలంగాణ ప్రాంతంలో పిల్లలు అల్లరి చేసినప్పుడు ‘ధూం’ చేస్తున్నావని అంటారు.. ధూంధాం అంటూ డాన్సులు చేస్తూ పాటలు పాడటం కూడా ఉంది. కొన్ని రహస్యమైన విషయాలు మనకు తెలియకుండానే మన వ్యవహారంలోకి ఎలా ప్రవేశిస్తాయో అనటానికి ఇది ఉదాహరణ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి