తెలంగాణ రాష్ట్ర సమితి దిశ మార్చుకుందా? కెసిఆర్ వైఖరి మార్చుకున్నారా? టిఆర్‌ఎస్ తొమ్మిదో వార్షికోత్సవాలు జరిగిన తీరు చూస్తే అలాగే అనిపిస్తోంది.. పార్టీ స్థాపించిన నాటి నుంచీ మునుపెన్నడూ జరగని రీతిలో ఈ ప్రతినిధుల సభ జరగడం విశేషం..
తెలంగాణా రాష్ట్ర సమితి సమావేశం అనగానే.. ఒక బహిరంగ సభను ఏర్పాటు.. దాని కోసం పెద్ద హంగామా, హడావుడి, జనసమీకరణ చేయటం ఆనవాయితీ.. సభకు వీలైనంత లేటుగా కెసిఆర్ వచ్చి ప్రసంగం ముగించుకుని వెళ్లిపోవటం ఒక తంతుగా సాగుతున్నదే..
తొమ్మిదో వార్షికోత్సవాలు ఇందుకు పూర్తి భిన్నంగా జరగటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. టిఆర్‌ఎస్ ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రతినిధుల సభ జరిగింది.. తెలుగుదేశం మహానాడు తరహాలోనే ఇదీ కొనసాగింది.
కెసిఆర్, జయశంకర్ లాంటి ఒకరిద్దరితో సరిపెట్టకుండా ఏకంగా 12 మంది ప్రతినిధులకు మాట్లాడే అవకాశం రావటం టిఆర్‌ఎస్ చరిత్రలోనే రికార్డు..
తెలంగాణాకు సంబంధించి మొత్తం ౨౩ తీర్మానాలను ప్రతినిధుల సభ ఆమోదించింది. తెలంగాణా రాష్ట్ర సాధనతో పాటుగా అన్ని రంగాల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఈ తీర్మానాల్లో చోటు కల్పించటం విశేషం.. అన్నింటికీ మించి పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తక్కువ సమయం మాట్లాడటమూ విచిత్రమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి